
విశాఖపట్నం: విశాఖలో బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. సుమారు 450 పోలీస్ అధికారులు, సిబ్బందితో 92 బృందాలుగా 104 బార్లు, పబ్‌ల్లో ఏకకాలంలో తనిఖీ చేపట్టారు. ఇందులో సంబంధిత శాఖల నుంచి లైసెన్సులు లేకుండా వ్యాపారం, మైనర్లకు మద్యం విక్రయాలు, ఫైర్ ఎన్‌ఓసీలు, సీసీటీవీ, అక్రమ మద్యం, ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయాలు ఇలా అనేక అంశాలను క్షణ్ణంగా పరిశీలించారు.
ఈ తనిఖీల్లో 23 బార్లలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 14 బార్లకు ఫైర్‌ఎన్‌ఓసీ, 2 బార్లలో సీసీటీవీ కెమెరాలు, ఒకచోట ఫుడ్ లైసెన్స్ లేకుండా రెస్టారెంట్ నిర్వహణ, ట్రైడ్ లైసెన్సులు లేకుండా 2, పార్కింగ్ సదుపాయం లేకుండా 14, జీఎస్టీ లేకుండా ఒక బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు తేల్చారు. సదరు బార్లపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సిఫార్సు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment