
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ బయోపిక్‌పై ప్రకటన వచ్చేసింది. ఇదే విషయాన్ని తాజాగా గంగూలీ ప్రకటించారు. తన పాత్రలో కనిపించనున్న నటుడు ఎవరో కూడా ఆయన రివీల్ చేశారు. అయితే, ఈ బయోపిక్ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఈ మూవీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా గురించి గంగూలీనే స్వయంగా అప్‌డేట్ ఇవ్వడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.
టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ పేరు తప్పక చరిత్రలో ఉంటుంది. ఇండియా తరఫున 113 టెస్టులు, 311 వన్డేలలో రాణించిన ఆయన అన్ని విభాగాల్లో కలిపి 18575 రన్స్ చేశారు. ఆయన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని వెండితెరపై ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని చూపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మీడియాతో మాట్లాడిన గంగూలీ పలు విషయాలు పంచుకున్నారు.
ఈ బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్నట్లు సౌరవ్ గంగూలీ తెలిపారు. తనకు తెలిసిన సమాచారం ఆయనే తన పాత్రలో నటిస్తున్నారని సౌరవ్ చెప్పుకొచ్చారు. కానీ, ఆయన షెడ్యూల్స్ బిజీగా ఉండటం వల్ల సరైన తేదీలు ఇంకా సెట్ కాలేదన్నారు. దీంతో ఈ సినిమా కోసం మరో ఏడాది పాటు ఆగాల్సి ఉంటుందని గంగూలీ అన్నారు.

రాజ్ కుమార్ రావ్ బాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ బిజీ స్టార్‌గా ఉన్నారు. రీసెంట్‌గా స్త్రీ2 సినిమాతో ఆయన మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం భూల్ చూక్ మాఫ్, టోస్టర్,మాలిక్ వంటి చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. గంగూలీ బయోపిక్‌లో ప్రముఖ బెంగాలీ నటుడిని కూడా చిత్ర యూనిట్ సంప్రదించారని తెలుస్తుంది. గంగూలీ స్నేహితుడైన ప్రొసేన్‌జిత్ ఛటర్జీని బయోపిక్‌లో నటించమని దర్శక, నిర్మాతలు కోరారట. ఇందుకు ప్రొసేన్‌జిత్ కూడా ఒప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ప్రొసేన్‌జిత్ సైడ్ అయిపోయి కొత్తగా రాజ్‌కుమార్ రావు తెరపైకి వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment