Gang stars
-
వణుకు పుట్టిస్తోన్న బ్లేడ్‌బ్యాచ్.. రంగంలోకి కమిషనర్!
సాక్షి ప్రతినిధి విజయవాడ: వారికి గంజాయితో నిత్యం సహవాసం.. జన సంచారం అంతగాలేని ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే వారే లక్ష్యం.. డబ్బులు ఇవ్వలంటూ బ్లేడుతో దాడి చేయడం, పోలీసులు పట్టుకోవాలని ప్రయత్నిస్తే తమను తాము కోసు కుని చస్తామంటూ బెదిరించడం వారికి సహజం.. ఇదీ విజయవాడలో హల్చల్ చేసే బ్లేడ్‌బ్యాచ్ సభ్యుల నైజం. నగరంలో అలజడి సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న బ్లేడ్ బ్యాచ్ సభ్యుల కట్టడికి పోలీసులు చర్యలు చేపట్టారు. వారి మూలాలను శోధించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా స్వయంగా రంగంలోకి దిగారు. సీపీ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి తాగేవారు ఎంత మంది ఉన్నారనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే నగరంలో బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలకు, గంజాయి తాగేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలైన వన్ టౌన్, టూ టౌన్, రైల్వే అప్ యార్డు, సీపీఆర్ ఫ్లై ఓవర్, ఆర్పీఎఫ్ పోస్టు, రామరాజ్యనగర్లోని రైల్వే బ్రిడ్జ్ కింద ఖాళీ ప్రదేశాలు, జక్కంపూడి శివారులోని 60, 40 అడుగుల రోడ్ల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నేర చరిత్ర ఆధారంగా బ్లేడ్ బ్యాచ్ సభ్యులను ఆయా పోలీస్స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పోలీస్ కమిషనర్ టి.కె.రాణా వన్‌టౌన్, సింగ్‌నగర్ ప్రాంతంలో బ్లేడ్‌బ్యాచ్, గంజాయి తాగేవారికి ఇప్పటికే కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి కదలికలు ఎక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో సీపీ స్వయంగా పర్యటించి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. సన్మార్గంలో నడిస్తే ఉపాధి బ్లేడ్ బ్యాచ్ సభ్యులు నేర ప్రవృత్తిని మార్చుకుని మంచి మార్గంలో నడవాలని నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆధ్వర్యంలో పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ జన జీవనానికి భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి కఠిన దండన తప్పదనే సంకేతాలు పంపుతున్నారు. నేర ప్రవృత్తి మార్చుకోని వారిని ఉపేక్షించేది లేదని, అవసరమైతే నగర బహిష్కరణ తప్పదని హెచ్చరిస్తున్నారు. మంచి మార్గంలో నడుచుకునే వారికి వ్యాపార సంస్థలతో మాట్లాడి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. బ్లేడ్‌బ్యాచ్ సభ్యులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి, వారి తల్లిదండ్రులను పిలిపించి పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. ఆగడాలకు అడ్డుకట్ట ఇలా.. బ్లేడ్ బ్యాచ్, గంజాయి తాగి చెడ్డదారుల్లో నడిచేవారికి ప్రతి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులను సీపీ టి.కె.రాణా ఆదేశించారు. గంజాయి తాగేందుకు అనువుగా ఉండే ప్రదేశాలను గుర్తించి పోలీస్ గస్తీ పెంచాలని, స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించి పిల్లలు వ్యసనాలకు బానిసలు కాకుండా చూసేలా తల్లిదండ్రులను చైతన్యం చేయాలని సూచించారు. గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలని, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారిలో మార్పు తీసుకురావడానికి డీ–ఎడిక్షన్ సెంటర్లకు పంపాలని పేర్కొన్నారు. నేరాలు జరగడానికి అవకాశం ఉన్న చీకటి ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో స్థానిక అధికారులతో మాట్లాడి లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా... చెడు నడత గల వ్యక్తుల సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు స్వయంగా లేదా, 100 నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని సీపీ టి.కె.రాణా ప్రజలను కోరారు. మత్తు పదార్థాల విక్రేతలు, వినియోగదారుల వివరాలను, వీధుల్లో తిరుగుతూ శాంతి భద్రతలకు భంగం కలిగించే ఆకతాయిల వివరాలను పోలీసులకు తెలపాలని కోరారు. ఈ సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. చదవండి: బాబోయ్ ప్రైవేట్ ట్రావెల్స్.. అడ్డంగా దోచేస్తున్నారు -
పంజాబ్‌లో పోలీసులపై కాల్పులు..ఇద్దరు ఏఎస్ఐల మృతి
లూథియానా: గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి పోలీసులపై కాల్పులకు పాల్పడిన ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్లు మరణించారు. ఈ దుర్ఘటన జాగ్రాన్ టౌన్లో జరిగిందని డీఎస్పీ జీఎస్ బియాన్స్ శనివారం తెలిపారు. కాల్పులు జరిగాక ఏఎస్ఐ భగవాన్ అక్కడికక్కడే మరణించారని, మరో ఏఎస్ఐ దల్విందర్‌సింగ్ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారని వెల్లడించారు. వీరిద్దరూ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (సీఐఏ)లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. కాల్పుల ఘటన గురించి తెలిసిన వెంటనే ఐజీపీ నౌ నిహాల్ సింగ్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. డ్రగ్స్ స్మగ్లర్లు, గ్యాంగ్స్టర్స్, గతంలో వీరిద్దరు ఇంటరాగేట్ చేసిన వారిలో ఎవరైనా ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో విచారణ జరుగుతోంది. (చదవండి: సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు) -
గ్యాంగ్‌స్టర్‌గా హృతిక్ రోషన్
గ్యాంగ్‌స్టర్‌గా కనిపించడానికి తగిన కసరత్తులు చేస్తున్నారు హృతిక్ రోషన్. రెండు నెలలుగా ఈ పని మీదే ఉన్నారు హృతిక్. అయితే మే నుంచి అంతకు మించి కఠినమైన కసరత్తులు చేయాలనుకుంటున్నారట. తమిళ చిత్రం ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్‌లో హృతిక్ గ్యాంగ్‌స్టర్ పాత్ర చేయనున్నారు. ఇదే సినిమాలో పోలీస్ పాత్రను సైఫ్ అలీఖాన్ చేయనున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా, మాధవన్ పోలీసాఫీసర్‌గా నటించారు. గ్యాంగ్‌స్టర్ పాత్ర బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకే హృతిక్ శ్రద్ధ తీసుకుని ఈ పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆయన లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది హృతిక్‌కి 25వ సినిమా. తమిళ చిత్రాన్ని తెరకెక్కించిన పుష్కర్–గాయత్రి దంపతులు హిందీ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహించనున్నారు. ఈ వేసవిలోనే షూటింగ్ ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. -
హత్యా బెదిరింపులు: సీఎంకు ఎమ్మెల్యే ఫిర్యాదు
లక్నో: గ్యాంగ్స్టర్లకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్‌లో ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ కరువైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పాలనా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. వారిలో మాత్రం ఏమాత్రం మార్పు రావడంలేదు. గ్యాంగ్‌స్టర్ వికాశ్ దుబే ఎన్కౌంటర్ ఉదంతం మరువకముందే మరో క్రిమినల్ ఏకంగా ఓ ఎమ్మెల్యేపై హత్యా బెదిరింపులకు దిగాడు. యూపీలోని భాగ్‌పట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యోగేష్ దామాకు గ్యాంగ్‌స్టర్ సునిల్ రాతి నుంచి హత్యా బెదిరింపులు ఎదురైయ్యాయి. దీంతో భయాందోళనకు గురైన ఎమ్మెల్యే మంగళవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డీజీపీ హితేష్ చంద్ర అవస్థీలకు ఫిర్యారు చేశారు. గ్యాంగ్‌స్టర్ నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. (22 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్, కానీ..) అనంతరం మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. సునిల్‌కు సంబంధించిన అక్రమ మైనింగ్‌ను తాను అడ్డుకున్నాని, దానికి ప్రతీకారంగానే తనపై బెదిరింపులకు దిగాడని తెలిపారు. దీనిపై సీఎం యోగి సానుకూలంగా స్పందించి భరోసా ఇచ్చారని చెప్పారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న నేరగాళ్ల పనిపడుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో పేరుమోసిన నేరగాళ్లలో ఒకడైన సునిల్ రాతి 2018లో జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అతనిపై మరొకొన్ని కేసులు కూడా నమోదై ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆయనకు భద్రతను పెంచారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని స్థానిక ఎస్పీ తెలిపారు. -
పిచ్ నుంచి పాటకు..!
క్రికెటర్ సురేశ్ రైనా ఓ రికార్డు సాధించారు. అదేంటి ఏ మ్యాచ్‌లో అనుకుంటున్నారా? మ్యాచ్‌లో కాదండి! పాట పాడటంలో. ‘మీరుథియా గ్యాంగ్స్టర్స్’ చిత్రంలో ‘తూ మిలే సబ్ మిలా’ అనే రొమాంటిక్ సాంగ్‌ను ఆలపించి తనలో మంచి పాటగాడు కూడా ఉన్నాడని నిరూపించాడు సురేశ్ రైనా. ‘‘క్రికెట్ అంటే నాకు ప్రాణం. దీంతో పాటు మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టం. అలా నాకు పాడటం వచ్చింది. ఈ సినిమా నిర్మాత నా భార్యకు బంధువు అవుతారు. ఏదో సందర్భంలో నా గొంతు విని నేను ఈ సినిమాలో పాడాల్సిందే పట్టుబట్టారు. కేవలం అయిదు గంటల్లో రికార్డింగ్ పూర్తయింది. వినేవాళ్లకు నచ్చుతుందనుకుంటున్నా’’ అని సురేశ్‌రైనా చెప్పారు.