ఎక్కడికి వెళ్లినా పిక్నిక్‌లా ఉండాలి
ట్రావెల్
ప్రకృతి గురించి తెలుసుకోవడం, బాధ్యతను గుర్తెరగడం, ఆనందాన్ని పంచుకోవడం.. ఇవన్నింటితో ప్రయాణం పిల్లలకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చేదై ఉండాలి. పిల్లలు త్వరగా బోర్ ఫీలవుతారు. దీంతో పెద్దవాళ్లను విసిగిస్తుంటారు. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే పిల్లలకే కొన్ని బాధ్యతలను అప్పజెప్పండి. బొమ్మలు, పుస్తకాలు ఎక్కడివక్కడ వదిలేయకుండా తిరిగి బ్యాగులో సర్దుకోవడం, వారి వస్తువులను వారే జాగ్రత్త చేసుకునే పనిని అప్పజెప్పండి. అంతేకాదు, కుటుంబంలో అందరికీ ఎక్కువ ఉపయోపడే టిష్యూ పేపర్లు, పేపర్ టీ కప్స్, చిన్న చిన్న కుకీస్, బిస్కెట్లు... వంటివి ఒక బ్యాగులో సర్ది దాని బాధ్యత పూర్తిగా పిల్లల్లో ఒకరిని చూసుకోమని చెప్పవచ్చు. లేదా ఒక్కో పనిని ఒకొక్కరికి అప్పజెప్పవచ్చు.
మీ సొంత వాహనంలో వెళుతున్నట్లయితే దారిలో విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని చోట్ల తప్పక ఆగాలి. ముఖ్యంగా పిల్లల ఆటస్థలాలు, పచ్చిక మైదానాల వద్ద ఆగాలి. వారికి నచ్చిన ఆహారం తినిపించడం, కాసేపు సరదాగా ఆడుకోవడం.. ఆ తర్వాత తిరిగి బయల్దేరడం... వంటివి ఉంటే పిల్లలు ప్రయాణాన్ని మరింత ఆనందిస్తారు.
{పయాణంలో ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించని దుస్తులను, షూ ఎంచుకోవాలి. పైజామాలు, స్లిప్పర్లు, సూపర్‌మ్యాన్ క్యాప్.. పిల్లల దుస్తులు పూర్తి ఫన్‌గా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే వారు మరింత ఎంజాయ్ చేస్తారు.విహారం అంటేనే స్వేచ్ఛగా సీతాకోకచిలుకల్లా ఎగరడం. ప్రతీ దానికి ఆంక్షలు పెడితే ప్రయాణం పిల్లలకు శిక్షగా మారవచ్చు. ఈ భావన పిల్లల మనసుల్లో చేరకుండా జాగ్రత్తపడండి.