
భోపాల్: మధ్యప్రదేశ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ ఘటన జబల్పూర్ స్టేడియంలో జరిగింది. కాగా, అధికారులు వివిధ కార్యక్రమంలో భాగంగా డ్రోన్లను ప్రదర్శించారు. అయితే, ఈ డ్రోన్లు.. రిపబ్లిక్ వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన వారి మీద పడ్డాయి. వేడుకలలో భాగంగా గిరిజన నృత్యం కొనసాగుతుంది. ఈ క్రమంలో.. డ్రోన్ ఒక్కసారిగా అదుపు తప్పి నృత్యం చేస్తున్న వారిమీద పడింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అధికారులు ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిని ఇందు కుంజమ్(38), గంగోత్రి కుంజమ్(18)లుగా గుర్తించారు. వీరు గిరిజన తెగకు చెందిన వారిగా.. దిండోరి జిల్లా నుంచి గణతంత్ర వేడుకలకు చూడటానికి జబల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరు పండిత్ రవి శుక్లా స్టేడియంలో గిరిజన నృత్యం చేయడానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
చదవండి: రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు
Comments
Please login to add a commentAdd a comment