Madhya pradesh: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు | Two Coaches Of Indore Jabalpur Express Train Derail | Sakshi
Sakshi News home page

Madhya pradesh: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

Sep 7 2024 11:02 AM | Updated on Sep 7 2024 2:10 PM

Two Coaches Of Indore Jabalpur Express Train Derail

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్‌-జబల్‌పూర్‌ (సోమనాథ్) ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఎక్స్‌ప్రెస్ ఇండోర్ నుండి జబల్‌పూర్‌కు వస్తున్న క్రమంలో జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున 5. 40 గంటలకు జబల్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉండడంతో రైలు వేగం చాలా తక్కువగా ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

 

రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులందరినీ హడావుడిగా రైలు ఎక్కించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement