bars and restaurants
-
ఢిల్లీలో బార్లు, రెస్టారెంట్లు మూసివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులు, పాజిటివిటీ రేటు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో మరిన్ని ఆంక్షలు విధించాలని డీడీఎంకే నిర్ణయించింది. ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నేతృత్వంలోని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిస్థితిని సమీక్షించేందుకు భేటీ అయింది. చదవండి: వైరల్: ‘సార్, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? పోలీసుల పంచ్ అదిరింది! ఈ మేరకు ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్న రెస్టారెంట్లు, బార్లను పూర్తిగా మూసివేస్తూ.. కేవలం టేక్‌అవేలకు మాత్రమే అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రతిపాదించింది. అలాగే మెట్రో రైళ్లు, బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం మళ్లీ తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే అమల్లో ఉన్న కరోనా ఆంక్షలను ఎన్సీఆర్ పరిధిలోనూ కఠినంగా అమలుచేయాలని డీడీఎంకే తీర్మానించింది. చదవండి: ఎవ్వరినీ వదలడం లేదు.. కరోనా బారిన పడ్డ మరో ఇద్దరు సీఎంలు -
న్యూ ఇయర్ : మందుబాబులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బుధవారం మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ కానుకగా రేపు అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే బార్లు, క్లబ్‌లకు రేపు(డిసెంబర్ 31) అర్థరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనాతో పాటుగా కొత్త స్ట్రెయిన్ వైరస్ భారత్‌లోకి ప్రవేశించడంతో అన్ని రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలపై నిషేధాజ్ఞలు విధించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అర్థరాత్రి వరకు మద్యం షాపులు ఓపెన్ చేయడంపట్ల మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అన్‌లాక్ 4 : ఢిల్లీలో తెరుచుకోనున్న బార్లు
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్ -4 మార్గదర్శకాల ప్రకారం ఢిల్లీలో బార్లకు సెప్టెంబర్ 9 నుంచి ట్రయల్ బేసిస్ పద్దతిలో తెరవనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం గురువారం పేర్కొంది. ఢిల్లీలో బార్లకు అనుమతి ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను ఇటీవలే కోరింది. కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్-4 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్ ప్రభుత్వం కోరినట్లు ఢిల్లీలో బార్లకు అనుమతి ఇస్తున్నట్లు అనిల్ బైజల్ తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 9 నుంచి 30వరకు ట్రయల్ పద్దతిలో బార్లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బార్లతో పాటు హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో పరిమిత సంఖ్యలో మద్యం సరఫరాకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం విధించిన అన్‌లాక్-4 మార్గదర్శకాల ప్రకారమే బార్లలో మద్యం సరఫరా చేయనున్నట్లు తెలిపింది. గత శనివారం కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్-4 మార్గదర్శకాల్లో ప్రధాన నగరాల్లోని మెట్రో సేవలను పునరుద్ధరించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు షరతులతో కూడిన విధంగా బార్లను తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం గోవా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు బార్ అండ్ రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతులు ఇచ్చాయి. బార్లకు అనుమతులు ఇచ్చిన సందర్భంగా సెప్టెంబర్ 9 నుంచి 30 వరకు ఢిల్లీలోని వివిధ బార్లు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.(చదవండి : తగ్గుతున్న పాజిటివ్ రేటు;భారత్‌కు ఊరట) ►కేంద్రం విధించిన అన్‌లాక్ -4 మార్గదర్శకాలను బార్లు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.. లేని పక్షంలో బార్ల లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ►బార్లకు వచ్చే కస్టమర్లకు మాస్కులు ఉంటేనే లోనికి అనుమతించాలి. ►సీటింగ్ కెపాసిటీ 50శాతానికి తగ్గించి.. ప్రతి కస్టమర్ కనీస భౌతికదూరం పాటించేలా చూడాలి. ►బార్‌కు వచ్చే కస్టమర్లకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్మోకింగ్ జోన్ లేకుండా ఉంచాలి. -
బార్లు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలు
బెంగుళూరు : ఇకపై మద్యంబాబులు దుకాణాల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూలు కట్టక్కర్లేదు. మీకు నచ్చిన వైన్‌షాప్, బార్, పబ్.. ఇలా ఏదో ఓ షాప్‌లో వెళ్లి మద్యం కొనుగోలు చేయోచ్చు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ కారణంగా పేరుకుపోయిన తమ స్టాక్‌ను క్లియర్ చేసుకోవడానికి మద్యం విక్రయాలు జరుపుకోవడానికి వైన్ షాపుల తరహాలోనే క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లకు అనుమతినిచ్చింది. (మద్యం ఎక్కువ తాగాడని హత్య ) తాజా ఉత్తర్వుల ప్రకారం నేటి నుంచి మే 17 వరకు ఆయా దుకాణాలు రిటైల్ ధరలకు (ఎమ్ఆర్పి) మద్యం విక్రయాలు జరుపుకోవచ్చు. అయితే కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు తప్పక పాటించాలి. ఉల్లంఘించిన వారి దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. ఆరు నెలల షెల్ఫ్ లైఫ్ ఉన్న బీర్ లాంటివి సరైన సమయంలో విక్రయించకపోతే ఆ స్టాక్ పనికిరాకుండా పోతుందని బార్ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 వరకు మద్యం విక్రయించడానికి అనుమతినిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
సారుకు సగం.. బార్లకు సగం..!
మద్య నిషేధానికి అడుగులు వేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీ ఓ ఎక్సైజ్ అధికారికి కాసులు కురిపిస్తోంది. మద్యం పాలసీని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఆయన.. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. మద్యానికి ఆయనే ఓ రేటు నిర్ణయించి ఇష్టానుసారం అమ్మిస్తున్నాడు. ఇక బార్ల నిర్వాహకులతో చేతులు కలిపి మందుబాబులను భారీగా దోచేస్తున్నాడు. ఫలితంగా అనతి కాలంలోనే కోటీశ్వరుడయ్యారు. ఆయన పేరు ఏమంటే కదిరిలో ఎవరైనా ‘టఖీ’మని చెప్పేస్తారు. సాక్షి, కదిరి: నిరుపేదల రెక్కల కష్టం మద్యం షాపునకు కాకుండా వారి పిల్లల భవిష్యత్‌కు పెట్టుబడి కావాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకే ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే మద్యనిషేధానికి తొలి అడుగులు వేశారు. ఈ క్రమంలోనే నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా 247 మద్యం దుకాణాలు ఉండగా.. 20 శాతం తగ్గిస్తూ 197కు పరిమితం చేశారు. అంతేకాకుండా సమయాన్ని కూడా తగ్గించేశారు. కానీ మద్యం పాలసీని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఓ ఎక్సైజ్ అధికారి నిరుపేదల జేబుకు చిల్లు పెడుతూ తన పర్సు నింపుకుంటున్నారు. ప్రభుత్వ దుకాణంలోనే అదనం కదిరి ఎక్సైజ్ శాఖ పరిధిలో ప్రస్తుతం 9 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో పనిచేసే సిబ్బందిని ఇటీవల ప్రభుత్వమే నియమించింది. వీటిపై పెత్తనం ఎక్సైజ్ శాఖకు ఉండటంతో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించాలని దుకాణాల్లోని యువకులకు ఆదేశించారు. టిన్ బీర్‌పై ఎంఆర్పీ రూ.100 ఉండగా రూ.130లకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి లిక్కర్‌ను అధిక ధరకు విక్రయిస్తుండగా.. మందుబాబులు లబోదిబోమంటున్నారు. దోపిడీ ‘బార్లా’ తెరిచారు కదిరి పట్టణంలో రెండు బార్లు ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో పీవీఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో రోజుకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఆర్ఎస్ రోడ్లో ఉన్న చందు బార్ అండ్ రెస్టారెంట్లో రోజుకు రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వ్యాపారం జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు. నిబంధనల ప్రకారం పట్టణంలోని మద్యం దుకాణాలు రాత్రి 8 గంటలకు మూతపడగానే ఈ బార్లలో మద్యం వ్యాపారం రెట్టింపు అవుతుంది. ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రూ.100 టిన్ బీర్ రూ.150 అమ్ముతారు. రూ.130 ఉన్న నాకౌట్ బీర్ రూ.160 నుంచి రూ.180, కొరియర్ గ్రీన్ విస్కీ క్వాటర్ బాటిల్ రూ.230 ఉంటే రూ.300 అమ్ముతున్నారు. ఇలా ఏ బ్రాండ్ తీసుకున్నా ఫుల్ బాటిల్ మీద రూ.100 నుంచి రూ.300 దాకా అధికంగా వసూలు చేస్తున్నారు. సారుకు సగం.. బార్లకు సగం బార్లలో రాత్రి 8 తర్వాత జరిగే వ్యాపారంలో బార్ల నిర్వాహకులకు సగమైతే.. ఆ మిగిలిన సగం వాటా ఎౖక్సైజ్ సారుకు అందుతోంది. ఆ డబ్బు ఎప్పటికప్పుడు రోజూ ఆయనే స్వయంగా వెళ్లి కలెక్షన్ చేసుకుంటున్నారని సంబంధిత శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఇలా మద్యం దుకాణాల ద్వారా అధిక ధరలకు మద్యం అమ్మినందుకు ఆయనకు రోజుకు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలు దాకా వస్తోందని, ఆ రెండు బార్ల ద్వారా రోజూ ఆయనకు రూ.80 వేల నుంచి రూ.లక్ష దాకా అక్రమ ఆదాయం వస్తోందని తెలుస్తోంది. ఎక్సైజ్ నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న సదరు ఎక్సైజ్ అధికారి అక్రమార్జనకు అడ్డూఅదుపు లేకుండా పోవడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. -
భద్రత లేకపోతే బాదుడే..
బంజారాహిల్స్: నగరంలో ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించని బార్లు, రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ ఫైర్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం కొరడా ఝులిపించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆరు బార్లు, రెస్టారెంట్లను ఫైర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సీజ్ చేశారు. నగరంలోని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లలో తీసుకోవాలని ఫైర్ సేఫ్టీ చర్యలపై నిర్వాహకులు, యజమానులతో గత ఆగస్టు 18న జీహెచ్ఎంసీ ఫైర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రతి బార్, రెస్టారెంట్లలో ఫైర్ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేయాలని ఇచ్చిన గడువును ముగిసిన అనంతరం పలు నోటీసులు జారీచేసినా వీటిని ఖాతరు చేయని బార్లు, పబ్‌లపై గత రెండు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేశారు. సీజ్ చేసిన రెస్టారెంట్లు... నగరంలోని జూబ్లీహిల్స్‌లోని టకీషాక్స్, క్యాలన్ గోట్ రెస్టోబార్, అర్బనేషియా కిచెన్ – బార్, ఈట్ ఇండియా కంపెనీ, రాస్తాకేఫ్ – బార్లను ఎన్ఫోర్స్మెంట్, ఫైర్ విభాగం సీజ్ చేసింది. శ్రీనగర్ కాలనీలోని శ్రీదుర్గా రెస్టారెంట్ – బార్‌ను మూసివేశారు. అనుమతులు లేకుండా హైదరాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 148 బార్లు, పబ్‌లు, సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో 103, రంగారెడ్డి జిల్లాలో 325 బార్లు, పబ్‌లు ఉండగా మరో 138 ఈవెంట్ పర్మిషన్ పేరుతోనూ బార్లు, పబ్‌లు నిర్వహిస్తున్నారు. మొత్తం 714 బార్లు, పబ్‌ల జాబితా మాత్రమే జీహెచ్ఎంసీ వద్ద ఉండగా అనధికారికంగా మరో 250 పైగా బార్లు, రెస్టారెంట్లు ఉన్నట్లు అంచనా. రికార్డులమేరకు గ్రేటర్ పరిధిలోని 750 బార్లు, పబ్‌లు, ఈవెంట్ పర్మీషన్ల భవనాల యజమానులకు ఫైర్ సేఫ్టీ చర్యలలపై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం గతంలో నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు ఫైర్ సెఫ్టీకి చేపట్టిన వివరాలు పేర్కొనే అప్లికేషన్ ఫారాన్ని జీహెచ్ఎంసీ వెబ్సైట్ ఠీఠీఠీ. జజిఝఛి. జౌఠి. జీn నుండి డౌన్ లోడ్ చేసుకొని దానిని నింపి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అంద చేయాలని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రకటించింది. జీహెచ్ఎంసీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తులను నింపి పలు బార్లు, రెస్టారెంట్లు, పబ్‌ల యజమానులు జీహెచ్ఎంసీకి అందజేశారు. నగర ప్రజల భద్రతను దష్టిలో పెట్టుకొని ప్రతి రెస్టారెంట్, బార్లో, ఫైర్‌సేఫ్టీ చర్యలను పాటించాలని జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో కోరింది. -
బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ధూమపాన నిషేధం
కర్ణాటక, బనశంకరి : ఉద్యాననగరిలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్, పబ్స్, క్లబ్‌లు సార్వజనిక ప్రాంతాలను ధూమపాన రహిత ప్రదేశాలుగా ప్రకటించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు కూడా రద్దు చేస్తామని బీబీఎంపీ హెచ్చరించింది. హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు చట్టపరంగా నో స్మోకింగ్జోన్ను ఏర్పాటు చేయడానికి పొగాకు నియంత్రణ శాఖ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి. నో స్మోకింగ్జోన్లో అల్పాహారం, భోజనం, మద్యం, సిగరెట్, నీరు, కాఫీ, టీ తదితర వాటిని సరఫరా చేయరాదు. కోప్టా చట్టం అనుగుణంగా 30కి పైగా ఆసనాలు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్, హోటల్స్, పబ్స్, క్లబుల్లో నో స్మోకింగ్జోన్ ఏర్పాటు చేయాలని బీబీఎంపీ ఆదేశాలు జారీ చేసింది. మైనర్లు, స్మోకింగ్ చేసేవారిని నో స్మోకింగ్ జోన్లోకి అనుమతించరాదు. ఈ నిబంధనలు ఉల్లంఘించే హోటల్స్, పబ్ అండ్ బార్ రెస్టారెంట్లు, క్లబ్స్ లైసెన్సు రద్దు చేస్తామని సూచించింది, నగరంలోని చాలా బార్ అండ్ రెస్టారెంట్, క్లబుల్లో ధూమపానం చేయడం సాధారణం. టీ దుకాణాల ముందు పొగరాయుళ్లు సిగరెట్ తాగుతుండటంతో ఇతరులకు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ షరా మామూలుగా కొనసాగుతోంది. ఇకపై కేటాయించిన స్మోకింగ్ జోన్లలో మాత్రమే సిగరెట్లు తాగాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు చేస్తామని బీబీఎంపీ హెచ్చరించింది. -
అశ్లీల దుస్తులతో లైవ్‌బ్యాండ్
బెంగళూరు : రెండు బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులు నిర్వహించిన సీసీబీ పోలీసులు 128 మందిని అరెస్టు చేశారు. 64 మంది యువతులకు విముక్తి కలిగించారు. వారు శుక్రవారం తెలిపిన సమాచారం మేరకు.. ఉద్యోగాల పేరుతో యువతులను మోసం చేసి బలవంతంగా వారితో బార్ అండ్ రెస్టారెంట్లలో అశ్లీల దుస్తులతో లైవ్‌బ్యాండ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కస్టమర్లను లైంగికంగా రెచ్చగొట్టాలని ఆ యువతులను వేధించేవారు. దీనిపై కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి మెజస్టిక్ సమీపం గాంధీనగర్‌లోని రాయల్ క్యాసినో, సంపంగి రామనగర్‌లో సిల్వర్ స్పూన్ బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులు చేశారు. ‘రాయల్ క్యాసినో’లో పని చేస్తున్న 11 మందిని, 51 కస్టమర్లను అరెస్ట్ చేశామని, రూ. 25 వేలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అందులోని 36 మంది యువతులకు విముక్తి కల్గించామని తెలిపారు. అలాగే ‘సిల్వర్ స్పూన్’లో పని చేస్తున్న 27 మందిని, 39 మంది కస్టమర్లను అరెస్ట్ చేశామని, రూ. 43 వేల వేలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అలాగే 28 మంది యువతులను రక్షించామని చెప్పారు. పరారీలో ఉన్న సిల్వర్ స్పూన్ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని వెంకటేశ్, యువతులను సరఫరా చేసిన పంజాబ్‌కు చెందిన నేహా, లైవ్‌బ్యాండ్ నిర్వాహకులు లక్ష్మికాంత, దినేష్ తదితరుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.