express train
-
Madhya pradesh: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్-జబల్పూర్ (సోమనాథ్) ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఎక్స్‌ప్రెస్ ఇండోర్ నుండి జబల్పూర్కు వస్తున్న క్రమంలో జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున 5. 40 గంటలకు జబల్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉండడంతో రైలు వేగం చాలా తక్కువగా ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.#WATCH | Two coaches of Indore- Jabalpur Overnight Express derailed in Jabalpur, Madhya Pradesh. No casualties/injuries reported. More details awaited pic.twitter.com/A8y0nqoD0r— ANI (@ANI) September 7, 2024 రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులందరినీ హడావుడిగా రైలు ఎక్కించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
గోండా రైలు ప్రమాదం.. ‘పేలుడు శబ్దం విన్నా’: లోకోపైలట్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో దిబ్రూఘఢ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి నలుగురు చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా, గాయపడిన 17 మందికి ప్రయాణికులకు చికిత్స అందుతోంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈలోపు లోకోపైలట్ (డ్రైవర్) మీడియాతో చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.‘రైలు పట్టాలు తప్పడానికి ముందు భారీ పేలుడు శబ్ధం విన్నా’అని అన్నారాయన. అయితే ఇందులో కుట్ర కోణాన్ని ఇప్పుడే నిర్ధారించలేమని రైల్వే అధికారులు అంటున్నారు. ప్రమాదంపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాత్రి రైలు నెంబర్ 15904 చండీగఢ్ రైల్వే స్టేషన్ నుంచి దిబ్రూఘఢ్(అసోం)కు బయల్దేరింది. గురువారం మధ్యాహ్న సమయంలో గోండా-మంకాపూర్ సెక్షన్లో మోతిఘడ్ స్టేషన్ దాటాక.. పికౌరా వద్ద ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. Gonda Train Derailment | Ex gratia of Rs. 10 lakhs to the family of the deceased, Rs 2.5 lakhs for grievous injury and Rs. 50,000 to the minor injured, has been announced. Apart from the CRS enquiry, a high-level enquiry has been ordered: Ministry of Railways pic.twitter.com/0mDy97pheD— ANI (@ANI) July 18, 2024 -
సికింద్రాబాద్ – గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలనుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఈ బై వీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయల్దేరి గోవా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇప్పటివరకు వారానికి ఒక రైలు 10 కోచ్‌లతో సికింద్రాబాద్ నుంచి బయల్దేరి గుంతకల్‌కు చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 కోచ్‌లతో కలుపుకుని గోవాకు చేరుకునేది. ఇది కాకుండా కాచిగూడ –యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్‌లను కలిపేవారు. ఈ 4 కోచ్‌లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ – గోవా మధ్య తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. అయితే సికింద్రాబాద్ – గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలామంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ...రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఈ ఏడాది మార్చి 16న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు.మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో..ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. దీనిపై అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. దీంతో సికింద్రాబాద్–వాస్కోడిగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడిగామా చేరుకుంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై జి.కిషన్‌రెడ్డి ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
తాజ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు దగ్ధమైన నాలుగు భోగీలు
-
బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్
పాట్నా: ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాల సంఖ్య క్రమంలో పెరుగుతోంది. తాజాగా బీహార్‌లో మరో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అసోంలోని కామాఖ్యాకు వెళ్తోన్న నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు బీహార్‌లోని రఘునాథ్పుర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వివరాల ప్రకారం.. నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు బీహార్‌లోని రఘునాథ్పుర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. బుధవారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపుగా 21 బోగీలు పట్టాలు తప్పాయని, మూడు బోగీలు పల్టీలు కొట్టినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందగా.. 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే స్తానిక ఆసుపత్రులకు తరలించారు. #WATCH | Bihar: Visuals from the Raghunathpur station in Buxar, where 21 coaches of the North East Express train derailed last night Restoration work is underway. pic.twitter.com/xcbXyA2MyG — ANI (@ANI) October 12, 2023 రైలు ప్రమాదంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్ఎఫ్కు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖకు సూచించారు. కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్ చౌబే కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఘటనాస్థలికి పంపించామని, క్షతగాత్రుల్ని పట్నాలోని ఎయిమ్స్‌కి తరలిస్తామన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. రైలు ప్రమాదం జరగడంతో రైల్వేశాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. పాట్నా: 9771449971, ధన్పూర్: 8905697493, కమాండ్ కంట్రోల్: 7759070004, ఆరా : 8306182542 హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. #WATCH | Bihar: Morning visuals from the Raghunathpur station in Buxar, where 21 coaches of the North East Express train derailed last night 4 people died and several got injured in the incident. pic.twitter.com/aiZZOYpfCc — ANI (@ANI) October 12, 2023 #WATCH | Bihar: Rescue operation by NDRF underway after 21 coaches of the North East Express train derailed near Raghunathpur station in Buxar pic.twitter.com/7mEvv9f6SE — ANI (@ANI) October 11, 2023 #WATCH | North East Express train derailment: Visuals from Primary Health Centre, Brahampur where some of the injured passengers have been admitted As per the General Manager of East Central Railway, 4 people died and several were injured after 21 coaches of the North East… pic.twitter.com/UOAC2FbuaA — ANI (@ANI) October 11, 2023 -
పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు.. ఐదుగురి మృతి!
బక్సర్: నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు బిహార్‌లోని బక్సర్ జిల్లా రఘునాథ్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ రైలు ఢిల్లీ నుంచి అస్సాంకు బయలుదేరింది. బుధవారం రాత్రి 9.35 గంటలకు కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రైలు కోచ్‌లు పట్టాలు తప్పడం వెనుక కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
రేపటి నుంచి పట్టాలపైకి ‘వందే భారత్’
హిందూపురం అర్బన్ : కాచిగూడ–యశ్వంతపూర్ మధ్య ‘వందే భారత్’ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం నుంచి పరుగులు తీయనుంది. దేశవ్యాప్తంగా 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని మోదీ ఈ నెల 24వ తేదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అందులో కాచిగూడ–యశ్వంతపూర్ మధ్య నడిచే ‘వందే భారత్’కూడా ఒకటి. వారంలో బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు నడిచే వందేభారత్ రైలు కేవలం 8.30 గంటల్లోనే కాచిగూడ నుంచి యశ్వంతపూర్ చేరేలా రైల్వే అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే వందేభారత్ (20703) మహబూబ్‌నగర్, కర్నూలు మీదుగా ఉదయం 10.55 గంటలకు అనంతపురానికి, 11.30 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 2.45 గంటలకు బయలుదేరనున్న వందేభారత్ (20704) సాయంత్రం 5.20 గంటలకు ధర్మవరం, 5.41 గంటలకు అనంతపురం, రాత్రి 11.15 గంటలకు తిరిగి కాచిగూడకు చేరుకుంటుంది. కాచిగూడ – యశ్వంతపూర్ మధ్య 609.81 కిలో మీటర్లు దూరం ఉండగా, అందులో సింగిల్ ట్రాక్ 213.31 కి.మీ కాగా, డబుల్ ట్రాక్ 396 .50 కి,మీ ఉంది. వందేభారత్ సగటున 71.74 కి.మీ వేగంతో దూసుకువెళ్లనుంది. భోజన సదుపాయంతో కలిపి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ. 2,425 కాగా, ఏసీ చైర్ టికెట్ రూ. 1,545గా నిర్ణయించారు. -
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడులు...
ప్రయాణికులారా.. జాగ్రత్త, మార్గమధ్యలో ఎప్పుడైనా రాళ్ల దాడి జరిగే ప్రమాదం ఉంది.. అని ప్రకటన చేరిస్తే బాగుండుననే చలోక్తులు వ్యాప్తిలో ఉన్నాయి. అంతగా రాళ్ల దాడులు రైల్వేశాఖకు సమస్యగా మారాయి. ప్రయాణంలో ఆదమరిచి ఉన్నవారు.. దుండగులు రాళ్లు విసురుతున్నారని తెలిసి భయాందోళనకు గురికావాల్సి వస్తోంది. సాక్షి, బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై ఆకతాయిల రాళ్ల దాడులు పరిపాటిగా మారాయి. ఇలాంటి తరహా ఘటనలు రాష్ట్రంలోనూ ఎక్కువగా జరుగుతున్నాయి. వందేభారత్ రైళ్లకు మాత్రమే కాకుండా మిగతా రైళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే శాఖకు ఈ పరిణామాలు పెద్ద తలనొప్పిగా మారాయి. వందేభారత్‌పై గురి ఇటీవల బెంగళూరు–ధార్వాడ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం అయింది. ప్రారంభం అయిన 15 రోజుల్లోనే సుమారు మూడు సార్లు వందేభారత్ రైలు రాళ్ల దాడికి గురయింది. రాళ్లు తగిలి రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ రాళ్లు తగలకపోవడంతో హాని జరగలేదు. కానీ రాళ్ల దాడుల వల్ల భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని నైరుతి రైల్వే, దక్షిణ రైల్వే, కొంకణ్ రైల్వే జోన్లలో రాళ్లు విసరడం మామూలుగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకు చెన్నై–మైసూరు, బెంగళూరు–ధార్వాడ మధ్య రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ రెండు రైళ్లు ఇప్పటివరకు 24 సార్లు రాళ్ల దాడులకు గురయ్యాయి. ఇతర రైళ్లు కూడా 190కి పైగా రాళ్ల దాడులకు గురయ్యాయి. పట్టుబడితే కఠినచర్యలు గడిచిన ఏడు నెలల్లో నైరుతి రైల్వేజోన్ పరిధిలో 65కు పైగా సాధారణ రైళ్లపై దాడి జరిగింది. రెండుసార్లు ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సెంట్రల్ రైల్వే సోలాపూర్ డివిజన్ పరిధిలో కలబురిగిలో ప్యాసింజర్ రైలుపై కూడా దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ప్రమాదంలో ఆశా కార్యకర్త ఒకరు గాయపడ్డారు. మరోవైపు రైల్వే చట్టం 152, 153 సెక్షన్ల ప్రకారం రాళ్ల దాడి శిక్షార్హమైన నేరం. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని నైరుతి రైల్వే హెచ్చరిస్తోంది. ఇటీవల దావణగెరెలో దాడికి పాల్పడిన ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో 200కు పైగా ఇలాంటి తరహా ఘటనలు జరిగాయి. సుమారు 49 మంది నిందితులను అరెస్టు కూడా చేశారు. పనీపాట లేని ఆకతాయిలు, మద్యం, గంజాయి వ్యసనపరులు పొంచి ఉండి రాళ్ల దాడులు చేస్తున్నట్లు, ప్రజలకు హాని చేయాలనే ఉన్మాద మనస్తత్వం ఉన్నవారు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు అంచనా. రైల్వే పోలీసులు గస్తీ ముమ్మరం చేయాల్సి ఉంది. -
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ‘భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘ట్రైన్ నంబరు 17233 సికింద్రాబాద్ నుంచి బల్లర్షా వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల పదమూడు నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది. ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి చింతించుచున్నాం.’ ఇదీ నిత్యం స్టేషన్లలో వినిపించే రైల్వే అధికార ప్రకటనలు. కొంతకాలంగా రైళ్ల రాకపోకలు తీవ్ర ఆలస్యమవుతూ ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఎప్పుడొస్తయో తెలియదు బల్లర్షా నుంచి కాజీపేట మధ్య నడిచే కాజీపేట ఎక్స్‌ప్రెస్, సిర్పూర్టౌన్ నుంచి భద్రాచలంరోడ్డు వరకు వెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్‌లు ఏ రోజూ సమయపాలన పాటించడం లేదు. ఉదయం, సాయంత్ర పూట ఆ యా స్టేషన్లలో ప్రయాణికులు గంటల కొద్దీ వేచి చూ స్తున్నారు. రైళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక సమ యం వృథా చేసుకుంటున్నారు. దీంతో తమ రోజూ వారి కార్యకలాపాల్లోనూ ప్రభావం చూపుతోంది. ‘భాగ్యనగర్’ రోజూ లేటే! బల్లార్షా నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి బల్లార్షా మధ్య రోజూ నడుస్తున్న ట్రైన్లు ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఆలస్యంగానే నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి 3.35 గంటలకు బయలుదేరి కాగజ్‌నగర్ వరకు వెళ్లాలంటే రాత్రి ఒకటి, రెండు గంటలవుతోంది. దీంతో మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిని రోడ్, ఆసిఫాబాద్ రోడ్, కాగజ్‌నగర్, సిర్పూర్(టీ) వరకు వెళ్లాల్సిన ప్రయాణికులు అరిగోస పడుతున్నారు. రాత్రి పూట రైలు దిగి ఇంటికి వెళ్ళేందుకు రవాణా సౌకర్యం లేక స్టేషన్లోనే పడుకుని తెల్లారి వెళ్తున్నారు. గతంలో 9 గంటలకే వస్తుండగా ప్రస్తుతం తీవ్ర జాప్యం జరుగుతోంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లూ ఆలస్యమే సికింద్రాబాద్‌కు వెళ్లే ఇంటర్సిటీ, కాగజ్‌నగర్ సూపర్‌పాస్ట్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఏపీ, గ్రాండ్ ట్రంక్, నవజీవన్, చెన్నై సెంట్రల్, రాప్తిసాగర్తో పాటు పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు సైతం గంట, రెండు గంటల ఆలస్యంతో నడుస్తున్నాయి. అన్ని రైళ్లూ ఆలస్యమేనా? దూరం, దగ్గర అని తేడా లేకుండా చవక, భద్రత, సౌకర్యవంతంగా గమ్యస్థానాలను చేరుకునేందుకు ఎక్కువగా పేద, మధ్య తరగతి వారు రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తారు. అయితే సకాలంలో రైళ్లు స్టేషన్లకు రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది నెలలుగా ఇదే తీరుగా ఉండడంతో వివిధ అవసరాల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, సికింద్రాబాద్, విజయవాడ, చెన్నై వైపు వెళ్లే వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యంగా నడుస్తున్నాయని మైకుల్లో అనౌన్స్ చేసి అసౌకర్యానికి చింతించుచున్నాం అంటూ చెప్పి రైల్వే అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న జిల్లా నుంచి కాజిపేట నుంచి కాగజ్‌నగర్, భద్రాచలం రోడ్ స్టేషన్ల మధ్య నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు ప్రయాణం చేస్తుంటారు. వీరితో పాటు వివిధ అవసరాలకు హైదరాబాద్ రాకపోకలు సాగించేవారు ఉన్నారు. పెరిగిన టికెట్ రేట్లు గతంతో పోలిస్తే టికెట్ల రేట్లు సైతం భారీగా పెరిగాయి. కరోనా ప్రభావంతో సీనియర్ సిటిజన్స్, వివిధ కేటగిరీలకు ఇస్తున్న రాయితీలు సైతం ఎత్తేశారు. ప్యాసింజర్ ట్రైన్ల చోట ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. దీంతో టికెట్ రేట్లు సైతం పెరిగాయి. గతంలో ఉన్న టికెట్ ధరలతో పోలిస్తే రూ.15 నుంచి 20 వరకు పెరిగాయి. -
రెండు నెలల కిందటే వివాహం.. మృత్యువు దారి కాచి మరీ వరుడిని మింగేసింది...
ఆ నవ వధువు కలలన్నీ ఛిద్రమైపోయాయి. ఆ కుటుంబంలోని ఆనందమంతా ఆవిరైపోయింది. చదువు, ఉద్యోగం, వివాహం అంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన ఆ యువకుడి జీవితం అక్కడితోనే ముగిసిపోయింది. కొల్లవానిపేట రైల్వేగేటు వద్ద కాపు కాచిన మృత్యుదేవత నవ వరుడిని తనతో తీసుకెళ్లిపోయింది. రెండు నెలల కిందటే వివాహం చేసుకున్న ఆ యువకుడి మృతితో కుటుంబం తల్లడిల్లిపోయింది. నరసన్నపేట: చక్కగా చదువుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. మరో ఉద్యోగినితో వివాహం జరిగింది. ఇక జీవితమంతా హాయిగా కలిసి బతక వచ్చని ఆశ పడిన ఆ వధూవరులపై విధి పగబట్టింది. మృత్యువు దారి కాచి మరీ వరుడిని మింగేసింది. నరసన్నపేట మండలం కామేశ్వరిపేటలో సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మట్ట సోమేశ్వరరావు (28) కొల్లవానిపేట రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం 10.20 గంటల సమయంలో యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదు నిమిషాల్లో కామేశ్వరిపేట చేరుకుంటాడనగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని బలగకు చెందిన మట్ట శ్యామలరావు కుమారుడు సోమేశ్వరరావు చక్కగా చదువుకున్నాడు. సచివాలయంలో ఇంజినీరింగ్ సహాయకుడిగా ఉద్యోగం వచ్చింది. మంచి సంబంధం రావడంతో రెండు నెలల కిందటే వివాహం చేశారు. ఆమె కూడా రణస్థలం మండలంలోని సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ లాగానే సోమేశ్వరరావు బుధవారం తన బండిపై కామేశ్వరిపేటలోని సచివాలయానికి బయల్దేరాడు. దారిలో కొల్లవానిపేట వద్ద గేటు వేశారు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు సోమేశ్వరరావు ప్రాణాలు తీశాయి. గేటు లేవడంతోనే.. సరిగ్గా ఉదయం 10.16కు కొల్లవానిపేట గేటు వేసి ఉంది. రెండు వైపులా వాహనాలు నిలిచి ఉన్నాయి. ఆమదాలవలస నుంచి తిలారు వైపునకు గూడ్స్ ట్రైన్ వెళ్లింది. ఆ రైలు వెళ్లగానే గేటు లేచింది. దీంతో కొల్లవానిపేట నుంచి ఒక కారు, ఆటో గేటు లోపలికి వచ్చాయి. సోమేశ్వరరావు కూడా తన బండితో ముందుకు కదిలాడు. అంతే.. అదే ట్రాక్‌పై ఊహించని వేగంతో వచ్చిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సోమేశ్వరరావును అమాంతం ఢీకొట్టింది. ఆ ధాటికి అతడి శరీరం తునాతునకలైంది. రైలు పట్టాలన్నీ రక్తంతో తడిచిపోయాయి. క్యారేజీ, హెల్మెట్ ఇలా ఆ యన వస్తువులన్నీ చాలాదూరం ఎగిరిపడ్డాయి. అయితే తమ కళ్ల ముందే ప్రమాదం జరగడంతో గే టు వద్ద ఉన్న వాహనదారులు నిశ్చేష్టులైపోయారు. రెప్పపాటులో తాము ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రత్యక్ష సాక్షులు వేళాల రమేష్, ఆర్.రామకృష్ణ, పుల్లట వెంకటరమణ తెలిపారు. ఆటోలో పది మంది, కారులో నలుగురు ఉన్నారని, వెంట్రుక వాసిలో వీరు ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పారు. కన్నీరుమున్నీరు.. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇలా దుర్మరణం పాలవ్వడంతో మృతుని తల్లిదండ్రులు శ్యామలరావు, సరస్వతిలు కన్నీరుమున్నీరయ్యారు. అతని సోదరి గౌతమి కూడా తల్లడిల్లిపోయింది. సోమేశ్వరరావు భార్య జయశ్రీ వేదన చూసి అంతా కన్నీరుపెట్టుకున్నారు. నన్ను వదిలి వెళ్లిపోయావా అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. కేసు నమోదు.. ఈ ప్రమాదంలో సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని ఆమదాలవలస రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆమదాలవలస స్టేషన్ మాస్టర్ రాజశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి ఏ ఎస్ఐ చిట్టిబాబు, హెచ్‌సీ మధుసూదనరావు వచ్చా రు. రైల్వేగేట్‌మెన్ మధుపర్ మిశ్రో నుంచి వివరణ తీసుకున్నామని, ప్రమాదవశాత్తు జరిగినట్లు కేసు నమోదు చేశామన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ సోమేశ్వరరావు మృతిపై నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ, ఎంపీడీఓ మదుసూదనరావు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు మోహనరావు, ఉదయ భాస్కర్, పంచాయ తీ కార్యదర్శుల సంఘం మండల విభాగం అధ్యక్షు డు ముకుందరావు, వెల్ఫేర్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులు దివ్య, కామేశ్వరిపేటకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు వాకముళ్లు చక్రధర్, జోగినాయుడులు సంతాపం వ్యక్తం చేశారు. -
రైలులో మంటలు..ఏడుగురు సజీవదహనం
కరాచీ: పాకిస్తాన్లో ఎక్స్‌ప్రెస్ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న రైలు ఏసీ బోగీలో బుధవారం అర్ధరాత్రి తర్వాత మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే టాండో మస్తి ఖాన్ స్టేషన్లో రైలును ఆపేసి, మంటలు అంటుకున్న బోగీని వేరు చేశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఆరు మృతదేహాలు గుర్తు పట్టడానికి కూడా వీలు లేనంతగా కాలిపోయాయి. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. -
రాజకీయ క్రీడాస్థలిగా రైల్వే
జైపూర్: కేంద్రంలో గత ప్రభుత్వాలు రైల్వే వ్యవస్థను రాజకీయ క్రీడాప్రాంగణంగా వాడుకుని దుర్వినియోగం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. బుధవారం రాజస్థాన్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించారు. ఇది దేశంలో 15వ వందేభారత్ ఎక్స్‌ప్రెస్. అజ్మీర్, ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘రాజకీయ లాభమనే సంకుచిత దృక్పథంలోనే గత ప్రభుత్వాల ఆలోచనలు సాగాయి. అందుకే రైల్వే ఆధునీకరణ పట్టాలెక్కలేదు. ఎవరు రైల్వే మంత్రి కావాలి, ఏ స్టేషన్ గుండా ఏ రైలు వెళ్లాలనే అంశాలూ రాజకీయ లబ్ధి కోణంలోనే నిర్ణయమయ్యేవి. 2014లో సుస్థిర ప్రభుత్వం వచ్చాక రైల్వేల పరిస్థితే మారిపోయింది. రాజకీయ జోక్యం పోయింది’’ అన్నారు. గహ్లోత్‌జీ, థ్యాంక్యూ రాజస్తాన్ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్న వేళ కూడా సీఎం అశోక్ గహ్లోత్æ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలని మోదీ అన్నారు. ‘‘గహ్లోత్ నాకు మంచి మిత్రుడు. రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ రాజస్థానీలే. అలా మీ చేతిలో రెండు లడ్డూలున్నాయి’’ అన్నారు. నవ్య భారత్ కోసమే భోపాల్: ‘అధునాతన, అభివృద్ధి చెందిన భారత్’ కోసమే నూతన జాతీయ విద్యావిధానం తెచ్చినట్టు మోదీ చెప్పారు. భోపాల్‌లో నూతన ఉపాధ్యాయుల నియామక కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వీడియో సందేశమిచ్చారు. ‘‘విజ్ఞానం, నైపుణ్యం, సంస్కృతి, భారతీయ విలువలను చిన్నారి విద్యార్థుల్లో ఇనుమడింపజేయడంలో ఎన్ఈపీ ఎంతో దోహదపడనుంది’’ అన్నారు. -
పట్టాలపై నిలబడి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురెళ్లిన యువకుడు.. చివరికి!
సాక్షి, చెన్నై: మద్యం మత్తులో ఓ యువకుడు రైలు పట్టాలపై నిలబడి రైలును అడ్డగించాడు. ఈ విషయం గుర్తించిన లొకోపైలెట్ రైలును ఆపి వేశాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి చెన్నైకి వస్తున్న లాల్బాగ్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉదయం యథావిధిగా బెంగుళూరు నుంచి బయలు దేరింది. రైలు ఉదయం 10.45 గంటల సమయంలో తిరుపత్తూరు జిల్లా వాని యంబాడి రైల్యేస్టేషన్‌లో నిలిచేందుకు తక్కువ వేగంతో వస్తుంది. రైలు న్యూటౌన్ రైల్యే గేటు వద్దకు రాగానే సుమారు 35 ఏళ్ల వ్యక్తి రైలు పట్టాలపై నిలబడి ఉన్నాడు. వీటిని గమనించిన రైలు ఇంజిన్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, రైలు ను నిలిపి వేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే రైలు పట్టాలపైకి వెళ్లి, యువకుడిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు యు వకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరు, తిరుపతి మధ్య కొత్త రైలు
జమ్మలమడుగు (వైఎస్సార్ జిల్లా): నంద్యాల– ఎర్రగుంట్ల మధ్య మరో రైలు పట్టాలెక్కబోతుంది. ఈనెల 18వ తేదీన గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17261/17262) రాబోతుంది. ఇప్పటికే నంద్యాల– ఎర్రగుంట్ల రహదారిలో డెమో రైలు నడుస్తోంది. ప్రస్తుతం మరొకటి రాబోతుండటం.. నేరుగా తిరుపతికి వెళ్లే అవకాశం రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు నంద్యాల, బనగాపల్లి, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడపలో మాత్రమే స్టాపింగ్ పెట్టారు. కొవెలకుంట్ల, జమ్మలమడుగులో స్టాపింగ్ లేకపోవడంతో ప్రజలు నిరుత్సాహపడుతున్నారు. మూడో రైలు పరుగులు తీయబోతుంది... ఇప్పటికే డెమో.. ధర్మవరం–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌లు ఎర్రగుంట్ల–నంద్యాల మీదుగా నడుస్తున్నాయి. కరోనా కారణంగా నంద్యాల– ఎర్రగుంట్ల డెమో రైలు దాదాపు రెండు సంవత్సరాలుగా నిలిపివేశారు. గత నెల 16వతేదీ నుంచి తిరిగి డెమో పునఃప్రారంభమైంది. అదేవిధంగా ధర్మవరం– విజయవాడ రైలు కూడా ఉదయం – రాత్రి పూట నడుస్తుంది. దీనికి అదనంగా రైల్వేశాఖ గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని సంకల్పించింది. గతంలో పాత రైలు నంబర్ 67232/67231 స్థానంలో 17261/17262 నంబర్ గల రైలును నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. 18న గుంటూరులో, 19న తిరుపతిలో ప్రారంభం కడప మీదుగా గుంటూరు–తిరుపతి మధ్య రాకపోకలు సాగించేందుకు డైలీ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేసినట్లు కడప రైల్వేస్టేషన్ మేనేజర్ డి.నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరులో ఈనెల 18వ తేదీ ఈ రైలు (17261) ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురంరోడ్డు, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం మీదుగా కడపకు అర్ధరాత్రి 12.45 గంటలకు చేరుకుంటుంది. నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మరుసటిరోజు ఉదయం 4.25 గంటలకు చేరుతుందన్నారు. ఈనెల 19వ తేదీన సాయంత్రం 7.35 గంటలకు తిరుపతిలో బయలుదేరి కడపకు రాత్రి 9.55 గంటలకు చేరుకుంటుంది. ఇదేమార్గంలో మరుసటిరోజు ఉదయం 8.00 గంటలకు గుంటూరుకు చేరుతుందన్నారు. ఈ రైలులో ఏసీ త్రీ టైర్ ఒకటి, స్లీపర్ 10, జనరల్ బోగీలు 2, బ్రేక్వ్యాన్ రెండింటితో కలిపి మొత్తం 15 కోచ్‌లు ఉంటాయన్నారు. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డివిజన్ కేంద్రంలో రైలు ఆపాలి జమ్మలమడుగు ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమల వెంకన్న దర్శనం కోసం,విద్యార్థులు చదువుకోవటానికి తిరుపతికి వెళుతుంటారు. గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 18న ప్రారంభించబోతున్నారు. జమ్మలమడుగు డివిజన్ కేంద్రంగా..నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌గా ఉంది. రైల్వేశాఖ అధికారులు ఇక్కడ రైలును ఆపితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – పి.నాగేశ్వరరెడ్డి, ఎస్పీ డిగ్రీకాలేజీ కరస్పాడెంట్ -
దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. బోగి పూర్తిగా దగ్ధం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. శనివారం అర్దరాత్రి సికింద్రాబాద్ నుండి ఢిల్లీ బయలుదేరిన దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు లగేజీ బోగీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఘట్కేసర్-పగిడిపల్లి మధ్య బోగిలో మంటలు చేలరేగాయి. ఈ క్రమంలో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అయితే, చివరి బోగీ కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్ని మాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టు తెలిపారు. -
డ్రెస్‌కోడ్ మార్చకపోతే రైలుని అడ్డుకుంటాం.. దెబ్బకు దిగొచ్చిన రైల్వే శాఖ
ఉజ్జయిని: రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పనిచేసే వెయిటర్ల డ్రెస్‌కోడ్‌ను రైల్వే శాఖ సోమవారం ఉపసంహరించుకుంది. వారి యూనిఫామ్‌ను మార్చేసింది. వారి డ్రెస్‌కోడ్ పట్ల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మత గురువులు, సాధువులు అభ్యంతరం వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. వెయిటర్లు సాధువుల తరహాలో కాషాయ రంగు దుస్తులు, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి, రైలులో విధులు నిర్వర్తిస్తున్నారని, ఇది హిందూ మతాన్ని అవమానించడమే అవుతుందని వారు ఆక్షేపించారు. డ్రెస్‌కోడ్‌ను మార్చకపోతే ఢిల్లీలో ఈ రైలును అడ్డుకుంటామన్నారు. రెండు రోజుల క్రితం రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు. దీంతో రైల్వే శాఖ వెంటనే స్పందించింది. సిబ్బంది దుస్తులను మార్చింది. సాధారణ చొక్కా, ప్యాంట్, సంప్రదాయ తలపాగా ధరించి, యాత్రికులకు సేవలందిస్తారని తెలిపింది. కాషాయ రంగు మాస్కులు, చేతి గ్లౌజ్‌ల్లో మార్పులు చేయలేదు. రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇటీవలే ఢిల్లీలో ప్రారంభమయ్యింది. 7,500 కి.మీ.ల మేర దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టేసి మళ్లీ ఢిల్లీకి చేరుకోనుంది. -
తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నుంచి ఝాన్సీ వెళ్తున్న తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఆ రైలుకు చెందిన ఏసీ బోగీలో ప్రమాదం జరిగినట్లు నార్తర్న్ రైల్వేస్ వెల్లడించింది. ఉదయం 7:40 గంటలకు రైలులో పొగలు రావడంతో రైలును సాంకేతిక సమీక్ష కోసం హర్యానాలోని నిజాముద్దీన్, పల్వాల్ సెక్షన్ల మధ్య అసోతి స్టేషన్లో నిలిపివేశారు. ఈ మంటలు బ్రేక్ జామ్ కారణంగా చెలరేగాయని అధికారులు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించడంతో మంటలు అదుపు చేయడంతో పాటు ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ తెలిపారు. ఇది చిన్న అగ్నిప్రమాదం. వాస్తవానికి మంటల కంటే ఎక్కువగా పొగ వచ్చిందని అని ఉత్తర రైల్వే సీపీఅర్ఓ దీపక్ కుమార్ తెలిపారు. -
ఆక్సిజన్ కోసం విశాఖపట్నంకు గూడ్స్‌రైలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను దూరం చేసేందుకు రైల్వే ముందుకువచ్చింది. ఇందులో భాగంగా ఆక్సిజన్ రైలు ముంబైకి సమీపంలోని కలంబోలి నుంచి విశాఖపట్టణం బయలుదేరింది. ఖాళీ ట్యాంకర్లతో బయలుదేరిన ఈ గూడ్స్ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ తీసుకురానుంది. ఇందుకోసం కలంబోలి రైల్వేస్టేషన్ వద్ద సెంట్రల్ రైల్వే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రైల్వే విభాగం ప్రకటించింది. దీంతో విశాఖపట్టణంలోని రైల్వే ప్లాంట్ నుంచి లిక్విడ్ ఆక్సిజన్ మహారాష్ట్రకు తొందర్లోనే అందనుంది. గత సంవత్సరం కూడా కరోనా లాక్డౌన్ సమయంలో నిత్యవసర వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు రైల్వే తన సేవలను అందించింది. లాతూర్ కరువు కారణంగా నీటి కొరతను తీర్చేందుకు రైల్వే ద్వారా నీటి ట్యాంకర్లను లాతూరుకు తరలించారు. -
తప్పిన పెను ప్రమాదం: అరగంటలో రెండుసార్లు
సాక్షి, ముంబై: బాంద్రా టర్మినస్ నుంచి రామ్‌నగర్ బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు రెండు సార్లు విడిపోవడంతో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశ్చిమ రైల్వే మార్గంలోని బాంద్రా టర్మినస్ నుంచి గురువారం ఉదయం రామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. కొద్ది సేపటికే పశ్చిమ ఉప నగరంలోని జోగేశ్వరీ–రామ్ మందిర్ స్టేషన్ల మధ్య కప్లింగ్ ఊడిపోయి చివరి రెండు బోగీలు విడిపోయాయి. రంగంలోకి దిగిన సాంకేతిక సిబ్బంది గంటన్నరకుపైగా శ్రమించి వాటిని జోడించి రైలును పంపించారు. దీంతో ఫాస్ట్ మార్గంలో లోకల్ రైళ్లతో పాటు దూర ప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా నిలిచిపోయాయి. ఆ తర్వాత నగర శివారు ప్రాంతమైన నాయిగావ్–వసై రోడ్ స్టేషన్ల మధ్య మళ్లీ ఆ బోగీలు విడిపోయాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ఆ బోగీలను మళ్లీ రైలుకు జోడించకూడదని నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలో మరో రెండు ఎల్‌హెచ్‌బీ బోగీలను తెప్పించి జోడించడం కుదరదని అధికారులు గుర్తించారు. దీంతో ఆ రెండు బోగీల్లో ఉన్న ప్రయాణికులను దింపి అదే రైలులో మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి పంపించారు. అందుకు మరో 25 నిమిషాల సమయం పట్టింది. రెండుసార్లు జరిగిన ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని పశ్చిమ రైల్వే నిర్ణయం తీసుకుంది. రైల్వే నియమాల ప్రకారం దూరం నుంచి వచ్చిన ప్రతీ రైలును యార్డులో నిర్వహణ పనులు పూర్తయిన తర్వాతే మళ్లీ పంపించడానికి సిద్ధం చేస్తారు. అంతా సవ్యంగా ఉంటేనే రైలును ప్లాట్ఫారం పైకి తెస్తారు. కానీ ఇలా బయలుదేరిన అర గంటలోపే రెండు సార్లు బోగీలు విడిపోవడం వర్క్ షాపు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొత్త టెక్నాలజీతో తయారైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఇలా విడిపోవడం రైల్వే సిబ్బంది నిర్వహణ లోపం, నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. చదవండి: ఇంజన్లో ఇరుక్కున్న బైక్, ఆగిన రైలు ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర -
రెడ్ సిగ్నల్ దాటిన రైలు: లోకో పైలట్ సస్పెండ్
పాట్నా: తూర్పు మధ్య రైల్వేలోని దానపూర్ డివిజన్ పరిధిలో ఓ రైలు ప్రమాద రెడ్ సిగ్నల్‌ను దాటి వెళ్లింది. టాటా నగర్-బౌండ్ దానపూర్ మధ్య ప్రయాణించే టాటా ఎక్స్‌ప్రెస్‌ను ఒక్కసారిగా ప్రమాద రెడ్ సిగ్నల్‌ను దాటి సుమారు 500 మీటర్లు ముందుకు ప్రయాణించింది. ప్రమాద రెడ్ సిగ్నల్‌ను నిర్లక్ష్యంగా దాటించిన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్‌ను రైల్వే అధికారులు సస్పెండ్ చేసినట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి రాజేష్ కుమార్ తెలిపారు. సురక్షితమై రైలు ప్రయాణానికి సంబంధించి డేంజర్ సిగ్నల్స్‌పై నిర్లక్ష్యంగా వ్యహరించినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన జరిగన సమయంలో భారీ అలారం శబ్ధం వినిపించింది. సంబంధిత రైలు లోకో పైలట్‌ను రైల్వే అధికారులు అదుపులో తీసుకున్నారు. చదవండి: రక్తపోటు మందుతో దీర్ఘాయువు? లోకో పైలట్ మద్యం సేవించి రైలు నడిపారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రమాద సిగ్నల్‌ను దాటడం నేరంగా కింద పరిగణించబడుతుందని, కొన్నిసార్లు ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కూడా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన పేలవమైన బ్రేక్స్ ఉండటం వల్ల జరిగిందా? లేదా లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ నిర్లక్ష్యంగా రైలును ప్రమాద సిగ్న్‌కు ముందే నిలిపివేయడం మర్చిపోయారా? అనేది విచారణలో తేలనున్నది. ఇటువంటి సంఘటనలను రైల్వే చాలా తీవ్రంగా పరిగణిస్తుందని, ప్రయాణికులు రక్షణ కోసం రైలు సిగ్నల్స్‌ను కచ్చితంగా పాటించాల్సిన ప్రోటోకాల్ ఉంటుందని చీఫ్ పీఆర్ రాజేష్ కుమార్ తెలిపారు. సంఘటన చోటు చేసుకున్న సందర్భాల్లో ఎంత దూరం ప్రమాద సిగ్నల్‌ను రైలు క్రాస్ చేసిందో పరిశీలించాల్సిన బాధ్యత రైలు పర్యవేక్షకులు, స్టేషన్ మాస్టర్ ఉంటుందన్నారు. అదే విధంగా ఘటనకు గల కారణాలను స్టేషన్ మాస్టర్.. లోకో పైలట్‌ను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. రైలు ప్రయాణం తిరిగి ప్రారంభించడానికి ముందు ఘటనకు సంబంధిదంచిన అన్ని వివరాలను నోట్ చేసుకోవాలని పేర్కొన్నారు. -
మంటల్లో రైలు
లాహోర్: రైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో 74 మంది మృత్యువాత పడిన దారుణ ఘటన గురువారం ఉదయం పాకిస్తాన్లో చోటు చేసుకుంది. కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తున్న తేజ్గామ్ ఎక్స్‌ప్రెస్‌లో కొందరు ప్రయాణీకులు ఉదయం గ్యాస్ స్టవ్‌లపై అల్పాహారం తయారు చేసుకుంటుండగా లియాఖత్పూర్ సమీపంలో ఒక్కసారిగా రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయని, క్షణాల్లో మంటలు వ్యాపించాయని, దాంతో మూడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ బోగీల్లో పిల్లలు, మహిళలు సహా దాదాపు 200 మంది వరకు ఉన్నారని, వారిలో అత్యధికులు రాయివింద్ పట్టణంలో జరగనున్న మత ప్రబోధ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నవారేనని తెలిపారు. మృతుల్లో అత్యధికులు ఇస్లాం వ్యాప్తికి కృషి చేసే తబ్లీగీ జమాత్ సంస్థకు చెందినవారేనని పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వెల్లడించారు. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం రాయివింద్ పట్టణంలో ఉందని, అక్కడ ప్రతీ సంవత్సరం తబ్లీజీ జితేమా అనే మత ప్రబోధ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ముస్లింలు, మత ప్రచారకులు వెళ్తుంటారని వివరించారు. పేలుళ్లు జరిగిన సమయంలో కొందరు ప్రయాణీకుల వద్ద కిరోసిన్ ఉండటంతో, మంటలు త్వరితగతిన వ్యాపించాయని తెలిపారు. మంటల భయంతో ప్రయాణీకులు వేగంగా వెళ్తున్న రైళ్లోంచి దూకేయడంతో ఎక్కువ మరణాలు సంభవించాయన్నారు. ప్రయాణీకులు గ్యాస్ సిలిండర్లు తీసుకువెళ్లకుండా అడ్డుకోలేకపోవడం రైల్వే సిబ్బంది పొరపాటేనని అంగీకరించారు. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షలు, గాయపడినవారికి రూ. 5 లక్షలు పరిహారంగా ఇస్తామన్నారు. అయితే, తబ్లీగీ జమాత్ ప్రతనిధులు మాత్రం సిలిండర్లు పేలడం వల్ల ప్రమాదం జరిగిందన్న రైల్వే మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుళ్లు జరిగాయని వారు తెలిపారు. వైర్లు కాలిన వాసన వస్తోందంటూ బుధవారం రాత్రే రైల్వే సిబ్బందికి తెలిపినా, వారు పట్టించుకోలేదని గాయపడ్డ పలువురు ప్రయాణీకులు ఆరోపించారు. ఈ ప్రమాద ఘటనపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి, కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోనికి తీసుకువచ్చాయి. ఆస్పత్రికి తీసుకువచ్చిన మృతదేహాల్లో గుర్తించడానికి వీలులేని స్థితిలో ఉన్నవే ఎక్కువగా ఉన్నాయని లియాఖత్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు నదీమ్ జియా తెలిపారు. -
వరదలో మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్
సాక్షి ముంబై: చిమ్మ చీకటి..చుట్టూ వరదనీరు.. విషకీటకాలు, పాముల భయం.. చిన్నారుల ఏడ్పులు.. మంచి నీరు కూడా అందని పరిస్థితి... ఇది ముంబై– కొల్హాపూర్ మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికుల దుస్థితి. శుక్రవారం రాత్రి ముంబై నుంచి బయలు దేరిన ఈ రైలు ముంబై శివారు ప్రాంతమైన వాంగణీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపైకి వరద నీరు చేరడంతో నిలిచిపోయింది. సుమారు 17 గంటల అనంతరం రైలులో చిక్కుపోయిన 1,050 మంది ప్రయాణికులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, పోలీసులు, స్థానికుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు చేర్చగలిగారు. ప్రయాణికులెవరికీ ఎటువంటి హాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముంబైతోపాటు శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉల్లాస్ నది ఉప్పొంగింది. సెంట్రల్ రైల్వే మార్గంపై బద్లాపూర్, వాంగణీ ప్రాంతాల్లోని రైల్వేట్రాక్‌లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజు టర్మినస్ నుంచి శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయలుదేరిన సీఎస్ఎంటీ–కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలు వాంగణీ ప్రాంతంలో వరదలో చిక్కుకుంది. రాత్రంతా రైలులోనే... వరద నీటిలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు ఒకేచోట రాత్రంతా రైల్లోనే గడపాల్సి వచ్చింది. ఓ వైపు చుట్టూ వరద నీరు, చిమ్మచీకటి.. నీరు బోగీలోకి వస్తే ఏమవుతుందోననే భయాం దోళన. మరోవైపు విష కీటకాలు, పాములు ఏమైనా లోనికి వస్తే ఎలా అనే భయం... ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ప్రయాణికులు తమ సెల్ ఫోన్ల ద్వారా మిత్రులతోపాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఇలా ఎవరికి తెలిసిన వారికి వారు ఫోన్లు చేసి, వీడియోలు పంపి సాయం కోరారు. ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లలతోపాటు వయోవృద్ధులు, వికలాంగులు కూడా ఈ రైలులో ఉన్నారు. వీరందరూ రాత్రంతా రైలు బోగీలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు వెంట తీసుకుచ్చిన నీరు, ఆహారం, పాలు అయిపోవడంతో పిల్లల ఏడ్పులతో అందరిదీ నిస్సహాయ స్థితి. ఊరట తెచ్చిన రైల్వే సిబ్బంది ప్రకటన.. రాత్రంతా తీవ్ర ఉత్కంఠ, భయాందోళనల మధ్య గడిపిన ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ప్రకటనతో కొంత ఊరట లభించింది. రైలు సిబ్బంది, పోలీసులు ఓ బ్లూ టూత్ మైక్ ద్వారా ప్రతి బోగీలోకి వెళ్లి ‘అందరం సురక్షితంగానే ఉన్నాం. ఎవరూ భయపడవద్దు. ఎవరూ కూడా తొందరపడి రైలు దిగవద్దు’అంటూ సూచనలు చేశారు. రెస్క్యూ టీమ్ వచ్చి అందరినీ రక్షిస్తుందని ప్రకటించారు. రెస్క్యూ టీమ్ రాక.. వరదల్లో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంతలోనే ఎన్డీఆర్ఎఫ్, నావిక దళం బృందాలు అక్కడికి చేరుకోవడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సహాయక బృందాలు ఎనిమిది రబ్బరు బోట్లు, ఇతర సామగ్రి తమ వెంట తెచ్చాయి. ముఖ్యంగా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్ల సాయంతో ముందుగా పరిసరాలను పర్యవేక్షించారు. రబ్బరు బోట్లతో రైలు వద్దకు చేరుకునేందుకు అనువైన స్థలాన్ని గుర్తించి, అక్కడి నుంచి రైలు వద్దకు చేరుకున్నారు. ఇందుకోసం స్థానికుల సాయం తీసుకున్నారు. రైలు వద్దకి చేరుకున్న అనంతరం బోట్ల ద్వారా ప్రయాణికులను బృందాలుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇలా 17 గంటల అనంతరం రైలులోని వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన సహాయక చర్యలు 2.20 గంటలకు ముగిశాయి. అనంతరం 14 బస్సులు, మూడు టెంపోల ద్వారా వారందరినీ సురక్షిత స్థలాలకు తరలించారు. తర్వాత వారి కోసం కళ్యాణ్ నుంచి ప్రత్యేక 19 బోగీల ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. మన్మాడ్, దౌండ్ మార్గం మీదుగా ఈ రైలు కొల్హాపూర్‌కు చేరుకోనుంది. మరో 120 మందిని కాపాడిన బృందాలు ఆకస్మికంగా వరద చుట్టుముట్టడంతో బద్లాపూర్‌లోని ఓ పెట్రోల్ పంప్ భవనంపైకి చేరుకున్న 70 మందిని, షాహద్లోని ఓ రిసార్టులో ఉన్న మరో 46 మందిని ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కాపాడారని అధికారులు తెలిపారు. అలాగే, కల్యాణ్ జిల్లాలో 9 మందిని రక్షించినట్లు చెప్పారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. థానేలో రికార్డు స్థాయిలో శనివారం ఉదయానికి 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఉల్హాస్ నగర్లో 200 మి.మీ. వాన కురిసింది. తక్షణం స్పందించిన కేంద్రం రైలు వరదలో చిక్కుకుందనే విషయం తెలిసిన వెంటనే కేంద్రం అప్రమత్తమయింది. ప్రయాణికులను రక్షించేందుకు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన తెలుసుకున్న హోంమంత్రి అమిత్ షా వెంటనే ముంబై లోని రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అవసరమైన సామగ్రితో సంఘటన స్థలానికి తరలివెళ్లాలని ఆదేశించారు. దీంతో సహాయక బృందాలు అక్కడికి ఉదయం 9.40 గంటలకు చేరుకున్నాయి. అమిత్ షా విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖ కూడా స్పందించి రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు, సుశిక్షితులైన 130 మంది సిబ్బంది కలిసి ఆహారం, మంచినీరు, సహాయక సామగ్రిని వెంట తీసుకుని వెళ్లారని ప్రభుత్వం తెలిపింది. రైల్వే శాఖ అధికారులు వైద్య బృందాలను అక్కడికి పంపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా తీసుకువచ్చిన బృందాలను అమిత్‌షా అభినందించారు. పరిమళించిన మానవత్వం.. మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికులందరు సురక్షితంగా బయటికి వచ్చిన అనంతరం స్థానిక గ్రామస్తులు వారికి అవసరమైనవి సమకూర్చారు. ముఖ్యంగా పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించారు. బద్లాపూర్‌లోని సహ్యాద్రి మంగళ కార్యాలయంలో వారందరికీ భోజనం, మంచి నీరు అందించి మానవత్వం చాటుకున్నారు. గర్భవతులు సురక్షిత స్థలాలకు: మహాలక్ష్మి రైలులోని సుమారు వెయ్యి మందిలో తొమ్మిది మంది గర్భవతులు. వీరిలో రేష్మా కాంబ్లే తొమ్మిది నెలల నిండు గర్భిణీ కావడంతో ఆమెను ముందుగా తీసుకు వచ్చారు. రైలులో ఉన్న 9 నెలల చిన్నారితోపాటు ఆమె తల్లిని కూడా ఒడ్డుకు తీసుకువచ్చారు. ముఖ్యంగా 37 మందితో కూడిన డాక్టర్ల బృందం సాయంతో గర్భవతులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
సాక్షి, రాయ్‌గఢ్ : హౌరా-జగదల్పూర్ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న టవర్‌కార్( ప్రత్యేక రైలు)ను ఢీకొట్టడంతో వెనుక నున్న మూడు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఒడిశాలోని హావ్‌డా నుంచి జగదల్పూర్ వైపు వెళ్తుండగా కెవుటాగూడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే లైనులో రైలు, టవర్‌కార్ ఎదురెదురుగా వచ్చి ఢికొనడం వల్ల రెండు జనరల్ బోగీలు, లగేజీ బోగీలో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించడంతో ఇద్దరు మినహా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. -
నాగపూర్ ట్రైన్లో దొంగల బీభత్సం
మందమర్రిరూరల్/మంచిర్యాలక్రైం: సికింద్రాబాద్ నుంచి నాగపూర్ వెళ్లే ట్రైన్లో శనివారం ఉద యం దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు మహిళల మెడల్లో నుంచి ఐదున్నర తులాల బంగారం అపహరించుకుని ట్రైన్ చైన్ లాగి పరారయ్యారు. రైల్వే సీఐ కర్రె స్వామి కథనం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు సికింద్రాబాద్ నుంచి నాగపూర్‌కు ట్రైన్ బయలుదేరింది. రవీంద్రఖని స్టేషన్ దాటిన తర్వాత మందమర్రి రైల్వేస్టేషన్ రాకముందు ట్రైన్లోనే వస్తున్న దొంగలు ప్రయాణికులు హైదరాబాద్‌కు చెందిన కల్పన మెడలో నుంచి తులంన్నర, సుష్మా రాంబాయి మెడలోంచి తులం, షేక్ తల్వాల్ మెడలోంచి మూడు తులాలు మొత్తం ఐ దున్నర తులాల బంగారు గొలుసులను లాక్కుని ట్రైన్ చైన్ లాగి, రైలు ఆగగానే దిగి పరారయ్యారు. ట్రైన్లో ఉన్న పోలీస్ సిబ్బంది నిందితులను పట్టుకునేందుకు గాలింపులు జరిపినా ఫలితం లేకుం డా పోయింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు జాగిలాలతో గాలించినా దొంగల ఆచూకీ దొర కలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే సీఐ వివరించారు. దొంగలు పారిపోతున్న సమయంలో పోలీస్ సిబ్బంది వద్ద ఆయుధాలు లేకపోవడం కూడా కొంత ఇబ్బంది కలిగిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే, దొంగతనానికి పాల్పడిన వారిలో 8 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. రైల్లో ప్రయణిస్తున్న సమయంలో నిద్రిస్తున్న మహిళలను టార్గె ట్ చేసి తరుచుగా దొంగతనాలకు పాల్పడే ముఠాగా అనుమానిస్తున్నామని సీఐ పేర్కొన్నారు. అదుపులో అనుమానితులు! రైల్లో జరిగిన దొంగతనం నేపథ్యంలో మంచిర్యా ల జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మంచి ర్యాల ఏసీపీ, బెల్లంపల్లి ఏసీపీ, కాగజ్‌నగర్ పోలీ సులు ఆయా ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్, లాడ్జీలు, వాహనాలతోపాటు బస్సులు, ఇతర వా హనాలను అర్ధరాత్రి నుంచే తనిఖీ చేశారు. కాగా, ఈ దోపిడి జరిగిన తర్వాత జీఆర్పీ పోలీసులు కొంతమంది పాత నేరస్తులను, అనుమానితులను అదుపులోకి తీసుకుకొని విచారిస్తున్నట్లు సమాచారం. తనిఖీల్లో మరీ అనుమానస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు తెలిసింది. అనుమానితుడిని రైల్వే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తున్న జీఆర్పీ పోలీసులు -
దారుణం : రైల్లోంచి గర్భిణి తోసివేత..!
సాక్షి, అనంతపురం : కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటుచేసుకుంది. దివ్య అనే గర్భిణిపై దుండగులు దాడికి దిగారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కునేందుకు యత్నించారు. వారి బారినుంచి బయటపడేందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో దివ్యను నిర్దాక్షణ్యంగా రైలులోంచి తోసేశారు. ఈ ఘటనలో గర్భిణికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.