
ప్రయాణంలో మహిళల భద్రతపై ఆర్టీఏ కీలక నిర్ణయం
అన్ని ప్రైవేటు ప్యాసింజర్ వాహనాల్లో లొకేషన్ ట్రాకింగ్ డివైజ్‌ల ఏర్పాటు
అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ప్యానిక్ బటన్ కూడా..
పోలీస్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానమై పనిచేసే వ్యవస్థ
టీజీ ఆర్టీసీలో ఇప్పటికే వెహికల్ ట్రాకింగ్ డివైజ్‌ల ఏర్పాటు
త్వరలో 2 లక్షల ప్రైవేటు బస్సులు, క్యాబ్‌లలో బిగించాలని నిర్ణయం
నిర్భయ చట్టం అమలుపై ఆర్టీఏ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగాలు చేసే మహిళలు రాత్రుళ్లు కూడా క్యాబ్‌లు, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో వారి భద్రత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంటోంది. త్వరలో ఈ పరిస్థితి మారిపోనుంది. మహిళలు క్యాబో.. ప్రైవేటు బస్సో ఎక్కినప్పుడు వేధింపులు ఎదురైతే అందులో ఉండే ఒక్క బటన్ నొక్కితే చాలు.. పోలీసులు క్షణాల్లో అక్కడ వాలిపోతారు. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుపై రవాణాశాఖ దృష్టి సారించింది. ప్రైవేటు ప్రజా రవాణా బస్సులు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లలో ‘వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్’లను తప్పనిసరి చేసింది. నిర్భయ చట్టం ప్రకారం కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు, పాత వాటిలోనూ ఈ పరికరాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.
వీటికి అదనంగా ప్రతి వాహనంలో ‘ప్యానిక్ బటన్’ను కూడా తప్పనిసరి చేయనుంది. మహిళలకు వేధింపులు ఎదురైనప్పుడు ఆ బటన్ నొక్కితే చాలు.. వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకు సందేశం వెళ్లిపోతుంది. వాహనం లొకేషన్ ఆధారంగా పోలీసులు వాహనం వద్దకు చేరుకుంటారు. ఆర్టీసీ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్ విధానం ఇప్పటికే అమలవుతోంది. త్వరలో ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుచేయాలని నిర్భయ చట్టంలోనే స్పష్టంగా ప్రతిపాదించినా అమల్లోకి రాలేదు. కొన్ని క్యాబ్ సంస్థలు వేటికి అవే స్వయంగా ఏర్పాటు చేసుకున్నా మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ క్రమంలో తాజాగా ట్రాకింగ్ పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది.
రెండు లక్షల వాహనాల్లో..
– గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 8,000 లకు పైగా ప్రవేట్ బస్సులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య స్టేజీ క్యారేజీలుగా నడిచే బస్సులతో పాటు నేషనల్ పర్మిట్‌లపై టూరిస్టు్ట బస్సులుగా వివిధ రాష్ట్రాలకు మరికొన్ని రాకపోకలు సాగిస్తున్నాయి.
– బస్సులకు అదనంగా 1.2 లక్షల క్యాబ్‌లు, సుమారు 30 వేల మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులు, ట్యాక్సీలు సేవలందిస్తున్నాయి. మొత్తంగా దాదాపు రెండు లక్షల ప్రైవేటు ప్రజా రవాణా వాహనాలు తిరుగుతున్నాయి.
– కొవిడ్ అనంతరం నగరంలో రకరకాల క్యాబ్ అగ్రిగేటర్‌లు అందుబాటులోకి వచ్చాయి. కొన్నిసార్లు వాహనాన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొన్న సమయంలో నమోదయ్యే వాహనం నంబర్‌కు, అందుబాటులోకి వచ్చే వాహనానికి సంబంధం ఉండడం లేదు. చివరకు ఏ క్యాబ్ వినియోగంలోకి వస్తుందో తెలియని గందరగోళం నెలకొంటోంది.
– శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే క్యాబ్‌లలోనూ డ్రైవర్ల తీరుపై మహిళా ప్రయాణికులు తరచుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సుల్లో కూడా డ్రైవర్లు, సిబ్బంది తరచుగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో వెహికిల్ ట్రాకింగ్ అనివార్యంగా మారింది.
ఎలా పనిచేస్తుందంటే..
Comments
Please login to add a commentAdd a comment