assistant sub inspector
-
Odisha: మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు.. ఛాతీలో దిగిన బుల్లెట్లు..
భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్య మంత్రి నబ కిశోర్ దాస్‌పై ఏఎస్ఐ కాల్పులు జరిపాడు. ఝార్‌సుగుద జిల్లా బ్రజ్రాజ్నగర్లోని గాంధీ స్క్వేర్‌లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి కారులో నుంచి దిగగానే పోలీసు తుపాకీ తీసి నాలుగైదు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో కిశోర్ దాస్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అధికారులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మంత్రిపై కాల్పులు జరిపిన ఏఎస్ఐ పేరు గోపాల్ దాస్ అని ఉన్నతాధికారులు వెల్లడించారు. అతను యూనిఫాంలోనే ఉన్నాడని పేర్కొన్నారు. తన సొంత తుపాకీతోనే కాల్పులు జరిపినట్లు చెప్పారు. అయితే మంత్రిపై ఏఎస్ఐ ఎందుకు కాల్పులు జరిపాడనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మంత్రికి పోలీస్ ఎస్కార్ట్ ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం చూస్తుంటే భద్రతా వైఫల్యంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. చదవండి: కళల అభ్యున్నతికి పాల్పడుతున్న వారిని గుర్తించాం.. 'మన్‌కీ బాత్'లో మోదీ -
మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం.. ఏఎస్ఐకు 20 ఏళ్ల జైలుశిక్ష
మైసూరు: ఆపదలో ఉన్నవారిని రక్షించాల్సిన పోలీస్ అధికారి అయి ఉండి మతిస్థిమితం లేని యువతిని చెరబట్టిన కామాంధునికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం అంతరసనహళ్లి వద్ద యువతిపై ఏఎస్ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధిస్తూ జిల్లా 2వ సెషన్స్ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లిఖార్జునస్వామి మంగళవారం తీర్పు వెలువరించారు. ఒంటరి యువతిని చూసి.. 2017న జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్లినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటిరోజు ఈ దారుణం తెలిసి యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఉమేశయ్య నేరం చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు. ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. రూ. లక్ష జరిమానాను బాధితురాలికి అందజేయాలని దోషిని ఆదేశించారు. కాగా ఉమేశయ్య జీపు డ్రైవర్‌పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి. దోషి ఉమేశయ్య -
Anantapur: కొడుకు పెళ్లయిన వెంటనే తండ్రి మృతి.. ఆ వెంటనే..
సాక్షి, అనంతపురం: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం వరకు పెళ్లి భాజాలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకెళ్తే.. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో క్షణాల వ్యవధిలో తల్లీ, కొడుకులు మరణించారు. పామిడి ఏఎస్ఐగా పనిచేస్తున్న వెంకటస్వామి ఆదివారం కొడుకు పెళ్లయిన వెంటనే గుండెపోటుతో మరణించారు. ఈ మరణవార్త తెలిసిన మరుక్షణమే వెంకటస్వామి తల్లి కోనమ్మ (70) మృతి చెందింది. తల్లీ, కొడుకుల మరణవార్తతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చదవండి: (మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు) అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కొడుకు వివాహం అనంతరం గుండెపోటుతో మృతి చెందిన పామిడి ఏఎస్ఐ వెంకటస్వామి, ఆయన తల్లి కోనమ్మ మృతదేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జిల్లా పోలీసు అధికారుల సంఘం నేతలు త్రిలోక్, సుధాకర్ రెడ్డి సంతాపం తెలియజేశారు. -
చంపుతామని బెదిరించారు: బీజేపీ కార్యకర్తలపై ఏఎస్సై ఫిర్యాదు
వీణవంక (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లాలో మాజీమంత్రి ఈటల రాజేందర్ పర్యటన సందర్భంగా విధి నిర్వహణపై వెళ్లిన ఏఎస్సై బాపిరెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వీణవంక మండలం వల్భాపూర్ గ్రామంలో సోమవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఈటల రాజేందర్ పర్యటనలో గొడవలు జరగకుండా చూసేం దుకు విధుల్లో భాగంగా బాపిరెడ్డి వల్భాపూర్ వెళ్లారు. అక్కడ దొమ్మాటి రాజమల్లు ఇంటివద్ద కార్యకర్తలతో ఈటల సమావేశ మయ్యారు. ఈక్రమంలో బాపిరెడ్డి అక్కడ విధులు నిర్వర్తిస్తుండగా బీజేపీ కార్యకర్తలు ఇక్కడికెందుకు వచ్చావ్ అంటూ అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన మోటార్ సైకిల్ ధ్వంసం కాగా, ఆయన వేసుకున్న చొక్కా చిరిగిపోయింది. విధులకు ఆటంకం కలిగించడంతోపాటుగా తనను చంపుతామని బెదిరించినట్లు ఏఎస్సై ఫిర్యా దు చేయగా.. బీజేపీ కార్యకర్తలు జీడి రాజు, దొమ్మాటి రాజమల్లు, నలుబాల మధు, మారముల్ల సదయ్య, నామిని విజేందర్, రాయిని శివయ్య, జీడి మోహన్, దొమ్మాటి శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేశారు. -
వైరల్: కొడుక్కు సెల్యూట్ చేసిన తల్లి, నెటిజన్లు ఫిదా
గాంధీనగర్: పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే.. సహజంగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. అయితే, పిల్లలను తమే గౌరవించాల్సిన ఉన్నత స్థితికి వారు చేరుకుంటే తల్లిదండ్రులకు పట్టపగ్గాలు ఉండవని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఈ మధ్యకాలంలో ఉద్యోగరిత్యా కొడుకును తండ్రి గౌరవించడం, ఉన్నతాధికారి అయిన కుమార్తెకు తండ్రి సెల్యూట్ చేయడం వంటి సన్నివేశాలను మనం చూసాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఓ చిత్రంలో కన్నతల్లి.. ఉన్నతాధికారి అయిన కొడుకుకు సెల్యూట్ చేస్తూ మురిసిపోతుంటుంది. చదవండి: భారత ఎంబసీల్లో తాలిబన్ల సోదాలు వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోకి అరవల్లి ప్రాంత డీఎస్పీకి (పోలీస్ శాఖ).. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఏఎస్సై సెల్యూట్ చేస్తుంది. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా. అక్కడ పరస్పరం సెల్యూట్ చేసుకున్న వారు తల్లి కొడుకు కావడమే విశేషం. ఈ సందర్భంగా తల్లి మురిసిపోతూ, కళ్ల నిండా ఆనందంతో కొడుకుకు సెల్యూట్ చేస్తున్న దృశ్యం హైలైట్‌గా నిలిచింది. ఈ అపురూప దృశ్యాన్ని గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ దినేశ్ దాస ట్వీట్ చేయడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మనస్సుకు హత్తుకునే ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మ కళ్లల్లో అసలుసిసలైన ఆనందాన్ని చూడాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: తండ్రితో పెళ్లికూతురు హుషారైన స్టెప్పులు.. ఫిదా అవ్వాల్సిందే -
పంజాబ్‌లో పోలీసులపై కాల్పులు..ఇద్దరు ఏఎస్ఐల మృతి
లూథియానా: గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి పోలీసులపై కాల్పులకు పాల్పడిన ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్లు మరణించారు. ఈ దుర్ఘటన జాగ్రాన్ టౌన్లో జరిగిందని డీఎస్పీ జీఎస్ బియాన్స్ శనివారం తెలిపారు. కాల్పులు జరిగాక ఏఎస్ఐ భగవాన్ అక్కడికక్కడే మరణించారని, మరో ఏఎస్ఐ దల్విందర్‌సింగ్ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారని వెల్లడించారు. వీరిద్దరూ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (సీఐఏ)లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. కాల్పుల ఘటన గురించి తెలిసిన వెంటనే ఐజీపీ నౌ నిహాల్ సింగ్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. డ్రగ్స్ స్మగ్లర్లు, గ్యాంగ్స్టర్స్, గతంలో వీరిద్దరు ఇంటరాగేట్ చేసిన వారిలో ఎవరైనా ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో విచారణ జరుగుతోంది. (చదవండి: సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు) -
ఘట్కేసర్ పీఎస్‌లో ఏఎస్సై ఆత్యహత్య కలకలం
సాక్షి, హైదరాబాద్ : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్సై ఆత్మహత్య ప్రయత్నం కలకలం సృష్టించింది. అధికారుల వేధింపులే కారణమని తెలిసింది. వివరాలు.. రామకృష్ణ అనే వ్యక్తి ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధుల నిర్వహిస్తున్నాడు. ఈనెల 10న ఒక కేసు విషయంలో కొంత మంది వ్యక్తులను పోలీసు స్టేషన్‌కి తీసుకురాగా.. ఆ సమయంలో రామకృష్ణ విధుల్లో ఉన్నాడు. అయితే రామకృష్ణ ఉన్న సమయంలోనే స్టేషన్‌కు తీసుకొచ్చినవారిలో ఒక వ్యక్తి పారిపోయాడని సమాచారం. దీంతో విధుల్లో ఉన్న ఏఎస్సై రామకృష్ణని పై అధికారులు మందలించారు. దీంతో తాను అవమానం గురైనట్లు భావించిన రామకృష్ణ నేడు జెండా పండుగకు హాజరయ్యాడు. అనంతరం ఇంటికి కాల్ చేసి ఇదే నా చివరి కాల్ అని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయపై అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామకృష్ణ ఫోన్ సిగ్నల్ ని ట్రాక్ చేసిన పోలీసులు ఘట్ కేసర్ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొనే సమయంలోనే అక్కడికి చేరుకొని రక్షించారు. కాగా రామకృష్ణ ని దగ్గర్లోని క్యూర్ ఆసుపత్రికి తరలించగా.. రామకృష్ణ సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
పలుమార్లు నెగెటివ్..చివరి పరీక్షలో పాజిటివ్
-
కరోనా పరీక్షల్లో నెగెటివ్.. సీటీ స్కాన్‌లో పాజిటివ్
హైదరాబాద్: కరోనా చెలగాటం సామాన్యులకు ప్రాణసంకటం.. ముందు నిద్రాణంగా ఉండి ఆ తర్వాత పంజా విసురుతోంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని కరోనా పరీక్ష చేయించుకుంటే ముందు నెగెటివ్ అని వస్తోంది.. ఆ తర్వాత సీటీస్కాన్లో అది పాజిటివ్‌గా తేలి ప్రాణాలు తీస్తోంది. ఈ విధంగానే ఓ ఏఎస్ఐని కబళించింది. కరోనాతో పోరులో చివరికి ఆయన కన్నుమూశాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ్‌కుమార్(55) ఏఎస్ఐగా మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ సమయంలోనూ ఆయన రేయింబవళ్ళు సేవలందించారు. ఈ నెల 7వ తేదీన శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అమీర్‌పేట్‌లోని నేచర్‌క్యూర్ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. సీటీ స్కాన్‌లో పాజిటివ్ అని.. కరోనా కాకపోవచ్చని భావించిన ప్రేమ్‌కుమార్ ఎర్రగడ్డలోని నీలిమా ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు ప్రేమ్‌కుమార్‌కు íసీటీ స్కాన్ తీశారు. ఈ స్కాన్‌లో ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. కరోనా వల్లే ఈ ఇన్ఫెక్షన్ ఉండొచ్చని భావించిన వైద్యులు ఆయనను కోవిడ్ ఆస్పత్రుల్లో చేరాలని సూచించగా మళ్లీ నేచర్ క్యూర్ ఆస్పత్రికి వెళ్ళారు. నెగెటివ్ వచ్చిన వారికి ఇక్కడ వైద్యం చేయడం కుదరదని, ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు లేవని ఆస్పత్రివర్గాలు చెప్పడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చేరిన కాసేపటికే ఆక్సిజన్ సరఫరా సరిగా లేక ప్రేమ్‌కుమార్ కళ్ల ముందే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆయనను సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమ వద్ద భద్రతాకార్డుపై చికిత్స అందించే సౌకర్యంలేదని ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేశాయి. సోమవారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో బెడ్ కోసం ప్రయత్నించారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో పోలీసు ఉన్నతాధికారుల చొరవతో అపోలో ఆస్పత్రిలో బెడ్ దొరికింది. అక్కడ ప్రేమ్‌కుమార్‌కు మరోసారి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. సోమవారం నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ప్రేమ్‌కుమార్ గురువారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ప్రేమ్‌కుమార్ చనిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. -
ప్రముఖ కబడ్డీ ప్లేయర్‌ను కాల్చి చంపిన పోలీసు
చండీగఢ్ : కారు పార్కింగ్‌లో గొడవ జరిగి ప్రముఖ కబడ్డీ ఆటగాడిని ఓ పోలీసు అధికారి కాల్చి చంపిన ఘటన పంజాబ్‌లోని కపుర్తాలా జిల్లాలో చోటు చేసుకుంది. మృతి చెందిన కబడ్డీ ప్లేయర్ అర్విందర్ జీత్ సింగ్‌గా గుర్తించారు. కాగా, కాల్పులకు పాల్పడిన ఏఎస్సై పరమ్‌జీత్ సింగ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందంటే.. పంజాబ్‌కు చెందిన ప్రముఖ కబడ్డీ ప్లేయర్ అర్విందర్ జీత్ సింగ్ గురువారం రాత్రి తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్(ఎస్యూవీ) కారులో రైడింగ్‌కు వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు ఓ రోడ్డు పక్కన వారి కారును పార్క్ చేసి అందులోనే కూర్చొని ఉన్నారు. ఇదే సమయంలో... మరో ఎస్‌యూవీలో ఏఎస్సై పరంజీత్‌సింగ్ అటుగా వచ్చాడు. ఇక్కడ ఎందుకు పార్కింగ్ చేశారు? అని అర్విందర్‌ను ప్రశ్నించారు. దీనికి అర్విందర్ సమాధానం చెప్పకుండా కారును స్టార్ట్ చేసి స్పీడ్‌గా దూసుకెళ్లాడు. దీంతో ఏఎస్సైకి అనుమానం వచ్చి వారి కారును ఛేజింగ్ చేశారు. అర్విందర్ సింగ్(ఫైల్ ఫోటో) పోలీసులు వదలట్లేదని భావించిన అర్విందర్... ఓ చోట కారు ఆపి తనతోపాటూ కారులో ఎవరెవరు వచ్చారో చెప్పడానికి వెనక్కి తిరిగాడు. ఇంతలో తన వెహికిల్ నుంచి కిందకు దిగిన ఏఎస్సై... అర్విందర్‌పై కాల్పులు జరిపాడు.దీంతో అర్వింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో స్నేహితుడు ప్రదీప్ సింగ్‌కి గాయాలయ్యాయి. వెంటనే అతని ఫ్రెండ్స్... కారు దిగి... ఫైరింగ్ ఆపమని వేడుకున్నారు. దాంతో ఏఎస్సై ఆగాడు. ఆ తర్వాత అదే వెహికిల్‌లో అర్విందర్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. కాగా, అర్విందర్ స్నేహితుల ఫిర్యాదు మేరకు ఏఎస్సైపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. -
ఏఎస్ఐ చేయి నరికేశారు!
చండీగఢ్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ముఠా ఇదేమని ప్రశ్నించిన పోలీసులపై కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి చేయి తెగిపోగా మరో ముగ్గురు పోలీసులు సహా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రం పటియాలా జిల్లా సనౌర్ పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, పాస్‌లు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి కొందరు నిహంగ్(సిక్కుల్లోని ఓ వర్గం)లు ఎస్యూవీ వాహనంలో అక్కడికి వచ్చారు. పోలీసులు వారిని పాస్‌లు చూపించాలని కోరగా బారికేడ్లపైకి వాహనాన్ని నడిపారు. అడ్డుకున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై) హర్జీత్ సింగ్ చేతిని తమ వద్ద ఉన్న కత్తితో నరికారు. మార్కెట్ అధికారితోపాటు మరో ముగ్గురు పోలీసులను కూడా గాయపర్చారు. పోలీసులు వెంబడించగా దుండగులు అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలోని బల్బేర్ గ్రామంలోని గురుద్వారాలో దాక్కున్నారు. ఈలోగా గాయపడిన హర్జీత్ సింగ్‌ను, తెగిన చేయి సహా అధికారులు చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)కు తరలించారు. నిహంగ్‌ల ముఠా గురుద్వారాలో దాగిన విషయం తెలిసిన పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆ ప్రదేశాన్ని దిగ్బంధించారు. లోపలున్న మహిళలు, చిన్నారులకు హాని కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. లొంగిపోవాలని హెచ్చరించినా దుండగులు వినకుండా గ్యాస్ సిలిండర్లతో గురుద్వారాను పేల్చి వేస్తామని బెదిరించడంతోపాటు పోలీసులపైకి కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకా>ల్పుల్లో ఆ ముఠాలోని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అనంతరం దాడికి పాల్పడిన ముఠాలోని ఐదుగురు, ఓ మహిళ సహా మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు పిస్టళ్లు, కత్తులు, మత్తు కోసం వాడే గసగసాల పొడిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, పీజీఐఎంఈఆర్లోని వైద్య బృందం ఏఎస్సై హర్జీత్ సింగ్ తెగిపోయిన చేతిని ఏడున్నర గంటలపాటు సర్జరీ చేసి విజయవంతంగా అతికించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. హర్జీత్ సింగ్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం -
వేధిస్తున్నారంటూ సోషల్‌మీడియాలో పోస్ట్
సాక్షి, ఆదోని : పోలీస్ శాఖలో కొందరు అధికారులు తనను అవమానిస్తూ, అగౌరవ పరుస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆదోని తాలూకా పోలీసు స్టేషన్ ఏఎస్ఐ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు తాళలేక ఉద్యోగానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఓ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ అయింది. వీడియోను సోషల్ మీడియాలో స్వయంగా ఆయనే అప్లోడ్ చేశారో, ఎవరైనా ఆయన ఆవేదనను రికార్డు చేసి పెట్టారో తెలియాల్సి ఉంది. అనారోగ్యంతో, ఆందోళనతో ఉన్న తనను ఓ అధికారి మానసికంగా వేధిస్తున్నారని, దీంతో ఉద్యోగం చేయలేక పోతున్నానని వీడియోలో పేర్కొన్నారు. తనకు జరుగుతున్న అన్యాయం పోలీసు శాఖలో ఏ ఒక్కరికీ రాకూడదన్న ఉద్దేశంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాల విధులలో ఉన్నానని, విధులు ముగియగానే జిల్లా ఎస్పీని కలిసి తనను ఎలా వేధించారో వివరించి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని చెప్పారు. ఈ విషయమై డీఎస్పీ రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పై అధికారులకు చెప్పుకోవాలి కాని ఇలా సోషల్ మీడియాలో వీడియోల ద్వారా వైరల్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సస్పెన్షన్ వేటు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోపాటు సోషల్ మీడియాలో ఉన్నతాధికారుల పట్ల అనుచితంగా మాట్లాడిన ఏఎస్ఐ నాగరాజుపై జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సస్పెన్షన్ వేటు వేశారు. ఏఎస్సై నాగరాజుకు రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలపై ఫిర్యాదులు వచ్చాయి. పని కన్నా ఇతరత్రా విషయాలకు ప్రాధాన్యం ఇస్తూ గతంలోనూ సస్పెండ్ అయ్యారు. అయినా పనితీరులో మార్పు రాలేదు. వెల్దుర్తిలో పనిచేస్తూ ఆదోనికి అటాచ్మెంట్ విధులు అప్పగించారు. సోషల్ మీడియాలో ఉన్నతాధికారులపై వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడంతో జిల్లా పోలీసు శాఖ తీవ్రంగా స్పందించింది. పోలీసు కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద జిల్లా ఎస్పీ అతనిపై చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ వేటు వేశారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యయత్నం
-
పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకుని..
సాక్షి, ప్రకాశం: పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని తన్నీరు నాగరాజుగా గుర్తించారు. ఓ కేసు విషయంలో ఏఎస్ఐ మురళీ కృష్ణ తనను వేధిస్తుండటంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు నాగరాజు వెల్లడించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 14వ తేదిన నాగరాజుకు, అతని బాబాయికి మధ్య గొడవ జరిగింది. 16న పోలీసులు వీరిద్దరి మీద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగానే.. బాబాయి తనపై జాలమ్మ గుడి వద్ద హత్యాయత్నం చేసినట్లు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఏఎస్ఐ మురళీ కృష్ణ తన ఫిర్యాదును పట్టించుకోకుండా.. తననే వేధింపులకు గురి చేస్తున్నాడని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు కూడా డిమాండ్ చేయటంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించాడు. -
ఏఎస్ఐ వీరంగం
నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ జిల్లా నవీపేట పోలీసుస్టేషన్ ఏఎస్ఐ జాన్సన్ మంగళవారం వీరంగం సృష్టించాడు. ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టాడు. వివరాలు.. నిజామాబాద్ రూరల్ మండలం పాల్దా గ్రామానికి చెందిన కిరణ్‌రావు ఆయన బంధువు మధుసూదన్‌రావు మధ్య పంట పొలానికి సంబంధించి కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పంట పొలాల సరిహద్దులో కిరణ్‌రావు బోరు వేశారని మధుసూదన్ నవీపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంగళవారం కిరణ్‌రావును పోలీసుస్టేషన్‌కు పిలిపించాడు. ఏఎస్ఐ జాన్సన్ స్టేషన్లో విచక్షణారహితంగా బెల్ట్‌తో చితకబాదాడని, కాలుతో తన్నాడని బాధితుడు ఆరోపించారు. అకారణంగా దుర్భాషలాడారని వాపోయాడు. ఫిర్యాదు చేసిన వారి ఎదురుగానే తనను లాకప్‌లో వేసి చితకబాదాడని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఏసీపీ శ్రీనివాస్‌రావును కలసి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఏఎస్ఐ జాన్సన్‌ను వివరణ కోరగా.. తాను కొట్టలేదని, కిరణ్‌రావు చెప్పిన మాటలు అవాస్తవమని పేర్కొన్నారు. -
ప్రేమ వివాహం చేయించారని ఏఎస్సై దాడి
సాక్షి, తిరుపతి : తన సోదరుడి కూతురికి ప్రేమ వివాహం చేయించారని ముగ్గురు యువకులపై దాడి చేశాడో ఏఎస్సై. రౌడీలా ప్రవర్తిస్తూ యువకులను చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. అలిపిరి పీఎస్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాము సోదరుడి కూతురు ఓ యువకుడిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోరనే భయంతో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సందర్భంగా దిగిన ఫోటోలను యువకుడి స్నేహితులు ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. సోషల్ మీడియాలో ఫోటోలను చూసిన రాము.. ముగ్గురు యువకులను పట్టుకొని చితకబాదాడు. రౌడీలా ప్రవర్తిస్తూ దాడి చేశాడు. ఏఎస్సై తమపై దాడి చేశారని ఆ యువకులు వెస్ట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఏఎస్సైపై చర్యలు తీసుకోవాలని యువకుల బంధువులు డిమాండ్ చేశారు. -
రేప్ కేసులో ఏఎస్ఐ అరెస్ట్
న్యూఢిల్లీ: పనిమనిషిని తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఢిల్లీ పోలీస్ ఏఎస్ఐ జగ్వీర్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయిన జగ్వీర్ గురువారం రాత్రి తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. జగ్వీర్ మద్యంమత్తులో స్నేహితుడి ఇంట్లోని పనిమనిషి (23)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏఎస్ఐని అరెస్ట్ చేశారు. -
పోలీసులకు ఫాస్ట్‌ట్రాక్ పదోన్నతుల విధానం
వెంటనే అమలు చేయాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు పదోన్నతులు కల్పించడానికి ఫాస్ట్‌ట్రాక్ పదోన్నతుల విధానాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి డిమాండ్ చేశారు. సంఘానికి చెందిన 57 యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శులు శుక్రవారమిక్కడ సమావేశమై తమ సమస్యలపై చర్చించుకున్నారు. అనంతరం గోపిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరిస్తామని కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఆ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రతి కానిస్టేబుల్ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి వీలుగా భూమి కేటాయింపు, బస్సుపాస్ సౌకర్యం, ఎస్ఐలను గెజిటెడ్ అధికారులుగా గుర్తించడం, కానిస్టేబుళ్లకు జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పించడం వంటి ప్రధాన డిమాండ్లు అపరిష్కృతంగా ఉన్నాయని వివరించారు. హోంగార్డులకు ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. కాగా, శనివారం హైదరాబాద్‌లోని రోజ్‌గార్డెన్(నాంపల్లి)లో తమ సంఘం విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.