gangsters
-
Haiti crisis: నేర ముఠాల గుప్పిట్లో హైతీ!
ఒక నేర ముఠా ఒక ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుని అరాచకం సృష్టిస్తే భద్రతాబలగాలు రంగంలోకి దిగి ఉక్కుపాదంతో అణచేయడం చాలా దేశాల్లో చూశాం. కానీ ఒక దేశం మొత్తమే నేర ముఠాల గుప్పెట్లోకి జారిపోతే ఎలా? హైతీ దేశ దుస్థితి చూస్తూంటే యావత్ ప్రపంచమే అయ్యో పాపం అంటోంది. పోర్ట్ ఎ ప్రిన్స్ రాజధానిసహా దేశాన్నే గడగడలాడిస్తున్న గ్యాంగ్‌లకు అసలేం కావాలి?. కెన్యా సాయం కోసం వెళ్లి రాజధాని ఎయిర్పోర్ట్ నేరముఠాలవశం కావడంతో స్వదేశం తిరిగిరాలేక అమెరికాలో చిక్కుకుపోయిన దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ చివరకు పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశ ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇళ్ల నుంచి బయటకురావడానికే జనం భయపడుతున్నారు. హైతీలో ప్రధాన గ్యాంగ్‌లు ఎన్ని? హైతీలో దాదాపు 200 వరకు నేరముఠాలు ఉన్నాయి. అయితే మాజీ పోలీస్ అధికారి జిమ్మీ ‘బార్బెక్యూ’ చెరీజియర్ నేతృత్వంలోని జీ9 ఫ్యామిలీ అండ్ అలీస్ అలయన్స్, గేబ్రియల్ జీన్ పెర్రీ నేతృత్వంలోని జీపెప్ నేరముఠాలు ప్రధానమైనవి. ఇవి ప్రజలను హింసిస్తూ దేశాన్ని నరకానికి నకళ్లుగా మార్చేశాయి. రాజధాని సమీప ప్రాంతాలపై పట్టుకోసం చాన్నాళ్లుగా ఈ రెండు వైరి వర్గముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఎంతో మందిని సజీవ దహనం చేశాడని జిమ్మీని స్థానికంగా బార్బెక్యూ అని పిలుస్తుంటారు. నరమేధం, దోపిడీ, ఆస్తుల ధ్వంసం, లైంగిక హింసకు జీ9, జీపెప్ నేరముఠాలు పాల్పడ్డాయి. దీంతో ఈ ముఠా లీడర్ల లావాదేవీలు, కార్యకలాపాలపై ఐరాస, అమెరికా ఆంక్షలు విధించాయి. దీంతో రెండు గ్యాంగ్‌లు ఉమ్మడిగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. కలిసి పనిచేసి ప్రధానిని గద్దెదింపేందుకు కుట్ర పన్నాయి. అసలు ఇవి ఎలా పుట్టుకొచ్చాయి? మురికివాడల్లో దారుణాలు చేశాడన్న ఆరోపణలపై జిమ్మీని పోలీస్ ఉద్యోగం నుంచి తీసేశాక నేరసామ్రాజ్యంలో అడుగు పెట్టాడు. దేశంలోని రాజకీయ పార్టీలు, నేతలు, పారిశ్రామికవేత్తలు తమ అనైతిక పనులకు అండగా ఉంటారని ఇలాంటి చిన్న చిన్న నేరగాళ్లను అక్కున చేర్చుకుని పెద్ద ముఠా స్థాయికి ఎదిగేలా చేశారు. 2021 జులైలో హత్యకు గురైన హైతీ మాజీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిసెకు చెందిన పార్టీ హైతియన్ టెట్ కాలే(పీహెచ్‌టీకే)తో జిమ్మీకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఒకానొక దశలో జిమ్మీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని మొయిసె భావించారు. జీపెప్ ముఠా సైతం విపక్ష పార్టీలతో అంటకాగింది. దీంతో ఆర్థికంగా, ఆయుధపరంగా రెండు ముఠాలు బలీయమయ్యాయి. హింస ఎప్పుడు మొదలైంది? హైతీ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ‘పాపా డాక్’ డ్యువేలియర్, అతని కుమారుడు జీన్‌క్లాడ్ డ్యువేలియర్‌ల 29 ఏళ్ల నియంతృత్వ పాలనాకాలంలోనే ఈ గ్యాంగ్‌లు పురుడుపో సుకున్నాయి. డ్యువేరియర్లు ఒక సమాంతర మిలటరీ(టోంటోన్స్ మకౌటీస్)ని ఏర్పాటు చేసి వైరి పార్టీల నేతలు, వేలాది మంది సామాన్య ప్రజానీకాన్ని అంతమొందించారు. ‘హైతీలో నేరముఠాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ ఇప్పుడున్న నేరముఠాల వైఖరి గతంతో పోలిస్తే దారుణం’ అని వర్జీనియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, హైతీ వ్యవహారాల నిపుణుడు రాబర్ట్ ఫాటన్ విశ్లేషించారు. నేతలనూ శాసిస్తారు బెదిరింపులు, కిడ్నాప్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా లతో నేరముఠాలు ఆర్థికంగా బలపడ్డాయి. ఆయుధాలను సమకూర్చుకున్నారు. గత వారం రాజధానిలోని రెండు జైళ్లపై అధునాతన డ్రోన్లతో దాడికి తెగబడ్డాయి. శిక్ష అనుభవిస్తున్న వేలాది మంది కరడుగట్టిన నేరగాళ్లను విడిపించుకు పోయారు. సాయుధముఠాలు ఇప్పుడు ఏకంగా రాజకీయపార్టీలు, నేతలనే శాసిస్తున్నాయి. పరిపాలన వాంఛ అక్రమ మార్గాల్లో సంపదను మూటగట్టుకున్న నేర ముఠాలు ఇప్పుడు రాజ్యాధికారంపై కన్నేశాయి. 2021లో దేశాధ్యక్షుడు మొయిసె హత్యానంతరం వీటి రాజకీయ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ముఠాలు ప్రధాని హెన్రీని గద్దె దింపాయి. దేశాన్ని పాలిస్తానని బార్బెక్యూ జిమ్మీ పరోక్షంగా చెప్పాడు. అంతర్జాతీయంగా తన పేరు మార్మోగాలని విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చాడు. విదేశీ జోక్యం వద్దని, విదేశీ బలగాలు రావద్దని హుకుం జారీచేశాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఒంటిచేత్తో పరిష్కరిస్తానని ప్రకటించాడు. రాజకీయ శక్తులుగా ఎదిగితేనే తమ మనుగడ సాధ్యమని ముఠాలు భావిస్తున్నాయి. సంకీర్ణ బలగాలు వస్తున్నాయా? కెన్యా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలను హైతీకి పంపించి సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టాలని అమెరికాసహా పలుదేశాలు నిర్ణయించాయి. ఐరాస ఇందుకు అంగీకారం తెలిపింది. అయితే కెన్యా కోర్టుల జోక్యంతో ప్రస్తుతానికి ఆ బలగాల ఆగమనం ఆగింది. హైతీ ప్రధాని రాజీనామా నేపథ్యంలో నూతన ప్రభుత్వ కొలువు కోసం కౌన్సిల్ ఏర్పాటు, అన్ని భాగస్వామ్యపక్షాల సంప్రతింపుల ప్రక్రియ ముగిసేదాకా వేచిచూసే ధోరణిని అవలంబిస్తామని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో చెప్పారు. మరి కొద్దిరోజుల్లోనే ఎన్నికల కోసం కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. మన వాళ్లను వెనక్కి రప్పిస్తాం: భారత విదేశాంగ శాఖ హైతీలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు ఉన్నారు. 60 మంది ఇప్పటికే హైతీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. హైతీలో భారతీయ రాయబార కార్యాలయం, కాన్సులేట్ లేవు. దీంతో సమీపాన ఉన్న డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమినిగోలోని ఇండియన్ మిషన్ ద్వారా హైతీలోని భారతీయులతో మోదీ సర్కార్ సంప్రతింపులు జరుపుతోంది. వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
khalistani Terrorists: నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్ గ్యాంగ్స్టర్లకు సంబంధాల కేసులో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) మంగళవారం విస్తృతంగా సోదాలు జరుపుతోంది. పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లోని 30 చోట్ల ఎన్ఐఏ పోలీసులు ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని బిలాస్పూర్ గ్రామంలో, ఫర్దికోట్‌లోని ఓ వ్యాపార వేత్త ఇంట్లోనూ ఎన్ఐఏ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఖలిస్తానీ టెర్రరిస్తులు, లోకల్ మాఫియా మధ్య బలపడుతున్న నెట్‌వర్క్‌లను చేధించేందుకే విస్తృత సోదాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాల ద్వారా తెలిసింది. సోదాల ద్వారా టెర్రస్టులకు చెందిన నగదు సీజ్ చేయడం, వారి ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వాటిని అటాచ్ చేయడం వీలవుతుందని ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి.. గ్యాంగ్‌స్టర్,లేడీ డాన్ల పెళ్లికి గ్యాంగ్‌వార్ ముప్పు -
గ్యాంగ్‌స్టర్ అతిక్ హత్య.. తొలిసారి స్పందించిన యూపీ సీఎం
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్యోదంతంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా గ్యాంగ్ స్టర్స్, క్రిమినల్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్న యోగి మాట్లాడుతూ.. ఇకపై యూపీలో గ్యాంగ్స్టర్లు ఏ ఒక్కరిని బెదిరించలేరని పేర్కొన్నారు. సాధారణ ప్రజానీకం నుంచి వ్యాపారవేత్తల వరకు ఎవరికీ క్రిమినల్, మాఫియా భయం ఉండబోదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని వ్యాఖ్యానించారు. 2017కు ముందు ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని యోగి ఆదిత్యానాథ్ విమర్శించారు. అల్లర్లకు రాష్ట్రం అపఖ్యాతి పాలయ్యిందని దుయ్యబట్టారు. గతంలో రాష్ట్ర గుర్తింపు కోసం పాకులాడే పరిస్థితి ఉండేదని మండిపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, నేరస్థులు, మాఫియా వెన్నులో వణుకు పుడుతోందని తెలిపారు. అయితే 2017 నుంచి 2023 వరకు రాష్ట్రంలో ఒక్క మతపరమైన హింస కూడా చోటుచేసుకోలేదని తెలిపారు. ఈ ఆరేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదని అన్నారు. తమ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తోన్నామని చెప్పారు. కాగా యూపీలో రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్య జరిగిన మూడు రోజుల అనంతరం యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు. #WATCH | Now mafia cannot threaten anyone in Uttar Pradesh, says CM Adityanath days after Mafia brothers Atiq-Ashraf were killed amid police presence & Atiq's son Asad was killed in a police encounter pic.twitter.com/hjfeBVF6qt — ANI (@ANI) April 18, 2023 ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను కోర్టు విచారణ కోసం సబర్మతి జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చిన సమయంలో శనివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు పాయింట్-బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో లవ్లేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. జర్నలిస్టులుగా చెప్పుకొని, ప్రెస్ కార్డులను మెడలో ధరించి అతిక్ సోదరుల సమీపానికి వచ్చి కాల్పులకు తెగబడ్డారు. ఇదిలా ఉండగా ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. రహస్య లేఖ అతిక్ అహ్మద్ రాసినట్టు చెబుతున్న ఓ 'రహస్య లేఖ'ను అతని న్యాయవాది సోమవారం బయటపెట్టారు. అతిక్ అహ్మద్ హత్యకు సరిగ్గా రెండు వారాల ముందు భారత సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. తనను ఎవరైనా హత్య చేస్తే ఈ లేఖను సుప్రీంకోర్టుకు అందజేయాలని అతిక్ కోరినట్టు న్యాయవాది వెల్లడించారు. అందుకే దాన్ని అపెక్స్ కోర్టుకు సమర్పిస్తున్నట్టు తెలిపారు. -
Yogi Adityanath: గ్యాంగ్స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయ్: సీఎం యోగి
లక్నో: యోగి అదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఉత్తర్‌ప్రదేశ్‌లో రౌడీషీట్లరు, గ్యాంగ్స్టర్లు హడలిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా ఆయన నేరస్థులపై ఉక్కుపాదం మోపడమే ఇందుకు కారణం. గ్యాంగ్‌స్టర్ కం పొలిటీషియన్ అయిన అతిక్ అహ్మద్ కూడా ఇటీవలే ఓ కిడ్నాప్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు యోగి. ఒకప్పుడు యూపీలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బలవంతపు వసూళ్లకు పాల్పడిన మాఫియా, గ్యాంగ్స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారు చేసిన నేరాలకు కోర్టుల్లో దోషులుగా తేలుతున్నారని చెప్పుకొచ్చారు. గతంలో శాంతిభద్రతలంటే గౌరవం లేకుండా చిన్నచూపు చూసిన వారు ఇప్పుడు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారని యోగి వ్యాఖ్యానించారు. శనివారం ఓ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈమేరకు మాట్లాడారు. 'ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడికి ఇవాళ యూపీ ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరూ ధిక్కరించలేరు. ప్రజలను భయపెట్టిన మాఫియానే ఇప్పుడు భయంతో వణికిపోతుంది. కోర్టులో శిక్షలు పడటం చూసి వారి ప్యాంట్లు తడిసిపోతున్నాయ్.' అని యోగి అన్నారు. ఆరేళ్ల క్రితం యూపీ అంటే అరాచకాలు, అల్లర్లకు గుర్తింపు ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని యోగి చెప్పుకొచ్చారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శ్రీరామ నవమి రోజు అల్లర్లు చెలరేగినా.. యూపీలో మాత్రం ప్రాశాంతంగా వేడుకలు జరిగాయని గుర్తుచేశారు. చదవండి: దేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే..? లెక్క చెప్పిన ప్రధాని మోదీ.. -
పంజాబ్ జైల్లో ఇద్దరు గ్యాంగ్స్టర్లు మృతి
అమృత్సర్: పంజాబ్‌లో తరన్‌తరన్ జిల్లా గోవింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు గ్యాంగ్స్టర్లు మృతి చెందారు. వీరికి గాయకుడు సిద్ధు మూసేవాలా హత్యతోపాటు పలు కేసులతో సంబంధముందని అధికారులు తెలిపారు. ఈ కేసు నిందితులు మన్దీప్ సింగ్, మన్మోహన్ సింగ్, కేశవ్, మరికొందరు ఇదే జైల్లో ఉన్నారు. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో మన్దీప్, మన్మోహన్ చనిపోగా కేశవ్ తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు ఆదివారం చెప్పారు. -
గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 70 చోట్ల ఎన్ఐఏ దాడులు..
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). దేశవ్యాప్తంగా 70 చోట్ల ఒకేసారి దాడులు చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ-ఎన్సీఆర్, చండీగడ్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సోదాలు చేపడుతోంది. ఉత్తర భారత్‌లో ప్రత్యేకించి ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో మాఫియా కార్యకలాపాలు పెరుగుతున్నట్లు గుర్తించిన ఎన్ఐఏ.. గ్యాంగ్స్టర్లపై రెండు కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏకకాలంలో సోదాలు చేస్తోంది. ఒక్క పంజాబ్‌లోనే 30 ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్‌పై నమోదైన కేసు విచారణలో భాగంగానే ఎన్ఏఐ ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్స్టర్లను లక్ష్యంగా చేసుకుని ఇలా సోదాలు నిర్వహించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. కాగా.. దేశంలోని పులు నగరాల్లో గ్యాంగ్స్టర్లు ఉగ్రకార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ వీరిపై ఉక్కుపాదం మోపుతోంది. చదవండి: జైల్లో ఆకస్మిక తనిఖీలు.. భయంతో మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ.. -
ఉత్తరాది గ్యాంగ్స్టర్లు దక్షిణాది జైళ్లకు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాంగ్స్టర్ల ఆగడాలను చెక్‌పెట్టేందుకు, వారి విస్తృత నెట్‌వర్క్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఎన్ఐఏ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్లను దక్షిణాది రాష్ట్రాల జైళ్లకు తరలించాలని భావిస్తోంది. నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరఫరా, సుపారీ హత్యలు, హవాలా దందా, బెదిరింపు వసూళ్లు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాల్లో కొందరు గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేసి సెంట్రల్ జైళ్లలో పడేశారు. వాళ్లు అక్కడి నుంచే నిక్షేపంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. తొలి దశలో వారిలో 25 మందిని దక్షిణాది జైళ్లకు బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. మూసావాలా హత్యతో అలర్ట్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దక్షిణాసియాలోని అతిపెద్ద, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే జైళ్లలో ఒకటైన ఢిల్లీలోని తీహార్ జైలు నుంచే మూసేవాలా హత్య ప్రణాళికను గ్యాంగ్స్టర్లు అమలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తిహార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన నెట్వర్క్ ద్వారా ఈ హత్య చేయించారనే కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. తిహార్‌లోనే ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ నీరాజ్ బవానా సైతం జైలు నుంచే తన వ్యాపారాన్ని ఇష్టారీతిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో ఉన్న గ్యాంగ్స్టర్లదీ ఇదే పంథా. జైళ్లలో కొత్తగా చిన్న ముఠాలుగా ఏర్పడి తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. ఏప్రిల్‌లో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగిను చంపేశాడనే కోపంతో మరో గ్యాంగ్‌స్టర్ శేఖర్ రాణాను గోగి సన్నిహితుడు రోహిత్ మోయి జైలు నుంచే కుట్ర పన్ని హత్య చేయించాడు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఉత్తరాదిన పెరిగాయి. కొన్ని కేసుల్లో గ్యాంగ్స్టర్లకు జైలు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం మధ్య ఆధిపత్య పోరు పెరిగి గొడవలకు దారితీస్తోంది. వీరికి విదేశాల నుంచి ఆర్ధిక సహకారం అందుతోందనే దారుణ వాస్తవాలు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యాయి. ఉత్తరాది జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం కూడా ఎన్ఐఏ ప్రతిపాదనకు మరో కారణం. ఢిల్లీలో 14 సెంట్రల్ జైళ్ల సామర్ధ్యం 9,346 కాగా 17,733 మంది ఖైదీలున్నారు. పంజాబ్‌లో జైళ్లలో 103 శాతం, హరియాణాలో 127 శాతం, రాజస్థాన్‌లో 107 శాతం ఖైదీలున్నారు. -
నీ కుమారుడి కంటే దారుణంగా చంపుతాం.. సిద్ధూ తండ్రికి బెదిరింపులు
చండీగఢ్: దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రిని దారుణంగా చంపుతామని బెదిరింపులు రావడం కుటుంభసభ్యులను ఆందోళనకు గురిచేసింది. సిద్ధూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోని సభ్యుడు ఈమెయిల్ ద్వారా ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సిద్ధూ మెయిల్ ఐడీకి షూటర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఈ మెయిల్ వచ్చింది. తమ అనుచరుడి హత్యకు ప్రతీకారంగానే సిద్ధూ మూసేవాలాను హతమార్చినట్లు నిందితుడు ఈమెయిల్లో పేర్కొన్నాడు. గ్యాంగ్స్టర్ల గురించి గానీ తమ భద్రత గురించి ఏ విషయమైనా లేవనెత్తితే సిద్ధూ కంటే దారుణంగా చంపేస్తామని హెచ్చరించాడు. నోరుమూసుకొని సైలెంట్‌గా ఉండాలని లేకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చాడు. కొందరు దుండగులు సిద్ధూ మూసేవాలను కొద్ది నెలల క్రితం దారుణంగా హత్య చేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడించి తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం తన కుమారుడి మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టొద్దని సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ డిమాండ్ చేశారు. నిందితుల కుటుంబసభ్యులకు పోలీసు భద్రత కల్పించడంపై మండిపడ్డారు. సిద్ధూ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నిందితులను అరెస్టు చేశారు. చదవండి: గుజరాత్లో భక్తులపైకి దూసుకెళ్లిన కారు .. ఆరుగురు మృతి -
Gun Culture: పంజాబ్‌లో ముఠా సంస్కృతి.. ఇదో రకం రక్తచరిత్ర
అదో గ్రామీణ పంజాబ్ రోడ్డు. తెల్ల కారు, దాని వెనకాల నల్లజీపు. అంతలో హఠాత్తుగా తూటాల శబ్దాలు. ఎర్రగా పరుచుకున్న రక్తపు మడుగు. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా తాలూకు ఓ మ్యూజిక్ వీడియోలోని దృశ్యాలివి. ఆయన హత్య జరిగిన తీరు కూడా అచ్చం ఆ వీడియోను తలపించేలా ఉండటం అందరినీ విస్మయపరుస్తోంది. పంజాబ్‌లో గాయకులది, గ్యాంగ్స్టర్లది అవినాభావ బంధం. కొందరు సింగర్ల పాటలకు గ్యాంగ్ కల్చరే థీమ్‌గా ఉంటుంది. ఇంకొందరు గాయకులు తమ బకాయిల వసూలుకు గ్యాంగ్స్టర్లను నియమించుకుంటారు. మరోవైపు గ్యాంగస్టర్స్ డబ్బులు దండుకోవడానికి గాయకులను బెదిరిస్తూ ఉంటారు. మొత్తమ్మీద ఇదో రకం రక్తచరిత్ర... సిద్ధూ మూసేవాలా. ‘సో హై’ వీడియో ద్వారా 2017లో పంజాబీ పాప్ ప్రపంచంలో అడుగు పెట్టారు. చూస్తుండగానే అందనత్త ఎత్తుకు ఎదిగారు. ఆయన పాడిన పాటలన్నీ గ్యాంగస్టర్ థీమ్‌తో ఉన్నవే. రెండు చేతులకూ వజ్రాల వాచీలు, చేతిలో ఏకే 47 గన్, దాన్ని పేల్చడానికి శిక్షణ తీసుకోవడం, కారులోంచి నోట్లు వెదజల్లడం వంటి సీన్లతో సిద్ధూ పాటలు యూత్‌ను ఊపేశాయి. ఆయన హత్యకు నెల రోజుల ముందే ముఠా నేరాలకు తెర దించేందుకు యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను సీఎం భగవంత్ మాన్ ఏర్పాటు చేశారు. గ్యాంగస్టర్లే యూత్ ఐకాన్లు విలాస జీవితానికి అలవాటు పడ్డ గ్యాంగ్‌స్టర్స్‌కు పంజాబీ యువతలో ఫాలోయింగ్ ఎక్కువ. ఈ గ్యాంగ్స్టర్స్ సోషల్ మీడియాలో పెట్టే తమ ఖరీదైన కార్లు, బైకులు, రైఫిళ్ల పోస్టులకు లెక్కలేనన్ని లైకులొస్తుంటాయి. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి గ్యాంగ్స్టర్లుగా మారిన వారు ఒక్కసారిగా వచ్చిపడుతున్న భారీ డబ్బును ఆడంబరంగా ప్రదర్శించడం రివాజుగా మారింది. అదే యూత్‌ను బాగా ఆకర్షిస్తూ పంజాబ్‌లో గన్ కల్చర్‌ను పెంచుతోంది. నిరుద్యోగం, ఈజీ మనీకి అలవాటు పడడం, హై–ఫ్లై లైఫ్‌స్టైల్ వారిని నేర ప్రపంచానికి దగ్గర చేస్తున్నాయి. ఇది కాలేజీ దశ నుంచే మొదలవుతోంది. చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ సింగర్లకు, యువ నేతలకు, గ్యాంగ్స్టర్లకు అడ్డాగా మారింది. లారెన్స్ బిష్ణోయి వంటి గ్యాంగ్స్టర్లు విద్యార్థి దశ నుంచే నేరాల్లో మునిగి తేలుతున్నారు. గతేడాది 70 ముఠాలకు చెందిన 500 మంది గ్యాంగ్స్టర్లను అరెస్టు చేశారు. అయినా పలు ముఠాలు రాష్ట్రంలో చురుగ్గా ఉన్నాయి. డబ్బు కోసం ఏమైనా చేస్తారు గ్యాంగ్ కల్చర్ ఎందరో గాయకుల నిండు ప్రాణాలు బలిగొంది. 2018 ఏప్రిల్‌లో పరమేశ్ వర్మ అనే గాయకున్ని డబ్బుల కోసం బెదిరించారు. ఇచ్చాక కూడా చంపేశారు. ఇది దిల్‌ప్రీత్‌సింగ్ దహాన్ అలియాస్ బాబా అనే గ్యాంగ్‌స్టర్ పనేనని విచారణలో తేలింది. డబ్బులతో కెనడా పారిపోయి అక్కడ సెటిలయ్యే ప్రయత్నాల్లో ఉండగా అతన్ని అరెస్టు చేశారు. సిద్ధూ హత్య తమ గ్యాంగ్ పనేనని అంగీకరించిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే గ్యాంగ్‌స్టర్‌గా పేరు మోసిన అతనిపై ఏకంగా 25 కేసులున్నాయి. జస్దీప్ సింగ్ అలియాస్ జగ్గు, గౌండర్ అండ్ బ్రదర్, బాంబిహ గ్రూపులు రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిని అమెరికా, కెనడా నుంచి నడుపుతుంటారు. పంజాబీ మ్యుజీషియన్ మంక్రీత్ తుల్లాఖ్ తదితరులకు కూడా ఈ గ్రూపుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. తుపాకీ స్టైలే...! పంజాబీ పాప్ గీతాల రూటే వేరు. అవి అత్యంత ఆడంబరంగా రూపొందుతాయి. గాయకులు ఖరీదైన బట్టలు వేసుకుంటారు. షూస్, వాచీలు కూడా విదేశాల నుంచి తెప్పించినవే వాడతారు. మెడ నిండా బంగారు గొలుసులు, వేళ్లకు ఉంగరాలు, వజ్రాల వాచీలు అదనపు ఆకర్షణ. చేతిలో స్పోర్ట్స్ గన్ లేదంటే రైఫిల్ తప్పనిసరి. పాటల సాహిత్యం కూడా గన్ కల్చర్ చుట్టూ తిరుగుతుంది. సింగర్ చేతిలో రైఫిల్‌తో స్టైల్‌గా చిందులేస్తూ పాడుతుంటే జనం వెర్రెత్తిపోతుంటారు. ఇలా గన్ కల్చర్ థీమ్‌తో పాటలల్లే సిద్ధూ యూట్యూబ్ చానల్‌కు కోటికి పైగా సబ్స్క్రైబర్లున్నారు! ఇన్‌స్ట్రాగాంలో ఆయనను 85 లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు!! పాంచ్ గోలీ (ఐదు తూటాలు) అనే పాటలో తుపాకీ ఎలా పేల్చాలో ఐదుగురు పోలీసు అధికారులు సిద్ధుకు నేర్పే సీన్లువివాదం రేపాయి. పాటల్లో ముఠా సంస్కృతిని, హింసను ప్రేరేపిస్తున్నారంటూ సిద్ధుపై 2020లో కేసులు నమోదయ్యాయి. దేశ జనాభాలో పంజాబ్ వాటా 2 శాతమైతే దేశం మొత్తమ్మీద ఉన్న తుపాకీ లైసెన్సుల్లో 10% అక్కడే ఉన్నాయి! అక్కడ 4 లక్షల దాకా గన్ లైసెన్సులున్నాయి. వాటిని తీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల శరవేగంగా పెరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి వెయ్యి మందిలో 13 మంది దగ్గర గన్స్ ఉన్నాయి. 2020లో రాష్ట్రంలో 362 కాల్పుల ఘటనలు జరిగాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యోగి వచ్చాక గ్యాంగ్స్టర్ల ఆటలు బంద్
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో గత ప్రభుత్వాల హయాంలో గ్యాంగ్స్టర్లు, నేరగాళ్ల ఆటలు సాగాయని, అయితే యోగి ఆదిత్యనాథ్ వచ్చాక వారి ఆటల కట్టించారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం గ్యాంగ్స్టర్లు, క్రిమినల్స్‌ను జైళ్లకు పంపుతూ వారిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘జైలు..జైలు’ ఆట (కబడ్డీ ఆటలోని కూతను తలపించేలా) ఆడుతున్నారని మోదీ.. యోగి సర్కార్‌ను ప్రశంసించారు. ఆదివారం మీరట్‌లో మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని సభలో ప్రసంగించారు. ‘గతంలో రాష్ట్రంలో నేరగాళ్లు, మాఫియా అక్రమాలు, ఆక్రమణల టోర్నీలు ఆడేవి. తమ కుమార్తెలపై అసభ్యంగా మాట్లాడిన వారు స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నా ప్రజలు నిస్సహాయంగా చూడాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వాల వైఫల్యం కారణంగా అకృత్యాలు పెరిగి ఇళ్లు తగలబెట్టడంతో జనం సొంతింటిని వదిలి వలస వెళ్లాల్సిన దుస్థితి. కానీ, ప్రస్తుతం యోగి సర్కార్.. క్రిమినల్స్‌ను జైళ్లకు పంపుతూ వారితో జైలు ఆట ఆడుతోంది’ అని మోదీ అన్నారు. రూ. 700 కోట్లతో నిర్మించే స్పోర్ట్స్ వర్సిటీ 1,080 మంది బాల, బాలికలను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దనుంది. -
పవన్ కళ్యాణ్ జల్సా సినిమా సీన్‌ను గుర్తు చేసిన ఢిల్లీ గ్యాంగ్స్టర్స్
ఢిల్లీ: గ్యాంగ్స్టర్స్ లాక్ అప్‌లో ఉండి జల్సా సినిమాలోని సీన్లను రిపీట్ చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక వివరాల్లోకి వెళితే..దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాను చూసి ఉంటారుగా.. ఆ సినిమాలోని విలన్ ముకేష్ రిషి జైలు నుంచే సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ ఉంటాడు. అయితే ఆ సన్నివేశం ప్రారంభంలో అది జైలు అని మనకు ఏ మాత్రం అనిపించదు. విచారణ నిమిత్తం కోర్టు నుంచి జైలుకు వెళ్లే దారిలో మర్డర్లు కూడా చేసి వస్తాడు ఆ సినిమాలోని విలన్. సినిమాలో చూడటానికి ఆ సన్నివేశం ఎంత బాగున్నా కూడా నిజ జీవితంలో ఇలా జరుగుతాయా అని మనం అనుకుంటూవుంటాం. అయితే తాజాగా అలాంటి సంఘటనలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాకపోతే ఆ సినిమాలో జైలు నుంచి చేస్తే ఈ వీడియోలో మాత్రం లాకప్ నుంచి. నలుగురు వ్యక్తులు లాకప్‌లో హ్యాపీగా కుర్చొని మద్యం తాగుతూ అందులో కలుపుకోవడానికి కూల్ డ్రింగ్స్, తినడానికి స్నాక్స్‌తో పాటు చేతిలో సిగరెట్టుతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇదిలా ఉంటే లాకప్‌లోని మరొక గ్యాంగ్‌స్టర్ సరదాగా ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియోని ఆ జైలులో ఉన్న ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవన పోస్ట్ చేయడం ఇందులోని ట్విస్ట్ అని చెప్పాలి. అంతే కాదు ఆ వీడియోలో ఉన్నది నీరజ్ బవన సోదరులైన రాహుల్ కాలా, నవీన్ బాలి కావడం ఇందులోని మరో ట్విస్ట్. View this post on Instagram A post shared by Neeraj_bawana_ (@neeraj_bawanaa_official_) అయితే అప్పటికే రాహుల్ కాలా, నవీన్ బాలి జైలులో ఉండగా ఈ నెల ఐదవ తారీకున పోలీసులు వారిని మళ్లీ అరెస్టు చేశారు. కస్టడిలో ఉంచి విచారణ చేసిన పోలీసులు ఆగస్టు 10న వీరిని తిరిగి జైలుకు పంపించారు. ఇదిలా ఉంటే వీళ్లను మళ్లీ అరెస్టు చేసింది కూడా జైలు నుంచి బయటి వారిని బెదిరింపులకు గురి చేసినందుకు కావడం గమనార్హం. ఇంకా ఈ వీడియోలో వీరున్న సెల్‌కి ఎదుట సెల్లో కొందరు ఖైదీలు కూడా కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఇదంతా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా తమకు ఏమీ తెలియనట్టుగా లాకప్‌లో మద్యం అందించబడదని జరిగిన సంఘటణపై విచారణ చేస్తామని చెప్పి సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉండగా ఈ వీడియో మాత్రం ఇంటర్ నెట్లో వైరలై చక్కర్లు కొడుతోంది. -
భూ తగాదాలు... గ్యాంగ్స్టర్లు... ప్రాణభయం
వేదిక రెజ్లింగ్ స్టేడియమే కావచ్చు... కానీ అది రెజ్లర్ల మధ్య గొడవ మాత్రమే కాదు... దాని వెనక బయటకు కనిపించని అనేక చీకటి కథలున్నాయి... దేశంలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో రెండు ఒలింపిక్ మెడల్స్‌ను సాధించిన దిగ్గజం తనది కాని బాటలో వెళ్లి తప్పుడు మనిషిగా తేలిన వైనమిది... ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి సాధించిన కీర్తి ప్రతిష్టలను పణంగా పెడుతూ సాధారణ గల్లీ గూండాలతో చేసిన స్నేహం, ఆపై శత్రుత్వం సుశీల్ కుమార్‌ను పతకాలు సాధించే స్థాయి నుంచి పతనం వైపు నడిపించింది. న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మే 4న ఈ ఘటన జరిగిన రోజున వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే... ఛత్రశాల్ స్టేడియంలో రెజ్లింగ్ ప్రాక్టీస్ చేసే కొందరి మధ్య వాదోపవాదాల తర్వాత క్షణికావేశంలో జరిగిన ఉదంతంలా కనిపించింది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఆస్తి, భూ తగాదాలు ప్రాథమిక కారణం కావడంతో పాటు రౌడీల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది. నిజానికి 18 రోజులపాటు సుశీల్ తప్పించుకు తిరిగింది పోలీసుల భయం వల్ల కాదని... గ్యాంగ్స్టర్లు తనను చంపేస్తారనే భయంతోనే అతను ఆ పని చేసినట్లు తెలుస్తోంది. నేపథ్యమిదీ... ఢిల్లీలోని మోడల్ హౌస్ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన ఒక ఫ్లాట్ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. తన భార్య పేరిట ఉన్న ఈ ఫ్లాట్‌ను సందీప్ అలియాస్ కాలా జఠేడి అనే వ్యక్తి భాగస్వామ్యంతో కలిసి సుశీల్ కొన్నాడు. సుశీల్ స్నేహం చేసిన ఈ కాలా జఠేడి న్యూఢిల్లీలో గ్యాంగ్స్టర్లలో ఒకడు. అతనిపైన పెద్ద సంఖ్యలో పోలీసు కేసులు ఉన్నాయి. ఢిల్లీ పరిసరాల్లో భూ కబ్జాల్లో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చాలా మంది రెజ్లర్లతో పాటు క్రిమినల్స్ కూడా ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఇందులో కొన్నాళ్లుగా జఠేడి మేనల్లుడి వరుస, అత్యంత ఆత్మీయుడైన రెజ్లర్ సోనూ మహల్, మరో రెజ్లర్ సాగర్ రాణా ఉంటున్నారు. రెజ్లర్ సోనూపై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. సమభాగస్వామ్యం ఉన్న ఈ ఫ్లాట్‌ను జఠేడి అమ్మాలని భావించగా, అందుకు సుశీల్ అంగీకరించలేదు. దానిని అమ్మి తన డబ్బులు ఇవ్వాలంటూ సుశీల్‌పై జఠేడి ఒత్తిడి పెంచగా... ఫ్లాట్‌లో ఉంటున్న సోనూ, సాగర్ ఖాళీ చేయాలంటూ సుశీల్ మరోవైపు చెబుతూ వచ్చాడు. గుణపాఠం చెప్పాలని... సుశీల్ గత కొంత కాలంగా జఠేడి ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా, నవీన్ బాలిలతో స్నేహం పెంచుకోవడం కూడా జఠేడి ఆగ్రహానికి కారణమైంది. ఫ్లాట్ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న సుశీల్‌పై సోనూ తదితరులు బహిరంగంగా దుర్భాషలాడటం మొదలు పెట్టారు. దాంతో వారికి గుణపాఠం చెప్పాలని సుశీల్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మే 4న స్టేడియం ముందు వీరంతా ఎదురెదురుగా తలపడ్డారు. అప్పటికే నీరజ్‌కు సంబంధించిన గూండాలను సుశీల్ తన కోసం పిలిపించుకున్నాడు. జఠేడి భయంతో సుశీల్ తనను ఏమీ చేయడని సోనూ భావించినా... నీరజ్ గూండాలు వారిని చితకబాదారు. ఆవేశపరుడైన సుశీల్ కూడా తాను ఓ చేయి వేశాడు. పైగా తనేంటో అందరికీ తెలియాలని, వారిలో భయం ఉండాలంటూ ఈ ఘటనను వీడియో షూట్ చేయమని తనవారికి సూచించాడు. తీవ్రంగా గాయపడిన సాగర్ తర్వాతి రోజు ఆసుపత్రిలో మరణించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వేర్వేరు చోట్ల నుంచి తప్పించుకుంటూ... తన మేనల్లుడు సోనూపై దాడి సహజంగానే జఠేడికి కోపం తెప్పించింది. దాంతో సుశీల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. అనూహ్య ఘటన తర్వాత బెదిరిన సుశీల్ ఆ రోజు నుంచి ఎవరికీ దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తనకు ప్రాణహాని ఉందంటూ ముందస్తు బెయిల్ కోసం చేసిన దరఖాస్తులో కూడా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి మొదలు పెట్టి యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో దాక్కున్నాడు. తనను క్షమించమంటూ చివరకు జఠేడిని ఫోన్లో కోరేందుకు కూడా సుశీల్ ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసుల చేతికి చిక్కిన తర్వాత కూడా అతను హత్య కేసుకంటే కూడా తనకు రౌడీల నుంచి రక్షణ కల్పించమంటూ అతను కోరాడని తెలిసింది. సస్పెండ్ చేయనున్న రైల్వేస్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని రైల్వే శాఖ భావిస్తోంది. నార్తర్న్ రైల్వేలో సుశీల్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ హోదాలో ఉన్నాడు. అయితే ప్రాథమిక స్థాయిలో క్రీడలను తీర్చిదిద్దే బాధ్యతలతో 2015 నుంచి అతను ఢిల్లీ ప్రభుత్వం వద్ద డిప్యుటేషన్ మీద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ హోదాలో పని చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా కొనసాగింపు కోరినా ఢిల్లీ ప్రభుత్వం అందుకు అనుమతించకపోవడంతో రైల్వేస్‌కు వెళ్లిపోయాడు. నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా నేరాల్లో నిందితుడిగా ఉంటే దర్యాప్తు ముగిసేవరకు సస్పెండ్ చేస్తామని, సుశీల్ విషయంలో కూడా అదే జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. మరోవైపు సుశీల్‌పై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించింది. ప్రస్తుతం అతనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని... చట్ట పరంగా విచారణ తర్వాత ముగిసి తీర్పు వచ్చిన తర్వాతే దానిపై మాట్లాడతామని స్పష్టం చేసింది. -
పంజాబ్‌లో పోలీసులపై కాల్పులు..ఇద్దరు ఏఎస్ఐల మృతి
లూథియానా: గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి పోలీసులపై కాల్పులకు పాల్పడిన ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్లు మరణించారు. ఈ దుర్ఘటన జాగ్రాన్ టౌన్లో జరిగిందని డీఎస్పీ జీఎస్ బియాన్స్ శనివారం తెలిపారు. కాల్పులు జరిగాక ఏఎస్ఐ భగవాన్ అక్కడికక్కడే మరణించారని, మరో ఏఎస్ఐ దల్విందర్‌సింగ్ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారని వెల్లడించారు. వీరిద్దరూ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (సీఐఏ)లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. కాల్పుల ఘటన గురించి తెలిసిన వెంటనే ఐజీపీ నౌ నిహాల్ సింగ్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. డ్రగ్స్ స్మగ్లర్లు, గ్యాంగ్స్టర్స్, గతంలో వీరిద్దరు ఇంటరాగేట్ చేసిన వారిలో ఎవరైనా ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో విచారణ జరుగుతోంది. (చదవండి: సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు) -
బీజేపీ గూండాలను తరమండి
కోల్‌కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని, బయటి నుంచి గూండాలను దిగుమతి చేస్తోందని తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. గరిటెలు, అట్లకాడలు, వంట పాత్రలతో బీజేపీ గూండాలను తరిమికొట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని నారాయణగఢ్, పింగ్లాలో శనివారం ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. నందిగ్రామ్‌లో తనపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువేందు అధికారిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు ద్రోహులని దుయ్యబట్టారు. సువేందు అధికారి కుటుంబ సభ్యుడొకరు శుక్రవారం రాత్రి ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయాడని అన్నారు. అతడిని మహిళలు పట్టుకొని పోలీసులకు అప్పగించారని చెప్పారు. బయటి నుంచి వచ్చిన మరో 30 మంది గూండాలను కూడా మహిళలు పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో ద్రోహులపై కన్నేశా: అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. నందిగ్రామ్‌లో మీర్ జాఫర్లపై(ద్రోహులు) ఓ కన్నేసి ఉంచానని వ్యాఖ్యానించారు. సువేందు అధికారికి, అతడి సోదరులకు మంచి పదవులు కట్టబెట్టానని గుర్తుచేశారు. అయినప్పటికీ వారు తృణమూల్ కాంగ్రెస్‌ను దగా చేసి, బీజేపీలో చేరారని విమర్శించారు. డబ్బుకు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. బీజేపీ, తృణమూల్ కార్యకర్తల ఘర్షణ పూర్బ మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో శనివారం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానంలో ఏప్రిల్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ బయటి నుంచి తీసుకొచ్చిన రౌడీలు తమపై దాడి చేశారని మమతా బెనర్జీ ఎలక్షన్ ఏజెంట్ షేక్ సూఫియాన్ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ముగ్గురు గాయాలపాలయ్యారని అన్నారు. -
కరోనా గ్యాంగ్స్టర్స్
కరోనా రాగానే ప్రజలంతా ఏకతాటి మీదకు వస్తున్నారు. కులమతాలకు అతీతంగా మానవులందరం ఒకటే అంటున్నారు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ ఐకమత్యం అవసరం. పాతకక్షలను, పాత భావోద్వేగాలను పక్కకు నెట్టి, ‘మనమంతా మానవులం’ అనే స్ఫూర్తితో కలసికట్టుగా పనిచేస్తూ, ఈ మహమ్మారి మీద పోరాటం సాగించాలి. ఈ స్ఫూర్తితో పనిచేస్తున్నారు కేప్‌టౌన్‌కు చెందిన ఇద్దరు గ్యాంగ్స్టర్లు. చేయి చేయి కలిసింది.. పాత కక్షలను పక్కకు తోసి, చేయిచేయి కలిపి, ఆకలితో అలమటిస్తున్నవారి కోసం ఆహారం పొట్లాలు పంచుతున్నారు ఈ గ్యాంగ్‌లీడర్లు. ‘ఇది నమ్మశక్యం కాని నిజం. రెండు గ్యాంగుల నడుమ శాంతియుత వాతావరణం అంటే కేవలం కాల్పుల నిషేధమే కాదు. ఆపదలో ఉన్నవారికి మేమున్నామన్న భరోసా కల్పించటం అని చూపుతున్నారు వీరు’ అంటున్నారు ఆండీ అనే కేకుల వ్యాపారి. కేప్‌టౌన్‌లో గ్యాంగ్‌ల మధ్య హింస సర్వసాధారణం. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. ఇటువంటి విపత్కర సమయంలో అనూహ్యమైన తాత్కాలిక సంధి చేసుకున్నారు రెండు గ్యాంగ్‌లకు చెందిన నాయకులు. ఆకలిగా ఉంది.. లాక్డౌన్ ప్రకటించగానే గ్యాంగ్ లీడర్‌కు ఒక ఫోన్ వచ్చింది. ‘మేం నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదన్నా. ఇప్పుడు మేమంతా ఆకలితో అలమటిస్తున్నాం. మిమ్మల్నే నమ్ముకుని ఉన్న మా ఆకలి తీర్చండి’ అని బాధగా అర్థించింది ఆ గొంతు. ఆ గొంతు మా గ్యాంగ్ సభ్యుడిది. పనులు లేకపోవటంతో వీరంతా ఆకలితో అలమటిస్తున్నారని అర్థమైంది. వారిని ఆదుకోవటం నా కర్తవ్యంగా భావించాను’ అన్నాడు ఆ కరడు కట్టిన గ్యాంగ్‌స్టర్. మానవత్వం.. ఆండీ అనే బేకరీ నిర్వాహకుడు ఈ గ్యాంగ్ సభ్యులతో కలిసి పనిచేస్తున్నాడు. వారికి కావలసిన పేస్ట్రీలను సరఫరా చేస్తుండేవాడు. ఆండీ కారణంగానే ప్రత్యర్థులైన గ్యాంగ్స్టర్ల చేతులు కలిసాయి. ఆనందం.. కేప్‌టౌన్‌లో చోటుచేసుకున్న ఈ పరిణామాలకు అక్కడి ప్రజలు సంతోషపడుతున్నారు. ఇటువంటి మంచి ఆలోచన వారికి ఎప్పుడూ వచ్చి ఉండదు. నిజమే. వాళ్లు వారి అనుచరు లను రక్షించుకోవటానికి చేతులు కలిపి మంచి పనులు చేయటం ఆహ్వానించాల్సిందే. ‘‘ఈ రోజు నేను నిజంగానే చచ్చి స్వర్గానికి వెళితే, సంతోషంగా చనిపోయానని భావిస్తాను. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను’’ అంటున్నారు నగర పౌరుడు ఒకరు. స్వాగతించాలి.. అప్పటిదాకా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించడానికి విచక్షణారహితంగా కాల్చుకున్న ఈ గ్యాంగులు, ఆకస్మికంగా తమ వైఖరిని మార్చుకున్నాయని తెలిసి, ఆశ్చర్యానికి గురవుతున్నారు మేయరల్ కమిటీ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అధికారి జె. పి. స్మిత్. ఒక కమ్యూనిటీపై అంతకంతకు కక్షను పెంచుకుంటున్న వీరు చేస్తున్న పనులు చూసి అందరం వారిని స్వాగతించాల్సిందే. ‘దశాబ్దాలుగా వారు చేసిన అకృత్యాలు నా మనసు నుంచి చెరిగిపోవటం లేదు. ఆ కాలంలో కొంతమందిని బందీలుగా ఉంచి ఎంతో హింసించారు. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో చేస్తున్న సహాయాలను మాత్రం గుర్తించాల్సిందే’ అంటున్నారు గతంలో ఒక గ్యాంగ్ లీడర్‌గా ఉన్న రాషద్ విలియమ్స్. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో గ్యాంగులకు పనిలేదు, గుర్తింపు లేదు. అందరం కలిసి పనిచేయాల్సిన తరుణం ఇది అంటున్నారు బ్రిటజ్ మలన్ అనే మహిళ. ‘ప్రస్తుతం మేమంతా ఒకరిపై ఒకరు ఆధారపడి, పరస్పరం సాయం చేసుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి శాంతి నెలకొంది. కరోనా వైరస్ అంతమైన తరవాత గ్యాంగ్‌వార్ మళ్లీ ప్రారంభం కావచ్చేమో’ అంటున్నారు యాష్లే అనే గ్యాంగ్ సభ్యుడు. ప్రస్తుతమైతే ఈ గ్యాంగు సభ్యులు కూడా మానవత్వం చాటుతున్నారు. వారిని తాత్కాలికంగానైనా అభినందించాల్సిందే. -
ఎస్ఐని దారుణంగా కొట్టి చంపారు..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో గ్యాంగ్స్టర్స్ బీభత్సం సృష్టించారు. అక్రమ మద్యం, డ్రగ్స్ విక్రయాలను అడ్డుకుంటున్నాడనే అక్కసుతో ఢిల్లీ పోలీస్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న రాజ్ కుమార్ (56 ఏళ్ళు)ను వెంటాడి మరీ దారుణగా కొట్టి చంపారు. షాదరా జిల్లాలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు ఉన్నతాధికారి మేఘనా యాదవ్ అందించిన సమాచారం ప్రకారం, నిందితుడు విజయ్ అలియాస్ భరూరి కస్తూర్బా నగర్‌కు చెందినవాడు. ఆదివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన ఎస్ఐ రాజ్‌కుమార్ భోజనానంతరం రోజూలాగానే వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో కొంతమంది ఎస్ఐతో వాదనకు దిగి దుర్భాషలాడారు. దీన్ని వ్యతిరేకించిన ఎస్పై గ్యాంగస్టర్స్ విరుచుకుపడి తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. దీంతో తనను తాను రక్షించుకునేందుకు ఎస్ఐ స్థానిక పోలీసు ఠాణాలోకి పారిపోయారు. అయినా రెచ్చిపోయిన నిందితులు ఎస్ఐను దారుణంగా కొట్టి అక్కడినుంచి పారి పోయారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. స్థానిక కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి, హత్య కేసు నమోదు చేశామని మేఘనా యాదవ్ తెలిపారు. నిందితులపై రెండు డజన్లకు పైగా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఎనిమిది నుంచి తొమ్మిదిమంది తన తండ్రిపైదాడి చేసి కొట్టి చంపేశారని రాజ్‌కుమార్ కుమార్తె వైశాలి కన్నీరు మున్నీరయ్యారు. మద్యం, డ్రగ్స్ అమ్మకాలను వ్యతిరేకించినందుకు తన తండ్రిని చంపేస్తామని ఇప్పటికే చాలా సార్లు బెదరించారనీ ఆమె ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
వైరల్: నవ్వుల పాలైన పోలీసులు
చండీగఢ్ : అప్పుడప్పుడు మేథావులు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేయడం సహజం. ఇలాగే ఓ చిన్న పొరపాటు చేసి నవ్వుల పాలైయ్యారు పంజాబ్ పోలీసులు. తరచూ నేరాలకు పాల్పడే ఓ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మీడియా ముందు హాజరుపరచి అనంతరం ఆ గ్యాంగ్‌ను ఫోటో తీశారు. ఎవరిని అరెస్ట్ చేసినా ఎప్పుడూ చేసే తతాంగమే. ఇందులో నవ్వులపాలు కావడానికి ఏముంది అంటారా..? ఆగండి ఒక్కసారి పైన ఉన్న ఫొటోలను గమనించండి. మీకే నవ్వొస్తుంది. నేరం చేసిన ముఠా సభ్యులకు కుర్చీలు వేసి మరీ కూర్చోబెట్టారు. తప్పు చేసిన వారిలా పోలీసులు మాత్రం వారి వెనుకాల నిలబడ్డారు. అనంతరం తమ తప్పిదాన్ని గమనించి కుర్చీలు తీసేసి కింద కూర్చొబెట్టి ఫొటో తీశారు. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు కామెడీగా స్పందించారు. ‘వారిని కుర్చీల్లో కూర్చోబెట్టడంలో తప్పేముంది. నాకు తెలిసి పోలీసులు వారికి గౌరవ మర్యాదలు చేశారు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ఇలాంటివి ఇండియాలో సాధ్యమే అని మరొకరు, నేరం రుజువైయ్యేంతవరకూ వారు అమాయకులే అని వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. కాగా ఈ ఫొటోలు నిజమైనవో లేదా మార్ఫింగ్ చేశారో తెలియాల్సి ఉంది. -
స్కైప్ లో కథవిని ఓకే చెప్పింది..
తమిళసినిమా: వంజకర్ ఉలగం రెగ్యులర్ గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంలా ఉండదని ఆ చిత్ర కథానాయకి అనీషా అంబ్రోస్ అంటోంది. చాలా మంది ఇతర చిత్రాల తారల మాదిరిగానే కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్న కన్నడ నటి ఈ అమ్మడు. కన్నడంలో గర్వ, మోహన్‌లాల్, గౌతమి జంటగా నటించిన మన్మధ వంటి చిత్రాల్లో నటించిన అనీషా వంజగర్ ఉలగం చిత్రంతో నాయికిగా కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధమైంది. ఈ చిత్రంలో నటించిన అనుభవాలను తెలుపుతూ వంజగర్ ఉలగం చిత్రం అవుట్ పుట్తో చిత్రయూనిట్ అంతా సంతృప్తిగా ఉందని చెప్పింది. అయితే తనకు మాత్రం ఇది చాలా స్పెషల్ అని పేర్కొంది. వార్తలను సేకరించే పనిలో ఒక భయంకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయిన విలేకరి పాత్రలో తాను నటించానని చెప్పింది. ఆ పరిస్థితి నుంచి ఎలా బయట పడ్డానన్నదే తన పాత్ర అని తెలిపింది. ఇది హైపర్లింక్ కథాంశంతో కూడిన చిత్రం అని పేర్కొంది. ఒకే సమయంలో జరిగే పలు కథల ఇతివృత్తంగా వంజకర్ ఉలగం చిత్రం ఉంటుందని చెప్పింది. ఇది గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అయినా రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ చిత్రాల మాదిరిగా ఉండదని అంది. ప్రేమ కథా చిత్రాలు పలు కోణాల్లో ఎలాగైతే తెరకెక్కుతాయో, ఈ వంజగర్ ఉలగం చిత్రం వైవిధ్యంగా ఉంటుందని పేర్కొంది. ఈ చిత్ర కథను దర్శకుడు మరోజ్ బీధ తనకు స్కైప్ ద్వారా చెప్పారని, కథ వినగానే ఆయన తాను ఇంతకు ముందు నటించిన చిత్రాలు చూసి ఉంటారా? అన్న ఆశ్చర్యం కలిగిందని చెప్పింది. కారణం నటనకు అవకాశం ఉన్న అలాంటి పాత్రకు తనను ఎంచుకోవడంతో తనకు అలా అనిపించిందంది. చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచి అంతా సక్రమంగా జరుగుతూ వచ్చిందని, ఈ చిత్రంలో నటించిన ప్రతిరోజూ సంతోషంగా సాగిందని అనీషా చెప్పుకొచ్చింది. ఇందులో ప్రధాన పాత్రల్లో సిబి భువన్ చంద్రన్, హరీశ్ పేరడి, గురు సోమసుందరం, చాందిని తమిళరసన్, విశాగన్ వనంగాముడి, జాన్‌విజయ్, వాసు విక్రమ్ నటించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని లాభిరింద్ ఫిలింస్ పతాకంపై మంజులా బీదా నిర్మిస్తున్నారు. -
బర్గర్లు ఇవ్వమంటే.. ఇవ్వరా?!
రియో డి జెనీరియో : బ్రెజిల్‌లోని అత్యంత ఖరీదైన నగరాల్లో రియో డిజెనీరియో ఒకటి. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా జరిగే ప్రాంతం కావడంతో ఖరీదైన హోటళ్లు, రిసార్టులు, రెస్టార్లు భారీగా ఉన్నాయి. ఇవి ఏడాది పొడుగునా బిజీగానే ఉంటాయి. అందులోనూ మెక్ డోనాల్డ్ రెస్టారెంట్‌కు స్థానికంగా డిమాడ్ ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆరుమంది వ్యక్తులు రెస్టారెంట్ వచ్చి 40 బర్గర్లు కావాలని చెప్పారు. వేడివేడిగా బర్గర్లు తెచ్చాక.. బిల్ పే చేయమని కౌంటర్లోని వ్యక్తి అడిగాడు.. బర్గర్ల కోసం వచ్చిన వ్యక్తి.. నేను బిల్ పే చేయను.. అంటూ.. తన వెంట తెచ్చుకున్న గన్‌తో ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. అతనికి సహాయంగా మరో అయిదుమంది కూడా తుపాకులకు పని చెప్పారు. బుల్లెట్లు ఎక్కడ తగులుతాయన్న భయంతో రెస్టారెంట్లో ఉన్న వాళ్లంతా.. టేబుళ్ల కింద.. దాక్కున్నారు. ఈ ఘటనలో అదృష్టవవాత్తు ఎవరూ గాయపడలేదని మెక్‌డోనాల్డ్ అధికారులు ప్రకటించారు. బుల్లెట్లు తగిలి రెస్టారెంట్ పర్నీచర్ చాలా వరకూ పాడైందని.. చెప్పారు. అయితే బర్గర్లుకు డబ్బులు చెల్లించకుండా.. తుపాకి కాల్పుల పాల్పడ్డవారు.. డ్రగ్స్ డీలర్లని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చెబుతున్నారు. -
నగరంలో నయా దోపిడీ
-
పోలీసులపై గ్యాంగ్స్టర్ల కాల్పులు
చండీగఢ్: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో గ్యాంగ్స్టర్లు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పక్కా సమాచారం ప్రకారం శనివారం గ్యాంగ్స్టర్లను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య 100 రౌండ్ల కాల్పులు చోటుచేసుకోవడంతో మాకు పట్టణ పరిసర ప్రాంతాల్లో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చేసుకోలేదు. నలుగురు గ్యాంగ్స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల గురుహర్ సహాయ్ పట్టణంలోని ఓ పోలీస్‌ష్టేషన్ వెలుపల కాల్పులు జరగడంతో గ్యాంగ్స్టర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. -
పొద్దున్నే జైలు బద్దలు ఎలా సాధ్యమైంది?
నభా(పాటియాలా): పంజాబ్.. నిరంతరం అప్రమత్తంగా ఉండే రాష్ట్రం. ఉగ్రవాదుల కదలికలతో ఎప్పటిప్పుడు పోలీసులే కాకుండా ఆర్మీ బూట్ల చప్పుడు కూడా అక్కడి వీధుల్లో వినిపిస్తుంటాయి. అలాంటి పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలోని నభా జైలు. సాధారణ ఖైదీలు ఉండే జైళ్లకే భద్రత కట్టుదిట్టంగా ఉండటంతోపాటు నిఘా నేత్రాలు కూడా పనిచేస్తుంటాయి. సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఇక అలాంటిది కొందరు ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు ఉన్న జైలుకు సంబంధించి పోలీసుల మరెంత అప్రమత్తంగా ఉండాలి. కానీ, అలాంటి జాగరుకత ఏదీ కూడా నభా జైలు వద్ద లేదని తెలుస్తోంది. అచ్చం సినీ ఫక్కీలో ఓ తెర మీద సినిమాలో చూస్తున్నట్లుగా దుండగులు తెగబడ్డారు. సరిగ్గా ఆదివారం ఉదయం తొమ్మిదిగంటల ప్రాంతంలో వాహనాల్లో 12 నుంచి 14 మంది దుండగులు పోలీసుల వేషాల్లో వచ్చారు. అందులో మూడు వాహనాలని జైలు వెలుపలే ఆపేశారు. తెలివిగా ఓ ఖైదీని తీసుకొచ్చామని చెప్పి సెంట్రీతో గేటు తీయించారు. ఆ వెంటనే అప్పటి వరకు తమ బ్లాంకెట్లకింద దాచుకున్న ఆయుధాలను తీసి నేరుగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఏం జరుగుతుంతో తెలిసే లోపే లోపలికి వెళ్లి తమకు కావాల్సిన ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మీందర్ సింగ్ అలియాస్ మింటూ మరికొందరు గ్యాంగ్ స్టర్లను విడిపించుకెళ్లారు. ఈ సంఘటన ఒక్కసారిగా పంజాబ్ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భద్రత డొల్లను బయటపెట్టింది. ఈ సందర్భంగా వారికి సహకరించిన పర్మిందర్ సింగ్ అలియాస్ పిండాను అరెస్టు చేశారు. జైలు గోడలు బద్ధలు కొట్టేందుకు ప్రణాళిక రచించింది కూడా ఇతడే. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జైలుపైనే దాడి చేయడం అంటే మాములు విషయం కాదు.. అలా చేయాలంటూ ఆ జైలుకు సంబంధించిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావాలి. అయితే, అతడు పర్మిందర్ సింగేనా లేదా ఇంకెవరైనా ఉన్నారా? లేదా జైలుకు సెక్యూరిటీ చూసుకునే వారికి అణువనువూ తెలుస్తుంది.. వారే పూర్తి వివరాలు పర్మిందర్కు అందించారా? అంతపెద్ద మొత్తంలో జైలులోకి వచ్చిన సాయుధులు ఒక్క సెంట్రీనికానీ, సెక్యూరిటీ సిబ్బందినిగానీ గాయపరచపోవడానికి గల కారణాలు ఏమిటీ? పై అధికారుల హస్తం ఇందులో ఉందా? దాడికి సంబంధించి ముందే జైలు సిబ్బందికి తెలుసా? పోలీసుల చేతికి పర్మిందర్ దొరికిపోయినప్పుడూ ఖలిస్తాన్ చీఫ్ హర్మీందర్ మధ్యలో దిగిపోయాడని చెప్పాడు. వీరందరు నేపాల్ లో కలుసుకునేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపాడు. దీని ప్రకారం తప్పించుకున్నవారందరికీ ఎస్కేప్‌కు సంబంధించిన వివరాలు ఎవరు? ఎలా ? చేరవేశారు.. ఇంత జరుగుతున్నప్పటికీ జైలు సిబ్బంది ఎందుకు అప్రమత్తంగా లేకుండా పోయారు? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఎవరీ హర్మీందర్ సింగ్? హర్మీందర్ సింగ్ అలియాస్ మింటూ మితిమీరిన సిక్కు మతాభిమాని. సిక్కులకు ప్రత్యేక రాజ్యస్థాపనే లక్ష్యంగా ఏర్పడిన ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (కేఎల్ఎఫ్)కు చీఫ్ గాఉన్నాడు. ఇతడిపై దాదాపు 10 ఉగ్రవాద సంబంధ చర్యలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. పంజాబ్ పోలీసులకు అతడు దొరకకుండా చాలాకాలం తప్పించుకు తిరిగాడు. 2008లో సిర్సాకు చెందిన దేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై కూడా దాడి చేసింది మింటూనే. 2010లో హల్వారా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన పాత్ర కూడా అతడిదే. చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న అతడు థాయిలాండ్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు రాగానే 2014నవంబర్ నెలలో అరెస్టు చేసి ప్రస్తుతం నభా జైలులో ఉంచారు. -
పేట్రేగుతున్న ఆకతాయిలు
– ఒంటరిగా తిరగాలంటే భయ పడుతున్న అమ్మాయిలు – మళ్లీ పెరుగుతున్న బ్యాచ్‌ల సంస్కృతి – అర్ధరాత్రి వేళలో బైకుల్లో సంచారం ప్రొద్దుటూరు క్రైం: చేతిలో బైక్.. జేబులో తల్లిదండ్రులు ఇచ్చిన ప్యాకెట్ మనీ.. పక్కన ఖర్చు చేయడానికి మిత్రులు.. ఇక మందు, బిరియానిలతో జల్సాలు చేయడం. అంత వరకూ అయితే ఇతరులకు వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. కానీ మద్యం మత్తులో వారు చేస్తున్న చేష్టలు వారి తల్లిదండ్రులతోపాటు అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదీ పట్టణంలో కొందరు ఆకతాయిలు చేస్తున్న పని. నడి రోడ్డులో తన్నుకోవడం, అమ్మాయి కోసం రెండు గ్రూపులు కొట్టుకోవడం లాంటి సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా కేసులు ఇటీవల కాలంలో అధికంగా పోలీస్స్టేషన్లకు వస్తున్నాయి. అయితే ఈ ఘటనల్లో విద్యార్థులుండటంతో వారి భవిష్యత్తు దృష్ట్యా పోలీసులు కౌన్సెలింగ్, వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. వారాంతపు రోజుల్లో అధికం: గతంలో గ్యాంగ్స్టర్ల గొడవతో భయానక వాతావరణం ఉండేది. తరచూ జరిగిన గొడవల్లో సుమారు 50 మంది విద్యార్థులపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. కొందరు తల్లిదండ్రులైతే గొడవలకు భయపడి తమ పిల్లలను హైదరాబాద్, తిరుపతి లాంటి ప్రాంతాలకు పంపించారు. తర్వాత పోలీసులు గట్టి చర్యలు తీసుకోవడంతో గొడవలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇటీవల కాలంలో మళ్లీ యువకులు కలకలం సృష్టిస్తున్నారు. తల్లిదండ్రులు రూ.వేలకు వేలు ప్యాకెట్ మనీ ఇవ్వడమే గాక వారికి బైక్ కూడా కొనివ్వడంతో కొందరు యువకులు కాలేజీలకు డుమ్మా కొట్టి అల్లర్లకు పాల్పడుతున్నారు. వారాంతపు రోజుల్లో వీరి ఆగడాలు మరీ ఎక్కువ కనిపిస్తుంటాయి. సాయంత్రం వేళలో రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతం, ఎర్రగుంట్ల రోడ్డులోని పార్కు, రైల్వేస్టేషన్ సమీపంలో సిట్టింగ్ వేసి మద్యం సేవిస్తుంటారు. మద్యం మత్తులో అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేయడం, వాహనాలకు నష్టం కలిగించడం లాంటి పనులు చేస్తున్నారు. కొన్ని సంఘటనలు.. – రెండు నెలల క్రితం సాయిటీర్ కుటీర్ రోడ్డులో నలుగురు యువకులు మద్యం సేవించి అమ్మాయి విషయంలో ఘర్షణ పడ్డారు. ప్రధాన రహదారిలో ఈ సంఘటన జరగడంతో కొంత సేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. – కోనేటి కాల్వ వీధిలో, రామేశ్వరంరోడ్డులోని అనా బంకు సమీపంలో, ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని నాలుగు రోడ్ల సమీపంలో, గంగమ్మఆలయం వీధిలో, మార్కెట్ యార్డు ఆవరణలో వేర్వేరు బ్యాచ్‌లకు చెందిన వారు మద్యం మత్తులో తన్నుకున్నారు. ఇందులో గంగమ్మ ఆలయం వీధిలో జరిగిన గొడవకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు. – నెహ్రూ రోడ్డులోని నాలుగు రోడ్ల కూడలిలో కొందరు గ్రూపులుగా ఏర్పడి ఆ ప్రాంతంలో వెళ్లే కళాశాల, పాఠశాల విద్యార్థినులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆ ప్రాంత వాసులు అంటున్నారు. – ఇటీవల కోనేటి కాలువ వీధి, భావనారుషి ఆలయం సమీపంలో, ప్రకాష్‌నగర్‌లో ఒకే రోజు మూడు బైక్‌లను కాల్చేశారు. – భగత్‌సింగ్ కాలనీ సమీపంలో ఒక యువతిని వేధిస్తున్నాడనే కారణంతో ఆ ప్రాంత వాసులు జులాయికి దేహశుద్ధి చేశారు. – పట్టణంలోని వూటుకూరు వీరయ్య పాఠశాలలో ఫ్యాన్లు, తలుపులు, కిటికీలను ధ్వంసం చేయడమేగాక మద్యం తాగి సీసాలను పగులగొట్టారు. – త్రిబుల్ రైడింగ్‌తో విద్యార్థులు ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్నప్పటికీ ఎందుకో మరి ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. గాంధీరోడ్డు, నెహ్రూరోడ్డు, సూపర్బజార్రోడ్డులలో విద్యార్థినులను వేధిస్తున్నట్లు ఆ ప్రాంత వాసులు అంటున్నారు. విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటైన షీ టీం ద్వారా వారికి రక్షణ లభించడం లేదు. రాత్రి వేళల్లో పొద్దుపోయే వరకు యువకులు పార్టీల పేరుతో పట్టణంలో నిత్యం బైకుల్లో సంచరిస్తున్నారు. పోలీసులు తగినంత నిఘా పెట్టకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు. – ఇవీ వెలుగులోకి వచ్చిన సంఘటనలు మాత్రమే. అనేకం బయటికి రావడం లేదు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని వీటిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం పట్టణంలో పోలీసు గస్తీ ముమ్మరం చేసి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కళాశాలల వద్ద కూడా షీ టీం సభ్యులతో నిఘా ఏర్పాటు చేస్తాం. – పూజిత నీలం, ప్రొద్దుటూరు డీఎస్పీ -
పోలీసుల కాల్పుల్లో ఐదుగురు గ్యాంగ్స్టర్స్ మృతి
కరాచీ : పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో శుక్రవారం అర్థరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు... గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు గ్యాంగ్స్టర్స్ మరణించారని సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి ఫిదా హుస్సేన్ జన్వారీ శనివారం వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో నేప్యర్ పోలీసు స్టేషన్ హౌస్ ఉన్నతాధికారి అజాంఖాన్ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కరాచీ నగరం లైరీ సమీపంలోని మార్కెట్ వద్ద గ్యాంగ్స్టర్స్ ఉన్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు సదరు ప్రదేశానికి చేరుకున్నారు. ఆ విషయం గమనించిన గ్యాంగ్స్టర్స్... పోలీసులపైకి ముకుమ్మడిగా కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారని ఫిదా హుస్సేన్ జన్వారీ వెల్లడించారు. -
హత్యకు భారీ సుపారీ... ముఠా అరెస్ట్
నల్గొండ: భారీగా సుపారీ తీసుకుని ఓ వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నీన కిరాయి హంతక ముఠా గుట్టును నల్గొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. మోత్కూరు మండలం అనాజ్పురంలో కిరాయి హంతకముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తుపాకీతో పాటు అయిదు వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ముఠాను తమదైన శైలిలో విచారించారు. శశిధర్ రెడ్డి అనే వ్యక్తిని హత్య చేసేందుకు తాము ఒకరి వద్ద నుంచి రూ. 15 లక్షలు సుపారీ తీసుకున్నట్లు వారు పోలీసులకు వివరించారు. ఎవరు ఆ నగదు ఇచ్చారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు.