
బాలుడు చెప్పినా నమ్మని తల్లి
ఆస్పత్రిలో చిన్నారి మృతి
కర్ణాటక: బహిర్భూమికి వెళ్లిన బాలున్ని పాము కాటు వేయడంతో చనిపోయిన సంఘటన జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని బాబురాయనకొప్పలు గ్రామంలో జరిగింది. పవిష్ (4) మృతబాలుడు. ఆరేళ్ల కిందట గాయత్రిని తమిళనాడుకు చెందిన రమేష్ కుమార్ ఇచ్చి వివాహం జరిపించారు. గాయత్రి రెండవ కాన్పు కోసం కొడుకుతో కలిసి పుట్టింటికి వచ్చింది.
సోమవారం పవిష్ బహిర్భూమి కోసం ఇంటి పక్కన స్థలంలోకి వెళ్లాడు. ఆ సమయంలో ఏదో పాము చిన్నారిని కరిచింది. వెంటనే బాలుడు వచ్చి నన్ను పాము కొరికింది అని తల్లికి చెప్పాడు. కానీ వారు ఊరికే అలా చెబుతున్నాడని పట్టించుకోలేదు. అర్ధగంట తరువాత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తున్న సమయంలో చనిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment