నల్గొండ: భారీగా సుపారీ తీసుకుని ఓ వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నీన కిరాయి హంతక ముఠా గుట్టును నల్గొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. మోత్కూరు మండలం అనాజ్పురంలో కిరాయి హంతకముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తుపాకీతో పాటు అయిదు వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ముఠాను తమదైన శైలిలో విచారించారు. శశిధర్ రెడ్డి అనే వ్యక్తిని హత్య చేసేందుకు తాము ఒకరి వద్ద నుంచి రూ. 15 లక్షలు సుపారీ తీసుకున్నట్లు వారు పోలీసులకు వివరించారు. ఎవరు ఆ నగదు ఇచ్చారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు.