ఆన్‌లైన్ పౌరసేవలు మరింత సులభం
ప్రస్తుతం టీ యాప్ ఫోలియో ద్వారా లభ్యం
సాంకేతిక సామర్థ్యం పెంపు దశగా చర్యలు
హైదరాబాద్: ఆర్టీఏ పౌరసేవలను మరింత సులభతరం చేసేందుకు రవాణాశాఖ కసరత్తు చేపట్టింది. వాహనదారులు నేరుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం వివిధ రకాల పౌరసేవలను ఆన్‌లైన్ ద్వారా అందజేస్తున్నారు.
ఇందుకోసం వాహనదారులు టీ–యాప్ ఫోలియోలో స్లాట్ నమోదు చేసుకొని అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. త్వరలో ఈ ఆన్‌లైన్ పౌరసేవలను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు.
52 రకాల సేవలు..
కొత్తగా లెర్నర్స్ లైసెన్సులు పొందడం నుంచి గడువు ముగిసిన వాటిని పొడిగించుకోవడం, డ్రైవింగ్ లైసెన్సులు, వాటి పునరుద్ధరణ, డూప్లికేట్ లైసెన్సులు, వాహనాల నమోదు, వాహనాల బదిలీలు, చిరునామా మార్పు, పర్మిట్‌లు, త్రైమాసిన పన్ను చెల్లింపులు, అపరాధ రుసుములు వంటి సుమారు 52 రకాల పౌరసేవలను రవాణాశాఖ అందజేస్తోంది. కొత్తగా లైసెన్సు తీసుకొనేవారు మొదట ఆరీ్టఏలో నిర్వహించే లెరి్నంగ్ పరీక్షలకు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెల రోజులకు శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు తీసుకొనేందుకు మరోసారి డ్రైవింగ్ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షల్లో పాల్గొనాలి. ఈ రెండు రకాల లైసెన్సుల కోసం వాహనదారులు నేరుగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లవలసి ఉంటుంది. అలాగే వాహనాల నమోదు, ఫిట్‌నెస్ పరీక్షలు వంటి వాటి కోసం అధికారులను స్వయంగా సంప్రదించాలి. ఇవి కాకుండా చాలా వరకు ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు.
సాంకేతిక సామర్ధ్యం పెంపు..
రవాణా శాఖ అందజేసే అన్ని రకాల పౌరసేవలకు ప్రస్తుతం త్రీటైర్ సాంకేతిక వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఆన్‌లైన్ నుంచి గాని, ప్రత్యక్షంగా గాని వచ్చే దరఖాస్తులను పరిశీలించి అవసరమైన డాక్యుమెంట్లను, సరి్టఫికెట్లను రవాణా కమిషనర్ కార్యాలయం నుంచి అందజేస్తున్నారు. పౌరసేవల నిర్వహణలో కమిషనర్ కార్యాలయం ఒక కేంద్రీకృతమైన వ్యవస్థగా సేవలను అందజేస్తోంది. టీ– యాప్ ఫోలియోతో పాటు ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా సేవల సౌలభ్యాన్ని పెంచేందుకు సాంకేతిక సామర్థ్యాన్ని మరింత పెంచాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment