
సాక్షి, భోపాల్: దాబాలో పనిచేసే వర్కర్‌పై యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. దాబా యజమాని, అతడి పార్టనర్ ఆ పనివాడి బట్టలు విప్పించి నగ్నంగా నిలబెట్టి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. బేతుల్ జిల్లా కేంద్రంలోని స్థానిక దాబాలో ఓ వ్యక్తి పని చేస్తున్నాడు. అయితే మంగళవారం ఆ పనివాడు తాను పనిచేస్తున్న దాబాలో ఆహారం ఎక్కువగా తీసుకున్నాడు. ఇది గమనించిన యజమాని, అతడి వ్యాపార భాగస్వామి వర్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవేశానికి లోనైన ఈ నిందితులు వర్కర్‌ను దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా బలవంతంగా అతడితో బట్టలు విప్పించారు. నగ్నంగా నిలబడి క్షమాపణ చెబుతున్నా బాధితుడి మాట వినకుండా అతడిని దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బేతుల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.