తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలుకు బుధవారం రవీంద్రఖని రైల్వేస్టేషన్‌లో ఎంపీ వివేకానంద, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్ స్వాగతం పలికారు.
రామకృష్ణాపూర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలుకు బుధవారం రవీంద్రఖని రైల్వేస్టేషన్‌లో ఎంపీ వివేకానంద, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్ స్వాగతం పలికారు. రవీంద్రఖని రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్‌కు అవకాశం కల్పిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధులు కొబ్బరికాయలు కొట్టి రైలు హాల్టింగ్‌ను ప్రారంభించారు. అనంతరం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యేలను సన్మానించారు. క్యాతనపల్లిలో అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామని ఎంపీ చెప్పారు. రామకృష్ణాపూర్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కేంద్రమంత్రులతో మాట్లాడి ఒప్పిస్తే ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ కన్వీనర్ ఆరుముల్ల పోచం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోనె శ్యాంసుందర్‌రావు, క్యాతనపల్లి సర్పంచ్ జాడి శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు గాండ్ల సమ్మయ్య, సురేందర్‌రావు, యాకోబ్‌అలీ, జె.రవీందర్, కాంగ్రెస్ నాయకులు నీలం శ్రీనివాస్‌గౌడ్, గోపతి రాజయ్య, టీడీపీ నాయకులు సంజయ్, గోపురాజం, సీపీఐ నాయకులు రామడుగు లక్ష్మణ్, మహంకాళి శ్రీనివాస్, సీపీఎం నాయకులు వెంకటస్వామి, రామగిరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.