
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బుధవారం మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ కానుకగా రేపు అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే బార్లు, క్లబ్‌లకు రేపు(డిసెంబర్ 31) అర్థరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనాతో పాటుగా కొత్త స్ట్రెయిన్ వైరస్ భారత్‌లోకి ప్రవేశించడంతో అన్ని రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలపై నిషేధాజ్ఞలు విధించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అర్థరాత్రి వరకు మద్యం షాపులు ఓపెన్ చేయడంపట్ల మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment