మధ్యప్రదేశ్ వ్యాపం (వ్యవసాయిక్ పరీక్షా మండల్) కుంభకోణంతో సంబంధం ఉన్న మరొకరు ఆదివారం ఉదయం అనుమానాస్పద రీతిలో మరణించారు. కుంభకోణాన్ని దర్యాప్తుచేస్తోన్న ఉన్నతాధికారుల బృందంలో సభ్యుడు, జబల్ పూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ అరుణ్ శర్మ ఢిల్లీలో శవంగా కనిపించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఉప్పల్ హోటల్ లోని తన గదిలో విగతజీవిగా పడిఉన్న ఆయనను హోటల్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.