
కర్ణాటక: మతాంతర ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట భద్రత కావాలని పోలీసులను కోరింది. ఈ ఘటన చిక్క నగరంలో జరిగింది. తాలూకాలోని మైలప్పనహళ్లివాసి హసీనా (23), ఎదురింటిలో ఉండే నాగార్జున (24) రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకొంటున్నారు.
పెళ్లి చేసుకుంటామని ఇళ్లలో చెప్పగా వారు తిరస్కరించారు. దీంతో చిక్కకు వచ్చి ఓ గుడిలో తాళి కట్టి పెళ్లి చేసుకుని పోలీసు స్టేషన్‌కు వచ్చారు. యువతి తల్లిదండ్రులు వచ్చి ఎంత వేడుకొన్నా, హసీనా భర్తతోనే ఉంటాను అని తెగేసి చెప్పింది. ఈ ప్రేమ వివాహం అందరినీ సంభ్రమానికి గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment