ghatkesar town
-
దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. బోగి పూర్తిగా దగ్ధం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. శనివారం అర్దరాత్రి సికింద్రాబాద్ నుండి ఢిల్లీ బయలుదేరిన దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు లగేజీ బోగీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఘట్కేసర్-పగిడిపల్లి మధ్య బోగిలో మంటలు చేలరేగాయి. ఈ క్రమంలో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అయితే, చివరి బోగీ కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్ని మాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టు తెలిపారు. -
ఘట్కేసర్ పీఎస్‌లో ఏఎస్సై ఆత్యహత్య కలకలం
సాక్షి, హైదరాబాద్ : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్సై ఆత్మహత్య ప్రయత్నం కలకలం సృష్టించింది. అధికారుల వేధింపులే కారణమని తెలిసింది. వివరాలు.. రామకృష్ణ అనే వ్యక్తి ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధుల నిర్వహిస్తున్నాడు. ఈనెల 10న ఒక కేసు విషయంలో కొంత మంది వ్యక్తులను పోలీసు స్టేషన్‌కి తీసుకురాగా.. ఆ సమయంలో రామకృష్ణ విధుల్లో ఉన్నాడు. అయితే రామకృష్ణ ఉన్న సమయంలోనే స్టేషన్‌కు తీసుకొచ్చినవారిలో ఒక వ్యక్తి పారిపోయాడని సమాచారం. దీంతో విధుల్లో ఉన్న ఏఎస్సై రామకృష్ణని పై అధికారులు మందలించారు. దీంతో తాను అవమానం గురైనట్లు భావించిన రామకృష్ణ నేడు జెండా పండుగకు హాజరయ్యాడు. అనంతరం ఇంటికి కాల్ చేసి ఇదే నా చివరి కాల్ అని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయపై అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామకృష్ణ ఫోన్ సిగ్నల్ ని ట్రాక్ చేసిన పోలీసులు ఘట్ కేసర్ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొనే సమయంలోనే అక్కడికి చేరుకొని రక్షించారు. కాగా రామకృష్ణ ని దగ్గర్లోని క్యూర్ ఆసుపత్రికి తరలించగా.. రామకృష్ణ సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
ఐదేళ్లుగా వీధిలైట్లు వెలుగుతూనే ఉన్నాయి..
ఘట్కేసర్(రంగారెడ్డి జిల్లా): మండల కేంద్రంలోని అంబ్కేర్ నగర్‌లోని ఓ వీధిలో సుమారు 12 ట్యూబ్‌లైట్లు గత 5 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా పగలు,రాత్రి తేడా లేకుండా వెలుగుతున్నాయి. ఒక వైపు ప్రభుత్వం విద్యుత్‌ను ప్రజలకు అందించడానికి అనేక విధాలుగా కృషి చేస్తుంది. కానీ మండల కేంద్రంలో విద్యుత్ నిరుపయోగమవుతుంది. ఆ వీధిలో ట్యూబ్ లైట్లు కాలిపోయినప్పుడు అక్కడి వెళ్లే విద్యుత్ లైన్లలో సరఫరాను నిలిపివేసి ట్యూబ్ లైట్లు మార్చుతున్నారు. సాధారణంగా సాయంత్రం 6గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు ట్యూబ్‌లైట్లు వెలుగుతుంటాయి. కానీ ఆవీధిలో పగలు, రాత్రి తేడా లేకుండా వెలుగుతూ ఉన్నాయి. తమ వీధిలో ట్యూబ్‌లైట్లు రాత్రి వెలిగేలా పగలు ఆరేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆ విషయమై పలు సార్లు గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకునే వారు కరువయ్యారు. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎక్కడ లోపం ఉందో తెలియదని అంటున్నారని ఆ వీధి ప్రజలు తెలిపారు. తమకు ఎలాంటి సంబంధం లేదని అది అంతా గ్రామపంచాయతీదేనని విద్యుత్ ఏఈ సంపత్‌రెడ్డి శుక్రవారం వివరణిచ్చారు.