
జబల్‌పూర్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడి చెల్లెలుపై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. అనంతరం ఆ విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించారు.ఈ ఘటన జబల్‌పూర్ నగరంలోని బడా పత్తార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 28న బడాపత్తార్ ఏరియాలో ఉండే స్నేహితుని దగ్గరని ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో వారి స్నేహితుని చెల్లెలు మాత్రమే ఉంది. అన్నయ్య స్నేహితులు కావడంతో ఆమె వారిని ఇంట్లోకి ఆహ్వానించింది. ఆ ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవెశించగానే తలుపులు బిగించారు.
అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామంటూ బెదిరించి పారిపోయారు. కాగా అత్యాచారం జరిగిన రెండు రోజుల తర్వాత ఆ బాలిక ఇంట్లో అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల్లో ఒకరు 18 ఏళ్ల యువకుడు కాగా మరో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment