![Hyderabad Saves Rs 418 Crore After Switching to LED Street Lighting - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/4/LED_Street_Lights.jpg.webp?itok=1nCb3Jfy)
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటు ద్వారా జీహెచ్‌ఎంసీకి రూ. 418 కోట్లు ఆదా అయ్యాయి. సోమవారం జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటు పూర్తి కాగా.. ఆ సంవత్సరం రూ. 42.42 కోట్లు, అనంతరం 2018–19 లో రూ. 85.23 కోట్లు, 2019–20లో రూ. 84.48 కోట్లు, 2020–21లో రూ. 86.72కోట్లు, అక్టోబర్ 2021 వరకు రూ. 49.93 కోట్లు వెరసి రూ. 347.78 కోట్లు కరెంట్ చార్జీలు ఆదా అయినట్లు పేర్కొంది.
మెటీరియల్ ఖర్చులు, కార్మికుల ఖర్చులు కూడా తగ్గడంతో వాటితో కలిపి మొత్తంగా రూ.418.26 కోట్లు ఆదా అయినట్లు పేర్కొంది. హైదరాబాద్ నగరంలో ఎల్‌ఈడీ వీధి దీపాలను కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈఈఎస్‌ఎల్.. ఎన్‌టీపీసీతో కలిసి ఏర్పాటు చేసినట్లు తెలిపింది. (చదవండి: ‘శంషాబాద్’కు ఇంధన పొదుపు అవార్డు)
Comments
Please login to add a commentAdd a comment