
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. సెవెన్ డాగ్స్ అనే అర్జెంటీనా సినిమాను హాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలోముఖ్య పాత్ర కోసం సల్లూ భాయ్‌ను సంప్రదించగా ఆయన పచ్చజెండా ఊపారట! ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
దుబాయ్‌లో షూటింగ్!
ఇందుకోసం సల్మాన్ ఖాన్ కొద్దిరోజుల క్రితమే దుబాయ్ పయనమయ్యాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లకు సంబంధించిన సన్నివేశాలపై చిత్రీకరణ జరుపుతున్నారంటూ కొన్ని వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో సల్మాన్ ఆటో డ్రైవర్ వేషంలో ఉన్నాడు. ఆటో దగ్గర సల్మాన్ నిల్చోగా అతడి పక్కనే సంజయ్ దత్ సూటూబూటు వేసుకుని ఠీవీగా కనిపిస్తున్నాడు. సల్మాన్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సినిమా
కాగా సల్మాన్ ఖాన్ చివరగా టైగర్ 3 సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సికందర్ మూవీ చేస్తున్నాడు. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం రంజాన్ పండగకు విడుదల కానుంది.
Bhai and Baba are in Saudi Arabia to shoot cameo for a Hollywood movie 🎥... #Salmankhan #Sanjaydutt #Sikandar pic.twitter.com/ZoTZ6mNae4
— Adil Hashmi👁🗨 (@X4SALMAN) February 19, 2025
MEGASTAR SALMAN KHAN in Saudi Arabia today #Sikandar #SalmanKhan pic.twitter.com/pUVl8WMvoc
— Lokendra Kumar (@rasafi24365) February 19, 2025
చదవండి: ఓటీటీలోకి ఎమర్జెన్సీ.. సింపుల్‌గా డేట్ చెప్పేసిన కంగనా
Comments
Please login to add a commentAdd a comment