థానే : అపరిశుభ్రమైన టిష్యూ పేపర్లు కాకుండా మంచివి ఇవ్వమని అడిగినందుకు ఓ కస్టమర్‌ని కొట్టి చంపారు ఇద్దరు ధాబా వెయిటర్లు. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలోని థానే నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధానేకు చెందిన నవ్‌నాథ్ పావ్నే అనే యువకుడు తన స్నేహితుడు మహేశ్‌తో కలిసి ఆక్టోరోయి నాకాలోని బాబా దాబాకు వెళ్లాడు. టిష్యూ పేపర్లు ఇవ్వాలని ధాబాలోని వెయిటర్లను అడిగాడు. అందుకు ధాబాలో పనిచేస్తున్న వెయిటర్ రాంలాల్ గుప్తా కట్టకట్టిన టిష్యూ పేపర్లని తీసుకొచ్చి ఇచ్చాడు.
(చదవండి : ప్రదీప్ లీలలు : చెప్పేవి నీతులు.. చేసేవి చెడ్డ పనులు)
అవి దుమ్ము పట్టి ఉండడంతో నవ్‌నాథ్ మంచి టిష్యూ పేపర్లు తీసుకురమ్మని చెప్పాడు. వాటిని తీసుకొచ్చి టిష్యూ బాక్స్‌లో పెట్టాలని సూచించాడు. ఆ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ధాబాలోని మరో ఇద్దరు సిబ్బంది వచ్చి నవ్‌నాథ్ గొడవకు దిగారు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రాంలాల్ గుప్తా ధాబాలో ఉన్న టైల్‌తో అతని తలపై గట్టిగా బాదాడు. దీంతో పావ్నే అక్కడిక్కడే కిందపడిపోయాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. రాంలాల్ గుప్తాతో పాటు మరో ఇద్దరు ధాబా సిబ్బందిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment