Travel
-
ఆధ్యాత్మిక పర్యాటకం.. ఆనందమయం
ప్రపంచం ఆధ్యాత్మికతను స్మరిస్తోంది. మానసిక చింతన, ప్రశాంత జీవనం కోసం వెతుకుతోంది. హాలిడే ట్రిప్పుల్లోని సంతోషాన్ని ఆధ్యాత్మిక పరవశ పర్యటనలుగా మారుస్తోంది. ఈ క్రమంలోనే 2025లో అంచనా వేసిన ఆధ్యాత్మిక మార్కెట్ విలువ 1,378.22 బిలియన్ డాలర్ల నుంచి 2032 నాటికి 2,260.43 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని ‘ట్రావెల్ టూరిజం వరల్డ్’ నివేదిక పేర్కొంది. ఆధ్యాత్మిక పర్యాటకం సగటున 6.5శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయనుంది. –సాక్షి, అమరావతి విశ్వాసమే నడిపిస్తోంది..ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు వ్యక్తిగత సంపద పెరిగేకొద్దీ, ఎక్కువ మంది ప్రజలు తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక పండుగలపై ఆసక్తి చూపిస్తున్నారు. సాంకేతికత సాయంతో ముందుగా వర్చువల్ టూర్లు చేసిన తర్వాత పర్యటనలను ఖరారు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, భారతదేశం, ఇటలీ వంటి దేశాలు చాలా కాలంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని లోతైన విశ్వాసం, సంస్కృతితో ముడిపడి ఉన్న అనుభవాలను కోరుకునే సందర్శకుల సంఖ్యను పెంచుతున్నాయి. ఈ ధోరణి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల ఆధ్యాత్మిక అవసరాలు, ప్రాధాన్యతలను తీర్చే ప్రత్యేక పర్యటనలను అందించడానికి ట్రావెల్ ఏజెన్సీలకు అవకాశాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మికతలో ఆనందం..ఆధ్యాత్మిక పర్యటనలు శారీరక–మానసిక శ్రేయస్సుతో మిళితం చేసే వెల్నెస్ టూరిజంగా మారుతోంది. ధ్యానం, యోగాపై దృష్టి సారించే విహార యాత్రలు ఆరోగ్య, ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తున్నాయి. యూఎస్, కెనడా వంటి దేశాల్లో స్థానిక ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతోంది. వాషింగ్టన్ డీసీలోని బసిలికా ఆఫ్ ది నేషనల్ ష్రైన్ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ (క్యాథలిక్ చర్చి)కు తాకిడి పెరుగుతోంది. యూరప్‌లోని స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు యూరోపియన్ నాగరికతను అన్వేíÙంచడానికి మైలురాళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆసియా–పసిఫిక్‌లో అయితే భారతదేశంలో దేవాలయాలు, పీఠాలు, చర్చిలు, మసీదులను దర్శించుకునే వారు పెరుగుతున్నారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం, చైనా–జపాన్ దేశాల్లో బౌద్ధారామాలు వంటి పవిత్ర స్థలాలను లక్షలాది మంది సందర్శిస్తున్నారు. మధ్యప్రాచ్యం–ఆఫ్రికాలో అయితే సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, ఇజ్రాయెల్ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మక్కా, జెరూసలేం తీర్థయాత్రలు ఎక్కువ ఉంటాయి. -
National Tourism Day సోలో ట్రావెల్ సో బెటర్!
పర్యటనలకు మనదేశం పుట్టిల్లు. తీర్థయాత్రలు మన సంస్కృతిలో భాగం. పర్యటన... ఒక పాఠం... రచనకు అదే మూలం. జీవన వైవిధ్యత అధ్యయనానికి ఓ మాధ్యమం. పర్యటనలు ఒత్తిడి నుంచి సాంత్వన కలిగిస్తాయి.జీవితాన్ని కొత్తగా చూడడానికి కళ్లు తెరిపిస్తాయి.అణగారిన జీవితేచ్ఛను తిరిగి చిగురింప చేస్తాయి. అందుకే ఫ్రెండ్స్‌తో టూర్లు... ఫ్యామిలీ టూర్లు... అలాగే... మహిళల సోలో ట్రావెల్స్ కూడా పెరిగాయి. మహిళలు ఒంటరిగా పర్యటనలు చేయడానికి సందేహించాల్సిన అవసరమేలేదిప్పుడు. ప్రపంచంలో మనుషులందరినీ కలిపే భాష ఇంగ్లిష్. మనదేశంలో పర్యటనలైనా, విదేశీ పర్యటనలైనా ఇంగ్లిష్ భాష వస్తే చాలు. అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం లేక΄ోయినప్పటికీ మనకు అవసరమైన సమాచారాన్ని అడగగలగడం, చెప్పింది అర్థం చేసుకోవడం తెలిస్తే చాలు. సేఫ్టీ, సెక్యూరిటీ నియమాలను పాటిస్తూ ప్రయాణం కొనసాగిస్తే మహిళలు ఒంటరిగా ప్రయాణించినా సరే ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కావన్నారు రజని లక్కా.ఆత్మవిశ్వాసం ఉండాలి, కనీసం ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపించి తీరాలి. బిత్తర చూపులు చూస్తే మోసగించేవాళ్లు అక్కడిక్కడే ప్రత్యక్షమవుతారు. మరో తప్పనిసరి జాగ్రత్త ఏమిటంటే సహ ప్రయాణికులతో కూడా డబ్బు లావాదేవీలు చేయకూడదు. అలాగే పర్యటనను ఆస్వాదించాలంటే లగేజ్ తక్కువగా ఉండాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. సోలోగా పర్యటనకు వెళ్లిన వాళ్లు ఇంట్లో వాళ్లకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండాలి. అయితే లైవ్ లొకేషన్స్ ఇతరులకు ఎవ్వరికీ షేర్ చేయవద్దు. సోషల్‌మీడియాలో లైక్‌ల కోసం తాపత్రయపడి టూరిస్ట్ ప్లేస్‌లో ఫొటోలు తీసుకుని గంటకో పోస్ట్ పెడుతూ ఉంటే మన కదలికలు ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలిసిపోతుంటాయి. మనల్ని ఎవరైనా రహస్యంగా వెంటాడుతున్నట్లయితే చేజేతులా వారికి దారి చూపించినట్లవుతుంది. పర్యటన వివరాలను సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌తో షేర్ చేయాలనుకుంటే పర్యటన పూర్తయి ఇంటికి వచ్చిన తర్వాత పోస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో ఒంటరిగా ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు జెన్నిఫర్. మనవాళ్లకు అడ్వెంచర్ టూర్లు చేయడం కంటే నియమాలను ఉల్లంఘించడంలో సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. ఫొటోగ్రఫీ నిషేధం అన్న చోట ఫొటోలు తీసుకుంటారు. సెక్యూరిటీ కళ్లు కప్పి నిషేధిత ప్రదేశాల్లోకి, డేంజర్ జోన్లలోకి దొంగచాటుగా వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాలు ప్రమాదకరం మాత్రమే కాదు నేరం కూడా. పర్యటనను ఆస్వాదించడం కూడా ఒక కళ. ఎప్పటికీ వన్నె తగ్గని కళ. (టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి)మనదేశం ప్రపంచానికి ప్రతీక కశ్మీర్లో తప్ప సోలో ట్రావెలర్‌గా మరెక్కడా నాకు ఇబ్బంది ఎదురుకాలేదు. తమిళనాడు ప్రజలు సింపుల్‌గా ఉంటారు. 76 దేశాల్లో పర్యటించిన తరవాత నాకనిపించిందేమిటంటే... ప్రపంచంలో ఉన్నవన్నీ మనదేశంలో ఉన్నాయి. మనదేశంలో లేనిది ప్రపంచంలో మరెక్కడా లేదు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతం బొలీవియాను తలపిస్తుంది. మన దగ్గర ఎడారులు, హిమాలయాలు, బీచ్‌లు ఒక్కొక్కటి ఒక్కోదేశంలో ప్రత్యేకమైన టూరిస్ట్ ప్లేస్‌ను తలపిస్తాయి. ఆర్కిటెక్చర్ పరంగా తమిళనాడు ఆలయాలు, రాజస్థాన్ కోటలకు ప్రపంచంలో మరేవీ సాటి రావు.- పొనుగోటి నీలిమ, ట్రావెలర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇదీ చదవండి: ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!ట్రావెల్ లైట్... ట్రావెల్ సేఫ్ ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతటా పర్యటించాను. ఏడు దేశాలు కూడా చూశాను. మనల్ని మనం మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగింది పర్యటన ద్వారానే. సోలో ట్రావెల్ అయితే మన అభిరుచికి తగినట్లు టూరిస్ట్ ప్రదేశాలను ఎంచుకోవచ్చు. ఇప్పుడు పర్యటనలకు సౌకర్యాలు బాగున్నాయి. సోలో ట్రావెల్లో అన్నీ మనమే సమకూర్చుకోవడం కష్టం అనిపిస్తే టూర్ ΄్యాకేజ్లో వెళ్లవచ్చు. ఎక్కడికి వెళ్తే ఆ ప్రదేశంలో స్థానికులతో కలిసి΄ోతున్నట్లుగా ఉండాలి. మనల్ని మనం ఎక్స్΄ోజ్ చేసుకునే ప్రయత్నం చేయరాదు. ఆ ప్రదేశానికి సరి΄ోలని వస్త్రధారణ, మాటల ద్వారా ఇతరుల దృష్టి మన మీద సులువుగా పడుతుంది. ప్రమాదాలు కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. సోలో ట్రావెల్ చేసే మహిళలు జాగ్రత్తగా ఉండాల్సింది ఈ విషయంలో మాత్రమే. – జెన్నిఫర్ ఆల్ఫాన్స్, డైరెక్టర్ సురక్షితంగా వెళ్లిరావచ్చు! ఒంటరి పర్యటనలు ఆస్వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. కెనడాలో మాంట్రియల్లో నేను ప్రయాణించిన టూరిస్ట్ బస్‌లో తొమ్మిది దేశాల వాళ్లున్నారు. అంతమందిలో ఇద్దరు మినహా అంతా సోలో ట్రావెలర్సే. అయితే వెళ్లే ముందు పర్యటనకు వెళ్లే ప్రదేశం గురించి ్ర΄ాథమిక వివరాలైనా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెంట్, జీపీఎస్ సౌకర్యాలున్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ధైర్యంగా ఒంటరి ప్రయాణాలు చేయవచ్చు. భద్రంగా వెళ్లి, సంతోషంగా తిరిగి రాగలిన పరిస్థితులున్నాయి. – రజని లక్కా, సోషల్ యాక్టివిస్ట్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సేఫ్ లడకీ దేశాన్ని చుట్టేస్తోంది!
కాళ్లకు చక్రాలుంటే బావుణ్ణు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దేశమంతా చుట్టేయవచ్చు. ఈ కోరిక చాలామందికే ఉంటుంది. తమిళనాడుకి చెందిన సరస్వతి అయ్యర్ మాత్రం ఈ మాటను నిజం చేస్తోంది. నిజం చేయడమంటే కాళ్లకు చక్రాలు కట్టుకోలేదు కానీ కాళ్లకు పని చెబుతోంది, చక్రాలున్న వాహనాల్లో హిచ్‌హైకింగ్ (ఆ దారిలో వెళ్లే వాహనాల్లో లిఫ్ట్ అడుగుతూ వెళ్లడం) చేస్తూ పర్యటిస్తోంది. దేశంలో ఆ మూల నుంచి ఈ మూలకు ఈ మూల నుంచి ఆ మూలకు అటూ ఇటూ పర్యటించేసింది. ఉమన్ సోలో ట్రావెల్ ఒక ట్రెండ్‌గా మారిన ఈ రోజుల్లో సోలో ట్రావెల్‌తోపాటు జీరో బడ్జెట్ ట్రావెల్ కూడా సాధ్యమేనని నిరూపించింది సరస్వతి అయ్యర్.జీవితాన్ని చదివేస్తోంది!సరస్వతి అయ్యర్ రెండేళ్ల కిందట ఉద్యోగం నుంచి విరామం తీసుకుంది. ఉద్యోగం చేయడానికి పుట్టలేదు, ఇంకా ఏదో సాధించాలనుకుంది. దేశమంతా చుట్టి వచ్చిన తర్వాత తన గురించి తాను సమీక్షించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ప్రయాణం కట్టింది. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆమె దగ్గర ఉన్నది రెండు జతల దుస్తులు, ఒక గుడారం, ఫోన్ చార్జింగ్ కోసం ఒక పవర్ బ్యాంక్. ఈ మాత్రం పరిమితమైన వనరులతో ఆమె పర్వత శిఖరాలను చూసింది. మారుమూల గ్రామాలను పలకరించింది. దేవాలయాల్లో ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించింది. బస కోసం ఆలయ్ర ప్రాంగణాలు, ఆశ్రమాలు, ధర్మశాలలను ఎంచుకుంది. భోజనం కూడా అక్కడే. ఎక్కడైనా శ్రామికులు పని చేస్తూ కనిపిస్తే వారితో కలిసి పని చేస్తోంది. వారితో కలిసి భోజనం చేస్తోంది. పొలంలోనే గుడారం వేసుకుని విశ్రమిస్తోంది. ఈ పర్యటన ద్వారా ఆమె ఇస్తున్న సందేశం మహిళలు సోలో ట్రావెల్ చేయగలరని నిరూపించడం మాత్రమే కాదు. మనదేశంలో మహిళలకు ఉన్న భద్రతను చాటుతోంది. ఒక సాహసం చేయాలంటే అది అంత ఖరీదైనదేమీ కాదని. అలాగే... ఒక పర్యటన జీవిత దృక్పథాన్ని మార్చేస్తుందనే జీవిత సత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది సరస్వతి అయ్యర్.(చదవండి: నృత్యం చిత్తరువు అయితే..!) -
టేస్ట్ అట్లాస్ రుచుల పండుగ.. టాప్ 100లో 4మనవే..!
‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా.. వేడి వేడన్నంలో వేడి వేడన్నంలో నెయ్యికారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరురుచులు ఉండగా బతుకు పండుగ చెయ్యరా’ అంటూ పాడే పాటలాగే, ప్రపంచంలోని కొన్ని ప్రశస్తమైన వంటకాలను గుర్తు చేసుకుంటేనే నోరూరుతుంది. ప్రపంచంలోని వందఅత్యుత్తమ వంటకాలు..వంద అత్యుత్తమ రుచుల నగరాలు.. వంద అత్యుత్తమ వంటల పుస్తకాలు..ఇవన్నీ ఒకేచోట పొందుపరిస్తే భోజనప్రియులకు అంతకు మించిన పండుగ ఏముంటుంది! మిమ్మల్ని మరోసారి వంటింటి వైపు చంటోడిలా చూసే వంటకాల్లో వంద ఉత్తమ వంటకాలను ప్రకటించింది ప్రముఖ ట్రావెల్ గైడ్ సైట్ ‘టేస్ట్ అట్లాస్’. వాటిలో మన భారతీయ వంటకాలు కూడా ఉండటం విశేషం.భోజనప్రియుల్లో చాలామంది ఫలానా ఆహార పదార్థం ఎక్కడ రుచిగా ఉంటుందని తెలిస్తే అక్కడకు ఎంత దూరమైన సరే, కేవలం ఆ వంటకం రుచి చూడటానికే వెళ్తుంటారు. మరికొందరు కొత్త ప్రాంతాలు, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ముందే నిర్ణయించుకుంటారు. అక్కడ ఏం వంటకం లభిస్తుంది, ఏది బాగుంటుంది అని ఇలా వంటకాలకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటుంటారు. అలాంటి వారందరికీ ఉపయోగపడేదే ఈ ‘టేస్ట్ అట్లాస్’. ఇదొక రుచుల ఎన్ సైక్లోపీడియా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ చుట్టివచ్చి, అక్కడ లభించే వంటకాలకు రేటింగ్ ఇస్తుంటారు.ఆ రేటింగ్ ఇచ్చేవారు మామూలు వారు కాదు. ఎక్స్పీరియన్స్డ్ ట్రావెల్ గైడ్స్, గ్యాస్ట్రోనమీ ఎక్స్పర్ట్స్, ఫేమస్ ఫుడ్ రివ్యూయర్స్ సాయంతో ఈ మధ్యనే సుమారు పదివేల కంటే ఎక్కువ ఆహార పదార్థాలను పరిశీలించి, ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల పేర్లను ప్రకటించింది ‘టేస్ట్ అట్లాస్’. ఇవన్నీ అత్యంత జనాదరణ పొందినవి, అలాగే ప్రపంచంలోని ప్రతి నగరం, ప్రాంతం, గ్రామాల వారీగా మరచిపోయిన రుచులను, సుగంధద్రవ్యాలను అన్వేషించి ఇతర జాబితాలను కూడా ప్రకటించింది. 2024–2025 ఏడాదికి విడుదల చేసిన ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాలో మన భారతీయ వంటకాలు నాలుగు ర్యాంకులు దక్కించుకున్నాయి. వీటితోపాటు మన దేశంలోని ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు తమ తమ ప్రాంతీయ వంటకాలతో అదరగొట్టి, ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చేరాయి. వరల్డ్టాప్ 10అలా మొదలైంది..‘టేస్ట్ అట్లాస్’ ఒక ట్రావెల్ గైడ్ వెబ్సైట్. దీనిని క్రొయేషియన్ జర్నలిస్ట్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో, వ్యాపారవేత్త మతిజా బాబిక్ 2015లో ప్రారంభించారు. దాదాపు ఐదువేల వంటకాలు, వందల ట్రావెల్ గైడ్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా మొదటిసారి 2018లో ప్రపంచంలోని వంద ఉత్తమ వంటకాలతో తొలి నివేదిక విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది వారు పరిశీలించే వంటకాల సంఖ్య పెరుగుతూనే పోతోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 11,258 వంటకాలను, 3,67,847 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా వంద ఉత్తమ వంటకాల జాబితాతో పాటు వంద ఉత్తమ ఆహార నగరాలు, వంద ఉత్తమ రెస్టరెంట్లు, ఉత్తమ వంటల పుస్తకాలు వంటి ఇతర జాబితాలను కూడా ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసింది.ఉత్తమ వంటకాలు ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల్లో మొదటి స్థానాన్ని కొలంబియా దక్కించుకుంది. మాంసాహార వంటకం అయిన ‘లేచోనా’ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకంగా ‘టేస్ట్ అట్లాస్’ ప్రకటించింది. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ఇటలీ ఈసారి రెండో స్థానంలో నిలిచింది. ఇటలీలోని ‘పిజ్జా నెపోలిటానా’ రెండవ రుచికరమైన వంటకంగా నిలిచింది. ఇక మూడో స్థానంలో బ్రెజిలియన్ బీఫ్ కట్ అయిన ‘పికాన్యా’ వంటకం నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో అల్జీరియా (రెచ్తా), థాయిలాండ్ (ఫానీంగ్ కర్రీ), అర్జెంటీనా (అసడో)లు, ఇతర దేశాలు ఉండగా, 99వ స్థానంలో ‘వాలాస్కీ ఫ్రగల్ కేక్’తో చెక్ రిపబ్లిక్ ఉంది. మన దేశం విషయానికి వస్తే, ఈ వంద ఉత్తమ వంటకాల్లో భారతదేశం నాలుగు ర్యాంకులు సాధించింది. మొదటగా 29వ ర్యాంకుతో ‘ముర్గ్ మఖానీ’ (బటర్ చికెన్) ఉండగా, 100వ ఉత్తమ వంటకంగా ‘కీమా’ నిలిచింది. ఇక ప్రపంచంలోని వంద ఉత్తమ ఆహార నగరాల్లో మన దేశం టాప్ టెన్‌లోనే ఉంది. స్ట్రీట్ ఫుడ్, ట్రెడిషనల్ వంటకాల్లో ముంబై ఐదవ ర్యాంకు సాధించింది. ముఖ్యంగా భారత్‌లో తప్పనిసరిగా తినాల్సిన వంటకాల్లో బటర్ చికెన్, అమృత్సర్ కుల్చా, హైదరాబాద్ బిరియానీ, బటర్ గార్లిక్ నాన్ ఉన్నాయి. అంతేకాదు, భారతదేశంలో లభించే గరమ్ మాసాలాలను కూడా తప్పనిసరిగా ట్రై చేయాలని ఈ రిపోర్ట్ సూచిస్తోంది. వీటితో పాటు గ్రీస్ దేశానికి చెందిన చాలా వంటకాలు ఉన్నాయి. వాటిలో ముసాకా, స్టిఫాడీ, సౌలాకీ, డోల్మడోస్, గౌరోస్, గ్రీక్ సలాడ్ ఇవన్నీ తప్పనిసరిగా రుచి చూడాల్సిన వంటకాలని, ముఖ్యంగా మెక్సికోలో మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ ‘టాకోస్’ చాలా ప్రజాదరణ పొందిన వంటకమని ‘టేస్ట్ అట్లాస్’ తెలిపింది. ప్రపంచంలోనే 100 అత్యంత పురాతన వంటల పుస్తకాలు లెక్కలేనన్ని కొత్త వంట పుస్తకాలు ప్రతిరోజూ ప్రచురిస్తున్నప్పటికీ, ఈ 100 వంట పుస్తకాలు కలకాలం జాతి సంపదగా నిలుస్తాయి. ఈ పుస్తకాలు పాక సంప్రదాయాలలో ప్రపంచంలోని పలువురు గొప్ప షెఫ్‌లకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకంగా మొదటి స్థానంలో అగస్టీ ఎస్కఫియా రచించిన ‘ది ఎస్కఫియా’ ఉండగా, రెండో స్థానంలో ‘ది జాయ్ ఆఫ్ కుకింగ్’ ఉంది. ఈ అత్యుత్తమ వంటల పుస్తకాల్లో నాలుగు భారతీయ పుస్తకాలు ఉన్నాయి. యాన్ ఇన్విటేషన్ టు ఇండియన్ కుకింగ్ (ర్యాంక్–09)మధుర్ జాఫ్రీ రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. ఇది పాశ్చాత్య పాఠకులకు భారతీయ వంటకాలను పరిచయం చేస్తుంది. వివిధ రకాల ప్రాంతీయ వంటకాలతో దేశ పాక సంప్రదాయాలను వివరిస్తుంది.మేడ్ ఇన్ ఇండియా (ర్యాంక్–25)మీరా సోదా రచించిన ఈ పుస్తకాన్ని 2014లో ప్రచురించారు. ప్రతిరోజూ చేసుకునే వంటకాలతో ఈ పుస్తకం కనిపిస్తుంది. అందుకే దీనికి పాఠకాదరణ ఎక్కువ. ది ఇండియన్ కుకింగ్ కోర్స్ (ర్యాంక్–33) మోనిషా భరద్వాజ్ రచించిన ఈ పుస్తకాన్ని 2018లో ప్రచురించారు. ఇది భారతీయ వంటకాలకు ఒక విస్తృతమైన మార్గదర్శి. సంప్రదాయ భారతీయ వంటకాలపై అవగాహనను పెంచుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.ఇండియన్ వెజిటేరియన్ కుకరీ (ర్యాంక్–69)జాక్ శాంటా మారియా రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. భారతీయ శాకాహార వంటకాల వైవిధ్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. వంటలలో రకరకాల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను పరిచయం చేస్తూ, ఆరోగ్యకరమైన వంటకాల తయారీ ప్రక్రియను చెబుతుంది.టాప్ 100 ఉత్తమ ఆహార నగరాలు‘టేస్ట్ అట్లాస్’ 15,478 వంటకాలకు 4,77,287 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా, విడుదల చేసిన ఉత్తమ ఆహార నగరాల జాబితాలో జాతీయ, ప్రాంతీయ వంటకాలన్నీ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఆహారం అందించే నగరాల జాబితాలో మొదటి నాలుగు స్థానాలను ఇటలీ దక్కించుకుంది. మొదటగా నిలిచిన నేపుల్స్ నగరంలోని పిజ్జా, మిలాన్‌లోని రిసోట్టాలను తప్పకుండా రుచి చూడాలంటూ ఈ రిపోర్టు తెలిపింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో బొలొగ్నా, ఫ్లోరెన్స్ నగరాలు ఉండగా, టాప్ 5వ స్థానాన్ని ముంబై దక్కించుకుంది. మరికొన్ని భారతీయ నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మన నగరాలు, వాటి ర్యాంకుల వివరాలు.ముంబై : వడాపావ్, భేల్పూరి, పావ్ భాజీ, దహీ పూరి, బాంబే శాండ్విచ్, బాంబే బిరియానీ, రగడా పట్టిచీ, ఐస్ చావ్లా, అంబా, బొంబిలీ ఫ్రై.అమృత్సర్ : అమృత్సరీ కుల్చా, పనీర్ కుల్చా, అమృత్సరీ ఫిష్ , చూర్ చూర్ నాన్.న్యూఢిల్లీ : బటర్ చికెన్, కుల్చా, రాజ్మా, ఖీర్, దాల్ మఖానీ, ఛోలే భటూరే, ఉల్లి పకోడీ, గులాబ్ జామూన్.హైదరాబాద్ : హైదరాబాదీ బిరియానీ, పెసరట్టు, చికెన్ 65, రూమాలీ రోటీ, మలీదా, కరాచీ బిస్కట్స్, బోటీ కూర, మిర్చీ కా సాలాన్, షికాంపురీ కబాబ్, కుబానీ కా మీఠా.కోల్కత్తా : కఠీ రోల్, గోబీ మంచూరియా, పనీర్ కఠీరోల్, రసగుల్లా, పొంగల్, చక్కర్ పొంగల్చెన్నై : మద్రాస్ కర్రీ, ఇడ్లీ, సాంబార్, దోశ, కొబ్బరి చట్నీ, మురుకులు, బోండా, కాజూ కత్లీ, చెట్టినాడ్ మసాలా. ఏది ఏమైనా ఈ ‘టేస్ట్ అట్లాస్’ రిపోర్ట్ ఒక సమీక్ష మాత్రమే! ‘లోకో భిన్న రుచి’ అని నానుడి. కొంతమందికి కొన్ని వంటకాలు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. చాలామంది బయటి ఆహారం కంటే ఇంట్లో వండుకునే వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ‘టేస్ట్ అట్లాస్’లో ఎక్కువగా యూరోపియన్స్ వంటకాలే టాప్‌లో నిలిచాయి. ఏ దేశ ప్రజలకు వారి దేశీయ వంటకాలే ఎక్కువగా నచ్చుతాయి. కాబట్టి ఈ ర్యాంకులన్నీ కూడా కేవలం చెప్పుకోవాడానికే కాని, వీటికి కచ్చితమైన ప్రామాణికత అంటూ నిర్ణయించలేం. -
త్యాగమయి చిత్తోర్ఘర్ పన్నా దాయి : ఆసక్తికర విశేషాలు
రాజస్థాన్, చిత్తోర్ఘర్... పేరు వినగానే మేవార్‌రాజుల ఘనచరిత్ర కళ్ల ముందు మెదులుతుంది. రాణి పద్మిని త్యాగం గుర్తు వస్తుంది. పద్మావత్ సినిమా తర్వాత చిత్తోర్ ఘర్ పేరు అనేక వివాదాలకు, విచిత్ర భాష్యాలకు నెలవైంది. సినిమాలో చూసిన చిత్తోర్ఘర్ కోటను స్వయంగా చూడడం కూడా అవసరమే. చిత్తోర్ఘర్ చరిత్రలో ఉన్న మహిళ రాణి పద్మినిది మాత్రమే కాదు. ఈ కోటలో చరిత్ర సృష్టించిన ముగ్గురు. భక్త మీరాబాయి, రాణి పద్మిని, పన్నాదాయి. భక్త మీరాబాయి... కృష్ణుడి భక్తురాలిగా సుపరిచతమే. ఇక పన్నా దాయి (Panna Dhai) మాత్రం సినిమాటిక్ అట్రాక్షన్ లేని పాత్రకావడంతో చరిత్రపుటల్లో అక్షరాలుగా మాత్రమే మిగిలిపోయింది. త్యాగమయి పన్నారాజపుత్ర రాజు రాణా సంగా భార్య రాణి కర్ణావతి దగ్గర దాదిగా పని చేసింది పన్నాదాయి. పిల్లల్ని పెంచే బాధ్యత ఆమెది. రెండవ ఉదయ్ సింగ్ చంటిబిడ్డగా ఉన్నప్పుడు కోట మీద దాడి జరిగింది. ఉదయ్ సింగ్‌ను కాపాడడానికి శత్రువుల దృష్టి మళ్లించడానికి ఊయలలో తన బిడ్డను పెట్టి ఉదయ్‌సింగ్‌ను భద్రంగా కోట నుంచి బయటకు పంపించింది. రాజ కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమకు, త్యాగానికి గుర్తుగా కోట లోపల ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కోటలో రాణా కుంభ కట్టిన విజయ్ స్తంభ్, రాణి పద్మిని ప్యాలెస్ ముఖ్యమైనవి. అల్లావుద్దీన్ ఖిల్జీ అద్దంలో రాణిని చూసిన ప్రదేశం ముఖ్యమైనది. పద్మిని తన ప్యాలెస్ మెట్ల మీద కూర్చుంటే, ఆమె ప్రతిబింబం... ప్యాలెస్ మెట్లకు అభిముఖంగా ఉన్న చిన్న బిల్డింగ్‌లోని అద్దంలో కనిపిస్తుంది. ఖిల్జీ ఆ ప్రతిబింబాన్ని చూసిన అద్దం ఇప్పటికీ ఉంది. జోవార్ గద్దెరాణి పద్మిని అందచందాలను విని ఆశ్చర్యపోయిన ఖిల్జీ ఆమె కోసమే దండెత్తి యుద్ధం చేశాడు. రాజ్యాన్ని ధ్వంసం చేశాక కూడా కోట స్వాధీనం కాకపోవడంతో రాణి పద్మినిని ఒకసారి చూసి వెళ్లిపోతానని కోరాడని, అప్పుడు మంత్రివర్గ ప్రముఖులు ఆమెను స్వయంగా చూపించకుండా అద్దంలో చూపించారని గైడ్లు చె΄్తారు. చూసి వెళ్లిపోతానన్న ఖిల్జీ ఆ తర్వాత మాటతప్పి కోటలోకి ఆహార పదార్థాలు అందకుండా దిగ్బంధించి కోటను స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు పద్మినితో పాటు నాలుగు వేల మంది మహిళలు నిప్పుల్లో దూకి ప్రాణత్యాగం(జోవార్) చేసిన ఆ స్థలాన్ని చూపించి ఈ వివరాలన్నీ చెబుతారు. కోట లోపల శివాలయం, జైనమందిరం ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆలయాలు, ప్యాలెస్‌లు, గార్డెన్లు, జ్ఞాపక నిర్మాణాలు ఏవైనా సరే అందులో ఇమిడిన నైపుణ్యానికి తలవంచి నమస్కరించాల్సిందే. -
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ పోషల్ మీడియాలో బాగా పాపులర్. తాజాగా '2024లో నేను ఎంత ఖర్చు చేశాను' అనే క్యాప్షన్‌తో ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన డబ్బులో ఎక్కువ భాగం ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించడానికి ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఒక్క ఏడాదిలోనే తన ప్రయాణాలకు రూ. 50 లక్షలు ఖర్చుపెట్టినట్టు తెలిపింది. అంతేకాదు రూ. 22 లక్షలతో హ్యందాయ్ కారు కొనుక్కొంది. దీంతో నోరెళ్ల బెట్టడం ఫాలోయర్ల వంతైంది. అంత డబ్బు ఎక్కడినుంచి నెటిజన్లు వచ్చిందంటూ ప్రశ్నలు కురిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో శరణ్య అయ్యర్ పోస్ట్ వైరల్ అయ్యింది. 1.3 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అసలింతకీ స్టోరీ ఏంటంటే..ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 5లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తరచూ ట్రావెల్ వీడియోను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక రీల్‌ను షేర్ చేసింది.ఇందులో ఒక్క ప్రయాణానికే రూ. 50 లక్షలు.ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత ఏడాదిలో ఆరుకుపైగా దేశాలను చుట్టివచ్చిందట. ఇందులో భాగంగా విమాన ఖర్చులకే రూ. 5 లక్షలు వెచ్చించినట్టు చెప్పుకొచ్చింది. మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగం వసతి మిగతా ఖర్చులున్నట్టు తెలిపింది. దీంతోపాటు కొత్త హ్యుందాయ్ కారును కూడా కొనుగోలు చేసినట్లు శరణ్య వెల్లడించింది. గత ఏడాది కష్టతరంగా గడిచినప్పటికీ, ఎంతో సంతోషాన్ని, భరోసాన్నిచ్చిందని చెప్పుకొచ్చింది. 2025లో ఇంత ఖర్చుపెట్టను.. కాస్త పొదుపు చేస్తానని కూడా తెలిపింది. ఇదీ చదవండి: ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్..2024లో జర్నీలకే రూ. 50 లక్షలు : నెటిజనులు షాక్శరణ్య అయ్యర్ ఖర్చులుశరణ్య అయ్యర్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియో ప్రకారం, లావోస్ , థాయిలాండ్ ట్రిప్‌కోసం, 1 లక్ష, రూ. మదీరాకు 1.5 లక్షలు, రూ. తన తల్లిదండ్రులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు రూ.8 లక్షలు, రూ. గ్రీన్‌ల్యాండ్‌లో 3 లక్షలు, మూడుసార్లు ఐస్లాండ్ పర్యటన ఖర్చు రూ2.5 లక్షలు అయింది. అలాగే యూరప్ ట్రిప్ రూ. 60,000 ఖర్చు. అయితే క్యాసినోలో 40 వేలు గెలిచినట్లు పేర్కొంది.అంతేకాదు ఇంకా ఇన్సూరెన్స్ కవర్ చేయని వైద్య ఖర్చులపై 5 లక్షల రూపాయలు ఖర్చుపెట్టిందట. ఈ మొత్తం ఖర్చులో ఫుడ్ రోజువారీ ఖర్చులు , షాపింగ్ ఖర్చులను తన జాబితాలో చేర్చలేదంటూ లెక్కలు చెప్పింది. View this post on Instagram A post shared by Sharanya Iyer | Travel (@trulynomadly) నెటిజన్లు ఏమన్నారంటే" ఇంత ఖర్చును భరించారు.. అదృష్టవంతులు.. ఇంతకీ మీ ఆదాయ వనరు ఏమిటి? అని ఒకరు. ఈ రీల్ తర్వాత పాపం మిగిలిన ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్లు బాధపడతారంటూ ఫన్నీగా కమెంట్ చేశారు. ఇంత తక్కువ బడ్జెట్‌తో ఐస్ల్యాండ్ని మూడుసార్లు ఎలా అబ్బా అని మరొకరు ప్రశ్నించగా, స్పాన్సర్లు లభించారంటూ సమాధానం చెప్పింది శరణ్య. -
స్లో.. & స్టడీ
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ట్రెండ్ మారుతోంది. ఉరుకుల పరుగుల ప్రయాణాలకు బదులు స్థిర అన్వేషణల వైపు గమ్యం సాగుతోంది. స్థానిక సంస్కృతి, ఆచార వ్యవహారాలను సంపూర్ణంగా అర్థం చేసుకునేలా ‘స్లో ట్రావెల్’పేరుతో పర్యాటక ఉద్యమం ఊపందుకుంటోంది. స్లో ట్రావెల్లో పర్యాటక ప్రదేశాల పరిమాణం కంటే.. అందులోని నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గజిబిజి జీవితాలను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసుకుని ప్రకృతి ఒడిలో మునిగిపోయేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం ‘స్లో ట్రావెల్’ఇయర్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రైళ్లకు జై కొడుతున్నారు2024లో 81శాతం మంది విశ్రాంతి కోసం, రోజువారీ ఒత్తిళ్ల నుంచి బయట పడేందుకు స్లో వెకేషన్లకు వెళ్లినట్టు ‘ట్రావెల్ అండ్ టూర్ వరల్డ్’పేర్కొంది. ఇందులో మూడొంతుల మంది సాంస్కృతిక, చారిత్రక అన్వేషణ, వారసత్వ ప్రదేశాల సందర్శనలకు విలువ ఇస్తున్నట్టు గుర్తించింది. స్లో ట్రావెల్లో భాగంగా అధిక శాతం మంది రైలు ప్రయాణాలకు జైకొడుతున్నట్టు తేలింది. సుదూర గమ్యస్థానాలకు విమాన, కారు ప్రయాణాలకు ఖర్చుతో కూడుకోవడం, ఒక్కోసారి రిమోట్ గమ్యస్థానాలను చేరుకోలేకపోవడంతో రైలు మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యువత సైక్లింగ్, బైక్ రైడ్లలో సోలోగా స్లో ట్రావెల్‌కు వెళ్తున్నారు. ఇటీవల కాలం నదీ అందాలను ఆస్వాదించేందకు క్రూయిజ్‌ల ప్రయాణాలను ఎంపికలు పెరిగాయి. అహ్మదాబాద్.. అగ్రస్థానంభారతదేశంలో అహ్మదా బాద్ నగరం సుదీర్ఘ సందర్శనలలో పాల్గొనే వారికి అగ్ర ఎంపికగా ఉద్భవించింది. గోవా, అయోధ్య తరువాత ఈ ప్రాంతంలో ఎక్కువగా గడిపేందుకు ప్రసిద్ధి చెందింది. విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు ముఖ్యంగా ఆసియాలో థాయ్‌లాండ్‌లోని ఖావో లాక్, జపాన్‌లోని టోక్యో, దక్షిణ కొరియాలోని సియో ల్, మలేషియాలోని పెర్హెన్షియన్ దీవులు, వియత్నాంలోని హోచిమిన్ సిటీకి ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్టు డిజిటల్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ అగోడా ప్రకటించింది.భారత్‌లో 10% వృద్ధి అంచనానిత్యం పని జీవితంలో ఒత్తిళ్లు తారస్థాయికి చేరుకోవడంతో సెలవులు తీసుకోవడం గతంతో పోలిస్తే విలువైనది మారింది. ఆఫ్బీచ్ వెకేషన్లు, కొత్త అన్వేషణల గమ్యస్థానాలకు ప్రయాణించడం మానసిక చికిత్సగా భావిస్తున్నారు. 2025లో అత్యధికులు ‘స్లో ట్రావెల్’కు జైకొడుతున్నారు. ఇది 2025లో 10 శాతం వార్షిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతుందని ట్రావెల్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. చాలామంది పర్యాటకులు గమ్యస్థానాలను పూర్తిగా అస్వాదించలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎక్కువ ప్రదేశాలను చుట్టిరావడం కంటే స్థానిక సంస్కృతిలో లీనమవ్వడం, మరింత అర్థవంతంగా ప్రయాణాన్ని మార్చుకోవడమే ప్రధాన ఉద్దేశంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజలు నిత్యం పిల్లలను పెంచడం, ఆఫీస్ సమావేశాలు, కుటుంబ కార్యక్రమాలంటూ బిజీ షెడ్యూల్లో మునిగిపోతున్నారు. ఇలాంటి తరుణంలో మానసిక విశ్రాంతి, ఆహ్లాదాన్ని పొందేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త ఆహారాన్ని రుచి చూడటం, కొత్త దృశ్యాలను కళ్లతో బంధిస్తూ విశ్రాంతిని పొందే ప్రదేశాలను కోరుకుంటున్నట్టు ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి. -
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ
నమ్మండి నమ్మకపోండి.. ఇది నిజంగానే ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. రైలు చక్రాల మధ్య వేలాడుతూ ఓ వ్యక్తి చేసిన ప్రయాణం మామూలుగా లేదు. మధ్యప్రదేశ్‌లోని దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ కింద దాక్కున్న ఓ వ్యక్తి.. ఇటార్సీ నుండి జబల్పూర్ వరకు దాదాపు 250 కిలోమీటర్లు రైలు బోగీ చక్రాల మధ్య వేలాడుతూ ప్రయాణించడం షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు రోలింగ్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో S-4 కోచ్ కింద ఈ వ్యక్తిని గుర్తించారు.అతడిని ఆ పరిస్థితిలో చూసిన సిబ్బంది అశ్చర్యానికి గురై వెంటనే. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులకు సమాచారం అందించగా, అతనిని బోగీ కింద చక్రాల మధ్య నుంచి బలవంతంగా బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రైలుకు కింద వేలాడుతూ ప్రయాణించినట్లు స్పష్టమవుతోంది.అధికారుల విచారణలో ఆ వ్యక్తి టిక్కెట్ కొనడానికి డబ్బులు లేవని.. అందువలనే ప్రయాణం కోసం ఈ రిస్క్ చేసినట్లు తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. ఆ వ్యక్తి రైలు కింద ఎలా దాక్కున్నాడో కూడా అస్పష్టంగానే ఉంది. ప్రస్తుతం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. #BreakingNews *"यह खबर हैरान कर देगी"**टिकट के लिए पैसा नही था, तो ट्रेन के बोगी के नीचे पहिये के पास बैठ कर एक शख्स ने किया 250 किलोमीटर का सफर!!*मध्य प्रदेश में इटारसी से जबलपुर आने वाली दानापुर एक्सप्रेस ट्रेन के S-4 बोगी के नीचे पहिये के पास बने ट्राली में एक व्यक्ति ने… pic.twitter.com/41ZUpDOBxY— THIS IS WRONG NUMBER (@Thiswrongnumber) December 27, 2024 -
మోతీ షాహీ మహల్ : ఐరన్ మ్యాన్ మెమోరియల్
మోతీ షాహీ మహల్... చారిత్రక నిర్మాణం. అహ్మదాబాద్ నగరంలో షాహీభాగ్లో ఉంది. ఇప్పుడది సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి దర్పణం. వల్లభాయ్ పటేల్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను వివరించే డిజిటల్ స్టూడియో అద్భుతం. డిజిటల్ స్టూడియో జైలు గదుల రూపంలో విభజించి ఉంటుంది. గదులకు ఉన్న ఊచలను పట్టుకుంటే ఒక్కొక్క ఘట్టం ఆడియోలో వినిపిస్తుంది. జాతీయోద్యమంలో భాగంగా పటేల్ జైలు జీవితం గడిపిన సంఘటనలతో పాటు ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో వినవచ్చు. వీటన్నింటినీ లేజర్ షోలో చూడవచ్చు. ఇక మ్యూజియంలో ఒక్కో గది ఒక్కో రకమైన వస్తువులతో అలరిస్తుంది. వర్తమానం, ఆహ్వానపత్రాలను పంపించిన ట్యూబ్‌లాంటి వెండి పెట్టెలున్నాయి. ఐరన్ మ్యాన్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేయించుకోవడానికి సిద్ధం చేసిన వెండితాపీలు లెక్కలేనన్ని ఉన్నాయి. మెమోరియల్ మ్యూజియం అంటే ఆ వ్యక్తి ఉపయోగించిన చెప్పులు, పెన్నులు, భోజనం చేసిన ప్లేట్లు, దుస్తులను మాత్రమే చూస్తుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్‌లో భారత జాతీయోద్యమం కనిపిస్తుంది. గాంధీ, నెహ్రూలతో పటేల్ కలసి ఉన్న ఫొటోలతోపాటు ఆయా సందర్భాల వివరణ కూడా ఉంటుంది. పటేల్ జీవితంలో ఉపయోగించిన వస్తువులు ఏయే సందర్భంగా ఉపయోగించారనే వివరాలు ఉండడంతో ఫ్రీడమ్ మూవ్మెంట్ క్షణక్షణమూ గుర్తుకు వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు పదిహేడేళ్ల వయసులో కొంత కాలం ఈ మహల్లో బస చేశాడు.ఇదీ చదవండి: వెళ్లిపోకు నా ప్రాణమా! బోరున విలపించిన సృజన షాజహాన్ విడిది వల్లభాయ్ పటేల్ మెమోరియల్ ఉన్న భవనం మోతీ షాహీ మహల్... మొఘలుల నిర్మాణాలను తలపిస్తుంది. ఈ షాహీ మహల్‌ని 17వ శతాబ్దంలో షాజహాన్ కట్టించాడు. షాజహాన్ యువరాజుగా ఈ ప్రదేశానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు దీనిని నిర్మించాడు, రాజ్యపర్యటనకు వచ్చినప్పుడు అతడి విడిది కూడా ఇందులోనే. ఆ తర్వాత బ్రిటిష్ ఉన్నతాధికారుల నివాసమైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ భవనం రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్. గవర్నర్ నివాసానికి కొత్త భవనం కట్టిన తర్వాత 1978లో ఈ భవనాన్ని పటేల్ మొమోరియల్‌గా మార్చారు. నరేంద్రమోదీ గుజరాత్‌కి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2013లో ఈ మెమోరియల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటలైజ్ అయింది. మ్యూజియం అంతా తిరిగి చూసిన తర్వాత అదే ప్రాంగణంలో ఉన్న పటేల్ విగ్రహం దగ్గరకు వచ్చినప్పుడు ‘ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడరన్ ఇండియా’ అనే ఆత్మీయ ప్రశంసను గుర్తు చేసుకుంటూ ఓ నమస్కారం పెడతాం.ఆదివారం ఆటవిడుపుమోతీ షాహీ మహల్ చుట్టూ అందమైన గార్డెన్ మొఘలుల చార్భాగ్ నమూనాలో ఉంటుంది. దట్టమైన చెట్ల మధ్య పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి. రంగురంగుల వాటర్ఫౌంటెయిన్ పిల్లలను అలరిస్తుంది. అహ్మదాబాద్ వాసులకు వీకెండ్ పిక్నిక్ ప్లేస్ ఇది. దాదాపుగా నగరంలోని స్కూళ్లన్నీ విద్యార్థులను ఏటా ఈ మ్యూజియం సందర్శనకు తీసుకువస్తుంటాయి. అహ్మదాబాద్ పర్యటనలో మిస్ కాకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. ఈ మెమోరియల్ భవనం లోపల మాత్రమే కాదు భవనం బయట పరిసరాలను కూడా ఆస్వాదించాలి. పచ్చటి ఉద్యానవనంలోని చెట్ల కొమ్మల మీద నెమళ్లు సేదదీరుతుంటాయి. చెట్ల మధ్య విహరిస్తూ తినుబండారాలను రుచి చూడాలంటే అనుమతించరు. చాటుగా తినే ప్రయత్నం చేసినా కోతులు ఊరుకోవు. మెరుపువేగంతో వచ్చి లాక్కెళ్తాయి. మ్యూజియం పర్యటనకు అనువైన కాలం అని ప్రత్యేకంగా అక్కరలేదు, కానీ అహ్మదాబాద్‌లో పర్యటించడానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనువుగా ఉంటుంది. కాబట్టి క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్లాన్ చేసుకోవచ్చు. అహ్మదాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్‌కు దూరం ఐదు కిలోమీటర్లు మాత్రమే. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎయిరిండియా చెక్-ఇన్ సమయంలో మార్పులు
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తన చెక్-ఇన్ సమయాలను సవరించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, విమానాశ్రయ విధానాలను క్రమబద్ధీకరించడానికి ఈ మార్పులు చేసినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీతోపాటు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఈమేరకు మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది.లండన్ హీత్రూ విమానాశ్రయంలో చెక్-ఇన్ సమయాల్లో మార్పులు ఇలా..చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.గతంలో ఇది 60 నిమిషాలుగా ఉండేది.కొత్త నియమం ద్వారా ప్రయాణికుల రద్దీ సమయాల్లో చెక్-ఇన్, సెక్యూరిటీ క్లియరెన్స్‌ల కోసం తగిన సమయం ఉంటుంది.ఢిల్లీ విమానాశ్రయంలో ఇలా..ఢిల్లీ నుంచి బయలుదేరే అన్ని అంతర్జాతీయ విమానాలకు ఈ నియమాలు అమలుల్లో ఉంటాయి.చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.ఇదీ చదవండి: రైల్లో మంటలు! క్షణాల్లో తప్పించుకునేలా..సవరించిన చెక్-ఇన్ సమయానికి అనుగుణంగా ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించాలనుకునేవారు షెడ్యుల్ సమయం కంటే దాదాపు 3 గంటల ముందుగానే ఉండడం మంచిదని పేర్కొంది. -
ఇది సిమ్లా యాపిల్ కాదు... కల్పా యాపిల్
యాపిల్ చెట్టు ఎన్ని కాయలు కాస్తుంది? మనం మామిడి చెట్టును చూస్తాం, జామచెట్టును చూసి ఉంటాం. కానీ యాపిల్ చెట్టుతో మనకు పరిచయం ఉండదు. యాపిల్ కోసం సిమ్లాకే కాదు... కల్పాకు కూడా వెళ్లవచ్చు. అందుకే ఓసారి హిమాచల్ ప్రదేశ్‌లోని ‘కల్పా’ బాట పడదాం. మన పక్కనే ఉన్నట్లుండే హిమాలయాలను చూస్తూ విస్తారమైన యాపిల్ తోటల్లో విహరిద్దాం. ‘రోజూ ఒక యాపిల్ పండు తింటే డాక్టర్‌ను చూడాల్సిన అవసరమే ఉండదు’ అని యాపిల్‌లో ఉండే ఆరోగ్య లక్షణాలను ఒక్కమాటలో చెప్తుంటాం. కల్పా గ్రామంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో కనిపిస్తారు. అస్సాం టీ తోటల్లో మహిళలు వీపుకు బుట్టలు కట్టుకుని ఆకు కోస్తున్న దృశ్యాలు కళ్ల ముందు మెదలుతాయి. యాపిల్ తోటల్లో అమ్మాయిలు బుట్టను చెట్టు కొమ్మల మధ్య పెట్టి యాపిల్ కాయలు కోస్తుంటారు. కిన్నౌర్ కైలాస్ పర్వత శ్రేణుల దగ్గర విస్తరించిన గ్రామం కల్పా. యాపిల్ పండుని చెట్టు నుంచి కోసుకుని తింటూ రంగులు మార్చే హిమాలయాలను చూడడం ఈ ట్రిప్‌లోనే సాధ్యమయ్యే అనుభూతి. తెల్లటి మంచు పర్వత శిఖరాల్లో కొన్ని ఉదయం ఎర్రగా కనిపిస్తాయి. మధ్యాహ్నానికి ఆ శిఖరం తెల్లగానూ మరో శిఖరం ఎరుపురంగులోకి మారుతుంది. సూర్యుడి కిరణాలు పడిన పర్వత శిఖరం ఎర్రగా మెరుస్తుంటుంది.సాయంత్రానికి అన్నీ తెల్లగా మంచుముత్యాల్లా ఉంటాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రకృతి ఇంతే సౌందర్యంగా ఉంటుంది. మంచుకొండలు చేసే మాయాజాలాన్ని చూడాలంటే శీతాకాలమే సరైన సమయం. గోరువెచ్చని వాతావరణంలో విహరించాలంటే మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్లాలి. కల్పా చాలా చిన్న గ్రామం. సిమ్లా టూర్లో భాగంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంత చిన్న కల్పా గ్రామంలో ప్రాచీన దేవాలయాలున్నాయి. బౌద్ధవిహారాలు కూడా ఉన్నాయి. (చదవండి: నోరూరించే కేఎఫ్‌సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!) -
రైలు ప్రయాణం హాయిగా సాగిపోవాలంటే..!
రైలు ప్రయాణం అంటే ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. స్లీపర్ క్లాస్‌లో వెళ్లితే ప్రశాంతత మాట దేవుడెరుగు..ఒకటే గజిబిజి గందరగోళంలా ఉంటుంది వాతావరణం. ఏదో ఫోన్లో తలదూర్చి లేదా పేపర్‌తోనే కాలక్షేపం చేస్తూ ఎప్పుడు దిగిపోతాం రా బాబు అనుకుంటుంటాం. అలాంటి విసుగు, ఇబ్బంది కలగకుండా హాయిగా ట్రైన్ జర్నీ సాగిపోవాలంటే బాలీవుడ్ నటి మలైకా అరోరా చెప్పే జర్నీ చిట్కాలను ప్రయత్నించి చూడండి. ఆమె తన రైలు ప్రయాణాన్ని వీడియో తీసి మరీ నెట్టింట్ షేర్ చేశారు. ఆ వీడియోలో మలైకా మీరు బుక్ చేసుకున్న క్లాస్‌ని బట్టి జర్నీ ఎంజాయ్ చేయడం అనేది ఆధారపడి ఉంటుందన్నారు. "తక్కవ బడ్జెట్లో వెళ్లాలనుకుంటే స్లీపర్, సెకండ్ క్లాస్‌లు అనువైనవి. అలాకాకుండా తన వ్యక్తిగత గోప్యత కోరుకునే ప్రయాణికులకు ఫస్ట్-క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లు అనుకూలం. రైల్లో ఎక్కువసేపు ప్రయాణించేవాళ్లు తప్పనిసరిగి పిల్లో, దుప్పటిని తప్పనిసరిగా తీసుకెళ్లడం ఉత్తమం. ఇది ఇంటిలో ఉన్న అనుభూతిని ఇస్తుంది. దీంతోపాటు సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం మంచిది. తేలికగా జీర్ణమయ్యే తినుబండరాలను కూడా తీసుకువెళ్లండి. అలాగే రాత్రి సమయాల్లో నిద్రపట్టనప్పుడు కాలక్షేపమయ్యేలా మంచి పుస్తకాలను, లేదా మ్యూజిక్, సినిమా చూసేలా ఏర్పాట్లు చేసుకోండి. ఇలాంటి సింపుల్ చిట్కాలతో ట్రైన్ జర్నీని హాయిగా ఎంజాయ చేస్తే సరి." అని మలైకా వీడియోలో వివరించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) (చదవండి: చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి..!) -
బహురూపాల బండి.. ఎక్కడికెళ్లాలన్నా ఈ ఒక్కటుంటే చాలు
-
రంభా ప్యాలెస్ గురించి తెలిస్తే.. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుంటారు!
ఒడిశాలో చిల్కా సరస్సు. ఆసియా ఖండంలో అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. ఆ సరస్సు తీరాన ఉంది రంభా ప్యాలెస్. ఆ ప్యాలెస్ గురించి చెప్పాలంటే రెండు వందల ఏళ్ల వెనక్కి వెళ్లాలి. రండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.అది 1791. మనదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ హవా నడుస్తున్న రోజులవి. ఇంగ్లిష్ ఇంజనీర్ థామస్ స్నోద్గ్రాస్, మన స్థానిక సహాయకులతో కలిసి నిర్మించిన ప్యాలెస్ అది. ఈప్యాలెస్ చక్కటి వెకేషన్ ప్లేస్. కోణార్క్ సూర్యదేవాలయానికి పూరీలోని జగన్నాథ ఆలయానికి కూడా 150 కిలోమీటర్ల దూరాన ఉంది. ఈ ΄్యాలెస్ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా 2018లో న్యూఢిల్లీకి చెందిన హాచ్ వెంచర్ కొన్నది. నిర్మాణాన్ని పునరుద్ధరించే బాధ్యతను శ్రీలంకకు చెందిన ఆర్కిటెక్ట్ చన్నా దాసవాతేకి అప్పగించింది. ఈ ఆర్కిటెక్ట్ ఆరేళ్ల పాటు శ్రమించి ప్యాలెస్ చారిత్రక వైభవానికి విఘాతం కలగకుండా పునరుద్ధరించాడు. జాతీయోద్యమంలో భాగంగా సాగిన ఉత్కళ్ మూవ్మెంట్ జ్ఞాపకాలను పదిలపరుచుకుని ఉందీ ప్యాలెస్. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బ్రిటిష్ ఉన్నతాధికారులతో సమావేశమైన గుర్తులున్నాయందులో. ప్యాలెస్‌లో నివసించిన అనుభూతి కోసం పర్యాటకులు రాజస్థాన్ వెళ్తుంటారు. ఒకసారి ఒడిశా సంస్కృతి సంప్రదాయాలను కూడా ఆస్వాదించండి’ అంటూ ఈ ప్యాలెస్ సహ యజమాని ఒడిశా రాజవంశానికి చెందిన వారసుడు హిమాన్గిని సింగ్ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నారు. క్రిస్టమస్ వెకేషన్‌కి లేదా సంక్రాంతి వెకేషన్‌కి ప్లాన్ చేసుకోండి. -
మహిళల ఉచిత బస్సు పథకం రద్దుపై కర్ణాటక సీఎం క్లారిటీ
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే 'శక్తి' పథకాన్ని పునఃసమీక్షించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే.. ఈ పథకంపై చర్చ జరగవచ్చని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల వ్యాఖ్యలుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే గురువారం స్వయంగా సీఎం సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ‘‘ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన లేదు. డీప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ కొంతమంది మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మాత్రమే వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు చేసిన సమయంలో నేను లేను’అని అన్నారు.ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో.. ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్న మహిళలు తమ ప్రయాణానికి డబ్బు చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేస్తూ తనను సంప్రదించారని శివకుమార్ పేర్కొన్నారు. ‘‘ చూద్దాం, మేం దీనిపై కూర్చుని చర్చిస్తాం. మరికొంతమంది మహిళలు.. కొంత చార్జీని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. రవాణా మంత్రి రామలింగారెడ్డి, నేను ఈ అంశంపై పరిశీలన చేస్తాం’అని అన్నారు. కొందరు మహిళలు టికెట్ డబ్బులు చెల్లిస్తామని ట్వీట్లు, మెయిళ్లు పెడుతున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. ఇక.. ఐదు గ్యారంటీల్లో భాగంగా గతేడాది నుంచి కర్ణాటకలో ‘శక్తి’ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. -
విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..
దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల అక్టోబర్ 14న వివిధ నగరాల నుంచి గరిష్ఠంగా 4,84,263 మంది విమానాల్లో ప్రయాణం సాగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన 4,71,751 రికార్డుతో పోలిస్తే ఇది 2.6 శాతం అధికం. విహార యాత్రల కోసం విదేశాలకు వెళ్లేప్పుడు ఎన్ని రోజులు వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. మరి, వెళ్లినచోట ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదురైతే..వెంటతీసుకెళ్లిన సామాగ్రి పోగొట్టుకుంటే.. కంగారు పడకండి.. అలాంటి వారికోసమే చాలా కంపెనీలు ప్రయాణబీమా అందిస్తున్నాయి. దానికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం.ఆరోగ్య అత్యవసర పరిస్థితి కోసం..నిత్యం వేలసంఖ్యలో విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్తూంటారు. వారికి వెళ్లినచోట ఎప్పుడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి రావొచ్చు. అలాంటి వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణ బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల చికిత్సలు కవర్ అయ్యేలా ఉండే బీమా పాలసీను ఎంచుకోవాలి. ఎలాంటి షరతులూ, నిబంధనలు లేకుండా పూర్తి వైద్య ఖర్చులను చెల్లించే పాలసీను తీసుకువాలి.విభిన్న దేశాలు.. ఒకే పాలసీ..ఒకసారి బీమా తీసుకుంటే చాలా ప్రయాణాలకు ఉపయోగపడే పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి ముఖ్యంగా వ్యాపారవేత్తలకు సరిపోతాయి. ఒకటికి మించి దేశాలకు ప్రయాణించే వారు ఆయా దేశాలన్నింటిలోనూ పాలసీ అమలయ్యేలా ఒకే పాలసీని ఎంచుకోవచ్చు. అమెరికాలో ఏడు రోజులపాటు పర్యటించాలనుకుంటే బీమా ప్రీమియం కంపెనీను అనుసరించి దాదాపు రూ.800-రూ.900 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: ఎక్కేద్దాం... ఎగిరిపోదాం! విమాన ప్రయాణికుల జోరుసామాగ్రి అందకపోయినా ధీమాగా..ఒకటి కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించేవారు నిత్యం సామాగ్రి వెంట తీసుకెళ్లాలంటే కష్టం. కాబట్టి ఇతరదేశంలోని చిరునామాలో తమ సామగ్రి చేరేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక్కోసారి ఆ సామగ్రి చేరడం ఆలస్యం అవుతుంది. దాంతో వారు ఇబ్బందులు పడకుండా బీమా సంస్థ పరిహారం ఇచ్చేలా పాలసీలున్నాయి. మొదటిసారి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు సామాగ్రి అందకపోతే ఆర్థికంగా ఎంతో నష్టపోతారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణ బీమా వారికి పరిహారం అందిస్తుంది. -
కార్పొరేట్ ట్రావెల్ 20.8 బిలియన్ డాలర్లు
ముంబై: కార్పొరేట్ ట్రావెల్ రంగం భారత్‌లో 2029–30 నాటికి ఏటా 10.1 శాతం వార్షిక వృద్ధితో 20.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని డెలాయిట్ నివేదిక వెల్లడించింది. సాంకేతికత తోడుగా వ్యక్తిగతీకరించిన, స్థిర పరిష్కారాలు పరిశ్రమను నడిపిస్తాయని వివరించింది. ప్రస్తుతం ఈ రంగం 10.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 45 మంది ట్రావెల్ మేనేజర్లు, వివిధ రంగాలకు చెందిన 160కిపైగా కార్పొరేట్ ట్రావెలర్స్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందింది.నివేదిక ప్రకారం.. మహమ్మారి తర్వాత వ్యాపారాలు హైబ్రిడ్ వర్క్ మోడళ్లతో తమ ప్రయాణ వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నందున.. భారత కార్పొరేట్ ట్రావెల్ సెక్టార్ పరిశ్రమను ఆవిష్కరణ, వ్యయ సామర్థ్యం, స్థిరత్వం యొక్క కొత్త శకంలోకి నడిపించడంలో ట్రావెల్ మేనేజ్మెంట్ కంపెనీలు (టీఎంసీ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ శక్తితో పనిచేసే చాట్బాట్లు, వాయిస్–సహాయక బుకింగ్ సిస్టమ్‌లు, రియల్ టైమ్ డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించి మరింత లోతుగా, వేగంగా నిమగ్నం అయ్యే కొత్త తరం ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి టీఎంసీలు తమ వ్యూహాలను పునరుద్ధరించాయి. ఒకే కంపెనీ రూ.2,600 కోట్లు.. చిన్న, మధ్య స్థాయి సంస్థలకు (250 మంది ఉద్యోగుల వరకు) ప్రయాణ ఖర్చు సంవత్సరానికి రూ.1 కోటికి చేరుకుంటోంది. పెద్ద సంస్థలు (250–5,000 ఉద్యోగులు) ప్రయాణ ఖర్చుల కోసం ఏటా రూ.10 కోట్లు కేటాయిస్తున్నాయి. భారీ పరిశ్రమలకు (5,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు) ప్రయాణ ఖర్చులు ఉద్యోగుల సంఖ్యకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటాయి. అగ్రశ్రేణి 100 లిస్టెడ్ సంస్థల విశ్లేషణలో ప్రముఖ ఐటీ సంస్థ అత్యధికంగా 2022–23లో రూ.2,600 కోట్లకు పైగా వెచ్చించినట్లు నివేదిక పేర్కొంది. సహాయక సేవలకు డిమాండ్ పెరుగుతోంది.సర్వేలో పాల్గొన్నవారిలో 72 శాతం మంది టాక్సీ సేవలను కోరారు. 63 శాతం మంది ప్రయాణ ప్లాట్‌ఫామ్‌లపై వీసా సహాయం డిమాండ్ చేస్తున్నారు. తద్వారా సమగ్ర ప్రయాణ పరిష్కారాల అవసరాన్ని నొక్కి చెప్పారు. ఐటీ సేవలు, బీఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్, ఏవియేషన్, ఆయిల్–గ్యాస్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్స్ రంగాలు కార్పొరేట్ ప్రయాణ వ్యయాలను పెంచే అగ్ర పరిశ్రమలుగా గుర్తింపు పొందాయి. భారత్‌లోని టాప్ 100 లిస్టెడ్ సంస్థలలో ప్రయాణ వ్యయంలో ఈ రంగాల వాటా 86 శాతం ఉంది. -
స్వర్గానికి కొంచెమే తక్కువ... ఎలా చేరుకోవాలో తెలుసా?
కాంచన్‌జంగ... మనదేశంలో ఎత్తైన శిఖరం. ప్రపంచ శిఖరాల జాబితాలో మూడవస్థానం. తొలిస్థానంలో ఎవరెస్టు ఉంటే రెండో స్థానంలో కేటూ ఉంది. కేటూ శిఖరం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పరిధిలో ఉండడంతో మనదేశంలో తొలి ఎత్తైన శిఖరం రికార్డు కాంచన్జంగకు వచ్చింది. ప్రపంచంలో అద్భుతంగా విస్తరించిన అరుదైన నేషనల్ పార్కుల్లో కూడా కాంచన్‌జంగ నేషనల్ పార్కుది ప్రత్యేకమైన స్థానం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది విదేశీ ట్రెకర్లను ఆకర్షిస్తున్న కాంచన్‌జంగ నేషనల్పార్కు, పర్వత శిఖరాలను వరల్డ్ టూరిజమ్ డే (27, సెప్టెంబర్) సందర్భంగా మనమూ చుట్టి వద్దాం...స్వర్గానికి కొంచెమే తక్కువపక్షులు, జంతువులు, పర్వతసానువులు, మంచు శిఖరాలను సంతృప్తిగా వీక్షించాలంటే ట్రెకింగ్‌ను మించినది లేదు. కంచన్‌జంగ నేషనల్ పార్కు, పర్వత శిఖరాలకు ట్రెకింగ్ చేయాలనుకునేవాళ్లకు దారులు పెంచింది సిక్కిం రాష్ట్రం. ట్రెకింగ్‌లో త్వరగా గమ్యాన్ని చేరాలని హడావుడిగా నడిచే వాళ్లు తమ చుట్టూ ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించలేరు. ప్రశాంతంగా అడుగులు వేస్తూ సరస్సులు, హిమనీ నదాలు, రోడోడెండ్రాన్ పూల చెట్లు, ఓక్ చెట్లు, ఔషధవృక్షాలను మెదడులో ముద్రించుకోవాలి. ఎప్పుడు కంటికి కనిపిస్తాయో తెలియని కస్తూరి జింక, మేక జాతికి చెందిన హిమాలయ తార్, అడవి కుక్కలు, హిమాలయాల్లో మాత్రమే కనిపించే నీలం గొర్రెలు, మంచు చిరుత, ఎర్రటిపాండా, నల్ల ఎలుగుబంటి, టిబెట్ గాడిదల కోసం కళ్లను విప్పార్చి శోధించాలి. కాంచన్‌జంగ నేషనల్పార్క్ ట్రెకింగ్‌లో కాళ్ల కింద నేలను చూసుకోవడంతోపాటు అప్పుడప్పుడూ తలపైకెత్తి కూడా చూస్తుండాలి. తలదించుకుని ముందుకు΄ోతే పక్షులను మిస్సవుతాం. పక్షిజాతులు 500కు పైగా ఉంటాయి. వాటిని గుర్తించడం కూడా కష్టమే. ఆకుపచ్చరంగులో మెరిసే రెక్కలతో ఏషియన్ ఎమరాల్డ్కూ వంటి అరుదైన పక్షులు కనువిందు చేస్తాయి. కాంచన్‌జంగ పర్వత శిఖరాన్ని చేరడానికి మౌంటనియరింగ్లో శిక్షణ ఉండాలి. ట్రెకింగ్ చేయడానికి సాధారణం కంటే ఒక మోస్తరు ఎక్కువ ఫిట్నెస్ ఉంటే చాలు.నదం నదవుతుంది!కశ్మీర్లో చలికి గడ్డకట్టిన దాల్ లేక్‌ను చూస్తాం. కంచన్‌జంగ టూర్లో జెమూ గ్లేసియర్‌ను తప్పకుండా చూడాలి. ఈ హిమానీనదం దాదాపుపాతిక కిలోమీటర్లకు పైగా ఉంటుంది. మంచులా బిగుసుకుపోయిన నీరు రాతికంటే గట్టిగా తగులుతుంది. ఎండాకాలంలో కరిగి నీరయి ప్రవహిస్తూ అనేక ఇతర నదులకు చేరుతుంది. తీస్తా నదికి కూడా ఈ గ్లేసియరే ఆధారం.శిఖరాలను చూడవచ్చు!హిమాలయాలను ఏరియల్ వ్యూలో చూడడానికి విమాన ప్రయాణంలోనే సాధ్యం. కంచన్ జంగ నేషనల్ పార్కుకు చేరాలంటే సిలిగురి, బాగ్డోగ్రా ఎయిర్΄ోర్టు నుంచి 220కిమీల దూరం ప్రయాణించాలి. ఈ దూరం రోడ్డు మార్గాన వెళ్ల వచ్చు లేదా హెలికాప్టర్లో 20 నిమిషాల ప్రయాణం. రైలు ప్రయాణాన్ని ఇష్టపడే వాళ్లు జల్పాయ్గురిలో దిగాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలి. పరిసరాలను, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రైలు, రోడ్డు ప్రయాణాలు బెస్ట్. ఒకవైపు ఫ్లయిట్ జర్నీ, మరో వైపు ట్రైన్ జర్నీప్లాన్ చేసుకుంటే టూర్ పరిపూర్ణమవుతుంది. ఇక్కడ పర్యటించడానికి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అనుకూలం. మనదేశంలో సింగిల్ యూజ్ ప్లాలాస్టిక్ని నిషేధించిన తొలి రాష్ట్రం సిక్కిం. పర్యాటకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనుషులను, లగేజ్‌ని సోదా చేసి ప్లాస్టిక్ వస్తువులను బయటవేస్తారు. -
జాబిల్లిపై కారులో!
టోక్యో: సంప్రదాయకంగా అపోలో మిషన్ మొదలు తాజా ప్రయోగాల దాకా జాబిల్లిపై జరిగిన అన్ని ప్రయోగాల్లో ల్యాండర్, రోవర్‌లనే అధికంగా వాడారు. మానవరహితంగా కదిలే రోవర్ కొద్దిపాటి దూరాలకు వెళ్లగలవు. అక్కడి ఉపరితల మట్టిని తవ్వి చిన్నపాటి ప్రయోగాలు చేయగలవు. అయితే వీటికి చెల్లుచీటి పాడేస్తూ చంద్రుడిపై ఏకంగా కారులో వ్యోమగాములు ప్రయాణించేలా ఒక అధునాతన స్పెషల్ కారును తయారుచేస్తామని జపాన్ ప్రకటించింది. ఆటోమోటివ్ దిగ్గజం టొయోటాతో కలిసి తాము తయారుచేయబోయే భారీ వాహనం వివరాలను జపాన్‌లోని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) తాజాగా వెల్లడించింది. భూమి లాంటి వాతావరణం అక్కడ లేని కారణంగా చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ చాలా తక్కువ. దీంతో సాధారణ కారు అక్కడ చకచకా ముందు కదలడం చాలా కష్టం. అందుకే ఒత్తిడితో నడిచే ప్రత్యేక వాహనాన్ని రూపొందిస్తామని టొయోటా సంస్థ తెలిపింది. ఈ కారు కథాకమామిషు ఓసారి చూద్దాం.. అమెరికా నాసా వారి ప్రతిష్టాత్మక ఆరి్టమిస్–8 మిషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా కారులా ఉండే అత్యాధునిక రోవర్ వాహనాన్ని సిద్ధంచేయనున్నారు. ఈ వాహనంలో వ్యోమగాములు ఎక్కువ కాలం గడపొచ్చు. సంప్రదాయ రోవర్ మాదిరిగా స్వల్ప దూరాలకుకాకుండా చాలా దూరాలకు ఈ వాహనం వెళ్లగలదు. వ్యోమగాములు చేపట్టబోయే అన్ని ప్రయోగాలకు సంబంధించిన ఉపకరణాలు ఇందులో ఉంటాయి. గతంలో ఎన్నడూ వెళ్లని ప్రాంతాలకు వెళ్తూ కారు లోపల, వెలుపల ప్రయోగాలు చేయొచ్చు. చందమామపై వేర్వేరు ప్రదేశాల వాతావరణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తూ వ్యోమగాములు అక్కడి నేల స్వభావాన్ని అంచనావేయొచ్చు. వ్యోమగాముల రక్షణ కోసం లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్, వాహనం దిగి ఎక్కువసేపు బయట గడిపితే రేడియేషన్ ప్రభా వానికి లోనుకాకుండా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు, దిగి సులభంగా ఆ ప్రాంతంలో కలియతిరిగేందుకు ‘ఎయిర్‌లాక్’వ్యవస్థ ఇలా పలు ఏర్పాట్లతో వాహనాన్ని తీర్చిదిద్దుతామని జాక్సా తెలిపింది. ఆటోమొబైల్ సాంకేతికతలో జపాన్‌ది అందెవేసిన చేయి. దీంతో జ పాన్ టెక్నాలజీ, అంతరిక్ష అనుభవం చంద్రుడి ఉపరితలంపై కొత్త తరహా ప్రయోగాలకు బాటలు వేస్తాయని నాసా తెలిపింది. -
బాజీరావు ఇల్లు
రణవీర్ సింగ్, దీపికా పడుకోన్ నటించిన బాజీరావ్ మస్తానీ సినిమా గుర్తందా? ఆ సినిమాలో బాజీరావు ఇల్లు శనివార్వాడా కళ్ల ముందు మెదులుతోందా? ఆ శనివార్ వాడా ఉన్నది పూణేకి సమీపంలోనే. ఆ సినిమాలో అనేక ప్రధానమైన సన్నివేశాల చిత్రీకరణ ఈ కోటలోనే జరిగింది. పూణేకి వెళ్లాల్సిన పని పడితే తప్పకుండా చూడండి. కోట ప్రధానద్వారం భారీ రాతి నిర్మాణం. ఏడంతస్థుల నిర్మాణంలో ఒక అంతస్థు మాత్రమే రాతి కట్టడం, ఆ తర్వాత ఇటుకలతో నిర్మించారు. కోటలోపల ప్రతి అంగుళమూ మరాఠాల విశ్వాసాలను, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంటుంది. 18వ శతాబ్దం నాటి ఈ నిర్మాణం భారత జాతీయ రాజకీయ క్లిష్టతలను కూడా ఎదుర్కొంది. 19వ శతాబ్దంలో కొంత భాగం అగ్నికి ఆహుతైపోయింది. నిర్మాణపరంగా, చరిత్ర పరంగా గొప్ప నేపథ్యం కలిగిన ఈ కోట పర్యాటకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. బాజీరావు మస్తానీ సినిమా తర్వాత పలువురి దృష్టి దీని మీదకు మళ్లింది. మహారాష్ట్ర టూరిజమ్ గార్డెన్లను మెయింటెయిన్ చేస్తోంది.కానీ పెరుగుతున్న పర్యాటకులకు తగినట్లు పార్కింగ్, రెస్టారెంట్ సౌకర్యం లేదు. ఈ కోటలో కాశీబాయ్ ప్యాలెస్, అద్దాల మహల్ పిల్లలను ఆకట్టుకుంటాయి. ఈ కోట లోపల తిరుగుతూ ఉంటే సినిమా దృశ్యాలు కళ్ల ముందు మెదులుతూ మనమూ అందులో భాగమైన భావన కలుగుతుంది. టీనేజ్ పిల్లలకు ఈ నిర్మాణాన్ని చూపించి తీరాలి. -
రూట్ బ్రిడ్జ్ యునెస్కో జాబితాలో...
మేఘాలయ రాష్ట్రంలో సర్వసాధారణంగా కనిపించే లివింగ్ రూట్ బ్రిడ్జీల గురించి మనకు తెలిసిందే. ఆ రాష్ట్రానికే మన దేశానికీ ప్రకృతి పరంగా గుర్తింపు తెచ్చిన ఈ రూట్ బ్రిడ్జ్‌లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వడం కోసం ప్రతినిధుల బృందం తరలి వచ్చింది. ప్రస్తుతం యునెస్కో తాత్కాలిక జాబితాలో ఉన్న లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లను ప్రపంచ ప్రసిద్ధ వారసత్వ జాబితాలోకి చేరనుందని మేఘాలయ పర్యాటక మంత్రి పాల్ తెలియజేస్తున్నారు. 42వ యునెస్కో జనరల్ కాన్ఫరె ్స ప్రెసిడెంట్, రొమేనియా రాయబారి అయిన సిమోనా–మిరేలా మికులేస్కుతో లింగ్డో, జింగ్కీంగ్ జ్రీ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో గుర్తించడం కోసం సమావేశం జరి΄ారు. ఈ సమావేశంలో యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి కూడా ఉన్నారు. -
మస్కట్ పిలుస్తోంది!
సెప్టెంబర్ నెలలో రాజధాని నగరం మస్కట్ నగరంలో విహరించమని పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది ఒమన్ దేశం. చల్లటి వాతావరణంలో టూరిస్టుల తాకిడి తక్కువగా ఉన్న సమయం షాపింగ్‌కి అనువైన కాలం అంటూ ఈ వీసా సౌకర్యం కల్పిస్తోంది ఒమన్ టూరిజం. ఇక్కడ ఏమేమి చూడవచ్చు, ఏమేమి కొనవచ్చు! ఓ లుక్ వేద్దాం.మస్కట్ నగరంలో పురాతన కోటలున్నాయి, అద్భుతంగా నిర్మించిన మసీదులున్నాయి, కనువిందు చేసే ΄ార్కులు, సంస్కృతి సంప్రదాయాలు చరిత్రకు ఆలవాలంగా భారీ మ్యూజియాలున్నాయి. అల్ జలాయ్ ఫోర్ట్‌ను చూడాలి. 16వ శతాబ్దంలో ΄ోర్చుగీసు స్వాధీనంలోకి వెళ్లిన అరబ్బుల కోట ఒమన్ చరిత్రకు ప్రతిబింబం. ఇక ప్రార్థన మందిరాలను చూడాలంటే సుల్తాన్ ఖాబూస్ గ్రాండ్ మాస్క్. ఇది ఎంత పెద్దదంటే ఒకేసారి ఇరవై వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చన్నమాట. ఇక షాపింగ్ చేయాలంటే ముత్రాహ్ సౌక్‌ను తప్పకుండా చూడాలి. అరబిక్ సంప్రదాయం కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లు ఉంటుంది. ముండూస్ (ఆభరణాల పెట్టె), టర్కీ కార్పెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, పోస్ట్ కార్డ్, పెర్ఫ్యూమ్, కర్జూరాలను కొనుక్కోవచ్చు. కశ్మీర్ కార్పెట్లు ఈ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణ.మ్యూజియం చేసే మ్యాజిక్: నేషనల్ మ్యూజియంలోకి వెళ్లిన తర్వాత మనకు తెలియకుండానే టైమ్ మెషీన్‌లోకి వెళ్లి΄ోతాం. ఎన్ని గంటలకు బయటకు వస్తామో చెప్పలేం. ఇక ముఖ్యంగా చెప్పుకోవలసింది బైట్ అల్ జుబైర్ గురించి. ఇది ఓమన్ సంప్రదాయ వాస్తుశైలి నిర్మాణం. ఫర్నిచర్, హస్తకళాకృతులు, స్టాంపులు, నాణేల సుమహారం. ఇదీ సింపుల్‌గా మస్కట్ నగరం. ముంబయి నుంచి డైరెక్ట్ ఫ్లయిట్ ఉంది. రెండున్నర గంటల ప్రయాణం. -
పెరిగిన ట్రక్ అద్దెలు
పండుగ సీజన్ సమీపిస్తుండటం, ఎన్నికల తర్వాత కార్యకలాపాలు పుంజుకోవడంతో ఆగస్టులో రవాణాకు డిమాండ్ పెరిగినట్లు శ్రీరామ్ ఫైనాన్స్ రూపొందించిన మొబిలిటీ బులెటిన్ వెల్లడించింది. దీంతో వరుసగా రెండో నెల కూడా ట్రక్కుల అద్దెలు పెరిగినట్లు సంస్థ ఎండీ వైఎస్ చక్రవర్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కోల్‌కతా–గౌహతి మార్గంలో ట్రక్కుల అద్దెలు అత్యధికంగా 3 శాతం, ఢిల్లీ–హైదరాబాద్ రూట్లో 2.3 శాతం పెరిగాయి. శ్రీనగర్ ప్రాంతంలో యాపిల్స్, ఎన్నికల సీజన్ కారణంగా సరుకు రవాణా ధరలు దాదాపు 10 శాతం అధికమయ్యాయి. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ట్రక్కుల వినియోగం గణనీయంగా వృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వర్షాల కారణంగా వాహన విక్రయాలు నెమ్మదించాయి. తెలుగు రాష్ట్రాలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి బైటపడి, పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..గతంలో అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల బ్యారెల్ క్రూడాయిల్ ధర పెరిగి 115 డాలర్లకు చేరింది. దాంతో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర 72 డాలర్లకు లభిస్తోంది. కానీ అందుకు తగ్గట్టుగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. దాంతో చేసేదేమిలేక ట్రక్కు యజమానులు అద్దెలు పెంచారు. ఇటీవల ప్రభుత్వ అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అందులో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే ప్రతిపాదనలున్నట్లు కొందరు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం వీటి ధరలను తగ్గిస్తే ట్రక్కు అద్దెలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అయితే కొందరు యాజమానులు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా అద్దెలు తగ్గించడానికి సుముఖంగా ఉండడంలేదు. ప్రభుత్వం స్పందించి వాటి ధరలు తగ్గేలా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. -
బెంగళూరు - హైదరాబాద్ టిక్కెట్ రూ.99కే!
అంతర్జాతీయ ట్రావెల్ సర్వీసు అందించే ఫ్లిక్స్‌బస్ సంస్థ ఇండియాలోని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నై మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించింది. కేవలం రూ.99కే హైదరాబాద్-బెంగళూరు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.కర్ణాటక వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ రూట్లలో బస్సులను ప్రారంభించారు. బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్యాసింజర్ల సంఖ్య అధికంగా ఉండడంతో వారి ప్రయాణాలకు అనుగుణంగా కంపెనీ ఆఫర్ ప్రకటించింది. రూ.99కే ఈ రూట్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ వినియోగించుకోవాలంటే ఈ నెల 3-15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ తేదీలు సెప్టెంబరు 10-అక్టోబరు 6 మధ్య ఉండాలని పేర్కొంది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫ్లిక్స్ సీఓఓ మ్యాక్స్ జుమేర్, సహ వ్యవస్థాపకులు డేనియల్ క్రాస్ పాల్గొన్నారు.ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఆశించినమేర వృద్ధి చెందడం లేదు. దాంతో చాలామంది ప్రయాణికులు దూర ప్రయాణాలకు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఎంచుకుంటున్నారు. వారాంతాలు, సెలవులు, పండగల సమయాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. కంపెనీలు అందుకు అనువుగా సర్వీసులు నడుపుతూ లాభాలు గడిస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటికే అంతర్జాతీయంగా సేవలందిస్తున్న ఫ్లిక్స్‌బస్ అనే జర్మన్ కంపెనీ దక్షణాది రాష్ట్రాల్లో సేవలు ప్రారంభించడం విశేషం. 2011లో స్థాపించిన ఈ కంపెనీ యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి దాదాపు 40 దేశాల్లో సర్వీసులు నడుపుతోంది. 4 లక్షల రూట్లలో 5000 ప్రదేశాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. -
మణిమహేష్ యాత్ర ప్రారంభం
హిమాచల్ ప్రదేశ్‌లో జన్మాష్టమికి మొదలై రాధాష్టమికి ముగిసే యాత్రను మణిమహేష్ యాత్ర అని అంటారు. ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. అటు ప్రకృతి ప్రేమికులకు, ఇటు సాహస ప్రియులకు ఎంతో ఇష్టమైన ప్రాంతం ఇది. అలాగే విహారయాత్రలు చేసేవారికి, ఆధ్యాత్మిక యాత్రలు చేపట్టేవారికి హిమాచల్‌ప్రదేశ్ గమ్యస్థానంగా నిలిచింది.వర్షాకాలం మినహా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించవచ్చు. ముఖ్యంగా జన్మాష్టమి నుండి రాధాష్టమి వరకు మణిమహేష్ సరస్సును సందర్శించేందుకు ఉత్తమమైన సమయం. దాల్ సరస్సునే మణిమహేష్ సరస్సును అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం జన్మాష్టమి అనంతరం మణిమహేష్ సరస్సును చూసేందుకు యాత్రికులు తరలివస్తుంటారు.ఆగస్టు 26 నుండి మణిమహేష్ యాత్ర ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మణిమహేష్ సరస్సును సందర్శించవచ్చు. కైలాస శిఖరంపై నివసిస్తున్న మణిమహేషుడు(మహాశివుడు)ఈ సమయంలో దాల్ సరస్సునుంచి అద్భుతంగా కనిపిస్తాడని చెబుతారు. మణిమహేష్ యాత్ర ప్రతియేటా సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వచ్చే జన్మాష్టమి నుంచి మొదలువుతుంది. తొమ్మదివ శతాబ్దంలో ఈ ప్రాంతానికి చెందిన రాజు సాహిల్ వర్మన్ ఇక్కడే శివుణ్ణి దర్శనం చేసుకున్నాడని చెబుతారు. సెప్టెంబర్ 11 రాధాష్టమితో మణిమహేష్ యాత్ర పరిసమాప్తమవుతుంది. -
పెరుగుతున్న ట్రావెల్ స్కామ్‌లు.. బాధితులు వీళ్లే..
దేశ విదేశాలకు ఇటీవల హాలిడే ట్రిప్‌లకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరిలో యువత, టీనేజర్లే అధికంగా ఉంటున్నారు. అయితే ఇలా హాలిడే ట్రిప్‌లకు వెళ్లేవారు ట్రావెల్ బుకింగ్ స్కామ్‌లకు గురవుతున్నారు. ఇలాంటి ట్రావెల్ స్కామ్‌లను అరికట్టడానికి ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్స్తో చేతులు కలిపింది.మార్కెట్ రీసెర్చ్ సంస్థ యుగోవ్ ఇటీవల ఒక అధ్యయనం చేసింది. ఇందులో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌కు చెందిన మిలీనియల్స్ (1980, 90లలో పుట్టినవారు), జెన్ జెడ్ (1995-2010 మధ్య జన్మించినవారు) టీనేజర్లు ఎక్కువగా ప్రయాణ స్కామ్‌ల బారిన పడుతున్నారు. బాధితులు సగటున రూ.1,02,233 నష్టపోతున్నారు. డబ్బు ఆదా అవుతుందంటే చాలు దాదాపు సగం మంది భారతీయ ప్రయాణికులు హాలిడే బుక్ చేసుకునేటప్పుడు అప్రమత్తతను పట్టించుకోవటం లేదని ఈ అధ్యయనం పేర్కొంది. 40 శాతం మందికిపైగా పరిమిత సమాచారంతోనే బుకింగ్ చేస్తుండటం వల్ల నష్టపోతున్నారని వెల్లడించింది.ఈ అధ్యయనానికి అనుగుణంగా వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ తమ కస్టమర్ ఇన్ఫర్మేషన్, బుకింగ్‌ల రక్షణ కోసం అనేక చర్యలను అమలు చేసింది. స్కామ్‌లు, ఆన్-ప్లాట్‌ఫారమ్ మెసేజింగ్ అరికట్టడానికి గెస్ట్ పేమెంట్ పేమెంట్ ప్రొటెక్షన్ కోసం ప్రత్యేక బృందాలు, వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వీటిలో భాగంగా చెక్-ఇన్ తర్వాత 24 గంటల వరకు పేమెంట్‌ను నిలిపివేయడం ద్వారా యూజర్లకు అదనపు భద్రతను అందిస్తోంది. -
ఫ్రీ బస్సు చిత్రాలు..
-
ట్రావెల్ ఆపరేటర్లకు అనుకూలం
న్యూఢిల్లీ: దేశీ పర్యాటక రంగం జోరు మీద ఉండడంతోపాటు, విదేశీ ప్రయాణాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి ఈ రంగంలో పనిచేసే ట్రావెల్ ఆపరేటర్లకు అనుకూలిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్ ఆపరేటర్ల ఆదాయం 15–17 శాతం వరకు వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. మౌలిక వసతులు మెరుగుపడుతుండడం, ఖర్చు చేసే ఆదాయం పెరుగుదల, ప్రయాణాలకు మొగ్గు చూపించే ధోరణికి తోడు.. దేశీ పర్యాటక రంగంపై పెరిగిన ప్రభుత్వ ప్రాధాన్యం ఈ రంగం వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ఈ రంగంలో 60 శాతం వాటా కలిగిన నలుగురు ప్రధాన ఆపరేటర్లను విశ్లేíÙంచిన అనంతరం క్రిసిల్ రేటింగ్స్ ఈ గణాంకాలను విడుదల చేసింది. ‘‘ట్రావెల్ ఆపరేటర్ల రుణ పరపతి సైతం ఆరోగ్యకర స్థాయిలో ఉంది. బలమైన బ్యాలన్స్ షీట్లకుతోడు గత ఆర్థిక సంవత్సరంలో మాదిరే 6.5–7 శాతం మేర స్థిరమైన మార్జిన్లు.. మెరుగైన నగదు ప్రవాహాలకు మద్దతునిస్తాయి. దీంతో ట్రావెల్ ఆపరేటర్లు రుణంపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం రాదు’’అని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. మెరుగైన వసతుల కారణంగా కొత్త పర్యాటక ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు, ఆధ్యాతి్మక పర్యాటకానికి డిమాండ్ పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. విదేశీ పర్యాటకుల రాక కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు తెలిపింది. ముఖ్యంగా కార్పొరేట్సమావేశాలు, సదస్సుల నుంచి డిమాండ్ పెరిగినట్టు పేర్కొంది. ఎన్నో అనుకూలతలు.. అధికంగా ఖర్చు చేసే ఆదాయం, 37 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే సదుపాయం, అడుగు పెట్టిన వెంటనే వీసా కారణంగా విదేశీ విహార యాత్రలు సైతం పెరుగుతున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. ఇక ఆకర్షణీయమైన ట్రావెల్ ప్యాకేజీలు, దక్షిణాసియా, మధ్య ఆసియా దేశాలకు ఎయిర్‌లైన్స్ సంస్థలు సరీ్వసులు నడిపిస్తుండడం కూడా డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. ‘‘కరోనా తర్వాత అప్పటి వరకు ఎటూ వెళ్లలేకపోయిన వారు పెద్ద ఎత్తున ప్రయాణాలకు మొగ్గు చూపించగా, ఆ ధోరణి తగ్గిపోయి.. సాధారణ పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు, పట్టణీకరణ, అందుబాటు ధరల్లో టూర్ ప్యాకేజీలు, ఆదాయంలో స్థిరమైన వృద్ధి, ఈ రంగంపై పెరిగిన ప్రభుత్వం దృష్టి ఇవన్నీ టూర్, ట్రావెల్ రంగాన్ని స్థిరంగా నడిపిస్తాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ తెలిపారు. -
హైవే ఎక్కితే టోల్!
సాక్షి, హైదరాబాద్: హైవే మీద కాస్త దూరమే ప్రయాణించినా ఇకపై సదరు వాహనం సంబంధిత ఖాతా నుంచి టోల్ రుసుము కట్ కానుంది. ప్రస్తుతం టోల్ ప్లాజాల్లోంచి వాహనం వెళ్తేనే టోల్ చెల్లించాల్సి వస్తోంది. టోల్ బూత్ వచ్చేలోపు రోడ్డు దిగిపోతే చెల్లించాల్సిన అవసరం ఉండటం లేదు. ఇకపై అలా కాకుండా హైవే ఎక్కితే చాలు రుసుము చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. వచ్చే సంవత్సరానికి ప్రాథమిక స్థాయిలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దశల వారీగా పూర్తిస్థాయిలో దీన్ని అమలు చేయనున్నారు. సెన్సార్లు, ఫాస్టాగ్‌లకు చెల్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాస్టాగ్‌తో అనుసంధానమై టోల్ వసూలు చేస్తున్నారు. గతంలో మాన్యువల్‌గా వసూలు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న టోల్ ప్లాజాలనే వినియోగించుకుంటున్నారు. అక్కడి సిబ్బందికి నిర్ధారిత రుసుము చెల్లించి రశీదు పొందే పద్ధతి తొలగించి, సెన్సార్లు ఫాస్టాగ్ స్టిక్కర్‌ను రీడ్ చేయటం ద్వారా ఖాతా నుంచి డబ్బులు తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఫాస్టాగ్ ఖాతాను వాడకాన్ని బట్టి ఎప్పటికప్పుడు టాప్ అప్ చేసుకోవల్సి ఉంటుంది.కాగా దీనికి పూర్తి భిన్నంగా కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంతో అనుసంధానమయ్యే కొత్త టోల్ వ్యవస్థను తీసుకొస్తోంది. టోల్ బూత్ అవసరం లేకుండా ఇది పనిచేస్తుంది. వాహనాలు టోల్ రోడ్ల మీద తిరిగిన దూరాన్ని ఉపగ్రహ సాయంతో గుర్తించి, ఆ మేరకు టోల్‌ను లెక్కిస్తుంది. ఆ వ్యవస్థతో అనుసంధానించిన ఖాతా నుంచి అంతమేర టోల్ రుసుము డిడక్ట్ అవుతుంది. వాహనాల బారులు ఉండవు గతంలో మాన్యువల్‌గా టోల్ వసూలు చేసినప్పుడు రద్దీ అధికంగా ఉండే సమయంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాల్సి వచ్చేది. దీన్ని నివారించేందుకు కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని తెచి్చంది. వాహనం టోల్ బూత్‌లోకి ప్రవేశిస్తుండగానే సెన్సార్లు ఫాస్టాగ్‌ను రీడ్ చేసి టోల్‌ను డిడక్ట్ చేస్తాయి. ఈ పద్ధతిలో వాహనాల బారులు ఉండవని భావించారు.కానీ సెన్సార్లు సరిగా పనిచేయకపోవడం, ఇతరత్రా కారణాలతో రద్దీ సమయాల్లో ఇప్పటికీ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతూనే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంను కేంద్రం తెరపైకి తెస్తోంది. ఈ పద్ధతిలో వాహనం ప్రయాణిస్తున్న సమయంలోనే క్షణాల్లో టోల్ లెక్కించడం, డబ్బులు డిడక్ట్ కావడం జరుగుతుంది. దీంతోపాటు అసలు టోల్‌బూత్‌లే ఉండకపోవడంతో ఎక్కడా వాహనాలు వేచి చూడాల్సిన పరిస్థితి రాదు. ప్రభుత్వానికి 3 రెట్లు పెరగనున్న ఆదాయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై రూ.40 వేల కోట్ల మేర టోల్ వసూలవుతోంది. ఈ ఆదాయం పెరగనుంది. ఇప్పటివరకు టోల్ గేట్లు వచ్చేలోపే దారి మళ్లి వెళ్లే వాహనాల వల్ల ఆదాయం రావటం లేదు. కొత్త విధానంతో టోల్ రోడ్డుపై వాహనాలు స్వల్ప నిడివిలో ప్రయాణించినా టోల్ వసూలు చేసే అవకాశం ఉండటంతో టోల్ ఆదాయం కనీసం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. పైగా టోల్ బూత్‌ల నిర్వహణ భారం ఉండదు. ఇలా పనిచేస్తుంది.. టోల్ రోడ్లను శాటిలైట్లు గుర్తించేందుకు వీలుగా ఆయా మార్గాల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆ రోడ్లపై ప్రత్యేక కెమెరాలు కూడా ఉంటాయి. ఇవి ఉపగ్రహంతో అనుసంధానమై పనిచేస్తాయి. ఇక వాహనాల్లో ఆన్‌బోర్డ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి జీపీఎస్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. ఇవన్నీ పరస్పరం సమన్వయం చేసుకుంటూ, వాహనం టోల్ రోడ్డు మీద ఎంత దూరం ప్రయాణించిందో కచి్చతంగా నిర్ధారిస్తాయి.వాహనదారు నిర్ధారించిన బ్యాంకు ఖాతాతో టోల్ వసూలు వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఏ ప్రాంతంలో టోల్ రోడ్డుపైకి వాహనం చేరింది, ఏ ప్రాంతంలో అది హైవే దిగిందీ అన్న విషయాన్ని క్షణాల్లో నమోదు చేసి టోల్‌ను నిర్ధారించి, సంబంధిత ఖాతా నుంచి వసూలు చేసుకుంటుంది. ఈ వ్యవస్థకు సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది.మైసూరు–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే, హర్యానా లోని పానిపట్–హిస్సార్ జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలిస్తోంది. మరో ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దీన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. -
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు: అమెరికా
వాషింగ్టన్: భారత్‌లో ఉగ్రవాదుల కదలికలు అధికంగా కలిగిన మణిపూర్, జమ్ముకశ్మీర్, భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు, దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా తమ దేశ పౌరులకు సూచించింది.అమెరికా తాజాగా భారతదేశంలో పర్యటించే తమ దేశపౌరులకు పలు సలహాలు అందజేసింది. వీటిలో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని నవీకరించినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది. నేరాలు, ఉగ్రవాదం, నక్సలిజం కారణంగా, భారతదేశంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటూ ఆమెరికా సలహా ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పు పెరిగిందని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, హింసాయుత పరిస్థితులు నెలకొన్న కారణంగా అక్కడికు వెళ్లాలనుకునేముందు అమెరికన్లు పునరాలోచించాలని సూచించింది.భారతదేశంలో వేగంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటని అమెరికా ట్రావెల్ అడ్వైజరీ పేర్కొంది. పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రదేశాలలో లైంగిక వేధింపుల వంటి హింసాత్మక నేరాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఎప్పుడైనా దాడి చేయవచ్చు. వారు పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని వివరించింది. -
ప్రమాదకరంగా మారనున్న జలపాతాలు
ఉత్తరాఖండ్... దేశంలోనే అత్యంత అందమైన రాష్ట్రంగా పేరొందింది. ఇక్కడి ప్రకృతి రమణీయత ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకుల మదిని పులకింపజేస్తాయి. వేసవిలో ఇక్కడికి వచ్చి, జలపాతాల్లో జలకాలాటలు ఆడినవారు వర్షాకాలంలో వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రుతుపవనాలు ఉత్తరాఖండ్‌ను తాకాయి. వేసవిలో ఎండ వేడిమి నుండి తప్పించుకునేందుకు ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, దాని పరిసర ప్రాంతాలకు వచ్చి, ఇక్కడి జలపాతాలలో స్నానం చేసినవారు ఇకపై ఈ జలపాతాలకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి.ఉత్తరాఖండ్‌లోని ధోకనే జలపాతం నైనిటాల్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వారు ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో ఇక్కడ నీరు అత్యధిక స్థాయిలో జాలువారుతుంది. అలాంటప్పుడు ఇక్కడ స్నానం చేయకూడదు. ఒడ్డున కూర్చుని స్నానం చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.ఉడ్‌ల్యాండ్ జలపాతం నైనిటాల్-కలాధుంగి రోడ్డులో ఉంది. స్థానికులు దీనిని మిల్కీ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. వర్షాకాలంలో ఇక్కడ నీటి ప్రవాహం వేగంగా ఉంటుంది. ఈ జలపాతం ఒక వాలులో ఉన్నందున పర్యాటకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జలపాతం కిందకు వెళ్లడం అత్యంత ప్రమాదకరమని స్థానికులు చెబుతుంటారు.జిమ్ కార్బెట్ జలపాతం కలదుంగి-రామ్‌నగర్ రహదారిలో ఉంది. ఈ జలపాతం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ స్నానం చేయడం నిషిద్ధం. వర్షాకాలంలో ఇక్కడ నీటి పరిమాణం మరింతగా పెరుగుతుంది. జలపాతం సమీపంలోకి వెళ్లడం ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.భాలుగాడ్ జలపాతం నైనిటాల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని అడవుల మధ్య అందమైన పర్వత మార్గాల్లో ట్రెక్కింగ్ ద్వారా ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. వేసవిలో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఈ జలపాతం ఎంత అందంగా కనిపిస్తుందో అంతే ప్రమాదకరంగా మారుతుంది. వర్షాకాలంలో ఈ జలపాతంలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది. ఈ జలపాతంలో స్నానానికి దూరంగా ఉండటం ఉత్తమం.దట్టమైన అడవుల మధ్య హిడెన్ జలపాతం ఉంది. వేసవిలో ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు. వర్షాకాలంలో ఈ జలపాతం అసాధారణ నీటిమట్టంతో ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు. అందుకే వర్షాకాలంలో ఇటువైపు రాకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. -
విదేశాలకే వి‘హారం’
సాక్షి, అమరావతి: భారతీయులు విదేశీయానాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. 2019తో పోలిస్తే జపాన్‌లో 53 శాతం, అమెరికాలో 59 శాతం, వియత్నాంలో 248 శాతం భారతీయ ప్రయాణికులు రాకపోకలు పెరగడం విశేషం. మాస్టర్ కార్డ్ ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్ ‘బ్రేకింగ్ బౌండరీస్’ పేరుతో తాజా ట్రావెల్ ట్రెండ్స్‌ను విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఆదాయాన్ని మెరుగు పరచుకోవడంతో విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు సంఖ్య ట్రావెల్, టూరిజం రంగానికి ఊతమిస్తోందని నివేదిక పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల మందికిపైగా మధ్య తరగతి ప్రజలు (ఏడాదికి రూ.12 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారు). దాదాపు 20 లక్షల మంది అధిక ఆదాయ ప్రజలు (ఏటా రూ.66 లక్షలు కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు) కూడా అంతర్జాతీయ ప్రయాణికుల జాబితాలో చేరతారని అంచనా వేసింది. విస్తరిస్తున్న విలాసవంతమైన ఆలోచనలు ఔట్ బౌండ్ ఇండియా ట్రావెల్ రంగాన్ని అసాధారణ వృద్ధిలోకి తీసుకెళ్తున్నాయని అభిప్రాయపడింది. తొలి త్రైమాసికంలో 10 కోట్ల మంది ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే సుమారు 10 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక దశాబ్దం కిందటి వరకు ఈ సంఖ్యలో ప్రయాణాలు చేయాలంటే ఏడాది సమయం పట్టేది. అంటే భారతీయుల్లో ఏ స్థాయిలో ప్రయాణాలు వృద్ధి చెందాయో నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి దేశీయ ప్రయాణాలు 21శాతం, విదేశీ ప్రయాణాలు 4 శాతం మేర పెరిగినట్టు గుర్తించింది. ఆమ్స్టర్డామ్, సింగపూర్, లండన్, ఫ్రాంక్‌ఫర్డ్, మెల్‌బోర్న్‌లు ఈ వేసవి (జూన్–ఆగస్టు)లో భారతీయ ప్రయాణికులు సందర్శించే ఐదు ట్రెండింగ్ గమ్యస్థానాలుగా నిలవడం విశేషం. 2019, 2020లో ఒక పర్యటన సగటు వ్యవధి నాలుగు రోజులుగా ఉంటే ఈ ఏడాది ఐదు రోజులకు పెరిగింది. పెరిగిన క్రూయిజ్ ప్రయాణాలు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యూరోపియన్ చాంపియన్íÙప్ కారణంగా 2024లో జర్మనీలోని మ్యూనిచ్ టాప్ ట్రెండింగ్ డెస్టినేషన్‌గా నిలిచింది. గత మార్చికి ముందు 12 నెలల్లో ప్రజలు అత్యధికంగా ప్రయాణించిన గమ్యస్థానంగా జపాన్ నిలిచింది. ముఖ్యంగా ఐదు మార్కెట్లలో నాలుగు యూరోపియన్ గమ్యస్థానాలు, టాప్ 10లో 50 శాతం ఆసియా–పసిఫిక్ గమ్యస్థానాలు ఉన్నాయి. గడిచిన ఏడాది అత్యధికంగా ప్రయాణికులను ఆకర్షించిన గమ్యస్థానాల్లో జపాన్, ఐర్లాండ్, రొమేనియా, ఇటలీ, స్పెయిన్, మలేషియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, యూఏఈ, ఇండోనేషియా నిలిచాయి. అయితే విదేశీ సందర్శకుల రికవరీలో అమెరికా 2019తో పోలిస్తే 6 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. హోటల్ పరిశ్రమలలో నిరంతరం ధరల పెరుగుదల కారణంగా క్రూయిజ్ ప్రయాణాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్ క్రూయిజ్ ప్యాసింజర్ లావాదేవీల సంఖ్య 2019 కంటే దాదాపు 16 శాతం పెరిగాయి. -
Lok Sabha Election 2024: రా రమ్మని.. రారా రమ్మని
భారీ సంఖ్యలో ఉపాధికి నెలవైన ఐటీ, టెక్నాలజీ కంపెనీలు కీలకమైన లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యోగులతో పాటు ప్రజలను కూడా ఓటేలా ప్రోత్సహిస్తున్నాయి. ఓటేయడం పౌరుల బాధ్యత మాత్రమే కాదని, సామూహిక సంకల్ప శక్తికి సంకేతమని పేర్కొంటున్నాయి. భవిష్యత్ మార్గనిర్దేశకుల్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ముగిసిన నాలుగు విడతల పోలింగ్‌లోనూ టెక్ కంపెనీల ప్రచారం చెప్పుకోదగ్గ రీతిలో పని చేసింది.ఫ్లిప్‌కార్ట్ ‘‘మీ ఓటును ధ్రువీకరించుకున్నారా?’’ అంటూ ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ పోలింగ్ తేదీల్లో ‘ఎక్స్’ వేదికగా యూజర్లను అప్రమత్తం చేస్తూ వస్తోంది. ఈజ్ మై ట్రిప్ ‘‘రోడ్డెక్కండి. లోక్‌సభ ఎన్నికల వేళ మీ మూలాలకు (నియోజకవర్గాలకు) తిరిగి వెళ్లండి. చూడని ప్రదేశాలను అన్వేíÙంచండి’’ అంటూ ఆన్లైన్ ట్రావెల్ సేవల బుకింగ్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ పిలుపునిచి్చంది. మొబిక్విక్ ‘‘డిజిటల్ ఆవిష్కరణల నుంచి దేశ భవిత దాకా అన్నీ కేవలం ఒక్క ట్యాప్‌తోనే’’ అంటూ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా ఓటింగ్ హక్కు వినియోగ ప్రాధాన్యతను గుర్తు చేసింది. జొమాటో ‘‘ఎవరు నాయకత్వం వహించాలో ఓటుతో నిర్ణయించడం కంటే ఏం తినాలో నిర్ణయించుకోవడం అంత ముఖ్యమేమీ కాదు’’ అంటూ ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో కూడా ఎక్స్ ద్వారా తన కస్టమర్లకు ఓటు సందేశం ఇచి్చంది. ఓలా ‘‘మన తాతలు స్వాతంత్య్రం కోసం పోరాడారు. మన తల్లిదండ్రులు రోటి, కపడా, మకాన్ కోసం పోరాటం చేశారు. మన కలలకు తగ్గట్టుగా దేశాన్ని నిర్మించడం మన తరం బాధ్యత’’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ఎక్స్ ద్వారా కోరారు. స్విగ్గీ ‘‘తర్వాత ఏం తినాలా అంటూ గంటల తరబడి సమయం వెచి్చంచేవారు తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సైతం అంతే సమయాన్ని కేటాయించాలి’’ అని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పిలుపునిచి్చంది. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేసింది. ఓయో ‘‘సరైన ప్రభుత్వం కొలువుదీరేలా చూడండి. వెళ్లి ఓటు వేయండి’’ అని హోటల్ బుకింగ్ సేవల యాప్ ఓయో కోరింది. ర్యాపిడో క్యాబ్ సేవల సంస్థ ర్యాపిడో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వారి కోసం ఉచిత రైడ్లు ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం వోట్నౌ కూపన్ వాడుకోవాలని సూచించింది. ‘‘ఓటేయడం మీ బాధ్యత. మిమ్మల్ని పోలింగ్ బూత్‌కు చేర్చడం మా బాధ్యత’’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. నమ్మ యాత్రి ‘‘మీ దేశ తదుపరి గమ్యస్థానం కేవలం ఒక ప్రెస్ (క్లిక్) దూరంలోనే ఉంది’’ అంటూ క్యాబ్ సేవలను ఆఫర్ చేసే బెంగళూరు కంపెనీ నమ్మయాత్రి ఓటర్లకు ఇచి్చన సందేశానికి నగరంలో పోలింగ్ సందర్భంగా బాగా ఆదరణ లభించింది. ఇన్స్టాగ్రామ్ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ సైతం ప్రయతి్నస్తోంది. పోలింగ్ రోజున ఇన్స్టాగ్రామ్ యాప్‌లో సందేశాల ద్వారా యూజర్లను అప్రమత్తం చేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
సాంస్కృతిక పర్యాటకం, వైల్డ్‌లైఫ్ టూరిజం, మెడికల్ టూరిజం, గ్రామీణ టూరిజం, హిమాలయన్ ట్రెక్కింగ్, టెంపుల్ టూరిజం. ఇలా మన దేశంలో పర్యాటకం ఎన్నో రకాలు! లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల పర్యాటకం కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది! మన దేశంలో మామూలుగానే రైళ్లు, బస్సులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటాయి. పండుగలప్పుడైతే వాటిలో కాలు పెట్టే సందు కూడా ఉండదు! లోక్‌సభ ఎన్నికల సీజన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణాలు ఏకంగా 27 శాతం పెరిగాయట! ఇక్సిగో, అభీబస్ వంటి ట్రావెల్ ప్లాట్‌ఫాంలు చెబుతున్న గణాంకాలివి. ముఖ్యంగా పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రయాణాలు బాగా పెరిగినట్టు అభీబస్ సీవోవో రోహిత్ శర్మ తెలిపారు. తమిళనాడు, ఒడిశా, బిహార్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ నుంచి అంతర్రాష్ట ప్రయాణాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందట. ‘‘బస్సు ప్రయాణాలకు డిమాండ్ తమిళనాడులో 27 శాతం, రాజస్తాన్‌లో 26 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 24 శాతం, బీహార్‌లో 16 శాతం, ఒడిశాలో 10 శాతం పెరిగింది. కర్నాటక నుంచి తమిళనాడుకు బస్సు ప్రయాణం 21 శాతం, ముంబై నుంచి ఢిల్లీకి 52 శాతం, ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు 45 శాతం, చండీగఢ్ నుంచి శ్రీనగర్‌కు 48 శాతం, బెంగళూరు నుంచి ముంబైకి ఏకంగా 104 శాతం చొప్పున డిమాండ్ పెరిగింది’’ అని అభీబస్, ఇక్సిగో వెల్లడించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోవిడ్ తర్వాత పెరిగిన పర్యాటకరంగ ఉపాధి!
కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టాక దేశంలో పర్యాటకరంగంలో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. 2033 నాటికి అంటే రాబోయే తొమ్మిదేళ్లలో ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో దేశంలో 5.82 కోట్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. కరోనా సమయంలో అంటే 2020లో పర్యాటక రంగంలో 3.9 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది దేశంలోని మొత్తం ఉపాధిలో 8 శాతం.తాజాగా ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదిక ప్రకారం మహమ్మారి నుండి కోలుకున్న తర్వాత పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఈ రంగం 2023 క్యాలెండర్ సంవత్సరంలో 16 లక్షల అదనపు ఉద్యోగాలను అందించింది. జనవరి 2023 నుండి ప్రయాణ, పర్యాటక రంగంలో రోజువారీ వేతన ఉద్యోగాలు 14 శాతం మేరకు పెరిగాయి. అనువాదకులు, ఫోటోగ్రాఫర్లు, టూర్ గైడ్లకు ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. వచ్చే రెండేళ్లలో పర్యాటక రంగంలో ఉద్యోగాలు 20 శాతం మేరకు పెరుగుతాయని అంచనా.ఎన్ఎల్బి సర్వీసెస్ నివేదికలోని డేటా ప్రకారం పర్యాటక రంగం 2022లో భారతదేశ జీడీపీకి 15.9 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించింది. అదే సమయంలో ఇది విదేశీ మారకద్రవ్యానికి ముఖ్య వనరుగా నిలిచింది. ఎన్ఎల్బి సర్వీసెస్ సీఈఓ సచిన్ అలగ్ మీడియాతో మాట్లాడుతూ పర్యాటకరంగంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె, కొచ్చి, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్‌లో ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగాయి.పర్యాటకరంగంలో సేల్స్ లో18 శాతం, బిజినెస్ డెవలప్మెంట్లో 17 శాతం, చెఫ్ విభాగంలో15 శాతం, ట్రావెల్ కన్సల్టెంట్లో 15 శాతం మేరకు ఉపాధి పెరగవచ్చనే అంచనాలున్నాయి. అలాగే టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు, గైడ్లు , వన్యప్రాణి నిపుణులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి. -
US: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!
రోడ్డు, రైలు, వాయు రవాణాలు ఎన్నున్నా తెలంగాణా సముద్ర తీరంలేని రాష్ట్రం కావడం వల్ల జల రవాణాకు ఉపయోగించే ఓషన్ లైనర్స్, విహార యాత్రలకు వాడే క్రూయిజ్ షిప్‌లు ఇక్కడి వాళ్లకు కొత్త. అయితే మన దేశంలో విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ముఖ్యంగా ముంబై , గోవా, విశాఖ, లక్ష్యదీప్, కేరళ, అండమాన్, కొచ్చి, మాల్ దీవ్ జలాల్లో క్రూయిజ్‌లు సందర్శకులతో రౌండ్ ట్రిప్‌లు చేస్తూ మన పర్యాటక పరిశ్రమలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. క్రూయిజ్ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ‘ టైటానిక్ ’ . 1912 నాటి ఈ అతిపెద్ద ప్రయాణికుల నౌక తన మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14 న ప్రమాదవశాత్తు ఒక మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోవడం, అందులోనున్న 1500కు పైగా ప్రయాణికులు, సిబ్బంది చనిపోవడం అదో పెద్ద చరిత్ర. ఈ నేపథ్యంతో జేమ్స్ కామెరాన్ రూపొందించిన హాలీవుడ్ ప్రేమ కథా చిత్రం టైటానిక్ ( 1997 ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి సినీ ప్రపంచంలోనే మరో చరిత్ర సృష్టించింది. సముద్ర మార్గాల్లో తిరిగే ఈ క్రూయిజ్లలో పర్యాటకులు బస చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలు, విలాసాలు ఉంటాయని వినడమే కానీ వీటిలో విహరించే అవకాశం మాకు 2016 అక్టోబర్‌లో అమెరికా వెళ్ళినప్పుడు మాత్రమే వచ్చింది. అప్పుడే అమెరికాలో హాలోవిన్ దయ్యాల పండగ నడుస్తోంది. మన దగ్గర పీర్ల పండగ కోలల్లాగ పిల్లలు ఇంటింటికి వెళ్లి క్యాండీలు సేకరిస్తూ ఆనందోత్సాహల్లో మునిగి తేలుతున్నారు. మా అమ్మాయి ఎంబీఏ పట్టా ప్రదానం చేసిన సందర్భంగా కోజుమల్ మెక్సికో క్రూయిజ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. డల్లాస్ నుం కారులో బయలుదేరి, ఆ రోజంతా ప్రయాణం తర్వాత ,రాత్రి 12 గంటలకు కుబాసియానా ఒక హోటల్లో బస చేసి మరునాడు ఉదయమే పోర్ట్‌కు చేరుకున్నాము. మేము క్రూయిజ్ అనబడే కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టింది డిసెంబర్ 15 నాడు, ఎయిర్పోర్ట్ లాగే సెక్యూరిటీ, పాస్‌పోర్ట్, వీసా వగైరా చెకింగ్లు చేశారు. అదో బహుళ అంతస్తుల భవనంలా ఉంది, అందులో అన్ని వసతులున్న ఏసి గదులున్నాయి. బాల్కనీ నుంచి కరీబియన్ సముద్రాన్ని చూస్తుంటే చుట్టు పక్కల ఏమీ కనబడలేదు పెద్ద పెద్ద అలలతో మమ్మల్ని ఆహ్వానిస్తున్న జలాలు తప్ప. లంచ్ అయినా డిన్నర్ అయినా షిప్‌లోని పెద్దపెద్ద హోటళ్లలోనే. డిసెంబర్ 16 నాడు క్రిస్మస్ ప్రోగ్రాము కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పక్కకే క్యాసినోలు, క్యాబరేలు.. డబ్బులుంటే వినోదాలకు కొరత లేదు. డిసెంబర్ 17 నాడు కొజు మల్ మెక్సికో ఐలాండ్ మీద అడుగు పెట్టాం. అక్కడి బీచ్ సన్ బాత్ చేసేవాళ్లతో కళకళలాడిపోతుంది. నదీ స్నానాన్ని మించిన ఆనందమేదో సముద్రంలో ఉన్నట్టుంది. అక్కడే డాల్ఫిన్లను చూశాం, ఆ సరదా కూడా తీర్చుకున్నాం. అక్కడ ఎన్ని సౌకర్యాలున్నాయంటే.. అప్పటికప్పుడు మన ఫోటోలు తీసిపెట్టేవాళ్లకు కొదువ లేదు. అక్కడ లభించే బఫె భోజనాల్లో రకరకాల సీఫుడ్ జీర్ణించుకునే శక్తి ఉంటే ఎంతైనా తినవచ్చు. ఆ ద్వీపాన్ని వదిలి మళ్ళీ క్రూయిజ్‌లోకి ప్రవేశించే సరికి సొంత ఇంట్లోకి వచ్చిన భావన కలిగింది. ఆ రోజు రాత్రంతా సముద్రం మీద ప్రయాణం, డిసెంబర్ 19 నాడు క్రూయిజ్ మళ్లీ మేము బయలుదేరిన పోర్ట్‌కు చేర్చింది. ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ పెట్టి మరీ క్రూయిజ్ సిబ్బంది మాకు వీడ్కోలు పలికారు, మళ్ళీ మళ్ళీ రావాలని చెబుతూ ! వేముల ప్రభాకర్ (చదవండి: యూఎస్‌లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా రూ. 75 వేల కోట్లు..!) -
గతేడాదితో పోలిస్తే అధికంగా విమానయానం.. ఎందరో తెలుసా..
దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ విమాన మార్గాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.26 కోట్ల మంది ప్రయాణం చేశారని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) తెలిపింది. 2023 ఫిబ్రవరిలో ప్రయాణించిన 1.20 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 4.8% అధికం. ఈ ఏడాది జనవరిలో ప్రయాణించిన 1.31 కోట్ల మందితో పోలిస్తే మాత్రం ఇది తక్కువే. గత నెలలో విమానాల జాప్యం కారణంగా 1.55 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సర్వీసులు రద్దు చేయడంతో 29,143 మంది ప్రయాణికులపై ప్రభావం పడగా, సంస్థలు పరిహారంగా రూ.99.96 లక్షలు చెల్లించాయి. ఇదీ చదవండి: ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..! ఫిబ్రవరిలో ఎయిరిండియా మార్కెట్ వాటా 12.2% నుంచి 12.8 శాతానికి పెరగ్గా.. ఇండిగో వాటా 60.2% నుంచి 60.1 శాతానికి, స్పైస్‌జెట్ వాటా 5.6% నుంచి 5.2 శాతానికి తగ్గింది. విస్తారా 9.9%, ఆకాశ ఎయిర్ 4.5%, ఏఐఎక్స్ కనెక్ట్ 6.1% వాటాలను పొందాయి. సమయానికి విమానాలు నడపడంలో ఎయిరిండియా 56.4%, స్పైస్‌జెట్ 59.1 శాతం పనితనాన్ని సాధించాయి. -
జర్మనీలో మహేశ్ బాబు.. ఎందుకో తెలుసా?
జర్మనీ వెళ్లారు మహేశ్‌బాబు. దర్శకుడు రాజమౌళి, హీరో మహేశ్ బాబు కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రధానంగా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ప్రీప్రోడక్షన్ వర్క్స్‌ను ఈపాటికే మొదలుపెట్టారు రాజమౌళి. తాజాగా ఈ పనులు మరింత ఊపందుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో తన లుక్, మేకోవర్ గురించిన సాంకేతికపరమైన విషయాల గురించిన పనుల కోసం మహేశ్‌బాబు జర్మనీ వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను విజయేంద్రప్రసాద్ దాదాపు పూర్తి చేసేశారని, వేసవిలో షూటింగ్ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. -
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘ట్రావెల్ ఫర్ లైఫ్’
సాక్షి, అమరావతి : భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా పర్యాటక విధానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే “ట్రావెల్ ఫర్ లైఫ్’ పేరిట కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తోంది. దేశంలో పర్యావరణహిత, అంతర్జాతీయ స్థాయి టూరిజం ప్రమాణాల అభివృద్ధిలో భాగంగా జీ–20 ప్రెసిడెన్సీ రోడ్‌మ్యాప్ అమలుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఐదు కేటగిరీల్లో ‘టూరిజం ఫర్ టుమారో కేస్ స్టడీ’లను పోటీలకు ఆహ్వానిస్తోంది. పర్యాటక రంగంలో ఆహ్లాదాన్ని అందించడంతో పాటు పర్యావరణ సుస్థిరత, జీవ వైవిధ్యం పెంపు–రక్షణ, సామాజిక ఆర్థిక, సాంస్కృతిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. స్థానిక సంఘాలు, ప్రభుత్వాలు, వ్యాపారులు, ఎన్జీవోలు, ఇతర స్టేక్హోల్డర్లను భాగస్వాములను చేయనుంది. అందుకే ‘ట్రావెల్ ఫర్ లైఫ్’ కింద గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, స్కిల్స్, పర్యాటక ఎంఎస్ఎంఈ, డెస్టినేషన్ మేనేజ్మెంట్ వంటి ఐదు కీలక ప్రాధాన్యతలను ఎంపిక చేసింది. వీటిని పర్యాటక రంగంలో అమలు చేస్తున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలు, విశ్వవిద్యాలయాల నుంచి కేస్ స్టడీల పోటీలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న లక్ష్యాల ప్రక్రియ, ఫలితాలు, వీడియో/ఫొటోలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో పంపించాల్సి ఉంటుంది. నామినేషన్లకు జనవరి 15వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఏపీ పర్యాటకంలో సుస్థిరాభివృద్ధి వెలుగులు.. ప్రపంచ వ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటక రంగాన్ని ప్రత్యేక వాహకంగా ఉపయోగిస్తున్నారు. అందుకే ‘సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఫర్ సస్టైయినబుల్ టూరిజం’ దేశంలో సుస్థిరాభివృద్ధి ఆధారిత ప్రాజెక్టులను గుర్తించి మద్దతిస్తోంది. వినూత్న, ప్రభావవంతమైన కార్యక్రమాలను విశ్లేషించి, ప్రదర్శించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించనుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో కీలక పురోగతిని కనబరుస్తోంది. సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం, పేదరిక నిర్మూలనలో విప్లవాత్మక మార్పులు చర్యలు చేపట్టింది. ఇక పర్యాటక రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం టీటీడీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. పునరుత్పాదక శక్తిని సమర్థంగా వినియోగించుకునేలా పవన విద్యుత్‌ను ప్రవేశపెట్టింది. జీవ వైవిధ్యాన్ని కాపాడటంతో పాటుగా ప్రజలకు అటవీ జంతువుల రక్షణపై అవగాహన కల్పిస్తూ ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. తద్వారా స్థానిక గిరిజనులు, చెంచుల ప్రత్యేక శిక్షణనిస్తూ పర్యాటకుల రూపంలో జీవనోపాధిని పెంపొందిస్తోంది. చారిత్రక, వారసత్వ సంపదకు నిలయమైన మ్యూజియాల్లో అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, కియోస్క్‌లు, డిజిటల్ యాప్స్ సాయంతో సందర్శకులకు సులభంగా, అర్థమయ్యేలా సమాచారాన్ని అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ‘పర్యాటక పోలీస్ స్టేషన్లు’ నెలకొల్పింది. ఇంధన శాఖ పరిధిలో అనేక రెన్యువబుల్ ఎనర్జీ, వ్యవసాయ పర్యాటకంగా మారుతున్న సేంద్రియ సాగు విధానాలు, ఆన్లైన్ విక్రయాల్లో ఏటికొప్పాక, కొండపల్లి కళాకృతులు, చేనేత, కలంకారి, సంస్కృతి, వారసత్వ వేదికల పునర్నిర్మాణం.. ఇలాంటి పర్యావరణ, సామాజికహిత కార్యక్రమాలతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు బాటలు వేస్తోంది. ఇవన్నీ ‘టూరిజం ఫర్ టుమారో కేస్ స్టడీ’లను ఏమాత్రం తీసిపోని విధానాలు కావడం విశేషం. -
Minister RK Roja: గుంటూరు నుంచి తిరుపతికి వందేభారత్ రైలులో ప్రయాణించిన మంత్రి రోజా (ఫొటోలు)
-
ఈ ఏడాది అక్కడికి వెళ్లేందుకు తెగ ఎగబడ్డారు,అంత స్పెషల్ ఏముందంటే..
2023 మరికొన్ని రోజుల్లోనే పూర్తికానుంది. మరి ఈ ఏడాదిలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించిన టూరిస్ట్ ప్లేస్ ఏంటి? గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లిస్ట్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా? 2023లో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించిన టూరిస్ట్ ప్రాంతమేంటి?అన్నదానిపై స్పెషల్ స్టోరీ. ప్రతి ఏడాది ప్రజలు ఎక్కువగా సందర్శించే టూరిస్ట్ ప్రాంతాలను ట్రావెల్ ఏజెన్సీలు రిలీజ్ చేస్తుంటాయి. అలా ఈ ఏడాది కూడా లిస్ట్‌ను విడుదల చేశాయి. గ్లోబల్ డెస్టినేషన్ సిటీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం 2023లో ఎక్కువ మంది ప్రజలు హాంకాంగ్ వెళ్లేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపించారు. అలా టాప్ టూరిస్ట్ ప్లేస్‌లో హాంకాంగ్ మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది బ్యాంకాక్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, 2023లో మాత్రం హాంకాంగ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. హాంకాంగ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సుమారు 29.2మిలియన్ల మంది అంటే 2 కోట్ల 92లక్షల మంది హాంకాంగ్‌ను సందర్శించారు. ఆగ్గేయ చైనాను ఆనుకొని ఉన్న ఈ నగరంలో ప్రతి ఏడాది సుమారు 5మిలియన్లకు తగ్గకుండా ప్రజలు విజిట్ చేస్తుంటారట. అంతలా ఎక్కడ ఏముందబ్బా అని పరిశీలిస్తే.. హాంకాంగ్‌లో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిస్నీల్యాండ్, విక్టోరియాస్ పీక్, మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియం, ఓషియన్ పార్క్,రిపల్స్ బే,లాంటూ ఐస్‌ల్యాండ్, స్టార్ ఫెర్రీ సహా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 2025 నాటికి సుమారు 44 మిలియన్లకు పైగా ప్రజలు హాంకాంగ్‌ను సందర్శిస్తారని సమాచారం. బ్యాంకాక్ హాంకాంగ్ తర్వాత ఎక్కువమంది పర్యాటకులు సందర్శించిన ప్రదేశం బ్యాంకాక్. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో బ్యాంకాక్ నగరం రెండోదిగా నిలిచింది. 2023 నాటికి 24 మిలియన్ల మంది అంటే సుమారు 2 కోట్ల 44 లక్షల మంది ప్రజలు బ్యాంకాక్‌ను సందర్శించారు. ఇక్కడి ప్రసిద్ధ బౌద్ధ దేవాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, వెరైటీ వంటలతో బ్యాంకాక్ పర్యాటకులను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. లండన్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ జాబితాలో లండన్ మూడవ స్థానంలో ఉంది. ఈ ఏడాది 19.2 మిలియన్లు(కోటి 2 లక్షల మంది) ప్రజలు లండన్‌ను సందర్శించారు. టూరిస్టులే కాకుండా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు కూడా 2023లో ఎక్కువగా లండన్‌ను విజిట్ చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఎక్కువగా సింగపూర్,చైనా,దుబాయ్, ప్యారిస్, న్యూయార్క్ ప్రాంతాలను పర్యాటకులు ఎక్కువగా సందర్శించారు. -
గూగుల్‌లో ఎక్కువగా వెతికిన పర్యాటక ప్రాంతాలివే
ప్రస్తుతమున్న రోజుల్లో గూగుల్ వాడకం బాగా పెరిగింది. ఎలాంటి సందేహాలు ఉన్నా క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. 2023కి త్వరలోనే ఎండ్‌కార్డ్ పడనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్ లిస్ట్‌ను గూగుల్ రిలీజ్ చేసింది. మరి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాలేంటి? టాప్ 10 లిస్ట్ ఏంటన్నది చూసేద్దాం. వియత్నాం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాల్లో వియత్నాం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రకృతి సోయగాలు,బీచ్‌లు,రుచికరమైన ఆహారం, చారిత్రక అంశాలతో మనసు దోచే ఈ ప్రాంతం టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తోంది. నవంబర్ నుంచి ఏప్రిల్ సీజన్లో వియత్నంలో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గుహకు నిలయమైన సోన్డూంగ్, ఫోంగ్ న్హా-కే బ్యాంగ్ నేషనల్ పార్క్, హాలాంగ్ బే, న్హా ట్రాంగ్, కాన్ దావో, ఫు క్వాక్, హోయ్ యాన్,నిన్ బిన్ ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు. View this post on Instagram A post shared by Vietnam 🇻🇳 Travel | Hotels | Food | Tips (@vietnamtravelers) గోవా 2023లో మోస్ట్ సెర్చ్డ్ డెస్టినేషన్స్‌లో భారత్‌లోని గోవా రెండో స్థానంలో నిలవడం విశేషం. బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన గోవా ట్రిప్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇక్కడి బీచ్‌లు, చర్చ్‌లు, పచ్చదనం సహా ఎన్నో అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసం సలీం అలీ బర్డ్ శాంక్చురీ,దూద్‌సాగర్ జలపాతాలు, బామ్ జీసస్, సే కేథడ్రల్ చర్చిలు, బోమ్ జీసస్ బసిలికా, ఫోర్ట్ అగ్వాడా ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. బాలి భూతల స్వరంగా పిలిచే బాలి ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాల్లో మూడో స్థానంలో ఉంది. ఇండోనేషియాలోని జావా, లాంబాక్ దీవుల మధ్య లో బాలి దీవి ఉంటుంది. 17 వేల దీవులు ఉన్న ఇండోనేషియాలో బాలి ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిఉస్తుంది. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అందుకే బాలిని దేవతల నివాసంగా పిలుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. సేక్రెడ్ మంకీ ఫారెస్ట్, ఉబుద్ ప్యాలెస్,ఉలువతు ఆలయం, లొవియానా వంటి ప్రాంతాలు ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు. చదవండి: 2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్ కోసం వెతికారో తెలుసా? View this post on Instagram A post shared by Bali - The Island of the Gods (@bali) శ్రీలంక గూగుల్ సెర్చ్‌లో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్‌లో శ్రీలంక నాలుగో స్థానంలో నిలిచింది.అందమైన ద్వీప దేశాల్లో శ్రీలంక ఒకటని చెప్పుకోవచ్చు. పురాతన శిథిలాలు, దేవాలయాలు, అందైన బీచ్‌లు, తేయకు తోటలు.. ఇలా ఎన్నో పేరుగాంచిన పర్యాటక ప్రదేశాలు శ్రీలంకలో ఉన్నాయి. ఇక్కడ సిగిరియా రాక్ ఫారెస్ట్,యాలా నేషనల్ పార్క్,మిరిస్సా బీచ్,ఎల్లా హిల్ స్టేషన్, బౌద్ధ దేవాలయం, డచ్ స్టైల్లో నిర్మించిన ఇళ్లు, హెరిటేజ్ మ్యూజియంలు, రెయిన్ ఫారెస్ట్లు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. థాయ్‌లాండ్ అందమైన ప్రకృతికి థాయ్‌లాండ్ పెట్టింది పేరు. ల్యాండ్ ఆఫ్ స్మైల్స్‌గా దీనికి పేరుంది. ఇక్కడ దట్టమైన అడవులు, థాయిలాండ్ ఫుకెట్, కో ఫై ఫై, క్రాబీ, కో స్యామ్యూయ్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. థాయ్ టూర్లో ప్రత్యేకత బ్యాంకాక్‌లో ఉన్న ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం. అంతేకాకుండా ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి. వీటితో పాటు కశ్మీర్, కూర్గ్, అండమాన్ నికోబార్ దీవులు,ఇటలీ, స్విట్జర్లాండ్ కూడా టాప్-10 డెస్టినేషన్ లిస్ట్‌లో ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. -
వీసా లేకుండానే భారతీయులు ఈ దేశాలకు వెళ్లి రావొచ్చు
ట్రావెలింగ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలితో కలిసి ఇష్టమైన ప్రాంతాలను చుట్టేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పని ఒత్తిడితో విసిగిపోయి ఉన్న వారికి ఈ విహార యాత్రలు, ప్రయాణాలు ఎంతో ఊరట కలిగిస్తాయి. మన దేశంలో అయితే ఏ ప్రాంతానికి అయినా వెళ్లొచ్చు కానీ విదేశాలకు వెళ్లాలంటే మాత్రం వీసా ఉండాల్సిందే. అయితే వీసాతో పని లేకుండా భారతీయులను మా దేశానికి రండి అంటూ ఆహ్వానం పలుకున్నాయి కొన్ని దేశాలు. అవేంటో చూసేయండి. మలేషియా ఎంత చూసినా తనివి తీరని భౌగోళిక సౌందర్యం మలేషియా. పచ్చని అడవులు, అందమైన ద్వీపాలు,అడవులు.. ఇలా ఎంతో అందమైన పర్యాటక ప్రదేశంగా మలేషియాకు పేరుంది. ఇకపై అక్కడికి వెళ్లాలంటే వీసా అవసరం లేదు. సుమారు 30 రోజుల పాటు అక్కడ సేద తీరవచ్చు. బొలీవియా: ఇక్కడ సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. సమోవా: దీనిని 'కార్డెల్ ఆఫ్ పాలినేషియా' అని కూడా పిలుస్తారు, సమోవా అనేది ఉత్కంఠభరితమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీప దేశానికి వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. శ్రీలంక: భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు ఇటీవలె శ్రీలంక అనుమతి ఇచ్చింది. కెన్యా: సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. మారిషస్: భారతీయులకు అతి గొప్ప ఆతిథ్యమిచ్చే ఆహ్లాదకరమైన దేశాల్లో మారిషస్ ఒకటి. అందమైన బీచ్‌లు, అడ్వెంచర్లు ఎన్నో ఉన్న ఈ దేశానికి మీకు వీసా అవసరం లేదు. మారిషస్‌ను వీసా లేకుండా, మీరు గరిష్టంగా 90 రోజులు పర్యటించవచ్చు. ఫిజీ: అందమైన దృశ్యాలు, పగడాలు, దీవులకు పెట్టింది పేరు ఫిజీ దేశం. ఈ దేశానికి భారతీయ పర్యాటకుల ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీసా లేకుండా 120 రోజులు అంటే సుమారు నాలుగు నెలలు హాయిగా గడపొచ్చు. భూటాన్: భారతదేశానికి అత్యంత సమీపంలో, పొరుగు దేశంగా ఉన్న భూటాన్‌కు మీరు వీసా లేకుండానే వెళ్లవచ్చు. ఇది ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.రోడ్డు, విమానం, రైలు ద్వారా కూడా భూటాన్ చేరుకోవచ్చు. బార్బడోస్: బార్బడోస్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు.ప్రశాంతమైన దీవుల్లో సెలవులను గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. కాస్ట్లీ హోటళ్లు, తీర ప్రాంతాలు ఇక్కడి స్పెషల్. భారతీయ పౌరులు బార్బడోస్ సందర్శించడానికి వీసా అవసరం లేదు. మీరు ఇక్కడ వీసా లేకుండా 90 రోజుల వరకు గడపవచ్చు. వీటితో పాటు జమైకా, కజికిస్తాన్, ఇండోనేషియా,టాంజానియా, జోర్డాన్,లావోస్ కాంబోడియా,వంటి దేశాలకు కూడా వీసా లేకుండా చుట్టిరావొచ్చు. -
గాలి వానలో.. వాన నీటిలో.. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు..
ఇటీవలి మిచౌంగ్ తుపాను.. దేశంలోని దక్షిణాదిని అతలాకుతలం చేసింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు పలు సహాయక చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలోనే ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని కడంబత్తూర్‌కు చెందిన మునుస్వామి(40) మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. ల్యాబ్ టెక్నీషియన్ అయిన మునుస్వామి.. క్యాన్సర్‌తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు.. ఈదురు గాలులు, భారీ వర్షం, వరదలతో నిండిన రోడ్లను సైతం లెక్కచేయక దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. మునుసామి.. దేశంలోని ప్రముఖ రక్త స్టెమ్ సెల్ దాతల ప్రభుత్వేతర సంస్థ డెట్రాయ్(డీఏటీఆర్ఐ)లో పని చేస్తున్నారు. ఈ సంస్థ రక్త రుగ్మతలతో బాధపడుతున్నవారికి సహాయం అందిస్తుంది. క్యాన్సర్ బాధితల శిశువుకు చికిత్సలో మూలకణాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చిన దాతకు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్‌ను అందించడానికి మునుస్వామి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ దాత బాధిత చిన్నారికి తన ఎముక మజ్జను దానం చేయడానికి అండమాన్ నుండి వచ్చి, చెన్నై నగరంలోని పాత పెరుంగులత్తూర్ ప్రాంతంలోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఈ సందర్భంగా డెట్రాయ్ ఇన్‌ఛార్జి సుమతి మిశ్రా మీడియాతో మాట్లాడుతూ బోన్ మ్యారో డొనేషన్ రెండు విధాలుగా చేయవచ్చు. బాధిత కుటుంబంలో వారి లేదా జన్యుపరమైన పోలిక కలిగిన వారి నుంచి దీనిని సేకించవచ్చు. అయితే ఆ రెండేళ్ల బాధిత చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు.. తన బోన్ మ్యారోను దానం చేసేందుకు ఒక వ్యక్తి ముందుకు వచ్చారన్నారు. వైద్య ప్రక్రియలో తాము రక్త కణాలను వెలికితీసేందుకు, ఐదు రోజుల పాటు దాతకు గ్రోత్ హార్మోన్ల ఇంజెక్షన్లు ఇవ్వాలి. ఇవి ఇచ్చేటప్పుడు గ్యాప్ ఉండకూడదు. అప్పుడే బాధితులకు అవసరమైన మూలకణాలను సేకరించగలమని అన్నారు. ఇలా సంగ్రహించిన స్టెమ్ సెల్ ప్రాసెస్ చేశాక, దానిని బాధితులకు ఉపయోగిస్తామన్నారు. తుఫానుకు ముందు రోజున దాతకు మొదటి డోస్ ఇచ్చాం. తుపాను కారణంగా రెండవ డోస్ ఇవ్వడంపై ఆందోళన చెందాం. దాత ఉంటున్న ప్రాంతంలోని వైద్య నిపుణుల సహాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో మునుసామి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మునుసామి మాట్లాడుతూ చిన్నారికి చికిత్స ఆలస్యమైతే ఏమి జరుగుతుందో నాకు తెలుసు. దానిని గుర్తించినంతనే ఈ సాహసానికి దిగాను. మోటార్ సైకిల్‌పై ఇంటి నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరాను. జాతీయ రహదారులు ఎక్కడికక్కడ జలమయమంగా ఉన్నాయి. రోడ్లు కనిపించడం లేదు. పెరంబక్కం వైపు వెళ్ళాను. చెన్నైకి వెళ్లే హైవేలను కనెక్ట్ అయ్యేందుకు ఒక అండర్ పాస్ దాటాలి. ఇది జలమయంగా ఉండటంతో మరో మార్గంలో వెళ్లాను. శ్రీపెరంబుత్తూరు నుండి పూనమల్లి రోడ్డు మీదుగా చెన్నై ఔటర్ రింగ్ రోడ్డులోకి ప్రవేశించానని మునుసామి తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా పాత పెరుంగళూరు రహదారిని కలిపే వంతెన జలమయం కావడంతో పోలీసులు అటువైపు వెళ్లడాన్ని అడ్డుకోవడంతో బైక్‌ని వంతెనపై ఆపి నడిచానని, అలా మూడు కిలోమీటర్ల నడిచి, తరువాత ఈదుకుంటూ చివరికి దాత ఇంటికి చేరుకుని, దాతకు ఇంజిక్షన్ ఇచ్చానని తెలిపారు. తరువాత దాత కుటుంబ సభ్యులు వర్షం తగ్గేవరకూ ఇంటిలోనే ఉండాలని కోరినప్పటికీ, మునుస్వామి తన ఇంటికి తిరిగి బయలుదేరాడు. ఆ మరుసటి కూడా రోజు దాతకు మునుస్వామి ఇంజెక్షన్ ఇచ్చాడు. కదంబత్తూర్లోని మునుస్వామి ఇంటి నుండి దాత ఇల్లు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కూడా చదవండి: రామాలయ నూతన అర్చకులకు శిక్షణ ప్రారంభం -
ప్రయాణ పాఠాలతో.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న యువకుడు!
ప్రయాణ ప్రేమికుడైన అనునయ్ సూద్ 30 దేశాల వరకు వెళ్లివచ్చాడు. చిన్న వయసులోనే ట్రావెలింగ్ అండ్ ఫోటోగ్రఫీ రంగంలో పెద్ద పేరు తెచ్చుకున్నాడు నోయిడాకు చెందిన అనునయ్ సూద్. వ్లోగ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన అనునయ్ సూద్ ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్లు అందుకున్నాడు. ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్గా స్విట్జర్లాండ్ టూరిజం, విజిట్ సౌదీ, న్యూజిలాండ్ టూరిజం... మొదలైన సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు... ‘నాకు ట్రావెలింగ్ అంటే ఎందుకు ఇష్టం అంటే ట్రావెల్ చేయకుండా ఉండలేను కాబట్టి’ నవ్వుతూ అంటాడు అనునయ్ సూద్. ఇంజినీరింగ్ చేసిన అనునయ్ కొంత కాలం ఉద్యోగం చేశాడు. జీతం రాగానే ఆ బడ్జెట్లో ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేసేవాడు. ప్రయాణ మాధుర్యాన్ని మరింతగా ఆస్వాదించడానికి ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్లెక్సిబుల్ ప్రాజెక్ట్స్‌లో పనిచేశాడు. సాహసకృత్యాలను ఇష్టపడే వారి కోసం ట్రెక్ ఆర్గనైజింగ్ కమ్యూనిటీని స్టార్ట్ చేశాడు. ఈ కమ్యూనిటీలో గైడ్, టీమ్ లీడర్‌గా వ్యవహరించాడు. అనునయ్ ప్రతి ప్రయాణాన్ని కొత్త జీవితంతో పోల్చుతాడు. ప్రయాణ జ్ఞాపకాలను ఛాయాచిత్రాలలో భద్రపరిచే క్రమంలో ట్రావెల్ ఫొటోగ్రఫీలో కూడా నైపుణ్యం సాధించాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీపై ఉన్న ఇష్టాన్ని మిళితం చేసి డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా విజయం సాధించాడు. ఆ తరువాత ‘మెటా–సోషల్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాడు. ‘మెటా–సోషల్’ అనేది పెర్ఫార్మెన్స్ అండ్ మార్కెటింగ్ సొల్యూషన్ కంపెనీ. ‘ట్రావెలింగ్‌పై నాకు ఉన్న ఇష్టాన్ని కమర్షియలైజ్ చేసుకోవాలనుకోలేదు’ అంటున్న అనునయ్ ‘ప్రాజెక్ట్ ఘర్’ పేరుతో హోమ్‌స్టే సర్వీస్ వెంచర్‌ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటి వరకు 30 దేశాల వరకు వెళ్లి వచ్చిన అనునయ్ ‘ఫొటోగ్రఫీ విజన్, ట్రావెలింగ్‌పై ఫ్యాషన్ ఉంటే సాధారణ ప్రదేశాల నుంచి కూడా అసాధారణ అందాలను వీక్షించవచ్చు. ట్రావెల్ ఫొటోగ్రఫీపై మనకు విజన్ ఉంటే ఖరీదైన కెమెరాలతో పనిలేదు’ అంటున్నాడు అనునయ్ సూద్. కొత్తదారులలో... ప్రయాణ క్రమంలో ప్రకృతి నుంచి, సామాజిక బృందాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఎన్నో ఉంటాయి. దృష్టి విశాలం కావడానికి, చురుగ్గా ఉండడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయాణాలు ఉపయోగపడతాయి. కొత్త దారులు కొత్త ఆలోచనలకు దారి తీస్తాయి. – అనునయ్ సూద్ (చదవండి: ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !) -
వరవరరావు హైదరాబాద్‌కు వెళ్లొచ్చు
ముంబై: ఎల్గార్ పరిషత్– మావోయిస్టుల తో సంబంధాల కేసులో అరెస్టయి బెయిల్ మీద బయటికొచ్చిన విప్లవకవి వరవరరావు హైదరాబాద్ వెళ్లేందుకు ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి మంజూరుచేసింది. ఎడమ కంటికి చికిత్స నిమిత్తం డిసెంబర్ 5–11 తేదీల మధ్య హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతినిస్తూ బుధవారం జడ్జి రాజేశ్ కటారియా ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్‌కు వెళ్లాక ఎక్కడ ఉండేది, చిరునామా, ఫోన్ నంబర్, షెడ్యూల్ తదితర సమగ్ర వివరాలను ముందుగానే ముంబైలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు సమర్పించాలని ఆదేశించింది. ప్రయాణ అనుమతిని దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది. -
విద్యార్థినులకు మెట్రో ప్రయాణం ఉచితం!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని, ల్యాప్‌టాప్‌లిస్తామని అంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ వర్గానికే మరో కీలక హామీ ఇవ్వబోతోంది. 14 ఏళ్లు నిండి, చదువుకుంటున్న బాలికలందరికీ మెట్రో ప్రయాణాన్ని ఉచితం చేస్తామని చెప్పబోతోంది. పదో తరగతి చదువుకుంటున్న బాలికల నుంచి పీహెచ్‌డీలు చేసే విద్యార్థినుల వరకు అన్ని స్థాయిల్లోని కళాశాలలు, యూనివర్సిటీల్లో చదివే వారికి ఈ సౌకర్యాన్ని వర్తింపజేస్తామని చెపుతోంది. ఈ మేరకు తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ‘ప్రజా మేనిఫెస్టో’పేరుతో తయారవుతున్న ఈ ప్రణాళిక కోసం కాంగ్రెస్ పార్టీ తన కసరత్తును పూర్తి చేసింది. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై అనేక అంశాలకు తుది రూపు తీసుకువచ్చింది. కమిటీ రూపొందించిన ముసాయిదా మేనిఫెస్టోను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పరిశీలనకు పంపారని, ఈనెల 14న పార్టీ మేనిఫెస్టో అధికారికంగా విడుదలవుతుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. అనివార్య కారణాల వల్ల వాయిదా పడితే ఒక రోజు ఆలస్యమవుతుందని అంటున్నాయి. ప్రజాకర్షకంగా రూపకల్పన.. ఈసారి ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే పథకాలకు కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యమిస్తోంది. ఆరుగ్యారంటీల పేరుతో మహిళలు, వృద్ధులు, పేద వర్గాలకు చెందిన ఓట్లను రాబట్టుకునే పనిలో పడిన కాంగ్రెస్.. మేనిఫెస్టోలో కూడా అన్ని వర్గాల ఓట్లు సంపాదించేలా పథకాలను ప్రతిపాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న అమ్మ ఒడి తరహా పథకాన్ని ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ తరహాలో పెద్ద మొత్తంలో కాకుండా రూ.1,000 ఆర్థిక సాయం చేయాలనే ప్రతిపాదనపై మేనిఫెస్టో కమిటీ తీవ్ర కసరత్తు చేసింది. ఎంత మొత్తం ప్రతిపాదించాలన్న దానిపై తర్జనభర్జనలు ఓ కొలిక్కి రావడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పరిశీలనకు ఈ ప్రతిపాదనను పంపినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల వార్డు మెంబర్లకు నెలకు రూ.1,500 గౌరవవేతనం ఇస్తామనే హామీని కూడా కాంగ్రెస్ ఇవ్వబోతోంది. హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి.. ఇక, విశ్వనగరం హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రత్యేక విభాగాన్ని రూపొందిస్తోంది. దినదినాభివృద్ధి చెందుతున్న నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాâళిక రూపొందిస్తోంది. ఇటు హైదరాబాద్‌తో పాటు అటు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆకర్షణీయంగా ఉండేలా వాహన చలాన్లను ఏకకాలంలో రద్దు చేస్తామని ప్రకటించనుంది. హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా కార్పొరేట్ ఆసుపత్రులు, వరదల తాకిడి నుంచి బయటపడేందుకు లోతట్టు ప్రాంతాల్లో నిలిచే నీరు త్వరగా వెళ్లిపోవడం కోసం లింక్డ్ కెనాల్స్ ఏర్పాటు లాంటి ప్రతిపాదనలతో పాటు మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రధానాంశంగా ప్రస్తావించనుంది. మూసీ చుట్టూ రేడియల్ రోడ్ల నిర్మాణం, నల్లగొండ జిల్లా వరకు మూసీ కనెక్టివిటీ కారిడార్ ఏర్పాటు లాంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించనుందని తెలుస్తోంది. -
మా ఊళ్లలో ఉండండి.. రూ.26 లక్షలు అందుకోండి: ఓ ప్రాంతం బంపరాఫర్!
విదేశాల్లో, ఏదైనా కొత్త ప్రాంతంలో నివాసం ఉండాలనుకుంటున్నారా? అయితే మీకు ఇటలీలోని ఓ ప్రాంతం బంపరాఫర్ ఇస్తోంది. ఇక్కడ నివాసముంటే చాలు సుమారు రూ.26 లక్షలు మీ సొంతమవుతాయి. అలా అని అదేదో సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతం కాదు. సముద్ర తీరాన, సుందరమైన పర్వతాల అంచున ఉండే అందమైన ప్రాంతమది. ఇటలీలోని దక్షిణ కాలాబ్రియా (Calabria) ప్రాంతం డబ్బు సంపాదించాలనుకునే, కొత్త ప్రాంతాన్ని అన్వేషించాలనుకునే వ్యక్తులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. అక్కడ నివసిస్తూ బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలనుకునేవారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అర్హతలు ఇవే.. కాలాబ్రియా అందిస్తున్న ఈ అవకాశాన్ని పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనది వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. ఇక అప్లికేషన్ ఆమోదం పొందిన 90 రోజులలోపు నివాసం ఉండటానికి సిద్ధంగా ఉండాలి. కాలాబ్రియా గురించి.. కాలాబ్రియా ప్రాంతాన్ని ఇటలీ "బొటనవేలు" గా పేర్కొంటారు. అందమైన సముద్ర తీరం, గంభీరమైన పర్వతాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఎందుకో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జనాభా బాగా తగ్గిపోయింది. దీంతో స్థానిక కమ్యూనిటీలలో ఆందోళన నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కాలాబ్రియా ఈ అసాధారణ ప్రణాళికను ప్రారంభించింది. రూ. 26.48 లక్షల వరకూ ప్రోత్సాహకం ప్రణాళికలో భాగంగా కాలాబ్రియా ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడే ఆసక్తి ఉన్న 40 ఏళ్లలోపు యువతకు మూడు సంవత్సరాల పాటు రూ. 26.48 లక్షల ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తారు. ఇక్కడ రెస్టారెంట్లు, దుకాణాలు, హోటళ్లు వంటి బిజినెస్‌లను ప్రారంభించేందుకు స్థానిక అధికారులు ప్రోత్సహిస్తున్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడం, కమ్యూనిటీల్లో కొత్త జీవితాన్ని నింపడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యమని దీన్ని రూపొందించినవారిలో ఒకరైన జియాన్లూకా గాల్లో పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపు ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 6.31 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ కార్యక్రమం రాబోయే వారాల్లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. కాలాబ్రియా ప్రాంతంలోని 75 శాతానికి పైగా మునిసిపాలిటీలలో 5,000 కంటే జనాభా ఉన్నారు. ఈ విశిష్ట కార్యక్రమం యువ పారిశ్రామికవేత్తలకు కాలాబ్రియా ప్రాంత విశిష్టతను, సంస్కృతిని పరిచయం చేస్తూ ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
టూర్స్ కోసం ఇండియన్స్ చేసే ఖర్చు ఇంతా..!
గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు విపరీతంగా పెరిగాయి. కొవిడ్‌కారణంగా కుంటుపడిన టూరిజం నుంచి వచ్చే రాబడులు ఊపందుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న భయాలు తొలగి భారత్ నుంచి విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈమధ్య భారతీయుల్లో టూర్స్ పట్ల ఉత్సాహం పెరుగుతోంది. ముఖ్యంగా నేటి యువతరం నాలుగు గోడల మధ్య బతకడానికి ఇష్టపడటం లేదు. ఖాళీ దొరికినప్పుడల్లా ట్రెక్కింగ్, విహారయాత్రలు, విదేశాలకు టూర్స్ ప్రణాళికలు వేస్తూ బిజీగా గడుపుతున్నారు. దాంతో దేశీయ పర్యాటక పరిశ్రమ వేగంగా దూసుకుపోతోంది. కొవిడ్ ముందు కంటే కూడా టూరిజం రంగంలో వస్తున్న ఆదాయం పెరుగుతుంది. కొవిడ్ మునుపుకంటే ప్రస్తుతం 173శాతం అధికంగా టూరిజం కోసం ఖర్చు చేస్తున్నారు. 2030 నాటికి భారత ట్రావెలర్స్ దాదాపు 410 బిలియన్ డాలర్లు(సుమారు రూ.32లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారని అంచనా. దాంతో ప్రపంచంలో పర్యాటకం కోసం అధికంగా వెచ్చించే నాలుగో దేశంగా ఇండియా నిలవనుందని గణాంకాలు చెబుతున్నాయి. 150 బిలియన్ డాలర్లు వెచ్చిస్తూ ఇండియా ప్రస్తుతం ప్రపంచంలో ఆరో స్థానంలో కొనసాగుతోందని హౌ ఇండియా ట్రావెల్స్ పేరిట బుకింగ్స్ డాట్ కామ్, మెకిన్సే & కంపెనీ సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్లు సగటున 63 రోజులు, జపాన్ ప్రజలు 57 రోజులతో పోలిస్తే భారతీయులు టూర్స్ కోసం 29 రోజులు వెచ్చిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. భారతీయ పర్యాటకుల్లో 80 శాతం మంది బస చేసేందుకు రెస్టారెంట్లు, రూమ్ సర్వీస్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక పేర్కొంది. సంప్రదాయ మనాలీ, సిమ్లా వంటి ప్రాంతాలతో పాటు వారణాసి, గురుగ్రాం, కోయంబత్తూరు తరహా నగరాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్లు వెల్లడించింది. గతేడాదికిగాను యూట్యూబ్ వీడియోలు చూసి తాము ట్రావెలింగ్ చేస్తున్నట్లు 91 శాతం మంది పర్యాటకులు చెప్పినట్లు బుకింగ్స్ డాట్ కామ్ నివేదిక పేర్కొంది. 85 శాతం మందిని ఇన్స్టాగ్రామ్ ప్రభావితం చేసినట్లు వెల్లడయింది. స్పోర్ట్స్, సమావేశాలు, మ్యూజికల్స్ వంటి ఇతర ఈవెంట్స్ పర్యాటకాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నట్లు సమాచారం. -
ఇదు శ్రీలంక: కేలనియా మహా విహారాయ!
శ్రీలంకకు రాముడు ఒకసారి వెళ్తే బుద్ధుడు మూడుసార్లు వెళ్లాడు. మూడవసారి శ్రీలంక పర్యటనలో బుద్ధుడు అడుగుపెట్టిన ప్రదేశం కేలనియా ఆలయం. శ్రీలంకలో చరిత్రను చారిత్రక ఆధారాలతో డాక్యుమెంట్ చేయడం కంటే సాహిత్యం ఆధారంగా, అది కూడా ధార్మిక గ్రంథాల ఆధారంగా గతంలో ఆ నేల మీద ఏం జరిగిందో తెలుసుకోవడమే జరిగింది. నాటి సంస్కృతిని సంప్రదాయాల ఆధారంగా చరిత్రను అంచనా వేయాల్సి వచ్చింది. చిత్రాల్లో బుద్ధుడు శ్రీలంకలో కేలనియా గంగా నది తీరాన కొలంబో నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది కేలనియా మహా విహారాయ. విశాలమైన ఆలయ ప్రాంగణంలో పెద్ద బోధివక్షం, ఆ వృక్షం మొదట్లో భారీ ధవళ బుద్ధుడి విగ్రహం. కేలనియా మహా విహారాయ అద్భుతమైన శిల్పకళానైపుణ్యంతో కూడిన నిర్మాణం. అంతకంటే ఎక్కువగా ఈ ఆలయం అద్భుతమైన చిత్రాలకు నెలవు. గోడలు, పై కప్పు నిండా పెయింటింగ్సే. ఒక్కొక్కటి ఒక్కో సంఘటనను ప్రతిబింబిస్తుంది. బుద్ధుడు శ్రీలంకలో అడుగుపెట్టడం, త్రిపీటకాలను బోధించడం, అష్టాంగమార్గాలను విశదపరచి సమ్యక్ జీవనం దిశగా నడిపించడం, స్థానిక రాజులు బుద్ధుడికి అనుచరులుగా మారిపోవడం, సామాన్యులు బుద్ధుడిని చూడడానికి ఆతృత పడడం, బుద్ధుడి మాటలతో చైతన్యవంతమై వికసిత వదనాలతో సన్మార్గదారులవడం... వంటి దృశ్యాలన్నీ కనిపిస్తాయి. మరొక ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ చిత్రాల్లో విభీషణుడి జీవితంలో ముఖ్యమైన విభీషణుడి పట్టాభిషేకం ఘట్టం కూడా ఉంది. విభీషణుడి రాజభవనం కేలనియా నది తీరాన ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో ఉందని చెబుతారు. ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం కూడా ఉంది. విభీషణుడిని సింహళీయులు విభీషణ్ దేవయా అని పిలుచుకుంటూ ప్రాచీనకాలంలో తమను పరిరక్షించిన దేవుడిగా కొలుస్తారు. విభీషణుడిని రాజుగా ప్రకటిస్తూ పట్టాభిషేకం చేసిన ప్రదేశం కేలనియా ఆలయ ప్రాంగణమేనని కూడా చెబుతారు. వాతావరణానికి అనువుగా నిర్మాణాలు! బౌద్ధ ప్రార్థనామందిరాల్లో డ్రెస్ కోడ్ ఉంటుంది. మన దుస్తులు భుజాలు, మోకాళ్లను కప్పేటట్లు ఉండాలి. అలా లేకపోతే ఆలయ ప్రాంగణంలో చున్నీ వంటి వస్త్రాన్ని ఇస్తారు. దాంతో భుజాలను కప్పుకోవాలి. మోకాళ్లు కనిపించే డ్రస్ అయితే ఆ వస్త్రాన్ని లుంగీలాగా చుట్టుకోవాలి. శ్రీలంక దీవి సతత హరితారణ్యాల నిలయం కావడంలో వర్షాలు అధికం. వర్షపు నీరు ఇంటి పై భాగాన నిలవ కుండా జారిపోవడానికి వీలుగా స్లాంట్ రూఫ్ ఉంటుంది. ఈ ఆలయం కూడా ఎర్ర పెంకుతో వాలు కప్పు నిర్మాణమే. దీనికి పక్కనే ఇదే ప్రాంగణంలో తెల్లగా మెరిసిపోతూ బౌద్ధ స్థూపం ఉంది. కేలనియా ఆలయంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ బుద్ధుడి విగ్రహానికి తల మీద బంగారు రంగులో లోహపు త్రిశూలం ఉంది. బుద్ధుడి వెనుక నీలాకాశం, తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ పర్వతాలను పోలిన నేపథ్యం ఉంది. స్థానికులు బుద్ధుడిని శివలింగం పూలతో పూజిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించే ప్రమిదల పెద్ద పెద్ద స్టాండులు నూనె ఓడుతూ ఉన్నాయి. కొంతమంది దీపాలు వెలిగిస్తున్నారు కూడా. కార్తీక మాసంలో మనదేశంలో శివాలయాల్లో కనిపించే దృశ్యం అన్నమాట. ధార్మికత సాధనలో ఎవరికి తోచిన మార్గం వారిది. 2,500 ఏళ్ల నాటి జ్ఞాపకాలకు ఆనవాలు కేలనియా మహావిహారాయ. భారతదేశం– శ్రీలంకల మధ్య వికసించిన మైత్రిబంధానికి ప్రతీక ఈ ఆలయం. వీటికి ప్రత్యక్ష సాక్షి ఆలయ ప్రాంగణంలో బోధివృక్షం. సింహళీయుల ఆత్మీయత తాజాగా తెలంగాణ రాష్ట్రం– శ్రీలంకలను కలుపుతున్న బౌద్ధం పరస్పర సహకారంతో పరిఢవిల్లనుంది. మనవాళ్లను చూడగానే సింహళీయులు ‘ఇండియన్స్’ అని చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా చూస్తారు. తెలుగు వాళ్ల మీద కూడా వారికి ప్రత్యేకమైన అభిమానం వ్యక్తమవుతుంది. శ్రీలంకతో ప్రాచీన తెలుగుబంధం బుద్ధఘోషుడి రూపంలో ఏర్పడింది. ఈ ఆలయంలోని చిత్రాల్లో బుద్ధఘోషుడు తాను రాసిన విశుద్ధమగ్గ గ్రంథాన్ని శిష్యుడికి అందిస్తున్న పెయింటింగ్‌ని కూడా చూడవచ్చు. సింహళులు ఇష్టంగా అనుసరించే ధార్మికత బౌద్ధం పుట్టింది భారతదేశంలోనే కాబట్టి వారు భారతీయుల పట్ల ఆత్మీయంగా ఉంటారు. సోదర ప్రేమను పంచుతారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు స్థానికులు తెలుగువారిని దక్షిణాది వారన్నట్లు తక్కువగా చూడడం ఎవరూ కాదనలేని సత్యం. శ్రీలంక సింహళీయులు మాత్రం బౌద్ధంతో మనతో బంధాన్ని కలుపుకుంటారు. సింహళీయుల ఆత్మీయత మనల్ని కట్టిపడేస్తుంది. – వాకా మంజులా రెడ్డి (చదవండి: రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం) -
ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా
కొండకు బోయొచ్చినప్పటి నుంచి కత్తి గెలిసిన కోడే గతం మా జయక్క మగం ఎలిగిపోతావుంది. కుమ్మరి ఎంగటప్ప చేత్తో తయారు చేసిన మొంటి ఉండీని మా జయక్క పది రూపాయలుకి ఇంటికి కొనక్కచ్చింది. ఎంగటప్ప దానికి ఎంతో సుందరంగా పూజులు కూడా తీర్సినాడు. ఆ ఉండీని ఎంగట్రమణ సామి పటాలకాడ పెట్టి ‘ఉండీ నిండిన్నాపొద్దు దావకర్సులకు ఈ దుడ్డు పెట్టుకొని నీ కొండకు వస్తాను సామీ’ అని మొక్కుంది. ఆ పొద్దు నుండి జయక్క చీర కొంగున ముడేసిన రూపాయి బిల్లలు, అరుదుగా చేతికి మిగిలే ఐదు రూపాయల బిల్లలు, ఎబుడన్న కతగెతిగ మిగిలిన యాబై రూపాయల నోట్లు, పంటపలం అమ్మిన సొమ్ములో అవసరం కోసం అప్పుచేసిన డబ్బుల్లో, కూలి డబ్బుల్లో కొద్దిగా తీసి ఉండీలో ఏసేది. అన్ని రకాల డబ్బుల్లో నుండి ఈ నోటు పక్కకు పోయిన బాద లేదులే అనుకోని ఏసిన నూరు రుపాయల నోట్లు, ఎంత ఉన్నా మనచేతిలో కర్సయిపోతుంది అనుకోని తెంపుచేసి ఏసిన ఒగటో రెండో ఐదు నూర్లు కాగితాలు కూడా ఉండేవి. ఈ రకంగా మూడేండ్ల నుండి కూడేసిన ఉండీ నిండి నిబ్బాలాడతా ఉంది. "మా ఊర్లోవాల్లు తిరుపతి కొండకు పోవాలంటే ఒగ ఇంట్లోవాల్లే పోరు. ఊర్లో కాగలిగినోల్లు అమ్మలక్కలు, అబ్బలబ్బలు మాట్లాడుకుని ఒగ పది పదైదు మందన్న జమై పోతారు." జయక్క నన్ను నా మొగున్ని పైనం చేసే. ‘ఇద్దరం వొచ్చేస్తే ఇంటికాడ మనిసి ఉండల్ల ఆ యమ్మిని తోడుకొనిపో’ అనే నా మొగుడు. ‘ఏం పాపా ఈ పైనం అట్ల పదాం పద మూడేళ్ల నాటి మొక్కుబడి తీర్సుకొని వద్దాము’ అనే జయక్క. ‘సర్లే’ అంటి. తిరపతికి పోను జతకు మనిసి దొరికితే సాలు అని కాసుకోనుండేవాల్లు. మా ఊరి లింగమ్మత్త, రెడ్డమ్మ, సరోజి, మగోల్లు నాగన్న, ఎంగటప్ప, రమణన్న.. అంతా తొమ్మిది మంది జమైనాము. మా ఊరు దావన పోయే తొమ్మిదిగంట్ల రైలు ఎక్కితే సరిగ్గా రెండు గంటలకు తిరపతిలో దిగతాం అని ఈ పొద్దే అందరం మాట్లాడుకొని పయనాలు కడతా ఉండాము. మా జయక్క ఉండీని చేతికి ఎత్తుకొని బరువు చూసే. కోటీసురాలు ఐనట్టు ఎలిగిపోతా వుంది మగం. ఆ వుండి పగలగొట్టే. సిల్లరంతా జల్లున రాలే. నోట్లన్నీ ఓపక్క, సిల్లరంతా ఓ పక్క లెక్కేసుకుండే. అంతా మూడేలు పైచిలుకు ఉన్నింది. ‘ఈ దుడ్డు మల్ల మిగిలించుకొని రాకూడదంట పాపా. అంతా కర్సు పెట్టేయలంట’ అని నాకు బింకంగా సెప్తా ఉంది. ఆ మరుసునాడు తెల్లారుజామునే లేసి అందరం తయారై ఒగ పూటకు సింతపులుసన్నం, గోదుమ రొట్లు, చెనిగ్గింజల గెట్టూరిబిండి ఏసి మనిసికి ఒగ పట్లాము కట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని పోతిమి. మా జయక్క వక్కాకు బలే ఏస్తుంది. ‘పాపా నాకు అన్నము లేకపోయినా ఉంట. వక్కాకు లేకుండా ఉండ్లేను’ అంటుంది. ఈ అమ్మకు దోడుమైనోల్లే సరోజమ్మ.. లింగమ్మ కూడా. ఈ ముగ్గురూ మేము పోయే తొక్కు వక్కాకు సిక్కదేమో అని మల్ల కొండ నుంచి తిరుక్కోని ఇంటికి వొచ్చిందంక ఉండేటిగా టౌనుకు పోయి కాలకట్ట తమలపాకులు, పిడుకుడు వక్కలు, పావు సేరు దుగ్గు తెచ్చుకున్నారు. మొగోల్లు మా యంగటన్న బీడీలు ఇపరీతంగా తాగతాడు. నాగన్న, రమణన్న కూడా తాగేవాల్లే. వాల్లకు కావాల్సిన బీడీలు, అగ్గిపెట్లు తెచ్చుకొని బ్యాగుల్లో పెట్టుకున్నారు. రెడ్డెక్క నేను తప్పనిడిసి మిగతా ఏడు మందికి బస్సెక్కినా రైలెక్కినా కిటికీ పక్కన వారసీటే కావాలంటారు వక్కాకు ఊంచుకోను. గెడిసేపన్నా వాల్ల నోర్లు ఊరికే ఉండవు. మేక నమిలినట్లు నమలతానే ఉంటారు. యాడబడితే ఆడ ఊంచుతారు. మాకు సగిచ్చదు. మేము వాల్ల మింద సిటుమొరుక్కుంటానే తిరపతి అలిపిరి మెట్లకాడికి పోతిమి కాలిదావన పోదామని. మా జయక్క కొండకు ముందే రెండుసార్లు వొచ్చింది. ఎంగటన్న కూడా ముందు వొచ్చినోడే. మిగతావాల్లకు ఇదే తొలిసారి. అందరం కియిలోకి పొయి నిలబడి ఆడ నుంచి బ్యాగుల్ని మనుసుల్ని తనికీ చేసే తావుకు పొయినాం. వీలంతా ఎనకెనకనే గుంజిట్లు పెడతా ఉంటే నేను రెడ్డెక్క ముందుగా పోతిమి. మావి చూసి అంపించేసిరి. మేము కడగా బారడు దూరం నిలబడితిమి. ఈల్లు ఎంచేపటికీ రాలా. మల్లొచ్చిరి. ఏమట ఇంతసేపు అంటే మా జయక్క మగం తప్ప మిగతా అందరివీ చింతాకంత అయిపొయినాయి. లింగమత్త ఐతే ఏడుపు మగమే పెట్టేసింది. ఎంగటన్న మటుకు నగుమొగంతో కనపడే. సరోజమ్మ ఉండుకొని ‘నేను నా వక్కాకు తిత్తి కనపడదు కదా అని పావడ నాడాకు కట్టి రెండు కాళ్ళ సందులో దిగేసుకోనుంటే అదెవుతో పోలీసిది ఒల్లంతా పామేటప్పుడు మూట పెద్దగా ఉండి చేతికి తగిలింది. తీయే అని పెరుక్కొని అంతా ఇసిరి పారేస. వక్కాకు పోతేపానీ బంగారట్ల తిత్తి ఆరు పారవులు ఏసి కుట్టిండేది. ఆరు ఏండ్లుకు ముందు కనుపూరి గంగమ్మ తిరణాల్లో తీసుకోనుంటి. ఎంత దుడ్డు మోసిందో ఎంత వక్కాకు మోసిందో! దుడ్డుతో ఎక్కువ బిక్కటైనబుడు తిత్తిని గాలిస్తే ఏదో ఒగ పార్వలో అంతో ఇంతో దొరికేది. అంత అచొచ్చిన తిత్తి పాయనే’ అని ఒకటే బాధపడే. ఇంతలో లింగమ్మ ‘ఓ నీ తిత్తి పోతే మల్ల తీసుకోవచ్చులే నాది సీమెండి పొడువు సున్నంకాయి. మాయమ్మ వాల్ల అమ్మ కాడ నుండి మూడు తరాల కాయి. మాయమ్మ గుర్తుగా అట్లే పెట్టుకో నుంటి. కాయినిండా ఒకసారి సున్నం పెడితే వారమంతా నమిలినా అయిపోయేదికాదు. ఆ సున్నంగాయి మూతకు ఎండి గొలుసు ఏసి, మూడు గెజ్జిలు కట్టి సున్నం లోడుకోను చిన్నగెంటి, పొల్లు గుచ్చుకునే పుల్ల, గుబిలిగెంటి ఇవన్నీ మూతకు కుచ్చు ఏసింటి. నా శనికాటం దాన్ని యాడన్న దాసిపెట్టుకోకూడదా! కడుపు సెన్నిట్టు అయిపోయా’ అని బాధపడే. నేను ఉండుకొని ‘పోతేపోనీలే వక్కాకే కదా ఏమో కలిమి పోయినట్టు ఏడస్తుండారే’ అంటే ‘అయ్యో నాయనా అదే మా పానాదరవ. పది దినాలు పస్తయిన ఉంటాము. గెడిసేపు వక్కాకు లేదంటే తలకాయి ఎర్రియాకోలం పడుతుంది. తెలిసినోల్లను గాని తెలీనోల్లను గాని అడగదామా అనిపిస్తుంది. మే జయా నువ్వు ముందే వచ్చింటివి కదా మాకు చెప్పిండకూడదా ఇంతకు నువ్వేమి చేసినావు’ అని అడిగిరి. ‘నేను వొట్టి తిత్తి నడుములో చెక్కోని వక్కాకు అంత మూటగట్టి గుడ్ల బ్యాగులో నడన పెట్టిన. ఆ నడుసుకొని పోయే మిసన్లో బ్యాగు ఏస్తే అది కిర్రుమనే. ఆ పోలీస్‌ది బ్యాగులో ఏందో ఉంది తీ బయటికి అనే. అమ్మా బజన చెక్కలు గిని అంటే ఏది చూపించు అనే. అవి పైనే ఉన్నాయి ఒగ జత అవి తీసిచూపిస్తే సరే పో అనే. పోనిలే మా ఇల్లిలప దేవుడు ఆ ఎంగట్రమన సామే నన్ను కాపాడినాడు. ఆ యప్ప సాస్టాగా నాపాలిటున్నాడు’ అని చెప్పే జయక్క. కత్తి గెలిసిన కోడేగతం మా జయక్క మగం ఎలిగిపాతా ఉంది. లింగమ్మకు కోపమొచ్చే ‘ఎంత మోసకారుదానివే! నీ యట్లాదాని మాటలకు ఎంగట్రరమణ సామే యామారి పోయినాడంట. నీ యట్లాడిది సామీ నేను అనుకునింది జరిగితే నీకు సిటికెల పందిరి ఏపిస్తాను అని మొక్కునిందంట. దేవుడు ఒరే ఇంతవరకు ఎవరు "తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు." ఏపీలేదే ఎట్లుంటుంది ఈ సిటికెల పందిరి చూద్దాం అని అసోద్దపోయి ఆ యమ్మ కోరిన మొక్కుతీర్సినాడు. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడంట ఇంగ ఎప్పుడు వచ్చి ఏపిస్తుంది సిటికెల పందిరి అని. ఆ యమ్మ నలగరు ఆడోల్లను పిలుసుకొనిబొయ్యి నలగర్నీ నాలుగు సమకాలంగా నిలబెట్టి నడిమిద్ద ఆ యమ్మ నిలబడుకొని అందరూ కలిసి సుట్టూ సిటికెలు ఏసిరంట. ఇదేసామి సిటికెల పందిరి నా మొక్కు సెల్లిపోయింది అంటే సామే బెబ్బిర్లకపోయి ఓరే ఎంత యామారిపోయినాను అనుకున్నంట. అట్లా దానివి నువ్వు’ అనే! లింగమ్మ చెప్పిన కతకు అందరం నగుకుంటూ ఉండగానే మగోల్ల మగాలు కూడా సప్పగిల్లినాయి. ఈల్ల బీడీలకట్టలు కూడా పెరుక్కొన్నారు. రమనన్న బీడీలకట్టని సరాయి లోజోబిలో పెట్టుకొని ఉన్నాడు. పోలీసులు తడిమేటప్పుడు చేతికి తగిలి పెరికి అక్కడ బారేసినరంట. నాగన్నది కూడా అట్లే పెరుక్కొన్నారు. ఎంగటప్ప మాత్రానికి బీడీలు కట్ట అగ్గిపెట్టి కట్ డ్రాయర్లో ఆయప్ప మాను కింద పెట్టుకున్నాడంట! ఈయప్ప ముందే రెండుసార్లు కొండకు వచ్చి పోయినాడు అందుకే తెలివి చేసినాడు. ఆయప్పవి మిగిలినాయి. మెటికిలు ఎక్కేటప్పుడు నాగన్న ఊరికే ఉండేదిలే కొండంతా పారజూస్తా ఎదో ఒకటి చెబతానే ఉంటాడు. ‘తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు. ఎంగట్రమణ సామికి పెండ్లి పెట్టుకున్నారు. చెప్పులు కుట్టే ఆయప్పకు జరం వొచ్చి మూర్తం టయానికి ఇవ్వలేక పెండ్లి అయిపోనంక చెప్పులు కుట్టకపోయి ఇచ్చినాడంట. మూర్తం టయానికి చెప్పులు బిన్నతేలేదని నువ్వు ఎన్ని మెట్లు కుట్టిన నీకు మెట్టు కరువైతుంది అని ఆ దేవుడు శపించినాడు. అందుకే కుట్టేవోనికి మెట్టు కరువు అనేది. ఇప్పుడు కూడా దినామూ మన మాదిగోడు జత మెట్లు కుట్టకపోయి ఆడ పెట్టాల అందుకే కొండన మనకు పావలా బాగం వస్తుంది’ అనే! అయితే ‘మనం దీని గురించి సెరియ తీసుకోవాల్సిందే’ అని ఎకసక్కలాడిరి. సద్ది మూట్లు మోయాలంటే బరువు అదే కడుపులో ఉంటే అంత బరువు ఉండదని నడన అందరూ కూసోని తినేస్తిమి. కొండెక్కి గుండ్లు కొట్టుకొని ఆ దేవుని దర్శనం బాగా చేసుకుంటిమి. గుళ్లో నుండి బయట పన్నాము. లింగమ్మ, సరోజమ్మ.. జయక్క యాడికిపోతే ఆడికి పోయేది ఎనకాలే వక్కాకు కోసం. ఎంగటప్ప యాడికి పోతే ఆడికి నాగన్న రమనన్న బంట్రోతులే గతం బీడీల కోసం పోయేది. అవి ఆయప్ప సామాన్లో పెట్టుకోనున్నివైనా సరే వాల్లు ఇడిసిపెట్లా. ఇదే తంతు ఇంటికి వచ్చిందంక. మా జయక్క మాత్రానికి వక్కాకు మిగిల్చినందుకు ఎంగట్రమణ సామి పటం తెచ్చుకుంది పూజించుకోను! (చదవండి: అన్నింటిలో కన్నా అన్నదానమే గొప్ప దానం! ) -
టైరు పేలి.. మంటలు చెలరేగి..
మిర్యాలగూడ అర్బన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం నార్కట్‌పల్లి–అద్దంకి రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ నుంచి 26 మంది నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని దర్గాను దర్శించుకునేందుకు వేమూరి కావేరి ట్రావెల్ బస్సును బుక్ చేసుకుని గురువారం రాత్రి బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున మిర్యాలగూడ హనుమాన్‌పేట ప్లైఓవర్ వద్దకు చేరుకోగానే బస్సు వెనుక టైర్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను బస్సు నుంచి దింపి వేశారు. బస్సులోని మూడు బకెట్లతో నీటిని చల్లినా మంటలు అదుపులోకి రాకపోగా.. క్షణాల్లో డీజిల్ ట్యాంక్‌కు మంటలు వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది. ఎస్ఐ కృష్ణయ్య అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం వచ్చేలోపు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ బస్సు.. రోడ్డు పక్కన నిలిపిఉన్న ఉల్లిగడ్డల లోడు లారీ పక్కనే ఆగిపోయింది. దీంతో లోడుపై కప్పిన టార్పాలిన్ సహా లారీకి కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులోని 26 మందిని కిందకు దింపడంతో ప్రాణ నష్టం తప్పింది. -
గ్యాస్ గ్రిల్‌తో.. పిక్నిక్లో వెరైటీ వంటలు వండేయొచ్చు
లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లినప్పుడు, పిక్నిక్లకు తిరిగినప్పుడు.. మన వెంట ఈ మెగామాస్టర్ పోర్టబుల్ గ్యాస్ గ్రిల్ ఉంటే చాలు, వేళకు రుచికరమైన ఐటమ్స్‌తో కడుపు నింపుకోవచ్చు. వెజ్, నాన్ వెజ్ ఇలా అన్ని రకాల వెరైటీలను చకచకా రెడీ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ గ్రిల్ డిజైన్ ప్రత్యేకంగా రూపొందింది. దీనిలో ఒకేసారి రెండు వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఇది గ్యాస్ మీద ఆధారపడి పనిచేస్తుంది. దీని లోపల పాన్ ప్లేట్, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ వేరువేరుగా ఉంటాయి. మూతకు అటాచ్ అయ్యి ఉన్న ఆ స్టీల్ స్టాండ్ మూతతో పాటు పైకిలేస్తుంది. క్లోజ్ చేస్తే.. దాని మీద ఆహారం లోపల పడిపోకుండా పోర్టబుల్‌గా మెషిన్లో అమరిపోతుంది. దీని బ్లాక్ అండ్ రెడ్ హ్యాండిల్‌కి ఆనుకుని ఉన్న చిన్న బటన్ ప్రెస్ చేస్తే.. పాన్ ప్లేట్ కింద మంట పుడుతుంది. అలాగే ఇది నిలబడటానికి ఉపయోగపడే స్టాండ్స్ కూడా మడిచేందుకు వీలుగానే ఉంటాయి. మూత ఊడకుండా లాక్ చేసుకోవడానికి ప్రత్యేకమైన క్లిప్ ఉంటుంది. ఎక్కడికైనా తీసుకుని వెళ్లడానికి దీని హ్యాండిల్ చక్కగా పనికొస్తుంది. ఇందులో కట్లెట్స్, కబాబ్స్, హోల్ చికెన్ వంటివెన్నీ రెడీ చేసుకోవచ్చు. ఈ డివైస్ ధర 79 డాలర్లు (రూ.6,535). -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్‌ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్‌రూమ్‌లు సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్‌ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
చంటి బిడ్డతో ప్రయాణమా? మీకోసమే 'ట్రావెల్ విత్ కిడ్స్'
ప్రయాణాల మీద బోలెడు ఆసక్తి ఉన్నప్పటికీ పిల్లలు ఒక వయసు వచ్చాకగానీ ఇల్లు దాటని తల్లులు ఎందరో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, డెంటిస్ట్‌లు సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు యంగ్ మదర్స్ కోసం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ అనే ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రయాణాలలో తల్లీపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు... సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు పర్యాటక ప్రేమికులు. వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రయాణాలకు మాత్రం దూరంగా ఉండేవారు కాదు. నాలుగున్నర సంవత్సరాల క్రితం సాక్షి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తున్నప్పుడు ‘చంటి బిడ్డతో ప్రయాణమా!!’ అని ఆశ్చర్యపోవడమే కాదు ప్రయాణాలు వద్దంటే వద్దన్నారు చాలామంది. ఒక బిడ్డకు తల్లి అయిన నికితకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా చెన్నైకి చెందిన సాక్షి తన మూడు నెలల బిడ్డతో కలిసి మహాబలిపురానికి వెళ్లింది. చాలా కాలం తరువాత పర్యాటక ప్రదేశానికి వచ్చింది. మరోవైపు బెంగళూరుకు చెందిన నికిత మూడు నెలల పిల్లాడితో కలిసి మైసూర్‌కు వెళ్లింది. ‘బేబీతో ప్రయాణం కష్టమని చాలామంది భయపెట్టారు. ఇది నిజం కాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. మొదటి మూడు నాలుగు నెలలు మాత్రమే కష్టం’ అంటుంది సాక్షి. చెన్నైలో ఉండే సాక్షి, బెంగళూరులో ఉండే నికితలు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఒకే రకమైన వృత్తి, అభిరుచులు వారిని సన్నిహిత స్నేహితులుగా మార్చాయి. సినిమాల నుంచి పర్యాటకం వరకు ఇద్దరు స్నేహితులు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. అలా ఒకరోజు వారి మధ్య చంటిబిడ్డలు ఉన్న తల్లుల ప్రస్తావన వచ్చింది. మహిళల కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. సోలో ట్రావెలర్స్, సీనియర్ సిటిజన్లు... మొదలైన వారి కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. కాని మదర్స్ అండ్ కిడ్స్ కోసం మాత్రం లేవు. ఈ లోటును భర్తి చేయడానికి రెండు సంవత్సరాల క్రితం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ పేరుతో ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. తొలి ‘మదర్ అండ్ కిడ్స్’ ట్రిప్‌ను పాండిచ్చేరికి ప్లాన్ చేశారు. సాక్షికి పాండిచ్చేరి కొట్టిన పిండి. పాండిచ్చేరి ట్రిప్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మంచి స్పందన లభించింది. ఈ ట్రిపుల్ ఆరుగురు తల్లులు వారి పిల్లలను తీసుకువెళ్లారు. ఈ ప్రయాణం విజయవంతం కావడంతో ఇద్దరు స్నేహితులకు ఎంతో ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు సంబంధించి అయిదు ట్రిప్‌లు ప్లాన్ చేశారు. తమ వృత్తిలో బిజీగా ఉండే సాక్షి, నికితలు వీకెండ్స్‌లో ప్లానింగ్ చేస్తుంటారు. ‘చంటి బిడ్డలు ఉన్నారని ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. బయటి ప్రపంచలోకి వస్తే కొత్త ఉత్సాహం, శక్తి వస్తాయి’ అంటున్నారు సాక్షి, నికిత. ‘పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త అనుభూతిని సొంతం చేసుకునేలా చంటి బిడ్డల తల్లులను ప్రేరేపించడం ఒక లక్ష్యం అయితే, ప్రయాణాలలో తల్లీబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అనేది మా ప్రధాన లక్ష్యం’ అంటుంది నికిత. ఈ ట్రావెల్ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు సాక్షి, నికితలలో ఒకరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి వస్తారు. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారు. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ‘ట్రిప్ బుక్ చేసుకున్న వారి కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. దీనిద్వారా తల్లుల ఆహారపు అలవాట్లతో పాటు వారి ఇష్టయిష్టాలు, తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం దొరికింది’ అంటుంది సాక్షి. చెన్నై. బెంగళూరు, ముంబై, జైపుర్, కోచి, కోల్‌కతా... ఇలా ఎన్నో నగరాల నుంచి తల్లులు ఈ ట్రిప్‌లలో భాగం అవుతున్నారు. తన పిల్లాడితో కలిసి పాండిచ్చేరికి వెళ్లిన దీపిక ఇలా అంటుంది... ‘ట్రిప్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు తిండి సహించేది కాదు. ఈ ప్రయాణంలో మాత్రం ఇంటి తిండిని మరిపించేలా చేశారు. ఈ ట్రిప్ ద్వారా ఎంతోమంది స్నేహితులయ్యారు’ ట్రిప్‌ల ద్వారా పరిచయం అయిన వారు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి కలుసుకోవడం, ఆ కుటుంబంలో వ్యక్తిలా మారడం మరో విషయం. ‘కిడ్–ఫ్రెండ్లీగా లేవని కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉంటాం. అయితే పిల్లలు మొరాకో నుంచి ఈజిప్ట్ వరకు ఎక్కడైనా సరే తమ ఆనందాన్ని తామే వెదుక్కుంటారు. పిల్లలు పార్క్‌లు, జూలలలో మాత్రమే ఆనందిస్తారనేది సరికాదు’ అంటుంది సాక్షి. సింగిల్ మదర్స్ ఈ ట్రిప్స్‌పై ఆసక్తి ప్రదర్శించడం మరో కోణం. స్థూలంగా చెప్పాలంటే ‘ట్రావెల్ విత్ కిడ్స్’ తల్లుల పర్యాటక సంతోషానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఒకే రకంగా ఆలోచించే వారిని ఒక దగ్గరికి తీసుకువచ్చింది. కొత్త స్నేహితుల రూపంలో కొత్త బలాన్ని కానుకగా ఇస్తోంది. -
ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..
రచయిత్రి, ప్రముఖ ఆదర్శ మూర్తి 'సుధామూర్తి' (Sudha Murthy) గత కొంత కాలంగా తన ప్రేమ గురించి, పారిశ్రామిక వేత్త భర్తగా ఉంటే భార్య ఎలా నడుచుకోవాలి అనే చాలా వివరాలు వెల్లడించింది. కాగా ఇప్పుడు తాను ఎలాంటి ఆహారం తీసుకుంటుంది, నాన్‌వెజ్ ఫుడ్ ఐటెమ్స్ ఏమైనా ఇష్టపడుతుందా అనే వివరాలు తెలిపింది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి ఖానే మే కౌన్ హై (Khaane Mein Kaun Hai) ఎపిసోడ్లో మాట్లాడుతూ.. తాను ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పుకొచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా తన ఫుడ్ తానే తీసుకెళుతుందని వెల్లడించింది. శాఖాహారానికి, మాంసాహారానికి ఒకే చెంచా ఉపయోగించడం తనకు నచ్చదని.. ఆఖరికి గుడ్లు, వెల్లులి కూడా తినదని తెలిపింది. విదేశాలకు వెళ్ళినప్పుడు వెజిటేరియన్ రెస్టారెంట్ కోసం వెతుకుతానని, ముందు జాగ్రత్తగా తన హ్యాండ్ బ్యాగ్ నిండుగా తినుబండారాలను తీసుకెళ్తానని కూడా చెప్పింది. తన వద్ద కుకింగ్ బ్యాగ్ కూడా ఉందని, అందులో ఆహారాన్ని వండడానికి ఉపయోగించే చిన్న కుక్కర్ ఉంటుందని చెప్పారు. (ఇదీ చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!) కొన్ని సంవత్సరాల క్రితం సుధామూర్తి తన అమ్మమ్మతో.. మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎందుకు మీ తినుబండారాలను మీతో తీసుకెళ్లకూడదు, బయట ఎందుకు తింటారు అని సరదాగా అడిగిందని.. చివరకు ఆ విధానాన్నే నేను అనుసరిస్తున్నానని సుధామూర్తి చెప్పింది. కావున ఇప్పుడు ఏ దేశానికీ వెళ్లినా దాదాపు తన ఫుడ్ తానే తీసుకెళుతుందని స్పష్టం చేసింది. -
వీరు విమాన ప్రయాణికులేనా?.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర
విమాన ప్రయాణాల్లో అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఇటీవలి కాలంలో తరుచూ నమోదవుతున్నాయి. కొందరు అభ్యంతరకరంగా ప్రవరిస్తూ తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. మరో ప్రయాణికునికి కేటాయించిన సీటులో కూర్చుని.. ఇటీవల టొరంటో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు హంగామా సృష్టించాడు. నేపాల్‌కు చెందిన మహేశ్ పండిట్ అనే ప్రయాణికుడు విమాన సిబ్బందిని తీవ్రంగా దూషించడంతోపాటు లావేటరీ డోర్‌ను ధ్వంసం చేసి, నానా రభస చేశాడు. తనకు కేటాయించిన సీటులో కాకుండా వేరే సీటులో కూర్చుని ఆ ప్రయాణికునితో మహేష్ పండిట్ గొడవపడ్డాడు. ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితునిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా తాకి.. గత ఏప్రిల్‌లో బ్యాంకాక్ నుంచి ముంబాయికి వస్తున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌తో పాటు ప్రయాణికులతో అమర్యాదకరంగా ప్రవర్తించాడు. విమానంలో ఆహారం అందుబాటులో లేదని ఎయిర్‌హోస్టెస్ చెప్పడంతో ఒక ప్రయాణికుడు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతసేపటి తరువాత ఆమె అందించిన చికెన్ డిష్ తీసుకునేందుకు అంగీకరిస్తూ, కార్డు స్వైపింగ్ పేరుతో ఆమెను అసభ్యంగా తాకాడు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయగా, మరింత రెచ్చిపోతూ అందరిముందు వేధించాడు. ఈ ఘటనపై సదరు ఎయిర్‌హోస్టెస్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీటు పక్కనే వాంతి చేసుకోవడంతో పాటు.. కొద్దిరోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు ముత్ర విసర్జన చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. గువాహటి నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో తన సీటు పక్కన వాంతి చేసుకున్నాడు. అంతటితో ఆగక టాయిలెట్ బయట మలవిసర్జన చేశాడు. ఫలితంగా విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కుక్క పిల్లను ఒడిలో పెట్టుకోవద్దనడంతో.. గత ఏడాది అట్లాంటా విమానాశ్రయంలో న్యూయార్క్ వెళ్లే విమానంలో ప్రయాణించిన ఒక మహిళా ప్రయాణికురాలు తన వెంట ఒక కుక్క పిల్లను తెచ్చుకుంది. ట్రావెల్ కేజ్‌లో ఉంచాల్సిన ఆ కుక్క పిల్లను తన ఒడిలో ఉంచుకొని కూర్చుంది. దీనిని గమనించిన విమాన సిబ్బంది ఆ కుక్క పిల్లను కేజ్‌లో ఉంచాలని చెప్పడంతో, ఆగ్రహించిన ఆ మహిళ విమాన సిబ్బందిని తిట్టడంతోపాటు నానా హంగామా చేసింది. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా వెంటనే విమానం దిగాలని చెప్పిన ఒక ప్రయాణికుడిపై వాటర్ బాటిల్ విసిరింది. అయితే చివరకు ఆ మహిళను విమాన సిబ్బంది కిందకు దించారు. ఈ విషయాన్ని అట్లాంటా పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. గణిత సమీకరణాన్ని పరిష్కరిస్తూ.. ఆ మధ్య అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. విమానంలో గణిత సమీకరణాన్ని పరిష్కరించే విషయంలో తోటి ప్రయాణికుడు అనుమానంగా ప్రవర్తిస్తున్నాడని, విదేశీ స్క్రిప్ట్‌లో రాస్తున్నాడని ఒక మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ ప్రయాణికుడి కారణంగా తాను అనారోగ్యం పాలయ్యానని పేర్కొంది. ఇందుకు కారకుడైన ప్రొఫెసర్ గైడో మెన్జియోను అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రాంతీయ విమానం టేకాఫ్ చేయడానికి ముందు ప్రశ్నించింది. అసలు విషయం వెల్లడి కావడంతో ఆమెను ప్రత్యేక విమానంలో ఆమె చేరాల్సిన గమ్యస్థానానికి తరలించారు. ఇది కూడా చదవండి: ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు -
ప్రపంచంలోని ఆ ముగ్గురు పాస్‌పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరో తెలిస్తే..
ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే ఎవరికైనా పాస్‌పోర్ట్ అవసరమనే సంగతి మనకు తెలిసిందే. ఈ నియమం పెద్దపెద్ద వీఐపీలకు కూడా వర్తిస్తుంది. సెలబ్రిటీలు కూడా పాస్‌పోర్టు లేకుండా ఏ దేశంలోనూ కాలుమోపలేరు. అయితే ప్రపంచంలోని ఆ ముగ్గురు ఎటువంటి పాస్‌పోర్టు లేకుండా ఏ దేశానికైనా వెళ్లవచ్చు. ఆ ముగ్గురికి పాస్పోర్టుతో పనేమీ లేదు. మరి ఆ ముగ్గురు ఎవరో తెలుసా? ఆ ముగ్గురు వీరే.. ప్రపంచంలో పాస్‌పోర్ట్ అవసరం లేని ఆ ముగ్గురు ఎవరనే విషయానికొస్తే.. వారు బ్రిటన్ కింగ్, జపాన్ కింగ్, జపాన్ క్వీన్. వీరు విదేశాలు వెళ్లాలనుకుంటే పాస్‌పోర్ట్ అవసరం లేదు. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన క్వీన్ ఎలిజబెత్‌కు ఈ అధకారం ఉండేది. తరువాత ఛార్లెస్ రాజయ్యాక అతనికి ఈ అధికారం సంక్రమించింది. ఈ అధికారం కేవలం ఛార్లెస్‌కు మాత్రమే ఉంటుంది. వారి ఫ్యామిలీలో ఎవరికీ ఈ అధికారం లభించదు. వారు విదేశాలు వెళ్లాలంటే వారికి పాస్‌పోర్టు అవసరమవుతుంది. ప్రముఖుల విషయంలో.. ఏ దేశంలోనైనా ఎంతటి ప్రముఖులైనా విదేశాల్లో కాలుమోపేందుకు వారికి పాస్‌పోర్ట్ అవసరమవుతుంది. అయితే వారి దగ్గర డిప్లొమెట్ పాస్‌పోర్టు ఉంటుంది. ఇది ఏదేశానికి వెళ్లాలన్నా వారికి ప్రత్యేక గుర్తింపును కల్పిస్తుంది. అలాగే ఎయిర్‌పోర్టులో వీరికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వీరు ప్రత్యేక ప్రొటోకాల్‌ను పాటించాల్సివుంటుంది. భారత్ విషయానికొస్తే ఇక్కడ రాజ్యాంగబద్ధమైన కొన్ని పదవుల్లో ఉండే కొందరి దగ్గర డిప్లొమెట్ పాస్‌పోర్టు ఉంటుంది. దీని సాయంతో వారు తగిన ప్రొటోకాల్ పాటిస్తూ విదేశీయాత్ర చేయవచ్చు. అయితే వీరికి కూడా పాస్‌పోర్టు అవసరమవుతుంది. ఇది కూడా చదవండి: రాత్రి భోజనం ఉదయం 11కే కానిచ్చేస్తాడు.. 45లో 18లా కనిపిస్తూ.. -
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం ఎక్కడో తెలుసా!
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సీతా సమాహిత్ స్థల్. సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యం అయ్యిందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో చాలా మందికి తెలియదు. మరి అదెక్కడుంది? ఆ ప్రాంత విశేషాలేమిటి వంటివి చూద్దామా ..! ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు .. అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతియ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండవ జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని 'సీత సమాహిత్ స్థల్' అని 'సీత మారి' అని పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్లో చూడటానికి ఒకేఒక గుడి ఉన్నది. ఆ గడ్డిని పశువులు కూడా తినేవి కావు బహుశా ..! దీన్ని చూస్తే గుడి అని అనిపించదేమో! ... స్మారకం అనాలేమో ..!! తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటుంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరుగక ముందు ఇక్కడ అమ్మ వారి జుట్టుని తలపించేట్టుగా కేశ వాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు 'సీతా కేశ వాటిక' ను పాడు చెయకుండ అలాగే ఉంచారు. స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమంలోనే జానకి దేవి మళ్లీ అడవుల పాలైనప్పుడు నివాసము ఉన్నది ఇక్కడే. ఆశ్రమానికి పక్కనే లవ కుశలకు జన్మనిచ్చిన స్థలం అయిన సీత వటవృక్షం కూడ ఉంటుంది. ఇక స్మారకం విషయానికి వస్తే, అది ముచ్చటగా రెండు అంతస్థుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపంలో అమ్మ వారి పాల రాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మ వారి ప్రతిమను చూస్తుంటే ... ఎంతటి వారికైన బాధ కలిగించే విధంగా ఉంటుంది. వెనక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలా చిత్రం కనిపిస్తుంది. గుడి లేదా స్మారక వివరాల్లోకి వెళితే, దీన్ని స్వామి జితేంద్రానంద తీర్థులవారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించారు. సీతా సమాహిత్ స్థల్ చేరుకొను మార్గం సీతా సమాహిత్ స్థల్ కి బస్సు మార్గం చక్కగా ఉంటుంది. అలహాబాద్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో, వారణాసి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్య క్షేత్రం. రైళ్లలో వచ్చే వారు అలహాబాద్ లేదా వారణాసి (ఏది దగ్గర అనుకుంటే అది) రైల్వే స్టేషన్లో దిగి సీతా సమాహిత్ స్థల్ చేరుకోవచ్చు. విమాన మార్గం ద్వారా వచ్చే వారు అలహాబాద్ లేదా వారణాసి విమానాశ్రయాలకు చేరుకొని క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సులో ప్రయాణించి చేరుకోవచ్చు. (చదవండి: కలియుగ శ్రవణుడిలా..తల్లిని భుజాలపై మోస్తూ..) -
పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటనతో తెలంగాణ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఈనెల 7 వరకు దక్షిణ కొరియాలో పర్యటించనుంది. ఈ బృందం శుక్రవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకోగా.. ఆ దేశంలో భారత అధికారులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గోదావరి నది ఒడ్డునున్న కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, మహబూబ్‌నగర్‌లోని ట్యాంక్ బండ్ అభివృద్ధి, అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్ జెయింట్ వీల్ వేవ్ పూల్, వాటర్ రైడ్స్, వాటర్ స్పోర్ట్స్, మన్యంకొండ వద్ద తొలిసారిగా నిర్మిస్తున్న రోప్ వే, హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయని వివరించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా తమ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్ వాటర్ రివర్ ఫ్రంట్‌ను అధ్యయనం చేస్తున్నట్లు శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. -
ప్రయాణాల్లో కాఫీ తాగాలనుందా? ఈ మేకర్‌తో సులువుగా..
చాలామందికి కాఫీ లేనిదే రోజు గడవదు. అలాంటి వారికి ప్రయాణాల్లో కూడా చక్కటి కాఫీని అందిస్తుంది ఈ మేకర్. చూడటానికి, వెంట తీసుకెళ్లడానికి చిన్న బాటిల్లా కనిపిస్తుంది. ఓపెన్ చేసుకుంటే మేకర్, కప్ రెండూ వేరువేరుగా ఉంటాయి. అలాగే ఈ బాటిల్లో కాఫీ పౌడర్ వేసుకోవడానికి, కలుపుకోవడానికి వీలుగా వేరువేరు స్పూన్స్‌తో పాటు మినీ ఫిల్టర్ ఉంటుంది. ఇందులో ఒకేసారి మూడు కప్పల కాఫీని తయారు చేసుకోవచ్చు. చిత్రంలో చూపిన విధంగా ఒకదానిపై ఒకటి అడ్జస్ట్ చేసుకుని.. అందులో కాఫీ పౌడర్, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని.. పై నుంచి గట్టిగా ప్రెస్ చేస్తే కొద్దికొద్దిగా లిక్విడ్ కప్‌లోకి చేరుతుంది. అందులో హాట్ వాటర్ లేదా కూలింగ్ వాటర్ లెక్క ప్రకారం(వేసుకున్న కాఫీ పౌడర్ని బట్టి) కలుపుకుని.. హాట్ కాఫీ లేదా కోల్డ్ కాఫీని తయారు చేసుకోవచ్చు. కాఫీ పెట్టుకోవడం పూర్తి అయిన తర్వాత క్లీన్ చేసుకుని, మళ్లీ చిన్న బాటిల్లా మార్చుకుని బ్యాగ్‌లో వేసుకోవచ్చు. -
అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే..
అమర్నాథ్ యాత్ర జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు బయలుదేరే భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రయాణానికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్ అమర్నాథ్ యాత్రికులకు ఒక శుభవార్త తెలిపింది. అమర్నాథ్ యాత్రికులకు ప్రయాణ సమయాన ఇబ్బందులను దూరం చేస్తే వార్త ఇది. ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగించనుంది. అమర్నాథ్ యాత్ర చేసేవారు ముందుగా హోటల్ బుక్ చేసుకుంటే వారికి భారీ రాయితీ లభించనుంది. ఈ విషయాన్ని ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్(ఏజేహెచ్ఎల్ఏ) ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్ములో బసచేసే అమర్నాథ్ యాత్రికులు ఇక్కడి హోటల్స్‌ను ముందుగానే బుక్ చేసుకుంటే 30 శాతం రాయితీ అందించనున్నట్లు ఏజేహెచ్ఎల్ఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పవన్‌గుప్తా మాట్లాడుతూ తాము సదుద్దేశంతో అమర్నాథ్ యాత్రికులలో ఇక్కడి హోటల్స్‌లో బసచేసేవారికి 30 శాతం రాయితీ అందజేస్తున్నట్లు తెలిపారు. తద్వారా అమర్నాథ్ యాత్రికులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందన్నారు. జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రంగా భావించే అమర్నాథ్ గుహ దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల నడుమ, సమద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ 62 రోజుల తీర్థయాత్ర రెండు మార్గాల గుండా సాగుతుంది. వాటిలో ఒకటి అనంత్‌నాగ్ జిల్లాలో 48 కిలోమీటర్ల పొడవున సాగుతుంది. మరొకటి బందర్బల్ జిల్లాలో 14 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుంది. ఈ యాత్రలో పాల్గొనేవారు జూన్ 30 నాటికి జమ్మునకు చేరుకోవాల్సి ఉంటుంది. కాగా ఈసారి అమర్నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తుల వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. చదవండి: ‘ఆది పురుష్’పై విమర్శల బాణం ఎక్కుపెట్టిన అఖిల భారత హిందూ మహాసభ! -
ఓయో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్
-
Odisha Train Accident: ఆ తండ్రి నమ్మకమే కొడుకుని బతికించింది!
ఒడిస్సా బాలాసోర్‌లో వందలాది ప్రాణాలు బలిగొన్న ఆ రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. ఎందరికో తీరని విషాదాన్ని మిగిల్చింది. కొందరూ మాత్రం ఆ ప్రమాదాన్ని ఎదుర్కొని మృత్యుంజయులై ప్రాణలతో బయటపడిన వారు కూడా ఉన్నారు. అంతటి భయానక విషాదంలోని తన వాళ్లు బతికే ఉండాలన్న ఆరాటం, ఆశతో గాలించిన కొందరి ఆశలు, ప్రయత్నాలు సఫలమయ్యాయి. వారి ప్రేమ, తపనే ఆయా వ్యక్తులకు ఊపిరి పోసి మృత్యుజయులుగా తిరిగొచ్చేలా చేసిందా!.. అన్నట్లుగా జరిగిందో ఓ ఉదంతం. ఆ తండ్రి నమ్మకమే విధే చిన్నబోయేలా గెలచింది. కొడుకు ప్రాణాలను కాపాడుకోగలిగే చేసింది ఆ తండ్రి ఆశ. అసలేం జరిగిందంటే..పశ్చిమ బెంగాల్‌లోన హౌరాకు చెందిన హేలరామ్ అనే దుకాణదారుడు తన 24 ఏళ్ల కొడుకు బిస్వజిత్ మాలిక్‌ని కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించేందుకు శుక్రవారం షాలిమార్ స్టేష్‌న్‌కు వచ్చాడు. కొడుకుని కోరమండల్ రైలు ఎక్కించి వీడ్కోలు పలికి వెనుదిరిగి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే రైలు ప్రమాదం గురించి విని షాక్ అయ్యాడు. వెంటనే కొడుకుకి ఫోన్ చేస్తే తాను చాలా గాయాలతో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హేలరామ్ ఓ అంబులెన్స్ డ్రైవర్ పలాష్ పండిట్‌ను ఏర్పాటు చేసుకుని.. తన బావ దీపక్ దాస్‌తో కలిసి ఒడిశాకు బయలుదేరాడు. సుమారు 230 కిలోమీటర్లు ప్రయాణించి.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రాత్రికల్లా చేరుకున్నారు. ఆ రాత్రే ప్రాణాలతో బయటపడిన వారికి చికిత్స అందిస్తున్న ప్రతి ఆస్పత్రిని సందర్శించిన ఏం ప్రయోజనం లేకపోయింది ఆ తండ్రికి . కొడుకు ఎక్కడ ఉన్నాడన్నది కానరాలేదు. అయితే అధికారులు హేలారామ్‌ని మృతదేహాలను ఉంచిన తాత్కాలిక మార్చరీ(బహనాగా హైస్కూల్) వద్దకు వెళ్లమని సూచించారు. నిజానికి సాధారణ పౌరులు ఎవర్నీ అక్కడకు వెళ్లనివ్వడం లేదు. బాధితుల బంధువులకు మాత్రమే అనుమతి. సరిగ్గా అక్కడకు హేలారామ్ చేరుకునేసరికి..ఇంతలో ఆ శవాల మధ్యలోంచి ఓ చేయి కదలడం ప్రారంభించింది. దీంతో అక్కడి వాతావరణం కాస్త గందరగోళంగా మారిపోయింది. అదృష్టవశాత్తు ఆ చేయి కదిలిన వ్యక్తే హేలరామ్ కొడుకు బిస్వజిత్‌గా తేలింది. ప్రమాదం జరిగిన రెండో రోజుకి తన కొడుకు ఆచూకిని కనిపెట్టగలిగాడు హేలారామ్. దీంతో ఆ తండ్రి తాను తీసుకొచ్చిన అంబులెన్స్‌లో బాలాసోర్ ఆస్పత్రికి కొడుకుని తీసుకుకెళ్లగా.. వారు కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి.. కటక్ మెడికల్ కాలేజికి తీసుకెళ్లమని రిఫర్ చేశారు. హుటాహుటినా అతడిని ఆ అంబులెన్స్‌లోనే కోల్‌కతాలోని సదరు ఆస్పత్రికి తరలించారు. అతని కాలికి అయ్యిన గాయాలకు శస్త్ర చికిత్సలు చేశారు. ప్రస్తుతం ఇంకా కొన్ని గాయాలతో బాధపడుతున్నట్లు అతడి తండ్రి చెప్పుకొచ్చాడు. నాన్ మెడికల్ సహయక బృందం అతను అపాస్మారక స్థితిలో ఉండటంతో.. చనిపోయాడని తప్పుగా భావించి శవాలు ఉండే చోటే పెట్టినట్లు అధికారులు చెప్పినట్లు వెల్లడించాడు హేలరామ్. ఎలాగైతే తన కొడుకు ప్రాణాలతో ఉంటాడన్న ఆ తండ్రి ఏకంగా అంబులెన్స్ మాట్లుడుకుని తీసుకెళ్లాడు. రెండు రోజులు శవాల మధ్య అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడి కొడుకుని.. ఆ తండ్రి నమ్మకమే ఊపిరి పోసి మృత్యుంజయుడై తిరిగొచ్చేలా చేసింది. (చదవండి: లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియాకు చుక్కెదురు) -
ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’..
ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం (జూన్ 2) నాడు ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న దరమిలా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. అదే సమయంలో అక్కడ ఒక ప్రేమకథకు ఆనవాళ్లుగా నిలిచిన కాగితాలు చిందరవందరగా పడి కనిపించాయి. ఈ కాగితాలపైగల అక్షరాలు బెంగాలీ భాషలో ఉన్నాయి. అవి ఒక ప్రేమ కథను ప్రతిబింబించాయి. వివరాల్లోకి వెళితే ఈ కాగితాలు ఎవరో రాసుకున్న డైరీలో నుంచి చినిగిపోయి చిందరవందరగా అక్కడ పడివున్నాయి. వీటిలో ఒక చేప, సూర్యుడు, ఏనుగు చిత్రాలను గీస్తూ ఎవరో తనలోని ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పేపర్లను పరిశీలనగా చూస్తే ఎవరో ప్రయాణికుడు తన సెలవు రోజుల్లో తన ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ తనలోని ప్రేమను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయాణికుని గురించి ఇంతవరకూ సమాచారం ఏదీ లభ్యంకాలేదు. ఈ కాగితాలపై బెంగాలీ భాషలో రాసిన ఆ పదాల తెలుగు అనువాదం ఇలా ఉంది ‘నేను నిన్ను ప్రతీ నిముషం ప్రేమించాలని పరితపిస్తుంటాను. ఎందుకంటే నువ్వు నా హృదయానికి అంతలా దగ్గరయ్యావు’ అని రాసివుంది. చదవండి: వరుని మెడలో దండ వేసే సమయంలో షాకిచ్చిన వధువు ప్రేమను ప్రతిబింబిస్తున్న ఈ అక్షరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న బృందంతో పాటు పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రేమ కవితలతో కూడిన ఈ కాగితాలను జాగ్రత్తపరుస్తాం. ఇప్పటి వరకూ ఈ కవితలు తనవే అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ఈ కవితలు ఎవరు రాశారో ఇంతవరకూ తెలియలేదని అన్నారు. కాగా జూన్ 2న ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 275 మంది మృతి చెందారు. 1000 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వీరంతా బాలేశ్వర్, కటక్, భువనేశ్వర్‌లలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. Just 2 days back, there was a train accident in Balasore, India. Too many died and a lot more had serious injuries. A bundle of love letters and poems were found amongst the debris on the tracks. A glimpse of a lost romance. A rarity in this age. Give this post a read. pic.twitter.com/MHUq8LplyD — Chandra Bhushan Shukla (@shuklaBchandra) June 4, 2023 -
ఆటోకి మూడు చక్రాలే ఎందుకుంటాయంటే...
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఏదైనా వాహనం అవసరం అవుతుందనే సంగతి మనకు తెలిసిందే. కొంతమంది ఇందుకోసం తమ సొంతవాహనాన్ని వినియోగిస్తారు. చాలామంది ఈ విషయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయితే చాలా వాహనాలకు నాలుగు చక్రాలు ఉంటుండగా ఆటోకు మాత్రం మూడు చక్రాలే ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆటోకు నాలుగు చక్రాలు ఎందుకు అమర్చలేదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? రండి... దీని వెనుకనున్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు చక్రాలతో కన్నా మూడు చక్రాలతో వాహనాన్ని రూపొందిస్తే ఖర్చు తగ్గుతుంది. అలాగే తక్కువ ఇంజినీరింగ్ వర్క్ సరిపోతుంది. నాలుగు చక్రాల వాహనం కన్నా మూడు చక్రాల వాహనం చిన్నదిగా రూపొందుతుంది. అలాంటప్పుడు ఎటువంటి ఇరుకు ప్రాంతంలో ప్రయాణించడానికైనా, కొద్దిపాటి ప్రాంతంలో పార్క్ చేయడానికైనా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే పట్టణాల్లో ఆటోలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మూడు చక్రాల వాహనం వలన ఇంధన వినియోగం కూడా భారీగా అవదు. ఆటోను నడిపించేందుకు ఇంజనుకు తక్కువ శక్తి సరిపోతుంది. సాధారణంగా మూడు చక్రాల వాహనాన్ని ప్రయాణికులను తరలించేందుకు, లేదా సరుకు రవాణాకు వినియోగిస్తుంటారు. అటువంటప్పుడు వాహనాన్ని అన్నిరకాలదారులలో త్వరగా ముందుకు తీసుకువెళ్లవచ్చు. అయితే కొన్ని పరిస్థితులలో నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం అనువైనదికాదనిపిస్తుంది. మంచుతో కూడిన ప్రాంతాలలో లేదా కార్నరింగ్ ప్రదేశాలలో ఆటో డ్రైవ్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అలాగే నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం తక్కువ సామర్థ్యం కలిగివుంటుంది. అలాగే తక్కువ సరుకును లేదా కొద్దిమంది ప్రయాణికులను మాత్రమే తరలించేందుకు అనువుగా ఉంటుంది. ఈ విధంగా చూస్తే మూడు చక్రాల ఆటో వలన కొన్ని లాభాలు, మరికొన్ని నష్టాలు ఉన్నాయి. -
యాపిల్ స్పెషల్ ఫీచర్‌తో స్మార్ట్ ట్రావెల్ మగ్, ధర వింటే..!
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులకు ఉండే క్రేజే వేరు. అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్, ఐపాడ్స్, స్మార్ట్ వాచెస్‌ను చూశాం. తాజాగా టెంపరేచర్‌ను కంట్రోల్ చేసే కీలక ఫీచర్‌తో యాంబర్ ట్రావెల్మగ్ 2+ను యాపిల్ తన ఆన్లైన్ స్టోర్‌లో విక్రయిస్తోంది. యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ ధర ప్రస్తుతం 199.95 డాలర్లు (రూ. 16,542) గా ఉంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ) ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌లో ఫైండ్ మై యాప్‌కు సపోర్ట్‌ను అందిస్తోంది అంటే ఒక వేళ ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ పోతే, దాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) వేడిగా వేడిగా కాఫీనో, టీనో ఆస్వాదించే ఈ యాంబర్ ట్రావెల్ మగ్ 2+ లో మనం తాగే డ్రింక్ ఉష్ణోగ్రతను (120°F- 145°F) సెట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ బ్యాటరీ సాయంతో ఉష్ణోగ్రతను 3 గంటల వరకు ఉంచుకోవచ్చు. లేదా ఛార్జింగ్ కోస్టర్ సాయంతో రోజంతా కూడా ఇందులోని డ్రింక్స్‌ను హాట్‌గా ఉంచుకోవచ్చు. ఇలాంటి టెక్ వార్తలు, ఇతర బిజినెస్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ట్రావెలింగ్ చేసేవారికి అలర్ట్! పెరుగుతున్న ఆన్లైన్ ట్రావెల్ స్కామ్‌లు
ముంబై: కరోనా వైరస్ ప్రభావం బలహీనపడిన తర్వాత పర్యాటక రంగంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దేశ, విదేశీ పర్యటనలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. విమాన ప్రయాణికుల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇదే తరుణంలో ఆన్లైన్ ట్రావెల్ స్కామ్‌లు (మోసాలు) కూడా పెరుగుతున్నట్టు మెకాఫీ కార్ప్ ‘సేఫ్ హాలిడేస్ ట్రావెల్’ నివేదిక వెల్లడించింది. పర్యాటకులు తమ విహారం కోసం ఆన్లైన్లో పలు సేవలను బుక్ చేసుకోవడం తెలిసిందే. ఇలా బుక్ చేసుకునే సమయంలో మోసపోతున్న కేసులు గణనీయంగా పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. దీనిపై ఓ సర్వే నిర్వహించి వివరాలను వెల్లడించింది. సర్వే వివరాలు.. తాము బుకింగ్ సమయంలో ఆదా చేసుకునేందుకు ప్రయత్నించగా, మోసపోయినట్టు 51 శాతం మంది చెప్పారు. వీరిలో 77 శాతం మంది సగటున ఒక్కొక్కరు వెయ్యి డాలర్లు (సుమారు రూ.82,000) నష్టపోయినట్టు తెలిపారు. మొత్తం 7,000 మందిని సర్వే చేయగా, అందులో భారత్ నుంచి 1,010 మంది ఉన్నారు. 27 శాతం మందిని చెల్లింపుల సమయంలో వేరే ప్లాట్‌ఫామ్‌లకు మళ్లించి మోసపుచ్చారు. 36 శాతం మంది గుర్తింపు చోరీకి గురైంది. ఇందులో 13 శాతం మంది పాస్‌పోర్ట్ వివరాలు పంచుకోగా, 27 శాతం మంది వ్యక్తిగత గుర్తింపు వివరాలను నకిలీ సైట్లకు వెల్లడించారు. డిజిటల్ మోసాల ముప్పు ఎక్కువని 59 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. వైఫై నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అవడం, ఎయిర్పోర్ట్ లేదా రైల్వే స్టేషన్లలో ఉచిత యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వాడుకోవడం, డిజిటల్ అకౌంట్‌ను లాగవుట్ చేయకుండా వదిలివేయడం రిస్క్‌ను పెంచుతోంది. ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ జోరు.. 5.6 లక్షల ఇళ్ల నిర్మాణం! హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో.. -
ట్రెండ్ మారింది గురూ! ఏసీకి ఫ్యాన్స్! ఖర్చుకు తగ్గేదేలే!
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణం అంటేనే హడావుడి. త్వరగా బయలుదేరి రైలు అందుకోవడం.. ఏ మూలనో కాసింత చోటు సంపాదించుకుని హమ్మయ్య అనుకోవడం.. రోజుల తరబడి వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు చివరికి ఏదో ఒక బెర్త్ కన్ఫర్మ్ అయితే చాలు అని ఆశపడటం ఇన్నాళ్లుగా కనిపించేంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. సౌకర్యవంతమైన ప్రయా ణానికి జనం మొగ్గు చూపుతున్నారు. జనరల్, నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ బోగీల కంటే.. ఏసీ బోగీల్లో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. దూరంతో, కాలంతో సంబంధం లేకుండా వేసవిలోనైనా, చలికాలంలోనైనా.. ఏసీ కోచ్‌లో సీట్లు దొరికాకే ప్రయాణానికి సిద్ధమవు తున్నారు. ఒంటరిగా ప్రయాణించినప్పుడు ఏదో ఒక బోగీలో ప్రయాణం చేసినా.. ఇంటిల్లిపాది కలిసి వెళితే మాత్రం ఏసీపై దృష్టిపెడుతున్నారు. థర్డ్ ఏసీకి ప్రాధాన్యం.. సాధారణ స్లీపర్ చార్జీలతో పోల్చుకుంటే ఏసీ ప్రయాణానికి చార్జీలు చాలా ఎక్కువే. ఫస్ట్, సెకండ్ ఏసీ బోగీలకైతే చాలా ఎక్కువ. అయితే అటు సౌకర్యం, ఇటు కాస్త అందుబాటులో ఉండటంతో థర్డ్ ఏసీ బోగీల్లో ప్రయాణానికి జనం మొగ్గుచూపుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి స్లీపర్ క్లాస్ చార్జీ రూ.450 వరకు ఉంటుంది. అదే థర్డ్ ఏసీలో రూ.1,100 వరకు ఉంటుంది. అయినా 12 గంటల పాటు ప్రయాణం కావడంతో టికెట్ ధర ఎక్కువే అయినా వీటిలో ప్రయాణిస్తున్నారు. ఇక ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్షీట్లు అందజేయడం, రెండు వైపులా డోర్లు లాక్ చేసే సదుపాయం వల్ల ప్రయాణంలో భద్రత ఉంటుందనే భరోసా.. రాత్రంతా ప్రశాంతంగా నిద్రించి ఉదయాన్నే గమ్యస్థానానికి చేరుకొనే అవకాశం ఉంటాయి. కొన్నిరైళ్లలో ఏసీ బోగీల్లో ఐఆర్సీటీసీ కేటరింగ్ సదుపాయం కూడా లభిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో ప్రతిరోజు సుమారు 650 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా.. వీటిలో 230కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లలో ప్రతిరోజు లక్షకుపైగా థర్డ్ ఏసీ బెర్తులు భర్తీ అవుతున్నట్టు అంచనా. సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ చార్జీలు బాగా ఎక్కువే అయినా.. దూర ప్రాంత ప్రయాణాల్లో సెకండ్ ఏసీకి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇవి రోజూ సుమారు 30 వేల బెర్తులు భర్తీ అవుతున్నట్లు అంచనా. స్లీపర్ బోగీలు తగ్గిస్తూ.. అన్ని ప్రధాన రైళ్లలో స్లీపర్ కోచ్‌లను తగ్గించి థర్డ్ ఏసీ బోగీలను పెంచుతున్నారు. గతంలో 1.5 లక్షల వరకు స్లీపర్ బెర్తులు అందుబాటులో ఉంటే.. ఇప్పుడవి లక్షకు తగ్గినట్టు అంచనా. ఇదే సమయంలో ప్రయాణికుల డిమాండ్‌కు తగినట్టు థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బెర్తులు పెంచారు. హైదరాబాద్ నుంచి విశాఖ, బెంగళూరు, ముంబై, దానాపూర్, రెక్సాల్, భువనేశ్వర్ తదితర రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ. ఈ రూట్లలో నడిచే రైళ్లలో స్లీపర్ బెర్తుల సంఖ్య సగానికి సగం తగ్గించినట్టు సమాచారం. ‘‘స్లీపర్ బోగీలకు డిమాండ్ లేదని చెప్పలేం. దిగువ మధ్య తరగతి, సాధారణ ప్రయాణికులకు తమ బడ్జెట్లో ప్రయాణ సదుపాయాన్ని అందజేసేవి స్లీపర్ క్లాస్ బోగీలే. కానీ ఇటీవల కాలంలో ఏసీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు..’’ అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ముందుఅన్నీ ఏసీ రైళ్లే.. రానున్న కాలంలో పూర్తిగా ఏసీ రైళ్లు మాత్రమే పట్టా లెక్కనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు విజయవంతంగా పరుగులు తీస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి పట్టణాలకు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. డిమాండ్ బాగుండటంతో తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో బోగీల సంఖ్యను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. త్వరలో బెంగళూరుకు వందేభారత్ అందుబాటులోకి రానుంది. అలాగే ఢిల్లీ, ముంబై తదితర నగరాలకు కూడా పూర్తి ఏసీ సదుపాయం ఉన్న వందేభారత్ రైళ్లను నడపనున్నారు. దక్షిణ మధ్య రైల్వే గణాంకాలివీ.. ♦ ప్రతి రోజు వచ్చే ఆదాయం: రూ.10 కోట్లు ♦ మొత్తం ప్రయాణికుల రైళ్లు: 650 ♦ రోజూ రాకపోకలు సాగించే ప్రయాణికులు 10.50 లక్షలు ♦ స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించేవారు 2.50 లక్షలు ♦ ఏసీ బోగీల్లో ప్రయాణించేవారు 1.50 లక్షలు ♦ థర్డ్ ఏసీ ప్రయాణికులు 1.10 లక్షలు ♦ సెకండ్ ఏసీ ప్రయాణికులు 30వేలు ♦ ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 10వేల లోపు -
కూర్గ్ అందాలు.. అక్కడ తప్పక చూడాల్సిన ప్రాంతాలివే
వేసవి కాలం వచ్చేసంది. ఈ ఎండలో చల్ల చల్లగా ఉపశమనం కోసం పర్యటక ప్రియులంతా సమ్మర్ వెకేషన్ కోసం ప్లాన్ చేస్తుంటారు. సమ్మర్ వెకేషన్ అనగానే అందరి టక్కున గుర్తొచ్చేది నార్త్ టూర్. కునుమానాలి, సిమ్లా ఇలా నార్త్‌లోని పలు పర్యాటక ప్రాంతాలు గుర్తొస్తాయి. కానీ మన సౌత్‌లో కూడా వేసవి విడిదికి ఉత్తమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందులో కూర్గ్ ఒకటి. సౌత్ టూర్ అనగానే అందరికి అరకులోయ, ఊటీ, కన్యాకుమారి ఇలా గుర్తొస్తాయి. కానీ దక్షిణ కర్ణాటకలోని ఈ కూర్గ్ ప్రాంతం చాలా తక్కువ మందికి తెలుసు. భారతదేశంలోనే అత్యంత ఆకట్టుకునే హిల్ స్టేషన్ ఇక్కడి ప్రత్యేకం. దీనిని ఇండియన్ స్కాట్లాండ్ అని కూడా పిలుస్తారు. అత్యంతక సుందరమైన, ఆకర్షనీయమైన పర్వతపాంతం ఇది. ఇక్కడి పచ్చని వాతావరణం, కాఫీ తోటలు ప్రత్యేకంగా ఆకర్షించే ప్రదేశాలు. ఇవి మాత్రమే ఇక్కడ ఇంకా కూర్గ్‌లో చూడాల్సిన అందమైన ప్రాంతాలేన్నో ఉన్నాయి. అక్కడ ముఖ్యంగా చూడాల్సిన ప్రాంతాలేవో ఓ సారి చూద్దాం. అబ్బే జలపాతం కూర్గ్ ముఖ్యంగా చూడాల్సిన పర్యాటక ప్రాంతం ఇది. కాఫీ తోటల మధ్య ఉండే ఈ జలపాతం చూడగానే అత్యంత అనుభూతిని ఇస్తుంది. స్వర్గాన్ని తలపించే ఈ అందమైన జలపాతాలను సందర్శించడానికి పర్యాటక ప్రియులు క్యూ కడుతుంటారు . కూర్గ్‌లో అబ్బే లేదా అబ్బి అంటే జలపాతం అని అర్ధం. ఈ జలపాతం ప్రాంతానికి దగ్గరలో ఉండడంతో తరచూ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. నాగర్హొళె జాతీయ పార్క్ ఈ ఉద్యానవనంలో అనేక జాతి రకాలకు చెందిన వృక్షాలు, జంతువులు దర్శనం ఇస్తుంటాయి. ఆ కారణంగా నాగర్హొళె జాతీయ ఉద్యానవనం దేశంలోని అత్యుత్తమ వైల్డ్ లైఫ్ రిజర్వులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన మనకు అనేక జాతుల వృక్షాలతో పాటు 270 జాతుల పక్షులు దర్శనమిస్తాయి. కూర్గ్ వెళ్ళినప్పుడు తప్పక సందర్శించవలసిన ప్రాంతాలలో ఇది ఒకటి. హనీ వాలి హనీ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన నీలకండి జలపాతం ఇది. దట్టమైన ఉష్ణమండల అడవుల మధ్య ఉన్న ఒక అందమైన జలపాతం. ఇది మంచి రిఫ్రెషింగ్ స్పాట్. ఇక్కడ ముఖ్యంగా ట్రెక్కింగ్, అత్యుత్తమ సాహస క్రీడలు ప్రసిద్ధి. హొన్నమన కెరె లెక్ కూర్గ్ సహజ అందాలలో ఒకటి. పచ్చని కొండలు, కాఫీ తోటల, గుహల మధ్య అద్భుతంగా కనిపిస్తుంది. సరస్సు సమీపంలోని ఆలయంలో జరుపుకునే గౌరీ పండుగ సమయంలో సరస్సును ప్రత్యేకంగా సందర్శిస్తారు. సోమవారపేట్ సోమవారపేట్ కాఫీ తొటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన పంటలు కాఫీ, అల్లం, యాలకులు, మిరియాలు. ఇక్కడి పచ్చని తోటలు పర్యాటక ప్రియులకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇది తప్పక సందర్శించవలసిన ప్రాంతం. నామ్‌డ్రోలింగ్ ఆరామం ఇక్కడ చూడాల్సిన మరో ప్రదేశం నామ్‌డ్రోలింగ్ ఆరామం గోల్డెన్ టెంపుల్ ఒకటి. ఈ ప్రసిద్ధి గాంచిన మఠం గోడలు బంగారు వర్ణంతో నిండిన చిత్రాలతో అలంకరించబడి ఆకర్షణీయంగా ఉంటుంది. విభిన్న శైలిలో కట్టడంగా ప్రసిద్ధి గాంచిన నామ్‌డ్రోలింగ్ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది. ఓంకారేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని 1820లో లింగ రాజేంద్ర అనే రాజు నిర్మించారు. ఈ ఆలయం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని శివ భగవానుడికి అంకితం చేస్తూ లింగ రాజేంద్ర నిర్మించారని కథనం. ఈ ఆలయంలో ఒక చిన్న నీటి కొలను ఉంది. ఇందులోని చేపలు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మడికెరి కోట బురద ఉపయోగించి ముద్దు రాజుచే నిర్మించబడిన ఈ కోట 17వ శతాబ్దానికి చెందినది. 1812-1814ల మధ్య కాలంలో ఇటుక, మోర్టార్లలో దీన్ని తిరిగి నిర్మించారని చెబుతారు. ఈ కోట ప్రవేశద్వారం చుట్టుపక్కల ఉన్న ఏనుగులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. -
90 శాతం పెరిగిన ఫ్యామిలీ టూర్లు.. టాప్ 4లో హైదరాబాద్!
సాక్షి, హైదరాబాద్: సకుటుంబ సపరివార సమేతంగా చేసే ప్రయాణాలు దేశంలో మళ్లీ ఊపందుకున్నాయి. కోవిడ్ నేపథ్యంలో గణనీయంగా పడిపోయిన ఫ్యామిలీ ట్రావెల్ గతేడాది 90 శాతం పెరిగింది. పరివార్‌తో కలిసి సందర్శించేందుకు ఎంపిక చేసుకునే నగరాల్లో టాప్–4లో హైదరాబాద్ నిలిచింది. పర్యాటకులకు వసతి సౌకర్యాలకు పేరొందిన ప్రముఖ సంస్థ ఎయిర్ బీఎన్బీ అధ్యయనం ఈ విశేషాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ బీఎన్బీ వేదికగా కుటుంబ ప్రయాణం గతేడాది 90 శాతం పెరిగిందని (ప్రపంచవ్యాప్త పెరుగుదలతో పోలిస్తే 30శాతం అధికం) దాదాపు 90,000 గమ్యస్థానాల్లో 15 మిలియన్లకు పైగా చెక్–ఇన్లు చోటుచేసుకున్నాయని ఈ స్టడీ తేల్చింది. గత ఏడాది కుటుంబ సమేతంగా టూర్లు వెళ్లడం పెరగడంతో పాటు తమ పెట్స్‌ను సైతం తమతో తీసుకువెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపించారు. అందుకు అనుగుణంగా తగిన వసతి సౌకర్యాల కోసం అన్వేషించారని అధ్యయనం వెల్లడించింది. అంతకు ముందుతో పోలిస్తే అత్యధికంగా పెంపుడు జంతువులు గతేడాది 5 మిలియన్ల పైగానే ప్రయాణాల్లో భాగం పంచుకున్నాయి. టాప్ 10 నగరాలివే శవ్యాప్తంగా ప్రజలు కుటుంబాలతో కలిసి తమకు ఇష్టమైన పలు ప్రాంతాలకు ప్రయాణించారు. అలా చేసిన ప్రయాణాల్లో అత్యధికులు ఎంచుకున్న గమ్యస్థానాల్లో గోవా తొలి స్థానంలో నిలువగా ఆ తర్వాత స్థానంలో బెంగళూర్ పూణె, మన హైదరాబాద్, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ వరుసగా టాప్–5లో చోటు దక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్తాన్‌లోని జైపూర్, మహారాష్ట్రలోని రాయ్‌ఘర్, కేరళలోని ఎర్నాకులం, న్యూఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని నైనిటాల్ వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. -
సపరివార సమేతంగా..!
కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు.. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు మాత్రమే అలవాటు పడిన భారతీయులు ఇప్పుడు పర్యాటక ప్రాంతాలను సైతం ఫ్యామిలీతో కలిసి చుట్టేసేందుకు ఇష్టపడుతున్నారు. దేశంలోనూ ఇప్పుడు ఫ్యామిలీ పర్యటనల ట్రెండ్ నడుస్తోంది. ఉరుకుల, పరుగుల జీవితంలో కొద్దిపాటి విరామం దొరికినా ఫ్యామిలీ టూర్లకు చెక్కేస్తున్నారు. సాక్షి, అమరావతి: చారిత్రక, సాంస్కృతిక నగరాలతో పాటు అందమైన బీచ్‌ల ఒడ్డున కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా సేదతీరేందుకు భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి దేశంలోని గోవా వెళ్లేందుకు ఇష్టపడుతుండగా.. అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక గమ్యస్థానంగా దుబాయ్ కొనసాగుతోంది. డిజిటల్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ‘అగోడా’ సర్వే ప్రకారం పర్యాటకులు ప్రత్యేక థీమ్‌లతో కూడిన టూర్లను ఎంపిక చేసుకుంటున్నారు. సౌకర్యవంతమైన బస, ఆకట్టుకునే ప్రదేశాలు, సముద్రపు తీరంలో సేద తీరడం, ఎకో పర్యాటకంలో ప్రశాంతంగా గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే బీచ్ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన గోవాను తొలి ఎంపికగా చేసుకుంటున్నారు. ఆ తర్వాత చారిత్రక దర్శనీయ స్థలాలైన ఢిల్లీ, ముంబై, సాంస్కృతిక నగరాలు జైపూర్, పుదుచ్చేరి నగరాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా దుబాయ్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సింగపూర్, మాల్దీవులు, బాలి (ఇండోనేషియా), ఫుకెట్ (థాయ్‌లాండ్)కు క్యూ కడుతున్నారు. అగోడా ఫ్యామిలీ ట్రావెల్ ట్రెండ్ సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా 14వేల కుటుంబాల నుంచి ప్రతిస్పంద నలను సేకరించింది. పర్యటనలు.. షాపింగ్ కోసమే ఎక్కువ ఖర్చు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక కూడా 88 శాతం మంది భారతీయులు ఫ్యామిలీ పర్యటనలు, షాపింగ్‌ల కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదని చెబుతోంది. 2023లోనూ టూర్లు, పర్యటనలకే ప్రాధాన్యత ఇస్తామని భారతీయులు స్పష్టం చేసినట్టు ఆ నివేదిక స్పష్టం చేసింది. 10 మంది పట్టణ భారతీయుల్లో 8 మంది సెలవుల సీజన్లో ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. కొందరు పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు, కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్టు తేలింది. ఈ విధానం 2021తో పోలిస్తే భారీగా పెరిగినట్టు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సర్వే పేర్కొంది. -
చైనాలో కోవిడ్ కేసుల విజృంభణ.. జనవరి 21 తర్వాత పరిస్థితేంటో!
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం ఇతర దేశాలపై ఏ మేరకు ఉంటుంది? ప్రతి దేశాన్ని కలవరపరుస్తున్న సమస్య. ఏ దేశానికి ఆ దేశం దీనిపై చర్చించుకుంటోంది. తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం, ఆరోగ్యరంగ నిపుణులు దీనిపై అధ్యయనాలు సాగిస్తున్నారు. చైనాలో పరిస్థితి ఏమిటి? ‘జీరో కోవిడ్ పాలసీ’ పేరుతో, గత మూడేళ్లుగా చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. లాక్ డౌన్, కేంద్రీకృత క్వారంటైన్ విధానం అమలు చేస్తోంది. పెద్ద ఎత్తున టెస్టింగ్, కాంట్రాక్టు ట్రేసింగు విధానాలను చేపట్టింది. దీంతో రోజువారీ కార్యకలాపాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. వ్యాపార వాణిజ్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. దీనిపైన ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావటంతో, డిసెంబరు మొదటి వారం నుంచి నిబంధనలను సడలించింది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయటం, ఆసుపత్రుల్లో ఐసీయూ సేవలను మెరుగుపరచటం, యాంటీవైరల్ మందులను పెద్ద ఎత్తున నిల్వ చేయటం వంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా, నిబంధనలన్నింటిని సడలించటంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరిగిపోయాయి. ఆస్పత్రులపైన ఒత్తిడిపెరిగిపోయింది. వైద్యసేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ఫార్మశీలు, ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫారాలల్లో మందుల కొరతను ఏర్పడింది. ఫీవర్ హాస్పిటళ్లలో రద్దీ.. యాంటీవైరల్ డ్రగ్ అందుబాటులో లేకుండా పోయింది. స్మశానాలు మృతులతో కిక్కిరిసిపోయాయి. అయినా కేసుల విషయంలోగానీ, మరణాల విషయంలోగానీ, వాస్తవసమాచారాన్ని చైనా బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. కోవిడ్-19కి సంబంధించిన రియల్ టైం సమాచారాన్ని అందించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ అనేక మార్లు విజ్గప్తి చేసింది. ప్రపంచదేశాలు దీనిపై గగ్గోలు చేశాయి. చైనాలో దాదాపు 90 శాతం మంది కోవిడ్ బారిన పడ్డారని అంచనా. అన్ని దేశాల్లో భయాలు చైనాలో జనవరి 21న వచ్చే ‘లూనార్ న్యూఇయర్ హాలిడే’కు ప్రత్యేకత ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు వచ్చి కుటుంబాలను కలుసుకోవటం ఆనవాయితీ. ‘లార్జెస్ట్ యాన్యువల్ మైగ్రేషన్’ గా దీనిని చెబుతారు. బస్సులు, రైళ్లు, విమానాలు ప్రయాణికులతో కిటకిటలాడతాయి. కుటుంబాలతో గడిపిన వీళ్లంతా ఆయా ప్రాంతాలకు తిరిగివచ్చేటప్పుడు వైరస్ ను వెంటతెస్తారన్న ఆందోళన సర్వత్రా వ్యక్త మవుతోంది. అదే జరిగితే చాలా దేశాలు ప్రభావితమయయ్యే అవకాశాలున్నాయి. చైనాకు వచ్చేవారు క్వారంటన్‌లో ఉండవలసిన పనిలేదని కూడా చైనా చెప్పడం ఈ భయాలకు మరో కారణం. ముందు జాగ్రత్త చర్యలు చైనా నుంచి వచ్చే యాత్రికుల విషయంలో అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనాడా, జపాన్, దక్షిణ కొరియా, యూకె, అనేక యూరోపియన్ దేశాలు ఇందులో ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ కొత్తగా జత కలిశాయి. కోవిడ్ నెగెటివ్ నివేదిక ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెబుతున్నాయి. మరి యూరప్ మాటేమిటి? పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం యూరోపియన్ రీజయన్ పైన అంతగా ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. యూరోపియన్ రీజియన్ అంటే.. 53 దేశాలు. రష్యాతో పాటు మధ్య ఆసియాలోని దేశాలు అన్నీ ఇందులోకి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిపై డబ్ల్యు హెచ్ ఓ యూరోపియన్ డైరక్టర్ హాన్స్ క్లంగ్ మాట్లాడుతూ, ‘‘ ప్రస్తుతానికి యూరోపియన్ దేశాలు ఆందోళన చెందవలసిన పనిలేదు. అలాగని అలసత్వంతో ఉండటానికి వీల్లేదు’’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు డజను వరకూ దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపైన ఆంక్షలు విధించటంలో తప్పు లేదని, అది వివక్ష కిందకు రాదని సమర్థించారు. ఆయా దేశాలు నిఘా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ఆయా వేరియంట్ల సీక్వెన్సింగ్ ను కొనసాగించాలని చెప్పారు. -
40 ఏళ్ల వయసులో సరికొత్త ప్రయాణం.. గిన్నిస్ రికార్డు! ఇప్పుడేమో
సాహసయాత్రలు యాత్ర వరకు మాత్రమే పరిమితం కావు. మనలో కొత్త వెలుగును నింపుతాయి. కొత్త దారి చూపుతాయి. కొత్త విజయాలు సాధించేలా సంకల్పబలాన్ని ఇస్తాయి. సైకిల్‌పై ఎన్నో సుదూరయాత్రలు చేసి రికార్డ్‌లు సాధించిన ప్రీతి మస్కే తాజాగా ఇండియా నుంచి సింగపూర్‌కు సైకిల్‌యాత్ర చేయడానికి సన్నద్ధం అవుతోంది... ఫాస్టెస్ట్ ఫిమేల్ సోలో సైకిలిస్ట్‌గా గత సంవత్సరం నవంబర్ నెలలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించింది పుణెకు చెందిన ప్రీతి మస్కే. 13 రోజుల 18 గంటల 38 నిమిషాలలో గుజరాత్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ సైకిల్‌యాత్రను పూర్తి చేసింది. గుజరాత్‌లోని కోటేశ్వర్ నుంచి మొదలైన ఈ సైకిల్ యాత్ర ఏడు రాష్ట్రాల గుండా సాగి అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబితులో ముగిసింది. ఈ యాత్ర చేయగలనా? ‘ప్రతి ఒక్కరూ అస్సామ్, అరుణాచల్‌ప్రదేశ్‌లను చూడాలనుకుంటారు. అయితే సైకిల్‌పై యాత్ర అనేసరికి వెనక్కి తగ్గుతారు. దీనికి కారణం అంతదూరం సైకిల్‌యాత్ర అంత సులువైన విషయం కాదు. ఈ యాత్ర చేయగలనా? అని మొదట్లో నేను కూడా సందేహించాను. కొద్ది సమయంలోనే ఆ సందేహం నుంచి బయటపడి సాహసయాత్రకు పూనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది ప్రీతి. ‘యాత్ర కోసం యాత్ర’ అని కాకుండా తన యాత్రకు సామాజిక సందేశాన్ని కూడా జోడించింది. దారి పొడుగునా అవయవదానం ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తూ వెళ్లింది. చిన్నప్పుడు ప్రీతికి ఆటలు అంటే ఇష్టం. హాకీ, బాస్కెట్‌బాల్ బాగా ఆడేది. అయితే స్కూలు చదువుల తరువాత తనకు ఆటలు దూరమయ్యాయి. 2017లో సరదాగా చేసిన సైకిలింగ్ తన జీవితాన్నే మార్చేసింది. ఎంతో సానుకూల శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తోంది. ఎన్నో కొత్త ద్వారాలు ‘ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత, నలభై ఏళ్ల వయసులో పిల్లలు, కుటుంబం తప్ప వేరే ప్రపంచం ఏదీ తెలియని ప్రపంచంలోకి వెళ్లిపోతాం. సైకిలింగ్ నా కోసం ఎన్నో కొత్త ద్వారాలు తెరిచింది. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సాధించాల్సింది ఎంతో ఉంది అని చెప్పింది’ అంటుంది ప్రీతి. వెనక్కి చూడలేదు 2019లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సోలోగా సైకిల్‌యాత్ర చేపట్టినప్పుడు చాలామంది భయపెట్టేలా మాట్లాడారు. అయితే ఆ భయంగొల్పే మాటలు ప్రీతిని వెనక్కి తీసుకువెళ్లకపోగా మరింత ధైర్యాన్ని ఇచ్చాయి. పట్టుదలను పెంచాయి. అసాధ్యం అనుకున్న సైకిల్ యాత్ర విజయవంతం అయ్యేలా చేశాయి. ఇక అప్పటి నుంచి ఆమె వెనక్కి చూడలేదు. సుదీర్ఘ సైకిల్‌యాత్రలు లేని సమయంలో ఆసక్తి ఉన్న వారికి సైకిలింగ్‌లో శిక్షణ ఇస్తోంది. స్విమ్ చేస్తోంది. శరీరం ఫిట్‌గా ఉండేలా రకరకాల ఎక్సర్సైజ్లు చేస్తుంది. వారాంతాలలో 100 నుంచి 300 కి.మీ వరకు సైకిలింగ్ చేస్తోంది. ఎన్నో సుదూర సైకిల్ యాత్రలు పూర్తి చేసిన ప్రీతి ‘ప్రతి రికార్డ్ ఒక సవాలే. దేనికదే ప్రత్యేకమైనది’ అంటోంది. ఆప్యాయ పలకరింపులు ఒక మంచిపని, స్ఫూర్తిని ఇచ్చే పని చేస్తే, సాహసాన్ని తట్టిలేపే పనిచేస్తే సమాజం తనకు తానుగా ముందుకు వచ్చి భుజం తట్టి ముందుకు నడిపిస్తుంది. సైకిల్ యాత్రలో ఎన్నో రాష్ట్రాలలో, ఎన్నోచోట్ల అపరిచితురాలైన తనను ఆప్యాయంగా పలకరించారు ప్రజలు. ఆతిథ్యం ఇచ్చారు. సైకిల్‌కు రిపేర్లు వస్తే బాగు చేయించారు. హైవే హోటళ్ల వాళ్లు కూడా మర్యాదగా పలకరించి తనకు ఆతిథ్యం ఇచ్చారు. సాధించిన దానితో సంతృప్తి చెంది అదే విజయం అనుకోవడం లేదు ప్రీతి. తాజాగా ఇండియా నుంచి సింగపూర్ సైకిల్ యాత్రకు సన్నద్ధం అవుతోంది. ‘సాధ్యం అవుతుంది’ అనడం తేలిక. ‘అసాధ్యం’ అనుకోవడం అంతకంటే తేలిక. అయితే అసాధ్యాలను, సుసాధ్యం చేయడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో ప్రీతీ మస్కే ఒకరు. చదవండి: Soumya Ranjan Biswal: సాగర తీరాన సైన్యమై కదులుతున్నాడు Kangana Ranaut: వారసత్వంగా మాకు అందిన చిట్కాలు.. నా బ్యూటీ సీక్రెట్ ఇదే -
పేటీఎం ట్రావెల్ సేల్
న్యూఢిల్లీ: చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం (వన్ 97 కమ్యూనికేషన్స్) ‘ట్రావెల్ సేల్’ను ప్రకటించింది. 18వ తేదీ వరకు ఈ సేల్ అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగా ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి పలు ఆఫర్లు ప్రకటించింది. గోఫస్ట్, విస్తారా, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా డొమెస్టిక్ టికెట్లపై 18 శాతం, ఇంటర్నేషనల్ ఫ్లయిట్ టికెట్లపై 12 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది. ఆర్బీఎల్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డ్, అమెక్స్ కార్డ్‌లతో చెల్లింపులు చేయడం ద్వారా ఈ డిస్కౌంట్ పొందొచ్చని సూచించింది. విద్యార్థులు, వృద్ధులు, సాయుధ దళాల సిబ్బందికి ప్రత్యేక ఆఫర్లను సైతం ఇస్తున్నట్టు ప్రకటించింది. కన్వీనియన్స్ ఫీజు చెల్లించే పని లేదని తెలిపింది. చదవండి: భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ.. భారత్‌పైనే ఎక్కువ ప్రభావం పడుతుందా! -
అలుపెరుగని బాటసారి.. 11 రోజులు నాన్–స్టాప్ జర్నీ.. ప్రపంచ రికార్డు
సిడ్నీ: పొడవైన ముక్కు, పొడవైన కాళ్లతో చూడగానే ఆకట్టుకొనే గాడ్విట్ పక్షి ఒకటి (శాస్త్రీయ నామం లిమోసా ల్యాపోనికా) అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికాలోని అలాస్కా నుంచి ఆస్ట్రేలియాకు చెందిన ఈశాన్య టాస్మానియా ద్వీపంలోని అన్సాన్స్ బే వరకూ 11 రోజుల్లో 8,425 మైళ్లు (13,558.72 కిలోమీటర్లు) ప్రయాణించింది. ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా ప్రయాణం సాగించడం గమనార్హం. కేవలం ఐదు నెలల వయసున్న ఈ మగ పక్షి (234684) ఈ నెల 13వ తేదీన అలాస్కా నుంచి బయలుదేరింది. ఓషియానియా, వనౌతు, న్యూ కాలెడోనియా తదితర ద్వీపాల గగనతలం నుంచి ప్రయాణం సాగించింది. ఈ నెల 24వ తేదీన అన్సాన్స్ బే ప్రాంతంలో కాలుమోపింది. సరిగ్గా చెప్పాలంటే 11 రోజుల ఒక గంట సమయంలో అలుపెరుగని తన ప్రయాణాన్ని పూర్తిచేసింది. ఈ పక్షికి సైంటిస్టులు 234684 అనే ఒక నంబర్ ఇచ్చారు. అలాస్కాలో పలు గాడ్విట్ పక్షులకు 5జీ శాటిలైట్ ట్యాగ్లు అమర్చి గాల్లోకి వదిలారు. వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించారు. మిగతా పక్షులకంటే 234684 నంబర్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించినట్లు తేల్చారు. నాన్–స్టాప్‌గా గాల్లో దూసుకెళ్తూ 11 రోజుల ఒక గంటలో టాస్మానియాకు చేరుకుందని న్యూజిలాండ్‌లోని పుకొరోకొరో మిరండా షోర్బర్డ్ సెంటర్ ప్రకటించింది. నీటిపై వాలితే మృత్యువాతే గాడ్విట్ పక్షులు వలసలకు పెట్టింది పేరు. ప్రతిఏటా వేసవిలో టాస్మానియాకు చేరుకుంటాయి. అక్కడ సంతతిని వృద్ధి చేసుకొని యూరప్ దేశాలకు తిరిగి వస్తుంటాయి. 2021లో 4బీబీఆర్‌డబ్ల్యూ అనే గాడ్విట్ మగ పక్షి 8,108 మైళ్లు(13,050 కిలోమీటర్లు) నాన్–స్టాప్‌గా ప్రయాణించింది. ఇప్పటిదాకా ఇదే రికార్డు. ఈ రికార్డును 234684 పక్షి బద్దలుకొట్టింది. ఇది 11 రోజుల ప్రయాణంలో సగంబరువును కోల్పోయి ఉంటుందని టాస్మానియాలోని పక్షి శాస్త్రవేత్త ఎరిక్ వోహ్లర్ చెప్పారు. ఈ రకం పక్షులు నీటిపై వాలలేవని, ఒకవేళ వాలితే చనిపోతాయని తెలిపారు. ఎందుకంటే వాటి కాలి వేళ్లను కలుపుతూ చర్మం ఉండదని వెల్లడించారు. గాట్‌విట్ జాతి పిట్టల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి. అవి బార్–టెయిల్డ్ గాడ్విట్, బ్లాక్–టెయిల్డ్ గాడ్విట్, హడ్సోనియన్ గాడ్విట్, మార్బ్ల్డ్ గాడ్విట్. పొడవైన ముక్కును సముద్ర తీరాల్లోని ఇసుకలోకి దూర్చి అక్కడున్న పురుగులు, కీటకాలను తింటాయి. -
Podcast: ఆత్మీయనేస్తంగా పాడ్‌కాస్ట్! యూత్‌కు దగ్గరైన జానర్లలో అగ్రస్థానం దానిదే
కోవిడ్ టైమ్‌లో యూత్‌కు సన్నగా పరిచయం అయిన ‘పాడ్‌కాస్ట్’ ఇప్పుడు వారికి ఆత్మీయనేస్తం అయింది. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన చరితకు పాటలు వినడం అంటే ఇష్టం. అయితే ఇప్పుడు ఆమె పాడ్‌కాస్టింగ్‌లో పాటలు ఒక భాగం మాత్రమే. ‘నాకు పాటలు వినడం అంటే ఎంత ఇష్టమో ట్రావెల్ చేయడం అంటే కూడా అంతే ఇష్టం. ముసాఫిర్ స్టోరీస్లాంటి ట్రావెల్ పాడ్కాస్ట్ల ద్వారా ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది చరిత. నాగ్‌పుర్‌కు చెందిన భానుకు రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టదు. అయితే ఎవరైనా కబుర్లు చెబుతుంటే, వింటూ వింటూ నిద్రపోతుంటాడు! ఇప్పుడు అతడికి పాడ్‌కాస్ట్ అనేది ఆత్మీయనేస్తం అయింది. ఎన్నో రంగాలకు చెందిన కబుర్లు వింటూ వింటూ నిద్రపోతుంటాడు. పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారి నుంచి పాడ్‌కాస్ట్‌కు అమితమైన ఆదరణ లభిస్తున్నట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. యూత్‌కు దగ్గరైన పాడ్‌కాస్ట్ జానర్లలో ‘మెంటల్ హెల్త్’ అగ్రస్థానంలో ఉంది. భోపాల్‌కు చెందిన తన్వీకి అకారణ దిగులు. ఎలాంటి సమస్యా లేదు...మరి దిగులెందుకో తెలియదు! స్నేహితుల సలహా మేరకు ‘ది హ్యాపీ టైమ్స్’ ‘ఎమోషనల్ ఫీల్’ ‘బుద్ధిస్ట్ సొల్యూషన్స్ ఫర్ లైఫ్స్ ప్రాబ్లమ్స్’....మొదలైన పాడ్‌కాస్ట్‌లు వింటూ ఉంది. ఇప్పుడు ఆ అకారణ దిగులు మాయం అయినట్లు చెబుతుంది తన్వీ. యూత్‌కు స్ట్రెస్ బస్టర్‌గా పాడ్‌కాస్టింగ్ ఉపయోగపడుతోంది. తెలుసుకోవడం, నేర్చుకోవడం, పరిష్కారాలు అందిపుచ్చుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సృజనాత్మకంగా స్వీయవ్యక్తీకరణకు పాడ్కాస్టింగ్ను బలమైన వేదికలా ఉపయోగించుకుంటోంది యూత్. చదవండి: Diet Tips To Control Asthma: ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు! -
నెదర్లాండ్స్ అమ్మాయి.. వ్యాన్నే ఇల్లుగా చేసుకుని! మన దేశమంతా చుట్టేస్తూ!
మన దేశంలో బతుకు బాదరబందీ కోసం చాలామంది కష్టపడుతుంటారు. కాని నెదర్లాండ్స్‌కు చెందిన ఒక అమ్మాయి చాలా సింపుల్‌గా సంవత్సర కాలంగా జీవిస్తోంది. ఒక వ్యాన్నే ఇల్లుగా చేసుకొని దేశమంతా తిరుగుతోంది. సముద్రం ఒడ్డున బస... నక్షత్రాల కింద నిద్ర... చాలదా జీవితానికి అని ప్రశ్నిస్తుంది? తమిళనాడు మహాబలిపురం దగ్గర వ్యాన్ నిలబెట్టుకుని సముద్రంతో కబుర్లు చెప్పే ఈ అమ్మాయిని అంతా వింతగా చూస్తుంటారు. ఆమె అందరినీ వింతగా. ఎవరి బతుకు ఎవరికి వింత? చెన్నై దగ్గర ఉన్న మహాబలిపురం నుంచి ఇంకో ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మామళ్లపురం. చిన్న ఊరు అది. సముద్రం ఘోష. దాని ఒడ్డునే ఒక వ్యాన్ని చూడవచ్చు. పూలు, లతలు, మత్స్యకన్యలు గీసి ఆకర్షణీయంగా ఉండే ఆ వ్యాన్ గత సంవత్సర కాలంగా మారియా ఉండెరింక్ ఇల్లు. అదే ఆమె వాహనం కూడా. వ్యాన్ నెత్తి మీద సర్ఫ్‌బోర్డ్, స్కేట్‌బోర్డ్‌ను కట్టి ఉంచుకుంటుంది. వ్యాన్ లోపల పడుకునే స్థలం, పుస్తకాల ర్యాకు, బట్టలు పెట్టుకునే చోటు, పాటలు వినడానికి స్పీకర్లు... ఇవన్నీ ఉంటాయి. నెదర్లాండ్స్‌కు చెందిన మారియా సంవత్సర కాలంగా దేశంలో ఉంటోంది. రెండేళ్ల క్రితం ఆమె ‘జంపా క్రియేషన్స్’ పేరుతో చిన్న ఆన్లైన్ బిజినెస్ మొదలెట్టింది. ఆర్గానిక్‌గా తయారు చేసిన అగరు బత్తీలు, పరిమళ తైలాలు విక్రయిస్తుంది. వాటికేం ఆఫీసు అక్కర్లేదు కనుక ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్లను కొరియర్ ద్వారా పంపిస్తుంది. వాటి మీద వచ్చే డబ్బులే ఆమె ఆదాయం. మరి మిగిలిన సమయమో? ఆమెనే అడుగుదాం. ఎక్కడ నచ్చితే అక్కడే సంవత్సరం క్రితం ఇండియా వచ్చిన మారియా మొదట చేసిన పని ఢిల్లీలో ఒక సెకండ్ హ్యాండ్ వ్యాన్ కొనడం. దానిని తనకు తగినట్టుగా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం. ఆ తర్వాత దానిని తీసుకొని దేశం చూడటానికి బయలుదేరడం. ‘మొదట రాజస్థాన్ వెళ్లాను. అక్కడ చాలా రోజులు ఉన్నాను. ఆ తర్వాత గోవాలో కొన్నాళ్లు. ఈ ఊరిలో సర్ఫింగ్ పోటీలు ఉన్నాయంటే మొన్నటి జూలైలో వచ్చాను. పోటీలో సెమీ ఫైనల్స్ దాకా వెళ్లాను. గెలవలేదు. కాని నాకు ఈ ఊరు చాలా నచ్చింది. అందుకే ఇక్కడ ఉండిపోయాను’ అంటుంది మారియా. మామళ్లపురం బెస్తవాళ్లు ఆమెను వింతగా చూస్తారు తప్ప అంతరాయం కలిగించరు. తోచినప్పుడల్లా సర్ఫ్‌బోర్డ్ తీసుకొని సముద్ర అలల మీద తేలుతుంటుంది మారియా. లేదంటే వ్యాన్‌లో కూచుని పుస్తకాలు చదువుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా ల్యాప్‌టాప్‌లో పని. కొన్ని జాగ్రత్తలు ప్రయాణంలో పెట్రోల్ బంకులనే తన కాలకృత్యాల కోసం ఉపయోగించుకుంటుంది. ఫోన్, ల్యాప్‌టాప్ చార్జింగ్ కావాలంటే ఏదో ఒక కాఫీ షాప్‌కు వెళుతుంది. మిగిలిన అన్ని పనులకు వ్యాన్ ఉంటుంది. ‘వ్యాన్‌ను ఎప్పుడూ నీట్‌గా పెట్టుకుంటాను. ఎందుకంటే అది నేను ఉండాల్సిన చోటు కదా’ అంటుంది. వ్యాన్‌లో ఆమె అమ్మే వస్తువులు సువాసన వ్యాపింపచేస్తుంటాయి. ‘సోలార్ ప్యానల్స్ బిగించిన మెటాడర్ వ్యాన్ కొనుక్కోవాలని ఉంది. అదైతే ఇంకా సౌకర్యంగా ఉంటుంది’ అంటుంది మారియా. ‘జీవితం ఇలా బాగుంది. సింపుల్‌గా’ అంటుంది. ‘కొన్ని గ్రిల్ చేసిన కూరగాయల భోజనం. రాత్రిళ్లు నక్షత్రాల కింద పడక. ఇంతకు మించి ఏం కావాలి?’ అంటుంది మారియా. ఏం కావాలో తెలియక నాగరీకులు ఉదయం లేచి ఉరుకుల పరుగుల మీద అన్వేషిస్తూ ఉంటారు. వారికి మారియా ఒక వింత. వారు మారియాకు. చదవండి: Travel Couple: ప్రేమ పెళ్లి.. సొంత కారవ్యాన్‌లో కుటుంబంతో కలిసి.. భారీ గుమ్మడిపండును డొల్లగా చేసి.. దానినే పడవగా మార్చి.. నదిని దాటి.. ఆపై! -
ఉత్తర కొరియా పర్యటనలు మరో ఏడాది పాటు నిషేధం!
వాషింగ్టన్: ఉత్తర కొరియా పర్యటన నిషేధం మరో ఏడాది పాటు పెంచినట్లు అమెరికా ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. ఈ నిషేధం ఆగస్టు 31, 2023 వరకు ఉంటుందని అమెరికా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ నిషేధాన్ని అమెరికా 2017 నుంచి అమలు చేస్తూ వస్తోంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది నిషేధాన్ని పెంచుతూనే ఉంది అమెరికా. యూఎస్ పౌరులకు ఉత్తర కొరియా పర్యటన అత్యంత ప్రమాదకరమని వారి భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా యంత్రాంగం పేర్కొంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి ప్రత్యేకంగా ఆ పర్యటనకు ధృవీకరించనప్పుడే మినహా మరే ఏవిధంగాను అమెరికా వీసాలు చెల్లుబాటు కావని పేర్కొంది. 2017లో ప్రచార పోస్టర్ని దొంగలించాడనే ఆరోపణలతో అమెరికా విద్యార్థి ఒట్టో వార్మ్బియర్ని ఉత్తర కొరియా పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేయడంతో మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి ఉత్తరకొరియా పర్యటనలను అమెరికా నిషేధించడం ప్రారంభించింది. (చదవండి: యుద్ధంపై విమర్శ... రష్యాన్ రాజకీయవేత్తపై వేటు..) -
పర్యాటకుల స్వర్గధామం.. ‘కాస్ పీఠభూమి’
పింప్రి: వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక మంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. మహారాష్ట్రలోనూ వర్షాకాలంలో అందమైన ప్రకృతి రమణీయమైన జలపాతాలు, పచ్చని కొండలు, లోయలు ఇలా అనేకం ఉన్నాయి. అయితే వీటిలో సాతారా జిల్లాలోని ఓ అందమైన ప్రాంతం.. జిల్లాకు 22 కి.మీ. దూరంలో ఉన్న ‘కాస్ పీఠభూమి’. ఒక అసాధారణమైన బయోస్పియర్, స్థానికులతోపాటు పర్యాటకులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ కేవలం ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో దాదాపు 300 రకాలకుపైగా వివిధ రకాలకు చెందిన రంగురంగుల పూలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కేవలం ఈ రెండు నెలల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు తండోపతండాలుగా దేశ, విదేశాల నుంచి తరలి వస్తారు. అదేవిధంగా మరెక్కడా చూడలేని రకరకాల పక్షులను ఈ ప్రాంతంలో చూసేందుకు ఇదే మంచి అవకాశం. పర్వత శిఖరాలపైన కనిపించే ఈ పీఠ భూములు హెలిప్యాడ్లను పోలి ఉంటాయి. రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు మొదలయ్యేసరికి వివిధ రకాల గడ్డి పెరిగి, కొండలన్నీ పచ్చటి తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. దీంతో ఆ ప్రదేశానికి రంగులు వేసినట్లుగా పచ్చిక బయళ్లు.. వాటిపై రంగురంగుల బొట్లు పెట్టినట్లుగా వివిధ రకాల పూలు చూడముచ్చటగా కనిపిస్తాయి. పసుపు రంగు, ఇత ర రంగుల పుష్పాలతో రంగురంగు తివాచీలు పర చి మనకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రకృతి దృశ్యాలను తిలకించేందుకు, పలు రకాల పుష్పాలను, పక్షులను అధ్యయనం చేసేందుకు వృక్ష, జంతు శాస్త్ర నిపుణులు, ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రఫీ ప్రియులు, పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ ప్రదేశానికి తరలివస్తుంటారు. పర్వత ప్రాంతం ఈ రెండు నెలల్లో పర్యాటకుల వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అయితే ఈ పీఠభూమికి కాలినడకన మాత్రమే చేరాల్సి ఉంటుంది. ఈ ప్రకృతిని ఆస్వా దించిన పర్యాటకులకు ఈ ప్రదేశం తమ జీవితంలో ఒక మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రయాణం.. అత్యంత అద్భుతం.. సతారా నుంచి కాస్‌కు వెళ్లే మార్గం కొంత ఇరుకుగా ఉన్నప్పటికి పర్వతాలపైకి వెళ్తున్నంతసేపు పర్యాటకులను తాకే చల్లటి గాలులు మొత్తం శ్రమను దూరం చేస్తాయి. ముందుకు సాగుతున్నంతసేపూ ఎన్నో అద్భుతాలను, మనోహరమైన ప్రకృతి దృశ్యాలను కెమరాలలో బంధించవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్‌కు సంబంధించిన ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. దీంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు పూలను, మొక్కలను తెంచకపోవడం మరో విశేషం. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ వింత లోకాన్ని చూడడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. చూడాల్సిన ప్రదేశాలు.. కాస్లేక్.. కాస్ పీఠభూమి సముద్ర మట్టానికి 3,725 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ పీఠభూమి సహ్యాద్రి కొండల మధ్య గిన్నె ఆకారంలో కనిపిస్తుంది. కొయనా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా కాస్ లేక్ ఏర్పడింది. సతారా పట్టణానికి తాగునీటిని ఈ లేక్ నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ సరస్సు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. స్వచ్ఛతలో ఈ లేక్ దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ఇక్కడ బోటింగ్ ఓ అద్భుత, చిరస్మరణీయ అనుభూతిని కల్గిస్తుంది. ఈ ప్రాంతం మొక్కలకు, వన్యజీవులకు అనుకూలంగా నిలుస్తుంది. భూలోకంలో స్వర్గాన్ని అనుభవించాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించి.. ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సిందే. చల్కేవాడి.. వందలాది గాలి మరలు ఇక్కడ పర్వతాలపై మనకు టాటా చెబుతూ వీడ్కోలు పలుకుతుంటాయి. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు పలు సినిమా షూటింగ్‌లు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ గాలి మరల ద్వారా ఇక్కడ విద్యుచ్ఛక్తిని తయారు చేస్తున్నారు. అందుకే సతారా జిల్లాను ‘డిస్ట్రిక్ట్ ఆఫ్ పవర్’గా పిలుస్తున్నారు. చల్కేవాడి పవన నిలయంగా చెప్పవచ్చు. నైసర్గ్ ఆర్గానిక్ ఫార్మ్.. సతారాకు చెందిన శిందే ఈ ఆర్గానిక్ ఫామ్‌ను నడుపుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన సర్పగంధ, ఇన్సులిన్, తులసి లాంటి వివిధ మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు. ఇక్కడ సజ్జన్ఘడ్ కోటను కూడా చూడవచ్చు. (క్లిక్: ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు) తోసేఘర్ వాటర్ ఫాల్స్... సతారా నుంచి 20 కి.మీ. దూరాన తోసేఘర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ వెయ్యి అడుగుల పైనుంచి కిందున్న లోయలోకి పడుతుంటాయి. పర్యాటకులకు ఈ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. వేలాది మంది పర్యాటకులు ఈ జలపాతాలను చూడడానికి దేశ నలుమూలల నుంచి వస్తుంటారు. వాటర్ ఫాల్స్‌కు ఎదురుగా ఉన్న లోయపైన ఒక ప్లాట్‌ఫాంను నిర్మించడం వల్ల ఈ జలపాతాలను దగ్గరగా చూసేందుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎటువంటి సాహస కృత్యాలు చేయకూడదు. గతంలో చాలామంది పర్యాటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇక్కడి ప్రకృతి అందా లు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. (క్లిక్: అదిరే..అదిరే.. అతిరాపల్లి వాటర్ ఫాల్స్)