
సాక్షి, హైదరాబాద్ : ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్సై ఆత్మహత్య ప్రయత్నం కలకలం సృష్టించింది. అధికారుల వేధింపులే కారణమని తెలిసింది. వివరాలు.. రామకృష్ణ అనే వ్యక్తి ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధుల నిర్వహిస్తున్నాడు. ఈనెల 10న ఒక కేసు విషయంలో కొంత మంది వ్యక్తులను పోలీసు స్టేషన్‌కి తీసుకురాగా.. ఆ సమయంలో రామకృష్ణ విధుల్లో ఉన్నాడు. అయితే రామకృష్ణ ఉన్న సమయంలోనే స్టేషన్‌కు తీసుకొచ్చినవారిలో ఒక వ్యక్తి పారిపోయాడని సమాచారం. దీంతో విధుల్లో ఉన్న ఏఎస్సై రామకృష్ణని పై అధికారులు మందలించారు. దీంతో తాను అవమానం గురైనట్లు భావించిన రామకృష్ణ నేడు జెండా పండుగకు హాజరయ్యాడు. అనంతరం ఇంటికి కాల్ చేసి ఇదే నా చివరి కాల్ అని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయపై అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామకృష్ణ ఫోన్ సిగ్నల్ ని ట్రాక్ చేసిన పోలీసులు ఘట్ కేసర్ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొనే సమయంలోనే అక్కడికి చేరుకొని రక్షించారు. కాగా రామకృష్ణ ని దగ్గర్లోని క్యూర్ ఆసుపత్రికి తరలించగా.. రామకృష్ణ సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment