ఘట్‌కేసర్(రంగారెడ్డి జిల్లా): మండల కేంద్రంలోని అంబ్కేర్ నగర్‌లోని ఓ వీధిలో సుమారు 12 ట్యూబ్‌లైట్లు గత 5 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా పగలు,రాత్రి తేడా లేకుండా వెలుగుతున్నాయి. ఒక వైపు ప్రభుత్వం విద్యుత్‌ను ప్రజలకు అందించడానికి అనేక విధాలుగా కృషి చేస్తుంది. కానీ మండల కేంద్రంలో విద్యుత్ నిరుపయోగమవుతుంది. ఆ వీధిలో ట్యూబ్ లైట్లు కాలిపోయినప్పుడు అక్కడి వెళ్లే విద్యుత్ లైన్లలో సరఫరాను నిలిపివేసి ట్యూబ్ లైట్లు మార్చుతున్నారు.
సాధారణంగా సాయంత్రం 6గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు ట్యూబ్‌లైట్లు వెలుగుతుంటాయి. కానీ ఆవీధిలో పగలు, రాత్రి తేడా లేకుండా వెలుగుతూ ఉన్నాయి. తమ వీధిలో ట్యూబ్‌లైట్లు రాత్రి వెలిగేలా పగలు ఆరేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆ విషయమై పలు సార్లు గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకునే వారు కరువయ్యారు. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎక్కడ లోపం ఉందో తెలియదని అంటున్నారని ఆ వీధి ప్రజలు తెలిపారు. తమకు ఎలాంటి సంబంధం లేదని అది అంతా గ్రామపంచాయతీదేనని విద్యుత్ ఏఈ సంపత్‌రెడ్డి శుక్రవారం వివరణిచ్చారు.
ఐదేళ్లుగా వీధిలైట్లు వెలుగుతూనే ఉన్నాయి..
Published Fri, May 22 2015 11:44 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement