
పట్టాలు తప్పిన రైలు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహాత్ జిల్లా రూరా రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం అజ్మీర్– సియాల్దా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు.
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహాత్ జిల్లా రూరా రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం అజ్మీర్– సియాల్దా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. 26 మంది గాయపడ్డారు. సియాల్దా నుంచి అజ్మీర్‌కి వెళ్తున్న రైలు.. రూరా స్టేషన్ దగ్గర్లో ఓ బ్రిడ్జిని దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 స్లీపర్, 2 జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి. రైలు పట్టా విరగడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో రెండు బోగీలు కాలువలో పడ్డాయి. కాలువలో నీరు తక్కువగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది.పట్టాలు దెబ్బ తినడంతో 12 రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. నార్త్ జోన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ శైలేష్ కుమార్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు.