Fire Breaks Out In Parcel Coach Of Dakshin Express Train - Sakshi
Sakshi News home page

దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. బోగి పూర్తిగా దగ్ధం

Published Sun, Jul 3 2022 7:54 AM | Last Updated on Sun, Jul 3 2022 11:43 AM

Fire Accident In Dakshin Express At Ghatkesar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. శనివారం అర్దరాత్రి సికింద్రాబాద్‌ నుండి ఢిల్లీ బయలుదేరిన దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు లగేజీ బోగీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌-పగిడిపల్లి మధ్య బోగిలో మంటలు చేలరేగాయి. ఈ క్రమంలో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. 

అయితే, చివరి బోగీ కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్ని మాపక సిబ్బంది 8 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement