NIA Crackdown On Gangsters: Conducts raids at over 70 locations in 8 states - Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 70 చోట్ల ఎన్‌ఐఏ దాడులు..

Published Tue, Feb 21 2023 10:38 AM | Last Updated on Tue, Feb 21 2023 2:05 PM

NIA Crackdown On Gangsters Raids 70 Locations Across India - Sakshi

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ). దేశవ్యాప్తంగా 70 చోట్ల ఒకేసారి దాడులు చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, చండీగడ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సోదాలు చేపడుతోంది.

ఉత్తర భారత్‌లో ప్రత్యేకించి ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో మాఫియా  కార్యకలాపాలు పెరుగుతున్నట్లు గుర్తించిన ఎన్‌ఐఏ.. గ్యాంగ్‌స్టర్లపై రెండు కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏకకాలంలో సోదాలు చేస్తోంది. ఒక్క పంజాబ్‌లోనే 30 ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్‌పై నమోదైన కేసు విచారణలో భాగంగానే ఎన్‌ఏఐ ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్లను లక్ష‍్యంగా చేసుకుని ఇలా సోదాలు నిర్వహించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

కాగా.. దేశంలోని పులు నగరాల్లో గ్యాంగ్‌స్టర్లు ఉగ్రకార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఐఏ వీరిపై ఉక్కుపాదం మోపుతోంది.
చదవండి: జైల్లో ఆకస్మిక తనిఖీలు.. భయంతో మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement