Kuppam : ప్రేమ వివాహం చేసుకుందని..! | Parents Gets Angry On Daughter After Her Inter Caste Marriage In Kuppam, More Details Inside | Sakshi
Sakshi News home page

Kuppam : ప్రేమ వివాహం చేసుకుందని..!

Published Thu, Mar 6 2025 8:54 AM | Last Updated on Thu, Mar 6 2025 10:24 AM

Daughter Inter Caste Marriage

కుప్పం: అల్లారుముద్దుగా పెంచిన ఒక్కగానొక్క కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని తండ్రి జీరి్ణంచుకోలేకపోయాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి, రాజీ కుదుర్చుతుండగా అమ్మాయి తండ్రి ప్రేమికులపై దాడి చేశాడు. దీంతో ప్రేమికులతో పాటు మధ్యవర్తులకూ గాయాలయ్యాయి. ఈ సంఘటన కుప్పం పట్టణం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. 
గుడుపల్లె మండలం అగరం కొత్తూరు గ్రామానికి చెందిన శివశంకర్, కోదండప్ప అనే వ్యక్తులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో కోదండప్ప కుమారుడు చంద్రశేఖర్, శివశంకర్‌ కుమార్తె కౌసల్య ఇరువురు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కౌసల్య ఒక్కగానొక్క కూతురు కావడంతో శివశంకర్‌ కూతుర్ని గారాబంగా పెంచి డిగ్రీ చదివిస్తున్నాడు. కౌసల్య, చంద్రశేఖర్‌ల ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో శివశంకర్‌ తన కూతురు కౌసల్యను పలుమార్లు మందలించాడు. డిగ్రీ వరకు చదువుకున్న అమ్మాయిని వ్యవసాయ కూలీకి ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేదంటూ కూతురికి పలుసార్లు నచ్చజెప్పాడు.

కానీ కౌసల్య ససేమిరా అనడంతో పాటు గత రెండు రోజుల క్రితం చంద్రశేఖర్‌తో పరారై తమిళనాడులోని ఓ దేవస్థానంలో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అగరం కొత్తూరు గ్రామస్తులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగా గురువారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద పంచాయితీ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న శివశంకర్‌ కత్తులతో ఒంటరిగా ఉన్న ప్రేమికులపై దాడి చేశాడు. ఈ దాడిలో కౌసల్య చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి అడ్డువచ్చిన గ్రామస్తులు రమేష్‌, సీతారామప్పలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరిని పక్కనే ఉన్న కుప్పం వంద పడకల ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement