న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్ గ్యాంగ్‌స్టర్‌లకు సంబంధాల కేసులో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) మంగళవారం విస్తృతంగా సోదాలు జరుపుతోంది. పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లోని 30 చోట్ల ఎన్‌ఐఏ పోలీసులు ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని బిలాస్‌పూర్ గ్రామంలో, ఫర్దికోట్‌లోని ఓ వ్యాపార వేత్త ఇంట్లోనూ ఎన్‌ఐఏ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
ఖలిస్తానీ టెర్రరిస్తులు, లోకల్ మాఫియా మధ్య బలపడుతున్న నెట్‌వర్క్‌లను చేధించేందుకే విస్తృత సోదాలు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాల ద్వారా తెలిసింది. సోదాల ద్వారా టెర్రస్టులకు చెందిన నగదు సీజ్ చేయడం, వారి ఆస్తుల డాక్యుమెంట్‌లను స్వాధీనం చేసుకుని వాటిని అటాచ్ చేయడం వీలవుతుందని ఎన్‌ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి.. గ్యాంగ్‌స్టర్,లేడీ డాన్‌ల పెళ్లికి గ్యాంగ్‌వార్ ముప్పు
Comments
Please login to add a commentAdd a comment