
గ్యాంగ్‌స్టర్‌గా కనిపించడానికి తగిన కసరత్తులు చేస్తున్నారు హృతిక్ రోషన్. రెండు నెలలుగా ఈ పని మీదే ఉన్నారు హృతిక్. అయితే మే నుంచి అంతకు మించి కఠినమైన కసరత్తులు చేయాలనుకుంటున్నారట. తమిళ చిత్రం ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్‌లో హృతిక్ గ్యాంగ్‌స్టర్ పాత్ర చేయనున్నారు. ఇదే సినిమాలో పోలీస్ పాత్రను సైఫ్ అలీఖాన్ చేయనున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా, మాధవన్ పోలీసాఫీసర్‌గా నటించారు.
గ్యాంగ్‌స్టర్ పాత్ర బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకే హృతిక్ శ్రద్ధ తీసుకుని ఈ పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆయన లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది హృతిక్‌కి 25వ సినిమా. తమిళ చిత్రాన్ని తెరకెక్కించిన పుష్కర్–గాయత్రి దంపతులు హిందీ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహించనున్నారు. ఈ వేసవిలోనే షూటింగ్ ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment