Stripped
-
ఆంక్షలను ధిక్కరిస్తూ.. లో దుస్తులతో నిరసన
టెహ్రాన్: బహిరంగంగా మహిళల వేషధారణపై కఠిన నిబంధనలు, కట్టుబాట్లను అమలుచేస్తున్న ఇరాన్లో ఓ విద్యార్థిని నిరసన గళం విప్పారు. ముఖం కనిపించకుండా సంప్రదాయ వస్త్రం ధరించలేదన్న కారణంగా టెహ్రాన్‌లో ఆ విద్యార్థినిపై బసీజ్ పారామిలటరీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. టెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ ఇందుకు వేదికైంది. వాగ్వాదంలో బసీజ్ పారామిలటరీ సభ్యులు ఆ వర్సిటీ విద్యార్థిని దుస్తులు చింపేశారు. దీంతో ఆగ్రహంతో ఆ అమ్మాయి చిరిగిన బట్టలు పక్కన పడేసి లోదుస్తుల్లో తన నిరసన వ్యక్తంచేసింది. విద్యార్థినులపై కఠిన మత చట్టాలను అమలుచేయడమేంటని నిలదీసింది. అలాగే లోదుస్తుల్లో వందలాది విద్యార్థినీవిద్యార్థుల మధ్యలో వర్సిటీ ప్రాంగణంలో కలియ తిరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసింది. దీంతో సాధారణ దుస్తుల్లో వచి్చన పోలీసులు ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కారులో కుక్కి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. దీంతో ఆమె ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ సంస్థ స్పందించింది. ‘‘ ఆమె ప్రస్తుతం ఎక్కడుందో ఎవరికీ తెలీదు. బేషరతుగా విద్యార్థిని తక్షణం విడుదలచేయాలి. ఆమెను పోలీసులు కొట్టడం, వేధించడం చేయొద్దు. కుటుంసభ్యులు, లాయర్‌తో మాట్లాడే అవకాశం కల్పించాలి. పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలి’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ డిమాండ్ చేసింది. హిజాబ్ ధరించలేదంటూ మాసా అమినీ అనే యువతిని నైతిక పోలీసులు చిత్రవధ చేసి చంపడం, అది ఇరాన్లో భారీ నిరసనలకు దారితీయడం తెలిసిందే. -
పనిపిల్లపై యజమాని కుటుంబం దాష్టీకం
గురుగ్రామ్: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనికి కుదిర్చిన వ్యక్తితో కలిసి ఎట్టకేలకు తల్లి.. ఆమె కూతురుని విడిపించుకుంది. తాను అనుభవించిన చిత్రహింసను కూతురు ఏడుస్తూ చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బిహార్‌కు చెందిన ఈమె తన కూతురును జూన్ 27వ తేదీన ఒకావిడ ఇంట్లో పనికి కుదిర్చింది. ఇంట్లో ఉంచుకుని, పనికి నెలకు రూ.9,000 జీతం ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంది. ‘‘ మొదట్లో రెండు నెలలు మాత్రమే నా కుతురుకు జీతం ఇచ్చారు. ఆ తర్వాత చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇంటి పని అంతా చేయించుకుని ఇష్టమొచి్చనట్ట కొట్టేవారు. పెంపుడు కుక్కతో కరిపించేవారు. యజమాని ఇద్దరు కుమారులు నా బిడ్డను లైంగికంగా వేధించారు. బలవంతంగా బట్టలూడదీసి ఫొటోలు, వీడియోలు తీసేవారు. అసభ్యంగా తాకేవారు. యజమానురాలు ఇనుప కడ్డీ, సుత్తితో కొట్టి చిత్రహింసలు పెట్టేది. బయటకు తప్పించుకునిపోకుండా గదిలో బంధించేవారు. కట్టేసి అరవకుండా నోటికి టేప్ అంటించారు. చేతులపై యాసిడ్ పోశారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించేవారు. నా బిడ్డకు రెండు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారు. ఇంతటి దారుణాలు తెలిశాక స్థానిక వ్యక్తితో కలిసి ఎట్టకేలకు ఆ బిడ్డను విడిపించుకున్నా’’ అని టీనేజర్ తల్లి వాపోయారు. -
స్ట్రిప్డ్ ఫ్లై మాల్వేర్తో జాగ్రత్త
ఫుకెట్ (థాయిల్యాండ్): సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కీ.. స్ట్రిప్డ్ ఫ్లై అనే మాల్వేర్ విషయమై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. గత ఆరేళ్లలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ మాల్వేర్ బారిన పడినట్టు తెలిపింది. ఆరంభంలో ఇది క్రిప్టోకరెన్సీ మాదిరిగా నటించి, ఆ తర్వాత మొండి మాల్వేర్గా మారిపోయినట్టు పేర్కొంది. ఈ మాల్వేర్ బహుళ మాడ్యూల్‌ను కలిగి ఉండడం, క్రిప్టో మైనర్‌గా, రామ్సమ్వేర్ సమూహంగా వ్యవహరించి.. ఆర్థిక లాభం నుంచి గూఢచర్యం వరకు కార్యకలాపాలు విస్తరించగలదని కాస్పర్స్కీ హెచ్చరించింది. బాధితులపై విస్తృతంగా నిఘా పెట్టే సామర్థ్యాలను ఈ మాల్వేర్ వెనుకనున్న వ్యక్తులు సంపాదించినట్టుగా తెలిపింది. యూజర్‌కు తెలియకుండానే, వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ షాట్లు ఈ మాల్వేర్ తీసుకోగలదని, స్మార్ట్‌ఫోన్‌పై గణనీయమైన నియంత్రణ పొందగలదని వివరించింది. స్టిప్డ్ ఫ్లై మాల్వేర్ బారిన పడకుండా కొన్ని చర్యలు సాయపడతాయని తెలిపింది. ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకోవడం, అప్లికేషన్లు, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అనుమానిత లింక్‌లపై క్లిక్ చేసే ముందు, వ్యక్తిగత వివరాలు షేర్ చేసే ముందు పంపించిన వారి ఐడెంటిటీని పరిశీలించాలని పేర్కొంది. -
అదనపు వడ్డీ కట్టలేదని వివస్త్రను చేసి..
పట్నా: సభ్య సమాజం తలదించుకోవాల్సిన దారుణ ఘటన బిహార్‌లో జరిగింది. ఆపదలో అక్కరకొస్తాయని రూ.1,500 అప్పు తీసుకున్న పాపానికి దళిత మహిళ ఒకరు దారుణ అవమానానికి గురికావాల్సి వచి్చంది. విషయం తెల్సి నిందితులకు కఠిన శిక్ష పడేలాచూడాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పోలీసులను ఆదేశించారు. బిహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా జిల్లాలోని ఖుస్రూపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈనెల 23వ తేదీ రాత్రి జరిగింది. కొన్ని నెలల క్రితం దళిత మహిళ భర్త.. ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద రూ.1,500 అప్పుగా తీసుకున్నారు. తర్వాత కొంతకాలానికి వడ్డీతోసహా అసలు మొత్తాన్నీ ప్రమోద్‌కు చెల్లించేశారు. ఇది సరిపోదని, ఇంకా అదనంగా వడ్డీ కట్టాలని ప్రమోద్ వేధింపులు మొదలుపెట్టారు. అదనంగా ఇచ్చేదేమీలేదని దళిత వ్యక్తి భార్య కరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆమెకు ఫోన్ చేసి ‘ అదనపు వడ్డీ కట్టకపోతే నిన్ను నగ్నంగా ఊరిలో ఊరేగిస్తా’ అంటూ ప్రమోద్ చేసిన బెదిరింపులను ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికొచ్చి విచారించి వెళ్లారు. పోలీసులు వచి్చన విషయం తెల్సి ప్రమోద్ కోపంతో ఊగిపోయాడు. ఈనెల 23వ తేదీన రాత్రి పదింటికి కొంత మందితో కలిసి దళితుడి ఇంటికొచ్చి అతిని భార్యను బలవంతంగా తన ఇంటికి లాక్కెళ్లాడు. వివస్త్రను చేసి పిడిగుద్దులు కురిపిస్తూ కర్రలతో చావబాదాడు. ప్రమోద్ కుమారుడు అన్షుతో ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ మళ్లీ పోలీసులుకు ఫిర్యాదుచేసింది. ప్రమోద్, కుమారుడు అన్షు పరారీలో ఉన్నారని పట్నా సీనియర్ ఎస్పీ రాజీవ్ మిశ్రా చెప్పారు. -
అదనపు వడ్డీ కోసం దళిత మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించి..
పాట్నా: బీహార్‌లోని పాట్నా జిల్లా మొశింపుర్ గ్రామంలో ఖుర్సుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రూ.1500 అదనపు వడ్డీ చెల్లించాలంటూ తండ్రీ కొడుకులు ఒక దళిత మహిళపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను వివస్త్రను చేసి కర్రలతో చితకబాది బలవంతంగా ఆమెతో మూత్రం తాగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలి భర్త ప్రమోద్ సింగ్ వద్ద రూ.9000 అప్పుగా తీసుకున్నారని ఆ నగదు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించినా కూడా రూ.1500 అదనంగా వడ్డీ చెల్లించాలని ప్రమోద్ సింగ్ పలుమార్లు వారిని వేధించాడన్నారు. భార్యభర్తలు ఇద్దరూ అప్పటికే మొత్తం అప్పు తిరిగి చెల్లించామని చెప్పి అదననపు వడ్డీ చెల్లించడానికి తిరస్కరించడంతో శనివారం ప్రమోద్ సింగ్ తన కుమారుడు అన్షు తోపాటు మరో నలుగురు ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా బయటకు లాక్కొచ్చి అందరూ చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేశారన్నారు. అనంతరం కర్రలతో చితకబాదాక ప్రమోద్ ఆదేశించగా అన్షు బలవంతంగా ఆమెతో మూత్రం తాగించాడు. అక్కడినుండి ఎలాగోలా తప్పించుకున్న ఆమె పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి తలకు తీవ్రగాయాలవ్వడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ప్రధాన నిందితుడు ప్రమోద్ సింగ్ అతని కుమారుడు అన్షు సహా మిగిలిన ఆనలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో క్షుద్రపూజలు.. నకిలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్ -
నగ్నంగా ఊరేగించిన మహిళకు సీఎం భరోసా
జైపూర్: రాజస్థాన్‌లో ఒక మహిళను వివస్త్రను చేసిన సంఘటన విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పగించామని బాధితురాలి భర్తతో సహా మరో 10 మందిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఈ సందర్బంగా బాధితురాలికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం తోపాటు ఒక ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన మరువక ముందే రాజస్థాన్‌లో అలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది. ప్రతాప్‌గఢ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన మీనా అనే వ్యక్తి తన భార్యకి పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధముందని అనుమానించి పది మంది చూస్తుండగా ఆమెను ఒకపక్క కొడుతూ వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడని తెలిపారు. బాధితురాలి అత్తమామలు ప్రోద్బలంతోనే మీనా ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని వారు తెలిపారు. సంఘటన వెలుగులోకి రాగానే వీడియో వైరల్ కావడంతో పాటు దీనిపై రాజకీయ రగడ కూడా మొదలవడంతో స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. కేసు విచారణ బాధ్యతను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పగించారు. అనంతరం ప్రతాప్‌గఢ్ వెళ్లి గర్భవతియైన బాధితురాలిని ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. రాజస్థాన్ బిడ్డ చాలా ధైర్యవంతురాలు, ఆమె అవమానకరమైన బాధను గొప్ప తెగువతో భరించింది. ఆమె ఆర్ధిక, సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ఆమెకు రూ.10 లక్షలు ఆర్ధిక సహాయంతో పాటు ఉద్యోగాన్ని కూడా కల్పిస్తున్నామని ప్రకటించారు. ఆమెకు ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపున అందజేస్తామని కూడా తెలిపారు. #WATCH | After meeting the Pratapgarh assault victim, Rajasthan CM Ashok Gehlot says, "In this case, an SIT has been formed. 11 people have been arrested... I spoke to the victim's family and assured them that justice would prevail... I offered her a government job... And we will… pic.twitter.com/rJQ4mFHbXk — ANI (@ANI) September 2, 2023 ఇది కూడా చదవండి: బాలాసోర్ రైలు ప్రమాదానికి అదే కారణం.. చార్జిషీట్లో సీబీఐ -
వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ దళిత కుటుంబంపై దాష్టీకం జరిగింది. వేధింపుల కేసులో రాజీకి రావాలంటూ ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని తల్లిని వివస్త్రని చేశారు. 'నా బిడ్డను విపరీతంగా కొట్టారు. కాపాడుకోలేకపోయా. మా ఇంటిని కూల్చివేశారు. ఇంట్లో వస్తువులన్నీ పాడు చేశారు. అడ్డుగా వెళ్లిన నన్ను వివస్త్రను చేశారు’’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది బాధిత మహిళ. పోలీసులు వచ్చి టవల్ అందించేంతవరకు ఆమె నగ్నంగానే ఉండిపోయారు. తన వేధింపుల కేసులో రాజీకి రావాలని తమ సోదరిపై ఒత్తిడి పెంచారని బాధితురాలి సోదరి తెలిపింది. వేధింపులకు గురిచేస్తున్నారని 2019లో మృతుని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో రాజీకి రావాలని కోరుతూ బాధిత కుటుంబంపై ఓ గుంపు దాడి చేసిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి మరో ఇద్దరు సోదరులను వెతుకుతూ వారి బంధువుల ఇళ్లలో కూడా నిందితులు విధ్వంసం సృష్టించారు. ఇళ్లలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. తమ భర్తలపై దాడి చేసి, పిల్లలను చంపబోయినట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. పోలీసు బలగాలు చేరేవరకు గ్రామంలో అల్లకల్లోలం సృష్టించారని స్థానికులు తెలిపారు. జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి, నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రక్షిస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చాక.. మృతునికి అంత్యక్రియలు జరిపారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా దూమారం రేపింది. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దళితులకు రక్షణ కరువైందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. దళితులపై దాడుల్లో రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. ఘటనపై స్పందించిన ప్రభుత్వం దోషులపై కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పింది. ఇలాంటి దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఎన్నికలు జరనున్న నేపథ్యంలో నేరాలకు రాజకీయ తెరలేపుతోందని ఆరోపించింది. రెండు వర్గాల మధ్య గొడవల తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తాజా ఘటన జరిగిందని మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ రాజకీయంగా ఉపయోగించుకునే కుట్ర పన్నుతోందని అన్నారు. ఇదీ చదవండి: మేకలు, పావురాలు చోరీ?.. దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి.. -
Manipur violence: రేప్ చేసి, రంపాలపై పడేసి...
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటన జరిగిన రోజే అక్కడికి 40కి.మీ. దూరంలో మరో దారుణం జరిగింది. కుకి–జోమి తెగకు చెందిన ఇద్దరు యువతుల్ని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసు స్టేషన్లో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ ద్వారా వెల్లడైంది. బాధిత యువతులు 21, 24 ఏళ్ల వయసున్న వారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని కొనుంగ్ మమాంగ్ ప్రాంతంలో కార్లు వాష్ చేసేవారు. మే 4న వారు కార్లు కడుగుతూ ఉండగా అల్లరిమూక కొందరు అక్కడికి వచ్చి దౌర్జన్యంగా వారిని పక్కనే ఉన్న గదిలోకి లాక్కెళ్లారు. వాళ్లు అరవకుండా నోటికి గుడ్డలు కట్టేసి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసినట్టుగా జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఆ తర్వాత ఆ ఇద్దరు యువతుల్ని దుండగులు పక్కనే ఉన్న రంపం మిల్లులోకి లాగి పడేశారు. రంపాల మీద పడేయడంతో వారు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆ ఇద్దరు యువతుల్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకువెళ్లడం తాము చూశామని వారి స్నేహితులు చెబుతున్నారు. మరణించిన ఇద్దరు యువతుల్లో ఒకరి తల్లి సాయికుల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాదాపుగా 100–200 మంది దుండగులు రాక్షసంగా తమ కుమార్తె, ఆమె స్నేహితురాల్ని అత్యాచారం చేసి, హింసించి చంపేశారని ఆమె అందులో పేర్కొన్నారు. వీడియో ఘటనలో మరో నిందితుడు అరెస్ట్ మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై అమానవీయ ఘటనలో పోలీసులు అయిదో నిందితుడిని అరెస్ట్ చేశారు. 19 ఏళ్ల వయసున్న యువకుడిని అదుపులోనికి తీసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఆ వీడియోలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. మణిపూర్‌లో వెలుగులోకి మరో భయానక ఘటన ఇటీవల మణిపూర్‌లో జరిగిన రెండు వర్గాల ఘర్షణల్లో ఓ స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను కొందరు దుండగులు సజీవదహనం చేశారు. ఆమెను లాక్కెళ్లి ఇంట్లో తాళం వేసి నిప్పంటించారు. దీనిపై పోలీసు కేసు కూడా నమోదైంది. కక్చింగ్ జిల్లాలోని సిరోయూ గ్రామంలో మే 28న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. -
విమానంలో బిత్తిరి చర్య.. బట్టలిప్పి మరీ రచ్చ
న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికులు చేసే తింగరి పనులకు సంబంధించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఎయిర్ ఏషియా విమానంలో చోటు చేసుకుంది. ఇటాలియన్ స్మూచ్ ఇవ్వనందుకు ఓ ప్రయాణికుడు విమానంలో బట్టలిప్పి మరీ రచ్చ చేశాడు. విమాన మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తోన్న ఎయిర్ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ క్రూ వద్దకు వెళ్లి లైఫ్ జాకెట్ ఇవ్వాలంటూ గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత మరి కాసేపటికి క్రూ దగ్గరకి వెళ్లి తనకు ఇటాలియన్ స్మూచ్ కావాలి అని అడిగాడు. వారు లేదని చెప్పడంతో ఆగ్రహించిన సదరు ప్రయాణికుడు తన ల్యాప్‌టాప్ విసిరి కొట్టాడు. తరువాత ఒంటి మీద బట్టలు విప్పుకుని.. ఎయిర్‌హోస్టెస్‌ని పిలిచి.. తనకు దుస్తులు వేయాల్సిందిగా కోరాడు. లేదంటే ముద్దిమ్మని అడిగాడు. సదరు ప్యాసింజర్ బిత్తిరి చర్యలకు మిగతా ప్రయాణికలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక విమానం ల్యాండ్ అవుతుండగా మరోసారి బట్టలిప్పి రచ్చ చేశాడు. సిబ్బంది ఎలాగో కష్టపడి అతడికి దుస్తులు తొడిగి సీట్లో కూర్చొబెట్టాడు. ఆ తర్వాత విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అతడిని అప్పగించారు. విమానంలో తప్పుగా ప్రవర్తించినందుకు గాను అతడి మీద కేసు నమోదు చేశారు. అతడి వింత ప్రవర్తన చూసిన మిగతా ప్రయాణికులు అతడు డ్రగ్స్ తీసుకుని ఉంటాడు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. చదవండి: బాబోయ్.. అసలు ఇంతకాలం నువ్వు ఎలా బతికావ్! -
ఐటీ సిటీలో మహిళపై అరాచకం..
సాక్షి, బెంగళూర్ : మహిళను అత్తింటి వారు దారుణంగా వెంటాడి, అత్యంత క్రూరంగా హింసించిన ఘటన ఐటీ సిటీ బెంగళూర్‌లోని కమ్మనహళ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. మహిళను నడిరోడ్డుపై ఆమె మరిది సహా అతడి కుటుంబ సభ్యులు రాళ్లతో, చెప్పులతో కొట్టడంతో పాటు దుస్తులను లాగి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించడంతో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. తనపై దాడికి తెగబడిన మరిది, అతని కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బాధితురాలు బనస్వాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి భర్త ఈ ఏడాది జనవరిలో మరణించగా ఇద్దరు కుమార్తెలతో కలిసి మరిది ఇతర కుటుంబ సభ్యులతో బనస్‌వాడిలోని మెట్టినింట్లో నివసిస్తోంది. కాగా ఆమె ప్రవర్తనను నిందిస్తూ ఆడపడుచు ప్రమీల ఇటీవల బాధితురాలితో ఘర్షణకు దిగింది. ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటోందని నిందిస్తూ బాధితురాలిని ఇంటి నుంచి వెళ్లాలని ఆమెపై చెప్పులు, రాళ్లు విసిరేసింది. తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్తింటి వారు మరింత రెచ్చిపోయారని బాధితురాలు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ తనపై కత్తితో దాడి చేసేందుకు ప్రమీల దూసుకొచ్చిందని, కొంతసేపటికి ఆమె భర్త సతీష్, కుమార్తె సైతం తనపై దాడి చేశారని, వారు తన దుస్తులు లాగేసి తీవ్రంగా కొట్టారని చెప్పారు. ఈ దృశ్యాలను ఫోన్లో రికార్డు చేసిన తన కుమార్తెను సైతం వారు గాయపరిచారని తెలిపారు. కాగా బాధితురాలి ఫిర్యాదుపై సతీష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డీజిల్ దొంగలించారని ఆరోపిస్తూ..
-
డీజిల్ దొంగలించారని.. బట్టలు విప్పించి..
జబల్పూర్ : డీజిల్ దొంగలించారన్న నెపంలో పనివాళ్లను బట్టలు విప్పించి మరీ చావబాదారు యాజమాని అతని మిత్రుడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాండ్ల జిల్లాకు చెందిన సురేష్ ఠాకూర్, అశిష్ గాండ్, గోలు ఠాకూర్లు జబల్పూర్లోని గుడ్డు శర్మకు ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే జూలై 11 రాత్రిన కంపెనీకి చెందిన 120లీటర్ల డీజిల్ ఆ ముగ్గురు దొంగలించారని ఆరోపిస్తూ.. యాజమాని గుడ్డు శర్మ వారి బట్టలు విప్పించి బేస్‌బాల్ బ్యాట్‌తో చితకబాదాబడు. గుడ్డు శర్మతో పాటు అతని మిత్రుడు శేరు కూడా వారిని తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో విషయం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులు గుడ్డు శర్మ, అతని మిత్రుడు శేరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఎక్కువ తిన్నాడని బట్టలు విప్పించి..
సాక్షి, భోపాల్: దాబాలో పనిచేసే వర్కర్‌పై యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. దాబా యజమాని, అతడి పార్టనర్ ఆ పనివాడి బట్టలు విప్పించి నగ్నంగా నిలబెట్టి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బేతుల్ జిల్లా కేంద్రంలోని స్థానిక దాబాలో ఓ వ్యక్తి పని చేస్తున్నాడు. అయితే మంగళవారం ఆ పనివాడు తాను పనిచేస్తున్న దాబాలో ఆహారం ఎక్కువగా తీసుకున్నాడు. ఇది గమనించిన యజమాని, అతడి వ్యాపార భాగస్వామి వర్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవేశానికి లోనైన ఈ నిందితులు వర్కర్‌ను దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా బలవంతంగా అతడితో బట్టలు విప్పించారు. నగ్నంగా నిలబడి క్షమాపణ చెబుతున్నా బాధితుడి మాట వినకుండా అతడిని దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బేతుల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
సెంట్రల్ వర్సిటీ; యువతుల దుస్తులు విప్పించి..
సాగర్: లేడీస్ హాస్టల్ ఆవరణలో వాడి పారేసిన శానిటరీప్యాడ్‌ను చూసిన వార్డెన్ కోపంతో రగిలిపోయింది. గదుల్లో నుంచి అమ్మాయిలందరినీ పిలిపించి, వరుసగా నిలబెట్టి దుస్తులు విప్పించింది. ఆ శానిటరీ ప్యాడ్ వాడింది ఎవరో చెప్పాలంటూ లోదుస్తులను సైతం పరిశీలించేప్రయత్నం చేసింది. అవమానభారంతో వెక్కివెక్కి ఏడ్చిన విద్యార్థినులు చివరికి వీసికి ఫిర్యాదు చేశారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ పట్టణంలోగల హరిసింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్సిటీ.. స్వాతంత్ర్యానికి పూర్వమే ఏర్పాటైన విద్యాసంస్థల్లో ఒకటి. దీనిని సాగర్ యూనివర్సిటీగా వ్యవహరిస్తారు. వర్సిటీ ఆవరణలోని రాణి లక్ష్మీబాయి హాస్టల్లో 40 మందికిపైగా విద్యార్థినులు ఉంటున్నారు. శనివారం హాస్టల్‌ను తనిఖీచేసిన వార్డెన్.. వాడిపారేసిన శానిటరీ ప్యాడ్ పడిఉండటాన్ని చూసి కోపంతో చిందులేసింది. తన సహాయకురాలితో కలిసి అమ్మాయిలందరినీ తనిఖీచేసింది. ఈక్రమంలోనే విద్యార్థినుల దుస్తులు విప్పించింది. ఆ మరుసటిరోజే విద్యార్థినులంతా కలిసి సదరు వార్డెన్ తీరుపై వీసీకి ఫిర్యాదుచేశారు. తక్షణమే వార్డెన్‌ను, సహాయకురాలిని తొలగించాలని డిమాండ్ చేశారు. పరిశీలిస్తున్నాం: వీసీ తివారీ విద్యార్థినుల ఫిర్యాదు అందిందని, జరిగిన సంఘటనకు సంబంధించి నిజానిజాలను పరిశీలిస్తున్నామని, ఎవరు తప్పు చేసినట్లు తేలినా తీవ్ర చర్యలు తీసుకుంటామని సాగర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆర్పీ తివారీ మీడియాతో అన్నారు. కాగా, జరిగిన అవమానకర ఘటన గురించి మీడియాతో మాట్లాడేందుకు విద్యార్థినులు విముఖత ప్రదర్శించారు. దీనిపై ఇప్పటివరకు పోలీసు కేసు నమోదు కాలేదు. -
వైరల్:మైనర్లను దారుణంగా వేధించారు
-
నగ్నంగా 2 కిమీ నడిపించి..
జైపూర్ : రాజస్ధాన్‌లో దారుణం చోటుచేసుకుంది. పొలంలో పనిచేసేందుకు నిరాకరించినందుకు మైనర్లను కొందరు దుస్తులు విప్పి నగ్నంగా రెండు కిలోమీటర్లు నడిపించిన ఘటన వెలుగుచూసింది. బికనీర్‌కు సమీపంలోని మోతావ్తా గ్రామంలో అందరు చూస్తుండగా మైనర్లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ దారుణానికి పాల్పడిన వారు ఘటనను వీడియో తీసినట్టు పోలీసులు తెలిపారు. పొరుగునే ఉన్న పొద్దుతిరుగుడు పంట సాగుకు సహకరించేందుకు నిరాకరించామని తమను కొందరు దారుణంగా కొట్టారని, బట్టలు లేకుండా రెండు కిలోమీటర్లు పైగా నడిపించారని బాధిత బాలుడు చెప్పాడు. ముగ్గురు బాలురను గణేష్ సింగ్ అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి పొలం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గ్రామం వరకూ నగ్నంగా నడిపించాడని పోలీసులు తెలిపారు. బాలురను వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా, పొలంలో పనిచేసేందుకు నిరాకరించినందుకు మైనర్లను దారుణంగా వేధించారని పోలీసులు చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
మహిళను వివస్త్రను చేసి, రాళ్లతో కొట్టి..
సాక్షి, కుప్పం : రాష్ట్రంలో మహిళలపై తెలుగుదేశం నేతల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. ఇటీవల విశాఖ జిల్లా పెందుర్తిలో భూకబ్జాను అడ్డుకున్నందుకు ఓ మహిళను వివస్త్రను హింసించిన ఘటన మరువక ముందే మరోసారి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అలాంటి కీచకపర్వం పునరావృతమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులైన భార్యాభర్తలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందినవారు దాడి చేశారు. మహిళను వివస్త్రను చేసి కిరాతకంగా ప్రవర్తించారు. ఈ దారుణ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుంజార్లపల్లికి చెందిన భార్యాభర్తలకు అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితో కొంతకాలంగా గొడవలున్నాయి. ఇదే విషయాన్ని ఉమ దంపతులు ఇటీవలి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. అయితే ఆ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిందంటూ ఆ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం...ఉమ దంపతులు పక్కింట్లోని అవ్వ దగ్గరకు వెళ్తుండగా వారిని చూసిన భాగ్యలక్ష్మి ఉమ్మివేసింది. ఎందుకు ఉమ్మావంటూ ఆ దంపతులు ప్రశ్నించడం నేరమయ్యింది. రెచ్చిపోయిన భాగ్యలక్ష్మి తన బంధువులతో కలసి వారిపై దాడికి తెగబడింది. అంతే కాకుండా జన్మభూమి కార్యక్రమంలో తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ ఉగిపోతూ... ఉమను వీధిలోకి లాక్కొచ్చి అందరి ముందే వివస్త్రను చేశారు. రాళ్లతో తీవ్రంగా కొట్టారు. నోటితో కొరికి దారుణంగా గాయపరిచారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భర్తను కూడా చితకబాదారు. స్థానికులు తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. స్థానిక టీడీపీ నేతల అండదండలతోనే భాగ్యలక్ష్మి ఈ దారుణానికి ఒడిగట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు. బాధితుడు తమపై జరిగిన దాడి గురించి రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మరోవైపు ఈ దారుణ ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాసిల్దార్ వనజాక్షిపై దాడి, కాల్‌మనీ సెక్స్ రాకెట్, విశాఖ జిల్లాలో దళిత మహిళపై దాడి ఘటనలు సిగ్గుచేటు అని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ...చంద్రబాబుకు బౌన్సర్లుగా మారారన్నారు. ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. -
అలా అన్నందుకు వివస్త్రను చేశారు
సాక్షి, పట్నా : చదువుకుంటా అన్న యువతిపై గ్రామస్తులు రాక్షసత్వం ప్రదర్శించారు. సభ్యసమాజం తలదించుకునేలా.. యువతి వివస్త్రను చేసి దారుణంగా కొట్టి హింసించారు. మానవత్వానికి మాయని మచ్చలాంటి ఈ ఘటన బీహార్‌లోని దర్భంగా పరిధిలోని బైరోలి గ్రామంలో జరిగింది. గ్రామస్తుల బెదిరింపులు లెక్క చేయకుండా తల్లిదండ్రుల అండతో దర్భంగాలోని ఒక యువతి బీఏ సెకెండ్ ఇయర్ చదువుతోంది. ఇది నచ్చని గ్రామస్తులు ఆ ఆమ్మాయిని పట్టపగలు గ్రామం నడిమధ్యలో వివస్త్రను చేసి లైంగికంగా వేధించి.. కర్రలతో కొట్టి మరీ హింసించారు. గ్రామం మధ్యలో ఇంతటి దారుణం జరుగుతున్నా.. ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. యువతి తండ్రి తన కుమార్తెకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి.. గ్రామస్తుల చేతిలో చావుదెబ్బలు తిన్నారు. యువతి ఉన్నత చదువులు చదువడం ఇష్టంలేని గ్రామస్తులు ఇటువంటి నీచకృత్యానికి ఒడిగట్టారు. తమకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళితే.. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోలేదని బాధిత యువతి తండ్రి తెలిపారు. చివరకు బాధితులు స్థానిక ఎస్ఎస్పీ సత్యవీర్ సింగ్‌ని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించినట్లు ఆయన తెలిపారు. నిందితులపై సత్యవీర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు.. ఘటనకు ప్రధాన కారకులైన 13 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. -
అరగుండు, చెప్పులదండ, నగ్నంగా..
ముంబై: ఆకలేసి తప్పు చేసిన ఇద్దరు మైనర్ బాలురు పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ముంబైలోని ఉల్హస్ నగర్లో శనివారం ఉదయం ఈ ఉందంతం చోటు చేసుకుంది. స్థానిక షాపులోంచి తినుబండారాలను దొంగిలించిన ఇద్దరు మైనర్ బాలుళ్ల పట్ల ఆ షాపు షాపు యజమాని అవమానకరంగా, నిర్దయగా ప్రవర్తించారు. బాలుర మెడలో చెప్పుల దండ వేసి, నగ్నంగా ఊరేగించారు. పొలీసులు అందించిన సమాచారం ప్రకారం 8,9 సం.రాల ఇద్దరు అబ్బాయిలు మెహమూద్ పఠాన్ (62) దుకాణంలోని చక్కిలాల ప్యాకెట్‌ను దొంగిలించారు. ఇది గమనించిన పఠాన్, అతని ఇద్దరుకు కొడుకులు ఇర్ఫాన్ (25), సలీ(20) వీళ్లపై విరుచుకుపడ్డారు. తీవ్రంగా కొట్టారు. అనంతరం అరగుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి, వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇంత జరుగుతున్నా ఆ పిల్లల్ని కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ దృశ్యాలను స్థానినికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. బాధితుల తల్లదండ్రుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఉల్హస్ నగర్, హిల్ లైన్ పోలీసు స్టేషన్, సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నిందితులను కోర్టుముందు హాజరు పర్చి, సోమవారం వరకు రిమాండ్ చేసినట్టు చెప్పారు. -
ఇంజనీరింగ్ విద్యార్థుల దారుణ హత్య
ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఇద్దరు ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా కొట్టి చంపారు. లోనావాలా, ఐఎన్ఎస్ శివాజీ సమీపంలోని కొండ మీద నగ్నంగా పడివున్న రెండు మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. సింగద్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న మరో విద్యార్థినిగా వీరిని గుర్తించారు. ఈ జంటల హత్య ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. అహ్మద్‌నగర్ కు చెందిన విద్యార్థి( 22), పుణేకు చెందిన అతని స్నేహితురాలు అనూహ్యంగా శవాలై తేలారు. చేతులను వెనక్కి కట్టివేసి, తలపై పదునైన ఆయుధంతో బలంగా మోదడంతో చనిపోయి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో బాధితుని బైక్‌తో పాటు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా బాధితులను గుర్తించిన పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మరోవైపు హత్యకు గరైన యువతికి ఇప్పటికే ఉద్యోగం వచ్చిందని కోర్సు పూర్తయిన తర్వాత జాబ్‌లో చేరేందుకు యోచిస్తున్నట్లు కళాశాల అధికారులు చెప్పారు. అలాగే హాస్టల్ నుంచి తన స్నేహితునితో కలసి బయటికి వెళుతున్నానని, ఆలస్యంగా వస్తానంటూ సన్నిహితులతో చెప్పి వెళ్లిందని తెలిపారు. -
దుస్తులు విప్పించి కొడుతున్నాడు.. కాపాడండి
న్యూఢిల్లీ: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న భారతీయులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. యజమానుల చేతిలో చిత్రహింసలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు ఒకటి వెలుగుచూసింది. ఉపాధి కోసం ఖతర్‌కు వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులను దారుణంగా హింసించారు. పైఅధికారి ఒకరు వీళ్ల లోదుస్తులు విప్పించి, గుర్రం పగ్గం తీసుకుని రక్తం వచ్చేలా విచక్షణరహితంగా కొట్టాడు. వాళ్ల చేతులు, కాళ్లు, తొడలు, వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తమకు తగిలిన గాయాలను వీడియో తీసి పంపారు. తాము ఆపదలో ఉన్నామని ఆదుకోవాల్సిందిగా విన్నవించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పర్వేజ్ అహ్మద్ (24), మహ్మద్ అక్రమ్ (27) నాలుగు నెలల క్రితం పుణెకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా ఖతర్ వెళ్లారు. పర్వేజ్ ఐదేళ్ల కాలపరిమితిపై డ్రైవర్‌గా పనిచేసేందుకు వర్క్ వీసాపై వెళ్లాడు. కాగా వీరిద్దరినీ సౌదీ అరేబియా-ఖతర్ సరిహద్దున ఉన్న ఓ ఫామ్‌కు తీసుకెళ్లి మేకలు, ఒంటెల సంరక్షణ బాధ్యత అప్పగించారు. అక్కడ పనిచేస్తున్న ఓ అధికారి తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పర్వేజ్ వీడియోలో తెలిపాడు. ఇక్కడ నరకం అనుభవిస్తున్నామని, ఇక్కడ పనిచేయడం కంటే జైల్లో ఉండటం మేలని వాపోయాడు. పర్వేజ్ ఢిల్లీలో ఉన్న తన స్నేహితుడు అఫ్తామ్ ఆలంకు ఈ విషయాలు తెలిపాడు. గాయాలతో ఉన్న పర్వేజ్, అక్రమ్ ఫొటోలను ఆలంకు పంపాడు. తాము సాయం కోరామని తెలిస్తే ఆ అధికారి తమను వేరే ప్రాంతానికి పంపించే అవకాశముందని, తమను తప్పుడు కేసులో ఇరికించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమను కాపాడాలని పర్వేజ్ విన్నవించాడు. -
దేశ రాజధానిలో దారుణం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. పీకలదాకా మద్యం సేవించిన దుండగులు 16 ఏళ్ల బాలుడి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఢిల్లీలోని ఇందరపురిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మద్యం మత్తులో బాలుడి బట్టలు విప్పించి దారుణంగా కొట్టారని డీసీపీ(నైరుతి) సురేందర్ కుమార్ తెలిపారు. అకారణంగా కొట్టినందుకు నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. అయితే బాధితుడిపై ఎటువంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని వైద్య పరీక్షల్లో తేలినట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బాలుడి కాళ్లుచేతులు కట్టేసి కొట్టినట్టు వీడియోలో కనబడుతోంది. అతడు కొట్టొద్దని వేడుకుంటున్నా వినకుండా హింసించారు. ఈ వీడియోను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే బాలుడిపై లైంగిక దాడి జరిగిందని అతడి బంధువులు ఆరోపించారని, ఈ అవమానం తట్టుకోలేక అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. -
పిల్లలపై దాడి, నగ్నంగా ఊరేగింపు
జైపూర్ : రాజస్థాన్ లో ముగ్గురు దళిత బాలురను నగ్నంగా ఊరేగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోటార్ సైకిల్ దొంగిలించాడనే ఆరోపణలతో వీరిపై అగ్రకులానికి చెందిన వ్యక్తులు తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. చిత్తోర్ ఘడ్ లోని బస్సీ గ్రామంలో ఈ భయంకరమైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. మరోవైపు నిందితులపై ఎలాంటి చర్య చేపట్టని పోలీసులు, బాధితులపై కేసు నమోదు చేసి, జువైనల్ హోంకు తరలించడం వివాదాన్ని రేపింది. వివరాల్లోకి వెళితే అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారని ఆరోపిస్తూ ముగ్గురు పిల్లలను మండుటెండలో ఓ చెట్టుకు కట్టేసి, విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో వారి ప్రకోపం చల్లారలేదు. 42 డిగ్రీల ఎండలో నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. బాధతో బాధితులు హాహాకారాలు చేసినా, వదిలిపెట్టమని వేడుకున్నా కనికరించలేదు. వారి ఆగడాలతో చుట్టూ ఉన్న ప్రజలు కూడా ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. సుమారు గంటసేపు ఈ తతంగం నడిచింది. ఒక గంట తర్వాత వచ్చిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...పిల్లలను విడిపించి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బైక్ దొంగతనం కేసులో బాలురను అరెస్టు చేశారు. విచారణ సమయంలో బైక్ దొంగిలించినట్టుగా అంగీకరించారని, బైక్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారి గజ్ సింగ్ తెలిపారు. అటు దాడి ఘటనలో అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
చేతులు కట్టేసి..నగ్నంగా ఊరేగించిన వీడియో
బ్యూనస్ ఎయిర్స్: అభంశుభంతెలియని పాపపై అత్యాచారానికి ప్రయత్నించిన ఓ దుర్మార్గుడికి స్థానికులు బుద్ధి చెప్పిన వైనం నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఎనిమిదిళ్లేపాపపై అఘాయిత్యానికి యత్నించిన ప్రబుద్ధుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు అతడిని ఉతికి ఆరేసారు. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతుంది. అర్జెంటీనా బ్యూన్ స్ ఎయిర్స్ లోని శాంతా బ్రిగేడ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బాలికపై లైంగిక దాడి చేస్తూ స్థానికులకు పట్టుబడ్డాడు. అతని ప్రవర్తన తీరును పసిగట్టిన కొంతమంది తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చెతులువెనక్కి కట్టేసి.. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇంకోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే చంపేస్తామంటూ మండిపడ్డారు. వీరికి కొంతమంది మహిళలు కూడా తోడయ్యారు. చంపేయండి.. చితక్కొట్టండి.. కారుకు కట్టి ఈడ్చుకుపోండంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. -
బెంగళూరు ఘటనలో ఐదుగురి అరెస్ట్
బెంగళూరు: టాంజానియా యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి భౌతిక దాడికి పాల్పడిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం హెసరగట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి కారణమైన కారులో కూర్చున్న టాంజానియా యువతిపై స్థానికులు అవమానకరరీతిలో దాడి చేశారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాంజానియా హై కమిషనర్ జాన్ కిజాజీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు. టాంజానియా యువతిపై దాడి చేయడాన్ని అవమానకర ఘటనగా విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ పేర్కొన్నారు. ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు.