వ్యాపం స్కామ్: చెరువులో శవమై తేలిన ట్రైనీ ఎస్ఐ | Vypam Scam || Trainee sub-inspector Anamika Kushwaha,found dead | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 6 2015 1:16 PM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM

దేశవ్యాప్తంగా కలకలం రేపిన వ్యాపం స్కామ్ అంతుచిక్కని మిస్టరీగా మారుతోంది. మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన ఈ కుంభకోణంలో అనుమానాస్పద మృతుల సంఖ్య 48కి పెరిగింది. గత మూడు రోజుల్లో ముగ్గురు చనిపోయారు. తాజాగా మహిళా ట్రైనీ ఎస్ఐ అనామికా కుష్వాహ అనుమానస్పద స్థితిలో మరణించారు. సాగర్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ట్రైనీగా ఉన్న కుష్వాహ మృతదేహాన్ని సోమవారం ఉదయం చెరువులో గుర్తించారు. వ్యాపం ద్వారా కుష్వాహ 2014 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికయ్యారు. గత 48 గంటల్లో ఈ కేసు విచారణతో సంబంధమున్న జర్నలిస్టు అక్షయ్ సింగ్, మెడికల్ కాలేజీ డీన్ అరుణా శర్మ అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. కోట్లాది రూపాయల వ్యాపం స్కాంలో సాక్షులు, నిందితులు వరుసగా చనిపోతుండటం మిస్టరీగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ స్కామ్పై న్యాయస్థానం ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు కానీ, మరెలాంటి విచారణకు అయినా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement