dhaba
-
YSRCP నేతకు చెందిన డాబా హౌస్ కూల్చివేత
-
కుక్కల కోసం ప్రత్యేక రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?
శునకాలు మనుషుల జీవితాల్లో భాగమైపోయాయి. చాలా ఇళ్లలో అవి కూడా సభ్యులుగా ఉంటున్నాయి. వివిధ రకాల జాతుల శునకాలను వేలు.. లక్షల రూపాయలు పెట్టి మరీ కొని ప్రేమగా పెంచుకుంటున్నారు. వాటి పోషణ, సంరక్షణ కోసం ఎంత ఖర్చయినా వెనకాడటం లేదు డాగ్ లవర్స్. ఈ క్రమంలోనే కుక్కల కోసం ప్రత్యేకమైన స్పాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటవుతున్నాయి. డాగ్ లవర్స్ తమ పెంపుడు శునకాలను తమతో పాటు హోటళ్లకు, రెస్టారెంట్లకు తీసుకెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అయితే వాటికి అక్కడ అనువైన వాతావరణం ఉండదు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శునకాల కోసమే ప్రత్యేకంగా ‘డాగీ దాబా’ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఇక్కడ కుక్కల కోసం చాలా రకాల వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాలు లభిస్తాయి. రూ.7 నుంచి రూ.500 వరకు శునకాలకు ఇష్టమైన ఆహారం అందిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ కుక్కల పుట్టినరోజులను జరుపుకోవచ్చు. ఇందు కోసం ప్రత్యేకమైన కేక్‌లు ఇక్కడ తయారు చేస్తున్నారు. కుక్కలు ఆడుకునేందుకు, విహారం చేసేందుకు అనువైన ఏర్పాట్లు సైతం చేశారు. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) బాలరాజ్ ఝాలా అనే వ్యక్తి అతని భార్య కలిసి ఈ డాగీ దాబాను ఏర్పాటు చేశారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో తమకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన చెప్పారు. తాను హోటల్లో పనిచేస్తున్న సమయంలో రోజూ ఇంటికి వెళ్లేటప్పుడు కుక్కలకు ఆహారం వేసేవాడినని, ఈ సమయంలోనే కుక్కలకు మంచి ఆహారం అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్లు బాలరాజ్ వివరించారు. -
షాకింగ్ ఘటన: దాబాలోని ఫ్రీజర్‌లో 25 ఏళ్ల యువతి మృతదేహం కలకలం
ఢిల్లీలోని దాబా వద్ద ఫ్రీజర్‌లో 25 ఏళ్ల యువతి మృతదేహం తీవ్ర కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. బాధితురాలు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నివాసిగా గుర్తించారు. దర్యాప్తులో దాబా యజమానిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు . విచారణలో అసలు విషయం తెలిసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దర్యాప్తులో..దాబా యజమాని గహ్లోత్ ఆ బాధిత మహిళ రిలేషన్షిప్లో ఉన్నారు. ఐతే గహ్లోత్ మరో మహిళను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు గహ్లోత్‌ని నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య ఈ విషయమై తీవ్ర వాగ్వాదం తలెత్తింది. తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది సదరు మహిళ. దీంతో కోపోద్రిక్తుడైన గహ్లోత్ ఆమెను హత్య చేసి మృతదేహాన్ని దాబాలోని ఫ్రీజర్‌లో దాచాడు. ఆ మహిళ రెండు, మూడు రోజుల క్రితమే హత్యకు గురైందని చెప్పారు. ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: పార్లమెంట్లో ఒక ప్రధాని ఇలా అంగీకరించడం ప్రపథమం! కంటతడి పెట్టిన స్టాలిన్) -
షాకింగ్ ప్రమాదం: జనాల మీదకు దూసుకొచ్చిన టెంపో, ఆపై..
-
షాకింగ్ ఘటన:రెస్టారెంట్లోకి దూసుకొచ్చిన టెంపో..ముగ్గురికి గాయాలు
గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఒక టెంపో హైవేకి సమీపంలో ఉన్న ధాబా (రోడ్డు సైడ్ రెస్టారెంట్)లోకి దూసుకొచ్చింది. సరిగ్గా ఆ సమయంలో రెస్టారెంట్లో సుమారు 8 నుంచి 10 మంది దాక కస్టమర్లు ఉన్నారు. ఈ అనుహ్య ఘటనలో ముగ్గరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ టెంపో అదుపు తప్పి వేగంగా ధాభాలోకి దూసుకురావడంతో రెస్టారెంట్‌లోని గోడను ఢీకొట్టి ఫర్నీచర్‌ని ధ్వంసం చేస్తూ..పలువురు పైకి దూసుకుపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అవ్వడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే ఆ సమయంలో టెంపో ఖాళీగానే ఉందని డ్రైవర్ మాత్రం తప్పించుకున్నాడని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. સરોલીમાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે. સરોલીમાં આવેલ બાપા ના બગીચા નામના ઢાભામાં બુલેરો પિકઅપ વાન ઘુસી જતા 3 લોકો કચડાયા@CP_SuratCity @TrPoliceSurat #ACCIDENT #suratcity #Surat pic.twitter.com/dumHqOW9OW — journalist Sharif Shaikh (@PatrkarShaikh) December 19, 2022 (చదవండి: గుంజీలు తీయండి..ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందండి) -
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. పాచిపోయిన బిర్యానీ, అన్నంలో ఈగలు
సాక్షి, వికారాబాద్: పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధుల భయం కనిపిస్తోంది. ఈ సమయంలో కల్తీ ఆహారం తీసుకున్నా, నాణ్యతా ప్రమాణాలు పాటించని చిరుతిండ్లు తిన్నా రోగాల బారిన పడక తప్పదు. జిల్లాలో అనేక హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాబాలు వెలిశాయి. పలు చోట్ల నాసిరకం, కల్తీ పదార్థాలు, సరుకులతో వంటలు చేస్తున్నారు. దీంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. హోటళ్లు, దాబాలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లకు.. కిరాణా షాపుల యజమానులు నాణ్యత లేని పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సదరు దుకాణాలపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. జిల్లాలో పూర్తి స్థాయి ఫుడ్ ఇన్స్పెక్టర్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సంబంధిత కార్యాలయంలోనూ సరిపడా సిబ్బంది లేక సమా ధానం చెప్పే వారు కరువయ్యారు. జిల్లాలో ఇన్చార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అధికారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో హోటళ్లు, దాబాలు, టిఫిన్ బండ్ల నిర్వాహకులు ఆడిందే ఆట పాట అనేలా వ్యాపారం సాగిస్తున్నారు. అనుమతులు లేకుండానే జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటిలో తయారు చేసే భోజన సామగ్రి, నూనె నాణ్యత విషయాలు ఎవరికీ తెలియట్లేదు. తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులతో వంటకాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. చాలా హోటళ్లకు కనీసం మున్సిపల్, గ్రామ పంచాయతీల అనుమతి కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు పెద్దగా పంటించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు కల్తీ వస్తువులతో హోటళ్లు నడిపిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. పాచిపోయిన బిర్యానీ వికారాబాద్‌లోని పలు బిర్యానీ సెంటర్లలో పాచి పోయిన బిర్యానీ విక్రయిస్తున్నారే ఆరోపణలున్నాయి. రెండు మూడు రోజుల పాటు చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి బిర్యానీ చేసి అమ్ముతున్నారు. ఎన్టీఆర్ చౌరస్తాలోని ఓ బిర్యానీ సెంటర్లో తీసుకున్న అన్నంలో ఇటీవల పురుగులు వచ్చాయి. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు కొద్దిసేపు నిర్వాహకులతో గొడవపడి వెళ్లిపోయారు. న్యూ గంజ్‌లోని మరో బిర్యానీ సెంటర్లో వారం రోజుల క్రితం అన్నంలో ఈగలు దర్శనమిచ్చాయి. ఇదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా, ఇదే బిర్యానీని మిగతా వారికి వడ్డించడం గమనార్హం. మరో హోటల్ నుంచి తీసుకువెళ్లిన ఇడ్లీ సాంబారులో బొద్దింక వచ్చిందని బాధితులు తెలిపారు. ఇలా ప్రతీ హోటల్లో నాసిరకం ఆహారం అమ్ముతున్నారనే ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ తాళమే.. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఫుడ్ సేఫ్టీ జిల్లా కార్యాలయం ఉంది. ఎప్పుడు చూసినా ఇది తాళం వేసే కనిపిస్తోంది. జిల్లా ఏర్పడ్డ తర్వాత గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారి పోస్టులు కేటాయించారు. జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉండాలి. కానీ ఈ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్కు వికారాబాద్ ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కచోట కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. హోటళ్లు, బేకరీలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాల షాపులను తనిఖీ చేయాల్సి ఉన్నా అధికారుల జాడ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో నాణ్యత లేని సరుకులు, ఇతర ఆహార పదార్థాలు జోరుగా విక్రయిస్తుండటంతో వాటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జిల్లాలో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. -
వైరల్ వీడియో: తందూరి కాదు ‘ఉమ్మి’ రోటీ
లక్నో: సాధారణంగా బయట ఆహారం తీసుకోవాడానికి చాలామంది ఇష్టపడరు. ఎలాంటి పదార్థాలు వాడతారో తెలియదు.. వంట చేసేవాళ్లు.. అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంటాయో లేదో తెలియదు. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ భయం మరింత పెరిగింది. పైగా అప్పుడప్పుడు కొందరు నికృష్టపు పనులు చేస్తూ ఉంటారు. గతంలో పానీపూరీ బండి వ్యక్తి ఎలాంటి నీచమైన పని చేశాడో చూశాం కదా. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. తందూరి రోటీలు చేస్తున్న వ్యక్తి వాటి మీద ఉమ్మి.. ఆ తర్వాత కాలుస్తున్నాడు. ఆ వివరాలు.. ఈ సంఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ధాబాలో ఓ వ్యక్తి తందూరి రోటీలు తయారు చేస్తుంటాడు. రోటీ తయారు చేసేటప్పుడు సాధారణంగా నూనె, నీరు వాడతారు. కానీ ఇతగాడు మాత్రం వాటి మీద ఉమ్మి.. ఆ తర్వాత రోటీ చేసి.. వాటిని కాలుస్తాడు. (చదవండి: వైరల్: అరెరే.. పాక్కుంటూ వెళ్లినా, అడ్డంగా బుక్కయ్యావ్ కదా!) ఇలా ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ.. కొన్ని రోజుల క్రితం ధాబాకు వచ్చిన ఓ వ్యక్తి.. సదరు వ్యక్తి చేస్తున్న దారుణాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఇది కాస్త వైరల్‌గా మారడమే కాక సదరు ధాబా మీద కేసు నమోదయ్యింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్..? गाजियाबाद के एक चिकन पॉइंट का वीडियो सामने आया है, जिसमें एक शख्स थूक लगाकर रोटी बनाता दिख रहा है. pic.twitter.com/utDi9Jh9F8 — Anubhav Veer Shakya (@AnubhavVeer) October 17, 2021 -
చపాతి గొడవ.. కస్టమర్ ప్రాణం తీసిన కుక్
సంభాల్: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చేటు చేసుకుంది. దాబాలో పనిచేసే ఓ కుక్.. కస్టమర్‌పై దాడి చేసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఖెంపాల్ అనే ట్రాన్స్పోర్టర్ సంభాల్‌లోని తన షాప్‌కు సమీపంలో ఉండే ఓ దాబాలో భోజనం అర్డర్ చేశాడు. అర్డర్ చేసిన భోజనాన్ని దాబా బేరర్ ఖెంపాల్కు ఇచ్చాడు. అయితే భోజనం ఎలా ఉందో తెలుసుకోవాలని ఖెంపాల్ ఫుడ్ తెరిచి చూశాడు. అందులో చపాతిలు సగం కాలినట్లు మాడిపోయి కనించాయి. దీంతో ఖెంపాల్ వాటిని చేసిన కుక్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత ఖెంపాల్ అక్కడి నుంచి తన షాప్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే ఆగ్రహంతో ఉన్న అనిల్.. ఖెంపాల్ షాప్ వద్దకు వెళ్లి అతనిపై దారుణంగా దాడి చేశాడు. దీంతో ఖెంపాల్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. స్థానిక ఎస్పీ చక్రేశ్ మిశ్రా మాట్లాడుతూ.. రాత్రి సమయంలో కుక్ అనిల్.. ఖెంపాల్ షాప్ వద్దకు వెళ్లి కర్రతో దాడి చేయడంతో అతను మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించామని పేర్కొన్నారు. నిందితుడు అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
వైరల్ వీడియో: సోనూసూద్ తందూరి రోటీలు, తింటే మర్చిపోలేరు!
ముంబై: కరోనా కష్టకాలంలో మొదలైన సోనూసూద్ దాతృత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని వేల మందిని తమ సమస్యల నుంచి ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా అడిగిన వారికి లేదు, కాదు అనకుండా తనకు తోచిన సాయాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా పలు వ్యాపారాలు కూడా మెదలు పెట్టాడు. అయితే ఈవేవి తన సొంత లాభం కోసం కాదు. కేవలం చిరు వ్యాపారులకు మద్దతివ్వడం కోసం నెట్టింట్లో చురుకుగా ప్రచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల సోనూసూద్ సూపర్ మార్కెట్ అని ఒకటి ఓపెన్ చేసి సైకిల్‌పై గుడ్లు, బ్రెండ్ వంటివి అమ్మాడు. దీనికి డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉందని, ఇందుకు ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందని, త్వరగా ఆర్డర్ చెయ్యాలని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. అలాంటి సోనూ కాగా తాజాగా పంజాబీ ధాబా ఓపెన్ చేసి అందులో స్వయంగా తందూరి రోటీలు చేసి అమ్ముతున్నాడు. సోనూ చేసిన రోటీలు తింటే మర్చిపోలేరని, ఒకసారి ఇక్కడ రోటీలు తిన్నవారు ఇక మళ్ళీ ఇంకెక్కడా తినలేరని కామెంట్‌ను జత చేసి ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే చిరు వ్యాపారులను ప్రొత్సహించేందుకు సోనూసూద్ ఇలా వారికి ఉచితంగా ప్రచారం చేస్తున్నాడు. సరసమైన ధరలకు ఇక్కడ పప్పు, రొట్టెలు లభించును అని క్యాషన్ పెట్టిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తుంది. కాగా చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని, వారు దేశానికి వెన్నుముకవంటి వారని సోనూసూద్ తెలిపాడు. చిన్న వ్యాపారాలు తమ రోజువారీ జీవనోపాధిని కొనసాగించలేకపోతున్నారని, వారిని ప్రోత్సహించే దిశగా తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
అయ్యో.. మళ్లీ రోడ్డు పక్కకే... ‘బాబా కా దాబా’
న్యూఢిల్లీ: ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతులు కాంతాప్రసాద్, ఆయన భార్య బాదామీ దేవి గుర్తున్నారా? వారి కథ మళ్లీ మొదటికొచ్చింది. కరోనా ధాటికి మళ్లీ దక్షిణ ఢిల్లీలోని మాలవ్యా నగర్లో రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుకుంటున్నారు. చాలీచాలని ఆదాయంతో బతుకీడుస్తున్నారు. రూ.5 లక్షల పెట్టుబడితో వారు గతేడాది ప్రారంభించిన రెస్టారెంట్ ఆరు నెలలు బాగానే నడిచింది. క్రమంగా వినియోగదారుల ఆదరణ పడిపోయింది. నష్టాలు వస్తుండడంతో చేసేది లేక ఈ ఏడాది ఫిబ్రవరిలో మూసేశారు. ఇప్పుడు మళ్లీ పాత హోటలే కొనసాగిస్తున్నారు. కరోనా వల్ల ఆదాయం లేక కన్నీటి పర్యంతం అవుతున్న బాబా కా దాబా దంపతుల వ్యథను యూ ట్యూబర్ గౌరవ్ వాసన్ గత ఏడాది సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. బాబాకా దాబాకు జనం పోటెత్తారు. రాత్రే సక్సెస్ఫుల్ దాబాగా మారింది. మానవతావాదులు అందించిన ఆర్థిక సాయంతో కాంతాప్రసాద్ దంపతులు తమ అప్పులన్నీ తీర్చేశారు. రూ.5 లక్షల దాకా పోగుచేశారు. ఈ డబ్బుతో అద్దె స్థలంలో రెస్టారెంట్ ప్రారంభించారు. ఆరు నెలలపాటు సక్రమంగా నడిచి ఫిబ్రవరిలో మూతపడింది. రెస్టారెంట్‌తో నష్టాలే మిగిలాయి లాక్డౌన్ కంటే ముందు నిత్యం రూ.3,500 దాకా అమ్మకాలు జరిగేవని, ఇప్పుడు కనీసం రూ.1,000 రావడం లేదని కాంతాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబంలో 8 మంది ఉన్నామని, ఈ ఆదాయంతో ఎలా బతకాలని వాపోయాడు. రెస్టారెంట్ ప్రారంభిస్తే నష్టాలే మిగిలాయన్నాడు. ముగ్గురిని పనిలో పెట్టుకున్నానని, నెలవారీ ఆదాయం ఎప్పుడూ రూ.40 వేలు దాటలేదన్నాడు. కొందరి తప్పుడు సలహా వల్లే రెస్టారెంట్ మొదలుపెట్టానని తెలిపాడు. అప్పట్లో వైరల్ అయిన 'బాబా కా దాబా' వీడియో చదవండి: బాబా కా ధాబా : యుట్యూబర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు -
పీకలదాక మెక్కారు.. బిల్లు కట్టమంటే తప్పుడు కేసులు
లక్నో: కొన్ని పాత సినిమాల్లో పోలీసులు హోటల్‌కు వెళ్లడం.. బాగా తినడం.. బిల్లు కట్టమంటే.. ‘నా దగ్గరే డబ్బులడుగుతావా.. జైలుకెళ్తావా ఏంటి’ అంటూ బెదిరించే సీన్లు చాలా సార్లు చూశాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన వెలుగు చూసింది. బిల్లు కట్టమని అడిగిన పాపానికి ఓ ధాబా ఓనర్, అతడి కుటుంబ సభ్యుల మీద డ్రగ్స్, మద్యం అక్రమ రవాణ చేస్తున్నారంటూ కేసులు పెట్టారు పోలీసులు. విషయం కాస్త పెద్దది కావడంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఇందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేశారు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ ఈటా జిల్లాలో బాధితుడు ఓ ధాబా నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 4న మధ్యాహ్నం ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ బాధితుడి ధాబాకు వచ్చి భోజనం చేశారు. 400 రూపాయల బిల్లు అయితే వారు కేవలం 100 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం.. పూర్తి బిల్లు చెల్లించమని కోరితే.. ధాబా సిబ్బందిని తిడుతూ.. మీ అంతు చూస్తాం అని బెదిరించారు. ఈ ఘటన జరిగిన 40 రోజుల తర్వాత పోలీసులు రెండు జీపుల్లో ఆ ధాబా వద్దకు వచ్చి.. అక్కడ పని చేస్తున్న 9 మందిని జైలుకు తీసుకెళ్లారు. వీరంతా మద్యం, గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని.. అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు. అంతేకాక నిందితుల వద్ద నుంచి ఆరు దేశీ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. (ఫోటో కర్టెసీ: ఎన్డీటీవీ) ఈ క్రమంలో సదరు ధాబా ఓనర్ మాట్లాడుతూ.. ‘‘గతంలో బిల్లు కట్టమని అడిగినందుకు అధికారులు మాపై కక్ష్య కట్టారు. కావాలనే మా మీద అక్రమ కేసులు పెట్టారు. తాగి వచ్చి నా సోదరుడు, సిబ్బందిపై దాడి చేశారు. మా దగ్గర తుపాకులు, గంజాయి దొరికిందని ప్రచారం చేస్తున్నారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. ఒక్కరిని విడిచిపెట్టారు’’ అని తెలిపారు. ఈ వివాదం కాస్త ముదరడంతో జిల్లా ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ని సస్పెండ్ చేశారు. విచారణకు ఆదేశించాము అని తెలిపారు. చదవండి: సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో -
చికెన్ లేదన్నాడని ఎంత పని చేశారు..
సాక్షి, ముంబై : తినడానికి చికెన్ అడిగితే ఓ డాబా యజమాని లేదన్నాడన్న కోపంతో డాబాను తగులబెట్టారు ఇద్దరు తాగుబోతులు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శంకర్ తైదే, సాగర్ పాటెల్‌లు ఆదివారం రాత్రి ఒంటి గంట సమయంలో నాగ్‌పూర్, బెల్‌ట్రోడీలోని ఓ డాబాకు వెళ్లారు. చికెన్ ఆర్డర్ చేశారు. ( కిడ్నాప్ కేసు: అఖిలప్రియ వాడిన సిమ్ నంబర్ ఇదే..) అయితే డాబాలో చికెన్ లేకపోవటంతో అదే విషయాన్ని వారికి చెప్పాడు డాబా యజమాని. దీంతో వారు అతడితో వాగ్వివాదానికి దిగారు. అనంతరం డాబాకు నిప్పంటించారు. యజమాని కళ్లముందే డాబా కాలి బూడిదైంది. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. -
కస్టమర్‌ని కొట్టి చంపిన వెయిటర్లు
థానే : అపరిశుభ్రమైన టిష్యూ పేపర్లు కాకుండా మంచివి ఇవ్వమని అడిగినందుకు ఓ కస్టమర్‌ని కొట్టి చంపారు ఇద్దరు ధాబా వెయిటర్లు. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలోని థానే నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధానేకు చెందిన నవ్‌నాథ్ పావ్నే అనే యువకుడు తన స్నేహితుడు మహేశ్‌తో కలిసి ఆక్టోరోయి నాకాలోని బాబా దాబాకు వెళ్లాడు. టిష్యూ పేపర్లు ఇవ్వాలని ధాబాలోని వెయిటర్లను అడిగాడు. అందుకు ధాబాలో పనిచేస్తున్న వెయిటర్ రాంలాల్ గుప్తా కట్టకట్టిన టిష్యూ పేపర్లని తీసుకొచ్చి ఇచ్చాడు. (చదవండి : ప్రదీప్ లీలలు : చెప్పేవి నీతులు.. చేసేవి చెడ్డ పనులు) అవి దుమ్ము పట్టి ఉండడంతో నవ్‌నాథ్ మంచి టిష్యూ పేపర్లు తీసుకురమ్మని చెప్పాడు. వాటిని తీసుకొచ్చి టిష్యూ బాక్స్‌లో పెట్టాలని సూచించాడు. ఆ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ధాబాలోని మరో ఇద్దరు సిబ్బంది వచ్చి నవ్‌నాథ్ గొడవకు దిగారు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రాంలాల్ గుప్తా ధాబాలో ఉన్న టైల్తో అతని తలపై గట్టిగా బాదాడు. దీంతో పావ్నే అక్కడిక్కడే కిందపడిపోయాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. రాంలాల్ గుప్తాతో పాటు మరో ఇద్దరు ధాబా సిబ్బందిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. -
బాబా కా ధాబా : యుట్యూబర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని బాబా కా ధాబా యజమాని కాంతాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్‌పై కేసు నమోదైంది. ప్రాథమిక విచారణ అనంతరం గౌరవ్‌పై సెక్షన్ 420 కింద ఎఫ్ఐఆర్ నమోదైనట్లు దక్షిణ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు. కాగా తమకు సాయం చేయడం కోసం చాలా మంది పంపిన డబ్బును వాసన్ తప్పుదోవ పట్టించాడని కాంతా ప్రసాద్ అక్టోబర్ 31న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు కేవలం రూ. 2.3 లక్షలు మాత్రమే ఇచ్చాడని మిగిలిన డబ్బును అతనే తీసుకున్నాడని ఆరోపించాడు. వాసన్ విరాళాలు సేకరించడానికి తన బ్యాంక్ ఖాతాలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు కూడా ఇచ్చాడని కాంతా ప్రసాద్ తెలిపారు. వచ్చిన విరాళాలు మొత్తాన్ని తమకు అందించకుండానే.. ‘ఇచ్చాను అంటూ’ అబద్ధాలు చెబుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వాసన్ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించాడు. తనకు వచ్చిన ఫండ్స్ అన్నింటిని కాంతా ప్రసాద్‌కు ఇచ్చానని బ్యాంక్ స్టేట్మెంట్లు చూపిస్తూ మరో వీడియో విడుదల చేశాడు. (సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో) అయితే దీనికి కౌంటర్‌గా కాంతా ప్రసాద్ లాయర్ ప్రేమ్ జోషి మాట్లాడుతూ..వాసన్ చెబుతున్నట్లుగా మొత్తం డబ్బును ఇవ్వలేదని కేవలం 2.3 లక్షల చెక్ మాత్రమే ఇచ్చాడని పేర్కొన్నాడు. వీడియోలో వాసన్ కేవలం అక్టోబర్ 7నుంచి 10 వరకు వచ్చిన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లను మాత్రమే వెల్లడించాడని, నిజానికి ఆ తర్వాత రోజుల్లోనే ఎక్కువ మొత్తంలో విరాళాలు అందాయని ఆరోపించారు. కాగా దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఉంటున్న ఒక వృద్ధ జంట కరోనా టైంలో తమ ధాబా బిజినెస్ సరిగా జరగడం లేదంటూ కంటతడి పెట్టుకున్న వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు సైతం‘బాబా కా ధాబా కు వెళ్లి తినండి అంటూ ట్వీట్లు చేశారు. దీంతో ఆ ధాబా పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. వృద్ధ జంట కాంతా ప్రసాద్, అతని భార్య బాదామి దేవి ఆవేదన చూసి చలించిపోయిన చాలా మంది నెటిజన్లు వారికి ఆర్ధిక సాయం కూడా చేశారు. ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతనే వీరి కోసం విరాళాలు సేకరించాడు. -
వైరలవుతున్న కేరళ బామ్మ ఆవేదన
తిరువనంతపురం : సోషల్ మీడియా విసృతిలో చెడుకు ఎంత అవకాశం ఉంటుందో మంచికి అంతే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా కొంతమంది జీవితాలు మెరుగుపడ్డాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారి ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేయగానే మంచి మనసున్న నెటిజన్లు కొందరు వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చేవారు. ఎవరి నుంచి ఆశించకుండా కష్టపడి బతికేవారికి దేవుడే ఏదో ఒక ఉపాధి చూపిస్తాడనడానికి ఈ వార్త ఉదాహరణ. ఇక అసలు విషయంలోకి వెళితే.. కేరళకు చెందిన పార్వతీ అమ్మ అనే 70 ఏళ్ల బామ్మ ఎవరిపై ఆధారపడకుండా మన్నార్కాడ్ సమీపంలోని కరింబా వద్ద ధాబాను నడిపేవారు. ఆమె చేతి వంటను ధాబాకు వచ్చే కస్టమర్లు మెచ్చకోకుండా ఉండేవారు కాదు. ధాబాపై వచ్చే లాభాలతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చేది. కానీ కరోనా వచ్చి ఆమె జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ధాబాలు తెరిచినా కస్టమర్లు రావడానికి భయపడుతుండడంతో ఆమె ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. (చదవండి : సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో) దీంతో పార్వతీ అమ్మ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను పంచకున్నారు. 'మీ అందరికి ఒక విజ్ఞప్తి. ఎంతో కష్టపడి డాబాను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఏనాడు ఎవరి దగ్గర చేయి చాపలేదు. కానీ పాడు కరోనా మా జీవితాలను కుదిపేసింది. మీరందరిని నేను కోరేది ఒకటే.. కస్టమర్లు నా ధాబాకు వచ్చేలా ఈ వీడియోనూ ప్రమోట్ చేయండి.. నా కుటుంబాన్ని ఆదుకోండి.. అందుకు ప్రతిఫలంగా నా చేతి వంటను మీకు రుచి చూపిస్తానంటూ ' పార్వతీ చెప్పుకొచ్చారు. అయితే పార్వతీ అమ్మను కలిసిన ఆరిఫ్ షా అనే జర్నలిస్ట్ ఆమె మాటలను వీడియో తీసి ట్విటర్లో షేర్ చేశాడు. ఇది కేరళ స్టోరీ.. మరో బాబా కా ధాబా స్టోరీ.. ఆమెను ఆదుకుందాం నాతో చేతులు కలపండి అంటూ క్యాప్షన్ జత చేశారు. ఆరిఫ్ షా షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాబా కా ధాబాకు అందిన సాయం లాగే కేరళ బామ్మకు సాయం చేద్దామంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. దక్షిణాది హీరోయిన్ రిచా చద్దా కూడా కేరళ బామ్మను ఆదుకోవాలంటూ ఆమె వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. కాగా మొన్నటికి మొన్న ఇదే తరహాలో ఢిల్లీలోని మాలవీయనగర్‌లో ఉన్న బాబాకా ధాబా గురించి ట్విటర్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కరోనా, లాక్డౌన్ కారణంగా డిమాండ్ లేక షాపు యజమాని కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలో షేర్ చేశారు. దాదాపు 80 ఏళ్ళ వృద్ధాప్యంలో జీవనం కోసం ఆ జంట పడుతున్న ఆరాటాన్ని చూపించారు. అంతేకాదు వీరిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరలయ్యి.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు బాబా కా ధాబాకు పోటెత్తుతున్నారు. Kerala Story : This old lady runs a Dhaba in order to feed her family. She doesn't have customers & struggles to earn. It’s resilient and delicious Parvathyamma’s eatery at Karimba, near Mannarkkad. After Baba ka Dhaba, Keralites turn to help this elderly woman. #BabaKaDhaba pic.twitter.com/DL3n4VddA8 — Aarif Shah (@aarifshaah) October 10, 2020 -
బాబాకా ధాబాకు క్యూ కట్టిన కస్టమర్లు
-
సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: చిన్నపిల్లలనుంచి వృద్ధుల దాకా సోషల్ మీడియా విపరీతమైన ప్రభావాన్ని పడవేస్తోంది. ఆధునిక టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా ప్రపంచ దిశ దశను మారుస్తోంది. రాజకీయాలు నుంచి వంటింటి దాకా సోషల్ మీడియానా మజాకా అనిపిస్తోంది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి తెలుసుకుంటే.. సోషల్ మీడియా మీద ఒకింత కోపంగా ఉన్న వారు కూడా ఔరా అనక మానరు. ఢిల్లీలోని మాలవీయనగర్‌లో ఉన్న బాబాకా ధాబా గురించి ట్విటర్లో ఒక వీడియో పోస్ట్ అయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా డిమాండ్ లేక షాపు యజమాని కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలో షేర్ చేశారు. దాదాపు 80 ఏళ్ళ వృద్ధాప్యంలో జీవనం కోసం ఆ జంట పడుతున్న ఆరాటాన్ని చూపించారు. అంతేకాదు వీరిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. పిల్లల అనాదరణకు గురైన ఈ వృద్ధ దంపతుల పోరాట కథ పలువురి హృదయాలను కదిలించింది. బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, రవీన్ టాండన్, సోనమ్ కపూర్, రవీనా టాండన్, జర్నలిస్టు, నటి స్వర భాస్కర్, క్రికెటర్ ఆర్ అశ్విన్ లాంటి సెలబ్రిటీలతో పలువురు దీన్ని లైక్ చేసి, షేర్ చేశారు. దీంతో నెటిజనుల నుంచి స్పందన భారీగా వచ్చింది. సపోర్ట్ లోకల్ అంటూ స్థానికులు బాబా కా ధాబాకు క్యూ కట్టారు. ఫుడ్ స్టాల్ లో లభ్యమయ్యే భోజనం, చపాతీలకు ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. బాబా చేతి వంట మటర్ పనీర్ ఆసాంతం లొట్టలేసుకుంటూ ఆరగించేశారు. సెల్ఫీలతో సందడి చేశారు. దీంతో సంతోషంతో ఉక్కిరి అయిపోవడం యజమాని వంతైంది. అంతేకాదు మాలవీయ నగర్ బాబాకా ధాబా ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఈ వీడియో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని కూడా కదిలించింది. బాబా కా ధాబాను తాను సందర్శించానని, వారి జీవితాల్లో సంతోషం కోసం తాను చేయగలిగింది తాను చేస్తానంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ వీడియోను బ్లాగర్ గౌరవ్ వాసన్ చిత్రీకరించారు. బాబా కా దాబా ఓనరు పేరు కాంత ప్రసాద్. భార్య పేరు బాదామి దేవి. .@RICHA_LAKHERA .@VasundharaTankh .@sohitmishra99 .@sakshijoshii .@RifatJawaid .@ShonakshiC .@TheDeshBhakt Visited "Baba Ka Dhaba" n hv done d needful to bring SMILE on their faces as promised. Will take care of them n I am starting a drive 2 take care of similarly placed people. pic.twitter.com/S9A94AmJxK — Adv. Somnath Bharti (@attorneybharti) October 8, 2020 -
ప్రాణం తీసిన రూ.180
లక్నో: డబ్బు.. మనుషులను రాక్షసులను చేస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. బిల్లు చెల్లించలేదనే కోపంతో ఓ హోటల్ యజమాని కస్టమర్‌ను చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాదోమీ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. సూరజ్ సింగ్, విశాల్ దూబే అనే యువకులు భోజనం కోసం ఓ హోటల్‌కు వెళ్లారు. భోజనం తర్వాత వెయిటర్ వారికి రూ.180 బిల్లు ఇచ్చాడు. అయితే తాము తిన్న భోజనానికి ఎక్కువ బిల్లు వేశారంటూ సూరజ్, విశాల్‌లు హోటల్ యజమానితో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ కాస్తా పెద్దదై కొట్టుకొనేవరకు వెళ్లింది. ఆగ్రహించిన హోటల్ యజమాని గుర్మయిల్, అతడి కుమారుడు సురేంద్ర సింగ్‌లు, సిబ్బందితో కలిసి కర్రలు, ఇనుప రాడ్లతో విశాల్, సూరజ్‌లపై దాడి చేశారు. ఈ ఘటనలో విశాల్ అక్కడ నుంచి తప్పించుకోగా.. సూరజ్‌ను తీవ్రంగా కొట్టారు. గాయాలతో కదల్లేని పరిస్థితిలో ఉన్న సూరజ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్మయిల్, సురేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన ఇద్దరు వెయిటర్లు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎక్కువ తిన్నాడని బట్టలు విప్పించి..
సాక్షి, భోపాల్: దాబాలో పనిచేసే వర్కర్‌పై యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. దాబా యజమాని, అతడి పార్టనర్ ఆ పనివాడి బట్టలు విప్పించి నగ్నంగా నిలబెట్టి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బేతుల్ జిల్లా కేంద్రంలోని స్థానిక దాబాలో ఓ వ్యక్తి పని చేస్తున్నాడు. అయితే మంగళవారం ఆ పనివాడు తాను పనిచేస్తున్న దాబాలో ఆహారం ఎక్కువగా తీసుకున్నాడు. ఇది గమనించిన యజమాని, అతడి వ్యాపార భాగస్వామి వర్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవేశానికి లోనైన ఈ నిందితులు వర్కర్‌ను దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా బలవంతంగా అతడితో బట్టలు విప్పించారు. నగ్నంగా నిలబడి క్షమాపణ చెబుతున్నా బాధితుడి మాట వినకుండా అతడిని దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బేతుల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
వ్యక్తి ప్రాణం తీసిన రూ.200
-
దాబాలపై పోలీసుల ఆకస్మిక దాడి
వేములవాడ రూరల్ (కరీంనగర్ జిల్లా) : వేములవాడ పరిధిలోని రెండు దాబాలపై పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. గణతంత్రదినోత్సవం నాడు మద్యం, మాంసం విక్రయిస్తున్న ఓ దాబా యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో వేములవాడ ఎస్ఐ లక్ష్మణ్ పాల్గొన్నారు. -
దాబాలో భారీ అగ్ని ప్రమాదం
పెందుర్తి: విశాఖ జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ-అరకు ప్రధాన రహదారి మార్గంలో పెందుర్తి సమీపంలో ఓ దాబాలోని కిచెన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దాబా నిర్వాహకులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది భారీగా ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తుంది. -
దాబాపై పోలీసుల దాడి
నల్లగొండ : అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న దాబాపై పోలీసులు దాడి చేశారు. జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గుంటూరు రహదారిలో ఉన్న గోకుల్ దాబాలో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాబాపై సోమవారం అర్ధరాత్రి దాడి చేసి 158 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, గత కొద్ది రోజుల క్రితమే పోలీసులు దాబాల్లో 10 గంటల తర్వాత అమ్మకాలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. అయినా, నోటీసులను ఖాతరు చేయకుండా మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేశారు. దాబా యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (మిర్యాలగూడ) -
ఆడపిల్ల పుట్టిందని..
డాబా పైనుంచి పడేసిన తండ్రి కంగ్టి: ఆడపిల్ల పుట్టిందని పసికందును ఇంటి డాబా నుంచి పడేశాడు ఓ తండ్రి. ఈ సంఘటన మెదక్ జిల్లా కంగ్టి మండలం జీర్గితండాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రదీప్‌బాబు కథనం మేరకు.. చౌకాన్‌పల్లి పంచాయతీ జీర్గితండాకు చెందిన బన్సీరాం కుమార్తె శీలాబాయికు నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం మమదాపురం తండాకు చెందిన దేవిదాస్ రాథోడ్‌తో గతేడాది వివాహం జరిగింది. శీలాబాయి ప్రసూతి నిమిత్తం రెండు నెలల కిందట పుట్టింటికి వెళ్లింది. అదే సమయంలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. భార్యాబిడ్డను చూసేందుకు దేవిదాస్ శుక్రవారం జీర్గితండాకు వచ్చాడు. ఆడపిల్ల పుట్టడంతో భార్యతో గొడవకు దిగాడు. అనంతరం శిశువును డాబాపై నుంచి పడేశాడు. శిశువుకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు బీదర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.