ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రభుత్వ వైద్యకళాశాల డీన్ ఒకరు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైద్యకళాశాలకు డీన్గా వ్యవహరిస్తున్న డాక్టర్ డీకే షకాల్యే తన అధికారిక నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య మార్నింగ్ వాక్ కోసం వెళ్లినప్పుడు ఆయన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ పని చేశారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదీ మాత్రం తెలియరాలేదు.
నిప్పంటించుకున్న తర్వాత మంటల వేడి తాళలేక ఆయన బయటికొచ్చి సాయం కోసం అరిచారు. అయితే, చుట్టుపక్కల వాళ్లు గుర్తించి మంటలు ఆర్పి ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ఏకంగా 98 శాతం కాలిన గాయాలయ్యాయి. దాంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆరు నెలల క్రితమే డీన్ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ షకాల్యే.. గత 20 రోజులుగా సెలవులో ఉన్నారు. ఆయన తరచు బాగా ఒత్తిడికి లోనైనట్లు కనిపిచంఏవారని సహోద్యోగులు తెలిపారు.
మద్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన ప్రవేశ పరీక్షలలో స్కాం వెలుగు చూసిన తర్వాత ఆయన పనిచేస్తున్న కాలేజీలో దాదాపు 90 మంది విద్యార్థులు బహిష్కరణకు గురయ్యారు. దానికి.. డీన్ ఆత్మహత్యకు ఏమైనా సంబంధం ఉందేమోనని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ వైద్యకళాశాల డీన్ ఆత్మహత్య
Published Fri, Jul 4 2014 3:33 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement