పనివాళ్లను బేస్‌బాల్ బ్యాట్‌తో కొడుతున్న గుడ్డు శర్మ
జబల్‌పూర్ : డీజిల్ దొంగలించారన్న నెపంలో పనివాళ్లను బట్టలు విప్పించి మరీ చావబాదారు యాజమాని అతని మిత్రుడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాండ్ల జిల్లాకు చెందిన సురేష్ ఠాకూర్, అశిష్ గాండ్, గోలు ఠాకూర్‌లు జబల్‌పూర్‌లోని గుడ్డు శర్మకు ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే జూలై 11 రాత్రిన కంపెనీకి చెందిన 120లీటర్ల డీజిల్ ఆ ముగ్గురు దొంగలించారని ఆరోపిస్తూ.. యాజమాని గుడ్డు శర్మ వారి బట్టలు విప్పించి బేస్‌బాల్ బ్యాట్‌తో చితకబాదాబడు.
గుడ్డు శర్మతో పాటు అతని మిత్రుడు శేరు కూడా వారిని తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో విషయం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులు గుడ్డు శర్మ, అతని మిత్రుడు శేరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment