సాక్షి, తిరుపతి : తన సోదరుడి కూతురికి ప్రేమ వివాహం చేయించారని ముగ్గురు యువకులపై దాడి చేశాడో ఏఎస్సై. రౌడీలా ప్రవర్తిస్తూ యువకులను చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. అలిపిరి పీఎస్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాము సోదరుడి కూతురు ఓ యువకుడిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోరనే భయంతో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సందర్భంగా దిగిన ఫోటోలను యువకుడి స్నేహితులు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. సోషల్ మీడియాలో ఫోటోలను చూసిన రాము.. ముగ్గురు యువకులను పట్టుకొని చితకబాదాడు. రౌడీలా ప్రవర్తిస్తూ దాడి చేశాడు. ఏఎస్సై తమపై దాడి చేశారని ఆ యువకులు వెస్ట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఏఎస్సైపై చర్యలు తీసుకోవాలని యువకుల బంధువులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment