Tissue papers
-
బాత్రూముల్లో కంపు.. ట్విట్టర్ సిబ్బందికి చుక్కలు చూపిస్తున్న మస్క్
వాషింగ్టన్: ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచీ సిబ్బందికి చుక్కులు చూపుతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నిర్వాకాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఓవైపు పొదుపు చర్యలకు దిగుతుంటే పారిశుధ్య సిబ్బంది వేతన పెంపుకు డిమాండ్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి వారందరినీ పీకిపడేశారు. దాంతో సరైన నిర్వహణ లేక బాత్రూములన్నీ భరించలేనంత కంపు కొడుతున్నాయని సిబ్బంది మొత్తుకుంటున్నారు. చివరికి వాటిలో టాయ్‌లెట్ పేపర్లకు కూడా దిక్కు లేదట! వాటిని ఇంటి నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. పలు నగరాల్లోని ట్విట్టర్ కార్యాలయాల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా కరువయ్యారట! నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఉద్యోగులందరినీ రెండంతస్తుల్లోనే కుక్కి నాలుగింటిని ఖాళీ చేశారట. సియాటిల్, శాన్ఫ్రాన్సిస్కో కార్యాలయ భవనాలకు అద్దె చెల్లించడం కూడా ఆపేశారు. సిబ్బందిని వీలైనంత వరకూ వర్క్ ఫ్రం హోం చేయాలని చెబుతున్నారు. ట్విట్టర్ సిబ్బందిలో సగం మందిని తీసేయడం తెలిసిందే. టెస్లా, స్పేస్ ఎక్స్ తదితర సొంత కంపెనీల నుంచి సిబ్బందిని ట్విట్టర్‌కు మస్క్ తరలిస్తున్నారట! -
మల్లెపూలు అనుకుంటున్నారా..కాదండోయ్!
న్యూఢిల్లీ: అమ్మాయిలకు పువ్వులకు విడదీయలేని బంధం ఉందని అంటారు. అందుకే వారిని పువ్వులతో పోలుస్తారు. ఒక తల్లి తన కూతురు సురేఖ పిళ్ళైకి ఏదైన సర్ప్రైజ్ చేయాలనుకుంది. వెంటనే ఒక టిష్యూపేపర్ తీసుకొని దానితో ఒక మల్లెపుల బొకే తయారుచేసి చేతిలో పెట్టేసింది. దీన్ని మొదట నిజమైన మల్లెపూల బొకేగా భావించిన సురేఖ..తర్వాత పరీక్షగా చూసి షాక్ కు గురయ్యింది. అంతేకాకుండా, కుర్తాసేట్, వెండిరింగులు, బింది మొదలైనవి తయారు చేసి ఇచ్చింది. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిపోయిన సురేఖ తల్లి అధ్బుతమైన కళను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. నెటిజన్లు మొదట సురేఖలాగే మోసపోయి, తీరా అది టిష్యూపేపర్తో తయారు చేసినవని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడిది తెగవైరల్ అయ్యింది. మీ అమ్మాగారి కళకు ఫిదా అవ్వాల్సిందే అని కామెంట్లు పెడుతున్నారు. my mom made this for me (from tissue paper) ❤️ pic.twitter.com/eISioFAmnM — Surekha (@surekhapillai) February 22, 2021 -
కస్టమర్‌ని కొట్టి చంపిన వెయిటర్లు
థానే : అపరిశుభ్రమైన టిష్యూ పేపర్లు కాకుండా మంచివి ఇవ్వమని అడిగినందుకు ఓ కస్టమర్‌ని కొట్టి చంపారు ఇద్దరు ధాబా వెయిటర్లు. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలోని థానే నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధానేకు చెందిన నవ్‌నాథ్ పావ్నే అనే యువకుడు తన స్నేహితుడు మహేశ్‌తో కలిసి ఆక్టోరోయి నాకాలోని బాబా దాబాకు వెళ్లాడు. టిష్యూ పేపర్లు ఇవ్వాలని ధాబాలోని వెయిటర్లను అడిగాడు. అందుకు ధాబాలో పనిచేస్తున్న వెయిటర్ రాంలాల్ గుప్తా కట్టకట్టిన టిష్యూ పేపర్లని తీసుకొచ్చి ఇచ్చాడు. (చదవండి : ప్రదీప్ లీలలు : చెప్పేవి నీతులు.. చేసేవి చెడ్డ పనులు) అవి దుమ్ము పట్టి ఉండడంతో నవ్‌నాథ్ మంచి టిష్యూ పేపర్లు తీసుకురమ్మని చెప్పాడు. వాటిని తీసుకొచ్చి టిష్యూ బాక్స్‌లో పెట్టాలని సూచించాడు. ఆ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ధాబాలోని మరో ఇద్దరు సిబ్బంది వచ్చి నవ్‌నాథ్ గొడవకు దిగారు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రాంలాల్ గుప్తా ధాబాలో ఉన్న టైల్తో అతని తలపై గట్టిగా బాదాడు. దీంతో పావ్నే అక్కడిక్కడే కిందపడిపోయాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. రాంలాల్ గుప్తాతో పాటు మరో ఇద్దరు ధాబా సిబ్బందిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. -
ఎక్కడికి వెళ్లినా పిక్నిక్లా ఉండాలి
ట్రావెల్ ప్రకృతి గురించి తెలుసుకోవడం, బాధ్యతను గుర్తెరగడం, ఆనందాన్ని పంచుకోవడం.. ఇవన్నింటితో ప్రయాణం పిల్లలకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చేదై ఉండాలి. పిల్లలు త్వరగా బోర్ ఫీలవుతారు. దీంతో పెద్దవాళ్లను విసిగిస్తుంటారు. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే పిల్లలకే కొన్ని బాధ్యతలను అప్పజెప్పండి. బొమ్మలు, పుస్తకాలు ఎక్కడివక్కడ వదిలేయకుండా తిరిగి బ్యాగులో సర్దుకోవడం, వారి వస్తువులను వారే జాగ్రత్త చేసుకునే పనిని అప్పజెప్పండి. అంతేకాదు, కుటుంబంలో అందరికీ ఎక్కువ ఉపయోపడే టిష్యూ పేపర్లు, పేపర్ టీ కప్స్, చిన్న చిన్న కుకీస్, బిస్కెట్లు... వంటివి ఒక బ్యాగులో సర్ది దాని బాధ్యత పూర్తిగా పిల్లల్లో ఒకరిని చూసుకోమని చెప్పవచ్చు. లేదా ఒక్కో పనిని ఒకొక్కరికి అప్పజెప్పవచ్చు. మీ సొంత వాహనంలో వెళుతున్నట్లయితే దారిలో విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని చోట్ల తప్పక ఆగాలి. ముఖ్యంగా పిల్లల ఆటస్థలాలు, పచ్చిక మైదానాల వద్ద ఆగాలి. వారికి నచ్చిన ఆహారం తినిపించడం, కాసేపు సరదాగా ఆడుకోవడం.. ఆ తర్వాత తిరిగి బయల్దేరడం... వంటివి ఉంటే పిల్లలు ప్రయాణాన్ని మరింత ఆనందిస్తారు. {పయాణంలో ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించని దుస్తులను, షూ ఎంచుకోవాలి. పైజామాలు, స్లిప్పర్లు, సూపర్‌మ్యాన్ క్యాప్.. పిల్లల దుస్తులు పూర్తి ఫన్‌గా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే వారు మరింత ఎంజాయ్ చేస్తారు.విహారం అంటేనే స్వేచ్ఛగా సీతాకోకచిలుకల్లా ఎగరడం. ప్రతీ దానికి ఆంక్షలు పెడితే ప్రయాణం పిల్లలకు శిక్షగా మారవచ్చు. ఈ భావన పిల్లల మనసుల్లో చేరకుండా జాగ్రత్తపడండి.