rta
-
బండి తోసుకెళ్తారు... తుక్కు చేసేస్తారు..
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): కాలం చెల్లిన వాహనాలను తుక్కు చేసి ధ్రువీకరణ పత్రాలను అందజేసే సమగ్ర స్క్రాపింగ్ సర్వీస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. నగర శివార్లలోని కొత్తూరు, తూప్రాన్లలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం లాంఛనంగా ఆమోదం తెలపడంతో నగరంలో కాలం చెల్లిన వాహనాల తుక్కు ప్రక్రియ మొదలైంది. రవాణాశాఖ పర్యవేక్షణలో జరిగే స్క్రాపింగ్‌లో 15 ఏళ్ల కాల పరిమితి ముగిసిన వాహనాలను తుక్కు చేయడంతో పాటు వాటి రిజి్రస్టేషన్లను రద్దు చేస్తారు. ఈ మేరకు స్క్రాపింగ్ సెంటర్ల నిర్వాహకులే ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. దీంతో వాహనదారులకు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం రెండో వాహనంపై 2 శాతం చొప్పున జీవితకాల పన్ను విధిస్తుండగా, కొత్తగా అమల్లోకి వచ్చిన స్క్రాప్ పాలసీతో ఈ ఇబ్బంది తొలగనుంది. అలాగే కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై 10 శాతం వరకు పన్ను రాయితీ లభించనుంది. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే వాహనదారులకు కొత్త వాటిపై ద్విచక్ర వాహనాలపై కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.5000 వరకు, కార్లపై కనిష్టంగా రూ.5000 నుంచి గరిష్టంగా రూ.20 వేల వరకు పన్ను రాయితీ ఉంటుంది. వాహనదారులు తమ వాహనాలను స్క్రాప్ చేయాలని కోరితే సదరు స్క్రాప్ కేంద్రాల నిర్వాహకులే స్వయంగా వచ్చి టోయింగ్ ద్వారా వాహనాలను తరలించి స్క్రాప్ చేస్తారు. గ్రేటర్లో 18 లక్షల పాత వాహనాలు... ఆర్టీఏ అంచనాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 18 లక్షల వరకు కాలపరిమితి ముగిసిన వాహనాలు ఉన్నాయి. మోటారు వాహన నిబంధనల మేరకు 15 ఏళ్లు దాటిన వాహనాలను తిరిగి వినియోగించుకునేందుకు రవాణాశాఖ వాటి అనుమతులను ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరించాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాల వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందజేస్తున్న నేపథ్యంలో కాలం చెల్లిన వాహనాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఇది స్వచ్ఛందంగా కొనసాగే ప్రక్రియే అయినప్పటికీ ఆందోళన కలిగిస్తున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తమ పాత వాహనాలను వదిలించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో కొన్నింటిని యజమానులు రిజి్రస్టేషన్లను పునరుద్ధరించుకొని వినియోగిస్తున్నారు. మరికొన్ని వినియోగానికి పనికి రాకుండా మూలన పడ్డాయి. ఆర్టీఏ ప్రమేయం లేకుండానే తుక్కు కింద మారాయి. మరోవైపు కొన్ని వాహనాలు రవాణాశాఖ లెక్కల్లో మాత్రమే కనిపిస్తూ వినియోగంలో లేకుండా ఉన్నాయి.స్పష్టత లేని స్క్రాప్...ఇలాంటి వాహనాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే ప్రభుత్వం తాజాగా స్క్రాప్ పాలసీని అమలు చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కారణాల వల్ల ఉనికిలో లేని వాహనాలను కూడా తుక్కుగా మార్చినట్లు ధ్రువీకరించి రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అప్పుడు మాత్రమే స్క్రాప్ విధానం సమగ్రంగా అమలవుతుందని పేర్కొంటున్నారు.గల్లంతైన వాటి సంగతేంటి.... మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను కాలపరిమితి ముగిసినవిగా పరిగణిస్తారు. తాజా నిబంధనల మేరకు వాటిని తుక్కు చేయవలసి ఉంటుంది. ఇక వ్యక్తిగత వాహనాల కేటగిరీలోకి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాల కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. వద్దనుకుంటే స్వచ్ఛందంగా తుక్కు చేసి కొత్త వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. పాతబండి స్క్రాప్ చేయడం వల్ల 2 శాతం అదనపు పన్ను నుంచి ఊరట లభిస్తుంది. అలాగే కొత్త వాహనం జీవిత కాలపన్నులోనూ రాయితీ ఇస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వినియోగంలో లేని వాహనాల సంగతేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కాలపరిమితి ముగిసి వినియోగానికి పనికి రాకుండా ఉన్నవి ఆటోమేటిక్‌గానే తుక్కుగా మారాయి. పెద్ద సంఖ్యలో చోరీకి గురయ్యాయి. అలాంటి వాటిపై పోలీస్స్టేషన్లు, ఆర్టీఏ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదై ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పోగొట్టుకున్న వాహనాలు లభించకపోవడంతో కొత్తవి కొనుగోలు చేసే సమయంలో 2 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి వస్తోంది. అపహరణకు గురైనప్పటికీ ఆ వాహనం సదరు యజమాని పేరిట నమోదై ఉందనే సాకుతో రవాణా అధికారులు అదనపు భారం మోపుతున్నారు. -
స్మార్ట్ కార్డు ‘బట్వాడా’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రవాణా, పోస్టల్ శాఖల మధ్య ఏర్పడిన సమస్య వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రవాణాశాఖ జారీచేసే లైసెన్సులు, ఆర్సీ సహా అన్ని రకాల స్మార్ట్ కార్డుల బట్వాడాను తపాలాశాఖ నిలిపేయటంతో కార్డులు అత్యవసరమైన వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15 నెలలుగా కార్డుల బట్వాడా చార్జీలను తపాలా శాఖకు రవాణాశాఖ చెల్లించటం లేదు. దాదాపు రూ.2 కోట్ల చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.ఎంతకూ ఈ బిల్లు రాకపోవటంతో నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ శాఖ ఆర్టీఏ కార్యాలయాల నుంచి కార్డుల బట్వాడాకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌తోపాటు సిద్ధమైన కార్డులను వాహనదారులకు చేరవేసే సేవలను కూడా నిలిపివేసింది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే దాదాపు 2 లక్షల కార్డులు పేరుకుపోయాయి. దీంతో జేబులో ఆర్సీ, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాబడి లెక్కే.. చెల్లింపు లెక్కలేదు వాహనదారుల నుంచి వసూలు చేసే వివిధ రకాల చార్జీలను రవాణాశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ కడుతుంది. దీన్ని ఆదాయంగా ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి సంవత్సరానికి ఈ ఆదాయాన్ని పెంచాలని రవాణా శాఖకు ప్రభుత్వం కొత్త టార్గెట్ నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఆదాయాన్ని అయితే వసూలు చేస్తోంది కానీ.. ఖర్చులకు కావల్సిన మొత్తాన్ని విడుదల చేయటంలేదు. 2014–15లో రూ.1,855 కోట్ల ఆదాయాన్ని రవాణాశాఖ ద్వారా పొందిన ప్రభుత్వం.. 2023–24 నాటికి రూ.6,990 కోట్లకు పెంచుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రూ.1,593 కోట్ల ఆదాయం పొందింది. రూ.4 కోట్లు వసూలు చేసినా.. గత 15 నెలల్లో వాహనదారుల నుంచి ‘కార్డుల బట్వాడా రుసుము’పేరుతో రవాణాశాఖ దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.2 కోట్లు తపాలాశాఖకు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రవాణాశాఖ ద్వారా రూ.6,990 కోట్లు రాబట్టుకుంది. ఇందులో రూ.2 కోట్లంటే సముద్రంలో నీటిబొట్టంతే. కానీ, ఆ చిన్న మొత్తాన్ని కూడా తపాలా శాఖకు చెల్లించలేకపోయింది.ఆర్సీ, లైసెన్సు, రెన్యువల్స్, కొన్ని రకాల డూప్లికేట్ స్మార్ట్ కార్డులను రవాణాశాఖ వాహనదారులకు పోస్టు ద్వారా చేరవేస్తుంది. ఆయా లావాదేవీకి సంబంధించి దరఖాస్తు సమయంలోనే ఆన్లైన్లో తపాలా బట్వాడా రుసుము వసూలు చేస్తుంది. తపాలా బట్వాడా చార్జీ కింద వాహనదారు నుంచి రూ.35 చొప్పున రవాణా శాఖ వసూలు చేసుకుంటోంది. పోస్టల్ శాఖకు మాత్రం ఒక్కో కార్డు బట్వాడాకు చెల్లిస్తున్నది రూ.17 మాత్రమే. కవర్ చార్జీ కింద మరో రూపాయి చెల్లిస్తుంది. తపాలాశాఖ ఉదారం.. రవాణాశాఖ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు తన వంతుగా మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖ కొంత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ‘బుక్ నౌ.. పే లేటర్’విధానాన్ని ప్రారంభించి బట్వాడాకు సంబంధించిన పార్శిళ్లను ముందుగా బుక్ చేసి, వాటి రుసుములను తర్వాత చెల్లించినా ఫర్వాలేదు అన్న ‘ఉద్దెర’పాలసీ తీసుకొచ్చింది. దీంతో కార్డుల బట్వాడా చేయించుకుంటూ.. రుసుములు తర్వాత చెల్లించే పద్ధతికి రవాణాశాఖ అలవాటు పడింది. చార్జీలు రాకున్నా సేవలు ఎందుకు అందిస్తున్నారని రెండేళ్ల క్రితం ఆడిట్ విభాగం తపాలాశాఖను ప్రశ్నించింది. తపాలాశాఖ అధికారులు ఇదే విషయాన్ని రవాణాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదు. -
కొత్త బండి మోజు తీరకుండానే చలాన్ల మోత.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కొత్త బండి మోజు తీరకుండానే చలాన్లు మోత మోగిస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదవుతున్నాయి. ఆర్సీలు లేకుండా నడుపుతూ అడ్డంగా బుక్ అవుతున్నారు. నిజానికి తప్పిదం తమది కాకపోయినా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల నుంచి వాహనదారులకు సకాలంలో ఆర్సీ స్మార్ట్‌కార్డులు అందకపోడం వల్ల ఈ పరిస్థితి నెలకొంటోంది. కొత్త బండి కొనుగోలు చేసిన సంతోషం క్షణాల్లో ఆవిరవుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఏలో వాహనం నమోదైన వారం, పది రోజుల్లోనే స్మార్ట్‌కార్డు ఇంటికి చేరాల్సి ఉండగా, అందుకు విరుద్దంగా నెలలు గడిచినా కార్డులు రావడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత వల్లనే ఈ జాప్యం చోటుచేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్మార్ట్‌కార్డుల నాణ్యత పెంచేందుకు ఇటీవల పాత కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. కానీ దాని స్థానంలో కొత్త కాంట్రాక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వల్ల రవాణాశాఖకు స్మార్ట్‌కార్డుల మెటీరియల్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో కొన్ని చోట్ల స్మార్ట్ కార్డులు అందుబాటులో ఉన్నప్పటికీ మరికొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో కొరత ఏర్పడింది. ఇది వాహనదారులకు ఆర్థిక భారంగా మారింది. గ్రేటర్లో వేలల్లో డిమాండ్గ్రేటర్ హైదరాబాద్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతిరోజూ సుమారు 2,500 వాహనాలు కొత్తగా నమోదవుతాయి. అలాగే బ్యాంకు ఈఎంఐలు చెల్లించిన అనంతరం స్మార్ట్‌కార్డుల్లో హైపతికేషన్ రద్దు కోసం వచ్చే వాహనదారులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. దీంతో తెలంగాణలోని ఇతర ప్రాంతాలకంటే హైదరాబాద్‌లో డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీల కోసం ముద్రించే స్మార్ట్‌కార్డులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రెండు కేటగిరీల్లో కనీసం రోజుకు 5,000 కార్డులను ప్రింట్ చేసి స్పీడ్ పోస్టు ద్వారా వాహనదారులకు చేరవేయాల్సి ఉంటుంది. ఒక్కో కార్యాలయం నుంచి సుమారు 500 కార్డులకు డిమాండ్ ఉంటుంది. కానీ ఇందుకు తగిన విధంగా కార్డుల మెటీరియల్ లేకపోవడం వల్ల కొరత తలెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షకుపైగా కార్డుల కొరత ఉండగా, సెప్టెంబర్ నాటికి 40 వేలకు పైగా అందజేసినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త కార్డుల సరఫరాకు ఒప్పందం ఏర్పడనుందని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో కార్డులను జారీ చేస్తామని తెలిపారు. కానీ ప్రస్తుతం నెలకొన్న జాప్యం వల్ల వాహనదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ‘హైపతికేషన్ కాన్సిల్ చేసుకొని నెల దాటింది. కానీ ఇప్పటి వరకు కార్డు రాలేదు. బండి బయటకు తీయాలంటే భయమేస్తోంది..’ అని తుర్కయంజాల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ అనే వాహనదారుడు విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికే చలాన్ల పేరిట రూ.300 చెల్లించినట్లు చెప్పారు. మరోవైపు స్మార్ట్‌కార్డుల కోసం ఆర్టీఏ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తుందని, గంటల తరబడి పడిగాపులు కాసినా అధికారులు స్పందించడం లేదని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ వాహనదారుడు ఆందోళన వ్యక్తం చేశారు.ఒక్కో కార్డు రూ.685డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల కోసం ఆర్టీఏకు ఆన్లైన్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్సుల కేటగిరీ మేరకు రూ.685 నుంచి రూ.1500 వరకు ఖర్చవుతుంది. ఆర్సీలకు మాత్రం రూ.685 వరకు చెల్లించాలి. ఇందులో సర్వీస్ చార్జీల రూపంలో రూ.400, స్మార్ట్‌కార్డుకు రూ.250 చొప్పున చెల్లించాలి. మరో రూ.35 స్పీడ్‌పోస్ట్ చార్జీలు చెల్లించాలి. ఇలా అన్ని చార్జీలు కలిపి ముందే చెల్లించినా నెలల తరబడి పడిగాపులు కాయాల్సి రావడం గమనార్హం. చదవండి: ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలపై వేటుసారథి వస్తే ఆన్లైన్లోనే.. మరోవైపు తరచూ కార్డుల జారీలో నెలకొంటున్న జాప్యం, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆధార్ తరహా ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని అధికారులు సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న సారథి సాంకేతిక వ్యవస్థ పూర్తిస్థాయిలో అమలైతే ఈ సేవా కేంద్రాల నుంచే స్మార్ట్ కార్డులను అందజేసే అవకాశం ఉంటుందని ఒక అధికారి చెప్పారు. ఇందుకు మరి కొంత సమయం పట్టవచ్చు. -
ఆర్టీఏ 2 శాతం దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఒక వ్యక్తి అప్పటికే ఓ కారును కలిగి ఉండి మరో కారును కొనుగోలు చేసినప్పుడు మాత్రమే 2 శాతం పన్ను రవాణాశాఖకు అదనంగా చెల్లించాలి. అంటే కొత్త వాహనంపై విధించే 18 శాతం పన్నుతో పాటు మొదటి కారుపై 2 శాతం వసూలు చేయాలనేది నిబంధన. కానీ ఆర్టీఏ అధికారులు ద్విచక్రవాహనం ఉన్నప్పటికీ రెండు శాతం పన్ను విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కార్లకే ఆ నిబంధన కానీ.. సాధారణంగా ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబ అవసరాలకు ఒక కారు సరిపోతుందనే భావనతో ఈ అదనపు పన్ను నిబంధనను అప్పట్లో తెరపైకి తెచ్చారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ కార్లను కలిగి ఉండడం వల్ల రహదారులపై భారం పెరుగుతుందని, అదనపు వాహనాలపై పన్నులు విధిస్తే ఆ కొనుగోళ్లను ఒకింత తగ్గించాలని భావించి గతంలో రవాణాశాఖ అధికారులు ఆ నిబంధనను అమలు చేస్తూ వచ్చారు. కానీ.. దీన్ని కేవలం కార్లకు మాత్రమే పరిమితం చేయాల్సి ఉండగా.. ద్విచక్ర వాహనాలను కూడా ఈ నిబంధన పరిధిలోకి తేవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ద్విచక్ర వాహనం కలిగిన వ్యక్తి కొత్తగా కారును కొనుగోలు చేస్తే ఆ కారు ధరలో 18 శాతం జీవితకాల పన్నుతో పాటు మరో 2 శాతం అదనంగా చెల్లించాలని పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్విచక్ర వాహనంఉన్నవారు కారు కొనుగోలు చేస్తే రూ.వేలల్లో అదనపు పన్ను చెల్లించాల్సివస్తోంది. ఈ అడ్డగోలు నిబంధన వల్ల 2010 నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది నష్టపోయారు. పైగా.. కాలం చెల్లి, తుప్పు పట్టి, వినియోగానికి పనికి రాని వాహనాలపై, చోరీకి గురైన వాహనాలపైనా రవాణాశాఖ నిర్దాక్షిణ్యంగా అదనపు పన్ను వసూళ్లకు పాల్పడడం గమనార్హం. కారు.. బైక్ ఒకటేనా? నలుగురు ప్రయాణం చేసే కారును.. ఇద్దరు మాత్రమే వెళ్లగలిగే బైక్‌ను ఒకే రకమైన వాహనంగా ముద్రవేసి పన్ను విధించడం వివాదాస్పదమవుతోంది. ‘2010లో రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను విధించాలనే ప్రతిపాదన వచ్చింది. ఇది కార్లకే పరిమితం చేయాలని నిర్ణయించాం. కానీ నిబంధనల్లో ఈ విషయం స్పష్టంగా లేకపోవడం వల్ల ద్విక్ర వాహనాలకు కూడా అమలవుతోంది’అని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పుకొచ్చారు. ఏపీలో ఎత్తేసినా.. ఇక్కడ మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి తెచి్చన రెండు శాతం అదనపు పన్ను నిబంధనను గత ఏపీ ప్రభుత్వం తొలగించింది. ‘రెండో వాహనం’తో నిమిత్తం లేకుండా కొత్త వాహనాలపై 18 శాతం జీవితకాల పన్ను వసూలు చేస్తోంది. 2021లోనే ఈ రెండో వాహనం నిబంధనను తొలగించడంతో లక్షలాది మంది వాహనదారులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చినట్లయింది. మరోవైపు వాహనం శాశ్వత రిజి్రస్టేషన్ కోసం వాహన యజమానులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా షోరూమ్‌ల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించారు. అంటే కొత్తగా బైక్, కారు తదితర వాహనాలను కొనుగోలు చేసిన వారు వాటి నమోదు కోసం ప్రత్యేకంగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నంబర్ ప్లేట్‌తో సహా షోరూమ్‌లోనే అన్ని పనులు పూర్తవుతాయి.‘బాదుడు’కథనంపై చర్చ.. ‘బండి ఉన్నా లేకున్నా బాదుడే’అనే శీర్షికన రెండు రోజుల క్రితం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన కథనం రవాణా శాఖలో చర్చకు తెరలేపింది. వినియోగంలో లేని వాహనాలను సైతం రెండో బండిగా పరిగణించి వాహనదారులపై అదనపు భారం మోపడంపై ఈ కథనంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఒక వాహనదారు తన బండి చోరీకి గురైందని పేర్కొంటూ పోలీసుల ధ్రువీకరణతో సహా ఆర్టీఏకు సమర్పించినప్పటికీ దాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలు నిబంధనలతో అదనపు వడ్డనకు పాల్పడుతున్న వైనాన్ని ఆ కథనంలో ప్రస్తావించడంతో చర్చ జరుగుతోంది. రెండో వాహనం కొనుగోలు చేసినప్పుడు జీవితకాల పన్నుపై మినహాయింపునివ్వాలని, ఈ మేరకు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆర్టిఏపై ఏసీబీ కొరడా
సాక్షి, సిటీబ్యూరో/మణికొండ/చాంద్రాయణగుట్ట/మలక్‌పేట: ఆర్టిఏలో దళారుల దందాపై ఏసీబీ దండెత్తింది. మంగళవారం నగరంలోని వివిధ చోట్ల ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఏసీబీ సోదాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఏసీబీ దాడుల భయంతో పలు చోట్ల పౌరసేవలను సైతం నిలిపివేశారు. చాలాకాలం పాటు ఎలాంటి తనిఖీలు, సోదాలు లేకుండా నిరాటంకంగా సాగుతున్న దళారుల కార్యకలాపాలకు మంగళవారం నాటి దాడులతో ఒక్కసారిగా బ్రేక్ పడింది. దళారులదే రాజ్యం.. రవాణాశాఖ అందజేసే డ్రైవింగ్ లైసెన్సులు, లెరి్నంగ్ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్లు, బదిలీలు తదితర సుమారు 50కి పైగా పౌరసేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చినప్పటికీ పలుచోట్ల దళారులే రాజ్యమేలుతున్నారు. మరోవైపు దళా రుల ద్వారా వస్తే తప్ప ప్రజలకు పౌరసేవలు లభించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నగరంలోని డ్రైవింగ్ స్కూళ్లు, ఏజెంట్లు, దళారులు ప్రతి పౌరసేవకు ఒక ధర చొప్పున నిర్ణయించి వాహనదారుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ ద్వారా పౌరసేవలను అందజేయడం ప్రహసనంలా మారింది. ఏకకాలంలో దాడులు.. మంగళవారం మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయంతో పాటు బండ్లగూడలోని దక్షిణ మండలం, మలక్‌పేట్‌లోని తూర్పు మండలం కార్యాలయాల్లో, టోలిచౌకి కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఐదుగురు ఇన్స్పెక్టర్ల బృందం బండ్లగూడలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో దాడులు నిర్వహించింది. ఏజెంట్లతో పాటు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి కొన్ని డాక్యుమెంట్లను, నగదును అధికారులు స్వా«దీనం చేసుకున్నారు.తాళాలు వేసుకుని పరార్.. ఏసీబీ అధికారుల తనిఖీలతో మలక్‌పేట ఆర్టీఓ కార్యాలయ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఆఫీసు చుట్టూ ఉన్న ఏజెంట్లు దుకాణాలకు తాళాలు వేసుకున్నారు. పౌరసేవల కోసం వచి్చన వాహనదారులను పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మణికొండలోని డీటీసీ కార్యాలయంలో నిర్వహించిన తనిఖీల్లోనూ పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని డాక్యుమెంట్లను స్వా«దీనం చేసుకున్నారు. మణికొండలో రూ.23,710, టోలిచౌకిలో రూ.43,360, బండ్లగూడలో రూ.48,370 నగదును అనధికార వ్యక్తుల నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఏజెంట్ల ఫోన్లలో అధికారుల నంబర్లు.. ఏజెంట్ల మొబైల్ ఫోన్లలో కొందరు అధికారుల ఫోన్ నంబర్లు ఉండడంపై పూర్తి స్థాయిలో విచారించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో పౌరసేవలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మూసారంబాగ్‌లోని మలక్‌పేట ఈస్ట్‌జోన్ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ సిటీ రేంజ్–1, డీఎస్పీ కె.శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన దాడుల్లో 15 మంది బయటి వ్యక్తులను గుర్తించారు. బయటి వ్యక్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి పంపించారు. పలువురు దళారులను పట్టుకున్నారు. కార్యాలయంలో సజ్జమీద పడేసి ఉన్న పర్సులో రూ. 22 వేలు లభించినట్లు అధికారులు తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్ల పాత్రపై, అవకతవకలపై సమగ్ర నివేదికను తయారు చేసి ఏసీబీ ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.ఇదిగో ఏసీబీ.. అదిగో ఏజెంట్... మరోవైపు ఏసీబీ దాడుల నేపథ్యంలో గ్రేటర్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలు హడలెత్తాయి. అధికారులు, ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చనే సమాచారంతో పలు చోట్ల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సిబ్బందిని అన్ని విధాలుగా అప్రమత్తం చేశారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయాలకు ఏజెంట్లను రాకుండా అడ్డుకున్నారు. డ్రైవింగ్ లైసెన్సులు, లెరి్నంగ్ లైసెన్సులు తదితర పౌరసేవల కోసం ఏజెంట్ల ద్వారా వెళ్లిన వాహనదారులు తమ స్లాట్లను రద్దు చేసుకున్నారు. ఏజెంట్లకు రూ.వేలల్లో చెల్లించి నష్టపోయామని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆధార్‌తో ఆర్టీఏ
హైదరాబాద్: ఆర్టీఏ పౌరసేవలను మరింత సులభతరం చేసేందుకు రవాణాశాఖ కసరత్తు చేపట్టింది. వాహనదారులు నేరుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం వివిధ రకాల పౌరసేవలను ఆన్లైన్ ద్వారా అందజేస్తున్నారు. ఇందుకోసం వాహనదారులు టీ–యాప్ ఫోలియోలో స్లాట్ నమోదు చేసుకొని అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. త్వరలో ఈ ఆన్లైన్ పౌరసేవలను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు. 52 రకాల సేవలు.. కొత్తగా లెర్నర్స్ లైసెన్సులు పొందడం నుంచి గడువు ముగిసిన వాటిని పొడిగించుకోవడం, డ్రైవింగ్ లైసెన్సులు, వాటి పునరుద్ధరణ, డూప్లికేట్ లైసెన్సులు, వాహనాల నమోదు, వాహనాల బదిలీలు, చిరునామా మార్పు, పర్మిట్లు, త్రైమాసిన పన్ను చెల్లింపులు, అపరాధ రుసుములు వంటి సుమారు 52 రకాల పౌరసేవలను రవాణాశాఖ అందజేస్తోంది. కొత్తగా లైసెన్సు తీసుకొనేవారు మొదట ఆరీ్టఏలో నిర్వహించే లెరి్నంగ్ పరీక్షలకు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెల రోజులకు శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు తీసుకొనేందుకు మరోసారి డ్రైవింగ్ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షల్లో పాల్గొనాలి. ఈ రెండు రకాల లైసెన్సుల కోసం వాహనదారులు నేరుగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లవలసి ఉంటుంది. అలాగే వాహనాల నమోదు, ఫిట్నెస్ పరీక్షలు వంటి వాటి కోసం అధికారులను స్వయంగా సంప్రదించాలి. ఇవి కాకుండా చాలా వరకు ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లోనే పొందవచ్చు. సాంకేతిక సామర్ధ్యం పెంపు.. రవాణా శాఖ అందజేసే అన్ని రకాల పౌరసేవలకు ప్రస్తుతం త్రీటైర్ సాంకేతిక వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఆన్లైన్ నుంచి గాని, ప్రత్యక్షంగా గాని వచ్చే దరఖాస్తులను పరిశీలించి అవసరమైన డాక్యుమెంట్లను, సరి్టఫికెట్లను రవాణా కమిషనర్ కార్యాలయం నుంచి అందజేస్తున్నారు. పౌరసేవల నిర్వహణలో కమిషనర్ కార్యాలయం ఒక కేంద్రీకృతమైన వ్యవస్థగా సేవలను అందజేస్తోంది. టీ– యాప్ ఫోలియోతో పాటు ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా సేవల సౌలభ్యాన్ని పెంచేందుకు సాంకేతిక సామర్థ్యాన్ని మరింత పెంచాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే గోవాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తాను కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్, హ్యుందాయ్ ఈవీ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. #TFNExclusive: Man of Masses @tarak9999 gets papped as he visits the RTO office for the registration of his new car!📸😎#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/61cW1D74k9 — Telugu FilmNagar (@telugufilmnagar) April 2, 2024 -
వైజాగ్ స్కూల్ ఆటో ఘటన.. విజయవాడ RTA అలర్ట్
-
ఆర్టీఏలో అల్లరి నరేష్
హైదరాబాద్: సినీ నటుడు అల్లరి నరేష్ శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. కొత్తగా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి రాంచందర్ మోటారు వాహన నిబంధనల మేరకు వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. అల్లరి నరేష్ తన ఖరీదైన కొత్త కియా ఈవీ–6 బ్యాటరీ కారు కోసం ప్రత్యేక నంబర్‌ను సొంతం చేసుకున్నారు. టీఎస్ 09 జీబీ 2799 నంబర్ కోసం ఆయన ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా రూ.94,899 చెల్లించి నంబర్ దక్కించుకున్నారు. -
ఖరీదైన కారు కొన్న మాస్ మహారాజా.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఇటీవలే ఆయన కొత్తగా ఖరీదైన ఎలక్ట్రిక్ కారు(ఈవీ)ని కొనుగోలు చేశారు. ఈ మేరకు తన వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు. దాదాపు రూ.34.5 లక్షలతో కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా టీఎస్09 జీబీ2628 అనే ఫ్యాన్సీ నంబర్‌ను 17,628 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు. కారు ప్రత్యేకతలు ఇవే రవితేజ తాజాగా కొనుగోలు కారులో ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. చైనాకు చెందిన ఈ కారు అత్యంత సురక్షితమైందిగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే , ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఒక పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, సింథటిక్ లెదర్ అపోల్స్ట్రే, పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు, 5 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా దీనికి పేరుంది. కాగా.. రవితేజ ఇటీవలే రావణాసుర సినిమాతో అభిమానులను అలరించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా సహా ఐదుగురు హీరోయిన్స్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడుతున్నప్పటికీ.. మూవీకి మాత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చింది. -
వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు భలే క్రేజ్.. ఒక్కరోజే 31 లక్షల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ పెరిగింది. వాహనదారులకు ఇష్టమైన నంబర్‌తో పాటు, లక్కీ నంబర్, పుట్టిన తేదీ, కలిసి వచ్చే నంబర్‌తో గుర్తింపు దక్కాలని చూస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి తమకు కావాల్సిన నంబర్లను వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. సాధార ణంగా వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రవాణా శాఖకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంటే.. ఫాన్సీ నంబర్ల ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. తాజాగా ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. ప్రతి సిరీస్‌లో ఎంతో డిమాండ్ ఉండే ఆల్‌నైన్ ఈసారి కూడా అ‘ధర’హో అనిపించింది. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ‘టీఎస్ 09 ఎఫ్‌జడ్ 9999’ నెంబర్‌కు ప్రీమియర్ ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.9,50,999 చెల్లించి సొంతం చేసుకుంది. అలాగే ‘టీఎస్ 09 జీఏ 0001’ నెంబర్ కోసం రాజేశ్వరి స్కిన్ అండ్ ఎయిర్క్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ వేలంలో రూ.7,25,199 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్09 జీఏ 0009’ నెంబర్ కోసం ఎం.వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2.20,111 చెలించింది. ‘టీఎస్09 జీఏ 0007’ నెంబర్ కోసం స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,35,007 చెల్లించి నెంబర్‌ను దక్కించుకుంది. ‘టీఎస్ 09 జీఏ 0003’ నెంబర్ కోసం ధని కన్సల్టేషన్స్ ఎల్ఎల్పీ రూ.1,35,000 చెల్లించి సొంతం చేసుకుంది. ప్రత్యేక నెంబర్లపైన శుక్రవారం ఒక్క రోజే రూ.31,66,464 లభించినట్లు హైదరాబాద్ జేటీసీ పాండురంగ్‌నాయక్ తెలిపారు. -
ఏదీ నిఘా.. ఉత్తుత్తి చర్యగా మారిన లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్సులపైన నిఘా కొరవడింది. సాధారణంగా ఒకసారి లైసెన్సు రద్దయ్యాక ఆరు నెలల పాటు సదరు వాహనదారుడు బండి నడిపేందుకు వీలులేదు. 6 నెలల అనంతరం తిరిగి డ్రైవింగ్ లైసెన్సును పునరుద్ధరించుకున్న తరువాత మాత్రమే వాహనం నడిపేందుకు అనుమతి లభిస్తుంది. అయితే ఆర్టీఏ, పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా లైసెన్సుల రద్దు ప్రక్రియ ఉత్తుత్తి ప్రహసనంగా మారింది. నగరంలో రోడ్డు ప్రమాదాలు, మద్యంసేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపైన ఏటా వేల సంఖ్యలో లైసెన్సులు రద్దవుతున్నాయి. కానీ ఇలా రద్దయిన వాహనదారులు యధేచ్చగా రోడ్డెక్కేస్తూనే ఉన్నారు. మరోవైపు మోటారు వాహన నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెస్సు రద్దయినట్లు ఎలాంటి సమాచారం కానీ, హెచ్చరికలు రద్దయినట్లు సదరు వాహనదారులకు అందకపోవడం వల్ల అదే పనిగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. రద్దులోనూ జాప్యం... నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ప్రతి రోజు పదుల సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఇలా వరుసగా డ్రంకెన్ డ్రైవ్‌లలో పట్టుపడిన వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఆర్టీఏను సంప్రదిస్తారు. ఆన్లైన్ ద్వారా ఆర్టీఏ అధికారులకు డేటా అందజేయాల్సి ఉంటుంది. కానీ పోలీసులు స్వాధీనం చేసుకున్న లైసెన్సుల వివరాలను ఎప్పటికప్పుడు రవాణాశాఖకు చేరవేయడంలో జాప్యం చోటుచేసుకుంటుంది. ఉదాహరణకు జనవరిలో పట్టుకున్న నిందితుల డేటాను మార్చి నెలలో ఆర్టీఏకు చేరవేస్తున్నారు. దీంతో మార్చి నుంచి 6 నెలల పాటు అమలయ్యే విధంగా ఆర్టీఏ సదరు డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తుంది. కానీ జనవరిలో పట్టుబడిన నిందితులు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి యధావిధిగా తిరుగుతున్నారు. మార్చి నుంచి ఆరు నెలల పాటు రద్దయిన సమాచారం కూడా వాహనదారులకు సకాలంలో అందడం లేదు. ఎం–వాలెట్లో చూడాల్సిందే... రద్దయిన డ్రైవింగ్ లైసెన్సుల వివరాలు ఆర్టీఏ ఎం–వాలెట్లో మాత్రమే నమోదవుతున్నాయి. ఎం–వాలెట్ యాప్ కలిగి ఉన్న వాహనదారులు ఆ యాప్‌లో తమ డ్రైవింగ్ లైసెన్సు ఏ స్థితిలో ఉందో తెలుసుకుంటే మాత్రమే సస్పెండ్ అయినట్లుగా నోటిఫికేషన్ కనిపిస్తుంది. కానీ పోలీసులు, ఆర్టీఏ నిఘా లేకపోవడం వల్ల డ్రైవింగ్ లైసెన్సులు లేకపోయినా యధేచ్చగా రోడ్డెక్కుతున్నారు. (చదవండి: పక్కాగా ప్లాన్ చేసిన దొరికిపోయాడు!....కథ మొత్తం కారు నుంచే..) -
ఆర్టీఏ కార్యాలయానికి కాసుల వర్షం.. 9999 @ రూ.10,49,999
సాక్షి, హైదరాబాద్: ఫ్యాన్సీ నంబర్ల వేలం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి కాసుల వర్షం కురిపించింది. బుధవారం నిర్వహించిన వేలం పాటలో పలు ఫ్యాన్సీ నంబర్ల విక్రయం ద్వారా మొత్తంగా రూ.30.83 లక్షల ఆదాయం లభించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా టీఎస్09 ఎఫ్యూ 9999 నంబరును రూ.10,49,999కు కోట్ చేసి గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుందని చెప్పారు. టీఎస్ 09 ఎఫ్‌వీ 0009 నంబరును రూ.3,50,0005 చెల్లించి సీహెచ్ అనంతయ్య అనే వినియోగదారుడు దక్కింకుకున్నారని పేర్కొన్నారు. టీఎస్ 09 ఎఫ్‌వీ 0001 నంబరును రూ,3,50,000కు రేజర్ గేమింగ్ సంస్థ దక్కించుకుందని తెలిపారు. వీటితోపాటు పలు ఇతర నంబర్లను కూడా వేలం వేశామని చెప్పారు. -
ఆర్టీఏకు వచ్చిన హైకోర్టు చీఫ్ జస్టిస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. తన డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ కోసం ఆయన నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి రావడం గమనార్హం. రవాణా కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు, హైద రాబాద్ జేటీసీ పాండురంగ నాయక్, ప్రాం తీయ రవాణా అధికారి రాంచందర్ తదితరులు చీఫ్ జస్టిస్‌కు సాదరస్వాగతం పలికారు. నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెన్సు కాలపరిమితిని పునరుద్ధరించి అందజేశారు. -
నిబంధనలకు విరుద్దంగా నడిచే పాఠశాలల బస్సుల పై చర్యలు
-
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రస్తుత కరోనా మహమ్మరి కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ఆన్లైన్ ద్వారా సేవలందించాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం 17 రకాల సేవలను ఆన్లైన్ ద్వారా అందించడానికి ‘ఎక్కడైనా - ఎప్పుడైనా (ఎనీవేర్ - ఎనీటైమ్)’ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికోసం ఇప్పటికే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న టీ-యాప్ ఫోలియో ద్వారా సేవలు అందించనున్నట్లు రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు బుధవారం తెలియజేశారు. పౌరులు తమ స్మార్ట్ మొబైల్ ఫోన్ల నుంచి 17 రకాల సేవలను యాక్సెస్ చేయవచ్చు అని ఈ సేవల కోసం రవాణా లేదా ఆర్టీఏ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు అని అన్నారు. టీ-యాప్ ఫోలియో యాప్‌ను గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో పేర్కొన్న సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. టీ-యాప్ ఫోలియో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకొని తర్వాత మీకు కనిపించే ఆర్టీఏ ఐకాన్‌పై క్లిక్ చేస్తే 17 రకాల సేవలు కనపడుతాయి. అందులో మనకు అవసరమైన దానిపైన క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. డూప్లికేట్ లైసెన్స్, ఇష్యూ ఆఫ్ బ్యాడ్జ్, స్మార్ట్‌కార్డు, లైసెన్స్ హిస్టరీ షీట్, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ పర్మిట్, పర్మిట్ రెన్యువల్, టెంపరరీ పర్మిట్ వంటి 17 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని కమిషనర్ తెలిపారు. చదవండి: జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం..స్టైఫండ్ పెంపు -
డ్రైవింగ్ లైసెన్స్.. తప్పదు వెయిటింగ్!
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. వాహనదారులకు పోస్టు ద్వారా అందజేయాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీ కార్డులు గత రెండు నెలలుగా నిలిచిపోయాయి. కార్డుల కొరత కారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షకు పైగా వినియోగదారులు స్మార్ట్‌కార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారు. వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకొని, డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు సకాలంలో స్మార్ట్ కార్డులు లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల కింద రూ.వేలల్లో జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. రవాణాశాఖ నిబంధనల మేరకు వినియోగదారులు ఎలాంటి పౌర సేవల కోసమైనా ముందే ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లిస్తారు. సర్వీస్ చార్జీలతో పాటు, పోస్టల్ చార్జీలను కూడా ఆర్టీఏ ఖాతాలో జమ చేస్తారు. ఇలా సర్వీసు చార్జీల రూపంలోనే ఒక్క హైదరాబాద్ నుంచి ఏటా రూ.100 కోట్ల మేర ప్రజలు చెల్లిస్తారు. కానీ రవాణాశాఖ అందజేసే పౌరసేవల్లో మాత్రం పారదర్శకత లోపించడం గమనార్హం. స్మార్టు కార్డులను తయారు చేసి, అందజేసే కాంట్రాక్ట్ సంస్థలకు సుమారు రూ.18 కోట్ల మేర బకాయీలు చెల్లించకపోవడం వల్లనే 2 నెలలుగా కార్డుల ప్రింటింగ్, పంపిణీని ఆ సంస్థలు నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో రవాణాశాఖ అధికారులు తాజాగా మరో సంస్థతో ఒప్పందానికి చర్యలు చేపట్టారు. కానీ ఈ ఒప్పందం ఏర్పడి కార్డులు తయారు చేసి అందజేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ ఇప్పటికిప్పుడు పంపిణీ చేపట్టినా వినియోగదారులకు చేరేందుకు మరో 15 రోజులకు పైగా సమయం పట్టవచ్చునని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. (పాపికొండలు.. పర్యటనకు వెళ్తారా?) సందట్లో సడేమియా.. గత 3 సంవత్సరాలుగా స్మార్ట్‌కార్డుల కొరత వెంటాడుతూనే ఉంది. వాహనదారులు నెలలతరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో కార్డులు పరిమితంగా ఉన్న సందర్భాల్లో కొంతమంది ఆర్టీఏ సిబ్బంది యథావిధిగా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రూ.200 నుంచి రూ.300లకు కార్డు చొప్పున విక్రయిస్తున్నారు. కార్డుల కొరత తీవ్రంగా ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ‘నిబంధనల ప్రకారం అన్ని రకాల ఫీజులు, పోస్టల్ చార్జీలు చెల్లించిన తరువాత కూడా ఆర్టీఏ సిబ్బందికి డబ్బులిస్తే తప్ప కార్డులు రావడం లేదని’ టోలిచౌకికి చెందిన అనిల్ అనే వాహనదారుడు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది దళారులే కార్డుల కొరతను సాకుగా చూపుతూ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పలు చోట్ల ఇదే ఒక దందాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: వ్యాక్సిన్‌పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు) -
వాహన సామర్థ్య పరీక్ష కేంద్రం నిర్మాణ బాధ్యతలు కేంద్రానికి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే వాహనాల శాస్త్రీయ ఫిట్నెస్ పరీక్షా కేంద్రం (ఐ అండ్ సీ) నిర్మాణ బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ కేంద్రం నిర్మాణంపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోనుంది. విశాఖ నగర సమీపంలో గంభీరం వద్ద ఏర్పాటు చేయనున్న ఐ అండ్ సీ (ఇన్స్పెక్షన్ అండ్ సెంటర్) నిర్మాణానికి కేంద్రం గతంలోనే రూ.16.50 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం 25 ఎకరాల విలువైన భూమిని కేంద్రానికి అప్పగించింది. ఇందులో అధునాతన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌తోపాటు వాహనం బ్రేక్ నుంచి హెడ్లైట్లు, కాలుష్య స్థాయిలు, స్టీరింగ్ సామర్థ్యం, టైర్లు, సీటింగ్ స్థానాలు వంటి ఇతర ముఖ్యమైన భాగాలను తనిఖీ చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న మాన్యువల్ మోటార్ వాహన ఫిట్నెస్ పరీక్షలు అవసరం లేకుండా చేస్తుంది. రాష్ట్ర విభజనతో ఏపీకి ఐ అండ్ సీ మంజూరు.. ► కేంద్ర ప్రభుత్వం సొంత నిధులతో ఐ అండ్ సీని మంజూరు చేసింది. గత ప్రభుత్వం దీని ఏర్పాటును పట్టించుకోలేదు. ► ఈ నెలలో సీఎం వైఎస్ జగన్‌తో శంకుస్థాపన చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ► నిర్మాణం తర్వాత ఈ కేంద్రాన్ని పుణెకు చెందిన ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) తొలి ఏడాది నిర్వహిస్తుంది. ఆ తర్వాత ఆర్టీఏ అధికారులకు అవసరమైన శిక్షణ ఇచ్చి రవాణా శాఖకు అప్పగిస్తుంది. ప్రస్తుతం ప్రతి రోజూ ఉత్తరాంధ్రలో దాదాపు 250 వాహనాలకు పైగా ఫిట్నెస్ పరీక్షలు మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు. ► నిబంధనల ప్రకారం రవాణా వాహనాలు ట్రక్కులు, క్యాబ్‌లు, పాఠశాల బస్సులు సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవాలి. ఈ సెంటర్లో కంప్యూటర్ ఆధారితంగా దాదాపు 30 నుంచి 40 ఫిట్నెస్ పరిమితుల్లో వాహనాల తనిఖీ జరుగుతుంది. ► పాఠశాల బస్సులు, భారీ రవాణా వాహనాలకు సరైన ఫిట్నెస్ లేని కారణంగా చాలావరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను అరికట్టడంలో ఐ అండ్ సీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. -
వాహనాల వేలం ఎప్పుడో..?
ఖిలా వరంగల్: ప్రమాదాలు, వివిధ సందర్భాల్లో రవాణాశాఖ అధికారులు, పోలీసులు సీజ్ చేసిన వాహనాలు ఎండకు ఎండి వానకు తడిసి తుప్పుపడుతున్నాయి. ఇలాంటి వాహనాలు ఒకటో రెండో ఉన్నాయనుకుంటే పొరపడినట్లే..!. కొన్ని వందల ఆటోలు, ద్విచక్ర వాహనాలతోపాటు ఇతర వాహనాలు ఆర్టీఏ కార్యాలయ ప్రాంగణంలో తుప్పిపట్టి శిథిలమయ్యాయి. దీంతో రూ.లక్షల ప్రజాధనం వృథా అయింది. అయినా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆరు నెలల్లో.. వివిధ కారణాలతో పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది సీజ్ చేసిన వాహనాలను రవాణాశాఖ సీక్ యార్డుకు తరలిస్తారు. వీటిని విడిపించుకోవడానికి యజమానులకు శాఖ నిబంధనల మేరకు ఆరు నెలలు సమయం ఉంటుంది. విడిపించుకోలేకపోతే ఆరు నెలలు తర్వాత ఆయా వాహనాలను వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. అయితే, రవాణాశాఖ అధికారులు ఆ మేరకు వ్యవహరించడం లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో వేలం నిర్వహించిన దాఖలాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, నాలుగున్నరేళ్లుగా వాహనాలు ఒకేచోట ఉండటంతో తుప్పుపట్టి ఎందుకు పనికిరాకుండా పోయాయని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. సీజ్ చేసిన సమయంలో బాగా నడిచిన వాహనాలు ఎండకు ఎండి వానకు తడిసి పిచ్చి మొక్కలు మొలిచాయి. ఇప్పుడు వాటిని విక్రయించాలన్నా అమ్ముడుపోని పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వేలంలో విక్రయించినా వాటిపై ఉన్న ట్యాక్స్, పెనాల్టీలు, ఇతర జరిమానాలు మొత్తం కలిపిన శాఖకు 50 శాతం కూడా రెవెన్యూ వచ్చేలా లేదు. సకాలంలో వాహనాలను వేలం వేసి ఉంటే పూర్తి సొమ్ము ఖజానాకు జమ అయ్యేదని పలువురు పేర్కొంటున్నారు. కమిషనర్‌కు నివేదిక అందజేస్తాం.. తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు, రోడ్డు టాక్స్ చెల్లించని వాహనాలను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయ ప్రాంగణంకు తరలిస్తాం. వాహన యజమానలు ఆరు నెలల్లోపు జరిమానా చెల్లించి విడిపించుకునే వీలుంటుంది. అలా తీసుకోకపోతే వారి చిరునామాకు మూడుసార్లు నోటీసులు పంపుతాం. అయినా స్పందించకపోతే ప్రకటన ద్వారా వాటిని వేలం నిర్వహించి విక్రయిస్తాం. ప్రస్తుతం నాలుగేళ్లలోపు సీజ్ చేసిన వాహనాలే కార్యాలయ ప్రాంగణంలో ఉన్నావి. డీటీసీకి నివేదిక అందజేసి శాఖ నిబంధనల ప్రకారం వేలం నిర్వహించి ఆర్సీలు అందజేస్తాం.– కంచి వేణు, ఎంవీఐ, వరంగల్ అర్బన్ -
మళ్లీ మొదటికి..!
సాక్షి, సిటీబ్యూరో: రవాణా శాఖలో స్మార్ట్‌కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. ఏడాది కాలంగా కొరత సమస్య కొనసాగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అప్పటికప్పుడు ఏవో కొన్ని కార్డులను దిగుమతి చేసుకొని డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ పత్రాలను ముద్రించి వాహనదారులకు అందజేస్తున్నారు. కానీ రెండు, మూడు నెలల్లోనే కొరత సమస్య తిరిగి తలెత్తుత్తోంది. స్మార్టు కార్డులను..వాటిలో వివరాలను ముద్రించేందుకు అవసరమయ్యే రిబ్బన్లను ఆర్టీఏకు విక్రయించే సంస్థలకుకోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండడం వల్లనే తరచుగా ఈ సమస్య తలెత్తుతోంది. పౌరసేవల పేరిట వినియోగదారుల నుంచి ఏటా రూ.కోట్లల్లో వసూలు చేస్తున్నప్పటికీ స్మార్ట్‌కార్డుల తయారీకయ్యే ఖర్చులను సకాలంలో చెల్లించడంలో మాత్రం రవాణాశాఖ జాప్యం చేస్తోంది. దీంతో అన్ని రకాల ఫీజులు, స్పీడ్ పోస్టు చార్జీలు కూడా చెల్లించిన వినియోగదారులు తాము కోరుకొనే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులను మాత్రం పొందలేకపోతున్నారు. గత 2 నెలలుగా సుమారు లక్షకు పైగా స్మార్ట్‌కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. ఒకవైపు కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనూ వాహనదారులు ఎంతో బాధ్యతగా అన్ని రకాల ఫీజులు చెల్లించి వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అలాగే డ్రైవింగ్ పరీక్షలకు హాజరవుతున్నారు. నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెన్సులను, ఆర్సీ పత్రాలను రెన్యూవల్ చేసుకుంటున్నారు. కానీ రవాణాశాఖ మాత్రం పౌరసేవల్లో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తోంది. వాహనదారులను ఆందోళనకు గురి చేస్తోంది. లక్షకు పైగా పెండింగ్... గ్రేటర్ హైదరాబాద్‌లోని ఉప్పల్, నాగోల్, మేడ్చల్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, మెహిదీపట్నం, కొండాపూర్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బండ్లగూడ తదితర అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో గత 2 నెలలుగా స్మార్ట్‌కార్డుల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో రోజుకు 250 నుంచి 300 వరకు స్మార్ట్‌కార్డుల డిమాండ్ ఉంటుంది. ఖైరతాబాద్‌లోని సెంట్రల్ కార్యాలయంలో మరో వారం రోజులకు సరిపడా కార్డులు మాత్రమే ఉన్నాయి. మేడ్చల్‌లో ఆర్సీ కార్డుల కొరత తీవ్రంగా ఉంది. ఉప్పల్‌లో డ్రైవింగ్ లైసెన్సులు లభించడం లేదు. ప్రతి రోజు సుమారు 300 మందికి డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి స్పీడ్ పోస్టు ద్వారా స్మార్ట్ కార్డులను వినియోగదారులకు పంపించే నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో కొరత తీవ్రంగా ఉండడంతో ఇటీవల ఖైరతాబాద్ నుంచి 5 వేల కార్డులను తెప్పించి అందజేశారు. ఇప్పటికే 2 నెలలుగా సుమారు లక్షలకు పైగా కార్డుల పంపిణీ నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా స్మార్ట్ కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. ఒకవేళ ప్రభుత్వం స్పందించి పరిష్కారం కోసం చర్యలు చేపట్టినా ఇప్పుడు ఆర్టీఏ పౌరసేవల కోసం దరఖాస్తు చేసుకొనేవారు వాటిని స్మార్ట్ కార్డుల రూపంలో పొందేందుకు మరో 2నెలలు ఆగాల్సిందే. చెల్లించిన ఫీజులు ఏమైనట్లు.... డ్రైవింగ్ లైసెన్సు అయినా, ఆర్సీ అయినా స్మార్ట్‌కార్డు రూపంలో ఉంటేనే వాహనదారుడికి గుర్తింపు లభిస్తుంది. ఇందుకోసం రవాణాశాఖ విధించే నిబంధనలన్నింటినీ పాటిస్తారు. డ్రైవింగ్ లైసెన్సు కోసం రూ.1550 ఆన్లైన్లో ముందే చెల్లించవలసి ఉంటుంది. ఇక వాహనాలు కొనుగోలు చేసిన సమయంలోనే జీవితకాల పన్నుతో పాటు, వాటి శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌తో సహా అన్ని ఫీజులను షోరూమ్‌లో చెల్లిస్తారు. స్మార్ట్‌కార్డులను వినియోగదారుల ఇంటికి పంపించేందుకు అయ్యే స్పీడ్ పోస్టు చార్జీ రూ.35 లు కూడా ఆర్టీఏ ఖాతాలో ముందుగానే జమ చేయవలసి ఉంటుంది. దీంతో పాటు సేవా రుసుము పేరిట రూ.250 వసూలు చేస్తారు.ఇలా ఫీజుల రూపంలోనే రవాణాశాఖ వినియోగదారుల నుంచి ప్రతి సంవత్సరం రూ.వందల కోట్లు వసూలు చేస్తుంది. బకాయిల చెల్లింపుల్లోనే జాప్యం.... గతంలో పూనేకు చెందిన కొన్ని ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలు స్మార్టు కార్డులను తయారు చేసి ఇచ్చేవి. కానీ రవాణాశాఖ సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆ సంస్థలు చేతులెత్తేశాయి. ఏకంగా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. దాంతో హైదరాబాద్‌కే చెందిన సీఎంఎస్, ఎంటెక్,తదితర సంస్థలతో గతేడాది ఒప్పందం కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను అందజేయడం ఈ సంస్థల బాధ్యత.ప్రతి 3 నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఈ బిల్లులను చెల్లించకపోవడంతో ఆ సంస్థలు కార్డుల పంపిణీ నిలిపివేసినట్లు తెలిసింది. సకాలంలో కార్డులు లభించకపోవడం వల్ల తమ వద్ద ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు రశీదులు ఉన్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తున్నారని వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
నోలైన్.. అన్నీ ఆన్లైన్
సాక్షి, హైదరాబాద్ : రవాణా శాఖ అందజేసే పౌర సేవలు మరింత సులభతరం కానున్నాయి. వాహన వినియోగదారులు ఆర్టీఏ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంటి నుంచే కొన్ని రకాల పౌర సేవలను పొందొచ్చు. ఇందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందించింది. మరో వారం, పది రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వాహనదారులు తమకు కావాల్సిన పౌరసేవల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్లతో పాటు వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్ సంతకాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో వెంటనే వినియోగదారుల మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందుతుంది. వినియోగదారుల దరఖాస్తులను, డాక్యుమెంట్లను పరిశీలించిన వారం రోజుల వ్యవధిలో స్మార్ట్ కార్డులను స్పీడ్ పోస్టు ద్వారా ఇళ్లకు పంపిస్తారు. దరఖాస్తు చేసుకొనే సమయంలోనే ఫీజులు కూడా ఆన్లైన్లో చెల్లించాలి. లెర్నింగ్ లైసెన్సులు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల క్రయ విక్రయాలు వంటి వినియోగదారులు స్వయంగా రావాల్సిన పౌరసేవలు మినహాయించి సుమారు 17 రకాల సేవలను ఆన్లైన్ ద్వారా నేరుగా వినియోగదారులకు అందజేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ట్రయల్స్ సైతం పూర్తయ్యాయి. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ధ్రువీకరణ కోసమే సెల్ఫీ.. సాధారణంగా ప్రస్తుతం వివిధ రకాల పౌరసేవల కోసం వినియోగదారులు మొదట ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లో, ఈ–సేవా కేంద్రాల ద్వారా నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఫీజులు చెల్లించాలి. స్లాట్‌లో నమోదైన తేదీ, సమయం ప్రకారం ఆర్టీఏకు వెళ్లి పత్రాలను అధికారులకు అందజేయాలి. అక్కడే ఫొటో దిగి, డిజిటల్ సంతకం చేయాలి. దీంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత వారం, 10 రోజులకు వినియోగదారుల ఇళ్లకే స్పీడ్ పోస్టు ద్వారా ధ్రువపత్రాలు అందజేస్తారు. వినియోగదారుల నిర్ధారణ కోసం ఫొటోలు, డిజిటల్ సంతకాలే కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ సేవల్లో వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్ సంతకాన్ని తప్పనిసరి చేశారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయాన్ని నియంత్రించేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది. మరోవైపు నకిలీ డాక్యుమెంట్లను అరికట్టేందుకు కూడా కీలకం కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారికి ఎస్సెమ్మెస్ ద్వారా అందజేసే సమాచారంలో వినియోగదారులు కోరుకున్న సేవలను ధ్రువీకరిస్తూ ఒక నంబర్ కేటాయిస్తారు. ఒకవేళ ఆర్టీఏ ఆన్లైన్ సేవల్లో జాప్యం చోటు చేసుకున్నా, సాంకేతిక సమస్యలు తలెత్తినా ఈ నంబర్ ఆధారంగా వివరాలు పొందొచ్చు. ఏయే సేవలకు ఆన్లైన్.. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, 6 నెలల గడువు ముగిసిన లెర్నింగ్ లైసెన్సు కాలపరిమితి పొడిగింపు, లెర్నింగ్ లైసెన్స్‌లో ఒకటి కంటే ఎక్కువ వాహనాలకు అనుమతి కోరడం, వాహన రిజిస్ట్రేషన్ డూప్లికేట్ పత్రాలు, గడువు ముగిసిన వాటి రెన్యువల్స్, వివిధ రకాల డాక్యుమెంట్ల చిరునామాలో మార్పు, అంతర్రాష్ట్ర సేవలపైన తీసుకోవాల్సిసిన నిరభ్యంతర పత్రాలు (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), రవాణా వాహనాల పర్మిట్లు, త్రైమాసిక పన్ను చెల్లింపులు వంటి 17 రకాల సేవలను ఆన్లైన్ పరిధిలోకి తేనున్నారు. వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు వంటి వాటికి మాత్రం వినియోగదారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. -
గడువు దాటిన ఎల్‌ఎల్‌ఆర్‌లు ఎలా?
సాక్షి, సిటీబ్యూరో: లెర్నింగ్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్) తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కనీసం నెల రోజులు ఎదురు చూడాల్సిందే! కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేందుకు అనుమతినిచ్చే ఎల్ఎల్ఆర్ కోసం నగరంలో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్ నిబంధనలదృష్ట్యా పౌరసేవలపై రవాణాశాఖ ఆన్లైన్ స్లాట్లను గణనీయంగా తగ్గించింది. దీంతో వాహన వినియోగదారులు తమకు కావాల్సిన సేవలను పొందేందుకు నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. గతంలో ఒకట్రెండు రోజుల్లోనే స్లాట్లు లభించేవి. డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పౌరసేవలను వినియోగించుకున్నారు. కానీ కోవిడ్ కట్టడికి విధించిన పరిమితుల దృష్ట్యా పడిగాపులు కాయాల్సి వస్తోంది. లెర్నింగ్ లైసెన్సు పొందిన వినియోగదారులు 6 నెలల్లో శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలి. స్లాట్ల కొరత కారణంగా ఎంతోమంది ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు. గడువు ముగిసిన లెర్నింగ్ లైసెన్సులు పొడిగించుకోవడం కూడా సాధ్యం కాకపోవడంతో పలువురు తమకు ఉన్న అర్హతను కోల్పోవాల్సివస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, గడువు ముగిసిన పర్మనెంట్ లైసెన్సుల రెన్యూవల్ కోసం కూడా ఆన్లైన్లో భారీ ఎత్తున క్యూలో ఉండాల్సి వస్తోంది. ఆర్టీఏ కార్యకలాపాలు మొదలైనప్పటికీ స్లాట్లు పెంచకపోవడం వల్లే డిమాండ్ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. భారీగా స్లాట్ల కుదింపు.. ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంలో సాధారణంగా రోజుకు 300 ఎల్ఎల్ఆర్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు సైతం ఇంచుమించు అదేస్థాయిలో ఉంటారు. 150 నుంచి 180 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల కోసంస్లాట్లు ఉంటాయి. కానీ.. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని భారీగా తగ్గించారు. ఎల్ఎల్ఆర్ స్లాట్లు కేవలం 25 నుంచి 30కే పరిమితం చేశారు. దీంతో ఈ కార్యాలయం పరిధిలో లెర్నింగ్ లైసెన్సు కోసం స్లాట్ నమోదు చేసుకోవాలంటే నెల రోజులు ఆగాల్సి వస్తోంది. ఒక్క ఖైరతాబాద్‌లోనే కాకుండా ఉప్పల్, ఇబ్రహీంపట్నం, అత్తాపూర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, మేడ్చల్.. ఇలా అన్ని ఆర్టీఏ కేంద్రాల్లో స్లాట్ల కుదింపుతో లెర్నింగ్ లైసెన్సుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్యలో రోజు రోజుకూ పెరుగుతోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్ కూడా 50 స్లాట్లకే పరిమితం చేశారు. నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో సాధారణంగా రోజుకు 350 నుంచి 400 మందికి పరీక్షలు నిర్వహించి లైసెన్సులకు అర్హతను ధ్రువీకరిస్తారు. కానీ.. ఇప్పుడు అక్కడ సైతం 50 స్లాట్లకే పరిమితం చేశారు. నాగోల్‌తో పాటు కొండాపూర్ తదితర డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గడువు దాటిన ఎల్‌ఎల్‌ఆర్‌లు ఎలా? లెర్నింగ్ లైసెన్సులకు 6 నెలల పరిమితి ఉంటుంది. ఉదాహరణకు గతేడాది నవంబర్‌లో లెర్నింగ్ లైసెన్సు తీసుకున్నవారు ఈ ఏడాది ఏప్రిల్‌లో పర్మనెంట్ లైసెన్స్ పరీక్షలకు హాజరుకావాలి. గత డిసెంబర్లో లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నవారు మే నెలలో శాశ్వత లైసెన్స్ పరీక్షలకు హాజరు కావాలి. స్లాట్లు లభించకపోవడంతో వందలాది మంది తమ లెర్నింగ్ లైసెన్సు అర్హతను కూడా కోల్పోవాల్సివస్తోంది. మరోవైపు కాలపరిమితి దాటిన లెర్నింగ్ లైసెన్సుల గడువు పొడిగించాలన్నా స్లాట్లు లభించకపోవడం సమస్యగానే పరిణమించింది. -
ఆర్టీఏ తొలిరోజు ఆదాయం రూ.1.82 కోట్లు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ తర్వాత సేవలు ప్రారంభించిన రవాణా శాఖకు తొలిరోజు రూ. 1.82 కోట్ల ఆదాయం సమకూరింది. గురువారం నుంచి పూర్తి స్థాయిలో రవాణా శాఖ సేవలు మొదలయ్యాయి. రవాణా శాఖ కమిషన ర్ ఎంఆర్‌ఎంరావు.. గురువారం ప్రధాన కార్యాలయంలో సేవలను దగ్గరుండి ప ర్యవేక్షించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ జిల్లాల్లోని అధికారులతో సమీక్షించారు. రవాణా కార్యాలయాల కు వచ్చే వారు కచ్చితంగా మాస్కులు ధరించటంతోపాటు, భౌతికదూరాన్ని పాటించేలా ఏ ర్పాట్లు చేయాలని ఆదేశించారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణకు వచ్చే వారు కచ్చితంగా శా నిటైజర్ వినియోగించాలని, వాటిని అందుబా టులో ఉంచాలని ఆయన ఆదేశించారు. కార్యాలయాలకు వచ్చే వారిని కచ్చితంగా థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనికి అనుమతించాలన్నారు. -
మాస్క్ ఉంటేనే వాహనాల రిజిస్ట్రేషన్
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ నేపథ్యంలో సుమారు 45 రోజులుగా నిలిచిపోయిన ఆర్టీఏ కార్యకలాపాలకు మార్గం సుగమమైంది. ఈ మేరకు వివిధ రకాల పౌరసేవల కోసం అధికారులు బుధవారం రవాణా శాఖ వెబ్సైట్లో స్లాట్లను అందుబాటులోకి తెచ్చారు. గురువారం నుంచి స్లాట్లు పరిమిత స్థాయిలో వినియోగంలోకి రానున్నాయి. లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, డూప్లికేట్ డాక్యుమెంట్లు తదితర సేవల కోసం వినియోగదారులు ఆన్లైన్లో స్లాట్లను నమోదు చేసుకొని ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌కు ముందు (మార్చి 23)స్లాట్లను నమోదు చేసుకుని ఫీజులు చెల్లించినవారికి రానున్న వారం రోజుల్లో దశలవారీగా సేవలను అందజేయనున్నట్లు ఉప రవాణా శాఖ కమిషనర్ (విజిలెన్స్)కె.పాపారావు తెలిపారు. లెర్నింగ్ లైసెన్సు కాలపరిమితి ముగిసి లాక్డౌన్ కారణంగా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలకు హాజరు కాలేకపోయిన వారికి కూడా లెర్నింగ్ లైసెన్సుల గడువును పొడిగించనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్– 19 పరిస్థితుల దృష్ట్యా ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే వినియోగదారులపై ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ప్రతి వినియోగదారుడూ కచ్చితమైన భౌతిక దూరం పాటించాలని సూచించారు. దరఖాస్తుదారులు మాత్రమే ఆర్టీఏ కార్యాలయాలకు రావాలని చెప్పారు. ఇతరులకు ఎలాంటి అనుమతులు ఉండబోవన్నారు. మాస్క్ఉంటేనే.. ♦ ప్రతి వాహన వినియోగదారుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకుండా వస్తే వాహనాల రిజిస్ట్రేషన్లు సహా ఎలాంటి సేవలనైనా నిలిపివేస్తారు. ♦ కార్యాలయంలోకి వచ్చిన ప్రతి వ్యక్తికీ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే లోనికి అనుమతిస్తారు. వ్యక్తుల మధ్య 6 అడుగుల భౌతిక దూరం పాటించేందుకు అన్ని చోట్లా మార్కింగ్ చేస్తారు. అందుబాటులో శానిటైజర్లను కూడా ఉంచుతారు. ♦ వాహనదారులకు నిర్దేశించిన స్లాట్ ప్రకారమే రావాల్సి ఉంటుంది. ఉదాహరణకు మధ్యాహ్నం 2 గంటలకు సమయం కేటాయిస్తే ఆ సమయానికే రావాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఆలస్యంగా వచ్చినా స్లాట్ రద్దు చేస్తారు. నిర్దేశించిన సమయానికి ముందే వచ్చినా ఇబ్బందే. ♦ సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకు స్లాట్ ఉంటే చాలామంది ఉదయం 10 గంటలకే ఆఫీస్‌లకు వస్తారు. ఇక నుంచి అలా రావడానికి వీల్లేదు. నిర్ణీత సమయానికే రావాలి. ముందుగా వచ్చేవారిని లోనికి అనుమతించబోరు. ♦ దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే రావాలి, ఇతరులకు ప్రవేశం ఉండదు. దివ్యాంగులు, సీనియర్ సిటీజన్లు మాత్రం సహాయకులను వెంట తెచ్చుకోవచ్చు. 50 శాతం స్లాట్లు మాత్రమే... ♦ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీని తగ్గించేందుకు స్లాట్ల సంఖ్యను సైతం కుదించారు. ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో సాధారణ రోజుల్లో ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 50శాతం స్లాట్లను మాత్రమే అనుమతిస్తారు. దీంతో ఎక్కువ మంది గుమిగూడకుండా నియంత్రించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.350 కోట్ల నష్టం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా రవాణాశాఖ సుమారు రూ.350 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. ఫీజులు, వివిధ రకాల పన్నులు, సేవలపై ఈ ఆదాయం లభిస్తుంది.రవాణా వాహనాలపై జూన్‌లో త్రైమాసిక పన్ను చెల్లించాలి. బీఎస్– 4 వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేకంగా స్లాట్లు నమోదు చేసి సేవలు అందజేస్తాం. – కె.పాపారావు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (విజిలెన్స్) -
నకిలీల గోల
రవాణాశాఖలో నకిలీ ఇన్సూరెన్స్‌ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నకిలీ బీమా పత్రాల వ్యవహారంలో ఆ శాఖ అధికారులు, ప్రైవేట్ ఏజెంట్లు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆన్లైన్లో పత్రాలు అప్లోడ్ చేసే విషయం కొంతమంది బీమా, రవాణా ఏజెంట్లకు కలసివస్తోంది. ఫిట్నెస్, ట్రాన్స్ఫర్ సెక్షన్లలో పనిచేసే ఉద్యోగులతో అనధికార ఒప్పందం చేసుకుని నకిలీ పత్రాలతో జేబులు నింపుకుంటున్న పరిస్థితి ఉంది. రవాణాశాఖలో నకిలీల వ్యవహారం గత ఎస్పీ దృష్టికి వెళ్లింది. తనిఖీలు జరుగుతాయన్న సమయంలో ఆయన బదిలీ అయ్యారు. దీంతో వీరి ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. ఇటీవల పొట్టేపాళేనికి చెందిన ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో సొంతంగా డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. ఈ ట్రాక్టర్‌కు నకిలీ బీమా పత్రం ఉంది. ఈ రీతిలో నకిలీ పత్రాలతో ప్రయానించే సమయంలో ప్రమాదం జరిగితే వాహనాల యజమానులతోపాటు గాయపడిన వ్యక్తులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్కో ధర.. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు ఇచ్చేందుకు కొంతమంది బీమా, రవాణా శాఖ ఏజెంట్లు ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు రవాణా కార్యాలయం సమీపంలో ఓ మహిళా ఏజెంట్ కూడా నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు ఇస్తున్నట్లు తెలిసింది. బీమా సంస్థకు ఇన్సూరెన్స్ చెల్లించాలంటే ఎక్కువ ధర ఉండడంతో ఎక్కువ మంది వాహనదారులు నకిలీ పత్రాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా ఆటో, బైక్, ఎల్‌జీవీ, ట్రాక్టర్ యజమానులు నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తీసుకుంటున్నట్లు సమాచారం. బైక్‌కు రూ.200 నుంచి రూ.300, ఆటోకు రూ.1500, లైట్ గూడ్స్ వెహికల్‌కు రూ.4,000, ట్రాక్టర్‌కు రూ.500 నుంచి రూ.1,000లు తీసుకుని నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు ఇస్తున్నారు. ప్రధానంగా హెచ్బీఎఫ్సీ, ఫ్యూచర్ జనరల్, జీఓ డిజిట్, ఇస్కోటోక్యో, శ్రీరామ్ తదితర కంపెనీల మీద కొంతమంది ఏజెంట్లు నకిలీ పత్రాలు ఇస్తున్నట్లు తెలిసింది. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల జారీలో ఆటో ఫైనాన్స్ కంపెనీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. నెల్లూరు(టౌన్): ఆర్టీఏ నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికి ప్రతి ఏటా ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంది. ఇన్సూరెన్స్ చెల్లిస్తేనే ఆ వాహనంపై లావాదేవీలను జరుపుతారు. వాహనాలకు ఇన్సూరెన్స్ పత్రాలు ఇచ్చేందుకు పదుల సంఖ్యలో బీమా సంస్థలు ఉన్నాయి. ఏడాదికి ద్విచక్ర వాహనానికి రూ.1,400, ఆటోకు రూ.7,851లు, లైట్ గూడ్స్ వెహికల్‌కు రూ.18,600, ట్రాక్టర్‌కు రూ.14,500, లారీకి రూ. 35,000 ఇన్సూరెన్స్చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు పలు ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ప్రతి ఏటా ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం, వాహన యజమానికి, బయట వ్యక్తులు గాయపడిన సమయంలో సంస్థ నిబంధనలు ప్రకారం బీమాను వర్తింపజేస్తారు. కలసివస్తున్న ఆన్లైన్ విధానం రెండేళ్ల క్రితం రవాణాశాఖలో 80కు పైగా సేవలను ఆన్లైన్ చేశారు. దీంతో మీసేవ, ఏపీఆన్‌లైన్, కామన్ సర్వీస్ సెంటర్ తదితర వాటిల్లో ఆన్లైన్ సేవలు నిర్వహిస్తున్నారు. అయితే వాహన లావాదేవీలకు సంబంధించి పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఫిట్నెస్, వాహన ట్రాన్స్ఫర్ల సమయంలో తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ఆన్లైన్ విధానం కావడంతో ఒరిజనల్ పత్రాలను చూసే పరిస్థితి రవాణా అధికారులకు ఉండదు. అనుమానం వస్తే తప్పనిసరిగా విచారణ చేయాలి. అదేం లేకుండా నకిలీ పత్రాన్ని ఓకే చేసినందుకు సంబంధిత గుమస్తా, ఏఓ, ఆర్టీఓకు రూ.300 నుంచి రూ.700 వరకు ముట్టజెప్పాల్సి ఉంటుందని సమాచారం. ప్రమాదం జరిగితే అంతే.. నకిలీ ఇన్సూరెన్స్‌లు ఉన్న వాహనాలు ప్రమాదాలకు గురైతే ఒక్కపైసా కూడా రాదు. పైగా ప్రమాదంలో వాహన యజమాని, లేదా బయట వ్యక్తి గాయపడినా, మృతి చెందినా బీమా సంస్థ నుంచి రూపాయి కూడా అందదు. ఇటీవల పొట్టేపాళేనికి చెందిన ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నకిలీ ఇన్సూరెన్స్ పత్రం కావడంతో మరణించిన వ్యక్తికి రూ.7 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. అయితే దెబ్బతిన్న ట్రాక్టర్‌ను యజమానే సొంత డబ్బులతో రిపేరు చేయించుకున్నారు. అదే ఒరిజనల్ ఇన్సూరెన్స్ పత్రం కలిగి ఉంటే వాహనంతో పాటు మరణించిన వ్యక్తికి సంస్థ నుంచి నగదు వచ్చేది. ఇప్పటికీ నకిలీ బీమా పత్రాలు కలిగి ప్రమాదాలు జరిగి పలు వాహనాల మీద కేసులు నడుస్తున్నాయి. నకిలీ బీమా పత్రాల మీద గత ఎస్పీకి కొంతమంది ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తనిఖీలు జరుగుతాయన్న సమయంలో ఆయన బదిలీ అయ్యారు. ఇప్పటికైనా నకిలీ బీమా పత్రాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీప్రతినిధులతో సమావేశం నకిలీ ఇన్సూరెన్స్లకు సంబంధించి ఆయా బీమా కంపెనీ ప్రతినిధులతో వచ్చేవారం సమావేశం నిర్వహిస్తాం. ఇన్సూరెన్స్ పత్రానికి సంబంధించి క్యూ ఆర్‌ను పరిశీలిస్తున్నాం. ఇప్పటి నుంచి నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం. పట్టుబడ్డ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.–సుబ్బారావు, రవాణా శాఖఉప కమిషనర్ -
ఆన్లైన్ రూట్లో ఆర్టీఏ
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ ఆన్లైన్ బాటపడుతోంది. ప్రత్యేక నంబర్ల కోసం ఆన్లైన్ బిడ్డింగ్ విజయవంతంగా నిర్వహించిన ఆర్టీఏ.. మరిన్ని సేవలను ఆన్లైన్ పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. వాహన వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావలసిన అవసరంలేని సేవల్ని గుర్తించి ఆన్లైన్ పరిధిలోకి తెచ్చారు. ఇంటి వద్ద నుంచే నేరుగా ఈ సేవలను పొందవచ్చు. ఇప్పటి వరకు ఆన్లైన్లో స్లాట్ నమోదుకే అవకాశం ఉంది. ఒకసారి స్లాట్ (సమయం,తేదీ) నమోదు చేసుకున్న వినియోగదారులు నెట్‌బ్యాంకింగ్ లేదా ఈ సేవ కేంద్రా ల్లో ఫీజు చెల్లించి నిర్ణీత సమయం ప్రకారం ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సి ఉండేది. ఇకపై కొన్ని సేవలకు మినహాయింపు లభించనుంది. ప్రస్తుతం ప్రత్యేక నంబర్లకు ఆన్లైన్లో బిడ్డింగ్ నిర్వహిస్తున్నట్టే సుమారు 20 రకాల పౌరసేవలకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. వినియోగదారుల అభ్యర్థనలు, వారు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు, చిరునామా ధ్రువీకరణ ఇతర పత్రాలను అధికారులు పరిశీలించి సంతృప్తి చెందితే.. వారు కోరుకున్న సేవలను ఆన్లైన్లోనే అందజేస్తారు. ఇందుకోసం నెట్‌బ్యాంకింగ్, ఈ సేవా కేంద్రాల ద్వారా చెల్లిస్తున్నట్టే ఫీజులను చెల్లించాలి. రవాణాశాఖ మంత్రి నుంచి ఆమోదం లభించిన వెంటనే మార్చి నుంచి ఆన్లైన్ సేవలను అమల్లోకి తేనున్నట్లు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు. ఆన్లైన్ సేవలివే.. లెర్నింగ్ లైసెన్స్ కేటగిరీ: కాలపరిమితి ముగిసిన లెర్నింగ్ లైసెన్స్ కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. ఉదాహరణకు ద్విచక్ర వాహనం నడిపేందుకు మొదట అనుమతి పొందిన వారు తరువాత ఆన్లైన్లోనే కారు లేదా ఆటో వంటి వాటి కోసం అనుమతి పొందవచ్చు. లెర్నింగ్ లైసెన్స్ పోగొట్టుకొంటే తిరిగి డూప్లికేట్ పొందవచ్చు. కాలపరిమితి ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్ స్థానంలో లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కేటగిరీ: రవాణా వాహనాలు నడిపేందుకు అనుమతించే బ్యాడ్జి, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ లైసెన్స్, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్, లైసెన్స్‌లో చిరునామా మార్పు, డ్రైవింగ్ లైసెన్స్ హిస్టరీ షీట్ సేవలను పొందవచ్చు. కండక్టర్ లైసెన్స్: ఆర్టీసీ కండక్టర్లు, ఇతర ప్రయాణికుల వాహనాల్లో కండక్టర్లుగా విధులు నిర్వహించే వారు ఆర్టీఏ నుంచి పొందే లైసెన్స్ ఆన్లైన్లోనే లభిస్తుంది. కొత్త లైసెన్స్ తీసుకోవడంతో పాటు రెన్యూవల్, డూప్లికేట్, అడ్రస్ మార్పువంటి అన్ని సదుపాయాలను పొందవచ్చు. వాహనాల రిజిస్ట్రేషన్ కేటగిరీ: వాహనం యాజమాన్య బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం విక్రయించిన వారు, కొనుగోలు చేసిన వారు తమ పూర్తి వివరాలను, డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. డూప్లికేట్ ఆర్సీ తీసుకోవచ్చు. సదరు వాహనానికి ఫైనాన్స్ ఉంటే మాత్రం సాధ్యం కాదు. ఆర్సీ (వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్)లో చిరునామా మార్చుకోవచ్చు. వాహనంఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకోవచ్చు. డాక్యుమెంట్లే కీలకం ఆన్లైన్ సేవల్లో వినియోగదారులు సమర్పించే డాక్యుమెంట్లను అధికారులు సీరియస్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు వాహన యాజమాన్యం ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయ్యేందుకు ప్రస్తుతం అందజేసే పత్రాలనే ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు వాహనం ఫొటో, అభ్యర్థుల తాజా చిత్రాలను సైతం అందజేయాలి. అభ్యర్థుల సంతకాలనూ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ‘ఫొటోలకు సంబంధించి కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థుల సెల్ఫీ అప్లోడ్ చేయడమా లేక, ఇంకేదైనా చేయవచ్చా అనేది పరిశీలిస్తున్నాం’అని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. -
ఆర్టీఏ ప్రత్యేక నంబర్లకు ఆన్లైన్ బిడ్డింగ్
సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖ ప్రత్యేక రిజర్వేషన్ నెంబర్లకు ఇక ఆన్లైన్లోనే టెండర్లు నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీ సోమవారం నుంచి హైదరాబాద్ పరిధిలోని ఐదు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఆన్లైన్ బిడ్డింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఒక నెల తరువాత రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏలకు దీనిని విస్తరిస్తారు. రిజర్వేషన్ నెంబర్లపై ప్రస్తుతం నిర్వహిస్తున్న టెండర్ ప్రక్రియ వల్ల అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ బిడ్డింగ్‌కు చర్యలు చేపట్టింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆన్లైన్ బిడ్డింగ్ విధివిధానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రవాణాశాఖ తాజాగా ఈ సదుపాయాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. కొత్త విధానం మేరకు వినియోగదారులు తమకు కావలసిన నెంబర్లను ఆర్టీఏ వెబ్సైట్లోనే ఎంపిక చేసుకోవచ్చు. నిబంధనల మేరకు ఫీజు చెల్లించి, వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు, ఆధార్, పాన్‌కార్డు తదితర డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఒక నెంబర్‌పైన ఎంత మందైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్‌బ్యాంకింగ్ లేదా ఇతర ఆన్లైన్ పద్ధతుల్లోనే ఆర్టీఏ నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లించవచ్చు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఆన్లైన్ బిడ్డింగ్‌ను ఆహ్వానిస్తారు. డిమాండ్ బాగా ఉన్న నెంబర్‌పైన వినియోగదారులు ఎంత మందైనా పోటీ పడవచ్చు. చివరకు ఎక్కువ మొత్తంలో బిడ్డింగ్ చేసిన వారికి నెంబర్లను కేటాయిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరిగిపోతుంది. బిడ్డింగ్‌లో నంబర్లను దక్కించుకోలేని వారికి వారు చెల్లించిన డబ్బులు ఆ తరువాత 48 గంటల్లో తిరిగి వాళ్ల ఖాతాలో జమ అవుతాయి. పోటీలో పాల్గొన్న వారికి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందచేస్తారు. అనూహ్యమైన డిమాండ్... ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపైన వాహనదారుల్లో అనూహ్యమైన డిమాండ్ ఉంది. ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో “9999’ నెంబర్‌కు వాహనదారులు రూ.10 లక్షల వరకు కూడా చెల్లించేందుకు పోటీపడుతున్నారు. ఖరీదైన హైఎండ్ కార్లను, బైక్‌లను కొనుగోలు చేస్తున్న వినియోగదారులు నచ్చిన నెంబర్ల కోసం ఎన్ని రు.లక్షలైనా వెచ్చించేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో రవాణాశాఖకు ప్రత్యేక నెంబర్లపైన ఏటా రూ.50 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. ‘0009, 999, 9999, 1234, 6666, 2233, 7777,1111’ వంటి నెంబర్లకు భారీ డిమాండ్ ఉంది. కొన్ని రకాల నెంబర్లను అదృష్ట సంఖ్యలుగా భావిస్తుండగా, మరికొన్ని రైజింగ్ నెంబర్లుగా, ఫ్యాన్సీ నెంబర్లుగా వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇలా ప్రత్యేక నెంబర్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని దళారులు రంగంలోకి దిగారు. వాహనదారులకు కావలసిన నెంబర్ల కోసం ఒక బేరం కుదుర్చుకొని ఆ తరువాత ఆర్టీఏ అధికారుల సహకారంతో సదరు నెంబర్లకు పోటీ లేకుండా దక్కించుకోవడం లేదా, ఆ నెంబర్లకు ఆ రోజు యాక్షన్ నుంచి మినహాయింపును ఇచ్చేసి మరుసటి రోజు లెఫ్టో్టవర్ (మిగిలిపోయిన) నెంబర్లుగా ఎలాంటి బిడ్డింగ్ లేకుండా రూ.లక్షల్లో సొమ్ము చేసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో ఏజెంట్లు సిండికేట్‌గా మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ బిడ్డింగ్‌కు శ్రీకారం చుట్టారు. 5 కేంద్రాల్లో అమలు ఇలా... నగరంలోని ఖైరతాబాద్, మెహదీపట్నం, సికింద్రాబాద్, మలక్‌పేట్, బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయాల్లో ఆన్లైన్ బిడ్డింగ్ సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఐదు ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో వాహనదారులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొని, ఫీజు చెల్లించి, బిడ్డింగ్‌లో పాల్గొనవలసి ఉంటుంది. ఒక నెంబర్ కోసం ఒక్కరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉండి, ఎక్కువ మొత్తంలో చెల్లించిన వారికి నెంబర్‌ను కేటాయిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక్కరే దరఖాస్తు చేసుకొంటే అలాంటి నెంబర్లు పోటీ లేకుండానే లభిస్తాయి. కాగా ఆన్లైన్ బిడ్డర్లు ఎవైనా సందేహాలుంటే నివృత్తి కోసం 040–23370081/83/84 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
వారెవ్వా ‘వాలెట్’!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ఎం–వాలెట్. ఇప్పుడు మరోసారి వాహనదారులంతా దీనిపైనే దృష్టిసారించారు. వివిధ రకాల ధృవపత్రాలను మొబైల్ ఫోన్లోనే భద్రపరుచుకొనే అద్భుతమైన సదుపాయం, డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లవలసిన అవసరం లేకపోవడం, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసే వీలుండడంతో వాహనదారులు ఈ యాప్‌ను ఇష్టపడుతున్నారు. ఈ యాప్ ఉంటే అన్నిరకాల డాక్యుమెంట్లు జేబులో ఉన్నట్లే లెక్క. డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ వంటి వివిధ రకాల సర్టిఫికెట్లను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకొనేవిధంగా రవాణాశాఖ ఎం–వాలెట్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొబైల్ యాప్ ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది వాహనదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. డాక్యుమెంట్లను ఎం–వాలెట్లో భద్రపరుచుకున్నారు. ఈ వాలెట్‌కు రవాణాశాఖ చట్టబద్ధత కల్పించడంతో అనూహ్యంగా డిమాండ్ నెలకొంది. ఇటీవల కేంద్రంకూడా ఈ వాలెట్‌ను గుర్తించింది. దీంతో దేశంలో ఎక్కడైనా ఎం–వాలెట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ యాప్ తాజాగా మరోసారి వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్తగా సవరించిన రోడ్డు భద్రతా చట్టం దృష్ట్యా మరో సారి ఎం–వాలెట్‌కు డిమాండ్ ఏర్పడింది. ఒక్క వాలెట్ చాలు... రోడ్డు భద్రత నిబంధనలను సవరిస్తూ కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త చట్టంతో వాహనదారులంతా అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధిస్తూ ఈ చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. వివిధ రకాల ఉల్లంఘనలపై రూ.1000 నుంచి రూ.10,000 వరకు జరిమానాలు విధించే అవకాశం ఉన్న దృష్ట్యా వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కేంద్రం విధించిన జరిమానాలను తగ్గించి అమలు చేసే అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఏ క్షణంలోనైనా కొత్త చట్టంకొరడా ఝళిపించే అవకాశం ఉంది. పైగా ప్రభుత్వం జరిమానాలను కొంతమేరకు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్న పెనాల్టీల కంటే పెద్ద మొత్తంలోనే భారం పెరగనుంది. దీంతో వాహనదారులు ఇప్పటి నుంచే కొత్త చట్టానికి అనుగుణంగా నిబంధనలను పాటిస్తున్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ వంటి వివిధ రకాల డాక్యుమెంట్లపైన కూడా శ్రద్ధ చూపుతున్నారు. దీంతో మూడేళ్ల క్రితమే రవాణాశాఖ అమల్లోకి తెచ్చిన ఎం–వాలెట్ వాహనదారులకు ఎంతో ఉపయోగంగా మారింది. అన్ని రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ పత్రాల రూపంలో ఈ వాలెట్ ద్వారా భద్రపరుచుకుంటున్నారు. గత వారం రోజుల్లో సుమారు 15 వేల మందికి పైగా వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో ఎం–వాలెట్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు అంచనా. 33 లక్షలకు పైగా వాహనదారులు మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఎం–వాలెట్ వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం 33.31 లక్షలకు పెరిగింది. ఈ వాహనదారులు 68.81 లక్షల డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఎక్కువ శాతం డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ పత్రాలు, ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఆ తరువాత పర్మిట్లు, ఫిట్నెస్ పత్రాలను ఎక్కువ మంది తమ మొబైల్ ఫోన్లలో ఎం–వాలెట్ యాప్ ద్వారా భద్రపరుచుకున్నారు. త్వరలో కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లను కూడా ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. మరోవైపు తమ వాహనాలపైన నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలను సైతం ఈ యాప్ ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో చెల్లించే సదుపాయం ఉంది. తెలంగాణతో పాటు దేశంలో ఎక్కడైనా సరే ఎం–వాలెట్లో ఉన్న ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లకు చట్టబద్ధతను కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో ఈ వాలెట్ వినియోగం బాగా పెరిగింది. ఆన్లైన్ సేవల వినియోగంలో రవాణాశాఖ దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రవాణాశాఖలో ఇటీవల కాలంలో స్మార్ట్‌కార్డులకు పెద్ద ఎత్తున కొరత ఏర్పడింది, స్టేషనరీ మెటీరియల్ లేకపోవడంతో లక్షలాది స్మార్ట్ కార్డుల ముద్రణ నిలిచిపోయింది. దీంతో ఎం–వాలెట్ వినియోగం మరింత పెరిగిపోయింది. -
దళారులకు కేరాఫ్ రవాణాశాఖ !
సాక్షి, కరీంనగర్ : అవినీతి, అక్రమాలకు రవాణా శాఖ కార్యాలయం నిలయంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ మొదలుకొని వాహనాల రిజిస్ట్రేషన్ వరకు ఇక్కడికి వచ్చే సామాన్యులు దళారుల ద్వారానే పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజీవ్ రహదారి వంటి స్టేట్హైవేతోపాటు ఆదిలాబాద్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు అనుసంధానంగా ఉన్న తిమ్మాపూర్‌లోని కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్లదే పెత్తనం. అధికారులు, దళారులతో కుమ్మక్కై లక్షలు దండుకుంటున్నారు. ప్రతిరోజు దాదాపు 70వరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగే ఈ కార్యాలయంలో రవాణాశాఖ అధికారులు ‘లెక్కలు’ చూసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పునర్విభజన తరువాత పాత కరీంనగర్ నాలుగు కొత్త్త జిల్లాలుగా ఏర్పాటు కావడంతో పనిచేసే అధికారులు, సిబ్బందితోపాటు ఏజెంట్లు కూడా కొత్త జిల్లాలను పంచుకున్నారు. అయినా.. రిజిస్టేషన్ల సంఖ్యతోపాటు ఆదాయంలో కూడా కరీంనగర్ జిల్లానే టాప్‌గా నిలిచింది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కరీంనగర్ జిల్లా హోదాకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి(డీటీసీ)ని నియమించాల్సి ఉన్నప్పటికీ, ఆరేళ్లుగా ఇన్చార్జిల పాలనే సాగుతుండడంతో అధికారులు, సిబ్బందిపై నిఘా లేకుండా పోయింది. దారుణం ఏంటంటే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు డీటీసీని నియమించి కరీంనగర్‌కు ఆయనను ఇన్చార్జిగా నియమించడం. జిల్లాలో ఒకే ఒక్కడుగా కొనసాగిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గౌస్‌పాషా ఇటీవలే అవినీతి ఆరోపణలపై కమిషనర్ కార్యాలయానికి సరెండర్ అయ్యారు. వాహనాలను తనిఖీ చేయడం ద్వారా లక్షలు వసూళ్లు చేసిన సదరు అధికారి తాజాగా ‘గూగుల్ పే’ వంటి అధునాతన ఆన్లైన్ లావాదేవీలను కూడా ఉపయోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది. సహాయ ఎంవీఐ ఒక్కరే మిగిలారు. సిబ్బంది పాత్ర షరా మామూలే. ఏజెంట్ల నుంచి వచ్చిన కాగితాలే ఫైనల్ అనే చందంగా రవాణాశాఖ కార్యాలయంలో ప్రస్తుత ధోరణి నెలకొంది. లైసెన్సుల మంజూరు నుంచి వాహనాల తనిఖీ వరకు అంతటా డబ్బులే రాజ్యమేలుతున్నాయి. ఇన్చార్జి అధికారులే ఇక్కడ..! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గానీ, విభజన తరువాత కరీంనగర్లో గానీ రెగ్యులర్ ఆర్టీవో/డీటీసీలు లేరు. 2012 నుంచి 2014 వరకు దుర్గా ప్రమీల ఆర్టీవోగా పనిచేశారు. కరీంనగర్‌కు ఈమెనే రెగ్యులర్ ఆర్టీవోగా పనిచేసిన చివరి అధికారి. ఆ తర్వాత వచ్చినవారంతా ఇన్‌చార్జీలే. 2014–17 వరకు వినోద్‌కుమార్ ఇన్చార్జి డీటీసీగా కొనసాగారు. ఆయన తరువాత 2017 నుంచి 2018 వరకు కొండల్రావు, 2018 నుంచి 2019 వరకు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రస్తుతం శ్రీనివాస్ ఇన్చార్జి అధికారులుగానే ఉన్నారు. మొన్నటి వరకు ఇద్దరు రెగ్యులర్ ఏఎంవీఐలు ఉండగా, ఇటీవల ఏఎంవీఐ గౌస్‌పాషా గూగుల్ పే ద్వారా రూ.5 వేలు లంచం తీసుకోవడంతో అతడిని రవాణాశాఖ కమిషనర్‌కే సరెండర్ చేశారు. ప్రస్తుతం రజినీదేవి ఒక్కరే ఇక్కడ రెగ్యులర్ అధికారి. గౌస్‌పాషా సరెండర్ తర్వాత పెద్దపల్లి రవాణా శాఖ కార్యాలయం నుంచి ఫారూఖ్‌ను తాత్కాలికంగా కరీంనగర్‌కు ఏఎంవీఐగా నియమించారు. లంచాల కోసం పీడింపు.. కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చేవారికి లర్నింగ్ లైసెన్స్ నుంచే లంచాల బెడద మొదలవుతుంది. లెర్నింగ్ తరువాత రెగ్యులర్ లైసెన్స్, వాహనాల రోడ్ టాక్స్, ఫిట్నెస్ వరకు రూ.వేలల్లో లంచాలు దండుకుంటున్నారు. రూ.450 లెర్నింగ్ ఫీజకు రూ.600, రూ.2,000 పర్మినెంట్ లైసెన్స్‌కు రూ.6 వేలు, రిజిస్టేషన్‌కు ఫీజు కాకుండా ద్విచక్రవాహనాలకు రూ.300, ఫోర్ వీలర్స్‌కు రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఫిట్నెస్ పరీక్షకు వచ్చే వాహనాలను వివిధ కారణాలు సాకుగా చూపి వేలాది రూపాయలు మామూళ్లు వసూలు చేస్తున్నారు. వాహనాల తనిఖీ పేరిట జరిగే తతంగం పూర్తిగా లంచాల వసూళ్లకేనని ఇటీవల ఎంవీఐ సరెండర్‌తో జిల్లా వాసులకు తెలిసిపోయింది. విద్యాసంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్, లారీలు, ట్రక్కుల పన్ను వసూళ్లు, ఓవర్ లోడింగ్ తదితర విషయాల్లో రవాణా శాఖ సిబ్బంది మామూళ్ల పర్వం అగ్రభాగానికి వెళ్లిపోయింది. అంతా ఏజెంట్లదే.. రవాణాశాఖ కార్యాలయంలో సుమారు 15 మంది ఏజెంట్లు రాజ్యమేలుతన్నారు. కార్యాలయం తెరవకముందే ఏజెంట్లు తిష్టవేస్తారు. అప్పటికే అక్కడకు వచ్చిన వాహనదారులతో, లైసెన్సుల కోసం వచ్చే వారితో బేరాలు మాట్లాడుకోవడం, తమను కాదని వెళితే లైసెన్స్ గానీ, వాహనం రిజిస్ట్రేషన్ గానీ కాదని హెచ్చరించి మరీ రోజువారీ సెటిల్మెంట్లు చేసుకుంటారు. అధికారులు 10:30 నుంచి 11 : 30 గంటల సమయంలోనే కార్యాలయానికి రావడం సర్వసాధారణమైంది. అప్పటికే ఆ రోజు ఇచ్చే లైసెన్సులు, చేసే రిజిస్ట్రేషన్లు, ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికెట్లకు సంబంధించి సెట్ చేసే ఏజెంట్లు అధికారులు రాగానే వారి గదుల్లోకి నేరుగా వెళ్లి మరీ, కమీషన్ ముట్టజెప్పి పనికానిచ్చేస్తారు. కార్లు, ట్రక్కులు, ఇతర పెద్ద వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఏజెంట్ల ద్వారానే సాగుతుండగా, డ్రైవింగ్ లైసెన్సులకు కూడా ఏజెంట్లే తప్పనిసరిగా మారిందనే విమర్శలున్నాయి. పంపకాల్లో అటెండర్ నుంచి అధికారి వరకు... ఏజెంట్ ఇచ్చే మామూళ్లు కార్యాలయంలో పని చేసే అటెండర్ నుంచి కార్యాలయంలోని అసలు బాస్ వరకు అందరికీ ముడతాయనేది బహిరంగ రహస్యం. కార్యాలయానికి వచ్చిన వారి తో మాట్లాడుకున్న బేరం ప్రకారం ఏజెంట్ల నుంచి వెళ్లిన పత్రాలను పరిశీలించి, ఏజెంట్ల నుంచి వచ్చిన వాటికే ఆమోదముద్ర తెలపడం, మిగతా దరఖాస్తులకు కొర్రీలు విధించడం సా ధారణంగా మారింది. ఫైల్‌పై కోడ్‌భాషలో ఇచ్చే ఇండికేషన్ అధికారులు గమనించి, సంతకాలు చేస్తారు. ఈ నేపథ్యంలో నేరుగా వెళ్లినా పని కా దని నిర్ణయానికి వచ్చిన వారు తిరిగి ఏజెంట్లనే నమ్ముకోవడం సర్వసాధారణంగా మారింది. జిరాక్స్ సెంటర్లే అడ్డా.. జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు అడ్డాగా చేసుకుని ఏజెంట్లు దందా నడిపిస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్ల సిబ్బంది కొంతమంది ఏజెంట్లతో కుమ్మక్కై బే రం మాట్లాడుతున్నారు. వచ్చిన దాంట్లో పంచుకోవడం మామూలుగా మారింది. బేరం రాగానే వారి ఏజెంట్‌కు సమాచారం అందించడంతోపాటు స్లాట్‌బుక్ చేయడం.. నుంచి సర్టిఫికెట్ జారీ చేసే వరకు అంతా వారిదే రాజ్యం. -
ఆర్టీఏ..ఈజీయే!
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ అందించే వివిధ రకాల పౌరసేవల్లో పెనుమార్పులు రానున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. దాదాపు 37 రకాల సేవలను మనం ఎంచక్కా ఇంట్లో కూర్చుని.. ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దీనికి సంబంధించిన నివేదిక ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉంది. అనుమతి వస్తే.. వెంటనే అమలే.. ఇంతకీ ఏంటా మార్పు.. వివరాలు ఇవిగో.. ఇప్పటివరకు.. అన్ని రకాల పౌర సేవల కోసం ఆన్లైన్లో స్లాట్ (సమయం, తేదీ) నమోదు చేసుకొని.. ఆన్లైన్లోనే ఫీజులు చెల్లించిన తరువాత నిర్దేశిత సమయం మేరకు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లవలసి వస్తుంది. సంబంధిత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. పత్రాల కోసం అటూ ఇటూ తిరగడాలు.. మధ్యవర్తులు, దళారుల హడావుడి.. చేతికి చమురు వదలడాలు ఇవన్నీ మామూలే.. ఇకపై.. ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. దళారుల బెడద ఉండదు. పాత డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, అలాగే అవసరమైన అన్ని రకాల పౌరసేవల్లో.. చిరునామాలో మార్పులు, చేర్పులు.. వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లను ఆన్లైన్లోనే పునరుద్ధరించుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యే వాహనాలకు నిరభ్యంతర పత్రం(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ఒకరి నుంచి మరొకరికి వాహన యాజమాన్యం బదిలీ, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు, లెర్నింగ్ లైసెన్స్ గడువు పొడిగింపు, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, డూప్లికేట్ ఆర్సీ, త్రైమాసిక పన్ను, గ్రీన్ ట్యాక్స్ వంటి వివిధ రకాల పన్ను చెల్లింపులు, హైర్ పర్చేస్ అగ్రిమెంట్, హైర్ పర్చేస్ టర్మినేషన్ వంటి సుమారు 37 రకాల పౌరసేవలను ఆన్లైన్లో పొందవచ్చు. ప్రస్తుతం వీటి కోసం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకొని ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సి వస్తుంది. ఇక నుంచి ఆ అవసరం ఉండదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం కావలసిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు.ఆర్టీఏ అధికారులు తమకు అందిన దరఖాస్తులు, డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం వినియోగదారులు కోరుకున్న సేవలను ఆన్లైన్లోనే అందజేస్తారు. వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు ఈ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ సదుపాయం లభిస్తుంది.దీంతో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సత్వరమే సేవలు లభించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఉద్యోగులపై కూడా పనిభారం తగ్గుతుందని చెబుతున్నారు. ఇవి మాత్రం ఎప్పటిలాగే.. ఆర్టీఏ అధికారులు స్వయంగా పరీక్షించి అందజేసే లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ పరీక్షలు వంటి వాటి కోసం అధికారులను సంప్రదించవలసి ఉంటుంది.లెర్నింగ్ లైసెన్సు కోసం ఇప్పుడు ఉన్న పద్ధతిలోనే ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకొని ఫీజు చెల్లించి వెళితే పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ఇది తీసుకున్న తరువాత నెల నుంచి 6 నెలలోపు మరోసారి డ్రైవింగ్ లైసెన్సు కోసం స్లాట్ నమోదు చేసుకొని, ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలి. లారీలు, బస్సులు, ఆటోలు తదితర ప్రయాణికుల, సరుకుల రవాణా వాహనాలకు ఏడాదికి ఒకసారి అందజేసే ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం స్వయంగా అధికారులను సంప్రదించవలసి ఉంటుంది. -
ఆర్టీఏ.. అదంతే!
‘హలో సార్.. నాలుగు నెలల క్రితం డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్వహించిన పరీక్షలో పాస్ అయ్యాను. వారం రోజుల్లో లైసెన్స్ నేరుగా ఇంటికే వస్తుందన్నారు. ఇప్పటి వరకు రాలేదు’ ఇదో వాహనదారుడి ఆందోళన. ‘కొత్త బండి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆరు నెలలైంది.ఇంకా ఆర్సీ రాలేదు. ట్రాఫిక్ పోలీసులుఇబ్బందులకుగురిచేస్తున్నారు’ మరో వాహనదారుడి ఆవేదన. ‘వాహనం అడ్రస్ మార్పు కోసం అధికారులనుసంప్రదిస్తే సరైన స్పందన లేదు. పట్టించుకునేవాళ్లే లేరంటూ’ నగర శివార్లలోని ఒక ఆర్టీఏకార్యాలయంలో ఎదురైన పరిస్థితిపైఓ మహిళ విస్మయం. సాక్షి, సిటీబ్యూరో: ఇలా ఒక్కరో, ఇద్దరో కాదు. లక్షలాది మంది వాహనదారులు ఆర్టీఏ పౌరసేవల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి, నిబంధనల మేరకు అన్ని డాక్యుమెంట్లను అందజేసినప్పటికీ డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు తదితర పౌరసేవలు లభించక నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2.15 లక్షల ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకుండా పెం డింగ్ జాబితాలో ఉన్నట్లు అంచనా. ఒకట్రెండు ఆర్టీఏ కార్యాలయాల్లో సత్వరమే పరిష్కారం లభిస్తున్నప్పటికీ చాలాచోట్ల అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. ఆర్టీఏ పౌరసేవలపైన నిర్దిష్టమైన కాలపరిమితిని విధించారు. అంతర్రాష్ట్ర బదిలీలపైన మాత్రమే 30 రోజుల గడువు విధించారు. మిగతా అన్ని రకాల పౌరసేవలు... ముఖ్యం గా డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, అడ్రస్ మార్పులు తదితర వారం, పది రోజుల్లో లభించే విధంగా సిటిజన్ చార్టర్‌ను రూపొందించారు. కానీ అది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. వారంరోజుల కాలపరిమితి 6 నెలల వరకు కొనసాగడం గమనార్హం. ఎందుకిలా.? రవాణాశాఖ పౌరసేవలపై వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో పటిష్టమైన ఆన్లైన్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఓజీఆర్టీఎస్) ఏర్పాటు చేశారు. వాహన వినియోగదారులు ఆర్టీఏ వెబ్‌సైట్‌లోని ‘సిటిజన్ చార్టర్ కంప్లయింట్స్’ను ఎంపిక చేసుకొని తమ ఫిర్యాదును తెలియజేయవచ్చు. అలాగే బీఎస్ఎన్ఎల్ ద్వారా స్వీకరించేందుకు ‘1100’, ఇతర ఫోన్ల నుంచి స్వీకరించేందుకు ‘18004251110’ అనే రెండు టోల్‌ఫ్రీ నంబర్లను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. జిల్లాల విభజన వరకు ఈ వ్యవస్థలు సక్రమంగానే పని చేశాయి. వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదుల్లో చాలా వరకు అప్పటికప్పుడు పరిష్కరించడమో లేదా ఎప్పటిలోగా తమ సమస్యను పరిష్కరిస్తారో తెలియజేసేవారు. కానీ 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి, పైస్థాయి ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం కొరవడింది. అన్ని చోట్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నప్పటికీ వాటికి ప్రాంతీయ రవాణా అధికారులు, యూనిట్ మోటారు వాహన ఇన్స్పెక్టర్ల స్థాయిలో పరిష్కారాన్ని సాధించడంలో ఓజీఆర్ఆటీఎస్ వ్యవస్థ విఫలమైంది. దీంతో ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెండింగ్ జాబితాలో చేరిపోయాయి. మరోవైపు తమకు సకాలంలో సరైన పరిష్కారం లభించకపోవడంతో వినియోగదారులు పదే పదే ఫిర్యాదులు చేయడం కూడా మరో కారణం. ఇదే అసలు సమస్య.. వినియోగదారుల సమస్యల పరిష్కారంలో కిందిస్థాయి నుంచి పైవరకు సమన్వయ లేమితో పాటు ఇటీవల కాలంలో డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కార్డులు (ఆర్సీలు) ముద్రించేందుకు అవసరమైన కార్డులు, రిబ్బన్ల కొరత మరో ప్రధానమైన సమస్యగా మారింది. రవాణాశాఖకు స్టేషనరీ అందజేసే ప్రైవేట్ సంస్థలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో సుమారు రూ.7 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సదరు సంస్థలు కార్డులు, రిబ్బన్ల పంపిణీకి చేతులెత్తేయడంతో వినియోగదారులకు సకాలంలో అందజేయలేకపోయారు. కేవలం వారం రోజుల్లో అందాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల కోసం 4 నెలల నుంచి 6 నెలలకు పైగా ఎదురుచూస్తున్న వినియోగదారులు కూడా ఉన్నారు. మంత్రి సమీక్షతో కదలిక.. ఇటీవల రవాణాశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్డుల పంపిణీ స్తంభించిపోవడం, స్టేషనరీ కొరత, ప్రింటర్లు, స్కానర్లు లేకపోవడం, పనిచేయని కంప్యూటర్లు తదితర అంశాలను పరిశీలించారు. వాహనదారుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా ఓజీఆర్టీఎస్ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. మరోవైపు తేలిగ్గా ఫిర్యాదు చేసేందుకు ఒక వాట్సప్ నంబర్‌ను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ‘కొద్ది రోజుల క్రితమే కొత్త ప్రింటర్లు, స్కానర్లు, స్టేషనరీ వచ్చాయి. త్వరలోనే వాహనదారుల సమస్యలన్నింటినీ పరిష్కస్తాం’ అని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
గ్రేటర్లో నకిలీ పాలసీల దందా
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు బీమా సంస్థలు, వాహన యజమానులు పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదన పరిహాసానికి తావిస్తోంది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రహదారి భద్రతా బిల్లులో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించే లక్ష్యంతో వాహన బీమాపై దృష్టి కేంద్రీకరించారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ప్రమాదానికి పాల్పడిన వాహన యజమానులు, బీమా సంస్థలే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలకు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రమాదబీమాపై ఇప్పటికే నీలినీడలు అలుముకొని ఉన్నాయి. గ్రేటర్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న నకిలీబీమా సర్టిఫికెట్ల దందా రహదారి భద్రతకు తూట్లు పొడుస్తోంది. ఆటోలు, కాబ్‌లు, మెటడోర్లు, టాటాఏస్‌లు, మినీ బస్సులు, డీసీఎంలు, వ్యాన్లు, లారీలు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, తదితర అన్ని ప్రజారవాణా, సరుకు రవాణా వాహనాలకు ప్రతి సంవత్సరం నిర్వహించే ఫిట్నెస్ పరీక్షల్లో నకిలీ బీమా సర్టిఫికెట్లే రాజ్యమేలుతున్నాయి. వాహనాల ఫిట్నెస్ సమయంలో వాటి యజమానులు, ట్రావెల్స్ సంస్థలు, ఏజెంట్లు సమర్పించే బీమా సర్టిఫికెట్లు కేవలం నకిలీవని, ఏ ప్రామాణికమైన బీమాసంస్థకు చెందినవి కావని తెలిసి కూడా ఆర్టీఏ అధికారులు యధేచ్చగా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. ఇలా నకిలీ బీమా పత్రాల ఆధారంగా ఫిట్‌నెస్‌పై ధృవీకరణ పొందే వాహనాలు ప్రమాదాలకు పాల్పడితే బాధితులకు ఎలాంటి పరిహారం లభించే అవకాశం ఉండదు. సదరు వాహనం ఏ బీమా సంస్థకు ప్రీమియం చెల్లించకుండానే తిరుగుతున్న దృష్ట్యా ప్రమాద బీమా వర్తించదు. నగరంలోని అన్ని ఆర్టీఏ కేంద్రాల పరిధిలో నకిలీ బీమా దందా యధేచ్చగా కొనసాగుతున్నప్పటికీ ఆర్టీఏ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాహన యజమానులు, దళారులు కుమ్ముక్కై సాగిస్తున్న ఈ అక్రమ దందాకు ఊతమిచ్చేవిధంగా ఈ నిర్లక్ష్యం కొనసాగుతోంది. క్యూఆర్ సృష్టించేస్తారు... వ్యక్తిగత వాహనాల బీమా విషయంలో వాహనదారులు నిర్లక్ష్యం చేస్తే ఆ నష్టం వారికే పరిమితమవుతుంది. అయినప్పటికీ కొత్త వాహనాల కొనుగోలు సమయంలోనే బీమా సంస్థలు కార్లు, బైక్‌లు, తదితర వ్యక్తిగత వాహనాలకు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు వర్తించే విధంగా ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని తీసుకొని బీమా ధృవపత్రాలను అందజేస్తున్నాయి. కానీ రవాణా వాహనాలకు ఇది సాధ్యం కాదు. ఈ వాహనాలు ప్రతి సంవత్సరం ఆర్టీఏ నుంచి సామర్ధ్య ధృవీకరణను పొందాల్సి ఉంటుంది. ఆ సమయంలో బీమా సర్టిఫికెట్ తప్పనిసరి. కానీ ప్రయాణికుల సీట్ల సామరŠాధ్యన్ని అనుసరించి ఒక్కో వాహనం రూ.5000 నుంచి రూ.15000 వరకు ప్రీమియం చెల్లించి అధీకృత బీమా సంస్థల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఈ ప్రీమియం మొత్తాన్ని ఎగవేసేందుకే వాహనదారులు ఆర్టీఏ ఏజెంట్ల సహకారంతో మార్కెట్లో కేవలం రూ.500 నుంచి రూ.1000లకు ఒకటి చొప్పున లభించే నకిలీ బీమా పత్రాలను సమర్పిస్తున్నారు. ఈ పత్రాలను తయారు చేసే క్రమంలో సదరు వ్యక్తులు క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్‌ను కూడా కంఫ్యూటర్ ఆధారంగా సృష్టిస్తున్నారు. రకరకాల పేర్లతో రూపొందించే ఈ పత్రాలు పూర్తిగా నకిలీవేనని తెలిసినప్పటికీ ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏజెంట్ల ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తును గుడ్డిగా ఆమోదిస్తూ రహదారి భద్రతను పాతరేస్తున్నారు. తమకు కనిపించే బీమా పత్రాలు నకిలీవేనని తెలిసినప్పటికీ తప్పుడు క్యూఆర్ కోడ్‌ను పరిగణనలోకి తీసుకొని వదిలేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో తరచుగా ఇలాంటి నకిలీలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం అన్ని రకాల వాహనాలు సుమారు 55 లక్షల వరకు ఉన్నాయి. సుమారు 35 లక్షల ద్విచక్ర వాహనాలు,మరో 15 లక్షల కార్లు వ్యక్తిగత కేటగిరీకి చెందినవి కాగా, మరో 5 లక్షల వాహనాలు పూర్తిగా రవాణా కేటగిరీకి చెందినవి. వీటికి ప్రతి సంవత్సరం ఫిట్నెస్ తప్పనిసరి. లక్షా 50 వేల ఆటోలు, సెవెన్ సీటర్ ఆటోలు, మరో 2 లక్షల లారీలు, ఇవి కాకుండా ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, వ్యాన్లు, తదితర అన్ని కేటగిరీలకు చెందిన ప్రజా రవాణా, సరుకు రవాణా వాహనాలలో 60 శాతానికి పైగా నకిలీ బీమా పత్రాల ఆధారంగానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. -
ఆర్టీఏ కార్డుల జారీలో జాప్యాన్ని నివారించాలి
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్స్, రిజిస్ట్రేషన్ కార్డుల జారీలో నెలకొన్న జాప్యాన్ని పక్షం రోజుల్లో నివారించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమస్య తీవ్రంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మంచిర్యాల జిల్లాల కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.30 లక్షల కార్డుల జారీ పెండింగ్‌లో పడిన నేపథ్యంలో వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన రవాణా శాఖ అధికారులతో సమీక్షించారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, జేటీసీలు రమేశ్, పాండురంగ నాయక్, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సంబంధిత కాంట్రాక్టర్ ఆ కార్డుల జారీకి కావాల్సిన రిబ్బన్లను సరఫరా చేయకపోవటంతో సమస్య తలెత్తిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్య తీవ్రంగా ఉన్న నాలుగు జిల్లాల కార్యాలయాలకు మూడు రోజుల్లో కార్డుల జారీకి కావాల్సిన సరంజామాను సరఫరా చే యాలని మంత్రి ఆదేశించారు. పక్షం రోజు ల్లో ఆ నాలుగు జిల్లాల్లో పెండింగ్‌ను క్లియర్ చేయాలని తెలిపారు. సాధారణ ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకంగా ఓ వ్యక్తిని కేటాయించి ఓ ల్యాండ్ లైన్ నంబరు, వాట్సాప్ నంబర్, ఈమెయిల్ ఐడీ కేటాయించాలని సూచించారు. ఆన్లైన్ సేవల పరిశీలనకు కమిటీ.. ప్రస్తుతం రవాణా శాఖ అందిస్తున్న ఆన్లైన్ సేవల తీరును పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్టీఏ మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తేవాలని తెలిపారు.కమిషనర్ అధ్యక్షతన ఏర్పడే ఈ కమిటీ పక్షం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం ఆయన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. -
రవాణాశాఖ మంత్రి మందలించినా మారని తీరు
సాక్షి, అనంతపురం టవర్ క్లాక్: వాహనదారులకు పారదర్శక సేవలు అందించాలన్న లక్ష్యంతో రవాణాశాఖలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చినా అవినీతిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. కార్యాలయ సమీపంలో తిష్టవేసిన దళారులే కథ అంతా నడిపిస్తున్నారు. వారి ద్వారా వెళ్లే ఫైల్లు మాత్రమే ఆమోదం పొందుతున్నాయి. నేరుగా వాహనదారులు ఎల్ఎల్ఆర్, వాహన రిజిస్ట్రేషన్‌కు వెళితే...నిబంధనల పేరుతో అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. అదే దళారుల ద్వారా వెళితే నిమిషాల్లో పనిచేసి పెడుతున్నారు. దందా సాగుతోందిలా.. ఒకరిపేరుతో ఉన్న వాహనాన్ని మరొకరి పేరుపైకి మార్చేందుకు గానీ, వాహనానికి ఎఫ్‌సీ చేయించేందుకు కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసేటప్పడు మెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంది. ఈ మెయిల్ ఐడీనే దళారులు దందాకు ఉపయోగించుకుంటున్నారు. వాహనదారుడి మెయిల్ ఐడీకి బదులుగా ఏజెంట్ పేరుతో ఉన్న మెయిల్ ఐడీని ఇస్తారు. అధికారులకు కూడా ఇదే సీక్రెట్ కోడ్‌గా మారింది. ఏ మెయిల్ నుంచి ఎన్ని వాహన రిజిస్ట్రేషన్లు, ఎల్‌ఎల్‌ఆర్‌లు, ఎఫ్‌సీ, లైసెన్స్ రెన్యూల్స్ వచ్చాయో తెలుసుకుంటున్న అధికారులు.. దళారులను ఏజెంట్ల వద్దకు పంపి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో ఈ దందా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఒక్కో పనికి ఒక్కోరేటు ఆర్టీఏలో పనినిబట్టి ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. చిన్న వాహనాలకు ఒక రేటు, పెద్ద వాహనాలకు ఒక రేటు నిర్ణయించారని సమాచారం. ఆన్లైన్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా, దళారులు, అధికారులకు ఇవ్వాల్సిన మామూళ్లలతో పాటు తాము తీసుకునే మొత్తాన్ని ఏజెంట్లు వాహనదారుల నుంచి ముక్కు పిండి వసూళ్లు చేస్తారు. ఎల్ఎల్ఆర్, పర్మినెంట్ లైసెన్స్ వరకూ భారీగా వసూళ్లు చేస్తున్నారు. ఇక ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) పొందేందుకు వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి. ఒక్కో లగేజీ ఆటో ఎఫ్‌సీ చేసేందుకు ప్రభుత్వ చలానా, ఏజెంటు, దళారి మామూళ్లతో పాటు అధికారులకు ఇచ్చే ముడుపు అంతా కలిపితే రూ.5,200 నుంచి రూ.6 వేలు వరకు తీసుకున్నట్లు సమాచారం. పెద్ద వాహనాలకు ఎఫ్‌సీ చేయించాలంటే రూ.10 వేలు నుంచి రూ. 15 వేలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బస్సుకు ఎఫ్‌సీ చేయించాలంటే అధికారులకే రూ. 3 వేలు అదనంగా ఇవ్వాల్సి ఉంటోందని వాహనదారులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాల వాహనాల బదిలీకి భారీరేటు ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలను ఇక్కడకి బదిలీ చేయించాలంటే భారీగా ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇతర రాష్ట్ర వాహనాలను కొనుగోలు చేయగానే వాహనం ఐడీఎల్ రద్దు అవుతుంది. అక్కడి నుంచి ఎన్ఓసీ తీసుకుని మన రాష్ట్రంలోకి ఆ వాహనం తీసుకురావచ్చు. ఆ ఎన్ఓసీ ఒక్కరోజు మాత్రమే పని చేస్తుంది. ఆ తర్వాత బదిలీ చేయించుకొన్న తర్వాతే వాహనం రోడ్డు మీద తిప్పాల్సి ఉంటుంది. ఇలా ఇతర రాష్ట్రాల వాహనాలు బదిలీ చేసే సమయంలో ఏజెంట్లు భారీగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రవాణాశాఖ మంత్రి హెచ్చరించినా... ఆర్టీఏలో జరుగుతున్న అవినీతి తంతుపై కొందరు ఫిర్యాదు చేయగా..నేరుగా రవాణ శాఖ మంత్రే ఉన్నతాధికారికి ఫోన్ చేసి హెచ్చరించారు. అయినప్పటికీ కార్యాలయంలో వసూళ్ల దందా మాత్రం ఆVýæకపోవడం విశేషం. 50కి పైగా ఏజెంట్ కార్యాలయాలు ఆర్టీఏ కార్యాలయం సమీపంలో 10కిపైగా ఆన్లైన్ సెంటర్లు, 50కిపైగా ఏజెంట్ కార్యాలయాలు ఉన్నాయి. ఏజెంటు కార్యాలయాలన్నీ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోనే హమాలీకాలనీలో నివాసాల మధ్య ఏర్పాటు చేశారు. ఆర్టీఏ కార్యాలయంలో దళారుల నుంచి వెళ్లిన ఫైల్లు మాత్రమే అధికారులు ఆమోదిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా వాహనదారుడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని నేరుగా కార్యాలయంలోకి వెళితే వారి పనులు జరగలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడి బస్సుల ఎఫ్సీలోనూ చేతివాటం జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 1,226 స్కూల్ బస్సులున్నాయి. వీటిలో వాడుకలో ఉన్నవి 1,060 బస్సులని అధికారులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటి దాకా 770 బస్సులు మాత్రమే ఎఫ్‌సీ సర్టిఫికెట్ పొందాయి. ఇంకా 456 బస్సులు ఎఫ్‌సీ చేయించుకోవాల్సి ఉంది. ఒక్కో బస్సు ఎఫ్సీకి దళారుల ద్వారా రూ.3 వేల వరకూ అధికారులు వసూలు చేసినట్లు సమాచారం. ఆన్లైన్ సేవలతో దళారులకు చెక్ పెట్టాం ఆర్టీఏలో దళారులకు చెక్ పెట్టేందుకు సేవలన్నీ ఆన్లైన్ చేశాం. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఆన్లైన్లో డబ్బు చెల్లించి వాహనదారులు సేవలు పొందవచ్చు. అధికారుల పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తుంటే నాకు ఫిర్యాదు చేయవచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాను. ఇతర రాష్ట్రాల వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో దళారులు పెద్ద ఎత్తున డబ్బు తీసుకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. – సుందర్‌వద్దీ, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ -
బాధ్యత ఎవరిది..?
సాక్షి, సిటీబ్యూరో: మరో విద్యా సంవత్సరం మొదలైంది... పాఠశాలలు పునఃప్రారంభమ య్యాయి... నగరంలో స్కూలు బస్సులకు అనేక రెట్లు ఆటోల్లో విద్యార్థుల రవాణా జరుగుతోంది... వీటిలోనూ ఆరుగురి కంటే ఎక్కువ తరలించరాదంటూ మరి కొన్ని నిబంధనలు విధించిన సర్కారు చేతులు దులుపుకుంది... ఈ అంశాలపై అధికారులు ప్రత్యేక డ్రైవ్స్ కూడా చేస్తున్నారు... ఇక్కడి వరకు బాగానే ఉన్నా... కొన్ని కీలకమైన అంశాలను అన్ని విభాగాలు విస్మరిస్తుండటం సమస్యలకు తావిస్తోంది. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 3 వేల స్కూళ్లు..వెయ్యి స్కూల్ బస్సులు నగరంలోని కొన్ని ‘ఖరీదైన’ స్కూళ్లు మినహా మిగిలిన వాటికి సొంత రవాణా వ్యవస్థ లేదు. ప్రముఖ పాఠశాలలు సైతం ఈ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. గతంలో సొంతంగా రవాణా సౌకర్యాన్ని కల్పించిన కొన్ని స్కూళ్లు ఇప్పుడు దానిని విస్మరించాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం నగరంలో 3 వేలకు పైగా స్కూళ్లు ఉండగా... ఆర్టీఏ లెక్కల ప్రకారం కేవలం వెయ్యి స్కూల్ బస్సులు మాత్రమే ఉన్నాయి. అంటే... స్కూలుకు ఒక బస్సు లెక్కన వేసుకున్నా రెండు వేల స్కూళ్లకు లేవన్నమాట. ఫలితంగా విద్యార్థులను ఆటోలు తదితర వాహనాల్లో స్కూళ్లకు పంపించాల్సి వస్తోంది. ప్రతి స్కూలు తమ విద్యార్థులకు ట్రాన్స్‌ఫోర్స్ ఫెసిలిటీ కల్పించాలన్నది కచ్చితం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. తల్లిదండ్రులు తదితరులు సొంతంగా తీసుకువచ్చి దింపే విద్యార్థులు మినహా మిగిలిన వారు స్కూలు బస్సుల్లోనే ప్రయాణించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై అధికారులు శ్రద్ధ చూపడం లేదని ఆరోపిస్తున్నారు. ఆటోల వీర బాదుడు... దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల చేతిలో మోసపోకూడదని భావిస్తున్న ట్రాఫిక్ పోలీసులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రీ పెయిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడో ఒకసారి నగరానికి వచ్చే వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న వారు అనునిత్యం ఆటోవాలాల చేత దోపిడీకి గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. స్కూలు పిల్లలను తరలించే ఆటోల డ్రైవర్లు దూరంతో నిమిత్తం లేకుండా భారీగా దండుకుంటున్నారు. సెలవులతో తమకు సంబంధం లేదని, మొత్తం 11 నెలలకూ చెల్లించాల్సిందేనంటూ వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్కూలు ఆటోలకు ఫేర్స్ (చార్జీలు) నిర్ణయించాల్సిన అవసరం కనిపిస్తోందని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆటో సేఫ్టీ గాలిలోనే... స్కూలు బస్సుల ఫిట్నెస్, డ్రైవర్లకు అర్హతలు అంటూ గొంతు చించుకుంటున్న ఆర్టీఏ, ఆటోల్లో ఆరుగురే అంటూ విరుచుకుపడుతున్న ట్రాఫిక్ అధికారులు ఆటోల ఫిట్నెస్ ను విస్మరిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి భారీగా వసూలు చేస్తూ పసి వాళ్లకు తరలించే ఆటోలకు సైడ్ డోర్స్, సేఫ్టీ మెష్‌లు మచ్చుకైనా కనిపించవు. వీటిలో అనేక ఆటోలు ఫిట్‌నెస్‌కు ఆమడ దూరంలో ఉంటున్నాయి. వీటి డ్రైవర్లూ ఆర్టీఏ నిర్ధేశించిన ప్రకారం ఉండట్లేదు. మరోపక్క తమ స్కూలుకు విద్యార్థులను తరలిస్తున్న ఆటోల వివరాలు, వాటి డ్రైవర్ల వ్యవహారం యాజమాన్యాలకు అసలే పట్టదు. ఈ నేపథ్యంలో స్కూల్ బస్సుల మాదిరి స్కూలు ఆటోలకూ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆటోలకు నిబంధలు అవసరం లేదా? స్కూలు బస్సుల విషయంలో నిబంధనలు వల్లెవేసే ఆర్టీఏ అధికారులు స్కూలు ఆటోల విషయంలో మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. సదరు ఆటోలు విద్యార్థులను తరలిస్తున్న సమయంలోనైనా దాన్ని సూచిస్తూ ముందు వెనుక చిన్న బోర్డులు ఏర్పాటు చేసేలా చూడాల్సి ఉంది. మాఫియాపై ఎవరిని ఆశ్రయించాలి? ఎవరైనా ప్రయాణికుడు ఓ ఆటోను ఫలానా చోటుకు రమ్మని పిలిస్తే కచ్చితంగా వెళ్లాల్సిందే. అలా కాని పక్షంలో సదరు ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆటో రిఫ్యూజల్ కింద జరిమానా విధిస్తారు. అయితే స్కూలు ఆటోల డ్రైవర్లు సాగిస్తున్న ‘మాఫియా’ వ్యవహారాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశంపై స్పష్టత లేదు. ఓ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్లు మాఫియాగా మారుతున్నారు. అక్కడున్న విద్యార్థిని ముందు ఓ ఆటోలో పంపించి... భద్రత నేపథ్యంలోనో, మరో కారణంగానో వేరే ఆటోకు మార్చాలని భావిస్తే అది గగనమే. దీనికి పాత ఆటో డ్రైవర్ అంగీకరించడు. కొత్తగా వస్తున్న వ్యక్తిని బెదిరించి మరీ తన కస్టమర్‌ను ‘కాపాడుకుంటాడు’. ఇది నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎదురవుతున్న పరిస్థితే అయినా... ఆర్టీఏ, ట్రాఫిక్ విభాగాల్లో ఎవరూ పట్టించుకోక... ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థకాక విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. కేవలం రిఫ్యూజల్ పైనే కాకుండా ట్రాఫిక్ పోలీసులు దీనిపైనా దృష్టిసారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
వేగానికి కళ్లెం
సాక్షి, సిటీబ్యూరో: రహదారులపై రవాణా వాహనాలు యమదూతల్లా దూసుకొస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి వాహనాలతో నిత్యం ఎక్కడో ఒక చోట రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. అపరిమితమైన వేగంతో పట్టపగ్గాల్లేకుండా పరుగులు తీసే రవాణా వాహనాలు తరచూ అదుపు తప్పి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎంతోమంది అమాయకులు మృత్యువాతపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని రవాణా శాఖ గుర్తించింది. ఇప్పటి వరకు జరిగిన అనేక రోడ్డు ప్రమాదాల్లో అపరిమితమైన వేగం కారణంగా డ్రైవర్లు వాటిని అదుపు చేయలేకపోతున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సులు, సరుకు రవాణా వాహనాలు, 8 సీట్ల మ్యాక్సీ క్యాబ్‌లు, పగటిపూట తిరిగే స్కూల్, కాలేజీ బస్సులు, చెత్త తరలింపు వాహనాలు, ట్యాంకర్లు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వేగనియంత్రణ పరికరాలు ఉండాల్సిందేనని కేంద్రం గతంలోనే చట్టం తెచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు వాహన యజమానులు ఈ చట్టాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయడంతో కొంతకాలం పాటు స్టే విధించారు. ప్రస్తుతం రహదారి భద్రత నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంపై రవాణాశాఖ సీరియస్‌గా దృష్టి సారించింది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా అన్ని రకాల రవాణా వాహనాలకు ఇక నుంచి స్పీడ్ గవర్నర్స్‌ను తప్పనిసరి చేయనున్నారు. స్పీడ్‌కు బ్రేక్.. వాహనాల వేగానికి కళ్లెం వేసేందుకు ఆగస్ట్ 1 నాటికి స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేసుకోవాల్సిందేనని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఆ లోగా స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేసుకోలేని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రవాణా శాఖ ఐటీ విభాగం జేటీసీ రమేష్ పేర్కొన్నారు. మొదట స్కూల్ బస్సులు, వ్యాన్లు, చెత్త తరలింపు వాహనాలు (డంపర్స్), ట్యాంకర్లు, మ్యాక్సీ క్యాబ్‌లపై చర్యలు తీసుకుంటారు. ఆయా వాహనాలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏఆర్ఏఐ (ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆమోదం పొందిన స్పీడ్ గవర్నర్స్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిస ఉంటుంది. స్పీడ్ గవర్నర్స్ లేని వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిలిపివేస్తారు. బైక్‌లు, ఆటోరిక్షాలు, క్వాడ్రా సైకిల్, పోలీస్ వాహనాలు, అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు మినహాయించి ఇతర అన్ని రకాల రవాణా వాహనాలకు ఈ నిబంధన క్రమంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 10 లక్షలకుపైగా వాహనాల వేగానికి కళ్లెం పడనుంది. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు తప్పనిసరిగా స్పీడ్ నియంత్రణ పరికరాలు ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలి. హై ఎండ్ కేటగిరీకి చెందిన కొన్ని రకాల రవాణా వాహనాలకు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను వాటి తయారీ సమయంలోనే అమర్చిపెడుతున్నారు. ఇలాంటి వాటికి గంటకు 80 కి.మీ వేగం వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. తొలిదశలో అవగాహన.. స్పీడ్ గవర్నర్స్‌పై మొదట అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఏఆర్ఏఐ నుంచి ఆమోదం పొందిన స్పీడ్ గవర్నర్స్ విక్రేతల నుంచి మాత్రమే ఈ పరికరాలను కొనుగోలు చేయాలి. ఇప్పటికే కొంతమంది వెండార్స్ స్పీడ్ గవర్నర్స్‌ను విక్రయించేందుకు అనుమతిని కోరుతూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని. ఏఆర్ఏఐ గుర్తింపు పొందిన విక్రయ సంస్థలకు త్వరలోనే అనుమతినివ్వనున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డీలర్లదే బాధ్యత రహదారి భద్రత ప్రమాణాల మేరకు అన్ని రకాల రవాణా వాహనాలకు స్పీడ్ గవర్నర్స్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2015 అక్టోబర్ 1 నుంచే ఇది అమల్లోకి వచ్చే విధంగా జీఓ వెల్లడించింది. ఆ తేదీ నాటికి తయారైన వాహనాలన్నింటికీ వాహన తయారీదారులు లేదా డీలర్లే స్పీడ్ గవర్నర్స్‌ను బిగించి ఇవ్వాల్సి ఉంటుంది. 2015 అక్టోబర్ 1వ తేదీ కంటే ముందు కొనుగోలు చేసిన వాహనాలకు వాటి యజమానులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే స్పీడ్ గవర్నర్స్ బిగించి ఉంటే వాహనాల ఫిట్నెస్ సమయంలో మోటారు వాహన తనిఖీ అధికారులకు ఆ వివరాలను అందజేయాలి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే వాహనాలకు తప్పనిసరిగా ఇంజిన్ నంబర్, చాసీస్ నంబర్లతో పాటు స్పీడ్‌గవర్నర్స్ నంబర్ల వివరాలను అధికారులకు సమర్పించాలి. -
వాహనం విక్రయించారా? అందుకు మీరే బాధ్యత
సాక్షి, సిటీబ్యూరో: సొంత వాహనం విక్రయించారా? అయితే యాజమాన్య మార్పిడి మరిచారో ముప్పు పొంచి ఉన్నట్లే! సదరు వాహనాలు అసాంఘిక వ్యక్తుల చేతుల్లో పడి నేరాల కోసం వినియోగించినా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా.. అందుకు మీరే మూల్యం చెల్లించాల్సి రావచ్చు. గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షలాది మంది వాహనదారులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాహనాలను విక్రయించిన తరువాత కొనుగోలు చేసిన వారి పేరిట యాజమాన్యం మార్పిడి జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనం అమ్మేసిన తరువాత చాలామంది వాహనదారులు ఆర్టీఏ పత్రాలపై (ఫామ్ 29, 30) సంతకాలు చేస్తే తమ పని పూర్తయినట్లు భావిస్తారు. కానీ రవాణాశాఖ అధికారుల సమక్షంలో కచ్చితంగా విక్రయించిన వారి నుంచి కొనుగోలు చేసిన వారి పేరిట ‘యాజమాన్య మార్పిడి’ జరగాల్సిందే. అలా కాకుండా కేవలం పత్రాలపైన సంతకాలు చేస్తూ ఒకరి నుంచి మరొకరికి వాహనాలు విక్రయిస్తూ పోతే చివరకు ఆ వాహనాలపైన జరిగే అన్ని రకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలపైన అసలు యజమానికి ఇబ్బందులు తప్పవు. రవాణాశాఖ వెబ్సైట్లో వాహనం ఎవరి పేరిట ఉంటే వారినే యజమానిగా గుర్తిస్తారు. నగరంలో ఇలా విక్రయించినప్పటికీ యాజమాన్యం బదిలీ కాకుండా సుమారు 10లక్షలకు పైగా వాహనాలు ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంఘటనల్లో పోలీసులు, రవాణా అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు, ఆ క్షణం వరకు వాటిని వినియోగిస్తున్న వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉండడం లేదు. వాహనాలు అమ్మిన వెంటనే యాజమాన్య బదిలీ చేయడం లేదు. అలాగే కొనుగోలు చేసిన వాళ్లు కూడా తమ పేరిట తిరిగి నమోదు చేసుకోవడం లేదు. భారీ మూల్యం తప్పదు... కార్లు, మోటారు బైక్‌లు వంటి వ్యక్తిగత వాహనాలు, ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, ప్రైవేట్ బస్సులు తదితర రవాణా వాహనాలు ప్రతి రోజు వేల సంఖ్యలో ఒకరి నుంచి ఒకరికి చేతులు మారుతాయి. సెకండ్హ్యాండ్స్ అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు సుమారు 1,000 వరకు పాత వాహనాల క్రయవిక్రయాలు జరుగుతాయి. కానీ వాహన యాజమాన్య బదిలీ కోసం ఆర్టీఏకు వస్తున్న వాహనాలు మాత్రం 250 నుంచి 300 వరకు మాత్రమే ఉన్నాయి. చాలామంది వాహనదారులు తమ పాత వాహనాలను అమ్మిన వెంటనే కొన్న వాళ్ల పేరిట బదిలీ చేయడం లేదు. వాహనం కొనుగోలు చేసిన వ్యక్తులు సైతం సకాలంలో తమ పేరిట బదిలీ చేసుకోవడం లేదు. పైగా ఇలా బదిలీ కాకుండా ఉన్న వాహనాలు ఒకరి నుంచి మరొకరికి అదే పనిగా మారిపోతున్నాయి. చివరకు అసలు వాహన యజమానికి, దానిని వినియోగించే వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 10లక్షల వాహనాలు బదిలీ కాకుండా ఉన్నట్లు అధికారుల అంచనా. నగరంలో తిరుగుతున్న 1.4లక్షల ఆటో రిక్షాల్లో సగానికి పైగా బినామీ పేర్లు, ఫైనాన్షియర్లపైనే నమోదై ఉన్నాయి. కానీ వాటిని వినియోగించే వ్యక్తులు మాత్రం వేరే ఉన్నారు. అలాగే తమిళనాడు, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన లక్షలాది కార్లు, క్యాబ్‌లు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే నగరంలో తప్పుడు చిరునామాలపై నమోదై తిరుగుతున్నాయి. చాలా వాహనాలు ఎలాంటి యాజమాన్య బదిలీ లేకుండానే రోడ్డెక్కుతున్నాయి. ఇలాంటి వాహనాలు రోడ్డు ప్రమాదాల్లో పట్టుబడినప్పుడు, ›ట్రాఫిక్ ఉల్లంఘనల్లో దొరికిపోయినప్పుడు అసలు వాహన యజమానులు భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు. రోడ్డు ప్రమాదాలు జరిగినా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా రవాణాశాఖ రికార్డుల్లో నమోదైన వాహన యజమానులనే పోలీసులు పరిగణనలోకి తీసుకొని కేసులు నమోదు చేస్తారు. అలాంటి వాహనాలు తమ వినియోగంలో లేకపోయినప్పటికీ యాజమాన్య బదిలీ చేయకపోవడం వల్ల రూ.వేలల్లో జరిమానాలు చెల్లించక తప్పదు. బినామీ దందా... మరోవైపు వాహనాలపైన బినామీ దందా సైతం యథేచ్ఛగా సాగుతోంది. దొంగ వాహనాలు, కాలం చెల్లిన వాహనాలు, వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి తరలించిన వాహనాలు, ఒక ఫైనాన్షియర్ నుంచి మరో ఫైనాన్షియర్‌కు బదిలీ అయ్యే వాహనాలు చాలా వరకు బినామీ పేర్లపైనే నమోదవుతున్నాయి. నగరంలోని కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో రవాణా అధికారులు కొందరు దళారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఏజెంట్లు, దళారుల కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. చిరునామా ధ్రువీకరణ కోసం రకరకాల ఆధారాలను సృష్టిస్తున్నారు. ఇదొక వ్యవస్థీకృత వ్యాపారంగా సాగుతోంది. ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు... వాహనం అమ్మిన వెంటనే ఆ వివరాలను ఆర్టీఏ వెబ్‌సైట్‌లోని నమోదు చేసి సకాలంలో కొన్న వారి పేరిట నమోదయ్యే విధంగా అధికారులను సంప్రదించాలి. ఈ సేవా కేంద్రాల్లో, ఇంటర్నెట్ కేంద్రాల్లో ఆర్టీఏ ఆన్లైన్ పౌరసేవలను వినియోగించుకోవచ్చు. మోటారు బైక్‌లు, కార్లు తదితర వాహనాల బదిలీ కోసం రూ.650 నుంచి రూ.850 వరకు ఫీజు చెల్లిస్తే చాలు. కానీ చిన్న పనిని వాయిదా వేసినా, జాప్యం చేసినా రూ.వేలల్లో నష్టపోవడమే కాదు. నేరగాళ్ల చేతిలో పడితే మరిన్ని చిక్కులు తప్పవు. -
ఫుడ్కోర్ట్ వెహికల్ ‘నడిచేదెలా’?
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ కారిడార్‌లో ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా పెరుగుతున్న ‘ఫుడ్‌కోర్టు వెహికల్స్’ ఏర్పాటుకు వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి నిరంభ్యంతర పత్రాలు, ట్రాఫిక్ పోలీసుల అనుమతి తలబొప్పిగా మారింది. పెద్దగా చదువుకోని వారు ఈ వ్యాపారంలోకి అడుగు పెడుతుండటంతో ఆయా అనుమతులు తీసుకోవడం తెలియక చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అయితే మారుతున్న జీవనశైలికి అనుగుణం గా చదువుకున్న వారు కూడా ఈ ప్రొఫెషన్‌ను ఎం చుకుంటుండడంతో చకచకా అన్ని అనుమతులు తీసుకొని వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఐటీ కారిడార్ జోన్లో అయితే ఈ ఫుడ్‌కోర్టు వెహికల్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆర్టీఏ, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక విభాగాల నుంచి నిరంభ్యంతర పత్రాలతో పాటు చివర్లో ట్రాఫిక్ పోలీసుల అనుమతిని తీసుకోవాలంటూ నాలుగేళ్ల క్రితమేపోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తుండటంతో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎన్ఓసీల కోసం చక్కర్లే... ఐటీ కారిడార్‌లో ఫుడ్‌కోర్టు వెహికల్ ఏర్పాటుచేసుకునేందుకు ఆర్టీఏ, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక విభాగాల నుంచి నిరంభ్యంతర పత్రాలు తీసుకురావడం తలకుమించిన భారమవుతోందని ఫుడ్‌కోర్టు వెహికల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్ఓసీలు రావాలంటే నెలలకొద్దీ సమయం పడుతుందని, ఇవన్నీ ఉంటేనే ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇస్తున్నారని చెబుతున్నారు. కష్టమైనా అన్నీ సమర్పిస్తున్నామని అంటున్నారు. నాలుగేళ్ల క్రితం నియమాలనే కొనసాగింపు... ఐటీ కారిడార్‌తో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని రహదారులపై విచ్చలవిడిగా వెలుస్తున్న ఫుడ్ కోర్టు వెహికల్స్, ఫుడ్‌కోర్టుల వల్ల రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుండటంతో అప్పటి పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ నిబంధనలు తీసుకొచ్చారు. ఈ వెండర్స్ సంబంధిత ఆర్టీఏ కార్యాలయం నుంచి కమర్షియల్ కేటగిరి కింద క్లోజ్డ్ బాడీతో మొబైల్ క్యాంటీన్ నిర్వహించే ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను తీసుకురావాలని, ఇటీవల రోడ్డు పన్ను చెల్లించిన రిసిప్ట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, అనుబంధ ప్రభుత్వ విభాగాల నుంచి ట్రేడ్ లైసెన్స్ తెచ్చుకోవాలని తెలిపారు. ఫుడ్ వెండింగ్‌కు ఈ వెహికల్ సరిపోతుందని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన ఆహరాన్ని అందిస్తామనే ఎన్ఓసీ సర్టిఫికెట్‌ను పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పొందాలని చేర్చిన నిబంధనలను కొనసాగిస్తున్నామని సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ అనుమతులతో అందరికీ భద్రత... ఉద్యోగుల ఆరోగ్య, భద్రత కోసం బిజినెస్ ఇన్సూరెన్స్ పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం తినడం వల ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ అవడం, ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించిన సందర్భంలోనూ ప్రజా బాధ్యత బీమా(పబ్లిక్ లియబులిటీ ఇన్సూరెన్స్)ను తీసుకోవాలని సూచించారు. వాట్ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి చేసుకోవాలని అన్నారు. సంబంధిత జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నుంచి ఎన్వోసీ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. అధికారులు సూచించిన విధంగా అగ్నిమాపక యంత్రాలు అమర్చుకోవల్సి ఉంటుంది. కమర్షియల్ సిలిండర్లను మాత్రమే ఉండాలి. గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. ఏదైనా ప్రైవేట్ భూమిలో మొబైల్ వ్యాన్ ఫుడ్ బిజినెస్ నిర్వహిస్తే సంబంధిత యజమాని నుంచి ఎన్వోసీ తీసుకరావాలి. సొంత స్థలంలో నిర్వహిస్తే సెల్ఫ్ డిక్లేరేషన్ ఇవ్వాలి. అతిక్రమిస్తే చర్యలు జీహెచ్ఎంసీ, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీలు పొందాక సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఫుడ్ కార్ట్, ట్రక్, వ్యాన్ అనేది తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. కార్ట్‌లకు మెయిన్‌రోడ్డుపై 60 ఫీట్ల నుంచి 100 ఫీట్ల వరకు, అంతర్గత రహదారుల్లో 30 ఫీట్ల వరకు మాత్రమే అనుమతిస్తారు. దీన్ని ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలుంటాయి. మొబైల్ ఫుడ్ వెండర్స్ నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ట్రక్కులకు స్థల కేటాయింపు ఉంటుంది. 2015లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే అనుమతులు ఇస్తున్నాం.–వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
‘ఆర్టీఏ’ పనితీరు అదుర్స్
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాలకు కారణాలు గుర్తించడంతో పాటు ఆయా కేసులను పక్కాగా దర్యాప్తు చేసేందుకుగాను సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ (ఆర్టీఏ) మానిటరింగ్ సెల్ సత్ఫలితాలు ఇస్తోందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది మార్చ్ 19 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సెల్ ఇప్పటి వరకు 12 హిట్ అండ్ రన్ (ప్రమాదం చేసి ఆగకుండా వెళ్లిపోవడం) కేసులను కొలిక్కి తీసుకువచ్చిందని, మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో ప్రమాదంగా నమోదైన హత్య కేసును ఛేదించినట్లు తెలిపారు. ఇన్స్పెక్టర్ మహ్మద్ వహీదుద్దీన్ నేతృత్వంలో పని చేస్తున్న ఈ విభాగం ప్రతి ప్రమాద స్థలాన్ని సందర్శించి నిశితంగా దర్యాప్తు చేయడంతో పాటు కారణాలతో కూడిన డాక్యుమెంట్లనూ రూపొందిస్తోంది. ఈ ప్రక్రియలో అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు తదితరాలను పరిగణలోకి తీసుకుంటోంది. వీటితో పాటు ప్రమాద ఘటనల్లో మృతులుగా మారిన వారి కుటుంబాలకు, బాధితులకు సహాయం అందించడంలోనూ చర్యలు తీసుకుంటోంది. అత్యుత్తమ ఫలితాల కోసం ఈ సెల్ స్థానిక శాంతిభద్రతల విభాగంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నట్లు విజయ్‌కుమార్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నిరోధానికి, రోడ్ ఇంజినీరింగ్‌లో మార్పులకు కీలక సూచనలు చేస్తోందన్నారు. గత రెండు నెలల్లో ఈ సెల్ పనితీరుపై నివేదికను ఆయన విడుదల చేశారు. కీలక కేసుల వివరాలివీ... ♦ మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో మే 6న ఒక హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. తెల్లవారుజామున మసీదుకు వెళ్తున్న మహ్మద్ ఖాన్‌ను ఓ వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రంగంలోకి దిగిన ఆర్టీఏ సెల్ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఎట్టకేలకు వాహనాన్ని గుర్తించి లోతుగా దర్యాప్తు చేయగా అది హత్యగా వెలుగులోకి వచ్చింది. దీంతో ముగ్గురు నిందితులు కటకటాల్లోకి చేరారు. ♦ కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో మార్చ్ 19న జేఎన్టీయూ నుంచి మియాపూర్ వైపు బైక్‌పై వెళ్తున్న మహేశ్వరిని ఓ బస్సు ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. ఘటనాస్థలిలో సీసీ కెమెరాలు లేకపోయినా వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి సెల్ ప్రమాదానికి కారణమైన బస్సు కర్ణాటక ఆర్టీసీకి చెందినదిగా గుర్తించింది. ♦ శామీర్‌పేట పరిధిలో ఆటోలో ప్రయాణిస్తున్న డి.శ్రీనివాసరావు కిందపడి మృతి చెందాడు. ఆటో డ్రైవర్ వాహనాన్ని అతి వేగంగా నడపడమే ఇందుకు కారణంగా తేల్చారు. ♦ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్.నిరీక్షణ్రావు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఉదంతం జరిగిన ప్రాంతంలో కొంత మేర రోడ్డు ధ్వంసమైంది. దీనికి కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు నిర్థారించారు. ♦ శామీర్‌పేట పరిధిలో ఆటోలో వెళ్తున్న బోయ వీరాస్వామిని పొట్టనపెట్టుకున్న ప్రమాదానికి వాటర్ ట్యాంకర్ కారణంగా తేలింది. రోడ్డు మధ్యలో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను తప్పించబోయిన ఆటో దానిని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. -
సారీ...నో డ్రైవింగ్ లైసెన్స్..
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏలో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీ మరోసారి స్తంభించింది. దాదాపు 1.5 లక్షల స్మార్ట్‌కార్డుల పంపిణీ పెండింగ్ జాబితాలో పడింది. దీంతో డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలకు హాజరైన వారు, కొత్త వాహనాలను నమో దు చేసుకొన్న వాహనదారులు గత రెండు నెలలు గా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల కోసం పడిగాపులు కాస్తున్నారు. నిబంధనల మేరకు రూ.వేలల్లో ఫీజులు చెల్లించినప్పటికీ సకాలంలో లైసెన్సులు, ఆర్సీ కార్డులను అందుకోలేకపోతున్నా రు. గ్రేటర్ పరిధిలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలతో పాటు, జిల్లాల్లోనూ ప్రతి ఆర్టీఏ కార్యాలయం పరిధిలో సుమారు 8 వేల నుంచి 10 వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల పంపిణీ నిలిచిపోయింది. స్పీడ్ పోస్టు ద్వారా వారం రోజుల్లో వాహనదారుల ఇంటికి చేరాల్సిన స్మార్ట్‌కార్డులు 2 నెలలు దాటినా అందకపోవడంతో వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనల మేర కు స్మార్ట్ కార్డు ప్రింటింగ్ ఖర్చుతో పాటు, పోస్టల్ చార్జీలు, వివిధ పౌరసేవల ఫీజులు, తదితర ఖర్చులన్నీ కలిపి రూ.వేలల్లో వసూలు చేస్తున్న అధికారులు సకాలంలో సేవలను అందజేయకపోవడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా తరచూ కార్డుల కొరత తలెత్తుతుండటంతో నెలల తరబడి పంపిణీ స్తంభించిపోతోంది. అయినాప్రభుత్వం ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. బకాయిలే కారణం... డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, వివిధ రకాల పౌరసేవల రెన్యువల్స్ పత్రాలను రవాణాశాఖ స్మార్ట్‌కార్డుల రూపంలో అందజేస్తోంది. ఇందులో భాగంగా కార్డులు, ప్రింటింగ్‌కు అవసరమయ్యే రిబ్బన్లు, తదితర సామాగ్రిని ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఏటా సుమారు 21 లక్షల కార్డుల కోసం కాంట్రాక్టు పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ద్వారా టెండర్లను నిర్వహించి అర్హత కలిగిన సంస్థలను ఎంపిక చేస్తారు. పూణేకు చెందిన ఎం–టెక్ సంస్థ గత కొన్నేళ్లుగా స్మార్ట్‌కార్డులను సరఫరా చేస్తోంది. ఒక్కో కార్డుకు రూ.21 చొప్పున చెల్లించి సదరు సంస్థ నుంచి కార్డులను కొనుగోలు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా రవాణాశాఖ బకాయిలు చెల్లించకపోవడంతో సదరు సంస్థ తరచూ కార్డుల సరఫరాను నిలిపివేస్తోంది. ఇప్పటి వరకు సుమారు రూ.7 కోట్ల మేర బకాయిలు ఎం.టెక్కు చెల్లించాల్సి ఉన్నట్లు అంచనా. దీంతో రెండేళ్లుగా కార్డు ల జారీకి బ్రేక్ పడుతూనే ఉంది. పెద్ద సంఖ్యలో కార్డుల ప్రింటింగ్ స్తంభించిన ప్రతిసారీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాంట్రాక్టర్ మారితే పరిష్కారం లభిస్తుందా... ఒకవైపు కార్డుల కొరత ఇలా కొనసాగుతుండగానే మరోవైపు రవాణా అధికారులు పాత కాంట్రాక్ట్ స్థానంలో మూడు రోజుల క్రితం కొత్త సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. పూణేకు చెందిన ఎం–టెక్ సంస్థకు బదులు తాజాగా ఖైరోస్ అనే కొత్త సంస్థకు కార్డుల సరఫరా కాంట్రాక్టును కట్టబెట్టారు. పాత సంస్థ రూ.21 కి ఒక కార్డు చొప్పున అందజేస్తుండగా, ఖైరోస్ మాత్రం రూ.19.17 కే కార్డు చొప్పున ప్రింట్ చేసి ఇచ్చేందుకు ముందుకు రావడంతో పాత సంస్థ స్థానంలో కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా ఏ సంస్థకైనా కార్డులు సరఫరా చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. మొరాయిస్తున్న ప్రింటర్లు... మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు ప్రింట్ చేసే యంత్రాలు కూడా పాడయ్యాయి. కొన్ని చోట్ల పూర్తిగా పనికి రాకుండా పోయాయి. కొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో పని చేస్తున్నప్పటికీ వాహనదారుల డిమాండ్‌కు తగిన విధంగా కా>ర్డులను ప్రింట్ చేసి అందజేయలేకపోతున్నారు. ఒకవైపు సకాలంలో స్మార్ట్ కార్డులు సరఫరా కాకపోవడం, మరోవైపు ప్రింటర్లు మొరాయించడంతో కొన్ని చోట్ల 2 నుంచి 3 నెలల వరకు కూడా వినియోగదారులకు స్మార్ట్‌కార్డులు అందజేయలేకపోతున్నారు. కార్డులు, ప్రింటర్లు, టెక్నికల్ సామాగ్రి, వాహనాల అద్దెలు, తదితర ఖర్చులన్నీ కలిపి సుమారు రూ.26 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిధులు మంజూరు చేయాలని ఏడాదిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందన లేదని, దీంతో అన్ని రకాల కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఇంత నిర్లక్ష్యమా... జీవితకాల పన్ను, త్రైమాసిక పన్ను, వివిధ రకాల పౌరసేవలపై విధించే ఫీజులు, అపరాధ రుసుములు, పర్మిట్లు, తదితర రూపంలో రవాణాశాఖకు ఏటా రూ.6 వేల కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. పౌరసేవలకు సంబంధించి ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, రెన్యువల్స్, తదితర సేవల కోసం ఆన్లైన్లో వాహనదారుల నుంచి ఫీజులు ముందే వసూలు చేస్తారు. ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్సు కోసం రూ.1500 ఫీజు ఉంటే అందులో నిర్ధారిత ఫీజు మినహాయించి కార్డు ధర, ప్రింటింగ్ ఖర్చు, స్పీడ్ పోస్టు కోసం రూ.250 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా అన్ని రకాల ఫీజులు ముందే చెల్లించినప్పటికీ వినియోగదారులకు సకాలంలో పౌరసేవలను మాత్రం అందజేయలేకపోతున్నారు. ఏటా రూ.6 వేల కోట్ల ఆదాయాన్ని సముపార్జించే రవాణాశాఖ కేవలం రూ.26 కోట్ల బకాయిలు చెల్లించలేక, వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం గమనార్హం. -
‘ఫ్యాన్సీ నంబర్’బహు భారం!
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): రవాణా శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఒకే రాష్ట్రం–ఒకే సిరీస్’విధానం వాహనదారులకు సరికొత్త ఇక్కట్లను తీసుకొచ్చింది. ఈ విధానంలో భాగంగా వాహనాలకు ఏపీ 39 సిరీస్ గత నెలాఖరు నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా భారీగా ఆదాయం వచ్చి చేరుతుందని ఆలోచించిన ప్రభుత్వం.. వాహనదారులపై పడే భారం గురించి ఆలోచించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నూతన విధానంతో ప్రత్యేక(ఫ్యాన్సీ) నంబర్ల కోసం గతంలో కంటే అధికంగా వెచ్చించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా బిడ్డింగ్‌లో పాల్గొనకపోతే ఫ్యాన్సీ నంబర్ల కోసం రవాణా శాఖకు ముందుగా డీడీ రూపంలో ఇచ్చే ధరావత్తు మొత్తం తిరిగి రాదన్న నిబంధనతో వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో రూ. 2వేలే.. నేడు రూ. 10 వేలు తాజాగా ప్రవేశపెట్టిన ఏపీ 39 సిరీస్‌తో వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. నూతన విధానం రాక ముందు ఉదాహరణకు 3663 నంబరు కావాలంటే రూ. 2వేలు చెల్లిస్తే సరిపోయేది. పోటీ ఉంటే బిడ్డింగ్ జరిగేది.. అదికూడా మహా అయితే రూ. 5వేల దాటకుండా ఉండేది. ప్రస్తుతం ఇదే నంబరుకు రూ. 10 వేలు చెల్లించాల్సి వస్తోంది. నూతన విధానం వల్ల ఒకే నంబరుకు ఎక్కువ మంది పోటీ పడాల్సి వస్తోంది. దీంతో వేలంలో వాహనాల నంబర్లకు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. వాహనదారుల్లో అధిక శాతం మంది టోటల్ 9కే ఆసక్తి చూపుతారు. అందులోనూ రేజింగ్ నంబర్లకు(ఉదా.3699, 4599) గిరాకీ ఉంటుంది. ప్రస్తుత విధానంతో సామాన్యుడు ఓ మోస్తరు నంబరు పొందాలంటే భారీగా సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. బిడ్డింగ్‌లో పాల్గొనకపోతే.. బిడ్డింగ్ సమయంలో వాహనదారుడు పాల్గొనక పోతే.. బిడ్డింగ్ రిజర్వేషన్ సమయంలో చెల్లించిన నగదు వెనక్కిరాదు. సాధారణంగా మధ్యాహ్నం 2గంటల నుంచి 4 గంటల వరకు బిడ్డింగ్ జరుపుతారు. అయితే బిడ్డింగ్ సమయంలో సర్వర్లు హ్యాంగ్ అయినా, నెట్వర్క్ సపోర్ట్ లేకపోయినా బిడ్డింగ్‌లో పాల్గొననట్టే లెక్క. ఉదాహరణకు 0009 నంబరు ప్రీమియం నంబరు కావడంతో రూ.50వేలు చెల్లించాల్సి ఉంది. ఇటువంటి నంబర్లకు పోటీ ఎక్కువగా ఉంటుంది. పోటీదారులు నంబరు రిజర్వేషన్‌కు రూ.50వేలు ముందుగానే చెల్లించి వేలానికి వెళతారు. అయితే వేలం జరిగే సమయంలో సర్వర్ హ్యాంగ్ అయినా, నెట్ సపోర్ట్ లేకపోయినా, ఇతర కారణాలవల్ల వేలంలో పాల్గొనలేకపోయినా రూ.50వేలు నష్టపోయినట్టే. రిజర్వేషన్ అయిన తర్వాత బిడ్డింగ్ ఆప్షన్ ఎంచుకున్న వాహనదారుడికి కనీసం మెసేజ్ కూడా రావపోవడం వల్ల నగదును నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. ఫ్యాన్సీ నంబర్లు ఇక కష్టమే గతంలో వలే ఇక ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకోవడం కష్టమే. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పెరుగుతుంది. సిరీస్‌లో నచ్చిన నంబర్ కావాలంటే సాధారణ వాహన చోదకులకు భారంగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దీని కోసం బిడ్‌లో పోటీ పడడమే కారణం.– శంకర్ రెడ్డి, కరాసా, విశాఖ బిడ్ ధర ఎక్కువకెళ్తోంది.. ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రభుత్వ ధరల్లో మార్పు లేకపోయినా బిడ్ ధర ఎక్కువకెళ్తోంది. ఇది కార్ల యజమానులకు భారమవుతుంది. ద్విచక్ర వాహనానికి ఫ్యాన్సీ నంబర్ కోసం ఆన్లైన్లో ప్రయత్నించి విరమించుకున్నాను. ఏకరూప నంబర్ బాగున్నా సామాన్యులకు మాత్రం భారంగా ఉంటుంది.– హనుమంతు, శివనగర్ సాంకేతిక సమస్యలుంటే ఫిర్యాదు చేయాలి ప్రత్యేక నంబర్ల కోసం వేలంలో పాల్గొనే ముందు రవాణాశాఖలో పొందుపర్చిన నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. డబ్బులు చెల్లించి వేలంలో పాల్గొనకపోతే డబ్బు తిరిగి ఇవ్వడం జరగదు. ఎవరికైనా బిడ్డింగ్ సమయంలో సర్వర్ సమస్య వచ్చినా.. నెట్వర్క్ సపోర్ట్ లేకపోయినా రవాణా శాఖ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు ఆధారంగా రవాణాశాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తేలితే మాత్రం ఆ డబ్బును వెనక్కు అప్పగిస్తాం. ఎవరో మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి.. ఇలాంటి ఫిర్యాదు చేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు. – వెంకటేశ్వరరావు, ఉప రవాణా శాఖ కమిషనర్ -
ఏప్రిల్ 1 నుంచి షోరూంల్లోనే నంబర్ ప్లేట్
సాక్షి, హైదరాబాద్: హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విషయంలో రాష్ట్ర రవాణా శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోవడం తప్పనిసరయినా.. కొందరు వీటిపై ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఇలాంటి వారు సైతం విధిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోవాలన్న ఆలోచనతో షోరూంల్లోనే వీటిని బిగించేలా రవాణా శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రతీ వాహనానికి సంబంధించిన సాంకేతిక వివరాలతోపాటు, వాహన యజమాని వ్యక్తిగత వివరాలు పొందుపరిచేలా.. బయోమెట్రిక్ యంత్రాలు సమకూర్చుకోవాలని షోరూంలకు ఆదేశాలు జారీ చేసింది. హైసెక్యూరిటీ ప్లేట్ల విషయంలోనూ ఇదే విధానం పాటించనుంది. ఇకపై షోరూంల్లో రిజిస్ట్రేషనయ్యే బైకులు, కార్లు, తదితర నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్లు అక్కడే బిగించి బయటకు పంపుతారు. హైసెక్యూరిటీ తప్పనిసరి ఎందుకు? వాహనాల విషయంలో పలువురు అవకతవకలకు పాల్పడటం, ఒకే నంబర్‌పై అనేక వాహనాలు నడపటం, పేలుళ్లకు చోరీ చేసిన వాహనాలు వినియోగించడం తదితర ఘటనలు పెరుగుతున్న దరిమిలా.. 2012లోనే హైసెక్యూరిటీ ప్లేట్ల బిగింపును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2015, డిసెంబర్ నాటికి పాత, కొత్త వాహనాలకు వీటిని తప్పనిసరి చేసింది. అయితే, అప్పటి నుంచి కొత్త వాహనాలకు మాత్రమే వీటిని బిగిస్తున్నారు. బైక్‌కు రూ.245, ఆటోకు రూ.400, కారుకు రూ.619 వసూలు చేస్తున్నారు. షోరూంలో వాహనం కొనుగోలు సమయంలోనే ఈ రుసుము చెల్లించాలి. నంబర్‌ప్లేట్ సిద్ధం కాగానే వాహనదారుడికి ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అపుడు వెళ్లి దాన్ని బిగించుకోవాలి. అసలు ఇలాంటి వాహనాలకు ఆర్సీలు పంపడం వల్లే వాహనదారులు కొందరు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లపై ఆసక్తి చూపడం లేదని తెలంగాణ ఆటోమోటార్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ ఆరోపించారు. వాస్తవానికి ఇలాంటి వాహనాలకు చలానాలకు బదులు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అమలులో అనేక లోపాలు.. వాస్తవానికి ఈ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు చాలా పలుచగా ఉన్నాయని విమర్శలున్నాయి. వీటిని పిల్లలు సైతం వంచడం లేదా పీకేయడం సులువుగా చేస్తున్నారు. దీంతో ఈ ప్లేట్లు అమర్చాక పట్టుమని 10 నెలలు కూడా ఉండటం లేదని వాహనదారులు వాపోతున్నారు. మరోవైపు ఇవి ఆకర్షణీయంగా లేవన్న కారణంతో యువకులు చాలామంది బిగించుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో చాలా వరకు హైసెక్యూరిటీ నంబర్ప్లేట్లు ఆర్టీఏ కార్యాలయాల్లో మూలకు పడుతున్నాయి. ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు నంబర్ప్లేట్లను వంచడం, విరగ్గొట్టడం చేస్తున్నారు. ఈ నంబర్ ప్లేట్ రెండోసారి బిగించుకోవాలంటే ఎఫ్ఐఆర్ తప్పనిసరి. ఈ తతంగమంతా ఎందుకులే అని వాహనదారులు వారే కొత్త ప్లేట్ వేయించుకుంటున్నారు. హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ లేకుండా తిరిగినప్పుడు ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు చలానా రాస్తారు. అయినా.. వాహనదారులు చలానాలు కడుతున్నారు తప్ప.. వీటిని బిగించుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. -
ఆర్టీఏలో రశీదుల భారం
సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అన్న సామెతను గుర్తు చేస్తోందీ మన ఆర్టీఏ కార్యాయాలు, మీసేవా కేంద్రాల పరిస్థితి. పారదర్శకత కోసం రవాణా శాఖకు సంబంధించిన సేవలను ఆన్లైన్ చేసిన లక్ష్యం నెరవేరింది. కానీ చేసిన ప్రతి లావాదేవీకి సంబంధించి ప్రింటౌట్ల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులపై రోజుకు గరిష్టంగా రూ.5 లక్షలకు పైగా అదనపు భారం పడుతోంది. వాహనదారుల అవగాహన లేమి, అధికారులు తగు ప్రచారం కల్పించకపోవడంతో ఇలా వినియోగదారుల నెత్తిన అదనపుభారం పడుతోంది. నేపథ్యమేంటి? 2016 ఆగస్టు నుంచి అప్పటి రవాణా శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు అన్ని సేవలను ఆన్లైన్ చేశారు. ఇందుకు రవాణా శాఖతో మీ–సేవా ఒప్పందం కూడా చేసుకుంది. అప్పటి నుంచి మాన్యువల్‌గా ఎలాంటి చెల్లింపులు జరగట్లేదు. లర్నింగ్ లైసెన్స్, పర్మినెంట్ లైసెన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, చిరునామా మార్పు, ఫిట్నెస్, ఆర్సీ రెన్యువల్ ఇలా దాదాపు 56 సేవలకు కావాల్సిన వివిధ రకాల సేవల చార్జీలను ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు. ప్రతి లావాదేవీకి కనీస చార్జిగా రూ.35 నిర్ణయించారు. వీటిని ఆన్లైన్లో పూర్తి చేసి, నిర్ణయించిన ఫీజును సర్వీసు చార్జీ రూ.35తో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో చెల్లింపుల అనంతరం మీ–సేవా కేంద్రాలు రశీదులు ఇస్తారు. కానీ సంబంధిత ఫారం ప్రింటౌట్ను వినియోగదారులే తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న ప్రింటౌట్‌కు సంబంధిత ఇతర పత్రాలు జమచేసి రవాణా శాఖ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రతి ప్రింటౌట్‌కు నెట్‌సెంటర్ల నిర్వాహకులు రూ.20 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రింటౌట్ ఇవ్వాలన్న నిబంధనేమీ లేదని మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. చాలా రోజులుగా సమస్య.. చాలా రోజులుగా మీ–సేవా కేంద్రాల్లో ప్రింటౌట్ సమస్య నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకట్రెండు రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న మీ–సేవా కేంద్రాలు మాత్రమే ప్రింటౌట్లు ఇస్తున్నాయి. మిగిలిన చోట్ల ఎక్కడా ప్రింటౌట్ ఇవ్వట్లేదు. దీంతో చేసేది లేక వినియోగదారులు బయటి నుంచి రూ.20 నుంచి 30 వరకు మరోసారి చెల్లిస్తున్నారు. ఒకసారి సర్వీసు చార్జీ చెల్లించాక మరోసారి ప్రింటౌట్‌కు డబ్బులు సమర్పించుకోవడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రూ.5 లక్షలకుపైగా భారం పడుతోదని తెలంగాణ ఆటోమోటార్స్ వెల్ఫేర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ వాపోయారు. ప్రభుత్వం రూ.35 సర్వీసు చార్జీ వసూలు చేశాక మరోసారి ప్రింటౌట్ కోసం చెల్లించాల్సి రావడం వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మీసేవా కేంద్రాలు ప్రింటౌట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రచారం, అవగాహన లేకపోవడమే కారణం.. దరఖాస్తు చేసునేందుకు వినియోగదారులు నేరుగా రవాణా కేంద్రంలోనే ఈ ఫారంలను ప్రింటౌట్ తీసుకోవచ్చని మీసేవా కేంద్రాల నిర్వహణ చూసే ఈఎస్డీ కమిషనర్ వెంకటేశ్వర్రావు స్పష్టం చేశారు. వియోగదారులు అవగాహన లేకే ప్రింటౌట్లకు అదనంగా రూ.30 చెల్లిస్తున్నారని వివరణ ఇచ్చారు. ఆర్టీఏ కార్యాలయాలు... లావాదేవీలు ఒక్కో కార్యాలయంలో రోజుకు జరిగే కనీస లావాదేవీలు 300కుపైగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల సంఖ్య 74 ఒక రోజుకు జరిగే లావాదేవీలు 22,200 (దాదాపుగా) మీ–సేవాల్లో ఒకరోజు వినియోగదారులు చెల్లించే సర్వీసుచార్జీలు రూ.7,77,000కుపైగా నెలలో 22 పనిదినాలకు చెల్లించే మొత్తం రూ.1,70,94,000 ఏటా మీ–సేవాకు అందుతున్న చార్జీల మొత్తం రూ.20,51,28,000కుపైగా -
1వ తేదీ నుంచి ‘ఏపీ–39’
సాక్షి, అమరావతిబ్యూరో : కృష్ణా జిల్లాకు కేటాయించిన ‘ఏపీ–16’ కోడ్ రద్దు కానుంది. ఇకపై ఫిబ్రవరి 1 నుంచి ఆ స్థానంలో ‘ఏపీ–39’ సిరీస్ అమల్లోకి రానుంది. ఈ మేరకు బుధవారం రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలో ఈ సిరీస్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రమంతా ఇదే కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇప్పటి వరకు కొనసాగిన ఏపీ –16.. కృష్ణా జిల్లా రిజిస్ట్రేషన్ కోడ్ నంబరు.. ఫిబ్రవరి 1 తర్వాత ఈ కోడ్ నంబరు ఏపీ–39గా మారనుంది. ఏపీ రవాణా శాఖ తీసుకున్న నిర్ణయంతో జిల్లా అంతటా ఒకే కోడ్ నంబర్ అమల్లోకి రానుంది. కొత్త సిరీస్ ప్రారంభం కావడం వల్ల వారం రోజుల్లోనే 1–9999 నంబర్ల సిరీస్ మారిపోయే అవకాశం ఉంది. తద్వారా నెలలోనే మూడు నాలుగేసిసార్లు కొత్త సిరీస్ అంకెలు వచ్చేస్తుంటాయి. రవాణా శాఖలో ఈ నూతన విధానం అమల్లోకి రానుండటంతో పక్క జిల్లాల్లో తాత్కాలిక చిరునామాలతో ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటున్న వాహనదారులకు కట్టడి పడినట్లే. ఫలితంగా రాబోయే రోజుల్లో ఏదైనా వాహనానికి 9999 లాంటి ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వాహన యజమాని ఇకపై అలాంటి నంబర్ల కోసం తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.రాష్ట్రమంతా వాహనాలకు ‘ఒకే కోడ్’ ఉండేలా రవాణా శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు బుధవారం రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలో నూతన సిరీస్ ఏపీ– 39ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో కృష్ణా జిల్లాకు కేటాయించిన ‘ఏపీ–16’ కోడ్ రద్దు కానుంది. -
రూ.17 స్పీడ్పోస్టుకు రూ.35 వసూలు..
ఆర్టీఏలో పోస్టల్ చార్జీల పేరిట భారీ దోపిడీ సాగుతోంది. ఏజెంట్ల చేతివాటం, అధికారుల ఏమరుపాటు కారణంగా వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఏటా స్పీడ్ పోస్టుల పేరిట వసూలు చేసిన కోట్ల రూపాయలకు ఆడిటింగ్ కూడా జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. 2008 నుంచి ఇలాగే పోస్టల్ చార్జీలు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఏంటీ సమస్య? ఆర్టీఏ కార్యాలయాల్లో రోజూ వాహనాల రిజి స్ట్రేషన్లు, పర్మినెంట్ లైసెన్స్‌లు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, ఆర్సీ డూప్లికేట్ ఇలా రకరకాల కార్డులు జారీ చేస్తుంటారు. జారీ చేసే స్మార్ట్ కార్డుల సంఖ్య రోజుకు దాదాపు 350కి పైగానే ఉం టుంది. నిబంధనల ప్రకారం వీటన్నింటినీ స్పీడ్ పోస్టుద్వారా పంపాలి. కానీ వీటిలో 80% అంటే దాదాపు 300 కార్డులు దళారుల చేతికే వెళ్తు న్నాయి. ఇందుకు వాహనదారుల వద్ద రూ.100 నుంచి 150 వరకు వసూలు చేస్తు న్నారు. అంటే అధికారుల సాయంతో ఏజెంట్లు నేరుగా చేతికే కార్డులు ఇస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. స్పీడ్ పోస్టు గురించి నిబంధనలు ఇవీ.. భారతీయ తపాలా సంస్థ పెట్టిన నిబంధనలు తెలంగాణ రవాణా శాఖలో అమలు కావ ట్లేదు. 40 గ్రాముల వరకు 350 కిలోమీటర్ల దూరం వరకు రూ.17 చార్జీ చేస్తారు. కానీ తెలంగాణ రవాణా శాఖ జారీ చేసే లైసెన్సుల దూరం మహా అయితే 15 కి.మీ. మించదు. జిల్లాల్లో ఈ పరిధి కాస్త అధికంగా ఉండొచ్చు. కార్డు బరువు 9 గ్రాములే ఉండటం గమనార్హం. ఇందులో కవర్ ఖర్చు ఒక్క రూపాయి అనుకున్నా కార్డు బట్వాడాకు అయ్యే ఖర్చు రూ.18 మాత్రమే. మరి రూ.35 ఎందుకు వసూలు చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ప్రజల నుంచి అక్రమంగా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న రవాణా శాఖలో ఈ విషయంపై ఇంతవరకూ అంత ర్గత ఆడిటింగ్ జరగకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ఇంటర్నరల్ ఆడిటింగ్ ఎందుకు జరగట్లేదు.. అదనంగా వసూలవు తున్న మొత్తం ఎవరి ఖాతాల్లోకి వెళ్తోంది.. దళారులు నేరుగా కార్డులు ఎలా ఇవ్వ గలుగుతున్నారనే వాటికి సమాధానం లేదు. 74 ఆఫీసుల్లో రోజుకు దాదాపు 50 కార్డులు మాత్రమే స్పీడ్ పోస్టు ద్వారా బట్వాడా అవుతున్నాయి. సీఎం, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం వాహనదారుల నుంచి ఆర్టీఏ అధి కారులు కోట్లాది రూపాయలు అక్ర మంగా వసూలు చేస్తున్నారు. తపాలా శాఖ నిబంధనలను కాదని, అదనంగా వసూలు చేస్తున్న రూ.17కు ఎందుకు లెక్క చెప్పరు? ఇలా వసూలవుతున్న కోట్ల రూపాయలను ఏం చేస్తున్నారు? ఈ విషయాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. దీనిపై తప్పకుండా ఏసీబీ విచారణ జరిపించాలి. – దయానంద్, తెలంగాణ ఆటో, మోటార్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దళారులను ఆశ్రయించొద్దు.. వాహనదారులు దళారులను ఆశ్రయించొద్దు. నిబంధనల ప్రకారం కార్డులన్నీ స్పీడ్ పోస్టులోనే తీసుకోవాలి. అలాంటివారిపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. – రమేశ్, జేటీసీ, ఆర్టీఏ చేతికిచ్చే వాటిలోనూ చేతివాటమేనా? మిగిలిన స్మార్ట్ కార్డులను తప్పనిసరిగా స్పీడ్పోస్టులోనే పంపాలని నిబంధనలు ఉన్నాయి. కాబట్టి వాటికి పోస్టల్ చార్జీల కింద రూ.35 వసూలు చేస్తున్నారని అనుకుందాం. కానీ ఏదైనా వాహనానికి ఎన్ఓసీ, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకున్నప్పుడు చేతికే ఇవ్వాలి. కానీ అధికారులు వీటికి ఇస్తున్న రశీదుల్లోనూ రూ.35 స్పీడ్ పోస్టు చార్జీలు కలిపి వడ్డిస్తుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 74 కార్యాలయాల్లో పోస్టు ద్వారా పంపుతున్న మొత్తం కార్డులు 3,700 స్పీడ్ పోస్టుకు వాస్తవంగా వసూలు చేయాల్సింది రూ.18 ప్రస్తుతం అదనంగా వసూలు చేస్తోంది రూ.17 3,700 కార్డులకు ఒకరోజు పడుతున్న అదనపు భారం రూ.62,900 22 పనిదినాలకు పడే భారం రూ.13,83,800 - భాషబోయిన అనిల్‌కుమార్ -
జప్తు జబర్దస్త్..!
ఎన్నికల సిబ్బంది, సామగ్రి తరలింపునకు సమాయత్తం వాహనాల వేటలో తలమునకలైన ఆర్టీఏ అధికారులుఆ డ్యూటీలు తమకొద్దంటున్న ట్రావెల్స్ నిర్వాహకులుఅద్దెలు అతి తక్కువ.. అవీ చెల్లిస్తారో లేదోననే భయంరాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,500 వాహనాలు అవసరంగ్రేటర్ హైదరాబాద్‌కే కావాల్సినవి 1,500 వాహనాలు సాక్షి, సిటీబ్యూరో: ‘డేవిడ్ సొంత వాహనం ఉన్న డ్రైవర్. తన ఇన్నోవా వాహనాన్ని ఓ కాల్‌సెంటర్‌కు అద్దె ప్రాతిపదికన నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం ఎన్నికల విధుల కోసం ఆర్టీఏ అధికారులు ఆ వాహనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. వారం రోజుల పాటు బండిని తమకు అప్పగించాలని కోరారు. అధికారుల ఒత్తిడితో మరో గత్యంతరం లేకపోయింది. కానీ సదరు కాల్‌సెంటర్ మాత్రం తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. వారం పాటు తమకు వాహనం అందుబాటులో లేకపోతే చాలా నష్టం వస్తుందంటూ నిర్వాహకులు స్పష్టం చేశారు. వారం రోజుల ఎన్నికల విధుల కోసం డేవిడ్ తన ఉపాధినే కోల్పోవాల్సి వచ్చింది’ ఈ పరిస్థితి డేవిడ్ ఒక్కడిదే కాదు. నగరంలో చాలామంది వాహనదారులు, ట్రావెల్స్ సంస్థలు కొద్ది రోజులుగా ఆర్టీఏ దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు, ఎక్కడ తమ వాహనాన్ని జప్తు చేస్తారో తెలియని అనిశ్చితితో ఆందోళనకు గురవుతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు, కాల్‌సెంటర్స్, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కాంట్రాక్ట్ పద్ధతిన వాహనాలను అద్దెకు నడుపుతున్న ట్రావెల్స్ ఏజెంట్లు, సంస్థలు, వాహన యజమానులు, డ్రైవర్లు ఉన్నపళంగా తమ వాహనాలను ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మరోవైపు ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సంస్థలతో అనుసంధానమైన వాహనాలు నడుపుతున్న భాగస్వామ్య డ్రైవర్లకు సైతం ఇది ఇబ్బందికరంగానే ఉంది. నాలుగైదు రోజుల ఎన్నికల డ్యూటీలతో శాశ్వత ఉపాధి కోల్పోవాల్సివస్తుందని పలువురు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేం బలవంతం..? ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది, సామగ్రి చేరవేత, భద్రతా ఏర్పాట్లు తదితర అవసరాల కోసం ప్రతి నియోజకవర్గానికి 50 నుంచి 70 వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇన్నోవా, క్వాలిస్, టవేరా, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులు వంటి అన్ని రకాల వాహనాలపై అధికారులు దృష్టి సారించారు. మొత్తం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు సుమారు 3,500 వాహనాలు ఏర్పాటు చేసేందుకు రవాణా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే సుమారు 1,500కుపైగా వాహనాలను సిద్ధం చేస్తున్నారు. తీరా ఎన్నికల తేదీ ముంచుకొచ్చిన తరుణంలో నాలుగైదు రోజులుగా బలవంతంగా వాహనాల జప్తు చేస్తున్నారు. దీంతో అప్పటికే బుకింగ్‌లు చేసుకున్న వారు ఇబ్బందులకు గురికావాల్సివస్తోంది. ముందస్తుగానే ఈ ప్రక్రియ ప్రారంభించి ఉంటే వినియోగదారులకు మరో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేవాళ్లమని హిమాయత్‌నగర్‌కు చెందిన వాహన యజమాని రవి ఆందోళన వ్యక్తం చేశారు. అద్దెలు చాలా తక్కువ.. ఎన్నికల విధుల కోసం స్వాధీనం చేసుకున్న ఇన్నోవా, క్వాలిస్, టవేరా వంటి వాహనాలకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కాకుండా రోజుకు రూ.1000 చొప్పున అద్దె చెల్లించనుండగా, ప్రైవేట్ సంస్థల నుంచి మాత్రం తమకు రూ.2600 వరకు లభిస్తుందని, ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వడం వల్ల రోజుకు రూ.1600 వరకు ఆదాయం కోల్పోవాల్సివస్తుందని వాహనదారులు పేర్కొంటున్నారు. దీంతో ఇది తమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలంగాణ ఫోర్‌వీలర్స్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల విధులను దృష్టిలో ఉంచుకొని ట్రావెల్స్ సంస్థలు, డ్రైవర్లు, వాహన యజమానులు తమకు సహకరించాలని రవాణా అధికారులు సూచించారు. -
నెంబర్ ఫ్యాన్సీ.. డిమాండ్ క్రేజీ..!
టీఎస్09 ఎఫ్బీ 9999... ఈ నెంబర్‌కు రవాణాశాఖ నిర్ణయించిన ఫీజు రూ.50వేలు. కానీ ఇటీవల నిర్వహించిన వేలంలో దీనికి అనూహ్యమైన పోటీ ఏర్పడింది. 10మంది వాహనదారులు రూ.లక్షలు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. ఒక వాహనదారుడు ఏకంగా రూ.9.25లక్షలు చెల్లించి ఈ నెంబర్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఒక్క నెంబర్ మాత్రమే కాదు... నచ్చిన నెంబర్ కోసం వాహనదారులు ఎంత చెల్లించేందుకైనా వెనుకాడడం లేదు. ఒక్కో నెంబర్ కోసం కనీసం 5 నుంచి 10మంది పోటీ పడుతున్నారు. నాలుగైదేళ్ల క్రితం పెద్దగా ఆదరణ లేని నెంబర్లకు సైతం ఇప్పుడు అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో : ఇటీవల నిర్వహించిన వేలంలోనే టీఎస్09 ఎఫ్‌సీ 0001 నెంబర్ కోసం ఒక సంస్థ రూ.6.66లక్షలు చెల్లించింది. అలాగే టీఎస్09 ఎఫ్‌సీ 0005 నెంబర్ కోసం స్పేస్ టైమ్ ఇంటీరియర్ అనే మరో సంస్థ రూ.5.06 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. ప్రత్యేక నెంబర్లపై వేలంపాటలు నిర్వహించిన ప్రతిసారి ఆర్టీఏకు దాదాపు రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. సంఖ్యాశాస్త్రంపై, జ్యోతిషంపై ఉండే విశ్వాసం, కొన్ని నెంబర్లతో అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకం వాహనదారుల్లో ఈ మేరకు ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు ఇదే ఆర్టీఏకు ఆదాయాన్నిస్తోంది. రెండేళ్ల క్రితం ఇదే ఆల్‌నైన్స్ నెంబర్ టీఎస్09 ఈఎల్ 9999 కోసం సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రూ.10.50లక్షలు చెల్లించాడు. అన్ని రకాల ప్రత్యేక నెంబర్లపై నిర్వహించే వేలంపాటలతో ఆర్టీఏకు ప్రతిఏటా రూ.25కోట్ల వరకు ఆదాయం లభిస్తున్నట్లు అంచనా. ఒక్క ఖైరతాబాద్ కార్యాలయంలోనే కాదు.. నగరంలోని అన్ని చోట్ల ప్రత్యేక నెంబర్లకు ఎంతో క్రేజ్ ఉంది. లగ్జరీ వాహనాలు కొనుగోలు చేసిన వారు తమకు నచ్చిన నెంబర్ కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. వీటికే డిమాండ్... 9, 1, 999, 9999, 786, 6, 666, 1111 తదితర నెంబర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఒక్క ‘ఆల్‌నైన్స్’ మాత్రమే కాదు... తమకు నచ్చిన నెంబర్ల కోసం వాహనదారులు రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ఫ్యాన్సీ నెంబర్లు, అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నెంబర్లుగా భావించే కొన్ని రకాల వాహన రిజిస్ట్రేషన్ నెంబర్లకు పోటీ బాగా ఉంది. బీఎండబ్ల్యూ, ల్యాండ్‌రోవర్, ల్యాండ్‌క్రూజర్, ఆడి తదితర ఖరీదైన వాహనాలే కాదు... బైక్‌ల కోసం కూడా వాహనదారులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నిర్వహించిన వేలంపాటల్లో ఇలాంటి నెంబర్లపై సుమారు రూ.25 కోట్ల ఆదాయం లభించినట్లు అంచనా. వాహనదారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘9’తో మొదలయ్యే ఖైరతాబాద్ కార్యాలయంలోనే డిమాండ్ ఎక్కువగా ఉంది. హోదా.. అదృష్టం అదృష్ట సంఖ్యలుగా భావించే నెంబర్ల కోసం కొందరు పోటీకి దిగితే... సామాజిక హోదా కోసం, పేరు ప్రతిష్టల కోసం మరికొందరు ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పడుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, సినిమాలు, రాజకీయాలు, పరిశ్రమలు తదితర విభిన్న రంగాలకు చెందిన వాహన యజమానులు ‘లక్కీ’ నెంబర్ల కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరిస్ ప్రారంభమవుతుంది. మొత్తం నెంబర్లలో 2500 వరకు ఫ్యాన్సీ నెంబర్లు ఉంటాయి. ఒక్కో నెంబర్‌కు సగటున 5 నుంచి 10 మంది పోటీకి వస్తుండగా... నచ్చిన నెంబర్లు లభించని వాళ్లు 3 నెలల నుంచి 6నెలల వరకు కూడా పడిగాపులు కాయడం గమనార్హం. కేవలం ఫ్యాన్సీ కోసం కాకుండా కొన్ని నెంబర్లతో అదృష్టం బాగా కలిసొస్తుందనే నమ్మకం కూడా ఈ క్రేజీకి కారణమే. జ్యోతిషులు ఒక్కొక్క నెంబర్‌ను ఒక గ్రహంతో, వాటి కదలికలతో సరి చూసి భవిష్యత్తును, మానసిక స్వభావాలను అంచనా వేస్తారు. అలా తమ స్వభావానికి తగిన నెంబర్లను వాహనదారులు ఎంపిక చేసుకుంటున్నారు. ఆ రకంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వంటి ప్రతి సింగిల్ నెంబర్‌కు ఒక లక్షణం ఉంటుంది. ఉదాహరణకు ‘1’ నాయకత్వానికి, ‘2’ శాంతస్వభావానాకి నిదర్శనం. గురుగ్రహంతో పోల్చే ‘3’ వల్ల చక్కటి తెలివితేటలు, జ్ఞానం లభిస్తాయని నమ్మకం. ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తారు. ఈ నెంబర్ వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం. ఇక ప్రతి ఒక్కరూ ఇష్టపడే నెంబర్ ‘9’. కుజగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో విజేతలుగా, తిరుగులేని నాయకులుగా ఎదగాలని కోరుకునేవాళ్లు, పోటీ మనస్తత్వం, పోరాడే తత్వం ఉన్నవాళ్లు ఈ నెం»బర్ను ఇష్టపడుతారు. ఎన్టీఆర్‌తో ప్రారంభం... మొదట్లో ఈ నెంబర్లకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. ఇప్పుడు రూ.లక్షల్లో డిమాండ్ ఉన్న ‘9999’ వంటి నెంబర్లు రెండు దశాబ్దాల క్రితం రూ.వేలల్లో లభించేవి. 1980లలో అయితే కేవలం రూ.500లకు ఈ నెంబర్లను కేటాయించేవారు. ఎలాంటి పోటీ ఉండేది కాదు. రాజకీయరంగ ప్రవేశం చేసిన ఎన్టీరామారావుతో ఈ నెంబర్‌కు క్రేజ్ వచ్చేసింది. అప్పట్లో ఎన్టీఆర్ 27, 999, 9999 వంటి నెంబర్లకు ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో అందరూ అదే బాటలో నడిచారు. బాగా డిమాండ్ పెరిగింది. ఆల్నైన్స్తో పాటు కొంతకాలంగా వాహనదారులు 6666 నెంబర్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెంబర్‌ను తన అదృష్ట సంఖ్యగా భావించడంతో మిగతా వాహనదారులపైన ప్రభావం పడింది. దీంతో ఈ నెంబర్‌కు ప్రస్తుతం రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వరకు పోటీ ఉంది. రాజకీయ నాయకులు, వ్యాపార రంగ ప్రముఖులు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నెంబర్లే బహుమతులు... ఇటీవల కాలంలో చాలామంది వినియోగదారులు తమ కుటుంబసభ్యులకు వాహనాలను బహుమానంగా అందజేయడమే కాదు... వారి పుట్టిన రోజు కలిసొచ్చే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్లను ఎంపిక చేసుకొని పోటీకి వస్తున్నారు. 1313 (తేరా తేరా) అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీనిని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. 5121 అనే నెంబర్‌ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు. 143, 214, 8045 వంటి నెంబర్లకు ఎంతో క్రేజీ ఉంది. లగ్జరీ వాహనాలు పెరగడంతోనే... గత రెండేళ్లుగా ఫ్యాన్సీ నెంబర్లకు అనూహ్య స్పందన వస్తోంది. లగ్జరీ వాహనాల వినియోగం బాగా పెరగడం ఇందుకు కారణం. ప్రతిఏటా 10వేలకు పైగా ఖరీదైన కార్లు విదేశాల నుంచి వచ్చేస్తున్నాయి. అలాగే రూ.50లక్షల విలువైన బైక్‌లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఈ వాహనాల స్థాయికి తగినట్లుగానే వినియోగదారులు నెంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. – పాండురంగ్‌నాయక్, జేటీసీ, హైదరాబాద్ -
ఇక స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్‌లు
న్యూఢిల్లీ: దేశమంతటా ఒకే రకమైన డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఎక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా అన్నీ ఒకే పరిమాణం, రంగు, రూపురేఖలు, భద్రతా సౌకర్యాలతో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది జూలై నుంచి ఈ రకమైన కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు దేశంలోని అన్ని రోడ్డు రవాణా కార్యాలయాల్లోనూ జారీ అవుతాయని తెలుస్తోంది. ఆ తర్వాత కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారితోపాటు పాత వాటిని రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ కొత్త ఫార్మాట్లోనే లైసెన్స్‌లను జారీ చేయనున్నారు. ఈ లైసెన్స్‌లపై జాతీయ, సబంధిత రాష్ట్ర చిహ్నాలు ఉంటాయి. భద్రత కోసం కార్డుల్లో మైక్రో చిప్‌లను అమర్చి, క్యూఆర్ కోడ్లను కూడా ముద్రించనున్నారు. లైసెన్స్‌దారుడి సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ప్రస్తుతం మెట్రోరైళ్ల స్మార్ట్‌కార్డుల్లో వాడుతున్న ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) టెక్నాలజీని కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్సుల్లో వాడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఫార్మాట్లలో డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తుండటంతో ఇతర రాష్ట్రాల్లోని ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. -
బస్సులా...రేకు డబ్బాలా?
సాక్షి,హైదరాబాద్: ఆర్టీసీది పేరు గొప్ప ఊరు దిబ్బ పరిస్థితిగా మారింది. ఇటీవల ఆర్టీసీ చరిత్రలోనే కాక దేశంలోనే జరిగిన అతిపెద్ద రోడ్డు యాక్సిడెంట్‌గా పరిగణిస్తున్న కొండగట్టు బస్సు ప్రమాదమే అందుకు తాజా ఉదాహరణ. కేవలం లాభార్జనపైనే దృష్టిపెట్టి నిబంధనలకు నీళ్లొదిలి ప్రయాణికులపాలిట మృత్యుశకటాలుగా మారిన బస్సుల్ని ఆర్టీసీ రోడ్డుపై నడుపుతోంది. కాలం చెల్లిన, ఫిట్నెస్ లేని దాదాపు నాలుగువేలకు పైగా పాతబస్సుల్లో జనాలను కుక్కి వారి జీవితాలతో ఆర్టీసీ చెలగాటమాడుతోంది. ఎక్కడికక్కడ ఊడుతున్న డోర్లు, సీట్లకు ఇనుప తీగలు, తాళ్లు కట్టుకుని నడుస్తోన్న బస్సులు ఆర్టీసీ దుర్భరస్థితిని లోకానికి చాటుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన ఆర్టీఏ రోడ్లపై తిరుగుతున్న డొక్కు బస్సుల్ని, రోడ్లపై జరుగుతున్న బస్సు ప్రమాదాల్ని చూసి కూడా కళ్లుమూసుకుని మొద్దు నిద్రను నటిస్తోంది. కనీసం కొండగట్టు బస్సు ప్రమాదం తర్వాతైనా ఆర్టీసీ, ఆర్టీఏ ఈ రెండూ కళ్లు తెరవలేదు. పొంచి ఉన్న ముప్పు తెలంగాణ ఆర్టీసీలో ఉన్న పాత బస్సులతో ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉంది. వీటిలో చాలా వరకు ఇప్పటికే తుక్కు దశకు చేరుకున్నా..అవే డొక్కు బస్సులను అధికారులు తిప్పుతున్నారు. ఇపుడు ఇవి మృత్యుశకటాలుగా మారి ప్రజలను అమాంతం మింగేస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో తక్షణం పక్కనబెట్టాల్సిన బస్సులు అక్షరాలా 4,549 బస్సులు. అంటే ఇవి 12 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగాయి. కొత్త బస్సులు వద్దా? 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి నేటి వరకు తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసిన బస్సుల సంఖ్య 1095గా ఉంది. స్క్రాప్ బస్సుల స్థానంలో ప్రధానంగా జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు నడిచే బస్సు లు కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఆర్టీసీలో అంతగా కనిపించడం లేదు. కేవలం సంస్థకు భారంగా పరిణమించే తెల్ల ఏనుగుల్లాంటి ఏసీ బస్సులపైనే అమితాసక్తిని ప్రదర్శిస్తుండటం గమనార్హం. - ఇదే క్రమంలో 2017లో దాదాపుగా రూ.20 కోట్లు వెచ్చించి వజ్ర బస్సులు కొనుగోలు చేశారు. వీటి ఆక్యుపెన్షీ రేషియో దారుణంగా ఉంది. చాలారూట్లలో ఈ బస్సులు సగం కూడా నిండటం లేదు. కొన్ని రూట్లలో ఒకరిద్దరే ఎక్కుతున్నారు. - ఈనెల 5న దాదాపుగా రూ.100 కోట్ల కేంద్రం గ్రాంటుతో 100 ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకుంది. వీటిలో తొలివిడతగా 5 బస్సులు నగరానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో పర్యావరణ కోణంలో ఇలాంటి బస్సులను నడపాల్సిందే. కానీ, వాటిపై చూ పిన శ్రద్ధ గ్రామీణ, జిల్లాల్లో కొత్తబస్సులపైనా చూపిస్తే.. వాటికి వెచ్చించే బడ్జెట్లో జిల్లా బస్సులకు వెచ్చి స్తే జనాలకు ఉపయోగకరంగా ఉంటుందని యూని యన్ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగుల అభిప్రాయపడుతున్నారు. కాంట్రాక్టర్లకు కాకుండా..ప్రజలకు, కార్మికులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. ఆర్టీఏ తనిఖీలెక్కడ? ఆర్టీసీ బస్సుల తనిఖీ అంటేనే ఆర్టీఏ అధికారులు పట్టించుకున్న దాఖలాలు తక్కువ. పోనీ, తనిఖీలు చేపట్టినా.. వెంటనే ఫోన్లు చేసి తమను అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు వస్తాయని ఆర్టీఏ ఉన్నతాధికారులే వాపోతున్నారు. కాలంచెల్లిన బస్సులు రోడ్లపై తిరుగుతున్నా గుడ్లప్పగించి చూడటం మినహా వారేం చేయలేని దుస్థితి. సాంకేతికంగా ఈ బస్సులకు నడిచేందుకు ఏమాత్రం అర్హతలేదు అయినా వీటిల్లో జనాలను కుక్కి పంపుతోంది ఆర్టీసీ. ఇదీ ఆర్టీసీ లెక్క ఆర్టీసీలో మొత్తం బస్సులు 10,500 కుపైగా రోజువారీ ప్రయాణికులు 97,00,000 ఒకరోజు ఆదాయం దాదాపు రూ.12,00,00,000/ (రూ.12కోట్లు) సంస్థలో కాలంచెల్లిన బస్సులు 4,549. వీటిలో ఒకరోజు ప్రయాణం చేసేవారు 40,00,000 మందికిపైగా ఈ బస్సులు ఎపుడు.. ఎక్కడ ప్రమాదానికి గురవుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. -
అధికలోడ్ లారీలను అరికట్టమని కాళ్లపై పడి వేడుకోలు
-
కార్డు..నోవేర్ –ఫైన్ బరాబర్!
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్‌కు చెందిన వినోద్ మే నెలలో డ్రైవింగ్ లైసెన్స్ చిరునామా మార్పు కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కొత్త లైసెన్స్ ‘స్మార్ట్ కార్డు’ పోస్టు ద్వారా వారం రోజుల్లో ఇంటికే వస్తుందని అధికారులు చెప్పారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు అతన్ని తనిఖీ చేసి డ్రైవింగ్ లైసెన్సు చూపించమన్నారు. అది లేకపోవడంతో జరిమానా విధించారు. ఐ లంగర్‌హౌస్‌లో ఉంటున్న సాయితేజ నెల రోజుల క్రితం కొత్త బైక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు వాహనం రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ) చేతికి రాలేదు. 15 రోజుల పాటు ఎదురు చూసి అధికారులను సంప్రదించాడు. కార్డుల కొరత వల్ల పంపిణీ నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పుడతడు బండి బయటకు తీస్తే పోలీసులు పట్టుకుంటారేమోనని భయపడుతున్నాడు. ఈ సమస్య వినోద్, సాయితేజలదే కాదు.. గ్రేటర్‌లోని సుమారు లక్షా 75 వేల మంది వాహన వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్య. నగరంలోని ఒక్కో ఆర్టీఏ కార్యాలయంలో 10 వేల నుంచి 25 వేల వరకు డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీ నిలిచిపోయింది. నగర శివారులోని ఒక్క ఇబ్రహీంపట్నం ఆర్టీఏ పరిధిలోనే సుమారు 20 వేల స్మార్ట్ కార్డుల పంపిణీకి బ్రేక్ పడింది. ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్‌లో 25 వేల కార్డులు ఆగిపోయాయి. ప్రస్తుతం అత్యంత ప్రముఖులకు మాత్రమే అతికష్టంగా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు అందజేస్తున్నారు. మేడ్చల్, అత్తాపూర్, ఉప్పల్ తదితర అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత రవాణాశాఖకు సవాల్‌గా మారింది. రెండు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ ప్రతిష్టంభన ఇప్పటికీకొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం డ్రైవింగ్ లైసెన్సు కోసం వినియోగదారుడు రూ.1550 వరకు చెల్లిస్తాడు. రవాణాశాఖ అందజేసే పౌరసేవల కోసం చెల్లించే ఫీజుతో పాటు, కార్డుపైన వాహనదారుడి వివరాలను ముద్రించి ఒక ప్రామాణికమైన డ్రైవింగ్ లైసెన్సు రూపంలో పోస్టు ద్వారా అందజేసేందుకు రూ.35 పోస్టల్ చార్జీలతో సహా రూ.250 సేవా రుసుం, ఇతరత్రా అన్ని ఖర్చులను ముందే చెల్లిస్తాడు. గతంలో డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలు పూర్తయిన వెంటనే నేరుగా లైసెన్స్ ఇచ్చేవారు. ఆర్సీలూ అంతే. వాహనదారుల చిరునామా ధ్రువీకరణ కోసం కొంతకాలంగా పోస్టు ద్వారా పంపిణీ చేస్తున్నారు. వారం రోజుల్లో వినియోగదారుడికి చేరేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. కానీ అన్ని రకాల ఫీజులు, సర్వీసు చార్జీలు చెల్లించిన సుమారు లక్షా 75 వేల మంది వినియోగదారులకు గత రెండు నెలలుగా స్మార్ట్ కార్డులు అందడం లేదు. ఒక్కో వినియోగదారుడు సగటున రూ.1500 ఫీజు చెల్లించినట్లు భావించినా ఈ రెండు నెలల్లో రవాణాశాఖ ఖజానాలో జమ అయిన మొత్తం అక్షరాలా రూ.26.25 కోట్లపైనే.. అంటే వాహనదారుల నుంచి ముందుగానే ఫీజుల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసిన రవాణశాఖ వారికి అందించాల్సిన స్మార్ట్‌కార్డుల విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏడాది కాలంగా ఈ సమస్య పదే పదే పునరావృతమవుతోంది. ఈ ఏడాది కాలంలో పౌరసేవలపైన వినియోగదారుల నుంచి వందల కోట్ల రూపాయలు ఆర్జించిన రవాణాశాఖ.. వారికి అందజేయవలసిన పౌరసేవలపైన మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యానికి ప్రదర్శిస్తోంది. బకాయిలు రూ.4 కోట్లే ప్రతినెలా 1.15 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను ముద్రించి పంపిణీ చేస్తారు. ఇందుకోసం వినియోగించే స్టేషనరీని పూణేకు చెందిన ఎంటెక్ ఇన్నొవేషన్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు. సాధారణంగా వినియోగదారుల డిమాండ్ మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సంస్థ 6 లక్షల కార్డులను రవాణాశాఖకు అందజేస్తుంది. అలాగే ముంబైకి చెందిన శ్రీనాథ్ ఎంటర్ప్రైజెస్ స్మార్ట్ కార్డుల ముద్రణకు అవసరమైన రిబ్బన్‌ను సరఫరా చేస్తుంది. ప్రతి 3 నెలలకోసారి ఈ రెండు సంస్థలకు నిధులు చెల్లించాలి. ఎంటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఇంకా 9 నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ రూ.4 కోట్ల మేర బకాయీలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆ సంస్థ మే నెలాఖరు నుంచి కార్డుల సరఫరాను నిలిపివేసింది. అప్పటి వరకు అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నిల్వ ఉన్న కార్డులను పంపిణీ చేయగా జూన్ నుంచి తీవ్ర కొరత ఏర్పడింది. వాహనదారులకు రెండు విధాలా నష్టం.. ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహనదారులు రెండు విధాలుగా నష్టపోతున్నారు. అన్ని రకాల ఫీజులు చెల్లించి సకాలంలో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు అందుకోలేకపోవడం ఒకటైతే.. సరైన ధ్రువపత్రాలు లేవనే కారణంతో ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం రెండోది. చాలా వరకు తమ వద్ద ఉన్న రశీదుల ఆధారంగా వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నుంచి బయటపడుతున్నప్పటికీ అవి కోల్పోయిన వారు మాత్రం తగిన ‘మూల్యం’ చెల్లించకతప్పడం లేదు. ఇలా ప్రతి రోజు సుమారు 250 మంది డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు లేక చలానాలు కడుతున్నారు. -
ఫిట్.. లెస్..
తణుకు: పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల్లో పిల్లలను చేర్పించుకునేందుకు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించిన పాఠశాలల యాజమాన్యాలు సకాలంలో అడ్మిషన్లు కూడా పూర్తి చేసుకున్నాయి. అయితే పిల్లలను ప్రతిరోజు ఇంటి నుంచి స్కూల్‌కు, స్కూల్ నుంచి ఇంటికి తరలించే బస్సులను నిబంధనల ప్రకారం సిద్ధం చేయడంలో మాత్రం ఆసక్తి చూపడంలేదు. చిన్నారులను కొందరు తల్లిదండ్రులు తమ సొంత వాహనాలపై తీసుకెళుతున్నారు. మరికొందరు పాఠశాల బస్సుల్లో పంపుతున్నారు. ఇదిలా ఉంటే ఎక్కువ శాతం విద్యాసంస్థలు వారి బస్సుల ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. వి ద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లు తెరిచే నాటికి అన్ని స్కూళ్లు, కాలేజీల బస్సులకు ఫిట్నెస్లు పొందాలని ఇప్పటికే రవాణాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గత నెల 15 నుంచి ఆయా రవాణాశాఖ కార్యాలయాల్లో ప్రత్యేకంగా స్కూల్, కాలేజీ బస్సుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో తమ పిల్లలను చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు వాటినే ఆశ్రయిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోయినా వాటికి ఉన్న క్రేజ్‌తో రూ.వేలకు రూ.వేలు వెచ్చించి తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఫీజులు, పుస్తకాల ధరలమోత ఆకాశాన్నంటుతుంటే మరోవైపు ట్రాన్స్పోర్ట్ ఫీజు అంటూ కనీసం రూ.3 వేలు నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. అయితే ఆ బస్సులు ఏ కండిషన్లో ఉన్నాయనే విషయాన్ని పట్టించుకోవటం లేదు. జిల్లాలో మొత్తం 2,485 స్కూలు బస్సులు ఉండగా వీటిలో శుక్రవారం నాటికి 1,869 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. మరో 616 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఉదయం పిల్లలతో స్కూలుకు బయల్దేరిన సరైన కండిషన్ లేని బస్సులు మధ్యలో మొరాయిస్తుంటే రోడ్డు పక్కన గంటల తరబడి నిలిపి వాహనం మరమ్మతులు పూర్తయిన తర్వాత బయల్దేరిన సంఘటనలు కూడా లేకపోలేదు. స్కూల్ బస్సులు చిన్నపాటి ప్రమాదాలతో గండం గట్టెక్కిన సందర్భాలు గతేడాదిలో పదికి పైగానే ఉన్నాయి. తణుకు ప్రాంతంలోనే మూడు పర్యాయాలు బస్సులు మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ సంఘటనల్లో íపిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే పాఠశాలలు తెరిచినా ఇంకా జిల్లాలో 616 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించకపోవటం ఆయా విద్యాసంస్థల యాజమాన్యాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పాటించాల్సిన నిబంధనలు ఇవే.. ♦ ప్రైవేటు విద్యాసంస్థలు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు వాహనంలో కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించాలి. అయితే తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇష్టమొచ్చినట్లు పాతవాహనాలను, అనుభవంలేని డ్రైవర్లను నియమించి విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులను తిప్పుతున్నారు. ♦ మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం పాఠశాల బస్సులో తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ♦ సామర్థ్యాన్ని బట్టి పిల్లలను ఎక్కించుకోవాలి. సామర్థ్యానికి మించి రెండు, మూడు రెట్లు పిల్లలను ఎక్కించుకుని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ♦ స్కూల్, కాలేజీ బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు ఎక్ట్సింగ్విషర్ తప్పకుండా అమర్చాలి. అయితే బస్సుల్లో అది కనిపించదు. ♦ బస్సులు అనుకోని పరిస్థితుల్లో ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు విద్యార్థులు బయట పడేందుకు వీలుగా అత్యవసర ద్వారం ఉండాలి. అయితే బస్సులకు గ్రిల్ వేసి అత్యవసర ద్వారం లేకుండా చేస్తున్నారు. ♦ పాఠశాల బస్సులను నడిపే డ్రైవర్‌కు అయిదేళ్ల అనుభవంతోపాటు లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి. తక్కువ జీతానికి వృద్ధులను డ్రైవర్లుగా తీసుకుని విద్యార్థులను ప్రమాదాలకు గురి చేస్తున్నారు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులతో అప్పుడప్పుడు పరీక్షలు చేయించి సంబంధిత ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉన్నప్పటికీ అవేమీ లేకుండానే కొనసాగిస్తున్నారు. ♦ ప్రయాణంలో పిల్లలను ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యం చేయడానికి ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కూడా అందుబాటులో లేకుండా బస్సులు నడుపుతున్నారు. ♦ చిన్నపిల్లలు బస్సు ఎక్కడానికి వీలుగా మెట్లు ఏర్పాటు చేయాలి. అయితే ప్రైవేటు స్కూలు బస్సులు ఎత్తుగా ఉండటంతో ఎక్కలేక విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. -
ఆర్టీఏ సేవలన్నీ ఆన్లైన్లోనే..!
సాక్షి, విశాఖపట్నం: రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ) ఇక అన్ని సేవలను ఆన్లైన్ ద్వారానే అందించనుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఇకపై గ్రామస్థాయిలోనూ డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. కొన్నాళ్ల నుంచి మీసేవ కేంద్రాల ద్వారా పూర్తిస్థాయి ఆర్టీఏ సేవలు పొందడానికి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా వినియోగదార్లు ఇబ్బందులు పడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఓన్డ్ కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. సీఎస్సీలు ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మీ–సేవ కేంద్రాల ద్వారా రవాణా శాఖ అందించాలనుకున్న సేవలను ఉపసంహరించుకుంది. వాటి స్థానంలో కొత్తగా అత్యాధునిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన సీఎస్సీలను ఇందుకోసం వినియోగించనుంది. ఉత్తరాంధ్రతో పాటు పొరుగున ఉన్న తూర్పు గోదావరి జిల్లాతో వెరసి 2500 వరకు సీఎస్సీలు నడుస్తున్నాయి. విశాఖ జిల్లాలో 970, శ్రీకాకుళం 469, విజయనగరం 450, తూర్పు గోదావరి జిల్లాలో 611 సీఎస్‌సీలున్నాయి. ప్రస్తుతం ఈ సెంటర్ల ద్వారా పాన్‌కార్డులు, ఓటరు కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్, టెలికాం బిల్లుల చెల్లింపు, వివిధ సర్టిఫికెట్లు పొందడం వంటి సేవలను వినియోగించుకుంటున్నారు. తాజాగా వాటి జాబితాలోకి ఆర్టీఏ సేవలను కూడా చేర్చారు. గ్రామస్థాయిలో ఉన్న వీటి ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్టీఏ సేవలు చేరువవుతాయి. ఇవి అందుబాటులోకి వస్తే డ్రైవింగ్ లైసెన్సులకు స్లాట్ల బుకింగ్, లెర్నింగ్ (ఎల్ఎల్ఆర్)/డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందడం, రెన్యూవల్ (నవీకరణ) చేయించుకోవడం, వాహనాల ఓనర్షిప్ల బదిలీలు, చిరునామా మార్పు, డూప్లికేట్లకు దరఖాస్తు చేసుకోవడం వంటి వాటి కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాదు. అందుబాటులో ఉన్న సీఎస్సీల ద్వారానే ఈ ఆర్టీఏ సేవలను తేలికగా పొందవచ్చు. ఇన్నాళ్లూ వీటి కోసం విశాఖ ఏజెన్సీలోని దూరప్రాంతాల నుంచి అనకాపల్లి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చేవారు. వారు ఆ కార్యాలయానికి చేరుకునే సరికి సమయం (మధ్యాహ్నం రెండు గంటలు) మించిపోయేది. దీంతో మళ్లీ మర్నాడో, మరో రోజో రావలసి వచ్చేది. ఇకపై సీఎస్‌సీలకే ఆర్టీఏ సేవలను అనుసంధానం చేయడం వల్ల వారికి సమీపంలోని కేంద్రాలకు వెళ్లి ఆర్టీఏ సేవలు పొందడానికి వీలవుతుంది. అంతేకాదు.. ఆర్టీఏ కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్నాహ్నం రెండు గంటల వరకే సేవలు పొందడానికి అనుమతిస్తారు. అదే సీఎస్సీల్లో అయితే ఉదయం నుంచి సాయంత్రం ఆరు, ఏడు గంటల వరకు, సెలవు రోజుల్లోనూ తెరిచే ఉంచుతారు. వీటి నిర్వహణపై సంబంధిత సీఎస్సీ ఆపరేటర్లకు విశాఖ నగరంలోనూ, జిల్లాలోని అనకాపల్లిల్లోనూ శిక్షణ ఇస్తున్నట్టు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. మార్చి నెల నుంచి సీఎస్సీల ద్వారా ఆన్లైన్లో ఆర్టీఏ సేవలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానున్నాయి. -
‘కార్డు’లెస్ డ్రైవింగ్!
గ్రేటర్ పరిధిలోని రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డుల కొరత మళ్లీ మొదటకొచ్చింది. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనప్పటికీ చాలా మంది వినియోగదారులకు సకాలంలో డ్రైవింగ్ లైసెన్సులు లభించడం లేదు. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఆర్సీలు చేతికందడం లేదు. కార్డుల తయారీ, ముద్రణకు అవసరమైన ఇంక్ రిబ్బన్ తదితర సామగ్రిని పంపిణీ చేసే కాంట్రాక్టర్ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం, తరచూ కాంట్రాక్టర్లు మారుతుండడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీంతో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేక వాహనదారులు జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఏడాది కాలంగా ఈ పరిస్థితి నెలకొన్నా అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ఆర్సీ కార్డుల జారీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో వాహనదారులు నానాపాట్లు పడుతున్నారు. అన్ని ఆఫీసుల్లోనూ వేల సంఖ్యలో కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. సమస్య తీవ్రంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి కొద్ది మొత్తంలో స్టేషనరీ సరఫరా చేస్తూ అప్పటికప్పుడు దాటవేయడం మినహా శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు అధికారుల మధ్య సమన్వయలోపం కూడా కార్డుల కొరతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వేల సంఖ్యలో పెండింగ్.... గ్రేటర్‌లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, మెహిదీపట్నం, మేడ్చల్, అత్తాపూర్, కొండాపూర్, నాగోల్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ, కూకట్పల్లి తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు సుమారు 2000 కొత్త వాహనాలు, మరో 1500 డ్రైవింగ్ లైసెన్సులకు కార్డులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 3500 నుంచి 4000 కార్డులు అవసరం. కార్డులతో పాటు వాటిపైన అక్షరాలను ప్రింట్ చేసేందుకు వినియోగించే రిబ్బన్‌కు కూడా డిమాండ్ మేరకు సరఫరా కావడం లేదు. గతంలో 3 నెలల గరిష్ట డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని స్టేషనరీ నిల్వలలు ఉంచేవారు. దీంతో కార్డుల ప్రింటింగ్, పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. కానీ ఏడాది కాలంగా తరచుగా కార్డుల పంపిణీలో సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల కార్డులు ఉంటే రిబ్బన్ ఉండడం లేదు. రిబ్బన్ ఉన్న చోట కార్డుల కొరత ఉంది. ఎందుకీ నిర్లక్ష్యం.... డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ సేవలను కోరే వినియోగదారులు రూ.1500 నుంచి రూ.2000 వరకు ఫీజులు చెల్లిస్తారు. తాము పొందే కార్డు చార్జీలు, రవాణా అధికారులు చేసిన సేవల రుసుము, ఆ కార్డులను ఇంటికి పంపించేందుకు అయ్యే పోస్టల్ చార్జీలతో సహా అన్ని రుసుములు కలిపి ముందుగానే డబ్బులు చెల్లిస్తారు. ఆర్టీఏ పౌరసేవల కోసం స్లాట్ నమోదు చేసుకోవడంతో పాటే ఈ ఫీజుల చెల్లింపు కూడా జరిగిపోతుంది. కానీ సేవల్లో మాత్రం తీవ్రమైన జాప్యం నెలకొంటోంది. ఇందుకు అధికారుల నిర్లక్ష్యం, సమన్వయలోపమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం డిసెంబర్లోనే పాతకాంట్రాక్ట్ సంస్థ గడువు ముగిసింది. తిరిగి దాని స్థానంలో కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకోలేదు. అలాగని పాతసంస్థతో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే అవసరం మేరకు పాత కాంట్రాక్టర్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికపైన స్టేషనరీ కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల తరచుగా కొరత తలెత్తుతోంది. ఒక్కో ఆఫీసులో సుమారు ఐదు వేల చొప్పున కార్డులు పెండింగ్‌లో ఉంటున్నాయి. వారం రోజుల్లో వినియోగదారుడికి చేరాల్సిన లైసెన్సు నెల రోజులైనా అందడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడమే కారణం... రవాణాశాఖకు సంబంధించిన విధానపరమైన అంశాల్లో, పౌరసేవల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనేందుకు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పటి కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఆర్థిక శాఖకు బదిలీ అయి ఏడాది గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదు. సీనియర్ అధికారుల్లో ఎవ్వరికీ ఆ బాధ్యతలను అప్పగించలేదు. దీంతో వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. మరోవైపు ప్రతిఫైల్‌ను ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి సెక్రెటేరియట్‌లోని రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ వద్దకు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఇలా వేలాది మంది వాహన వినియోగదారులకు సంబంధించిన పౌరసేవల అమల్లోనూ నిర్లక్ష్యం చోటుచేసుకొంటోంది. -
ఆటో పర్మిట్ల బ్లాక్.. డ్రైవర్లకు షాక్!
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటో పర్మిట్ల దందాకు మళ్లీ తెరలేచింది. నగరంలో కొత్త ఆటో పర్మిట్లు విడుదలైన ప్రతిసారీ నిరుపేద డ్రైవర్ల సొమ్మును ఫైనాన్షియర్లు, డీలర్లు కొల్లగొడుతున్నారు. ఆటోమొబైల్ తయారీదారులు నిర్ణయించిన ధర ప్రకారం ఒక ఆటోరిక్షా రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు డ్రైవర్‌కు లభించాలి. కానీ, కొందరు ఫైనాన్షియర్లు, డీలర్లు కుమ్మక్కై బినామీ ఆటోడ్రైవర్ల పేరుతో పర్మిట్లను బ్లాక్ చేస్తున్నారు. తరువాత ఒక్కో ఆటోను రూ.2.5 లక్షలకు విక్రయిస్తున్నారు. ఎలాగైనా సొంతంగా ఆటోరిక్షాను సంపాదించుకోవాలనుకునే డ్రైవర్లు ఫైనాన్షియర్ల చక్రవడ్డీకీ, ధనదాహానికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మరో 686 కొత్త ఆటోలకు అనుమతినిచ్చింది. తాజాగా మరో జీవో విడుదల: నగరంలో వాహన కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా 2002లో కొత్త ఆటోలపై అధికారులు నిషేధం విధించారు. ఈ నిషేధమే ఆటోడీలర్లు, ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తోంది. నగరంలోని సుమారు 1.4 లక్షల ఆటోల్లో 80 శాతం ఇప్పటికీ ఫైనాన్షియర్ల గుప్పిట్లోనే ఉన్నాయి. చక్రవడ్డీకి అప్పులిచ్చి ఆటోడ్రైవర్లకు ఆటోలను కట్టబెట్టడం, వాళ్లు డబ్బులు చెల్లించుకోలేని స్థితిలో తిరిగి వాటిని స్వాధీనం చేసుకొని మరో డ్రైవర్‌కు విక్రయించడం, అక్కడా అప్పు చెల్లించకుంటే జప్తు చేయడం సర్వసాధారణంగా మారింది. గతంలో ఇవ్వగా మిగిలిపోయిన 686 పర్మిట్లకు ప్రభుత్వం రెండు రోజుల క్రితం అనుమతినిస్తూ జీవో విడుదల చేసింది. ఈ పర్మిట్లపై ఇప్పటికే బినామీ పేర్లతో ప్రొసీడింగ్స్ సంపాదించిన ఫైనాన్షియర్లు తాజాగా దందాకు తెరలేపారు. ఆర్టీఏలోనే ప్రొసీడింగ్స్ ఇవ్వాలి... ఆటోడ్రైవర్లపై దోపిడీని అరికట్టి బ్లాక్ మార్కెట్‌కు అవకాశం లేకుండా ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలోనే నిజమైన ఆటోడ్రైవర్లను గుర్తించి ప్రొసీడింగ్స్ (అనుమతి పత్రాలు) ఇవ్వాలని ఆటోసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దందాకు ఆస్కారమిచ్చేవిధంగా ఇప్పటివరకు షోరూమ్‌లలో ప్రొసీడింగ్స్ ఇచ్చేవారని తెలంగాణ ఆటోడ్రైవర్ల సంఘం అధ్యక్షుడు వి.మారయ్య, తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం నాయకులు ఎ.సత్తిరెడ్డి, అమానుల్లాఖాన్ పేర్కొన్నారు. ప్రొసీడింగ్ల జారీలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా రవాణా అధికారులు శ్రద్ధ చూపాలని కోరారు. -
లెఫ్ట్ టు రైట్‌కు ‘టెస్ట్’..!
ఎడమ నుంచి కుడికి మారాలంటే పరీక్ష పాసవ్వాల్సిందే కనీస శిక్షణ ఉంటేనే విదేశీ డ్రైవింగ్ లైసెన్సుల మార్పిడి హైదరాబాద్ ట్రాఫిక్‌పై అవగాహన ఉండాలంటున్న నిపుణులు ప్రస్తుతం డేటా ఆధారంగానే లైసెన్సుల బదిలీ లైసెన్స్ బదిలీ విధానంలో మార్పులకు ఆర్టీఏ సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేశారా..? ఆ దేశంలో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సును ఇక్కడికి బదిలీ చేసుకోవా లని అనుకుంటున్నారా..? అయితే మీరు కొంతకాలం డ్రైవింగ్‌లో శిక్షణ పొందాల్సిందే. హైదరాబాద్ ట్రాఫిక్ నిబంధనలకు అనుగు ణంగా వాహనం నడిపే నైపుణ్యం సాధిస్తేనే మీ డ్రైవింగ్ లైసెన్సు బదిలీ అవుతుంది. అమెరికా యే కాదు.. ఏ విదేశీ డ్రైవింగ్ లైసెన్సు అయినా మార్చుకోవాలంటే డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరు కావలసిందే. ఇప్పటి వరకు ఆయా దేశాల్లో పొందిన డ్రైవింగ్ లైసెన్సుల ఆధారంగా ఇక్కడ కొత్తగా లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. ఈ విధానంలో మార్పులు అవసరమని రవాణా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆర్టీఏ అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. లెఫ్ట్ టూ రైట్ కోసం.. విదేశాల్లో ఎక్కువ శాతం ఎడమ వైపు స్టీరింగ్ ఉంటుంది. అక్కడ వాహనాలు నడిపే వాళ్లంతా ఎడమవైపు డ్రైవింగ్‌లో అనుభవం ఉన్నవాళ్లు. పైగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోని ట్రాఫిక్ నిబంధనలకు, మన నిబంధనలకు ఎంతో తేడా ఉంటుంది. రోడ్డు నిర్మాణంలోనూ మార్పులుంటాయి. హైదరా బాద్‌లో ట్రాఫిక్ ఎక్కువ. మన రోడ్లపై 18 నుంచి 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లడం సాధ్యం కాదు. ఇక్కడి రోడ్లన్నీ కుడివైపు డ్రైవింగ్‌కు అనుగుణమైన నిబంధనలతో ఉన్నాయి. అయితే ఈ మార్పులను పరిగణన లోకి తీసుకోకుండా అమెరికా లైసెన్సు కలిగి ఉన్నవాళ్లకు ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో డ్రైవింగ్ లైసెన్సు ఇచ్చేస్తున్నారు. స్పీడ్‌పై నియంత్రణ లేకపోవడం.. ట్రాఫిక్ రద్దీ తదితర కారణాలతో వాహనదారులు తరచు అదుపు కోల్పోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి రోడ్డు నిర్మాణం, ట్రాఫిక్ నిబంధనలు, ఎడమ నుంచి కుడికి స్టీరింగ్ మార్పుపై కొంత శిక్షణ అవసరమని నిఫుణులు భావిస్తున్నారు. లైసెన్సు మార్చుకునేందుకు వచ్చేవారికి ఆర్టీఏ డ్రైవింగ్ ట్రాక్‌ల్లో పరీక్షలు నిర్వహించి లైసెన్సులిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనువాదం ఉండాలి.. విదేశాల్లో తీసుకునే డ్రైవింగ్ లైసెన్సులు ఎక్కువ శాతం ఇంగ్లిష్‌లోనే ఉన్నప్పటికీ.. సౌదీ అరేబియా, దుబాయ్ తదితర దేశాల డ్రైవింగ్ లైసెన్సులు అరబిక్, ఉర్దూ భాషల్లో ఉంటాయి. ఇలాంటి లైసెన్సుల్లో డేటాను ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసుకుని ఆర్టీఏలో సమర్పించాలి. వీటిని ఇఫ్లూ యూనివర్సిటీలోనూ, ఇతర అధికారిక అనువాదకుల వద్ద ట్రాన్స్‌లేట్ చేసుకోవలసి ఉంటుంది. మన డ్రైవింగ్ లైసెన్సుల్లో ‘ఎంసీ (మోటార్ సైకిల్), ఎల్ఎంవీ(లైట్ మోటార్ వెహికల్) వంటి పదాలు ఉంటాయి. విదేశీ లైసెన్సుల్లో ‘ఎ,’‘బి’, ‘సి’, ‘డి’వంటి అక్షరాలు ఉంటాయి. ఏ అక్షరం ఏ వాహనానికి సంకేతం అనేది ఆయా దేశాల్లోని రవాణా కార్యాలయాల్లో మాత్రమే నమోదై ఉంటుంది. డేటా మార్పిడిలో ఇలాంటి సాంకేతిక పదజాలం కూడా మారుతుంది. అలాగే విదేశాల్లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సుకు కాలపరిమితి ఎంత వరకు ఉంటే అంతవరకే ఇక్కడ ఇస్తారు. ‘‘మనం ఇచ్చే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లను(ఐడీపీ) కొన్ని దేశాల్లో పరిగణనలోకి తీసుకోవడం లేదు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఇది ఒక డాక్యుమెంట్గానే నమోదై ఉంది. కానీ డ్రైవింగ్ లైసెన్సుగా కాదు. హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేసిన వాళ్లు ప్రపంచంలో ఎక్కడైనా వాహనం నడపగలరు. కానీ విదేశాల్లో డ్రైవింగ్ అనుభవం ఉన్నవాళ్లు ఇక్కడ నడపాలంటే కచ్చితంగా అవగాహన ఉండాల్సిందే’’అని ఆర్టీఏ అధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. ఏటా వందల్లో మార్పులు.. ప్రస్తుతం విదేశాల్లో పొందిన డ్రైవింగ్ లైసెన్సు కాలపరిమితికి అనుగు ణంగా ఎలాంటి టెస్టులు లేకుండానే ఇక్కడ లైసెన్సులు ఇస్తున్నారు. ఇందు కోసం వాహనదారులు హైదరాబాద్‌లో తమ శాశ్వత చిరునామా ధ్రువీకరణ, విదేశాల్లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సు డేటాను అందజేయాలి. ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకుని రూ.750 ఫీజు చెల్లించి.. నిర్ణీత తేదీ, సమయంలో ఆర్టీఏ అధికారులను సంప్రదిస్తే.. విదేశాల్లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సు డేటాను హైదరాబాద్ ఆర్టీఏకు మార్చుకుని కొత్త లైసెన్సు ఇస్తారు. అమెరికా, సింగపూర్, బ్రిటన్, దుబాయ్, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి ఈ తరహా లైసెన్సుల బదిలీ కోసం ఏటా వందలాది మంది వస్తుంటారు. -
ఆర్టీఏలో ‘శ్రీరామ్’ అనుచరుల దందా
– అడ్డదారిలో పనులు చక్కబెట్టుకుంటున్న వైనం – గోడదూకి కార్యాలయంలోకి వెళ్లిన ఏజెంట్ అనుచరుడు – మరుసటి రోజు అడ్డుకున్న సెక్యూరిటీపై విచక్షణారహితంగా దాడి అనంతపురం సెంట్రల్: మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పేరు చెప్పుకొని కొంతమంది వ్యక్తులు అనంతపురం రోడ్డు రవాణా శాఖ(ఆర్టీఏ) కార్యాలయంలో దందా చేస్తున్నారు. అనధికారికంగా కార్యాలయంలోకి ప్రవేశించి, పనులు చక్కబెట్టుకుంటున్నారు. అడ్డు వచ్చిన వారిపై దాడికి పాల్పడుతున్నారు. రోడ్డు రవాణా శాఖలో అక్రమాలను నివారించేందుకు ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) సుందర్‌వద్దీ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఏజెంట్లు, వారి అనుచరులు కార్యాలయంలోకి రాకూడదని ఆంక్షలు విధించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది డీటీసీ ఆదేశాలు గట్టిగా అమలు చేస్తున్నారు. కార్యాలయంలోకి వచ్చే వాహనదారులు ఏ పని మీద వస్తున్నారో రికార్డులను చూసి పంపిస్తున్నారు. అయితే పరిటాల శ్రీరామ్ పేరు చెప్పుకొని ఏజెంట్ చోటూ ఇక్కడ దందా కొనసాగిస్తున్నారు. ఆయన మనుషులు నేరుగా కార్యాలయంలోకి చొరబడి అధికారులను బెదిరించి పనులు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా గత బుధవారం ఏజెంట్ అనుచరుడు గోడదూకి ఫైళ్లు తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో మరుసటిరోజు సెక్యూరిటీ గార్డు పెద్దన్న వీరిపై నిఘా పెట్టాడు. కార్యాలయంలోకి వస్తుండడం చూసి అడ్డుకున్నాడు. చేసేది లేక సదరు వ్యక్తి జరిగిన విషయాన్ని ఏజెంట్‌కు తెలియజేశాడు. కోపోద్రిక్తుడైన ఏజెంట్ చోటూ ఇద్దరు మనుషులను వెంటబెట్టుకొని నేరుగా ఆర్టీఏ కార్యాలయంలోకి వచ్చి సెక్యూరిటీపై దాడికి తెగబడ్డాడు. ‘రేయ్ ఏమనుకుంటున్నావ్. పరిటాల శ్రీరామ్ మనుషులైన మమ్మల్నే అడ్డుకుంటావా’ అంటూ ఇష్టానుసారం చితకబాదాడు. దాడి దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీగార్డుపై ఇష్టానుసారం దాడి చేసిన ఏజెంట్‌పై ఎలాంటి చర్యలూ లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. బాధితుడు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దాడి చేసిన వ్యక్తి పరిటాల శ్రీరామ్ అనుచరుడు కావడంతో కేసు నమోదు చేయకుండా పోలీసుల తాత్సారం చేశారు. అడ్డుకున్నందుకు దాడి చేశాడు : పెద్దన్న, సెక్యూరిటీగార్డు, బాధితుడు ఏజెంట్లకు కార్యాలయంలోకి అనుమతించరాదని డీటీసీ, ఆర్టీఓ ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు రాకుండా అడ్డుకున్నాను. అంతకు మించి నాకేమీ తెలియదు. అంతకుముందు రోజు గోడదూకి పోయాడు. మళ్లీ గురువారం వస్తే అడ్డుకోవడంతో ఇష్టానుసారం చేయిచేసుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాజీకావాలని చెబుతున్నారు. -
ముగ్గురు ఆర్టీఏ అధికారుల బదిలీ
అనంతపురం సెంట్రల్: రోడ్డు రవాణా శాఖ(ఆర్టీఏ)లో బదిలీల ప్రక్రియ పూర్తయ్యింది. ఇద్దరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఒక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు స్థాన చలనం కలిగింది. అనంతపురంలో ఎంవీఐగా పనిచేస్తున్న వరప్రసాద్, టాస్క్ఫోర్సు విభాగం ఎంవీఐ శేఖర్‌రావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాణి కర్నూలుకు బదిలీ అయ్యారు. వీరు శుక్రవారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. -
రావాణాయేతర వాహనాలకూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్
ఏలూరు అర్బన్: రోడ్డు రవాణా కార్యాలయంలో ఇక నుంచి నో ఫుట్‌ఫాల్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఎస్ఎస్ మూర్తి తెలిపారు. నగరంలోని రోడ్డు రవాణా కార్యాలయంలో శనివారం వాహనాల డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకూ రవాణా వాహనాలను ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు అనుమతించామని, ఇకపై రవాణేతర వాహనాలను కూడా ఈ విధానంలోకి తీసుకువస్తున్నామని చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్‌లో జాప్యాన్ని నివారించడం, అధికారులు, మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించే లక్ష్యంతో ఆన్లైన్ రిజిస్ట్రేసన్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. వాహనాల డీలర్లు, అమ్మకందారులు వాహనాన్ని విక్రయించిన సమయంలోనే టెంపరరీ రిజిస్ట్రేషన్ జనరేట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తే ఆర్టీవో కార్యాలయంలో సదరు అప్లికేషన్ అప్రూవల్ చేసి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ జనరేట్ అవుతుందని చెప్పారు. వాహనదారుడు ఆర్టీఏ కార్యాలయానికి రాకుండానే టీఆర్, పీఆర్, వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇంటి వద్దే అందుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఇకపై డీలర్లు, అమ్మకందారులు రవాణేతర వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఆన్లైన్లో జరపాలని ఆయన సూచించారు. -
ఆర్టీఏ ‘సేవ’ మరింత ఖరీదు
రవాణా శాఖ సేవల రుసుములు పెంచిన సర్కార్ సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖకు సంబంధించిన సేవలు ఇకపై మరింత భారం కాబోతున్నాయి. రవాణా శాఖ ఫీజులను జనవరిలో కేంద్రం పెంచగా ఇప్పుడు దానికి అనుబంధంగా సేవా రుసుములను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతోంది. ఫీజుల నియంత్రణ పూర్తిగా కేంద్రం పరిధిలో ఉండగా, సేవా రుసుములను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సవరించుకునే వెసులుబాటు ఉంది. ఈ మేరకు సేవా రుసుములు పెంచేందుకు కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం వాటిని ఖరారు చేసింది. దీంతో లైసెన్సు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఆర్సీ, పర్మిట్ ఫీజులు పెరగబోతున్నాయి. డ్రైవింగ్ లెసెన్సుపై సేవా రుసుము రూ.50 నుంచి రూ.100, రవాణా వాహనాల రుసుము రూ.50 నుంచి రూ.200, భారీ వాహనాల లైసెన్సు రుసుము రూ.150 నుంచి రూ.300, ఆర్సీ రుసుము ఆటోలతో పాటు ఇతర భారీ వాహనాలకు రూ.200 నుంచి రూ.400, ద్విచక్రవాహనాలకు రూ.100 నుంచి రూ.250, ఫిట్నెస్ సర్టిఫికెట్‌కు సంబంధించి ఆటోలకు రూ.30 నుంచి రూ.100, ఇతర వాహనాలకు రూ.60 నుంచి రూ.200, పర్మిట్లకు సంబంధించి ఆటోలకు రూ.50 నుంచి రూ.100, ఇతర వాహనాలకు రూ.100 నుంచి రూ.200గా నిర్ధారించారు. కొంతకాలంగా రవాణా శాఖ నుంచి ఆదాయాన్ని భారీగా పెంచుకోవాలని చూస్తున్న ప్రభుత్వం వీటిని పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,700 కోట్లు ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా రూ.2,400 కోట్లు సమకూరింది. ఈసారి ఆ మొత్తం కనీసం రూ.3 వేల కోట్లకు పెంచుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. -
ప్రైవేట్ బస్సులపై కొరడా
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై కొరడా ఝుళిపించారు. శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం పలు బస్సులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని 6 బస్సులను సీజ్ చేశారు. మరో 23 బస్సులపై కేసులు నమోదు చేశారు. -
అక్రమ రవాణాపై ఆర్టీఏ కొరడా
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ రవాణా పై ఆర్టీఏ కొరడా ఝళిపిచింది. బుధవారం తెల్లవారు జామున నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు రాజేంద్రనగర్, ఆరాంఘర్ చౌరస్తా, గగన్పహడ్లలో పోలీసులతో కలిసి ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశాయి. సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయరావు సారథ్యంలో చేపట్టిన ఈ దాడుల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న 90 బస్సులను తనిఖీ చేసి, కాంట్రాక్ట్ క్యారేజీలుగా అనుమతి తీసుకొని స్టేజీ క్యారేజీలుగా నడుపుతున్న 33 బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు సీట్లు ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున సరుకు రవాణాకు పాల్పడినందుకుగాను 11 బస్సులను సీజ్ చేశారు. అలాగే ప్రైవేట్ బస్సులతో పాటు అదే మార్గంలో నగరంలోకి ప్రవేశిస్తున్న 50 లారీలను తనిఖీ చేసి డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. 6 గురు లారీ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఓవర్‌లోడ్‌పై ఉక్కుపాదం... మరోవైపు హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మియాపూర్, రాజేంద్రనగర్‌లలో పరిమితికి మించి వస్తులను తరలిస్తున్న 21 ఓవల్ లోడ్ లారీలపై కేసులు నమోదు చేశారు. ఇసుక, కంకర పొడి,బియ్యం, తదితర వస్తువులను నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్ చేస్తున్నట్లు డీటీసీ ప్రవీణ్‌రావు తెలిపారు. రహదారి భద్రతకు విఘాతం కలిగిస్తున్న డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులను 6 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఓవర్‌లోడ్‌పై దాడులను మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపే సరుకు రవాణా, ప్రయాణికుల రవాణా వాహనాలు, వాటి యాజమాన్యాలు, డ్రైవర్లను సహించబోమని హెచ్చరించారు. -
ఐదు ప్రైవేటు బస్సులు సీజ్
రంగారెడ్డి: నగరంలోని శంషాబాద్ సమీపంలో ఐదు ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ సీజ్ చేసింది. శుక్రవారం ఉదయం ఆర్టీఏ చేపట్టిన తనిఖీల్లో 23 బస్సులు నిబంధనలు పాటించకుండా దొరికాయి. వీటిలో ఐదు బస్సులను సీజ్ చేసిన అధికారులు మిగిలిన 18 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
ఆర్టీఏలో మహిళల కోసం ప్రత్యేక కౌంటర్..
సాక్షి, హైదరాబాద్: రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ)లో మహిళలకు ప్రత్యేక సేవా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం మహిళలకు డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్స్, లెర్నింగ్ లైసెన్స్‌లు, వాహ నాల రిజిస్ట్రేషన్లు, ఇతరత్రా పౌరసేవలను ప్రత్యేక కౌంటర్ల నుంచే అందజేశారు. ఈ కేంద్రాల్లో మహిళా ఉద్యోగులు మాత్రమే విధుల్ని నిర్వహించడం విశేషం. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లెర్నింగ్ లైసెన్స్ మేళాకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన ఆర్టీఏ కేంద్రాల్లో మహిళలకు ఇకనుంచి ప్రత్యేక సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ జేటీసీ పాండురంగ్‌నాయక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మహిళల కోసం ప్రత్యేక సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీఏ ప్రత్యేక ఏర్పాట్ల పట్ల మహిళా వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. -
జిల్లాలో ట్రాఫిక్ పార్కులు
తణుకు: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడంతోపాటు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలో ట్రాఫిక్ పార్కుల నిర్మాణం చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మున్సిపాలిటీకి ఒకటి చొప్పున నిర్మించాలని రవాణాశాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా ప్రధాన కేంద్రంలోని ఏలూరు జిల్లా ఉపరవాణా కమిషనర్ కార్యాలయం పరిధిలో ఇప్పటికే డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటు చేయగా తాజాగా భీమవరం ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం పరిధిలోని ప్రైవేట్ స్థలంలో డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటుచేశారు. ఇదిలా ఉంటే తణుకు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం రవాణా శాఖ యూనిట్ కార్యాలయాల పరిధిలో ట్రాఫిక్ పార్కుల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో స్థల సేకరణకు ఇబ్బందులు తలెత్తడంతో మున్సిపల్ రిజర్వ్ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాహన పరీక్షలు ఏవీ..? జిల్లాలోని వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆయా రవాణాశాఖ కా ర్యాలయాల్లో పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. ఇం దులో ప్రాథమికంగా తీసుకునే ఎల్‌ఎల్‌ఆర్‌కు కంప్యూటర్లో పరీక్ష ఉత్తీర్ణత పొందాలి. కంప్యూటర్లో వచ్చే 20 ప్రశ్నల్లో 12 సరైన సమాధానాలు ఇవ్వ డం ద్వారా వాహనదారుడు ఉత్తీర్ణత చెం దినట్టు భావించి ఎల్ఎల్ఆర్ అందజేస్తారు. 30 రోజుల అనంతరం తీసుకునే శాశ్వత డ్రైవింగ్ లైన్స్ పొందడానికి సంబంధిత వాహనం నడపాల్సి ఉం టుంది. ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ ట్రాక్‌ల్లో వాహనం నడిపిన తర్వాత వాహనదారుడికి లైసెన్స్ మంజూరు చేయాలా లేదా అనేది మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే ఏలూరు, భీమవరం మినహా మిగిలిన ప్రాంతాల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న రోడ్డుపైనే పరీక్షించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వాహనదారులు పలు సందర్భాల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతోపాటు ట్రాఫిక్ నిబంధనలు, సూచికలు లేకపోవడంతో ట్రాఫిక్‌పై అవగాహన రావడంలేదు. దీంతో డ్రైవింగ్ లైసెన్సులు పొందుతున్నా క్షేత్రస్థాయిలో అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని గమనించిన అధికారులు జిల్లాలోని మున్సిపల్ కేంద్రాల్లో ట్రాఫిక్ పార్కుల పేరుతో డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మించాలనే ప్రతిపాదనను తీసుకువచ్చారు. స్థల సేకరణే సవాల్ ట్రాఫిక్ పార్కుల నిర్మాణం పేరుతో చేపట్టబోయే డ్రైవింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి స్థల సేకరణ అంశం ప్రతిబంధకంగా మారుతోంది. ఒక్కో ట్రాక్ నిర్మాణానికి ఎకరా నుంచి రెండెకరాల స్థలం అవసరముంటుంది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఎకరా రూ.కోటి వరకు పలుకుతుండటంతో డ్రైవింగ్ ట్రాక్‌ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపల్ కేంద్రాల్లో రిజర్వు స్థలాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అద్దె భవనాల్లో కార్యాలయాలు జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం యూనిట్ రవాణాశాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు ఉన్న ప్రాంతాల్లోనే కార్యాలయాలు ఉండాల్సిన పరిస్థితి. రిజర్వు స్థలాల్లో కార్యాలయాల నిర్మాణం సాధ్యం కాకపోవడంపై రవాణాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. డ్రైవింగ్ ట్రాక్‌లు ఒకచోట, కార్యాలయాలు మరోచోట ఉంటే ఫలితం ఉండదని వారంటున్నారు. ఆర్టీసీ డిపో స్థలాల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మించాలని గతంలో చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం మున్సిపాలిటీల పరిధిలోని ట్రాఫిక్ పార్కుల పేరుతో నిర్మాణం చేపట్టనున్న డ్రైవింగ్ ట్రాక్ పట్టాలెక్కుతుందో లేదో వేచి చూడాలి. -
జిల్లాలో ట్రాఫిక్ పార్కులు
తణుకు: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడంతోపాటు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలో ట్రాఫిక్ పార్కుల నిర్మాణం చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మున్సిపాలిటీకి ఒకటి చొప్పున నిర్మించాలని రవాణాశాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా ప్రధాన కేంద్రంలోని ఏలూరు జిల్లా ఉపరవాణా కమిషనర్ కార్యాలయం పరిధిలో ఇప్పటికే డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటు చేయగా తాజాగా భీమవరం ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం పరిధిలోని ప్రైవేట్ స్థలంలో డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటుచేశారు. ఇదిలా ఉంటే తణుకు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం రవాణా శాఖ యూనిట్ కార్యాలయాల పరిధిలో ట్రాఫిక్ పార్కుల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో స్థల సేకరణకు ఇబ్బందులు తలెత్తడంతో మున్సిపల్ రిజర్వ్ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాహన పరీక్షలు ఏవీ..? జిల్లాలోని వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆయా రవాణాశాఖ కా ర్యాలయాల్లో పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. ఇం దులో ప్రాథమికంగా తీసుకునే ఎల్‌ఎల్‌ఆర్‌కు కంప్యూటర్లో పరీక్ష ఉత్తీర్ణత పొందాలి. కంప్యూటర్లో వచ్చే 20 ప్రశ్నల్లో 12 సరైన సమాధానాలు ఇవ్వ డం ద్వారా వాహనదారుడు ఉత్తీర్ణత చెం దినట్టు భావించి ఎల్ఎల్ఆర్ అందజేస్తారు. 30 రోజుల అనంతరం తీసుకునే శాశ్వత డ్రైవింగ్ లైసె¯Œ్స పొందడానికి సంబంధిత వాహనం నడపాల్సి ఉం టుంది. ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ ట్రాక్‌ల్లో వాహనం నడిపిన తర్వాత వాహనదారుడికి లైసెన్స్ మంజూరు చేయాలా లేదా అనేది మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే ఏలూరు, భీమవరం మినహా మిగిలిన ప్రాంతాల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న రోడ్డుపైనే పరీక్షించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వాహనదారులు పలు సందర్భాల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతోపాటు ట్రాఫిక్ నిబంధనలు, సూచికలు లేకపోవడంతో ట్రాఫిక్‌పై అవగాహన రావడంలేదు. దీంతో డ్రైవింగ్ లైసెన్సులు పొందుతున్నా క్షేత్రస్థాయిలో అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని గమనించిన అధికారులు జిల్లాలోని మున్సిపల్ కేంద్రాల్లో ట్రాఫిక్ పార్కుల పేరుతో డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మించాలనే ప్రతిపాదనను తీసుకువచ్చారు. స్థల సేకరణే సవాల్ ట్రాఫిక్ పార్కుల నిర్మాణం పేరుతో చేపట్టబోయే డ్రైవింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి స్థల సేకరణ అంశం ప్రతిబంధకంగా మారుతోంది. ఒక్కో ట్రాక్ నిర్మాణానికి ఎకరా నుంచి రెండెకరాల స్థలం అవసరముంటుంది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఎకరా రూ.కోటి వరకు పలుకుతుండటంతో డ్రైవింగ్ ట్రాక్‌ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపల్ కేంద్రాల్లో రిజర్వు స్థలాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అద్దె భవనాల్లో కార్యాలయాలు జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం యూనిట్ రవాణాశాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు ఉన్న ప్రాంతాల్లోనే కార్యాలయాలు ఉండాల్సిన పరిస్థితి. రిజర్వు స్థలాల్లో కార్యాలయాల నిర్మాణం సాధ్యం కాకపోవడంపై రవాణాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. డ్రైవింగ్ ట్రాక్‌లు ఒకచోట, కార్యాలయాలు మరోచోట ఉంటే ఫలితం ఉండదని వారంటున్నారు. ఆర్టీసీ డిపో స్థలాల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మించాలని గతంలో చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం మున్సిపాలిటీల పరిధిలోని ట్రాఫిక్ పార్కుల పేరుతో నిర్మాణం చేపట్టనున్న డ్రైవింగ్ ట్రాక్ పట్టాలెక్కుతుందో లేదో వేచి చూడాలి. -
8న లేడీస్ స్పెషల్
♦ మహిళలకు ప్రత్యేకంగా లైసెన్స్ మేళా ♦ విమెన్ స్పెషల్ స్లాట్లు అందుబాటులోకి తెచ్చిన ఆర్టీఏ సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకొని అద్భుతమైన విజయాలను సాధిస్తున్న మహిళలు డ్రైవింగ్‌లో మాత్రం ఇంకా ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. ఇప్పటికీ డ్రైవింగ్ విషయంలో ఇతరులపైనే ఆధారపడి ఉన్నారు. డ్రైవింగ్‌లో అనుభవం, నైపుణ్యం ఉన్నప్పటికీ లైసెన్స్ తీసుకునే విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బహదూర్‌పురా, మెహదీపట్నం ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో 20,62,541 మంది మగవారు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉంటే మహిళలు 1,23,437 మంది మాత్రమే ఉన్నారు. సొంతంగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లేందుకు, స్లాట్ నమోదు చేసుకొనేందుకు మహిళలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ ‘మహిళా డ్రైవింగ్ లైసెన్స్ మేళా’కు శ్రీకారం చుట్టింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో మహిళలకు లెర్నింగ్ లైసెన్సులు అందజేయనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్లాట్ నమోదు చేసుకోవచ్చు... మార్చి 8న సికింద్రాబాద్, ఖైరతాబాద్, మలక్‌పేట్, మెహదీ పట్నం, బహదూర్‌పురా ఆర్టీఏ కార్యాలయాల్లో మహిళలు మాత్రమే లెర్నింగ్ లైసెన్సు తీసుకొనేలా స్లాట్స్ (సమయం+ తేదీ) ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఈ కేంద్రాల్లో మహిళా ఎంవీఐలు, మహిళా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి లెర్నింగ్ లైసెన్సులకు హాజరయ్యే మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారు. మిగతా కార్యాలయాలు ఉప్పల్, అత్తాపూర్, మేడ్చల్, కూకట్పల్లి, తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రత్యేకంగా స్లాట్స్ అందుబాటులో లేనప్పటికీ ఆ రోజు లెర్నింగ్ లైసెన్సుతో పాటు, వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే మహిళలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. -
‘స్మార్ట్’ వ్యథ!
► డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీలో నిర్లక్ష్యం ► వాహనదారులకు చేరవేయడంలో విఫలం ► ఆర్టీఏ, పోస్టల్ శాఖల మధ్య సమన్వయ లోపం ► నెలలు గడిచినా అందని స్మార్ట్‌కార్డులు ► వాహనదారులపై ఈ చలాన్ ల మోత సాక్షి, సిటీబ్యూరో బాగ్ అంబర్‌పేట్‌కు చెందిన నారాయణరావు మూడు నెలల క్రితం డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులను సంప్రదించారు. నిబంధనల మేరకు ఆన్ లైన్ స్లాట్ నమోదు చేసుకొని, ఈ సేవ ద్వారా ఫీజులు చెల్లించి, స్మార్ట్ కార్డు ఇంటికి స్పీడ్ పోస్టు చేసేందుకు అయ్యే రుసుము కూడా ఈ సేవా ద్వారానే చెల్లించి అధికారుల వద్దకు వెళ్లాడు. డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ ప్రక్రియను ముగించిన అధికారులు.. మరో వారంలో స్మార్ట్‌కార్డు పోస్టులో నేరుగా ఇంటికే వస్తుందన్నారు. ♦ గతేడాది నవంబర్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు ఆయన అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 3 నెలల క్రితమే కార్డు పోస్టు చేశామని చెప్పారు ఆర్టీఏ ఉద్యోగులు. ♦ ఇప్పుడు ఆ స్మార్ట్‌కార్డు సంబంధిత వినియోగదారుడు పేర్కొన్న చిరునామాకు చేరలేదు. అలాగని వెనక్కి తిరిగి రాలేదు. రవాణా అధికారుల వద్దకు తిరిగి రాకుండా, వాహనదారుడి చిరునామాకు చేరుకోకుండా ఆ విలువైన డ్రైవింగ్ లైసెన్సు స్మార్ట్ కార్డు ఏమైనట్లు... ♦ ఇది ఒక్క నారాయణరావు సమస్య మాత్రమే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు వందలాది వినియోగదారులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య. ♦ డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ ల కోసం వందల రూపాయల ఫీజులు చెల్లించినప్పటికీ సకాలంలో అందక అనేక మంది వినియోగదారులు ఆర్టీ ఏ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాస్తున్నారు. బాధ్యతారాహిత్యం... గ్రేటర్‌లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు సుమారు 3500 మంది వరకు వాహనాల రిజిస్ట్రేషన్ లు, డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన సేవలను పొందుతారు. ఈ వినియోగదారులందరికీ స్పీడ్ పోస్టు ద్వారా స్మార్ట్‌కార్డులను అందజేయవలసి ఉంటుంది. గతంలో వినియోగదారులకే ప్రత్యక్షంగా అందజేసే పద్ధతికి స్వస్తి చెప్పి స్పీడ్ పోస్టును ప్రవేశపెట్టారు. రవాణాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పద్ధతిలో వినియోగదారుల చిరునామా ధృవీకరణ ప్రధానమైన అంశం. కానీ ఆచరణలో మాత్రం లక్ష్యం నీరుగారుతోంది. కొన్నిసార్లు వినియోగదారులే సరైన చిరునామా నమోదు చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతుండగా చాలా సార్లు పోస్టల్ శాఖ బాధ్యతారాహిత్యం, రవాణా అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో స్మార్ట్‌కార్డులు వినియోగదారులకు చేరడం లేదు. కొన్ని స్మార్ట్‌కార్డులపై పోస్టల్ సిబ్బంది ‘డోర్‌లాక్’ అని ముద్ర వేసి వెనక్కి పంపుతుండగా, చాలా వరకు నెలలు దాటినా ఇటు ఆర్టీఏకు వెనక్కి తిరిగి రాక, అటు వినియోగదారుడికి చేరకుండా మధ్యలోనే బుట్టదాఖలా అవుతున్నాయి. ఇలాంటి వాటిపై రెండు శాఖల్లో ఎలాంటి సమన్వయం, నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. ఇదేం స్పీడ్‌పోస్ట్? ♦ ప్రతి రోజు గ్రేటర్ పరిధిలో సుమారు 3500 స్మార్ట్ కార్డులు బట్వాడా చేయవలసి ఉంటుంది. వివిధ కారణాల వల్ల వాటిలో 35 శాతం కార్డులు పెండింగ్‌లో పెట్టేస్తారు. ♦ బట్వాడా చేసిన 65 శాతం కార్డులలో కనీసం 15 శాతం కార్డులు వినియోగదారులకు చేరడం లేదు. ♦ మొత్తంగా రోజుకు 500 నుంచి 600 స్మార్ట్‌కార్డులు వినియోగదారులకు బట్వాడా కావడం లేదు. ♦ స్పీడ్ పోస్టు అంటే కనీసం 48 గంటల్లోనైనా వినియోగదారుడికి ఆ పోస్టు అందాలి. కానీ ఆర్టీఏ బట్వాడా చేసే కార్డులు వినియోగదారుడికి చేరేందుకు వారం నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి 15 రోజులు కూడా దాటుతోంది. ♦ ఇక నెలలు దాటినా పౌరసేవలను అందుకోలేకపోతున్న సగటు వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. -
ఫ్యాన్సీ నంబర్‌కు ఆన్లైన్ బ్రేక్
తణుకు : కొత్త వాహనం కొనుగోలు చేసినవారు గుర్తింపునిచ్చే (ఫ్యాన్సీ) నంబర్‌కు ప్రాధాన్యమిస్తుంటారు. కొందరు తమకు ఇష్టమైన నంబర్ కోసం ఎంతైనా వెచ్చిస్తుంటారు. దీనిద్వారా కోట్లాది రూపాయల ఆదాయం రవాణా శాఖకు సమకూరుతోంది. అయితే జిల్లాలో ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియ కారణంగా ఫ్యాన్సీ నంబర్లకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా కొత్త సాఫ్ట్వేర్ రూపొందించడంలో జరుగుతున్న జాప్యంతో నంబర్ల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రవాణాశాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం సాధారణ నంబర్లను సీరియల్ ప్రకారం కేటాయిస్తున్నారు. జిల్లాలో కొత్త సిరీస్‌లు జిల్లాలో ఏలూరులోని ఉపరవాణాశాఖ కార్యాలయంతోపాటు భీమవరంలోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాలకు అనుసంధానంగా తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు పట్టణాల్లో రవాణాశాఖ యూనిట్ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియతో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలిపివేశారు. ప్రస్తుతం వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌ల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రతి కార్యాలయానికి కొత్త సిరీస్‌ను కేటాయించారు. ఆన్లైన్లో కొనసాగుతున్న సిరీస్‌కు అనుబంధంగా ఆఫ్‌లైన్‌లో కొత్తగా సిరీస్‌ను కేటాయించారు. దీనిలో భాగంగా ఏలూరుకు 37/డీఈ, భీమవరం 37/సీయూ, తణుకు 37/సీఎస్, కొవ్వూరు 37/సీఆర్, తాడేపల్లిగూడెం 37/సీక్యూ, జంగారెడ్డిగూడెం 37/సీవీ సిరీస్‌లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ సిరీస్‌ల నంబర్ల కేటాయిస్తున్నారు. పాత సిరీస్‌లో ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలిచిపోయింది. పది నెలలుగా ఫ్యాన్సీ నంబర్ల కొరత ఏర్పడింది. ‘ఈ–బయ్’ ఎక్కడ..? ఆన్లైన్ ప్రక్రియలో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపునకు వీలుగా ‘ఈ–బయ్’ విధానం ప్రవేశపెట్టడానికి రవాణాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయితే నంబర్ దక్కించుకునేందుకు వేలంలో పాల్గొనే వారంతా బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డులతో లావాదేవీలు నిర్వహించాలి. వేలంలో నంబర్ దక్కని వారికి తిరిగి చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. తిరిగి చెల్లింపుల విషయంలో స్పష్టత రాకపోవడంతో ‘ఈ–బయ్’ విధానానికి బ్రేకులు పడ్డాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రవాణా శాఖకు ఏటా రూ.కోట్లు మేర ఆదాయం సమకూరుతుంది. ఒక్కో సిరీస్‌లో 0001 నుంచి 9999 వరకు నంబర్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో సిరీస్‌లో ఫ్యాన్సీ నంబర్ల ద్వారా సుమారు రూ.కోటి వరకు ఆదాయం వస్తున్నట్టు అంచనా. ఫ్యాన్సీ నంబర్‌కు కనీసం రూ.5 వేలు నుంచి గరిష్టంగా రూ.50 వేల వరకు ధర నిర్ణయించారు. కొన్ని నంబర్లను వేలంలో లక్షలు వెచ్చించి వాహనదారులు సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ విధానంతో కరెంట్ రిజర్వేషన్ కూడా నిలిచిపోయింది త్వరలో ఇబ్బందులు తొలగిస్తాం ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలిచిపోయింది. ఆన్లైన్లో ఫ్యాన్సీ నంబర్ల కోసం బిడ్లు ఆహ్వానించి నంబర్లు కేటాయించాల్సి ఉంది. తిరిగి చెల్లింపుల విషయంలో స్పష్టత రాలేదు. త్వరలోనే ఇబ్బందులన్నీ తొలగించి ఫ్యాన్సీ నంబర్లు కేటాయింపునకు చర్యలు తీసుకుంటాం. – ఎస్.సత్యనారాయణమూర్తి, డీటీసీ, ఏలూరు -
నేడు ఆర్టీఏలో ఎల్ఎల్ఆర్ స్పెషల్‌డ్రైవ్
అనంతపురం సెంట్రల్ : నాన్ ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్‌పోర్టు వాహనాలకు ఎల్ఎల్ఆర్ మంజూరు చేసేందుకు శనివారం స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సుందర్‌వద్దీ తెలిపారు. శుక్రవారం ఆయన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. నాన్ ట్రాన్స్‌పోర్టు ఆటోరిక్షా డ్రైవర్లు ట్రాన్స్‌పోర్టు వాహనాలకు ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్‌లు కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇలాంటి వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ప్రత్యేకంగా స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎల్ఎల్ఆర్ మంజూరు చేస్తామని వివరించారు. నెల రోజుల తర్వాత వారికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తామన్నారు. వయసు ధ్రువీకరణ పత్రం, స్కూల్ డిక్లరేషన్ సర్టిఫికెట్ లేకపోయినా వెరిఫికేషన్ చేసి ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్ ఎల్ఎల్ఆర్ మంజూరు చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఆర్టీఏ అధికారుల అప్రమత్తతో తప్పిన ముప్పు
-
ఆర్టీఏ అధికారుల అప్రమత్తతో తప్పిన ముప్పు
హైదరాబాద్: ఆర్టీఏ అధికారుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. బస్సు డివైడర్‌ను ఢీకొన్న పట్టించుకోకుండా అలాగే వెళ్తుండటంతో అనుమానం వచ్చిన ఆర్టీఏ అధికారులు బస్సును నిలిపివేసి తనిఖీలు చేయగా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. దీంతో అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రయాణికులను ఇతర వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చారు. ఈ సంఘటన నగరశివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. భద్రాచలం నుంచి 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తున్న AP28 TA 6599 భారతి ట్రావెల్స్ బస్సు హయత్‌నగర్ శివారులోని పెద్దఅంబర్‌పేట్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ విషయం గమనించని డ్రైవర్ యాదగిరి బస్సును అలాగే ముందుగు పోనిచ్చాడు. ఇది గుర్తించిన ఆర్టీఏ అధికారులు బస్సును వెంబడించి డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గమనించి అతన్ని హయత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
రవాణా రంగం నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర
– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏగఫూర్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కేంద్ర ప్రభుత్వం రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే కుట్ర పన్నుతోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యద్శి ఎంఏ గఫూర్ ఆరోపించారు. పెంచిన ఆర్టీఏ చలానా, జరిమానాలతో కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మోటార్స్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కార్యాలయంలో ఈ.పుల్లారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. నూతన మోటార్ ట్రాన్స్‌ఫోర్టు చట్టంతో కార్మికులు జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఫీజులను తగ్గించకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. మోటార్ ట్రాన్స్‌ఫోర్టు వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ సుభాన్ మాట్లాడుతూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక చాలా మంది యువకులు ఆటోలు, లారీలు, ఇతర వాహనానలు నడుపుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీరు రోజంతా కష్టపడితే వచ్చే నగదంతా చలానాలు, జరిమానాలు కట్టడానికే సరిపోతే వారి కుటుంబాల జీవనం ఎలా సాగించాలని ప్రశ్నించారు. ఇప్పటికే ఆర్టీఏ అధికారుల దాడులతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే చలానా, జరిమానాల ఫీజులను పెంచితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లాంగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మిన్నల్లా, లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు రామకృష్ణ, యూసుఫ్ మియ్యా, లైట్ వెహికల్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస యాదవ్, మెకానిక్స్ యూనియన్ నాయకులు గోవిందు పాల్గొన్నారు. పోరాట కమిటీ ఎన్నిక పెంచిన ఆర్టీఏ చలానా, జరిమాన ఫీజులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు పోరాట కమిటీని ఎన్నకున్నారు. కమిటీ కన్వీనర్‌గా సీఐటీయూ నాయకులు ఇ.పుల్లారెడ్డి, కోకన్వీనర్ మిన్నల్లా, యూసూఫ్మియాతోపాటు 12 రంగాల నుంచి 42 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. -
ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా
ఎల్బీనగర్: పండగ వేళ తీవ్ర రద్దీగా ఉన్న సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. రంగారెడ్డిజిల్లా హయత్‌నగర్ పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగురోడ్డు వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 28 బస్సులను గుర్తించి.. కేసులు నమోదు చేశారు. -
ఆర్టీఏ అధికారుల దాడులు
- వివక్షత చూపుతున్నారని తెలంగాణా ప్రాంత వాహన దారుల ఆందోళన శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం పరిసర ప్రాంతంలో ఆదివారం రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు. స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ కె. ఎల్ఎన్వీ ప్రసాద్ అటవీశాఖ కార్యాలయం వద్ద తెలంగాణా ప్రాంతం నుంచి వస్తున్న వాహనాలను నిలిపి పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని ఆరు వాహనాలకు అపరాధ రుసుం విధించారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం ఆంధ్రప్రాంతంలోని సున్నిపెంట వద్ద బార్డర్ చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణా ప్రాంతానికి చెందిన వాహదారులపై వివక్ష చూపుతున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు సిబ్బంది మామూళ్లు తీసుకుంటూ వాహనాలను వదిలేశారని ఆరోపించారు. కాగా బార్డర్ చెక్‌పోస్టు వద్ద నిలుపుదల చేస్తున్నా ఆపకుండా వెళ్లిన వాహనాలను స్పెషల్ స్క్వాడ్ అధికారులు అడ్డుకుని జరిమానా విధించారని ఆర్టీఓ రఘునాథ్ తెలిపారు. -
శంషాబాద్ దగ్గర ఆర్టీఏ తనీఖీలు
-
8న ఆర్టీఏలో వాహనాల వేలం
అనంతపురం సెంట్రల్ : వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 8న ఉప రవాణా కమిషనర్(డీటీసీ) కార్యాలయంలో వేలం వేస్తున్నట్లు డీటీసీ సుందర్‌వద్ది ఒక ప్రకటనలో తెలిపారు. 235 ఆటో రిక్షాలు, 47 గూడ్స్ వాహనాలు, 14 ద్విచక్ర వాహనాలు, 14 ట్రాక్టర్ ట్రాలీలు, 26 మ్యాక్సిక్యాబ్‌లు వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఈ వేలంలో పాల్గొను వారు రూ. 5 వేలు ధరావత్తు చెల్లించాలన్నారు. వాహనాలకు సంబంధించిన యజమానులు ఎవరైనా ఉంటే తగిన అపరాధ రుసుం చెల్లించి వెంటనే విడిపించుకోవాలని కోరారు. -
నేటి నుంచి షోరూంలలోనే రిజిస్ట్రేషన్
రవాణాశాఖలో సంస్కరణలు కొన్నచోటే శాశ్వత రిజిస్ట్రేషన్ వెంటనే నంబరు కేటాయింపు నెల్లూరు (టౌన్): రవాణాశాఖ పలు సంస్కరణల అమలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎల్ఎల్ఆర్, లైసెన్స్‌లకు సంబంధించి శ్లాట్‌ను ఆన్లైన్లో ప్రవేశపెట్టింది. ఇది విజయవంతం కావడంతో శనివారం నుంచి వాహనాలు కొన్న షోరూంల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పటి దాకా షోరూంలలో కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) మాత్రమే చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి పరుగు తీయాల్సి వచ్చేది. ఈ ప్రయాసలను తగ్గించేందుకు రవాణాశాఖ వాహనం కొన్నచోటే శాశ్వాత రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. షోరూంల డీలర్లకు గురు, శుక్రవారాల్లో ఆన్లైన్ విధానంలో శాశ్వత రిజిస్ట్రేషన్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫ్యాన్సీ నంబర్లు సైతం ఆన్లైన్లో.. వాహనాలకు సంబంధించి ఫ్యాన్సీ నంబర్లను సైతం వారం తర్వాత ఆన్లైన్లో ఉంచేందుకు రవాణాశాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో నెల్లూరుతో పాటు కావలి, గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు ప్రాంతాల్లో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో వాహనాలు రిజిస్ట్రేషన్లు, ఎల్‌ఎల్‌ఆర్‌లు, లైసెన్స్‌లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, రెన్యూవల్స్, ట్రాన్స్ఫర్లు తదితర 83 రకాలు సేవలు జరుగుతున్నాయి. ఈ సేవల కోసం ప్రతి వాహనదారుడు, వినియోగదారుడు రవాణా కార్యాలయానికి వెళ్లాల్సిని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రవాణా అధికారులు, ఏజెంట్లు కుమ్మక్కై వాహనదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారనే విమర్శలు రావడంతో వాహనదారుడు నేరుగా ఆన్లైన్లో సేవలు పొందే విధంగా రవాణాశాఖ చర్యలు చేపట్టింది. 24గంటల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ షోరూంల్లో ఆన్లైన్ విధానం ద్వారా వాహనానికి 24గంటల లోపు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇప్పటి దాక వాహనదారుడు కేవలం టీఆర్ మాత్రమే చేయించుకుని కొన్ని నెలల పాటు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా తిరుగుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక నుంచి షోరూంలో వాహనదారుడి సంతకం, వేలిముద్రలు తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయనున్నారు. ప్రతి దరఖాస్తు ఆన్లైన్లో రవాణాశాఖకు చేరుతుంది. సంతకం, ఆధార్‌కార్డులోని వేలిముద్రను సరిపోల్చడంతో సేవలు పూర్తవుతాయి. అనంతర వాహనదారుడు ఈమెయిల్ ఐడీకి వాహనానికి సంబంధించిన శాశ్వత రిజిస్ట్రేషన్ నంబరును పంపిస్తారు. కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు – శివరాంప్రసాద్, ఉప రవాణా కమిషనర్, రవాణాశాఖ వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. శనివారం నుంచి షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి వేలిముద్రలు, వాహనం ఫోటోలను షోరూం నిర్వాహకులు రవాణా కార్యాలయానికి అన్లైన్లో అనుసంధానం చేస్తారు. కార్యాలయంలో అధికారులు వాటిని నిర్ధారించిన తరువాత శాశ్వత రిజిస్ట్రేషన్‌ను చేయనున్నారు. -
ఆన్లైన్లో వాహనాల రిజిస్ట్రేషన్స్
నెల్లూరు రూరల్ : వాహనాల రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు ఉప రవాణా శాఖ కమిషనర్ శివరాం ప్రసాద్ తెలిపారు. కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల్లో ఆన్లైన్ వాహనాల రిజిస్ట్రేషన్‌పై రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, ఆటోమొబైల్స్ డీలర్లకు గురువారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శిక్షణకు హాజరుకానీ డీలర్ల వద్దకు నేరుగా తమ సిబ్బంది వెళ్లి శుక్రవారం వారికి అవగాహన కల్పిస్తారన్నారు. నెల్లూరు భార్గవి ఆటోమొబైల్ షోరూమ్‌లో ఈనెల 15వ తేదీన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని జిల్లా మంత్రి నారాయణ ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మోటారు తనఖీ అధికారులు, పరిపాలనాధికారులు, సీనియర్, జూనియర్ సహాయకులు, డీబీఏలు, డీలర్లు పాల్గొన్నారు. -
55 వాహనాలపై కేసులు నమోదు
2.5 లక్షల జరిమానా నెల్లూరు(టౌన్) : ఎలాంటి పత్రాలు లేకుండా తిరుగుతున్న పలు వాహనాలపై బుధవారం రవాణా అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, గాంధీబొమ్మ సెంటర్, మినీ బైపాస్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్ కాని, లైసెన్స్ లేకుండా తిరుగుతున్న 55 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి వారికి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో మోటారు వాహనాల అధికారులు బాలమురళీకృష్ణ, మురళీమోహన్, రామకృష్ణారెడ్డి, ఏఎంవీఐలు ప్రభాకర్, భాస్కర్, సిబ్బంది మురళీ పాల్గొన్నారు.