ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. ఆరు ట్రావెల్ సంస్థలపై కేసులు
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. సోమవారం హైదరాబాదాద్, విజయవాడలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడలో తనిఖీలను చిత్రీకరిస్తున్న మీడియాపై ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు దాడికి దిగాయి. సాక్షితో పాటు ఇతర మీడియా కెమేరాలను ట్రావెల్స్ సిబ్బంది లాక్కొని అసభ్య పదజాలంతో దూషించారు. విజయవాడలో సోమవారం తనిఖీలు చేపట్టారు. అన్‌లైన్ బుకింగ్‌లపై దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా పలు అక్రమాలు వెలుగుచూశాయి. బెంగళూరుకు పర్మిట్ తీసుకుని నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు టిక్కెట్లు అమ్మినట్లు గుర్తించారు. ఈ సంస్థలపై కేసులు నమోదు చేస్తామని ఆర్టీఏ అధికారులు తెలిపారు. దాడుల విషయాన్ని తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లి చిత్రీకరిస్తుండగా యాజమాన్యాలు తమ సిబ్బందిని రెచ్చగొట్టి దాడికి పురికొల్పాయి. దీంతో సిబ్బంది కెమేరాలు లాక్కుని విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. దాడికి దిగిన ముగ్గురిని మీడియా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
నేటి నుంచే పర్మిట్ల రద్దు అమల్లోకి: హైదరాబాద్ లకడీకాపూల్‌లోని ప్రైవేటు ట్రావెల్స్ బుకింగ్ కార్యాలయాలలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆన్‌లైన్ ద్వారా ప్రయాణికులను బుక్ చేసుకోవడం, వ్యక్తిగత టిక్కెట్‌లు ఇవ్వడం, ట్రావెల్ బుకింగ్ ఏజెంట్ లెసైన్స్ లేకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఆరు ట్రావెల్ సంస్థలపై కేసులు నమోదు చేశారు. కేశినేని, కాళేశ్వరి, కేబీఎన్, కృష్ణా, ధనుంజయ, బాలాజీ ట్రావెల్స్ వీటిలో ఉన్నాయి. ఆర్టీఏ హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్(జేటీసీ) రఘునాథ్ విలేకరులతో మాటాడుతూ ఇకపై నిబంధనలను పాటించని బస్సుల పర్మిట్లను సస్పెండ్ చేస్తామని, మంగళవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు.
ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా
Published Tue, Dec 31 2013 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement