
లూథియానా: గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి పోలీసులపై కాల్పులకు పాల్పడిన ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ సబ్‌ఇన్స్‌పెక్టర్లు మరణించారు. ఈ దుర్ఘటన జాగ్రాన్ టౌన్‌లో జరిగిందని డీఎస్‌పీ జీఎస్ బియాన్స్ శనివారం తెలిపారు. కాల్పులు జరిగాక ఏఎస్‌ఐ భగవాన్ అక్కడికక్కడే మరణించారని, మరో ఏఎస్‌ఐ దల్విందర్‌సింగ్ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారని వెల్లడించారు. వీరిద్దరూ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (సీఐఏ)లో పని చేస్తున్నారని పేర్కొన్నారు.
కాల్పుల ఘటన గురించి తెలిసిన వెంటనే ఐజీపీ నౌ నిహాల్ సింగ్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. డ్రగ్స్ స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్స్, గతంలో వీరిద్దరు ఇంటరాగేట్ చేసిన వారిలో ఎవరైనా ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో విచారణ జరుగుతోంది.
(చదవండి: సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు)