jabalpur
-
జబల్పూర్ ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం
తాడేపల్లి, సాక్షి: మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లా సిహోరాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మహా కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న హైదరాబాద్ వాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తెలుగు భక్తులు మృతి చెందటంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను వెంటనే ప్రభుత్వాలు ఆదుకోవాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాచారం నుంచి కొందరు భక్తులు మినీ బస్సుల్లో ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లారు. పుణ్య స్నానాలు ముగించుకుని తిరిగి వస్తుండగా.. సిహోరా వద్ద 30వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రాంగ్ రూట్లో వచ్చిన ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. -
జబల్పూర్ వద్ద ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు
-
మధ్యప్రదేశ్‌లో తెలుగువారిని బలిగొన్న ఘోర ప్రమాదం
హైదరాబాద్, సాక్షి: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తెలుగువారిని బలిగొంది. మంగళవారం ఉదయం హైవేపై ఓ మినీ బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరొకరికి తీవ్ర గాయాలవ్వగా.. చికిత్స అందుతోంది. మృతులంతా హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందినవాళ్లుగా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ నాచారంలోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర నగర్‌లకు చెందిన స్థానికులు మూడు మినీ బస్సుల్లో మహా కుంభమేళా యాత్రకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో అందులోని ఓ బస్సును.. రాంగ్ రూట్లో వచ్చిన సిమెంట్లోడ్ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించారు. జబల్పూర్(Jabalpur) సిహోరా దగ్గర జాతీయ రహదారి 30పై మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుందని కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా మీడియాకు తెలిపారు. ప్రమాదానికి గురైన మినీ బస్ నెంబర్ AP29 W1525 అని తెలిపారు. ఘటనపై నాచారం పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. అలాగే.. మృతుల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. మృతుల వివరాలుబాలకృష్ణ శ్రీరామ్, సంతోష్ ఖాన్సారీ, శశికాంత్ ఖాన్సారీ,ఆనంద్ ఖాన్సారీటీవీ ప్రసాద్మల్లా రెడ్డిరవి వైశ్య, నవీన్ గాయపడ్డవాళ్లువీ సంతోష్ మృతుల్లో.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేసే శశికాంత్ కుటుంబ సభ్యులే ఉన్నట్లు సమాచారం. ఏడుగురి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.హైదరాబాద్వాసులేప్రమాదంలో మరణించినవాళ్లంతా ఏపీ వాసులంటూ తొలుత ప్రచారం జరిగింది. అయితే.. వాళ్లంతా హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన వాళ్లుగా తర్వాత అధికారులు నిర్ధారించుకున్నారు. ప్రమాద సమయంలో అందులో 9 మంది ఉన్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిమధ్యప్రదేశ్ లోని జబల్పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ నాచారం ఏరియాకు చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందటంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతిజబల్పూర్ ప్రమాదంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన ఇద్దరికి సరైన చికిత్సనందించాలని కేంద్రమంత్రి సూచించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్ల తోనూ మాట్లాడి, ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబసభ్యులనూ ఫోన్లో కేంద్రమంత్రి పరామర్శించారు. Jabalpur, MP: A bus from Andhra Pradesh returning from Prayagraj collided with a truck near Sihora on NH-30, killing seven people. The accident occurred around 9:15 AM near Mohla-Bargi. Officials, including the Collector and SP, have reached the site pic.twitter.com/j6uQD592Wl— IANS (@ians_india) February 11, 2025 -
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ
నమ్మండి నమ్మకపోండి.. ఇది నిజంగానే ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. రైలు చక్రాల మధ్య వేలాడుతూ ఓ వ్యక్తి చేసిన ప్రయాణం మామూలుగా లేదు. మధ్యప్రదేశ్‌లోని దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ కింద దాక్కున్న ఓ వ్యక్తి.. ఇటార్సీ నుండి జబల్పూర్ వరకు దాదాపు 250 కిలోమీటర్లు రైలు బోగీ చక్రాల మధ్య వేలాడుతూ ప్రయాణించడం షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు రోలింగ్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో S-4 కోచ్ కింద ఈ వ్యక్తిని గుర్తించారు.అతడిని ఆ పరిస్థితిలో చూసిన సిబ్బంది అశ్చర్యానికి గురై వెంటనే. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులకు సమాచారం అందించగా, అతనిని బోగీ కింద చక్రాల మధ్య నుంచి బలవంతంగా బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రైలుకు కింద వేలాడుతూ ప్రయాణించినట్లు స్పష్టమవుతోంది.అధికారుల విచారణలో ఆ వ్యక్తి టిక్కెట్ కొనడానికి డబ్బులు లేవని.. అందువలనే ప్రయాణం కోసం ఈ రిస్క్ చేసినట్లు తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. ఆ వ్యక్తి రైలు కింద ఎలా దాక్కున్నాడో కూడా అస్పష్టంగానే ఉంది. ప్రస్తుతం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. #BreakingNews *"यह खबर हैरान कर देगी"**टिकट के लिए पैसा नही था, तो ट्रेन के बोगी के नीचे पहिये के पास बैठ कर एक शख्स ने किया 250 किलोमीटर का सफर!!*मध्य प्रदेश में इटारसी से जबलपुर आने वाली दानापुर एक्सप्रेस ट्रेन के S-4 बोगी के नीचे पहिये के पास बने ट्राली में एक व्यक्ति ने… pic.twitter.com/41ZUpDOBxY— THIS IS WRONG NUMBER (@Thiswrongnumber) December 27, 2024 -
Madhya pradesh: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్-జబల్పూర్ (సోమనాథ్) ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఎక్స్‌ప్రెస్ ఇండోర్ నుండి జబల్పూర్కు వస్తున్న క్రమంలో జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున 5. 40 గంటలకు జబల్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉండడంతో రైలు వేగం చాలా తక్కువగా ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.#WATCH | Two coaches of Indore- Jabalpur Overnight Express derailed in Jabalpur, Madhya Pradesh. No casualties/injuries reported. More details awaited pic.twitter.com/A8y0nqoD0r— ANI (@ANI) September 7, 2024 రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులందరినీ హడావుడిగా రైలు ఎక్కించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
మృత ఉద్యోగికి ఎన్నికల డ్యూటీ.. అధికారి సస్పెండ్!
లోక్‌సభ ఎన్నికల డ్యూటీ కేటాయింపులో వింతవైనం వెలుగు చూసింది. ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్ కమిషనర్‌పై వేటు పడింది. వివరాల్లోకి వెళితే జబల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న రచయితా అవస్థి.. మరణించిన ఒక మహిళా ఉద్యోగిని ఎన్నికల విధులకు కేటాయించారు. అలాగే ఆమె చేయాల్సిన పనులను కూడా సంబంధిత రిపోర్టులో పేర్కొన్నారు. తరువాత ఎన్నికల ఉద్యోగుల డేటా బేస్‌ను ఎన్నికల కార్యాలయానికి పంపారు. అయితే దీనిలో చనిపోయిన ఒక మహిళా ఉద్యోగి పేరు కూడా ఉందని జిల్లా ఎన్నికల అధికారి గుర్తించారు. ఈ నేపధ్యంలో ఎన్నికల అధికారులు సంబంధిత అధికారులను విచారించారు. చివరికి ఇది అసిస్టెంట్ కమిషనర్ రచయితా అవస్థి తప్పిదమని తేలింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, అసిస్టెంట్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి దీపక్ సక్సేనా హెచ్చరించారు. -
రైల్వే స్టేషన్లో చీకట్లు... లగేజీలు చోరీ, పడిపోయిన ప్రయాణికులు!
అది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ రైల్వేస్టేషన్.. తాము ఎక్కబోయే రైలు కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా స్టేషన్లో కరెంట్ పోయింది. ప్రయాణికులకు మొదట ఏమీ అర్థం కాలేదు. చాలా సేపు ఇదే పరిస్థితి నెలకొనడంతో స్టేషన్లో గందరగోళం ఏర్పడింది. జబల్పూర్ ప్రధాన స్టేషన్‌లోని విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలడంతో ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ నుంచి ప్లాట్‌ఫామ్ ఆరు వరకు స్టేషన్ ఆవరణ అంతా అంధకారమయం అయ్యింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టికెట్ కౌంటర్ కూడా మూతపడింది. ఇది చూసిన ప్రయాణికులు నానా హంగామా చేశారు. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా దీనికి బాధ్యులెవరనేది అధికారులు తేల్చలేదు. స్టేషన్ మొత్తంమీద గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో చాలా మంది ప్రయాణికుల సామాను చోరీకి గురయ్యింది. చీకటిమాటున దొంగలు రెచ్చిపోయారు. చీకటిలో ఎదుట ఏమున్నదో తెలియక పలువురు ప్రయాణికులు నడిచేటప్పుడు పడిపోయారు. ఈ ఘటన అనంతరం సంబంధిత శాఖ ఇంజినీర్లు మరమ్మతులు చేపట్టారు. గంట తరువాత తిరిగి విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. స్టేషన్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్యానెల్లో లోపం కారణంగా, ప్లాట్‌ఫారమ్‌తో సహా మొత్తం స్టేషన్ ప్రాంగణం, వివిధ రైల్వే విభాగాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ప్యానల్‌కు మరమ్మతులు చేసిన తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. ఇది కూడా చదవండి: ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే.. -
బీజేపీ నాయకురాలు సనాఖాన్ హత్య.. భర్తే చంపి, నదిలో పడేసి!
మహారాష్ట్ర బీజేపీ మైనారిటీ సెల్ నాయకురాలు అదృశ్యం కేసు విషాదంతంగా మారింది. పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆమె మధ్యప్రదేశ్‌లోని దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే సనాను ఆమె భర్త అంతమొందించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు అమిత్ అలియాస్ పప్పు సాహుని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాం కోసం గాలిస్తున్నారు. నాగ్‌పూర్ నివాసి, బీజేపీ మైనారిటీ సెల్ సభ్యురాలు సనా ఖాన్ ఇటీవల భర్త అమిత్ సాహును కలిసేందుకు జబల్పూర్కు వెళ్లారు. రెండు రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా రాలేదు. సనాఖాన్ నాగ్‌పూర్ నుంచి ప్రైవేట్ బస్సులో బయలుదేరి, మరుసటి రోజు జబల్పూర్ చేరుకున్న తర్వాత తన తల్లికి ఫోన్ చేసింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు జబల్పూర్ వెళ్లి వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. సనా చివరి లొకేషన్ ఆధారంగా ఆచూకీ కోసం నాగ్‌పూర్, జబల్పూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. చదవండి: పెళ్లి కుదిరింది.. 9 రోజుల్లో నిశ్చితార్థం ఉందని చెప్పిన వినిపించుకోకుండా.. అయితే జబల్పూర్లో భర్త సాహూను కలవడానికి వెళ్లిన్నట్లు తల్లికి చెప్పగా.. ఇదే విషయాన్ని ఆమె పోలీసులకు తెలియజేసింది. నాగ్‌పూర్ పోలీసులకు భర్తపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో సనా ఖాన్‌ను హత్య చేసినట్లు వెల్లడించాడు. తన ఇంట్లోనే సనా తలపై తీవ్రంగా కొట్టి చంపేసినట్లు చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని జబల్పూర్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరాన్ నదిలో పడేసినట్లు తెలిపాడు. బాధితురాలి మృతదేహం ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. జబల్పూర్లోని ఘోరా బజార్ ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అమిత్ షా లిక్కర్ స్మగ్లింగ్ వ్యాపారంలో భాగస్వామిగా ఉంటూ.. రోడ్డు పక్కన ఫుడ్ కోర్టును కూడా నడుపుతున్నాడని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో సనా, పప్పుల మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. -
లంచంతో పట్టుబడి.. అధికారుల్ని చూసి కంగారులో..
జబల్పూర్: అవినీతికి పాల్పడడంలో ఏమాత్రం జంకని అధికారులు.. పైఅధికారుల చర్యలకు ఎందుకనో వణికిపోతుంటారు. అయితే ఇక్కడో అధికారి భయపడలేదు.. ఏకంగా బెదిరిపోయాడు. ఆ కంగారులో కరెన్సీ నోట్లను మింగేశాడు. మధ్యప్రదేశ్ కత్నికి చెందిన రెవెన్యూ అధికారి(పట్వారి) గజేంద్ర సింగ్ బర్ఖేడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడట. దీంతో బాధితుడు లోకాయుక్తకు చెందిన స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్(SPE) అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం గజేంద్ర కోరిన ఐదు వేల లంచంతో బాధితుడు కార్యాలయానికి చేరుకున్నాడు. గజేంద్ర లంచం తీసుకుంటున్న టైంలో ఎస్పీఈ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్లను చూసి ఆందోళన చెందిన ఆ అధికారి తప్పించుకోవాలనే ఆలోచనతో ఆ నోట్లను కసాబిసా నమిలి మింగేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతన్ని పరిశీలించి క్షేమంగానే ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. A patwari in Katni in Madhya Pradesh was caught in a bribe-taking act by a team of the Lokayukta's Special Police Establishment. In a desperate attempt to escape, he allegedly swallowed the money he had accepted as a bribe. #AntiCorruption #BriberyCase #Lokayukta #Katni #MP pic.twitter.com/zgYXpbdYGv — The BothSide News (@TheBothSideNews) July 24, 2023 -
ఇతర మతస్థుడిని పెళ్లి చేసుకుందని కుమార్తెకు పిండ ప్రదానం..
మధ్యప్రదేశ్: బతికుండగానే కన్నకూతురికి అంతిమ సంస్కారాలు చేశారు తల్లిదండ్రులు. ఇతర మతస్థుడిని వివాహమాడిందనే కోపంతో కూతురికి పిండ ప్రదానం చేశారు. ఈ ఘటన మధ్యపదేశ్లోని జబల్పూర్లో జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించాలనుకున్నారు. కానీ వారి కలలేవీ ఆ కూతురు నెరవేర్చలేదు. ఇతర మతస్థుడిని వివాహమాడింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు బిడ్డ చనిపోయిందనుకున్నారు. నర్మదా నది ఒడ్డున ఏకంగా అంతమ సంస్కారాలు కూడా చేశారు. జబల్పూర్కు చెందిన అనామిక దూబె ఇతర మతస్థుడిని వివాహమాడింది. అడ్డగించిన బంధువులతో గొడవపడింది. న్యాయస్థానాన్ని సంప్రదించి జూన్ 7న ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఆమె వివాహం జరిగింది. తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చి ఉజ్మ ఫాతిమాగా పేరు పెట్టుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు బిడ్డను వదిలేశారు. నర్మదా నది ఒడ్డున ఆదివారం రోజున గౌరీ ఘాట్‌లో కూతురుకి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. పిండప్రదానం చేసి నదిలో కలిపేశారు. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తాను అనుకోలేదని అనామిక సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదీ చదవండి:ప్రేమపెళ్లి చేసుకున్నారని.. ఆ గుడిలో ఏం చేశారంటే! -
50 లీటర్ల పెట్రోల్ ట్యాంకుకు 57 లీటర్ల బిల్లు! బంకు సీల్..!
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఓ పెట్రోల్ పంపు సిబ్బంది ఏకంగా హైకోర్టు న్యాయమూర్తికే టోకరా ఇచ్చారు! ఆయన కారు ట్యాంక్ సామర్థ్యమే 50 లీటర్లయితే ఏకంగా 57 లీటర్ల పెట్రోల్ కొట్టినట్టు బిల్లు చేతికిచ్చారు. న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు అధికారులు పెట్రోల్ బంకును సీల్ చేశారు. ఆ ప్రాంతంలోని ఇతర బంకుల నిర్వహణ తీరుపై విచారణకు ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: ఆల్‌టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..! -
ఘోరం: గుండెపోటుతో డ్రైవర్ మృతి.. బస్సు బీభత్సం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. రన్నింగ్ బస్సులో డ్రైవర్ గుండె పోటుతో సీటులోనే కన్నుమూశాడు. ఆపై బస్సు పలు వాహనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. జబల్పూర్లో ఓ సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ హఠాత్తుగా గుండెపోటుతో డ్రైవర్ సీటులోనే కన్నుమూశాడు. దీంతో బస్సు అదుపు తప్పి పలు వాహనాలపైకి బస్సు దూసుకెళ్లింది. సిగ్నల్ ప్రాంతం కావడం, బస్సు వేగం తక్కువగా ఉండడం, సిగ్నల్ దగ్గర ఓ ఈ-రిక్షాను ఢీ కొట్టడంతో బస్సు ముందుకెళ్లి ఆగిపోయింది. బస్సు ప్రయాణికులతో పాటు ఈ-రిక్షా బోల్తా పడగా.. అందులోని ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం ఆరు మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బస్సు ఢీ కొట్టడంతో ఓ పెద్దాయన గాయపడగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. డ్రైవర్ హర్దేవ్ పటేల్ గత పదేళ్లుగా సిటీ మెట్రో బస్సు సర్వీసుకు పని చేస్తున్నారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. CAUGHT ON CAMERA - A city bus in Madhya Pradesh's Jabalpur ran into several vehicles, killing 2, after its driver died of sudden heart attack. #Jabalpur #MadhyaPradesh #Accident pic.twitter.com/MvOEq3lbHV — TIMES NOW (@TimesNow) December 2, 2022 VIDEO CREDITS: TIMES NOW -
దారుణం: పెళ్లి భోజనం చేశాడని.. ప్లేట్లు కడిగించారు
వైరల్: పిలవని పెళ్లికి వెళ్లిన ఓ హాస్టల్ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. ఫ్రీగా తిన్నాడని అతనితో బలవంతంగా ప్లేట్లు కడిగించారు అక్కడున్న కొందరు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రీగా తింటే దానికి శిక్ష ఏంటో తెలుసా?.. మీ ఇంట్లోలాగే ఇక్కడ ప్లేట్లు సరిగ్గా కడుగు అంటూ అతని ఎదురుగా ఉన్న వ్యక్తి చెప్తూ ఉండగా.. వీడియో రికార్డు అయ్యింది. ఎందుకు వచ్చావ్? అసలు ఎవడు పెళ్లికి పిలిచాడు నిన్ను.. ఫ్రీగా తినడానికి వచ్చావా?.. ఇదే నీకు సరైన శిక్ష అంటూ వాయిస్ వినిపిస్తుంది ఆ వీడియోలో. బాధిత యువకుడిది జబల్పూర్(మధ్యప్రదేశ్)గా తేలింది. భోపాల్‌కి చదువు కోసం వచ్చాడట. ‘‘ఎంబీఏ చదువుతున్నావ్. నీ తల్లిదండ్రులు నెల నెలా డబ్బు పంపడం లేదా?. నువ్వు ఇలా చేయడం వల్ల మీ ఊరికి చెడ్డ పేరు వస్తుంది అంటూ అతన్ని మందలిస్తున్నారు మరికొందరు. दो तस्वीर… pic.twitter.com/T8uG6l4te1 — Awanish Sharan (@AwanishSharan) December 1, 2022 కొసమెరుపు ఏంటంటే.. తీరా ప్లేట్లు కడిగాక ‘ఎలా అనిపిస్తోంది’ అంటూ కొందరు అతన్ని అడిగారు. ఫ్రీగా తిన్నప్పుడు.. ఏదో ఒక పని చేయాల్సిందే కదా అంటూ సమాధానం ఇచ్చాడు ఆ స్టూడెంట్. ఇలా పిలవని ఫంక్షన్లకు, కార్యక్రమాలకు వెళ్లి భోజనం చేయడం మామూలు కావొచ్చు. కానీ, దానికే ఇలా ప్లేట్లు కడిగించి మరీ వీడియోలు తీయడం, ఆ విద్యార్థిని అలా అవమానించడం సరికాదంటున్నారు చాలామంది. ఇదిలా ఉంటే.. అదే సమయంలో మరో వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. బీహార్‌లో ఇలాగే పిలవని పెళ్లికి వెళ్లి భోజనం చేసిన ఓ హాస్టల్ విద్యార్థి.. ఏకంగా పెళ్లి కొడుకు దగ్గరికే వెళ్లి ఆ విషయాన్ని తెలియజేశాడు. అయితే.. ఆ విద్యార్థి బాధను అర్థం చేసుకున్న ఆ పెళ్లి కొడుకు.. పర్వాలేదని, మరికొంత భోజనం హాస్టల్లో ఉన్న అతని స్నేహితులకు సైతం తీసుకెళ్లమని సూచిస్తాడు. God Bless You.❤️ pic.twitter.com/0Cu0rDdZoI — Awanish Sharan (@AwanishSharan) December 1, 2022 ఇదీ చూడండి: పేగుబంధం పక్కన పెట్టి.. కొడుకును పోలీసులకు పట్టించింది -
దేవుడా క్షమించు నీ హుండీ ఎత్తుకెళ్తున్నా!.. వీడియో వైరల్
భోపాల్: రాత్రి వేళ్లల్లో ఆలయాల్లోకి చొరబడి హుండీ ఎత్తుకెళ్లిన సంఘటనలు చాలానే చూసుంటారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో జరిగిన ఈ హుండీ చోరీ అందులో ప్రత్యేకం. అర్ధరాత్రి గుడికి కారులో వచ్చిన ఓ దొంగ.. ముందుగా దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి హుండీని మాయం చేశాడు. సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ‘దేవుడా నన్ను క్షమించు నీ హుండీని ఎత్తుకెళ్తున్నా’ అని ఆ దొంగ ప్రార్థన చేశాడేమో అని వీడియో చూసినవారు అనుకుంటున్నారు! జబల్పుర్ గౌర్ చౌకిలో ఉన్న హనుమాన్ ఆలయానికి సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కారులో వచ్చాడు దొంగ. అంతా దీపావళి హడావుడిలో ఉండగా.. తన చేతివాటాన్ని చూపించాడు. తెల్లవారి ఓ భక్తుడు గుడికి వెళ్లగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. చేతికి విలువైన గడియారం ధరించిన వ్యక్తి గుడి ముందు చెప్పులు విడిచి లోపలికి వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జిల్లాలో గత ఆగస్టులో జరిగిన చోరీలాగే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ -
తల్లి ప్రేమ అంటే ఇదే కదా.. ప్రాణాలు తెగించి.. పులితో పోరాడి..
భోపాల్: పులితో ప్రాణాలకు తెగించి పోరాడి కన్నకొడుకుని కాపాడుకుంది ఓ మహిళ. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ సమీపంలోని జబల్పూర్లో చోటు చేసుకుంది. ఒక పులి రోహనియా గ్రామంలో టైగర్‌రిజర్వ్ వెలుపల తిరుగుతుందని సమాచారం. కానీ ఆ విషయం సదరు మహిళకు తెలియదు. ఆమె తన ఏడాది వయసున్న కొడుకుని తీసుకుని పొలానికి వెళ్లింది. పొలంలోని పొదలమాటున దాగి ఉంది పులి. సదరు మహిళ పొలం పనులు చేస్తుండగా..ఒక్కసారిగా మాటేసిన పులి సదరు బాలుడిపై హఠాత్తుగా దాడి చేసింది. దీంతో ఆమె తన చేతిలో ఏ ఆయుధం లేకపోయినా.. ఆ పులితో ప్రాణాలకు తెగించి పోరాడింది. పులిచేసే ప్రతి దాడిని ఎదుర్కొంటూ...మరోవైపు అరుస్తూ చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేసింది. దీంతో గ్రామస్తులంతా వచ్చి ఆ పులిని తరిమికొట్టారు. ఈ ఘటనలో ఆ బాలుడికి తలకు తీవ్రగాయలవ్వగా, తల్లి శరీరమంతా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ తల్లికొడుకు లిద్దరు జబల్పూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారిద్దరు క్షేమంగానే ఉన్నారని టైగర్ రిజర్వ్ మేనేజర్ భారతి తెలిపారు. -
Crime News: బెయిల్‌పై వచ్చి మళ్లీ రేప్ చేశాడు
భోపాల్: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ మానవ మృగం.. మరోసారి కిరాతకానికి పాల్పడింది. బెయిల్ మీద బయటకు వచ్చి మరీ స్నేహితుడితో కలిసి మళ్లీ బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది ఇంతటితోనే ఆగలేదు.. మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. అత్యాచార బాధితురాలిపై మళ్లీ అత్యాచారానికి తెగపడ్డాడు దుర్మార్గుడు. ఈసారి స్నేహితుడితో కలిసి అఘాయిత్యాన్ని పాల్పడి.. అంతటితో ఆగకుండా ఆ నేరాన్ని వీడియో తీశాడు. తన మీద పెట్టిన కేసును వెనక్కి తీసుకోకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలికి ఇప్పుడు 19 ఏళ్లు. రెండేళ్ల కిందట.. ఆమెపై వివేక్ పటేల్ అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. ఏడాది తర్వాత అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న టైంలో కత్తితో బెదిరించి తన స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పరారీలో ఉన్న వివేక్ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెబుతోంది బాధితురాలు. ఇదీ చదవండి: భర్త వివాహేతర సంబంధం! సహించలేక పసిబిడ్డకు ఉరేసి.. -
పోలీస్ పైశాచికత్వం.. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వృద్ధుడిపై దాడి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ రైల్వే స్టేషన్లో ఓ పోలీస్ రెచ్చిపోయాడు. వృద్ధుడు అనే కనికరం కూడా లేకుండా ఓ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అతని మొహంపై పదే పదే తన్నాడు. అంతటితో ఆగకుండా కాళ్లుపట్టి ఈడ్చుకెళ్లి రైల్వే ట్రాక్‌పై వేలాడదీశాడు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోలీసు తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. A video of a uniformed cop kicking an elderly man at Jabalpur railway station has given rise to a wave of outrage at police. A passenger at the railway station had broadcast it live at the time of the incident @ndtv @ndtvindia pic.twitter.com/5PpijBPcw1 — Anurag Dwary (@Anurag_Dwary) July 29, 2022 పోలీస్ వృద్ధుడ్ని అంతలా కొడుతున్నా.. ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. అయితే సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. అతడ్ని సస్పెండ్ చేశారు. ఆ పోలీస్ పేరు అనంత్ శర్మ అని వెల్లడించారు. మరోవైపు బాధితుడు గోపాల్ ప్రసాద్.. తనను పోలీసు ఎందుకు కొట్టాడో అర్థం కాలేదని తెలిపాడు. తనను ఓ వ్యక్తి తిడుతున్నాడని ఫిర్యాదు చేసేందుకు వెళ్తే విచక్షణా రహితంగా దాడి చేశాడని వాపోయాడు. చదవండి: ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని ఇంటి తాళమిచ్చిన యజమాని.. రూ.10కోట్లతో చెక్కేసిన వ్యక్తి -
క్యాబిన్లో పొగలు: స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి,ఢిల్లీ: ప్రైవేటురంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో పొగలు అలుముకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే సిబ్బంది వెంటనే అప్రమత్త మయ్యారు. తక్షణమే విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. #WATCH | A SpiceJet aircraft operating from Delhi to Jabalpur returned safely to the Delhi airport today morning after the crew noticed smoke in the cabin while passing 5000ft; passengers safely disembarked: SpiceJet Spokesperson pic.twitter.com/R1LwAVO4Mk — ANI (@ANI) July 2, 2022 ఢిల్లీ నుంచి జబల్పూర్కు వెళుతున్న విమానంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లోకి ఎగిరి, సుమారు 5వేల అడుగుల ఎత్తుకు చేరిన తరువాత క్యాబిన్లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీన్ని గమనించిన పైలట్లు, సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. దీంతో ప్రమాదం తప్పింది. ప్రయాణీ కులందరూ సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. SpiceJet: On July 2 @flyspicejet Q400 aircraft was operating SG-2962 (Delhi-Jabalpur). While passing 5000ft, the crew noticed smoke in the cabin. The pilots decided to return back to Delhi. Aircraft landed safely & passengers were safely disembarked. pic.twitter.com/N6cu7kFj0e — Poulomi Saha (@PoulomiMSaha) July 2, 2022 -
పైశాచికం: బిడ్డ బాగోగులు చూస్తుందని అనుకుంటే..
వైరల్: ఉద్యోగాల బిజీలో ఉండే తల్లిదండ్రులు.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి. తమ బిడ్డ బాగోగులు చూస్తుందని ఓ ఆయాను పెడితే.. ఆమె మాత్రం పైశాచికానికి పాల్పడింది. బిడ్డ ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు.. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లో దారుణం జరిగింది. రెండేళ్ల బిడ్డను బాగోగులు చూసేందుకు ఓ ఆయాను నియమించుకున్నారు పేరెంట్స్. అయితే.. ఎప్పుడు సందడిగా ఉండే ఆ చిన్నారి డల్‌గా మారిపోయాడు. అంతేకాదు.. నీరసంగానూ తయారయ్యాడు. దీంతో బాబుకు ఏమయ్యిందో అని తల్లిదండ్రులు చిన్నారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లగా.. చిన్నారి అంతర్గత అవయవాలు వాచిపోయి ఉన్నాయని డాక్టర్ తెలిపాడు. ఎవరో ఆ చిన్నారిని వేధించి ఉంటారని వైద్యుడు వెల్లడించాడు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టారు. ఆఫీసులనుంచి ఇంటికి వచ్చాక.. అందులో రికార్డైన దృశ్యం వారిని ఉలిక్కిపడేలా చేసింది. రజినీ చౌదరిగా గుర్తించబడిన నానీని నెలవారీ రూ. 5,000 ఇచ్చి.. బాబును చూసుకోవడానికి నియమించుకున్నారు. జీతంతో పాటు ఆమెకు భోజనం కూడా పెడుతున్నారు. కానీ, ఆమె మాత్రం చిన్నారిని జుట్టుపట్టి లాక్కెళ్లం, ఈడ్చి చెంపల మీద కొట్టడం, ఇష్టానుసారంగా బాదడం చేసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రజినీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. Note: ఈ వీడియోలోని కంటెంట్ కొందరిని ఇబ్బందికి గురి చేయొవచ్చు In a shocking incident, police in Jabalpur, Madhya Pradesh, have arrested a domestic maid who used to beat up mercilessly a two-year-old kid when the parents of the kid went out to work. .#breakingnews #rahemanzildaily #madhyapradesh #Jabalpur #ViralVideo #maid #ChildAbuse #viral pic.twitter.com/E342UtPr7J — ViralVdoz (@viralvdoz) June 15, 2022 -
ఇద్దరు పైలెట్ల లైసెన్స్ రద్దు చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ: జబల్పూర్ విమానాశ్రయంలోని రన్‌వే పై మార్చి 12న ల్యాండ్ అయిన ఒక విమానం విషయమై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ జరిపింది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన అలయన్స్ ఎయిర్ ఏటీఆర్-72 విమానం ఆ రోజు జబల్పూర్లో రన్‌వేని దాటి ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో దాదాపు 55 మంది ప్రయాణికులు ఉన్నారు. దర్యాప్తులో ఈ విమానం రన్‌వే సమీపంలో చాలా సేపు ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే ఉందని, రన్‌వేకి దాదాపు 900 మీటర్లు దాటి ల్యాండ్ అయ్యిందని తేలింది. అలాంటి విపత్కర సమయంలో మంటలు రాజుకునే అవకాశం పొంచి ఉందని డీజీసీఏ పేర్కొంది. ల్యాండింగ్ సమయంలో విమానం సరిగా స్థిరికరించబడకపోతే వెంటనే గో అరౌండ్ కోసం అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఆ పైలెట్లు ఇద్దరూ అవేమి చేయకుండా ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసి ఏవియేషన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఒక ఏడాది పాటు వేటు వేసింది. (చదవండి: చీర కట్టుకోవడం రాదని.. లెటర్ రాసి భర్త ఆత్మహత్య) -
తండ్రి ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయించలేదని..
తండ్రి ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయించలేదన్న కోపంతో ఓ కొడుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. కూలీ పనులు చేసుకునే ఆ తండ్రికి.. కుటుంబానికి సరైన తిండి పెట్టడమే కష్టంగా మారింది. ఈ తరుణంలో.. ఫోన్ విలాసానికి అలవాటు పడ్డ ఆ కొడుకు డేటా ప్యాక్ వేయించమని తండ్రిని కోరాడు. అందుకు తండ్రి ఒప్పుకోకపోవడంతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్లో గేమ్‌లకు అలవాటు పడ్డ ఆ కుర్రాడు.. తండ్రి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాడని, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలని సిటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ శర్మ సూచిస్తున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. బలవన్మరణం మహా పాపం. పైగా అది సమస్యలకు పరిష్కారం కాదు. జీవితం అంటే.. మనం బతికి నలుగురిని బతికించేదిలా ఉండాలి. అందుకే ఆత్మహత్య ఆలోచనలు వస్తే.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఫుడ్ డెలివరీ బాయ్‌ను చితకబాదిన యువతి.. వీడియో వైరల్
భోపాల్: నడిరోడ్డుపై ఓ యువతి రెచ్చిపోయింది. ఫుడ్ డెలివరీ బాయ్‌ను చితకబాదింది. చెప్పుతో కొడుతూ కొద్దిసేపు బీభత్సం సృష్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. యువతిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జబల్పూర్ జిల్లాలోని రసల్చౌక్ ట్రాఫిక్ సిగ్నల్ ఓ యువతి బైక్‌పై వెళ్తుండగా ఫుడ్ డెలివరీ బాయ్.. ఆమె బైక్‌ను ఢీకొట్టాడు. అయితే సదరు యువకుడు రాంగ్ రూట్లో వచ్చి.. సిగ్నల్ పడిన దగ్గర మహిళ బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతుంటే ఢీకొట్టాడు. అంతే సదరు యువతి ఓ రేంజ్లో రెచ్చిపోయింది. అందరి ముందే రోడ్డుపై ఫుడ్ డెలివరీ బాయ్‌ను చెప్పు తీసుకొని చితకబాదింది. ఈ క్రమంలో ఆ యువకుడు తప్పైందని చెబుతున్నా వినిపించుకోకుండా రెచ్చిపోయింది. పక్కనున్నా వాళ్లు ఆమెకు ఎంత చెప్పినా ఆమె మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కొడుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. సదరు యువతి చేసిన హంగామా వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, పబ్లిక్ ప్లేస్‌లో ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు వారిద్దరినీ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాంగ్రూట్లో డ్రైవింగ్ చేసినందు ఫుడ్ డెలివరీ బాయ్‌కు ఫైన్ వేసి.. యువతికి వార్నింగ్ ఇచ్చి స్టేషన్ నుంచి పంపించేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో యువతి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పొగరు తగదంటూ హితవు పలుకుతున్నారు. -
రిపబ్లిక్ డే వేడుకలలో అపశ్రుతి.. తలపై పడిన డ్రోన్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ ఘటన జబల్పూర్ స్టేడియంలో జరిగింది. కాగా, అధికారులు వివిధ కార్యక్రమంలో భాగంగా డ్రోన్లను ప్రదర్శించారు. అయితే, ఈ డ్రోన్లు.. రిపబ్లిక్ వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన వారి మీద పడ్డాయి. వేడుకలలో భాగంగా గిరిజన నృత్యం కొనసాగుతుంది. ఈ క్రమంలో.. డ్రోన్ ఒక్కసారిగా అదుపు తప్పి నృత్యం చేస్తున్న వారిమీద పడింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఇందు కుంజమ్(38), గంగోత్రి కుంజమ్(18)లుగా గుర్తించారు. వీరు గిరిజన తెగకు చెందిన వారిగా.. దిండోరి జిల్లా నుంచి గణతంత్ర వేడుకలకు చూడటానికి జబల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరు పండిత్ రవి శుక్లా స్టేడియంలో గిరిజన నృత్యం చేయడానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. చదవండి: రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు -
రైతులను పంపించి నాట్లేసిన టీచర్లు.. ఎందుకంటే
భోపాల్: మహమ్మారి కరోనా ఇంకా అంతం కాలేదు. రూపాలు మార్చుకుంటూ రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా తయారవుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే కోవిడ్ నాలుగో వేవ్ మొదలు కాగా.. భారత్‌లోనూ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతో పాటు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, కొన్నిచోట్ల అవసరానికి తగ్గట్లుగా డోసులు అందుబాటులో లేకపోగా, మరికొన్ని చోట్ల టీకా వేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ టీచర్లు చూపిన చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. వ్యాక్సినేషన్ సజావుగా సాగేందుకు ఉపాధ్యాయులు నడుం బిగించి.. పొలాల్లో దిగి రైతుల్లా అవతారమెత్తిన వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. ఆగష్టు 7న, జబల్పూర్ సమీప గ్రామమైన మానిక్పూర్లోని వ్యాక్సినేషన్ బూత్‌కు వెళ్లిన ఉపాధ్యాయులకు ఖాళీ కేంద్రం దర్శనమిచ్చింది. రికార్డులను పరిశీలించగా.. ఆరోజు 33 మంది గ్రామస్తులు రెండో డోసు వేయించుకోవాల్సి ఉంది. కానీ, ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ సెంటర్‌కు రాలేదు. దీంతో విషయమేంటని ఆరా తీయగా.. వారంతా పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో.. అక్కడికి చేరుకున్న టీచర్లు..వారిని టీకా రెండో డోసు వేయించుకోవాల్సిందిగా కోరారు. అయితే, సీజన్ ఉన్నపుడే పనులు పూర్తిచేసుకోవాలని, లేదంటే పంట నష్టపోవాల్సి ఉంటుందని.. ఆ తర్వాతే వ్యాక్సిన్ వేసుకుంటామని రైతులు తేల్చిచెప్పారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య కాసేపు సంభాషణ నడిచింది. ఈ క్రమంలో తాము కూడా గ్రామాల నుంచే వచ్చామని, పొలం పనుల్లో సాయం చేస్తామంటూ టీచర్లు ముందుకు వచ్చారు. అందుకు బదులుగా.. రైతులను వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లాల్సిందిగా కోరారు. మొదట కాస్త తటపటాయించినప్పటికీ.. ఉపాధ్యాయుల చొరవ చూసి.. ఆ 33 మంది రైతులు వ్యాక్సిన్ బూత్‌కు వెళ్లి రెండో డోసు వేయించుకున్నారు. ఇక ఈ విషయం గురించి ముఖ్య వైద్యాధికారి రమేశ్ మరావి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. రైతుల కోసం టీచర్లు పొలంలోకి దిగి పనిచేయడం, వ్యాక్సినేషన్ సజావుగా సాగేలా చూడటం అభినందనీయమన్నారు. -
17- 19 ఏళ్ల వయసు ప్రేమ.. హైటెక్ మోసంతో లక్షల దోపిడీ
భోపాల్: తన కన్నా తక్కువ వయసున్న యువకుడితో ఆ యువతి ప్రేమలో పడింది. వారి మధ్య వయసు తేడా ఉన్నా ఎంచక్కా ప్రేమించుకుంటున్నారు. కలిసిమెలసి తిరుగుతూ ఊహలోకంలో తిరుగుతున్నారు. అయితే తమ జల్సాల కోసం వారు వక్రమార్గం పట్టారు. అమాయికులే లక్ష్యంగా చేసుకుని వారికి తెలియకుండానే రూ.లక్షల్లో దోచేసుకుంటున్నారు. ఆ విధంగా ఏకంగా రూ.11.50 లక్షల్లో టోకరా కొట్టి దర్జాగా తిరుగుతున్నారు. వారి ఆటను పోలీసులు కట్టడి చేశారు. ఇప్పుడు వారిద్దరూ జైలు పాలయ్యారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఎలా మోసం చేశారో తెలుసుకోండి. జబాల్‌పూర్ జిల్లాకు చెందిన 19 సంజనా గుప్తా 17 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడింది. మైనర్ కావడంతో పేరు వెల్లడించలేదు. వీరిద్దరూ కలిసి పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా మోసాలు చేశారు. అదుపులోకి తీసుకున్నప్పుడు వారు ఎలా నేరాలు చేసేవారో పోలీసులకు పూసగుచ్చినట్టు చెప్పారు. సీనియర్ పోలీస్ అధికారి సిద్ధార్థ్ బహుగుణ ఆ వివరాలు వెల్లడించారు. హైటెక్ మోసం ‘ఎస్బీఐ బ్రాంచ్‌లను సందర్శించి క్రెడిట్ కార్డుదారుల వివరాలు సేకరించారు. వారి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ అన్నీ తీసుకుంటారు. వారిలో ఖాతాదారుల సంతకాలు (సిగ్నేచర్) ఎవరివి సులువుగా ఉంటే వారి తీసుకున్నారు. ఆ సంతకాలను వారు తీసుకుని బ్యాంక్‌కు వెళ్లి తమ సంతకాలు మరిచిపోయామని, ఫోన్ నంబర్లు మార్చాలని ఖాతాదారుల పేరుపై వీరు దరఖాస్తు చేసుకున్నారు. ఆ విధంగా చేసి మొబైల్ ఫోన్లో ఆ ఖాతాదారుల అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు విత్ డ్రా చేసుకున్నారు. అలా జూన్ 30వ తేదీ నుంచి జూలై 16 మధ్య చాలా బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా చేశారు.’ ఆ వచ్చిన డబ్బులతో ఇద్దరూ జల్సాలు చేశారు. అయితే తమ ఖాతా నుంచి ఎవరో డబ్బు డ్రా చేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బరేలా, పనాగర్ పోలీస్‌స్టేషన్ పరిధిల్లో ఇద్దరు, సిహోరా స్టేషన్ ఒక బాధితుడు ఫిర్యాదు చేశారు. వరుస ఘటనలు జరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మోసం వెలుగులోకి వచ్చింది. వీరిని ఆచూకీ కనుక్కుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.పది వేల నగదు, రూ.లక్షన్నర విలువైన ఆభరణాలు, రూ.లక్షకు పైగా విలువైన సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి సిద్ధార్థ్ బహుగుణ వెల్లడించారు. వారిని రిమాండ్‌కు తరలించారు. అయితే ఆమె ప్రియుడు మైనర్ కావడంతో అతడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. వీరి బారిన ఇంకేవరైనా పడి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని, తరచూ పాస్వర్డ్లు మారుస్తూ ఉండాలని సూచించారు. -
అయోధ్య తీర్పు : ఆమె కల సాకారమైంది..!
జబల్పూర్: శ్రీరాముని వెంట వనవాసానికి వెళ్లిన తన భర్త లక్ష్మణుడు తిరిగి వచ్చే వరకు ఊర్మిళ 14 ఏళ్లపాటు నిద్రలోనే గడిపినట్లు రామాయణం చెబుతోంది. అది అప్పటి ఊర్మిళ కథ. అదేవిధంగా, రామాలయం నిర్మాణానికి దారులు పడే వరకు సాధారణ ఆహారం తినబోనంటూ దీక్షబూనారు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన నేటి ఊర్మిళ. అయోధ్యలో రామమందిరం కల సాకారం కావాలని ఎదురుచూస్తున్న వారిలో సంస్కృత ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఊర్మిళా చతుర్వేది(81) ఒకరు. 1992లో బాబ్రీ మసీదు కూల్చేసిన రోజు నుంచి సాధారణ ఆహారం తీసుకోవడం మానేశారు. 27 ఏళ్లుగా పాలు, పండ్లనే తీసుకుంటున్నారు. అయోధ్య వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఊర్మిళ తిరిగి సాధారణ ఆహారం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. సరయూ తీరంలో కార్తీక పౌర్ణమి మంగళవారం కార్తీక పౌర్ణమి కావడంతో లక్షలాది మంది భక్తులు అయోధ్యలోని సరయూనదిలో కార్తీక దీపోత్సవాన్ని జరుపుకోనున్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో అధికారులు.. ఘజియాబాద్‌లోని ఆయోధ్య ద్వారం వద్ద నుంచి అయోధ్య నగరం వరకు 4 కిలోమీటర్ల పొడవునా కట్టుదిట్టమైన భద్రత కలి్పంచారు. ఆ వైపుగా వాహనాల రాకపోకలను నిషేధించారు. -
బెడ్‌షీట్‌పై పేషెంట్‌ను లాక్కెళ్లారు..
జబల్పూర్ : మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో పేదవారికి ఏ రకమైన వైద్యం అందుతుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. జబల్పూర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజ్‌లో ఓ పేషెంట్‌కు ఎక్స్ రే తీయించాలని వైద్యులు తెలిపారు. అయితే సిబ్బంది పేషెంట్‌ను ఎక్స్ రే రూమ్‌కు బెడ్‌షీట్‌పై లాక్కుని వెళ్లారు. ఆస్పత్రిలో స్ట్రెచ్చర్లు లేకపోవడంతో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. వైద్య అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు అక్కడ ఉన్నవారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో సిబ్బంది, అధికారుల తీరుపై పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తున్నాయి. దీంతో మెడికల్ కాలేజ్ డీన్ నవనీత్ సక్సేనా ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బెడ్‌షీట్‌పై పేషెంట్‌ను లాక్కెళ్లారు..
-
చెత్తను చిత్తు చేశారు!
చెత్త.. ఎక్కడపడితే అక్కడ.. పల్లె, పట్టణం తేడా లేదు.. రోజూ వందల టన్నుల్లో.. గుట్టలు గుట్టలుగా.. ప్రజలకు, ప్రభుత్వానికి నిజంగానే ఇదో పెద్ద ‘చెత్త’ సమస్య! కానీ జబల్పూర్ మున్సిపాలిటీకి మాత్రం కాదు.. ఎందుకంటే.. వాళ్లు దీనికో ‘స్మార్ట్’ పరిష్కారాన్ని కనిపెట్టారు.. పైగా.. దాన్నుంచి విద్యుత్‌ను కూడా తయారుచేస్తూ.. ఆదాయాన్నీ ఆర్జిస్తున్నారు.. అదెలాగో తెలుసుకునే ముందు.. అసలు ఏమిటీ సమస్య.. మన దగ్గర పరిస్థితేంటి అన్నది ముందుగా చూద్దాం.. అసలు రోజూ వందల టన్నుల్లో పోగవుతున్న చెత్తను సేకరించడం ఒక ఎత్తయితే, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయడం, యార్డులకు తరలించడం ప్రభుత్వాలకు సమస్యగా మారుతోంది. ఇళ్లలో డస్ట్బిన్లు చెత్తతో నిండిపోయినా మున్సిపాలిటీ వాళ్లు దాన్ని తీసుకెళ్లకపోవడం, రోడ్ల మీద చెత్తను సరిగా శుభ్రం చేయకపోవడంతో రోగాల ఇబ్బంది ఉండనే ఉంది. చాలాచోట్ల డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థలాలే దొరకడం లేదు. నగర శివారుల్లో వీటిని ఏర్పాటు చేస్తే పరిసరాల్లో ఉండే వారు అభ్యంతరం చెబుతున్నారు. డంపింగ్ యార్డుల్లో చెత్తను తగులబెట్టడంతో పర్యావరణానికీ ముప్పు వాటిల్లుతోంది. మన దగ్గర చూస్తే.. రోజూ 40 మెట్రిక్ టన్నుల చెత్త పోగయ్యే సంగారెడ్డి మున్సిపాలిటీలో డంపింగ్ యార్డే లేదు. దీంతో చెత్తను రోడ్ల పక్కనే పారబోస్తున్నారు. నిజామాబాద్‌లో డంపింగ్ యార్డు ఉన్నా చెత్తను నామమాత్రంగా రీసైకిలింగ్ చేస్తున్నారు. దీంతో సమస్య అలాగే ఉంది. కరీంనగర్లో డంపింగ్ యార్డు నగరానికి 15 కి.మీ. దూరంలో ఉండటంతో మున్సిపల్ సిబ్బందికి రాకపోకలు ఇబ్బందిగా మారాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉంటే కేవలం 3 నగరాల్లోనే డంపింగ్ యార్డులున్నాయి. దీనికితోడు పారిశుద్ధ్య సిబ్బంది కొరత, శాఖల మధ్య సమన్వయలోపం చెత్త సమస్యను మరింత జటిలం చేస్తోంది. స్వచ్ఛ భారత్ కింద నగరాల్లో చెత్తను తొలగించడం కోసం ప్రభుత్వం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. చెత్తను తడి, పొడిగా విభజించడం.. తడి చెత్తతో కంపోస్టు తయారు చేయడం, పొడి చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. అయితే ఇవి పూర్తి స్థాయిలో, శాస్త్రీయంగా జరగడం లేదు. చాలా చోట్ల మొత్తం చెత్తలో పది, ఇరవై శాతమే రీసైకిలింగ్ అవుతోంది. ఇదండీ పరిస్థితి.. ఇక జబల్పూర్కి వెళ్దాం.. అక్కడేం చేశారో చూద్దాం.. కార్మికులకు ఆర్ఎఫ్ఐడీలు.. మధ్యప్రదేశ్‌లో మూడో పెద్ద నగరం జబల్పూర్. కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీ మిషన్ కింద ఈ నగరం ఎంపికయింది. ఇక్కడ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే కార్మికులకు ప్రభుత్వం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) రీడర్లను ఇచ్చింది. నగరంలో ఉన్న అన్ని ఇళ్లకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు అమర్చారు. పారిశుద్ధ్య సిబ్బంది ఒక ఇంట్లో డస్ట్‌బిన్‌ను ఖాళీ చేశాక తమ దగ్గరున్న ఆర్‌ఎఫ్‌ఐడీతో ఆ ఇంటిగోడపై అమర్చిన ట్యాగ్‌ను స్కాన్ చేస్తారు. వెంటనే ఆ సమాచారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుంది. ఏ ఒక్క ఇంటి సమాచారం అందకపోయినా కమాండ్ సెంటర్ అధికారులు సంబంధిత పారిశుద్ధ్య సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. దీంతో రోజూ ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ తప్పనిసరిగా జరుగుతుంది. చెత్త కుండీలకు సెన్సార్లు.. ఇళ్ల సంగతి ఇలా ఉంటే, నగరంలోని చాలా చోట్ల కమ్యూనిటీ డస్ట్‌బిన్ (రెండు మూడు వీధులకు కలిపి ఏర్పాటు చేసే చెత్త కుండీ)లు ఉన్నాయి. వీటన్నింటికీ సెన్సార్లు అమర్చారు. ఈ డస్ట్బిన్లు 90 శాతానికిపైగా నిండగానే ఆ సెన్సార్లు కమాండ్ సెం టర్కు, సంబంధిత అధికారులకు చెత్తకుండీని ఖాళీ చేయాల్సిందిగా సందేశం పంపుతాయి. వెంటనే అధికారులు దగ్గర్లో ఉన్న మున్సిపాలిటీ టిప్పర్‌కు సమాచారం అందజేస్తారు. దీంతో ఆ టిప్పర్ వచ్చి చెత్తను తీసుకెళుతుంది. వందల సం ఖ్యలో ఉన్న ఈ టిప్పర్లన్నింటినీ జీపీఎస్‌తో అనుసంధానించారు. దీంతో సమాచారం పంపడమే కాక వాటి రాకపోకలను కూడా నియంత్రించవచ్చు. విద్యుత్ ఉత్పత్తి ఇలా... ఇలా సేకరించిన చెత్త నుంచి తడి, పొడి చెత్తను వేరు చేస్తారు. దాన్ని నగర శివారులో 65 ఎకరాల్లో నెలకొల్పిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌కు తరలిస్తారు. ఈ ప్లాంట్‌లో రోజుకు 600 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసి తద్వారా రోజూ 11.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఆ విద్యుత్ 18 వేల ఇళ్లకు రోజువారీ వినియోగానికి సరిపోతుంది. దేశంలో ఇంత భారీస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానంతో చెత్త నిర్వహణ చేపడుతున్న నగరాల్లో జబల్పూరే మొదటిది. చెత్త నిర్వహణకు అవసరమైన స్మార్ట్ పరిజ్ఞానాన్ని టెక్ మహీంద్ర సంస్థ అందిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఎస్సెల్ గ్రూప్ సంస్థ నెలకొల్పింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో దీనిని నిర్వహిస్తున్నారు. రోజూ ఉత్పత్తి చేసే విద్యుత్.. 11.5 మెగావాట్లు. -
డీజిల్ దొంగలించారని ఆరోపిస్తూ..
-
డీజిల్ దొంగలించారని.. బట్టలు విప్పించి..
జబల్పూర్ : డీజిల్ దొంగలించారన్న నెపంలో పనివాళ్లను బట్టలు విప్పించి మరీ చావబాదారు యాజమాని అతని మిత్రుడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాండ్ల జిల్లాకు చెందిన సురేష్ ఠాకూర్, అశిష్ గాండ్, గోలు ఠాకూర్లు జబల్పూర్లోని గుడ్డు శర్మకు ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే జూలై 11 రాత్రిన కంపెనీకి చెందిన 120లీటర్ల డీజిల్ ఆ ముగ్గురు దొంగలించారని ఆరోపిస్తూ.. యాజమాని గుడ్డు శర్మ వారి బట్టలు విప్పించి బేస్‌బాల్ బ్యాట్‌తో చితకబాదాబడు. గుడ్డు శర్మతో పాటు అతని మిత్రుడు శేరు కూడా వారిని తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో విషయం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులు గుడ్డు శర్మ, అతని మిత్రుడు శేరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
మిత్రుడి చెల్లెలిపై సామూహిక అత్యాచారం
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడి చెల్లెలుపై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. అనంతరం ఆ విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించారు.ఈ ఘటన జబల్పూర్ నగరంలోని బడా పత్తార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 28న బడాపత్తార్ ఏరియాలో ఉండే స్నేహితుని దగ్గరని ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో వారి స్నేహితుని చెల్లెలు మాత్రమే ఉంది. అన్నయ్య స్నేహితులు కావడంతో ఆమె వారిని ఇంట్లోకి ఆహ్వానించింది. ఆ ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవెశించగానే తలుపులు బిగించారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామంటూ బెదిరించి పారిపోయారు. కాగా అత్యాచారం జరిగిన రెండు రోజుల తర్వాత ఆ బాలిక ఇంట్లో అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల్లో ఒకరు 18 ఏళ్ల యువకుడు కాగా మరో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం. -
కళ్ల ముందే తల్లిదండ్రుల్ని కొట్టారని..
జబల్పూర్ : కళ్ల ముందే తల్లిదండ్రుల్ని కొట్టారన్న బాధతో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జబల్పూర్లో ఏడోతరగతి చదువుతున్న బాలికను గత కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన యువకుడు వెంటపడి వేధిస్తున్నాడు. శనివారం ఆ యువకుడు బాలిక చేతిలో బలవంతంగా ఫోన్ పెట్టి.. తనకు కాల్ చేయాలని వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. యువకుడిపై ఫిర్యాదు చేసేందుకు బాలిక తల్లిదండ్రులు అతడి ఇంటికి వెళ్లారు. తమ కూతురిని వేధిస్తున్న సంగతి వారు యువకుడి తల్లిదండ్రులు చెప్పినప్పటికీ.. ఈ విషయాన్ని నమ్మకపోగా బాలిక కళ్లముందే ఆమె కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ హఠాత్ పరిణామాన్ని జీర్ణించుకోలేని బాలిక ఆవేదనకు గురై ఇంటికి వెళ్లిన అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పడంతో వారు గుండెలు బాదుకున్నారు. యువకుడిపై, అతడి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసినట్టు ఏఎస్పీ అల్పానారాయణ్ మిశ్రా తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రుజువైతే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడైన యువకుడి వయస్సు 17 ఏళ్లు అని, అతడు మైనర్ తల్లిదండ్రులు చెప్తుండగా... ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
నేతాజీ ప్రతిమనూ వదల్లేదు..
జబల్పూర్ : విగ్రహాల ధ్వంసం ఘటనలకు బ్రేక్ పడటం లేదు. దేశవ్యాప్తంగా మహనీయుల విగ్రహాలను లక్ష్యంగా చేసుకుంటున్న దుండగులు తాజాగా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని అవమానించారు. శుక్రవారం ఉదయం కొందరు దుండగులు నేతాజీ విగ్రహానికి ఎరుపు రంగు పులిమారు. ఈ ఘటనపై స్ధానిక అధికారుల చొరవతో పోలీసులు ప్రాధమిక దర్యాప్తును చేపట్టారు. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. త్రిపురలో రెండు లెనిన్ విగ్రహాలను కొందరు కూల్చివేశారు. అగర్తలాలో కొందరు దుండగలు లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేయగా, బెలోనియాలో వ్యవసాయ క్షేత్రంలోని లెనిన్ విగ్రహాన్ని బుల్డోజర్తో తొలగించారు. లెనిన్ విగ్రహాన్ని నేలమట్టం చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.మరోవైపు యూపీలోని ఖరోవ్ గ్రామంలో శుక్రవారం హనుమాన్ విగ్రహంపైనా దుండగులు దాడికి తెగబడ్డారు. విగ్రహాల కూల్చివేతలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపడతామని ప్రధాని హెచ్చరించినా ఇలాంటి ఘటనలు కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
'ఆ వీడియో చూసి చనిపోవాలనుకుంది'
సాక్షి, జబల్పూర్ : తన తండ్రిని అవమానించిన తీరును చూసి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అదృష్టం కొద్ది ప్రాణాపాయం నుంచి బయటపడి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. వివరాల్లోకి వెళితే, డబ్బు వివాదమై జబల్పూర్లోని బీజేపీ మైనారిటీ సెల్ విభాగం అధ్యక్షుడు మహ్మద్ షఫిక్ అలియాస్ హీరా అనే వ్యక్తి బాధితురాలి తండ్రిని మొకాళ్లపై కూర్చొబెట్టి నడుం వంచి దండం పెట్టించుకున్నాడు. పైగా అతడి వీపుపై ఓ వాటర్ బాటిల్‌పై పెట్టి వీడియోలు తీయించి ఆ వీడియోలను వాట్సాప్‌లో పెట్టించాడు. అది కాస్త వైరల్‌గా మారి బాధితురాలు చదువుకునే కాలేజీలో స్నేహితుల ఫోన్లలోకి వెళ్లింది. ఆ వీడియోను తాను కూడా చూడటంతో తీవ్రంగా అవమానంగా భావించి ఇంటికొచ్చిన ఆ యువతి వెంటనే పురుగుల మందులాంటి విషాన్ని తీసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇలా చేసిన సదరు బీజేపీ నేతపైనా, ఆ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తులపైనా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
రక్తం అమ్మి డబ్బు కట్టబోయారు
భోపాల్: ప్రభుత్వ హాస్టళ్ల వార్డెన్లు జలగల్లా విద్యార్థుల రక్తం తాగుతున్నారనడానికి మరో నిజం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. జబల్పూర్ జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన విద్యార్ధినిలు ఇద్దరు స్ధానిక ఆసుపత్రి వద్ద కనిపించారు. అక్కడు వచ్చి పోయే వారి వద్దకు వెళ్లి రక్తం అవసరమైతే తాము ఇస్తామని.. అందుకు కొంత డబ్బు కావాలని కోరుతూ గంటల తరబడి అక్కడే ఎదురుచూస్తున్నారు. ఇది గమనించిన ఓ రిపోర్టర్ వారిని ప్రశ్నించగా హాస్టల్లో నివసించాలంటే డబ్బులు ఇవ్వాలని వార్డెన్ డిమాండ్ చేసినట్లు బాలికలు తెలిపారు. ఘటనను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో గద్దా రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ట్రైబల్ గర్ల్స్ వార్డెన్‌గా పనిచేస్తున్న బైదేహీ ఠాకూర్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు. దీనిపై మాట్లాడిన మధ్యప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ జైన్ వార్డెన్‌పై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. -
20 ఏళ్లుగా అమ్మను భుజాన మోస్తున్నాడు!
ఆగ్రా: జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలించుకుంటున్న బిడ్డలున్న మన సమాజంలో కన్నతల్లిని 20 ఏళ్లుగా మోస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు అభినవ 'శ్రవణుడు'. అతడి పేరు కైలాశ్ గిరి. తన తల్లి కోరిక తీర్చేందుకు 20 ఏళ్లుగా దేశమంతా కాలినడన తిరుగుతున్నాడు. కళ్లులేని తన తల్లిదండ్రులను శ్రవణుడు కావడిలో మోస్తే... కైలాశ్ తన తల్లిని భుజాన మోస్తున్నాడు. ఛార్ ధామ్ యాత్ర చేయాలన్న తల్లి ఆకాంక్షను నెరవేర్చేందుకు ఇప్పటివరకు కాలినడన 36,582 కిలోమీటర్లు ప్రయాణించాడు. మధ్యప్రదేశ్ లోని జాబల్ పూర్ కు చెందిన 48 ఏళ్ల కైలాశ్ అంధురాలైన 92 ఏళ్ల తన తల్లి కీర్తిదేవిని కావడిలో భుజాన మోస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రాలు చుట్టివస్తున్నాడు. మాథూరా వెళుతుండగా అతడిని మీడియా ప్రతినిధులు పలకరించగా తన గురించి చెప్పాడు. 'నాకు 28 ఏళ్ల వయసులో 1996, ఫిబ్రవరిలో ఈ యాత్ర చేపట్టాను. ఇప్పుడు 50 ఏళ్లకు చేరువయ్యాను. నా కోసం, మా అమ్మ కోసం యాత్ర చేస్తున్నా. 20 ఏళ్లుగా ప్రయాణం చేస్తూనే ఉన్నా. మరికొన్ని పుణ్యక్షేతాలు దర్శిస్తే నా యాత్ర పూర్తవుతుంద'ని చెప్పాడు. తన తల్లి కోరిక నెరవేర్చడానికి నిర్ణయం తీసుకోవడం వెనుకున్న కథ గురించి చెబుతూ... 'నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు చెట్టు మీద నుంచి పడిపోయాను. నేను బతకడం కష్టమన్నారు. మా అమ్మ ఎన్నో పూజలు చేసి నన్ను బతికించింది. నా జీవితం ఆమెకే అంకితం. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే మానాన్న, సోదరుడు చనిపోయారు. ఆమె ఆకాంక్షను నేను కాకపోతే ఎవరు తీరుస్తారు' అని కైలాశ్ అన్నాడు. దేశవ్యాప్త పర్యటన తనకెంతో సంతోషం కలిగించిందన్నాడు. ఎంతో మంది తమకు సాయం చేశారని తెలిపాడు. తన తల్లిని తిరుపతికి తీసుకువస్తానని వెల్లడించాడు. -
'అభిమానుల తీరు బాధ కలిగించింది'
మొహంజొదారో షూటింగ్ సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించటంపై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హృతిక్ లీడ్ రోల్లో అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ సినిమా మొహంజోదారో. ప్రస్తుతం జబల్పూర్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లోకేషన్ లో హృతిక్ కు అభిమానుల మూలంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. హృతిక్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అభిమానులు ద్విచక్ వాహనాలపై వెంబడించటంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ విషయం పై హృతిక్ స్పందిస్తూ. 'మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ ఇతరులకు హాని కలిగించటం బాధగా ఉంది. మీరు నా దగ్గరికి రాకపోయినా మీ ప్రేమను నేను ఫీల్ అవుతాను' అంటూ వ్యాఖ్యానించాడు. పూజాహెగ్డే ఈ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2016లో ఆగస్టులో రిలీజ్ కానుంది. -
వ్యాపం కేసులో మరో అనుమానాస్పద మృతి
-
మధ్యప్రదేశ్‌లో మరో బియాస్ దుర్ఘటన
బియాస్ నదీ విషాదాన్ని మరువక ముందే అలాంటి ఘటనే పునరావృతమైంది. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని బాగ్దారి జలపాతం వద్ద 11 మంది నీటిలో కొట్టుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించిన అధికారులు ఎనిమిది మృతదేహాలను వెలికి తీశారు. మధ్యప్రదేశ్‌లోని హన్‌మాన్‌తల్ ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలు సరదాగా గడపాలనుకున్నాయి. ఎంజాయ్ చేసేందుకు జబల్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నబాగ్దారి జలపాతాన్ని ఎంపిక చేసుకున్నాయి. అనుకున్నట్లుగానే రెండు కుటుంబాలకు చెందిన 12 మంది బాగ్దారి జలపాతానికి వెళ్లారు. కొండల మధ్య చిన్న నదీపాయను దాటి పిక్నిక్ స్పాట్‌కు చేరుకున్నారు. జలపాతం అందాలను ఆస్వాదించి సంతోషంగా గడిపారు. సరిగ్గా వాళ్లు తిరిగి ఇంటికి వెళ్దామనుకుంటున్న సమయంలో మృత్యువు కాటేసింది. నదీపాయను దాటుతున్న సమయంలో అనూహ్యంగా పెరిగిపోయిన వరద ఆ రెండు కుటుంబాలను కబళించేసింది. వరద ఉద్ధృతిలో మొదట ఓ యువకుడు పడిపోగా అతడిని రక్షించే ప్రయత్నంలో మిగతా వారంతా కొట్టుకుపోయారు. ఒక యువతి మాత్రం ప్రాణాలతో బయటపడగలిగింది. మరో యువతిని రక్షించేందుకు స్థానిక ప్రజలు ప్రయత్నించినా అది ఫలించలేదు. ప్రమాద విషయం తెలిసిన అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. సహాయ బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. ఈ గాలింపులో ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికి తీశారు. మరో ముగ్గురి కోసం గాలింపు జరుగుతోంది. ఈ ఘోర విషాదంలో ప్రాణాలతో బయటపడిన యువతికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులకు లక్ష రూపాయల చొప్పున జిల్లా అధికార యంత్రాంగం ఎక్స్గ్గ్రేషియా ప్రకటించింది. వాస్తవానికి వాళ్లు ఉన్నప్పుడు ప్రవాహం అంత ఎక్కువగా లేదని, కానీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ఉన్నట్టుండి ప్రవాహం ఎక్కువయ్యిందని, దాన్ని గుర్తించి అవతలి గట్టుకు వెళ్దామనుకునేలోపే ప్రవాహం ముంచుకొచ్చి 11 మంది నీళ్లలో కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వ వైద్యకళాశాల డీన్ ఆత్మహత్య
ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ప్రభుత్వ వైద్యకళాశాల డీన్ ఒకరు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైద్యకళాశాలకు డీన్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ డీకే షకాల్యే తన అధికారిక నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య మార్నింగ్ వాక్ కోసం వెళ్లినప్పుడు ఆయన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ పని చేశారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదీ మాత్రం తెలియరాలేదు. నిప్పంటించుకున్న తర్వాత మంటల వేడి తాళలేక ఆయన బయటికొచ్చి సాయం కోసం అరిచారు. అయితే, చుట్టుపక్కల వాళ్లు గుర్తించి మంటలు ఆర్పి ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ఏకంగా 98 శాతం కాలిన గాయాలయ్యాయి. దాంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆరు నెలల క్రితమే డీన్ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ షకాల్యే.. గత 20 రోజులుగా సెలవులో ఉన్నారు. ఆయన తరచు బాగా ఒత్తిడికి లోనైనట్లు కనిపిచంఏవారని సహోద్యోగులు తెలిపారు. మద్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన ప్రవేశ పరీక్షలలో స్కాం వెలుగు చూసిన తర్వాత ఆయన పనిచేస్తున్న కాలేజీలో దాదాపు 90 మంది విద్యార్థులు బహిష్కరణకు గురయ్యారు. దానికి.. డీన్ ఆత్మహత్యకు ఏమైనా సంబంధం ఉందేమోనని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేయసిని పెళ్లాడిన యువతి!
యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రేమించడం, అలా ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకోవాలనుకోవడం అన్నీ మామూలే. కానీ.. చాలాకాలంగా తనతో కలిసి ఉంటున్న ప్రేయసిని పెళ్లాడేసింది ఓ యువతి!! ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జరిగింది. నికితా అసానీ (24) అనే యువతి సత్నా ప్రాంతంలో నివసిస్తుంది. ఆమె కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో ఇంటి నుంచి కనపడకుండా పోయింది. దాంతో ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు జబల్పూర్ ప్రాంతంలో అచ్చం నికితలాగే ఉండే ఓ అమ్మాయి పోలీసులకు కనిపించింది. దాంతో ఆమెను గుర్తించాలని తల్లిదండ్రులను పిలవగా, ఆమే అని తేలింది. కానీ వాళ్లతో ఇంటికి వెళ్లేందుకు నికిత నిరాకరించింది. తానెప్పటికీ తన ప్రేయసితోనే కలిసి ఉంటానని మొండికేసింది. అంతేకాదు, చాలాకాలంగా తాను సహజీవనం చేస్తున్న రజినీ రాజ్ నగర్ అనే యువతినే తాను పెళ్లి చేసుకున్నానని చెప్పేసింది. ఇది సరికాదు, తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లాలని పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా, తాను మేజర్‌నని, ఏది మంచో.. ఏది చెడో తనకు తెలుసునని చెప్పింది. అయితే.. నికితను ట్రాప్ చేసిన రజనీ నగర్‌కు ఇది తొలిసారి కాదని, ఇంతకుముందు కూడా ఆమె ఓ అమ్మాయిని తన వలలో వేసుకుందని తెలిసింది. రజనీపై పలు క్రిమినల్ కేసులు ఇప్పటికే ఉన్నాయి. -
చేయిచేసుకున్న స్వరూపానంద!
వివాదాలు కొనితెచ్చుకోవడంలో రాజకీయ నాయకులతో బాబాలు పోటీ పడుతున్నారు. దురుసు ప్రవర్తనలో నేతాశ్రీలకు తామేమి తీసిపోమని రుజువు చేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణగా నిలిచారు ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి. తాను సాధువునన్న సంగతి మర్చిపోయి విలేకరిపై చేయి చేసుకున్నారు. పెద్దరికాన్ని పక్కనపెట్టి పాత్రికేయుడిపై ప్రతాపం చూపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురించి ఓ విలేకరి ప్రశ్న సంధించడం స్వరూపానందకు ఆగ్రహం తెప్పించింది. రాజకీయాల గురించి అడగొద్దని చెప్పినా వినకుండా విలేకరి ప్రశ్నించడంతో అతడిపై ఆయన చేయి చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని జబర్పూర్లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు జాతీయ చానళ్ల ప్రసారం కావడంతో స్వరూపానంద వివరణయిచ్చారు. పాత్రికేయుడిపై కావాలని చేయి చేసుకోలేదని, పొరపాటున తన చేయి అతడికి తగిలిందని తెలిపారు. అయితే ఇదంతా కాషాయ పార్టీ కుట్ర అని స్వరూపానంద ప్రతినిధి ఆరోపించారు. బీజేపీ ఇదంతా చేయించిందని అన్నారు. స్వామిజీని ప్రశ్నించిన విలేకరి మద్యం సేవించి ఉన్నాడని, స్వరూపానందను సమీపించి ఆయనను తోసివేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. స్వరూపానందను రెచ్చగొట్టేందుకే అతడు అలా ప్రవర్తించాడని అన్నారు. దీని వెనుక బీజేపీ మాజీ మంత్రి హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. స్వరూపానంద విలేకరిపై చేయిచేసుకోవడం పట్ల మధ్యప్రదేశ్ బీజేపీ మీడియా సెల్ అధ్యక్షుడు హితేష్ వాజపేయి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరి వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయించారని కాంగ్రెస్ ఆరోపించింది. స్వరూపానంద సరస్వతి గతంలోనూ వార్తల్లో నిలిచారు. మోడీని విమర్శించిన బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి విరాట్ రామాయణ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి స్వరూపానంద సరస్వతి తన 'చేతి వాటం'తో మరోసారి పతాక శీర్షికలకు ఎక్కారు.