న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నుంచి ఝాన్సీ వెళ్తున్న తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఆ రైలుకు చెందిన ఏసీ బోగీలో ప్రమాదం జరిగినట్లు నార్తర్న్ రైల్వేస్ వెల్లడించింది. ఉదయం 7:40 గంటలకు రైలులో పొగలు రావడంతో రైలును సాంకేతిక సమీక్ష కోసం హర్యానాలోని నిజాముద్దీన్, పల్వాల్ సెక్షన్‌ల మధ్య అసోతి స్టేషన్‌లో నిలిపివేశారు.
ఈ మంటలు బ్రేక్ జామ్ కారణంగా చెలరేగాయని అధికారులు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించడంతో మంటలు అదుపు చేయడంతో పాటు ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ తెలిపారు. ఇది చిన్న అగ్నిప్రమాదం. వాస్తవానికి మంటల కంటే ఎక్కువగా పొగ వచ్చిందని అని ఉత్తర రైల్వే సీపీఅర్ఓ దీపక్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment