తమిళనాడు: యుద్ధంతో అట్టుడుకున్న ఉక్రెయిన్(Ukraine) దేశ యువతిని విల్లుపురం యువకుడు ప్రేమించి హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. వివరాలు.. విల్లుపురానికి చెందిన జయకుమార్ కుమారుడు ఉదయకుమార్ (30). ఇతను కోవైలో బీఈ చదువు పూర్తి చేసి ఆరు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం స్లోవేకియా దేశానికి వెళ్లారు. అక్కడ రెండేళ్లు చదువు పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.
అక్కడ తనతో పాటూ ఉద్యోగం చేస్తున్న ఉక్రెయిన్ దేశానికి చెందిన అనస్టాసియా (25)ను ప్రేమించాడు. తర్వాత వారు పెళ్లి చేసుకోవాలని భావించగా, ఇరు కుటుంబీకులు అందుకు అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో ఆ దేశం నుంచి సొంత ఊరికి వచ్చిన ప్రేమ జంటకు సోమవారం విల్లుపురం సమీపంలో కంబియంపులియూర్ పెరుమాల్ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.
అమెరికా అమ్మాయితో..
అదేవిధంగా తిరువన్నామలై జిల్లా చెయ్యారు తాలూకా అనక్కావూరుకు చెందిన భాస్కరన్ అమెరికాలోని ప్రైవేటు కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. భార్య ఆదిరై, ఇద్దరు కుమారులతో టెక్సాస్‌లో నివసిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు అవి నాష్ నాసాలో సైంటిస్ట్‌గా ఉన్నారు. ఈయన ఆ ప్రాంతానికి చెందిన కేథరిన్ ఓసేవి అనే యువతిని ప్రేమించారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబీకులు సమ్మతించడంతో విల్లుపురం జిల్లా సెంజిలో ఉన్న కులదేవత ఏకాంభరేశ్వరర్ ఆలయంలో, తమిళ సాంప్రదాయం ప్రకారం కనులపండువగా వీరి వివాహ వేడుక మంగళవారం సాగింది.
Comments
Please login to add a commentAdd a comment