wine shops
-
Wine Shops Closed : వైన్‌షాపులు బంద్.. ఎందుకో తెలుసా?
సాక్షి,హైదరాబాద్ : మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 14న మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో హోలీ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 14వ తేదీ ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి.ఈ సందర్భంగా పోలీసులు పలు కీలక సూచలను జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా హోలీ షాపులు మూసివేయాలని వైన్స్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని, బహింగంగా ప్రదేశాల్లో వాహనదారులపై కలర్స్ వేసి ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. -
Telangana: వైన్‌షాపులు బంద్
నిజామాబాద్: శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్‌షాపులు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి వైన్‌షాపులు, బార్లు తెరిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వేములవాడకు ప్రత్యేక బస్సులుఖలీల్వాడి: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోత్స్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగినన్ని బస్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి 27 వరకు ఆర్మూర్, నిజామాబాద్–2, కామారెడ్డి డిపోల నుంచి 136 బస్సులను నడుపుతామని తె లిపారు. నిజామాబాద్ నుంచి లోంక, కామారెడ్డి నుంచి మద్దికుంట సంతాయిపేట్, కొమురవెల్లి పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
కాకినాడ జిల్లా తునిలో మద్యం షాపులపై మహిళల తిరుగుబాటు
-
జీఎస్టీ పరిధిలో లేము.. రూపాయి పన్ను ఎగ్గొట్టలేము
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రేవరేజెస్ కార్పొరేషన్ (టీజీబీసీఎల్) పరిధిలో ఎలాంటి పన్ను ఎగవేతకు ఆస్కారం లేదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. తాము ఒక్క రూపాయి కూడా నగదు లావాదేవీలు నిర్వహించట్లేదని.. మద్యం వ్యాపారుల నుంచి నేరుగా ఆర్థిక శాఖ ఖాతాలోకి నగదు జమ చేస్తున్నామని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ పరిధిలో పన్ను ఎగవేతకు ఆస్కారం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు రూ. 400 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన వివరాలను పంపాలని వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శాఖ రాసిన లేఖకు ఇటీవల ఎక్సైజ్ యంత్రాంగం సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మద్యం వ్యాపారం జీఎస్టీ పరిధిలో లేదని... ఈ వ్యాపార లావాదేవీలపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)నే వసూలు చేస్తామని జీఎస్టీ శాఖకు పంపిన సమాధానంలో పేర్కొన్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెప్పాయి.అలా వసూలు చేయడంలో లేదా మద్యం అమ్మకాలకు సంబంధించిన పన్నును ప్రభుత్వానికి చెల్లించడంలో ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టలేమని స్పష్టం చేసినట్లు చెబుతున్నాయి. అన్ని వ్యాపారాల్లా కాదు.. జీఎస్టీ వసూలుకు సంబంధించి అన్ని వ్యాపారాల్లాగా మద్యం అమ్మకాలు ఉండవని ఎక్సైజ్ శాఖ తన సమాధానంలో పేర్కొన్నట్లు తెలిసింది. మద్యం తయారీదారులు సరఫరా చేసిన మద్యా న్ని బ్రూవరేజస్ కార్పొరేషన్ ద్వారా వైన్ షాపులకు అమ్ముతామని.. అలా విక్రయించే క్రమంలోనే రిటైలర్ల (వైన్‌షాప్స్) నుంచి మార్కెట్లో మద్యం అమ్మకపు రేటుకు పన్ను తీసుకుంటా మని తెలియజేసింది. ఆ పన్ను పోను మద్యం అమ్మకాలపై వైన్ షాపు నిర్వాహకులకు కేవలం కమిషన్ ఇస్తామని... మార్కెట్లో మద్యం అమ్మే ధరపై జీఎస్టీ చెల్లించాలన్న వాదన సమంజసం కాదని వెల్లడించింది. ఈ మేరకు వైన్ షాపుల నుంచి పన్ను వసూలు చేసుకొని ప్రభుత్వానికి బ్రూవరేజస్ కార్పొరేషన్ చెల్లించే వెసులుబాటు వ్యాట్ చట్టం ద్వారా ఉందని తెలియజేసింది.తద్వారా కార్పొరేషన్ పన్ను ఎగవేసిందన్న వాదనలో వాస్తవం లేదని, నగదు లావాదేవీలే నిర్వహించని ప్రభుత్వ సంస్థ.. ప్రభుత్వానికి పన్ను ఎగవేసే వీలుండదని తెలిపింది. తమకూ వివరాలు ఇవ్వాలన్న సీజీఎస్టీ.. బ్రేవరేజెస్ కార్పొరేషన్ సహా 72 కంపెనీలు రూ. 1,400 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ జీఎస్టీ శాఖ జూలైలో కేసులు నమోదు చేసింది. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పైనా కేసు పెట్టింది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను తమకు కూడా పంపాలని కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్టీ) విభాగం ఇటీవల రాష్ట్ర జీఎస్టీ శాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. అందులో తమకు కూడా రూ. 700 కోట్ల వాటా వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. -
AP: కొత్త మద్యం పాలసీ.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
సాక్షి,అమరావతి : ఏపీ ప్రభుత్వం నూతన మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీని విడుదల చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. నోటిఫికేషన్లో భాగంగా నేటి నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. అక్టోబర్ 11న రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు లాటరీ తీసి లైసెన్స్‌లు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం.దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉంటుంది. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఒకరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జనాభా ప్రాతిపదికన రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు లైసెన్స్ ఫీజును నిర్ణయించింది. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ లిక్కర్ మాల్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
మద్యం ప్రియులకు దొరకని బీర్లు
మెదక్: టెండల్లో బుసబుస పొంగే చల్లని బీరు తాగి ఉపశమనం పొందాలనుకునే మందుబాబులకుకష్టకాలమొచ్చింది. వైన్ షాపుల్లో బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. మద్యం డిపోలు ప్రధాన బ్రాండ్ల బీర్లపై రేషన్ విధించడంతో అటు వైన్‌షాప్ యజమానులు.. ఇటు కొనుగోలు దార్లు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీంతో మద్యం ప్రియులు దొరికిన దానితోనే సరి పెట్టుకుంటున్నారు. ఒక్కో షాపునకు ఇండెక్స్ ఆధారంగా 20 నుంచి 25 కేసులు ఇస్తుండగా.. ఇది ఒక రోజుకు కూడా సరిపోదని మద్యం వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్‌లో ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 49 వైన్ షాపులు, ఐదు బార్లు ఉన్నాయి. ఈయేడు ఎక్సైజ్ సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కొంత మేర మద్యం అమ్మకాలు పెరిగాయి. గతేడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు రూ.194.68 కోట్ల మద్యం విక్రయాలు జరుగగా, ఈసారి నాలుగు నెలల కాలంలో రూ.206.71 కోట్ల విక్రయాలు జరిగాయి. మందు బాబుల పరేషాన్.. వేసవి ఎండలు ముదరడంతో మద్యం ప్రియులు ఎక్కువగా బీర్లు తాగడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ ప్రస్తుతం నీటి కొరత, బీర్ల ఉత్పత్తి షరతులు తదితర కారణాల వల్ల బీర్ల కొరత ఏర్పడింది. అలాగే బీరు కాలపరిమితి 6 నెలలు ఉండటంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచలేని పరిస్థితి. గతేడాది నాలుగు నెలల కాలంలో 2,68,763 కేసులు అమ్మగా, ఈయేడు మార్చి 31 వరకు 2,96,977 కేసులు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం సాధారణ బ్రాండ్లు లభిస్తున్నప్పటికీ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్లు దొరకడం లేదు. దీంతో ఇండెక్స్‌కు అనుగుణంగా 20 నుంచి 25 కేసులు లభ్యతను బట్టి ఇస్తున్నారు. అలాగే సామాన్యుడికి అందుబాటు ధర కలిగి, నిత్యం ఎక్కువగా అమ్ముడు పోయే ఓ బ్రాండ్ లిక్కర్ కొరత కారణంగా దానికి కూడా రేషన్ విధించినట్లు మద్యం వ్యాపారులు తెలిపారు. పెరిగిన 10.50 శాతం ఎక్సైజ్ స్టేషన్ల వారీగా మద్యం అమ్మకాలు చూస్తే గతేడాది నాలుగు నెలలు (డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి) నర్సాపూర్‌లో రూ.7,172.2 లక్షలు విక్రయాలు జరుగగా ఈసారి నాలుగు నెలలు రూ.7,888.2 లక్షలు, మెదక్‌లో గతేడాది రూ.6,847.6 లక్షలు ఉండగా, ఈసారి రూ.6,902.4 లక్షలు, రామాయంపేటలో గతేడాది రూ.5,447.9 లక్షలు కాగా, ఈసారి రూ.5,880.2 లక్షలు విక్రయించాయి. మొత్తం మీద గతేడాది నాలుగు నెలలతో పోలిస్తే ఈసారి జిల్లా వ్యాప్తంగా 6.18 శాతం మద్యం విక్రయాలు వృద్ధి చెందాయి. అలాగే గతేడాది బీర్లతో పోలీస్తే ఈ నాలుగు నెలల్లోనే బీర్ల వినియోగం 10.50 శాతం పెరిగింది. ప్రతీయేటా వేసవి కాలంలో బీరు సరఫరాలో కొరత ఏర్పడుతుంది. డిమాండ్ కనుగుణంగా సరఫరా లేక పోవడంతో ప్రధాన బ్రాండ్లపై రేషన్ విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
‘టానిక్’ వెనుక కీలక వ్యక్తులు ఎవరు?.. వెలుగులోకి సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు శివారుల్లో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టానిక్ ఎలైట్ వైన్ షాపుల్లో 6 ఏళ్లలో వందల కోట్ల అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. మిగతా 10 క్యూ బై టానిక్ వైన్ షాప్స్ లెక్కలపై జీఎస్టీ, ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో గత ప్రభుత్వ స్పెషల్ సెక్రెటరీ జీవో జారీ చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ చిరునామాతో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ ఎలైట్ షాప్ లైసెన్స్ జారీ అయ్యింది. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌కి ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌కు భారీ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిసింది. 2016 నుండి 2019వరకు అన్ లిమిటెడ్ లిక్కర్ విక్రయాలకు టానిక్కు అనుమతి లభించగా, ఐదేళ్లకు ఒకసారి షాప్ రెన్యూవల్ చేసుకొనేలా వెసులుబాటు కల్పించారు. ఇతర షాపుల కంటే టానిక్కు ఐదు లక్షలు మాత్రమే అదనంగా యానివల్ ఫీజు నిర్ణయించారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌ల వెనుక ఉన్న కీలక వ్యక్తుల ఎవరనేదానిపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదీ చదవండి: టానిక్ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత! -
నేడే మద్యం లాటరీలు
సాక్షి, హైదరాబాద్/జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రానున్న రెండేళ్ల కాలానికిగాను లైసెన్సుల మంజూరు కోసం నేడు(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్‌షాపులకు లాటరీలు నిర్వహించనున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18వ తేదీన ముగిసిన నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘డ్రా’తీయనున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వీడియో చిత్రీకరణ ద్వారా ఈ లాటరీల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, ఈ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, లాటరీలో విజేతలకు వెంటనే షాపుల కేటాయింపు ఉత్తర్వులు అందజేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. ఎంట్రీ పాసులు ఉన్నవారిని మాత్రమే డ్రా తీసే ప్రదేశంలోకి అనుమతించాలని, లాటరీ ప్రక్రియ విషయంలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. కాగా, మంత్రి ఆదివారం మహబూబ్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో కూడా ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాటరీ ప్రక్రియ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. -
కిక్కెక్కించిన మద్యం దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఖజానాకు ‘మద్యం దరఖాస్తుల’రూపంలో కాసుల వర్షం కురిసింది. రానున్న రెండేళ్ల కాలానికి గాను రాష్ట్రంలోని వైన్‌షాపులకు లైసెన్సుల మంజూరు కోసం నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు అనూహ్య రీతిలో స్పందన కనిపించింది. శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ముగియగా, శనివారం మధ్యాహా్ననికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న లెక్కలను ఎక్సైజ్ శాఖ తేల్చింది. ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 2,620 వైన్‌షాపుల లైసెన్సుల కోసం ఏకంగా 1,31,954 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లైసెన్సుల కోసం 68,691 దరఖాస్తులు రాగా, ఈసారి గతం కంటే 63,263 దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. గత రెండేళ్లతో పోలిస్తే రానున్న రెండేళ్ల కాలానికి గాను దరఖాస్తుల సంఖ్య దాదాపు రెట్టింపయింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.2,639 కోట్ల ఆదాయం కేవలం దరఖాస్తుల రూపంలోనే లభించింది. ఈ దరఖాస్తుల నుంచి జిల్లా స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈనెల 21న డ్రా తీసి లైసెన్సులు మంజూరు చేయనున్నారు. హైదరాబాద్ శివార్లలో భారీగా.. భారీస్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతున్న జిల్లాల్లోని వైన్‌షాపులను దక్కించుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున పోటీ పడినట్లు గణాంకాలు చెపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని షాపుల కోసం వ్యాపారులు భారీ స్థాయిలో దరఖాస్తులు దాఖలు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. సరూర్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయ పరిధిలోని 134 షాపులకు ఏకంగా 10,908 దరఖాస్తులు రాగా, శంషాబాద్‌లోని 100 షాపులకు 10,811 దరఖాస్తులు వచ్చాయి. ఇవే షాపులకు గత రెండేళ్ల లైసెన్సుల కోసం వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఈసారి రెట్టింపు సంఖ్యలో రావడం గమనార్హం. సరూర్‌నగర్ పరిధిలోని షాపులకు గత రెండేళ్ల కాలానికి 4,102, శంషాబాద్‌లో 4,122 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక మరో ఏడు జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య 5 వేలు దాటింది. ఖమ్మం (7,207), కొత్తగూడెం (5,057), సంగారెడ్డి (6,156), నల్లగొండ (7,058), మల్కాజ్గిరి (6,722), మేడ్చల్ (7,017), వరంగల్ అర్బన్ (5,858)లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇక, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రమే వెయ్యి కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. కాగా, క్రితం సారి 10 రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో మొత్తం కలిపి 68 వేల పైచిలుకు దరఖాస్తులు రాగా, ఈసారి చివరి ఒక్కరోజే 56,980 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈసారి చివరి నాలుగు రోజుల్లోనే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 15న సెలవు దినాన్ని మినహాయిస్తే 14,16,17, 18 తేదీల్లో కలిపి 1.10 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. ఆదిలాబాద్‌లో 979, ఆసిఫాబాద్‌లో 967 దరఖాస్తులు వచ్చాయి. ఇక, తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన జిల్లాల జాబితాలో నిర్మల్ (1,019), గద్వాల (1,179), వనపర్తి (1,329) ఉన్నాయి. ఈ దరఖాస్తుల సరళిని బట్టి రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపార రంగ సంస్థల యజమానులతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన లిక్కర్ వ్యాపారులు కూడా దరఖాస్తు చేసి ఉంటారని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
వైన్ షాపుల లైసెన్సులకు లాటరీ.. ఉత్తర్వులు జారీ.. రూ.2 వేల కోట్ల ఆదాయం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండేళ్లకు ఏ4 (వైన్) షాపులకు లైసెన్సులు కేటాయించే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు లైసెన్సుల జారీకి సంబంధించిన నిబంధనలతో కూడిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సీఎస్ శాంతికుమారి జారీ చేసిన జీఓ నంబరు 86 ప్రకారం పాత పాలసీలోని నిబంధనల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి, నవంబర్ 30, 2025 వరకు మద్యం విక్రయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2,620 షాపులకు లైసెన్సులు జారీ చేస్తారు. ఇందుకు లాటరీ పద్ధతినే పాటిస్తారు. దరఖాస్తు ఫీజు కూడా గతంలో లాగానే రూ.2లక్షలుగా ఉంటుంది. ఎక్సైజ్ ఫీజు శ్లాబులూ, ఇతర నిబంధనలన్నీ గత పాలసీ మేరకే ఉంటాయి. గతంలో మాదిరిగానే గౌడ సామాజికవర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈ రిజర్వేషన్ల ప్రకారమే జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాలో ఎన్ని షాపులు కేటాయించాలో బుధవారమే నిర్ణయించారు. ఈ షాపుల సంఖ్య ప్రకారం గురువారం ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రాలు నిర్వహించి ఏ షాపులు ఏ ఏ వర్గాలకు కేటాయించాలో నిర్ణయిస్తారు. ఇతర షాపులకు కూడా లాటరీ పద్ధతిలోనే లైసెన్సులు ఇస్తారు. లాటరీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో గతంలో నిర్వహించిన విధంగానే జరుగుతుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైన్ షాపుల కేటాయింపు ద్వారా ఈసారి కూడా రూ.2వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏ4 షాపుల కేటాయింపు నిబంధనలు ఇలా... ♦ లైసెన్సులకు గత పాలసీ మాదిరిగానే దరఖాస్తు చేసుకోవాలి. ఫీజులోనూ ఎలాంటి మార్పు లేదు. రూ.2లక్షలు దరఖాస్తు కోసం చెల్లించాలి. లాటరీ వచి్చనా రాకపోయినా ఆ డబ్బులు ప్రభుత్వానికే జమవుతాయి. ఒకరు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు. ♦ రెండేళ్ల పాటు మద్యం విక్రయించుకునే ఫీజు గతంలోలాగే ఉంచారు. పాత స్లాబుల ప్రకారమే ఫీజులు నిర్ధారించారు. 5వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.50 లక్షలు, 5–50వేల జనాభా వరకు రూ.55 లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా వరకు రూ.60లక్షలు, లక్ష నుంచి 5లక్షల జనాభా వరకు రూ.65లక్షలు, 5 నుంచి 20లక్షల జనాభా వరకు రూ.85లక్షలు, 20లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో షాపులకు రూ.1.10 కోట్లు ఎక్సైజ్ ఫీజుగా నిర్ణయించారు. ♦ జీహెచ్ఎంసీ పరిధిలోని షాపులకు వర్తించే స్లాబు, జీహెచ్ఎంసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే షాపులకు, ఇతర కార్పొరేషన్లకు వర్తించే స్లాబులను కూడా ఐదు కిలోమీటర్ల పరిధిలోని షాపులకు వర్తింపజేస్తారు. మున్సిపాలిటీలకు వర్తించే స్లాబును ఆయా మున్సిపాలిటీలకు రెండు కిలోమీటర్ల దూరంలోని షాపులకు కూడా వర్తిస్తుంది. ♦ లైసెన్స్ ఫీజు ప్రతి ఏడాది ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చు. అంటే రెండేళ్లలో 12 సార్లు ఫీజు చెల్లించాలి. ఇందుకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీ కింద మొత్తం ఫీజులో 25 శాతానికి ఇస్తే సరిపోతుంది. ♦ గతంలో మాదిరిగానే దరఖాస్తుతోపాటు ధరావతు (ఈఎండీ) చెల్లించాల్సిన అవసరం ఉండదు. ♦ మద్యం విక్రయాల ద్వారా లైసెన్సీలకు కమిషన్ (మార్జిన్) కూడా గతంలో ఉన్న విధంగానే నిర్ణయించారు. వార్షికఫీజు కంటే 10 రెట్ల టర్నోవర్ వరకు 27 శాతం మార్జిన్ ఇస్తారు. మీడియం, ప్రీమియం బ్రాండ్లపై 20 శాతం, బీర్లపై 20 శాతంగా మార్జిన్ నిర్ధారించారు. పదిరెట్ల టర్నోవర్ దాటిన తర్వాత మాత్రం అన్ని బ్రాండ్లకు 10శాతం మార్జిన్ మాత్రమే ఇస్తారు. ♦ పర్మిట్రూం కోసం అదనంగా ఏడాదికి రూ.5లక్షలు చెల్లించాలి. వాకిన్‌స్టోర్ కావాలంటే మరో రూ.5లక్షలు చెల్లించాలి. ♦ జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చు. మద్యం బాటిల్ లేబుల్‌పై ఉన్న ధరకు మాత్రమే విక్రయించాలి. ప్రతి షాపులో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ద్వారా కేటాయింపబడని షాపులకు మళ్లీ టెండర్లు పిలవాలా లేక అవుట్లెట్లు ఏర్పాటు చేయాలా అనే దానిపై ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారు. -
ముందస్తుగా ‘మద్యం లాటరీలు’?
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో నవంబర్‌లో జరగాల్సిన వైన్‌షాపుల లాటరీ ప్రక్రియ వచ్చే నెలలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అక్టోబర్‌లోనే వస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఈ మేరకు కసరత్తు చేస్తోంది. 2021–23 సంవత్సరాల ఏ4 (వైన్స్) షాపుల లైసెన్సు కాలం ముగియక ముందే 2023–25 సంవత్సరాలకు లైసెన్సులిచ్చే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ముమ్మరంగా ముందుకెళ్తోంది. వచ్చే నెలలో ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ ప్రారంభం కల్లా ప్రక్రియను పూర్తి చేసేలా కొత్త పాలసీ రూపకల్పనలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ముందుగానే ఎందుకు?: వాస్తవానికి, 2021–23 (రెండేళ్ల పాలసీ) సంవత్సరాలకుగాను ఏ4 లైసెన్సుల గడువు వచ్చే నవంబర్ 30తో ముగియనుంది. అంటే డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్‌దారులు రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరపాల్సి ఉంటుంది. అలా జరగాలంటే అక్టోబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రానున్న రెండేళ్లకు (2023–25) లైసెన్సులను లాటరీ పద్ధతిలో జారీ చేసేందుకు కొత్త పాలసీ రూపొందించాల్సి ఉంటుంది. అయితే, వచ్చే డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున అక్టోబర్‌లో షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశముంది. దీంతో ఎన్నికల నియమావళి వచ్చేలోపే నోటిఫికేషన్ ఇచ్చి లాటరీలు ముగించి కొత్త లైసెన్స్‌దారులకు షాపులు కేటాయించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే డిసెంబర్ 1 నుంచి మాత్రమే వారికి షాపులు అప్పగించాలని, ఈలోగా పాత లైసెన్స్‌ల ద్వారా మద్యం విక్రయాలు జరపవచ్చని అంటు న్నారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన మద్యం టెండర్లకు ముహూర్తం ఖరారు చేసే పనిలో పడ్డారు. అడిగితే ఇవ్వరా?: గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ముందస్తు ఎక్సైజ్ టెండర్లకు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. గతంలో జూలై 1 నాటికి లైసెన్సులు ముగిసేవి. కానీ, 2014లో మూడుసార్లు గడువు పెంచడంతో ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఈసారి గడువు పెంచకుండా ముందస్తుగా లాటరీల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎన్నికల కోడ్ అడ్డంకి అయితే, ఆ సమయంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని ప్రక్రియ ప్రారంభించి లైసెన్స్‌లను ఖరారు చేసి పెట్టుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోడ్ అయ్యాక కొత్త లైసెన్స్‌దారులకు షాపులు అప్పగించవచ్చనే వాదనా ఉంది. అయితే, అప్పటివరకు ఎంతకాలం అవసరమైతే అంతకాలం పాటు గడువు పొడిగించి పాత లైసెన్స్‌దారుల దగ్గరే ఫీజు వసూలు చేసి విక్రయాలు జరపవచ్చనే అభిప్రాయమూ ఉంది. మరోవైపు, వైన్‌షాపుల్లో కొన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. మళ్లీ ఇప్పుడు ముందస్తు ప్రక్రియపై ఎవరైనా కోర్టుకు వెళితే అసలుకే ఎసరు వస్తుందనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లోనే జరుగుతుండటం గమనార్హం. ఆదాయం కోసమేనా?: మందుషాపులకు ముందస్తు లాటరీలు ఆదాయం కోసమేనా అనే చర్చ జరుగుతోంది. రెండేళ్లకు లైసెన్సు ఫీజు జారీ చేసేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల అమ్మకాల మీదనే ప్రభుత్వానికి రూ. 1,400 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ పాలసీ నిబంధనల ప్రకారం లాటరీ ప్రక్రియ పూర్తయి షాపు కేటాయించాలంటే మొదటి విడత లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా లైసెన్స్ ఫీజు కింద మరో రూ.500– 600 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఎన్నికలకు ముందు ఈ రూ.2 వేల కోట్ల కోసమే ఎక్సైజ్ శాఖ హడావుడి చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. -
మద్యం అమ్మకాలపై ఎకై ్సజ్ అధికారులు టార్గెట్!
మోర్తాడ్: మద్యం అమ్మకాలను పెంచాలని వైన్ షాపుల యజమానులకు ఎకై ్సజ్ అధికారులు టార్గెట్ విధించారు. గతేడాది కంటే పది శాతం విక్రయాలు పెరగాలని ఒత్తిడి చేస్తున్నారు. అమ్మకాలు తగ్గితే తాము ఏమి చేయాలని యజమానులు మొరపెట్టుకుంటున్నా.. ఎకై ్సజ్ శాఖ మాత్రం టార్గెట్ ప్రకారం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించడం గమనార్హం. ప్రభుత్వ ఖజానా నింపే ప్రధాన ఆదాయం మద్యమే కావడంతో టార్గెట్‌పై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. గత సంవత్సరం కొనుగోళ్ల జాబితా ఆధారంగా ఈసారి పది శాతం అదనంగా లేదా గతంలో మాదిరిగానే మద్యం కొనుగో ళ్లను పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో 102 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దుకాణం ద్వారా రోజుకు రూ.4లక్షల నుంచి రూ.10లక్షల వరకు మద్యం కొనుగోళ్లు చేపట్టాలని ఎకై ్సజ్ శాఖ టార్గెట్‌ను నిర్ణయించింది. 2022 నాటి కొనుగోళ్లపై అదనంగా పదిశాతం మద్యం కొనుగోలు చేయాలని లేదంటే కేసులు తప్పవని వైన్ షాపుల యజమానులను అధికారులు హెచ్చరిస్తున్నారు. నిత్యం లక్ష్యానికి అనుగుణంగా డీడీలు చెల్లించాలని ఆదేశిస్తున్నారు. జీరో దందా కట్టడి.. మద్యం దుకాణాల నుంచి రిటైల్ అమ్మకాలతో పాటు టోకున బెల్టుషాపులకు కూడా మద్యం అమ్ముతారు. ఈ క్రమంలో జీరో (పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించిన) మద్యం విక్రయిస్తున్నారా అనే సందేహం వ్యక్తమైతుంది. బెల్టుషాపుల్లో మద్యం గోల్మాల్ జరిగే అవకాశం ఉండటంతో వాటి నిర్వాహకులను అధికారులు బైండోవర్ చేస్తున్నారు. బెల్టుషాపులను వైన్‌షాపుల యజమానులే నిర్వహిస్తుండగా కేవలం పని చేస్తున్న తమను ఎందుకు బైండోవర్ చేస్తున్నారని కూలీలు ప్రశ్నిస్తున్నారు. టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి మద్యం దుకాణాల ద్వారా గతంలో మాదిరిగా మద్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని టార్గెట్ ఉంది. బ్రేవరీస్ నుంచి మద్యం కొనుగోళ్లు చేపట్టాలి. ఎక్కడైనా జీరో మద్యం కొనుగోలు చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడితే సహించేది లేదు. – గుండప్ప, ఎకై ్సజ్ సీఐ, మోర్తాడ్ -
Telangana: న్యూ ఇయర్ వేడుకలు.. మందుబాబులకు గుడ్ న్యూస్
హైదరాబాద్: కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు ఈసారి పూర్తిస్థాయిలో జరగనున్నాయి. న్యూ ఇయర్‌ను వెల్కం చెప్పేందుకు యువత జోరుగా హుషారుగా రెడీ అవుతోంది. వీరి ఆసక్తిని రెట్టింపు చేసేందుకు నగరం నలు చెరగులా వేదికలు, వేడుకలు స్వాగతం పలుకుతున్నాయి. ఈసారి వేడుకలు వారాంతపు రోజైన శనివారం రావడంతో మరింత జోష్ ఏర్పడింది. తాజాగా న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్‌శాఖ అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు రాత్రి ఒంటిగంట వరకు.. రిటైల్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండనున్నాయి. మరోవైపు న్యూయిర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిబంధనలు విధించారు. త్రీ స్టార్, ఆపై హోటల్స్, పబ్బులు, క్లబ్బుల వద్ద ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసభ్యకర నృత్యాలు, న్యూసెన్స్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని షరతు విధించారు. పరిమితికి మించి పాస్‌లు, టికెట్లు జారీ చేయొద్దని పేర్కొన్నారు.. పబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని తెలిపారు. చదవండి: తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్.. గతేడాదితో పోలిస్తే.. -
మూడు రోజులు వైన్ షాప్‌లు బంద్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక కోడ్ నేపథ్యంలో నవంబర్ 1న సాయంత్రం 6గంటల నుంచి 3న సాయంత్రం 6గంటల వరకు వైన్ షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు మునుగోడు నియోజకవర్గంలోని వైన్‌షాపులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మునుగోడు పరిధిలో మద్యం అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల్లో 128 మంది ఎక్సైజ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వారంతా వైన్‌షాపుల్లో మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 2,705 లీటర్ల మద్యం, రెండు బైక్‌లను సీజ్ చేసి.. 48మందిని అరెస్టు చేసి మొత్తం 118 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.5,59,000 ఉన్నట్లు తెలిపారు. -
మద్యం దుకాణాల్లో స్టాక్ ఆడిట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు, డిపోలలో స్టాక్ ఆడిట్ చేయాలని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ నిర్ణయించింది. ప్రతి నెలా ఈ స్టాక్ ఆడిట్ నిర్వహిస్తారు. అందుకోసం మూడు సంస్థలను ఎంపిక చేశారు. డిపోలను ఓ సంస్థ ఆడిట్ చేస్తే.. మిగిలిన రెండు సంస్థలు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఆడిట్ నిర్వహిస్తాయి. బేవరేజస్ సంస్థల నుంచి డిపోలకు వస్తున్న నిల్వలు, అక్కడ నుంచి మద్యం దుకాణాలకు సరఫరా అవుతున్న వాటిని సెంట్రల్ డిపో నుంచే ఆడిట్ చేస్తారు. మిగిలిన రెండు సంస్థలు రాష్ట్రంలోని 2,975 ప్రభుత్వ మద్యం దుకాణాలకు వెళ్లి స్టాక్ ఆడిట్ నిర్వహిస్తాయి. ఆ దుకాణాలకు సరఫరా అవుతున్న మద్యం, అక్కడి విక్రయాలు, ఇంకా అందుబాటులో ఉన్న నిల్వలను తనిఖీ చేస్తాయి. రికార్డులను పరిశీలిస్తాయి. ఈ విధంగా మద్యం డిపోలు, దుకాణాల్లోని స్టాక్ ఆడిట్ మొత్తాన్ని పరిశీలించి విక్రయాలు సక్రమంగా సాగుతున్నాయా? అవకతవకలు జరుగుతున్నాయా? అనే విషయాలను పరిశీలించి నివేదిక సమర్పిస్తారు. అవకతవకలను గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. -
లాక్డౌన్: వైన్స్, మార్ట్‌ల్లో మద్యం ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ అని ప్రకటించగానే మందుబాబులు షాక్‌కు గురయ్యారు. పది రోజుల లాక్డౌన్ ప్రకటన వెలువడిన వెంటనే మద్యంప్రియులు వైన్స్ దుకాణాలు, మార్ట్‌లకు పరుగులు పెట్టారు. గతేడాది అనుభవం దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా మద్యం కొనుగోలుకు ఎగబడ్డారు. ఏ మద్యం దుకాణం చూసినా కూడా మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు కిటకిటలాడాయి. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర క్యూలైన్ కొనసాగాయి. మద్యం దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటలకు తెరచి ఉంటుందని తెలిసినా కూడా మందు కోసం ఎగబడ్డారు. సంపన్నులతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా తమ స్థాయికి మించి మద్యం కొనుగోళ్లు చేశారు. కొందరు తమ వద్ద డబ్బు లేకున్నా అప్పు చేసి మరి మద్యం తీసుకెళ్లారు. ఈ పది రోజులకు సరిపడా తీసుకెళ్లారు. మరికొందరేమో లాక్డౌన్ గడువు పెరుగుతుందని భావించి భారీగా కొనుగోలు చేశారు. మద్యం దుకాణాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో నిర్వాహకులు, యజమానులు ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. ఉన్న అరకొర సిబ్బందితోనే విక్రయాలు కొనసాగించారు. మద్యంప్రియులు ఒక్కసారిగా ఎగబడడంతో మద్యం దుకాణాల్లో స్టాకంతా అయిపోయింది. నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సాధారణ మద్యం దుకాణం నుంచి వైన్స్ మార్ట్ వరకు ఇదే పరిస్థితి. ఒక వైన్స్ మార్ట్‌లో మద్యం సీసాలన్నీ ఖాళీ అవడంతో కబోర్డులన్నీ వెలవెలబోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా హైదరాబాద్‌లోని ఓ వైన్స్ మార్ట్‌లో ఖాళీగా ఉన్న ర్యాక్‌లు -
‘ఇంజక్షన్ పనికి రాదు..! ఆల్కహాల్‌తో అన్నీ సీదా..!’
ఢిల్లీ: కరోనా తీవ్రత దృష్ట్యా కేజ్రీవాల్ ప్రభుత్వం సోమవారం రాత్రి నుంచి ఏప్రిల్ 26 వరకు పూర్తి లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. దీంతో మందు బాబులు వైన్ షాపుల ముందు భారీ క్యూ కట్టారు. మహిళలు కూడా షాపుల ముందు బారులు తీరారు. ఈ నేపథ్యంలో వైన్స్ షాప్‌నకు వచ్చిన ఓ మహిళ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలోని శివపురి గీతా కాలనీ సమీపంలో ఉన్న వైన్స్ దగ్గరికి ఆల్కహాల్ కొనుగోలు చేయడానికి రాగా, అక్కడే ఉన్న మీడియా ఆ మహిళను పలుకరించగా విచిత్రంగా సమాధానమిచ్చింది. కరోనా వస్తే ఇంజక్షన్ బదులు మందు(ఆల్కహాల్)ను వాడితే నయమవుతుందని తెలిపింది. తనకు మెడిసిన్ వాడితే ఎలాంటి ఉపయోగం ఉండదని, రోజు ఒక పెగ్ మందు తాగితే అన్ని సెట్ అవుతుందని తెలిపింది. అంతేకాకుండా డాక్టర్ రాసే మందు అసలు పనిచేయదని, ఆల్కహాలే సర్వరోగనివారిణి అని తెలిపింది. ఆవిడ చెప్పిన సమాధానం విన్న రిపోర్టర్ కంగుతిన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. కాగా, దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా రోజువారి కేసుల సంఖ్య దాదాపు 3 లక్షలుగా ఉంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన రేపుతోంది. దీంతో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విధించిన రాత్రి కర్ఫ్యూని లాక్‌డౌన్‌గా మార్చింది. ఢిల్లీలో అత్యధికంగా ఒకే రోజు 25 వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారిని నిలువరించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 26వ తేదీవరకు లాక్‌డౌన్‌ను ప్రకటించారు. #WATCH Delhi: A woman, who has come to purchase liquor, at a shop in Shivpuri Geeta Colony, says, "...Injection fayda nahi karega, ye alcohol fayda karegi...Mujhe dawaion se asar nahi hoga, peg se asar hoga..." pic.twitter.com/iat5N9vdFZ — ANI (@ANI) April 19, 2021 చదవండి: 870 కిలోమీటర్లు ప్రయాణం చేసిన పాము..! తీరా చూస్తే -
మందుబాబులకు షాక్.. ఆరోజు వైన్స్ బంద్
సాక్షి, హైదరాబాద్ : మరో నాలుగు రోజుల్లో హోలీ పండుగ రాబోతుంది. ఈ క్రమంలో హోలీ నాడు రంగులతో ఆటలే కాకుండా ఫుల్‌గా తాగి రోడ్లపై తాగుబోతులు వీరంగం సృష్టిస్తుంటారు. వీరి వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వీటన్నింటికి చెక్ పెట్టడానికి హైదరాబాద్ పోలీసులు నడుం బిగించారు. రంగుల వేడుక హోలీ పండుగ సందర్భంగా జంట నగరాల్లో ఈ సారి కఠిన నిబంధనలు అమలు చెయ్యాలని పోలీసులు భావిస్తున్నారు. హోలీ పండుగ నేపథ్యంలో 36 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ మందుబాబులకు షాక్ ఇచ్చారు. హోలీ పండుగ సందర్బంగా మార్చి 28 తేది సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 30 ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీ వేడులను ప్రజలు జరుపుకోవాలని..పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలపై గుంపులు..గుంపులుగా ప్రయాణించవద్దని ఒకవేళ అలా ప్రయాణిస్తే అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రయాణీకులపైనా.. వాహనాలపై వెళ్లేవారిపైనా వారి అనుమతి లేకుండా బలవంతంగా రంగులు చల్లరాదనీ సీపీ హెచ్చరికలు జారీ చేశారు. చదవండి: కరోనా టెర్రర్.. హోలీ పండుగపై నిషేధం -
న్యూ ఇయర్ : మందుబాబులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బుధవారం మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ కానుకగా రేపు అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే బార్లు, క్లబ్‌లకు రేపు(డిసెంబర్ 31) అర్థరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనాతో పాటుగా కొత్త స్ట్రెయిన్ వైరస్ భారత్‌లోకి ప్రవేశించడంతో అన్ని రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలపై నిషేధాజ్ఞలు విధించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అర్థరాత్రి వరకు మద్యం షాపులు ఓపెన్ చేయడంపట్ల మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మందుబాబులకు బ్యాడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బెల్టు షాపులు వెంటనే మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు. ఈ నెల 29న సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ ఒకటిన పోలింగ్ ముగిసేవరకు గ్రేటర్ పరిధిలో మద్యం షాపులు మూసేయించాలన్నారు. డిసెంబర్ 4న కౌంటింగ్ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం షాపులు మూసివుంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా పార్థసారథి మాట్లాడారు. 3,133 మందిపై బైండోవర్ కేసులు జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి ఇప్పటిదాకా 65,098 ప్రచార బ్యానర్లు, పోస్టర్లు, బోర్డులు, ఫ్లెక్సీలు, జెండాలు తొలగించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) వెల్లడించింది. ఇప్పటివరకు 3,133 మందిపై బైండోవర్ కేసులు పెట్టినట్టు తెలిపింది. 243 నాన్‌బెయిలబుల్ వారంట్లను అమలుచేయగా, ఇంకా 1,549 వారంట్లు పెండింగ్‌లో ఉన్నాయని, బుధవారందాకా దాదాపు రూ.1.41 కోట్ల నగదును, రూ.11 లక్షల పైచిలుకు విలువ చేసే మెఫెగ్రోన్ డ్రగ్, విడిగాంజా, మద్యం, ఐఎంఎఫ్ఎల్, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. గ్రేటర్ బరిలో 49 మంది నేరచరితులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలు డివిజన్లలో కార్పొరేటర్లుగా పోటీ చేస్తోన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో మొత్తం 49 మంది నేరచరితులు ఉన్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) తెలిపింది. టీఆర్ఎస్లో 13 మంది, బీజేపీలో 17 మంది, కాంగ్రెస్‌లో 12 మంది, ఎంఐఎంలో ఏడుగురిపై మొత్తం 96 కేసులు ఉన్నాయని వివరిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. వీరిలో ఆరుగురు మహిళా అభ్యర్థులపైనా కేసులు ఉండటం గమనార్హం. వీరంతా 41 వార్డుల్లో పోటీ చేస్తున్నారని పేర్కొంది. మల్కాజిగిరి వార్డు (147)లో పోటీ చేస్తోన్న అభ్యర్థులందరికీ నేరచరిత ఉందని ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి వివరించారు. గత ఎన్నికల్లో 72 మంది నేరచరితులు పోటీ చేయగా, ఈసారి ఆ సంఖ్య 49కు తగ్గిందన్నారు. ప్రజల కోసం పాటుపడేవారికి ఓటు వేయాలని ఎఫ్‌జీజీ కోరింది. చదవండి: సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న వారిపైన కేసులు: డీజీపీ -
వైన్‌షాపులు ఇక రాత్రి 9:30 వరకు
సాక్షి, హైదరాబాద్: వైన్‌షాపులు గురువారం నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ బుధవారం తెలిపారు. పేద ప్రజలతో చెలగాటం ఆడుతున్న గుడుంబా తయారీని పూర్తిగా అరికడతామని, దాన్ని తయారు చేసేవారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం వైన్‌షాపుల సమయాన్ని పెంచామని మంత్రి తెలిపారు. తెలంగాణను సీఎం కేసీఆర్ గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చారని పేర్కొన్నారు. బెల్లం సరఫరా, అక్రమమద్యం సరఫరా, గుడుంబా తయారు చేసేవారి సమాచారం తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి, తగిన పారితోషికం ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. -
లాక్డౌన్ ప్రకటనతో.. కిక్కు కోసం క్యూ
సాక్షి, చెన్నై : లాక్డౌన్ కఠినతరం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన వెలువరించిన నేపథ్యంలో మందుబాబులు టాస్మాక్ దుకాణాల ముందు బారులు తీరారు. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో జూన్ 19 నుంచి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 12 రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడే అవకాశం ఉందని గ్రహించిన మందు బాబులు మంగళవారం ఉదయం నుంచే టాస్మాక్ దుకాణాల వద్ద బారులు తీరారు. దాదాపు కిలోమీటర్ దూరం మేరకు మందుబాబుల హడావిడి కనిపించింది. అయితే దుకాణాల వద్ద భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చిన మందుబాబులు 12 రోజులకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేశారు. మద్యం కేసులు కొనుగోలు చేసి తమ వాహనాల్లో తరలించడం స్పష్టంగా కనిపించింది. మద్యం అమ్మకాలు జోరందుకోవడంతో ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు మద్యం ష్టాకును సిద్ధంగా ఉంచింది. కాగా లోడ్ వచ్చిన వెంటనే హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. చదవండి: లడక్ కాల్పుల్లో పళని వీరమరణం -
ఆన్లైన్ మద్యం డెలివరీకి స్విగ్గీ సై!
కరోనా కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌తో తాగుబోతులకు తిప్పలు పెరిగాయి. గతంలో లాగా విచ్చలవిడిగా కొని, తాగి తూలే అవకాశం లేకపోవడంతో డ్రింకర్ బాబులంతా డీలా పడ్డారు. కొన్ని రోజుల క్రితం కొన్ని రాష్ట్రాలు లిక్కర్ అమ్మకాలు షురూ చేయడంతో కరువుబట్టినట్లు మందుబాబులంతా వైన్స్ ముందు క్యూలు కట్టారు. అయితే ఈ అమ్మకాలకు సవాలక్ష పరిమితులుండడం వీళ్లని పాపం బాగా నిరాశ పరిచింది. ఇలాంటి మందుమాలోకాలకు ఆన్లైన్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ శుభవార్త వినిపించింది. ఇప్పటివరకు ఫుడ్, గ్రాసరీ, మెడిసన్స్ మాత్రమే ఆన్లైన్లో డెలివరీ చేసిన స్విగ్గీ ఇకపై ఆల్కహాల్ డ్రింక్స్‌ను సరఫరా చేసేందుకు సిద్ధమైంది. తమ యాప్‌లో తాజాగా ‘‘వైన్‌షాప్’’ కేటగిరీని చేర్చింది. ఈ వార్త వినగానే హడావుడిగా స్విగ్గీయాప్ ఓపెన్ చేసి మందు బుక్ చేయాలని కంగారు పడకండి... ప్రస్తుతానికి ఇది ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరానికే పరిమితం. త్వరలో ఈ రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కూడా ఈ సర్వీసును అందిస్తామని స్విగ్గీ తెలిపింది. అంతేకాదండోయ్! ఆన్లైన్ లిక్కర్ డెలివరీ కోసం ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా చర్చలు జరుపుతున్నామని, వీలును బట్టి ఇతర రాష్ట్రాల్లో ఈ సేవలారంభిస్తామని ప్రకటించింది. ఆషామాషీ కాదు... ఆన్లైన్ లిక్కర్ డెలివరీ అనగానే ఠక్కున యాప్ ఓపెన్ చేసి బుక్ చేసుకోవడం కాదని స్విగ్గీ తెలిపింది. ముందుగా కస్టమర్ తన వయసును ధృవీకరించుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం జారీ చేసిన ఐడీని, ఒక సెల్ఫీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని డెలివరీ సమయంలో చెప్పాల్సిఉంటుంది. అంతేకాకుండా ఝార్ఖండ్ ప్రభుత్వ నియమాల ప్రకారం ఒక్కో కస్టమర్ చేసుకునే లిక్కర్ బుకింగ్‌కు పరిమితి ఉంటుంది. ఆన్లైన్ డెలివరీ ద్వారా వైన్స్ వద్ద గుంపులుకూడకుండా సాయం చేస్తున్నామని స్విగ్గీ ప్రతినిధి చెప్పుకున్నారు. తమ డెలివరీ పార్టనర్స్‌కు శుభ్రత, సురక్షిత విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. -
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: మద్య నియంత్రణ, నిషేధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దశలవారీగా మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 శాతం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 4380 మద్యం షాపులను 2934కి తగ్గించింది. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం దుకాణాలను తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 13 శాతం మద్యం షాపులను తొలగించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నాటికి షాపులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 43వేల బెల్టు షాపులను తొలగించడంతో పాటు, 40 శాతం బార్లును గతంలోనే తగ్గించింది. మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను ప్రభుత్వం ఇప్పటికే 20శాతం తగ్గించింది. లిక్కర్ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. అలాగే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్‌షాపుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం, ముందుగా బెల్ట్‌షాపులు ఎత్తివేస్తానంటూ పాదయాత్రలో హామీనిచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను ఏటా కొంతమేర తగ్గించేలా కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చారు. ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో నూటికి నూరుశాతం మద్యం దుకాణాలు ఎత్తివేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
ఆ మనిషి మారడంతే : విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్వీటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో మద్యం షాపులు ఎలా తగ్గిస్తారని గతంలో గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడేమో కేంద్రం నిర్ణయం మేరకు లిక్కర్ షాపులు తెరిస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. (చదవండి : బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా?) ‘రెండు నాలుకల్లో ఏది,ఎప్పుడు,ఏలైన్ తీసుకుంటుందో ఊహించడం కష్టం. కష్టజీవులకు ఉపశమనం లేకుండా మద్య నియంత్రణ ఏంటి? షాపులెలా తగ్గిస్తారని నిన్నటికి నిన్న కిందపడి దొర్లాడు. సైకిల్ నేతలను దెబ్బకొట్టడానికే ఇదంతా అన్నాడు. ఇప్పుడు కేంద్రం నిర్ణయానికి రాష్ట్రాన్ని నిందిస్తున్నాడు.మనిషి మారడంతే!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా?
సాక్షి, అమరావతి : గతంలో పది ఇళ్లకు ఒక బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కావని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక బెల్టు షాపులే లేకుండా చేశారని, వైన్ షాపుల సంఖ్య తగ్గించడం వల్ల జనాల్లో కొంత ఆతృత కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎన్టీర్ తెచ్చిన మద్య నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోందని ఎద్దేవాచేశారు. “ఉప్పల్ హెరిటేజ్‌లో నలుగురికి కరోనా, వారి వల్ల 25 మంది క్వారంటైన్” వీరంతా సత్వరం కోలుకోవాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. ఈ వార్త పబ్లిష్ కాకుండా, టెలికాస్ట్ కాకుండా మీడియాను మేనేజ్ చేసిన చంద్రబాబును ఏం చేయాలి? బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా? అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. -
‘అద్భుతం! ఉమ్మేయడం మళ్లీ మొదలవుతుంది’
దేశ వ్యాప్తంగా రెండు వారాలపాటు లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో గ్రీన్ జోన్లలలో కొన్ని నిబంధనలతో మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్, గేయ రచయిత జావేద్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్డౌన్లో పాన్ సెంటర్లు, గుట్కా, మద్యం షాపులు, తెరుచుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘అద్భుతం.. పాన్, గుట్కా షాపుల తెరుచుకుంటున్నాయి. ఇక ఉమ్మివేయడం కూడా మళ్లీ ప్రారంభమవుతుంది’ అంటూ రవీనా వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. (వలస కార్మికులపై ఎందుకింత ఆలస్యం?) లాక్డౌన్లో మద్యం ప్రజలపై త్వరగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని జావేద్ అక్తర్ అన్నారు. అంతేగాక దేశంలో ఇప్పటికే మద్యం కారణంగా గృహహింస కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ‘‘లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలను తెరవడం వినాశకరమైన ఫలితాలను ఇస్తుంది. ఇక అన్ని సర్వేల ప్రకారం ఈ కాలంలో గృహ హింస కేసులు చాలా వరకు పెరిగాయి. ఈ సమయంలో మద్యం అమ్మకాలకు అనుమతిస్తే అది మహిళలు, పిల్లలకు మరింత ప్రమాదకరంగా మారుతుంది’’. అని ట్వీట్ చేశారు. అయితే జావిద్ మద్యం సేవించడం మానేసినట్లు కనిపిస్తోందని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 1991 జూలై 30 మద్యం స్వీకరించిన చివరి రోజు అని జావేద్ బదులిచ్చారు. (18 వేల మందిని రాష్ట్రానికి తీసుకొస్తాం : సీఎం ) కాగా భారత్‌లో మే 3 వరకు ముగియనున్న లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రటకించిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్లో దేశంలోని అన్ని రాష్ట్రల్లోని జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా విభజించి.. మే 4 నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రీన్ జోన్లలలో కొన్ని నిబంధనలతో మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం శుక్రవారం ఆదేశించింది. మద్యం షాపులలో ఒకేసారి అయిదుగురికి మించి ఉండకూదనే నిబంధనలు పెట్టింది. (మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా! ) -
వైన్ షాపుల మూతపై వర్మ ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడంతో దాదాపు అన్ని వ్యాపార కార్యక్రమాలు మూతపడ్డాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. వీటిలో మద్యం షాపుల మూత అనేది పెద్ద ఎత్తున ఆదాయాన్ని స్తంభింపజేసింది. కేవలం దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వైన్ షాపులు మూతపటడంతో ఆయా ప్రభుత్వాల ఆదాయానికి గండిపడింది. ముఖ్యంగా భారత్‌లో లిక్కర్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున రెవెన్యూ అందుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడం కోసం మద్యం దుకాణాలకు ఆంక్షల నుంచి సడలింపు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. నిషేధం పూర్తిగా ఎత్తివేయకుండా ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు పరిమితులతో కూడిన వెసులుబాటును ఇవ్వాలని ప్రభుత్వాలకు పలువురు సూచనలు సైతం ఇస్తున్నారు. అలాగే బార్ షాపులు తెరిస్తే ఆహార పదార్థాల విక్రయం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాజాగా దీనిపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. మద్యం అందుబాటులో లేకపోతే బ్లాక్ మార్కెట్ ద్వారా జరిగే అనార్థాలపై ట్వీట్ చేశారు. ‘ప్రజలు కోరుకునే దేనినైనా పరిమితం చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ ధరలను పెంచడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల తమకు అవసరమైన ఆల్కహాల్‌ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున డబ్బును ఉపయోగిస్తారు. తద్వారా వారి కుటుంబాలు ఇతర అవసరాలను కోల్పోయే అవకాశం ఉంది’ అని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
వైన్ షాపులు తెరవండి.. ఖజానా నింపుకోండి
సాక్షి, ముంబై : లాక్డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలంటే మద్యం దుకాణాలను తెరవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఎమ్‌ఎన్‌ఎస్పీ చీఫ్ రాజ్ ఠాక్రే సలహా ఇచ్చారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ విధించడంతో రాష్ట్ర ఆదాయం పెద్ద ఎత్తున పడిపోయిందని, మద్యం అమ్మకాల ద్వారా దానిని పూడ్చవచ్చని సూచించారు. రాష్ట్రంలో వైన్ షాపులను తెరిస్తే రోజుకు రూ. 42 కోట్లు, నెలకు 1250 కోట్లు, ఏడాదికి రూ. 14000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఉద్ధవ్‌కు రాజ్ ఠాక్రే గురువారం ఓ లేఖ రాశారు. (24 గంటల్లో 1409 పాజిటివ్ కేసులు) వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ఎప్పటి వరకు కొనసాగుతుందో చెప్పలేమన్నారు. ఇది ఇలానే కొనసాగితే ముందుముందు రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక వనరులన్నీ మూసుకుపోవడంతో సంక్షేమ పథకాలకు ఇబ్బందులు ఏర్పడొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాను పెంచుకోవాలంటే మద్యం అమ్మకాలకు వెసులుబాటు కల్పించాలని సీఎంకు సూచించారు. లాక్డౌన్ ఆంక్షలను కొనసాగిస్తూనే.. సామాజిక దూరం పాటిస్తూ వీటిని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. వీటి ద్వారం వచ్చిన మొత్తాన్ని సంక్షేమ పథకాలు, కరోనా బాధితులకు ఉపయోగించవచ్చని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. (లాక్డౌన్ నుంచి పలు షాపులకు మినహాయింపులు) కాగా దేశ వ్యాప్తింగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రంలోని వెలుగుచూసిన విషయం తెలిసిందే. గురువారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5,221 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యారు. ఇప్పటి వరకు 251 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు వైరస్ నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడంలేదు. ఇక ధారావిలాంటి మురికివాడలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం అధికారులును, ప్రభుత్వాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. -
తెరుచుకోనున్న మద్యం షాపులు
గువాహటి: లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ అస్సాం రాష్ట్రంలో సోమవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. అలాగే బాట్లింగ్ ప్లాంట్లు, డిస్టిలరీలు, బ్రూవరీలు కూడా పని చేస్తాయి. మద్యం దుకాణాలను రోజుకు 7 గంటలు మాత్రమే తెరిచి ఉంచాలని అస్సాం ఎక్సైజ్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని తేల్చిచెప్పింది. అస్సాంలో ఇకపై ప్రభుత్వం అనుమతించిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లిక్కర్ షాపులు తెరిచి ఉంటాయి. -
సామాజిక మాధ్యమాల్లో ‘మందు’ గోల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైన్‌షాపులు తెరుస్తున్నారంటూ శనివారం మధ్యాహ్నం సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం ఒక రకంగా సంచలనానికి దారి తీసింది. ఈనెల 29 నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వైన్‌షాపులు తెరుస్తున్నారని, ప్రతి షాపు దగ్గర ఐదుగురు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు కాపలా ఉంటారని వాట్సాప్‌లో వచ్చిన ఫేక్ డాక్యుమెంట్ క్షణాల్లో వైరల్ అయింది. అలా వాట్సాప్‌లోకి వచ్చిందో లేదో నిమిషాల్లో వందలు, వేల వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో మళ్లీ మద్యం గురించి చర్చ మొదలైంది. మద్యం కోసం తహతహలాడుతున్న మందు బాబులు మళ్లీ వైన్‌షాపులు తెరుస్తున్నారన్న ఆశతో తమ సహచరులు, సన్నిహితులు, మీడియా వ్యక్తులకు ఫోన్లు చేసి ఆరా తీశారు. అయితే వాట్సాప్‌లో ఈ ఫేక్ సమాచారం ఎంత వేగంగా ప్రచారమైందో అంతే వేగంగా ఎక్సైజ్ అధికారులు కూడా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన డాక్యుమెంట్ నకిలీదని, శాఖా పరంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారికంగా వివరణ ఇచ్చారు. పైగా నకిలీ పోస్టును ప్రచారం చేసిన వారిపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈజీ కాదు రాష్ట్రంలో మద్యం తాగేవారి సంఖ్య దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువే ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత వారం రోజులుగా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మందు దొరక్కపోవడంతో ఎప్పుడెప్పుడు వైన్‌షాపులు తెరుస్తారా అనే ఆశతో మందుబాబులు ఎదురుచూస్తున్నారు. మందు కోసం వీరంతా రోజూ ఏదోలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శనివారం వెలుగులోకి వచ్చిన నకిలీ డాక్యుమెంట్ వీరిలో లేనిపోని ఆశలు కల్పించింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి షాపులు తెరిస్తే నియంత్రించడం కష్టమవుతుందని, అలాంటి పరిస్థితుల్లో ఇప్పట్లో మద్యం దుకాణాలు తెరవడం జరిగే పని కాదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. అవసరమైన వారికి మద్యం ఇంటికే సరఫరా చేసేందుకు కసరత్తు జరుగుతుందన్న వార్తల్లో కూడా వాస్తవం లేదని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలపై సీఎం కేసీఆర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారుల చేతిలో ఈ నిర్ణయం ఉండదని, ఒక్కసారి నిత్యావసరాల చట్టం అమల్లోకి వచ్చాక శాఖల చేతిలో ఏమీ ఉండదని, సీఎం సూచన మేరకు ఉన్నత స్థాయిలోనే నిర్ణయం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇది ఒక్క ఎక్సైజ్ శాఖకే కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకూ ఇదే నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ నకిలీ డాక్యుమెంట్ తయారుచేసిన వారిపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు. ఈ వదంతులను పంపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్మీ రావడం అవాస్తవం: డీజీపీ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జన సంచారాన్ని నియంత్రించేందుకు సైన్యం రంగంలోకి దిగిందన్న ప్రచారాన్ని డీజీపీ కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో ఖండించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను నియంత్రించడానికి రాష్ట్ర బలగాలు సరిపోతాయని, అదనపు బలగాలు, ఆర్మీని పంపాలని రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని తెలిపింది. మరికొన్ని ఫేక్‌న్యూస్‌ల హల్చల్ కరోనా నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ కొందరు తప్పుడు పోస్టులు పెడుతున్నారు. కరోనా నియంత్రణకు అనుమానితులను చైనా కాల్చేసిందని, రష్యా రోడ్లపై సింహాలను వదిలిందంటూ కొన్ని ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జన సంచారం నియంత్రణకు ఆర్మీ వస్తోందని పాత వీడియోలు షేర్ చేస్తున్నారు. -
గొంతులో మందు చుక్క పడనిదే...
-
మందు బాబులను ఆగమాగం చేస్తోంది...
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కడుపులో సమయానికి ముద్ద లేకున్నా ఫర్వాలేదు కానీ చుక్క పడకపోతే కాళ్లు చేతులు ఆడవు. నాలుక పిడచ కట్టుకుపోతుంది. నరాలన్నీ ఒక్కసారిగా లాగుతూ మందు బాబును నిలబడనీయడంలేదు. ఏ బ్రాండ్ అయినా ఫర్వాలేదు పెగ్గు ఉన్నా చాలు అన్నట్లుంది వారి పరిస్థితి. ఏదో ఒకటి నాలుగు చుక్కలు నోట్లో పడితే చాలన్నట్లు మందు కోసం ఉరుకులు పరుగులు తీస్తున్నారు. చివరకు గుడుంబా, నాటుసారాల వైపు చూస్తున్నారు. అదీ లేకుంటే కల్లు కోసం కల్లు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాటి వనాల వద్ద ఈ మందు బాబుల హాల్చల్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నిద్రలేవగానే గొంతులో మందు చుక్క పడనిదే అడుగు ముందుకు వేయని మందుబాబులు...లాక్డౌన్ కారణంగా కొన్ని రోజులుగా మద్యం లభించకపోవడంతో పిచ్చివాళ్లుగా మారుతున్నారు. లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలను సైతం బంద్ చేశారు. నగరంలోని పలుచోట్ల కొందరు మద్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. మద్యం షాపు వద్దకు వచ్చి మద్యం ఇవ్వాలంటూ మారాం చేస్తున్నారు. మరికొంతమంది వైన్ షాపుల వద్ద మద్యం కోసం పడిగాపులు పడుతున్నారు. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్‌లో ఉంటున్న మధు అనే పెయింటర్ మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోయాడు. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాక్‌డౌన్‌తో కిక్కు కరువై కరోనా వైరస్ (కోవిడ్–19) మందు బాబులను ఆగమాగం చేస్తోంది. లాక్‌డౌన్‌తో బార్లు, మద్యం దుకాణాలు కూడా మూత పడడంతో మద్యం కోసం నానాయాతనలు పడుతున్నారు. అక్కడక్కడా బెల్టు షాపులు ఆదుకున్నా.. అక్కడ కూడా నిల్వలు అడుగంటిపోవడం.. ధరలు నింగినంటడంతో లబోదిబోమంటున్నారు. మొన్నటి వరకు ఖరీదైన బ్రాండ్లు తప్ప మద్యం ముట్టని బడాబాబులు కూడా చోటామోటా బ్రాండ్లతో సరిపుచ్చుకుంటున్నారు. కేవలం 24 గంటలపాటే జనతా కర్ఫ్యూ ఉంటుందని భావించిన మందుబాబులు.. మద్యం కొనుగోళ్లపై ముందుచూపు ప్రదర్శించలేదు. రాత్రికి రాత్రే ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ ప్రకటించడంతో బిత్తరపోయారు. (కరోనా: ధోని విరాళం రూ. లక్ష.. సిగ్గు పడండి!) చేసేదేమీలేక వైన్స్‌షాపులు, బెల్టు షాపుల్లో ఉన్నవాటిని గుట్టుగా కొని గుటకేసినా.. అక్కడ కూడా మందు సీసాలు ఖాళీ కావడంతో దేశీ మద్యం వైపు చూస్తున్నారు. దేశీ మద్యం అంటే అదేంటో అనుకుంటున్నారా? అదేనండీ గుడుంబా, నాటుసారా. ఆఖరికి కల్లు. ఈ మూడే ప్రస్తుతం మందుబాబులకు ఆదుకుంటున్నాయి. అయితే, ఇవీ కూడా ఎక్కడపడితే అక్కడ దొరకడంలేదు. కేవలం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవి లభ్యమవుతున్నాయి. గుడుంబా అమ్మకాలను నిషేధించడంతో ఐదేళ్ల క్రితమే వీటి తయారీని నిలిపివేసిన తయారీదారులు.. అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. దీంతో గుట్టుగా నాటుసారా బట్టీలను మొదలుపెట్టారు. (అగ్రరాజ్యం అతలాకుతలం) తాటివనాల్లో మందు..విందు! ఉద్యోగ, ఉపాధిరీత్యా ఇన్నాళ్లూ హైదరాబాద్ సహా పట్టణాల్లో ఉన్నవారంతా లాక్డౌన్ పుణ్యామా అని పల్లెబాట పట్టారు. మద్యం లభ్యం కాకపోవడం... దొరికినా భారీ రేట్లు పలుకుతుండడంతో కల్లు సేవించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని తాటి వనాల్లో ఎక్కడ చూసినా మందుబాబుల సందడే కనిపిస్తోంది. దీనికితోడు చికెన్ ధరలు కూడా పడిపోవడంతో కల్లు చుక్క..చికెన్ ముక్కతో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో మొన్నటివరకు రూ.20 నుంచి 30 వరకు దొరికే కల్లు సీసా ఇప్పుడు రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. పట్టణాలు, మండలాల్లో కల్లు దుకాణాలు బంద్ కావడంతో కల్లు ప్రియులు గందరగోళంలో పడ్డారు. కల్లు డిపోలు తెరవాలని ముస్తేదార్లపై ఒత్తిడి తెస్తున్నారు. కలుకు బానిసలైన కొంతమంది మాత్రం మానసికంగా బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. (కేవలం 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ!) ఆస్పత్రులకు క్యూ కడుతున్న కల్లు బాధితులు నిజామాబాద్ జిల్లాలో కల్లు ప్రియులు ఆందోళనకు గురవుతున్నారు. లాక్డౌన్ కారణంగా కల్లు దుకాణాలు మూతపడటంతో కల్తీ కల్లు బాధితులు మతి స్థిమితం తప్పి ప్రవర్తిస్తున్నారు. దీంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ... వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా నగరంలోని ముదిరాజ్‌గల్లిలో భూషణ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. అయితే లాక్డౌన్ కారణంగా కల్లు దొరకకపోవడంతో పిట్స్ వచ్చి మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. వైన్ షాపులో చోరీ ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మందుబాబులు ఏకంగా వైన్ షాపుకే కన్నం వేశారు. చేతికి అందినన్ని మందు బాటిల్స్‌ను పట్టుకెళ్లారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెంలోని శ్రీ సాయి వైన్స్‌లో ఆగంతకులు షాపు షట్టర్స్ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న సివిల్, ఎక్సైజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, విచారణ చేపట్టారు. -
స్టోరంతా తిరిగి కొనుక్కునే చాన్స్
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలోని మద్యం ప్రియులకు ఇక సూపర్ కిక్ ఎక్కనుంది. నవంబర్ నుంచి సూపర్ మార్కెట్ తరహాలో వాక్ఇన్ లిక్కర్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులిస్తూ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఎక్సైజ్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మేరకు ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటయ్యే వాక్ఇన్ వైన్ షాపులలోకి మద్యం ప్రియులు వెళ్లి స్టోరంతా కలియ తిరిగి వారికి ఇష్టమైనబ్రాండ్లను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఒక్క స్పెన్సర్స్ మాల్లోనే ఈ తరహా షాపు ఉంది. కొత్త ఎక్సైజ్ పాలసీతో షాపింగ్ మాల్స్, ఇతర ప్రాంతాల్లోనూ వాక్ఇన్ వైన్స్ ఏర్పాటుకు చాన్స్ ఉంది. ఈ దుకాణాలను ఏర్పాటు చేయాలంటే లైసెన్సు ఫీజుతో పాటు స్పెషల్ ఎక్సైజ్ పన్నుకు అదనంగా మరో రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే వాక్ఇన్ దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునేవారు మొత్తంగా రూ.2.30 కోట్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నగరంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు కొనసాగుతుండగా కొత్త ఎక్సైజ్ పాలసీ సిటీలోని మద్యం ప్రియులకు మరింత మత్తెక్కించేలా ఉంది. పాత షాపులే... హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ప్రస్తుతమున్న షాపులన్నింటికీ మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిటీలో షాపులు తగ్గించి శివార్లలో పెంచుతారని భావించినా పాత సంఖ్యనే ఖరారు చేశారు. దీంతో పాటు మద్యం షాపుల టెండర్లో పాల్గొనేందుకు దరఖాస్తు రుసుమును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచారు. ఈ నెల 9 నుంచి దరఖాస్తులు విక్రయించి 18న లాటరీ తీయనున్నారు. -
ప్రభుత్వ అధీనంలో మద్యం షాపులు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను ప్రభుత్వం 20శాతం తగ్గించింది. లిక్కర్ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. అలాగే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్‌షాపుల ఏర్పాటుపై ఉక్కపాదం మోపింది. గ్రామాల్లో మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో 14 వేల 944 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించింది. కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా నేటినుంచి ప్రభుత్వ అధీనంలోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం షాపులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ పెద్దిరాజు ప్రారంభించారు. నియోజకవర్గంలో గతంలో 21 మద్యం షాపులు ఉండగా వాటిని 20% కుదించి.. 17 షాపులను ప్రారంభించారు. ప్రభుత్వం తరపున ఏర్పాటైన మద్యం షాపుల్లో 17మంది సూపర్ వైజర్లు,17 మంది నైట్ వాచ్మెన్లు, 41మంది సేల్స్‌మేన్లగా నియమితులయ్యారు. ఈ మేరకు ఉద్యోగాలు లభించడంతో నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తోంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపులను నిర్వహిస్తున్నామని, మద్యం షాపుల సంఖ్యను, అమ్మకాల సమయాన్ని కుదించించడం ద్వారా ఏపీలో దశలవారీగా మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహోన్నతమైన ఆశయం కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఎక్సైజ్ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. పుత్తూరు పట్టణంలో.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం విధానాన్ని అమలు చేశారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఉన్న 29 షాపులును కుదించి 23 షాపులు ప్రవేశపెట్టారు. 23 షాపులలో 77 మందిని సేల్స్ అండ్ క్యాషియర్‌గా నియమించారు. ఈ కొత్త మద్యం విధానంతో మద్యపానాన్ని అంచలంచలుగా నియంత్రిస్తామన్నారు పుత్తూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మోహన్. సీఎం వైఎస్ జగన్ హామీ ఆదేశాల మేరకు మేం కట్టుబడి పని చేస్తామని మా పరిధిలో ఎక్కడ బెల్టుషాపులు ఉన్నా తొలగిస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మోహన్ తెలిపారు. చదవండి: రాత్రి 8 వరకే మద్యం -
బెల్టు షాపులపై ఉక్కుపాదం: సీఎం జగన్
-
బెల్టు షాపులపై ఉక్కుపాదం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేరకు మద్య నిషేధం దిశగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్ననే నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చారు. తాజాగా అక్టోబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 20శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యను తగ్గిస్తామని తెలిపారు. అక్రమ మద్యాన్ని, నాటుసారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ‘బెల్టుషాపులపై ఉక్కుపాదం. ఫలితంగా మద్యం వినియోగం భారీగా తగ్గుతోంది. అక్టోబర్ నుంచి 20శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యను తగ్గిస్తాం. అక్రమ మద్యాన్ని, నాటుసారాను అరికట్టేందుకు గ్రామసచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నాం. దశలవారీ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. (చదవండి: ఉద్వేగానికి లోనవుతున్నా) -
సర్కారు మద్యం షాపులకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి : ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా కృష్ణా జిల్లాలో రెన్యువల్ చేసుకోని 52 మద్యం దుకాణాలను తొలి విడతగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 13వ తేదీన అద్దె దుకాణాలు, ఫర్నీచర్, మద్యం డిపో నుంచి షాపులకు సరఫరా అంశాలపై వేర్వేరు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లను జాయింట్ కలెక్టర్ మాధవీలత ఆధ్వర్యంలో ఖరారు చేశారు. 52 మద్యం దుకాణాలకు గాను 35 షాపులకు టెండర్లు ఖరారు కాగా.. మిగిలిన 17 షాపులకు దరఖాస్తులు రాకపోవడంతో వాటిని వాయిదా వేశారు. సర్కారు నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించి మిగిలిన వాటికి ఈ నెల 28న రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు టెండర్లు ఖారారు చేయబోతున్నారు. జిల్లాలో మద్యం దుకాణాలు.. మద్యం పాలసీ ప్రకారం 2019 జూన్‌తో రాష్ట్రంలోని మద్యం దుకాణాలకు గడువు ముగిసింది. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దీని కోసం విధి విధానాలను రూపొందిస్తోంది. కొత్త విధి విధానాలు వచ్చేంత వరకు గడువు ముగిసినా పాత మద్యం దుకాణాలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా దుకాణాల లైసెన్సులను 3 నెలలు పొడిగించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లాలో మొత్తం 346 మద్యం దుకాణాలున్నాయి. వీటిలో విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 171, మచిలీపట్నం ఈఎస్ పరిధిలో 175 షాపులు ఉన్నాయి. రెన్యూవల్ చేయని దుకాణాలు 52 జిల్లాలో మొత్తం దుకాణాల్లో 294 దుకాణాలు రెన్యువల్ చేసుకోగా ఇంకా 52 దుకాణదారులు రెన్యువల్ చేసుకోలేదు. ఈ 52 దుకాణాలను మొదటి విడతలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో మచిలీపట్నం ఈఎస్ పరిధిలో ఖాళీలు ఉన్న దుకాణాలు 39 ఉండగా.. అందులో మచిలీపట్నం 4, అవనిగడ్డ 1, మొవ్వ 2, గుడివాడ 8, కైకలూరు 8, మండవల్లి 6, గన్నవరం 5, ఉయ్యూరు 5 ఉన్నాయి. విజయవాడ ఈఎస్ పరిధిలో 13 ఖాళీ దుకాణాలు ఉన్నాయి. పటమట 3, భవానీపురం 1, మైలవరం 2, నందిగామ 1, కంచికచర్ల 1, జగ్గయ్యపేట 3, తిరువూరు 2 దుకాణాలు ఉన్నాయి. మొత్తం దుకాణాలకు ఈ నెల 28న టెండర్లు ఖరారు ప్రభుత్వం నిర్ణయం ప్రకారం 20 శాతం దుకాణాలను తగ్గించడానికి అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే 52 మద్యం షాపులను మినహాయిస్తే మిగిలిన 294 షాపుల్లో 20 శాతం అంటే 59 షాపులను రద్దు చేయబోతున్నారు. పోగా మిగిలిన 234 షాపులకు ఈ నెల 28న టెండర్లు ఖరారు చేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. సితారా సెంటర్‌కు అత్యధికంగా రూ. 82 వేల అద్దె రెన్యువల్ చేసుకోని 52 దుకాణాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. 52 దుకాణాలకు అద్దెకు ఇవ్వడానికి 47 మంది ముందుకు రాగా.. అందులో 17 షాపులకు దరఖాస్తులు రాలేదు. మచిలీపట్నంలో అత్యల్పంగా ఒక దుకాణానికి నెలకు 5,500 అద్దె ఖరారు కాగా.. అత్యధికంగా విజయవాడ నగరంలోని భవానీపురం సితారా సెంటర్లో దుకాణానికి నెలకు రూ. 82 వేలు అద్దె చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇదేవిధంగా ఫర్నీచర్, డిపోల నుంచి మద్యం సరఫరా టెండరుదారులతో అధికారులు బుధవారం రాత్రి వరకు సంప్రదింపులు జరిపి నిర్ణయించడం జరిగినట్లు సమాచారం. అక్టోబరు 1 నుంచి ఈ షాపుల ద్వారా ప్రభుత్వం మద్యం అమ్మకాలు చేపట్టనుంది. -
జిల్లాలో 42 ప్రభుత్వ మద్యం దుకాణాలు
సాక్షి, విశాఖపట్నం: దశల వారీ మద్యపాన నిషేదం దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే బెల్ట్ మద్యం దుకాణాలను దాదాపు నియంత్రించిన ప్రభుత్వం సిండికేట్ వ్యాపారానికి కూడా చెక్ పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను నడిపేందుకు కార్యాచరణ రూపొందించింది. సర్కారు ఆదేశాల మేరకు మరో పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 42 మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. క్రితం సారి వేలంలో హక్కులు పొంది గతేడాది లైసన్స్లు పునరుద్ధరించుకోని దుకాణాల స్థానంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో దుకాణానికి ఓ సూపర్వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్‌ను నియమించనున్నారు. దీనికి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసి అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని భర్తీ చేయనున్నారు. వీరికి జీతభత్యాలు, ఇతరత్ర అంశాలను నోటిఫికేషన్ సమయంలో ప్రకటిస్తారు. ఈ ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ బాధ్యతలు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు చూసుకుంటారు. సిండికేట్‌కు చెక్ గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మద్యం ఏరులై పారిన సంగతి తెలిసిందే. లైసన్స్ మద్యం దుకాణాలకు ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడంతో సిండికేట్ వ్యాపారం పెచ్చుమీరింది. దీంతో బెల్ట్ దుకాణాలు పుట్టగొడుగుల్లా ఎక్కడిక్కడే వెలిశాయి. ఆయా దుకాణాలకు నేరుగా లైసన్స్ షాపుల నుంచే మద్యం సరఫరా చేయడంతో మద్యం వ్యాపారం మూడు ఫుల్లు.. ఆరు క్వార్టర్లుగా సాగింది. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభించినా వాటి నిర్వహణ గాలికి వదిలేయడంతో కొద్దిరోజులకే దుకాణాలన్నీ మూతపడ్డాయి. దీంతో సిండికేట్ వ్యాపారులు మరింత విజృంభించి సొమ్ము చేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న నూతన మద్యం పాలసీతో ఈ సిండికేట్ వ్యాపారానికి పూర్తిగా చరమగీతం పాడినట్లే. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపడితే బెల్ట్ దుకాణాల మనుగడ ఉండదు. ధరల నియంత్రణ ఉంటుంది. కల్తీ మద్యం అమ్మకాలు జరిగే అవకాశాలు ఉండవు. నిరుద్యోగులకు మందికి ఉపాధి మరోవైపు నూతన మద్యం పాలసీ వల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తం 42 దుకాణాలకు గాను ఒక్కో దుకాణానికి ఒక సూపర్వైజర్, ఇద్దరు సేల్స్ మెన్‌ను నియమిస్తారు. తద్వారా జిల్లాలో 126 మందికి ఉపాధి లభిస్తుంది. సిబ్బంది జీత భత్యాలు, దుకాణాల సమయాలు, ఇతర నియమ నిబంధనలు రెండు మూడు రోజుల్లో జేసీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పది రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది.. నూతన మద్యం దుకాణాలు ప్రారంభించడానికి మాకు సమాచారం అందింది. దీనిపై కమిషనర్‌తో సమీక్ష కూడా జరిగింది. మరో పదిరోజుల్లో సిబ్బంది నియామకాలు, దుకాణాల లభ్యతను చూసుకుని అమ్మకాలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత మరిన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. –శ్రీనివాసరావు, డీసీ, ఎక్సైజ్‌శాఖ -
కిక్కు దించే జ‘గన్’
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో.. మద్యం రాకాసి వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్న దుస్థితిని మహిళలు వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి ముందు ఏకరువు పెట్టారు. అధికారంలోకి రాగానే దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని, ఫైవ్‌స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో చట్టాన్ని చేశారు. ఫలితంగా జిల్లాలో మద్యం అక్రమాలకు చెక్‌పడటంతో పాటు నియంత్రణకు మార్గం సుగమమైంది. సాక్షి, చిత్తూరు అర్బన్: జిల్లాలో ఏటా రూ.1,500 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం ఏమాత్రమూ లెక్కచేయడం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా దశలవారీ మద్యపాన నిషేధం వైపు మొగ్గు చూపుతోంది. దీన్ని బలపరుస్తూ అసెంబ్లీలో మద్య నియంత్రణ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ బిల్లును పాస్ చేసింది. పైగా జిల్లాలో 15 దుకాణాలను వచ్చేనెల నుంచి ప్రభుత్వమే నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం అధికారుల నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. కొత్త చట్టం ఇలా... కొత్తగా ఆమోదించిన చట్టం ప్రకారం మద్యం విక్రయాల నియంత్రణే ప్రధాన అంశం. జిల్లాలోని మద్యం దుకాణాలు సమయపాలన పాటించకపోవడం, ఎమ్మార్పీ ఉల్లంఘన లాంటి అంశాలపై కొత్త చట్టం తీవ్రంగా పరిగణించనుంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బెల్టు దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా సామాజిక భద్రతకు భంగం కలిగిస్తున్నారు. వీటిపై ఇప్పటివరకు దుకాణ నిర్వాహకులకు జరిమానాలు విధించడంతో పాటు తాత్కాలికంగా లైసెన్సులు రద్దు చేసేవారు. అయితే కొత్త చట్టంలో లైసె న్సు తీసుకున్న నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు సైతం పెట్టనున్నారు. ఇక ప్రభుత్వ దుకాణాల్లో మద్యం విక్రయించడం ద్వారా విక్రయ సమయాలను సైతం కుదించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న 12 గంటల సమయంలో నాలుగు గంటలు తగ్గించి 8 గంటలు మాత్రమే మద్యాన్ని అందుబాటులో ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబరు నెలాఖరుకు ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ గడువు ముగుస్తుండటంతో అక్టోబర్ నుంచి కొత్త పాలసీని తీసుకురానున్నారు. ఇందులో ఎలాంటి మార్పులు ఉంటాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రతిపాదనలు పంపాం గతంలో జిల్లాలో డిస్పోజ్కానటువంటి దుకాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఆ వివరాలను ఇప్పటికే పంపిం చాం. ప్రతి సర్కిల్లోనూ ఓ ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. – నాగలక్ష్మి, డెప్యూటీ కమిషనర్, జిల్లా మద్య నియంత్రణ, ఆబ్కారీ శాఖ -
బీర్లు నోస్టాక్!
సాక్షి, హైదరాబాద్: చల్లని బీరు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. బీరు ప్రియం అయింది.. ఈ కబురు బీరుప్రియులకు అప్రియం అయింది. చాలా వైన్‌షాపుల్లో ‘నో స్టాక్’.. ‘బీర్లు లేవు’.. ‘ఒకరికి ఒక్క బీరు మాత్రమే’.. బీర్ ‘కూల్’లేదు.... వంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. మండే ఎం డల్లో చల్లని బీరు కోసం వెళ్లిన బీరుప్రియులు నిరాశతో వెనుదిర గాల్సి వస్తోంది. వినియోగం పెరగడంతోపాటు ఉత్పత్తి కూడా తక్కువ కావడంతో 15–20 రోజుల నుంచి రాష్ట్రంలో బీరు దొరకడమే గగనమైపోయింది. ఐదు బేవరేజెస్కూ నీళ్లు బంద్ రాష్ట్రంలో బీరు ఉత్పత్తి చేసే ఐదు బేవరేజెస్ కంపెనీలు సింగూరు జలాశయం పరిధిలోనే ఉన్నాయి. ఎగువ నుంచి నీటి ప్రవాహాలు లేకపోవడం, సింగూరు జలాశయంలో నీళ్లు తక్కువగా ఉండడంతో రోజువారీ తాగునీటి అవసరాల కోసం ఆదా చేయాలన్న ఉద్దేశంతో ఈ జలాశయం నుంచి బేవరేజెస్‌కు నీటి సరఫరాను ప్రభుత్వం మార్చి 1 నుంచి నిలిపివేసింది. దీంతో ఆయా బేవరేజెస్ కంపెనీలున్న పరిసరాల్లోని బోర్లు, ప్రత్యేకంగా ట్యాంకుల్లో తెప్పించుకుంటున్న నీళ్ల ద్వారా బీర్ల తయారీ సాగుతోంది. తగినంత నీటి సరఫరా లేకపోవడంతో డిమాండ్‌కు అనుగుణంగా బీర్ల ఉత్పత్తి జరగడం లేదు. ఏప్రిల్, మే మాసాల్లో నెలకు సగటున 60 లక్షల కేసుల బీర్ల డిమాండ్ ఉండగా, బేవరీల నుంచి 30–35 లక్షల కేసులు మాత్రమే ఉత్పత్తి అవుతుండడంతో ఈ కొరత ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని ఓ వైన్‌షాప్ వద్ద బీర్లు లేవు అని పది రోజుల నుంచి దర్శనమిస్తున్న బోర్డు డిపోల్లో ‘రేషన్’షురూ... బీర్ల ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో మద్యం డిపోల్లో రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి షాపునకు వేసవిలో రోజుకు 150–200 కేసుల బీర్లు అమ్మే సామర్థ్యమున్నా కేవలం 30–50 కేసుల బీర్లు మాత్రమే ఇస్తున్నారు. ఈ బీర్లు వచ్చిన రెండు గంటల్లోపే అమ్ముడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని చోట్ల వైన్‌షాప్ యజమానులు ఒకరికి ఒక బీరు మాత్రమే ఇస్తు న్నారు. అయినా బీర్లు సరిపోక పోవడంతో బీరు ప్రియులు వైన్‌షాపుల సిబ్బందితో గొడవలు పడాల్సి వస్తోంది. అయితే, బార్ అండ్ రెస్టారెంట్లలో మాత్రం బీర్ల కొరత పెద్దగా లేదు. ఆయా రెస్టారెం ట్లకు డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటిలాగే డిపోల నుంచి బీర్లు సరఫరా అవుతుండడం, వైన్‌షాపులతో పోలిస్తే రెస్టారెంట్లకు వెళ్లి బీర్లు తాగేవారి సంఖ్య కూడా తక్కువ కావడమే దీనికి కారణం. మళ్లీ వర్షాలు పడితేనే! సింగూరు జలాశయంలో నీటినిల్వలను బట్టి చూస్తే మళ్లీ వర్షాలు పడి భూగర్భజలాల్లో పెరుగుదల కనిపిస్తేనే బీర్ల తయారీ ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. నీటికొరత కారణంగానే బీర్ల కొరత ఏర్పడిందని, మళ్లీ నీళ్లు పుష్కలంగా వస్తే తప్ప చేసేదేమీ లేదని వారంటున్నారు. ఎప్పటిలాగే బేవరేజెస్ తాము ఈ వేసవిలో కూడా అధికంగా బీర్లు తయారు చేయాలని ఇండెంట్లు ఇచ్చామని, నీటిసరఫరా లేకపోవడంతోనే బీర్ల తయారీ తగ్గిపోయిందని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణుడు కరుణిస్తే కానీ రాష్ట్రంలోని బీరు ప్రియుల దాహం తీరనుంది. గత మూడు నెలల్లో బీర్ల అమ్మకాలు...52,70,660కేసులు మార్చి నెలలో.. ఏప్రిల్‌లో.. 52,70,077కేసులు మేలో.. 48,71,668కేసులు -
బాబోయ్ మహమ్మారి!
ఎవరైనా ఉన్నట్లుండి తిరిగి రాని లోకాలకు వెళితే ఏమంటాం? ఏ జబ్బు బారిన పడో మృతి చెందితే ఏమంటాం? మహమ్మారి మింగేసిందంటాం..ఇంకా దెయ్యం మింగిందంటాం. ఎన్నో మహమ్మారులు, దయ్యాలు మనుషుల్ని మింగేస్తున్నా, మనందరం చూస్తూనే ఉన్నాం కానీ అడ్డుకోము.. ప్రభుత్వాలూ అడ్డుకోవు.. పైగా కొన్ని మహమ్మారిలను ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయి. అందులో మద్యం అనే మహమ్మారిని పేద జనాల పైకి వదిలింది ఈ ప్రభుత్వమే. ఈ మహమ్మారి రాష్ట్రంలో వేలాది పేదల కుటుంబాలను కకావికలు చేసింది.. చేస్తోంది. ఒళ్లు, ఇల్లు గుల్ల చేసి.. పీల్చి పిప్పి చేస్తోంది. ఈ మహమ్మారి ఆవహించినోళ్లు పెళ్లాం, పిల్లలని కూడా చూడకుండా చితకబాది డబ్బులు లాక్కెళ్లడం మామూలు విషయం. అడ్డుచెబితే కడతేర్చడానికి కూడా వెనుకాడనీయదు ఈ మహమ్మారి.ఈ మహమ్మారిని వదిలించండి మహాప్రభో అని లక్షలాది మందిపేద మహిళలు ఊరూ వాడా నెత్తీ నోరు బాదుకుంటున్నారు. అమరావతి/ సాక్షి నెట్వర్క్:బిహార్, గుజరాత్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లో మద్య నిషేధం అమల్లో ఉంది. మద్యనిషేధాన్ని అమలు చేస్తూ బిహార్ సీఎం నితీష్కుమార్సత్ఫలితాలు సాధిస్తున్నారు. బెల్టు షాపుల నిషేధంపైనాలుగో సంతకం చేసిన చంద్రబాబు.. మూడేళ్లలోఏనాడైనా బెల్టుషాపుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారా? అంటే లేదనే సమాధానం వస్తుంది. ఈ నాలుగున్నరేళ్లలో గతం కంటే 50 శాతం బెల్టు షాపులు పెరిగాయి.మద్యపానం వల్ల ఎదురవుతున్న దుష్ఫలితాల్నివివరించేందుకు చంద్రబాబు అధికారంలోకి వచ్చాకఒక్క పైసా ఖర్చు చేసిన దాఖలాల్లేవు. రాష్ట్రంలో ఎక్కడా డీ–అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మద్యంద్వారా వచ్చే ఆదాయం కోసం రహదారుల స్థాయితగ్గించి.. ప్రజల ప్రాణాల కన్నా మద్యం ఆదాయానికే చంద్రబాబు సర్కారు ప్రాధాన్యమిస్తోందన్న విమర్శలున్నాయి. చంద్రబాబు అధికారంలోకొచ్చేసరికి రూ.11,569 వేల కోట్ల మేర అమ్మకాలుంటే.. ప్రస్తుతం రూ.17 వేల కోట్లకు పైగా ఎగబాకాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరిగిన దాడులు, బలాత్కారాలు అన్నీ మద్యం మత్తులో జరిగినవే కావడం గమనార్హం. ఇప్పుడున్న మద్యం దుకాణాలు,బార్లు చాలవన్నట్టు పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లలో బార్లు ఏర్పాటు చేసి రెడీ టూ డ్రింక్ పేరిట అమ్మకాలు సాగిస్తున్నారు. బీరు హెల్త్ డ్రింకట.. రాష్ట్రంలో తాగునీరు దొరకని గ్రామాలున్నాయిగానీ.. మద్యం దొరకని గ్రామాల్లేవు. చంద్రబాబు సర్కారు ఊరూరా, వీధి వీధినా మద్యం షాపుల్ని ఏర్పాటు చేసింది. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో బార్ల సంఖ్య పెంచి ప్రతి సగానికి సగం మందిని తాగుబోతుల్ని చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల పొడవునా పాలు, నీళ్లు దొరకడం లేదుగానీ.. మద్యం మాత్రం అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా దొరుకుతోంది. బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తామని ఏకంగా అబ్కారీ మంత్రి ప్రకటించారంటే జనంతో మద్యం తాగించేందుకు ఈ పాలకులు ఎంతగా ఆరాట పడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మద్యం ఆదాయం కోసం పాకులాడుతూ ఆవాస ప్రాంతాలు, నివాస గృహాలు, గుడిపక్కన, బడిపక్కన.. చివరకు తినుబండారాలు అమ్మే దుకాణాల్లో సైతం బెల్టు షాపులను ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేయిస్తున్నారు. అధికారంలోకి రాగానే బెల్టు షాపుల్ని రద్దు చేస్తామని.. ప్రమాణ స్వీకారం రోజే నాలుగో సంతకం చేసిన సీఎం చంద్రబాబు బెల్టు షాపులపై సమీక్ష కూడా చేయలేదంటే ఎంతగా వీటిని ప్రోత్సహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మద్యం ఆదాయం పెంచుకునేందుకు మాత్రం సమీక్షలు చేసి.. ప్రజల్లో భక్తిభావం పెరిగి, స్వామిమాలలు ధరించడం వల్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయని సీఎం చంద్రబాబు గతంలో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా 1995లో చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. ఆ సమయంలోనే బెల్టు షాపులు వాడవాడలా వెలిశాయి. వైఎస్ హయాంలో ‘బెల్టు’ తీశారు వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకొచ్చాక గుంటూరు జిల్లా కొల్లిపరలో పల్లెబాట నిర్వహించారు. ఆ సమయంలో మహిళలు బెల్టు షాపుల వల్ల తామెదుర్కొంటున్న ఇబ్బందుల్ని వైఎస్‌కు ఏకరవు పెట్టారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపారు. బెల్టు షాపులు ఏర్పాటు చేసి పదే పదే పట్టుబడితే పీడీ యాక్టు పెడతామని హెచ్చరించడంతో మద్యం సిండికేట్లు బెల్టు షాపుల ఏర్పాటులో వెనక్కు తగ్గారు. మా కష్టం మాటలతో చెప్పలేం.. నా భర్త నెల్లి సత్యనారాయణ ఆకివీడులో ఓ రైస్ మిల్లు కార్మికుడు. మాకు ఇద్దరు పిల్లలు. అయితే నా భర్త మద్యానికి బానిసయ్యాడు. అదే మా కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. గతేడాది జూలైలో డ్యూటీ దిగాక పూటుగా మద్యం తాగి సైకిల్‌పై వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన నా భర్తను భీమవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి.. మెరుగైన చికిత్స కోసం ఆపై ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లాం. అయినా ప్రాణాలు కాపాడుకోలేకపోయాం. చికిత్స పొందుతూ మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయాడు. రెక్కాడితేగానీ డొక్కాడని పేద బతుకుల్లో మద్యం చిచ్చు పెడుతోంది. కుటుంబ సభ్యుల్ని మానసికంగా, ఆర్థికంగా నలిపేసి చివరకు ప్రాణాల్ని హరించేస్తోంది. మాకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తే.. ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. – నెల్లి అప్పాయమ్మ, ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా మా బతుకులు ఇంత దయనీయంగా మారడానికి మద్యమే కారణం ప్రజల మాన, ప్రాణాల్ని, ఆరోగ్యాన్ని మద్యం మహమ్మారి కబళించివేస్తుందని తెలిసినా టార్గెట్ ఇచ్చి మరీ మద్యం అమ్మకాలు జరుపుతున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? వీధుల్లో, ఇళ్ల మధ్య, గుడి పక్కన, బడిపక్కన మద్యం అమ్మకాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే పనులు ఎవరు చేసినా చట్ట ప్రకారం శిక్షార్హులే. మరి ప్రజల ప్రాణాలు తోడేస్తున్న మద్యాన్ని అమ్ముతున్న ఈ ప్రభుత్వాన్ని ఎవరు శిక్షించాలి? నా తండ్రి మద్యం వల్లే చనిపోయాడు.. మద్యమే గనక లేకుంటే మా బతుకులు బాగుండేవి. నాన్న మరణంతో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో నన్ను నా మేనమామకిచ్చి వివాహం చేశారు. ఆయనకు మతిస్థిమితం లేకపోవడంతో నా తల్లి అప్పాయమ్మ దగ్గరే జీవనం గడుపుతున్నా. మా బతుకులు ఇంత దయనీయంగా మారడానికి మద్యమే కారణం. – స్వాతి, అప్పాయమ్మ కుమార్తె, ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా మద్యపాన నిషేధంతోనే గ్రామాల్లో వెలుగు రేఖలు మద్యపాన నిషేధం అమలైతేనే గ్రామాల్లో ప్రజల జీవన విధానం మెరుగు పడుతుంది. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువ శాతం మంది మద్యం బారిన పడి వ్యసనాన్ని మానుకోలేక జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ముఖ్యంగా 1990వ దశకంలో నాటి గ్రామీణ వాతావరణంలో 90 శాతం మంది పురుషులు మద్యంకు బానిసలుగా ఉండి కుటుంబాలను రోడ్డున పడేసేవారు. ఈ క్రమంలో కూలీ పనులు చేసి వచ్చిన రూపాయిని కూడ మద్యంకే ధారపోయటంతో పాటు అనేక మంది మృత్యువాత పడిన ఘటనలు నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మను చలింపజేశాయి. అదే ఆమె సారా వ్యతిరేక పోరాటానికి నాంది పలికేలా చేసింది. రోశమ్మ పోరాటం ఫలితంగా గ్రామంలో వైన్ షాపు ఏర్పాటు చేయనప్పటికీ మహిళల స్ఫూర్తికి విరుద్ధంగా మూడు బెల్ట్‌షాపులున్నాయి. మద్యం వ్యతిరేక ఉద్యమకారిణిగా అందరికీ సుపరిచితురాలు. 1991లో స్థానిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసిన కొలిక మీరయ్య గ్రామస్తులతో చర్చించి మద్యం వల్ల జరిగే అనార్ధాలను వివరించారు. మధ్యం వల్ల జరుగుతున్న అనార్ధాలపై అవగాహన పొందిన రోశమ్మ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు మహిళలు, యువకులు 1991వ ఏప్రిల్ 20 వ తేదీన కల్లు, సారాయి దుకాణాలపై దాడులు జరిపి సారా రవాణా వాహనాలను అడ్డుకున్నారు అలా దూబగుంటలో మొదలైన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. వీరికి పలువురు నాయకులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు పలికాయి. - కలిగిరి మండలం తూర్పు దూబగుంట గ్రామానికి చెందిన వర్ధినేని రోశమ్మ మద్యాన్ని నిషేధించే వారికే ఓటెయ్యాలి మద్యపాన నిషేధం చాలా అవసరం. రాష్ట్రంలో అదే జరిగితే లక్షలాది పేద కుటుంబాలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం డబ్బు కోసం నిషేధం విధించటం లేదు. అప్పట్లో మేము సారా వ్యతిరేక ఉద్యమం బలంగా నిర్వహించి కనీసం కొంత సమయం అయినా నిషేధం తీసుకురాగలిగాం. తర్వాతి ప్రభుత్వాలు దీనిని పట్టించుకోలేదు. ఇప్పటి మహిళలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చేలా పోరాటం చేయాలి.మద్యపాన నిషేధం చేసే రాజకీయ పార్టీలకే మహిళలందరూ ఓటెయ్యాలి. – కొపర్తి కొండమ్మ, దూబగుంట రోశమ్మ సన్నిహితురాలు, తూర్పు దూబగుంట, నెల్లూరు జిల్లా నా ముగ్గురు బిడ్డల్నీ మద్యం మింగేసిందయ్యా.. నాకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. నా భర్త మెట్టె సుబ్బారావు 20 ఏళ్ల కిందటే మృతి చెందినా కూలి పనులు, పాచి పనులు చేసుకుంటూ నా ఐదుగురు బిడ్డల(నలుగురు మగ పిల్లలు, ఓ ఆడపిల్ల)ను పెంచి పెద్ద చేశాను. నా పెద్ద కుమారుడు ముసలయ్య భవన నిర్మాణ కార్మికుడు. సోమరాజు, రామకృష్ణ, కిషోర్‌లు భవనాలకు రంగులు వేసే పనులు చేస్తూ.. రోజుకు రూ.500 చొప్పున సంపాదించేవారు. నా పిల్లలకు పెళ్లిళ్లు చేద్దామనుకున్న దశలో మద్యం మహమ్మారి మా కుటుంబంలో చిచ్చు రేపింది. పెయింట్ పనిచేసే నా ముగ్గురు బిడ్డలూ మద్యానికి అలవాటుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వీధికో బెల్టుషాపు వెలసింది. దీంతో 24 గంటలు మద్యం అందుబాటులోకి రావడంతో బానిసయ్యారు. నేను ఎంత మొత్తుకున్నా వినేవారు కాదు. పనులకు వెళ్లేటప్పుడు కూడా కొంచెం తాగి వెళ్లేవారు. పని ముగించుకున్నాక పూటుగా తాగొచ్చేవారు. అసలు మద్యం లేనిదే బతకలేని స్థితికొచ్చారు. లివరు, కిడ్నీలు పాడయిపోయి ఒకే ఏడాది ముగ్గురూ చనిపోయారు. ఎన్నో కష్టాలుపడి వాళ్లను పెంచి పెద్ద చేశాను. చేతికి అందివచ్చారు.. ఇక నాకు ఏలోటూ రాకుండా చూసుకుంటారని కలలుగన్నాను. ఇంతలోనే నా బిడ్డల్ని మద్యం మహమ్మారి కబళించింది. ఇప్పుడు నేను వంట పనులు చేసుకుంటూ బతుకీడుస్తున్నాను. మద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోయిన నా బిడ్డల్ని నాకు తెచ్చివ్వగలరా? నా బిడ్డల ఉసురు పోసుకుని నాకు కడుపుకోత మిగిల్చిన ఈ మద్యాన్ని అమ్మకుండా చేయండయ్యా.. అలా ఎవరు చేస్తారో వారికి కోటి దండాలు పెడతా. – మెట్టె బూరమ్మ, చర్చిపేట, నిడదవోలు, పశ్చిమగోదావరి జిల్లా జగన్ భరోసాతో మహిళల హర్షం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి జాతీయ ప్లీనరీలో ‘నవరత్నాల్లాంటి’ హామీలిచ్చారు. వాటిలో ఒకటి..దశలవారీ మద్య నిషేధం. దీనిపై మహిళల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.మద్య నిషేధం తమ కుటుంబాల్లో సంతోషాన్నినింపుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన పాదయాత్రలో మద్యం మహమ్మారి బారినపడి ఛిన్నాభిన్నమైన కుటుంబాల కష్టాల్ని కళ్లారా చూసిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే మద్యపానాన్ని మూడు దశల్లో నిషేధిస్తామని హామీ ఇచ్చారు. మద్యపానం వల్ల ఎదురవుతున్న దుష్ఫలితాల్ని జగన్ ఏడేళ్ల నుంచి చూస్తున్నారు. 2012లో కల్తీ సారా తాగి కృష్ణా జిల్లా మైలవరం తండాలో 12 మంది మృత్యువాత పడ్డారు. కల్తీ సారా బాధితకుటుంబాలను పరామర్శించేందుకు అప్పట్లో ఆయన మైలవరం ప్రాంతంలో పర్యటించారు.ఈ సందర్భంగా స్థానికులు.. ఇళ్ల మధ్యే మద్యం దుకాణం ఉండటంతో చిన్న పిల్లలు సైతంవ్యసనపరులవుతున్నారంటూ ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో 2015లోకల్తీ మద్యం బారిన పడి మరణించిన కుటుంబాలను ఓదార్చిన సమయంలోనూ..మద్యం మహమ్మారి తమ వారిని పొట్టన పెట్టుకుని కుటుంబాల్లో విషాదాన్ని నింపిందంటూ బాధితులు చేసిన ఆర్తనాదాలకు వైఎస్ జగన్ చలించిపోయారు. -
'సారో'దయ ఆంధ్రప్రదేశ్!
ఈ చిత్రంలో కత్తిపోట్లకు గురై మృతి చెందిన యువకుడి పేరు.. అబ్దుల్ హమీద్. కర్నూలు జిల్లా నంద్యాల సలీంనగర్‌కు చెందిన అబ్దుల్ లారీ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈనెల 5 రాత్రి ఓ ఉత్సవంలో గొడవపడుతున్న స్నేహితులను వారించేందుకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్నవారు విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో హమీద్ (27) తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా ఐదేళ్లలోపు చిన్నారులు కావడంతో కుటుంబ సభ్యులు అనాథలుగా మిగిలిపోయారు. మద్యం మనుషుల్లో విచక్షణను చంపేస్తుందనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. సాక్షి, అమరావతి: ‘సూర్యోదయ’ ఆంధ్రప్రదేశ్.. ఇది ఏపీ సర్కారు ప్రచార నినాదం. దీని సంగతేమో కానీ.. ‘సారో’దయ ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం వర్థిల్లుతోంది. మూడు మద్యం షాపులు.. ఆరు బెల్టు షాపులు.. అన్న రీతిలో మద్యం అమ్మకాల్లో రెండంకెల వృద్ధి సాధిస్తోంది. రాష్ట్రంలో తాగునీరు దొరకని గ్రామాలున్నాయి కానీ.. మద్యం దొరకని గ్రామాలు లేవు. టీడీపీ అధికారంలో వచ్చిననాటి నుంచి ఊరూరా.. వీధివీధిన మద్యం షాపుల్ని ఏర్పాటు చేస్తోంది. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో బార్ల సంఖ్యను పెంచి ప్రతి వంద మందికి 13 నుంచి 15 మందిని తాగుబోతుల్ని చేస్తోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన అయితే అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా మద్యం లభిస్తోంది. జాతీయ/రాష్ట్ర రహదారుల పక్కన మద్యం షాపులను ఎత్తేయాలని గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వమే గండికొడుతోంది. ఏకంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రసంగంలో మద్యం షాపుల్ని రహదారుల వెంబడి తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఈ తీర్పుతో తమ ఆదాయం తగ్గిపోతుందని పేర్కొన్నారంటే ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగానే చూస్తోందని తేటతెల్లమవుతోంది. బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేస్తామని మరో మంత్రి జవహర్ ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. మద్యం ఆదాయం కోసం కారాడుతూ ఆవాస ప్రాంతాలు, నివాస గృహాలు, చివరకు తినుబండారాలు అమ్మే దుకాణాల్లోనూ బెల్టు షాపులను ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేస్తున్నారు. అటకెక్కిన నవోదయం టీడీపీ అధికారంలోకొచ్చేనాటికి రాష్ట్రంలో నాటు సారా తయారీ గ్రామాల సంఖ్య.. 1,942. ఈ సంఖ్య నాలుగున్నరేళ్లలో నాలుగు వేలకు చేరినట్లు ఎక్సైజ్ శాఖ అంచనా. సారా రహిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మారుస్తామని 2016, ఫిబ్రవరి 1న ప్రభుత్వం ప్రకటించి ‘నవోదయం’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండు దశల్లో ఈ పథకాన్ని అమలుచేస్తామని ప్రకటించింది. ఈ పథకం అమల్లో భాగంగా.. అబ్కారీ శాఖలో ప్రతి ఉద్యోగి కాపు సారా గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి శనివారం ఆ గ్రామాన్ని సందర్శించాలి. ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా సారా తయారీదారులు, విక్రేతలను గుర్తించి కేసులు నమోదు చేయాలి. సారా తయారీదారు, ముడి పదార్ధాలను అందించేవారిపై సీఆర్పీసీ చట్టం ప్రకారం బాండ్లను తీసుకోవాలి. అయితే మొదట్లో హడావుడి చేసిన ఎక్సైజ్ యంత్రాంగం ఆ తర్వాత ‘నవోదయం’ పథకాన్ని అటకెక్కించింది. కాపు సారా తయారీదారులపై దాడులు చేయలేమని చేతులెత్తేసింది. దీంతో రాష్ట్రంలో మారుమూల, అటవీ ప్రాంతాల్లో కూడా కాపు సారా దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇటీవలి కాలంలో సారా విక్రయాలు ఊపందుకున్నాయి. నవోదయం మొదటి దశలో.. శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, అనంతపురం, కృష్ణా, విజయనగరం జిల్లాలను సారా రహిత జిల్లాలుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. కానీ కృష్ణా, విజయనగరం జిల్లాలను ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. నవోదయం రెండో దశలో.. తూర్పుగోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాలను సారా రహిత జిల్లాలుగా ప్రకటిస్తామని చెప్పి ఏడాది దాటుతున్నా ఇంతవరకు పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో కాపు సారా ఇంకా కుటీర పరిశ్రమగానే కొనసాగుతోంది. ‘తూర్పు’లోనే ఎక్కువ రాష్ట్రంలో ప్రధానంగా సారా తయారీ, అమ్మకాలు తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. రోజుకు ఈ జిల్లాలో సగటున ఐదు లక్షల లీటర్ల సారా తయారవుతున్నట్లు అంచనా. ఈ జిల్లాలో పదివేల కుటుంబాలు సారా తయారీపై ఆధారపడి ఉన్నట్లు ఎక్సైజ్ వర్గాలే చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల లీటర్ల పరిమాణం గల సారా బట్టీలు పల్లెల్లో ఉన్నట్లు సమాచారం. గుంటూరు–నల్గొండ జిల్లాల సరిహద్దులోని కృష్ణా నదీ తీర ప్రాంతంలోని గ్రామాల్లో కూడా యథేచ్ఛగా సారా తయారవుతోంది. కర్నూలు జిల్లా సంజామల మండలం కుందూ నదీ తీర ప్రాంతంలోనూ సారా తయారుచేస్తున్నారు. ఈ జిల్లాలోని కొలిమిగుండ్ల, బనగానపల్లె నుంచి వైఎస్సార్ జిల్లాలో జమ్మలమడుగు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతాలకు సారా సరఫరా చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు, బేతంచర్ల, ప్యాపిలి అటవీ ప్రాంతాల్లోనూ జోరుగా సారా వ్యాపారం జరుగుతోంది. అదేవిధంగా కృష్ణా జిల్లా మైలవరం, రెడ్డిగూడెం తండాల్లో నాటు సారా తయారవుతోంది. సారా తయారీలో విషతుల్య పదార్ధాలను వినియోగిస్తున్నారు. బెల్లంతోపాటు పాత రబ్బర్లు, చెప్పులు, తుమ్మ, చెడిపోయిన బ్యాటరీలు, సల్ఫర్ వంటివి వాడుతున్నారు. కొందరైతే కిక్కు కోసం మిథైల్ ఆల్కహాల్‌ను కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బాబు అధికారంలోకి రాగానే బెల్టు షాపులు 1990వ దశకంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమ స్ఫూర్తితో నెల్లూరు జిల్లాలో దూబగుంట రోశమ్మ అనే మహిళ ఆధ్వర్యంలో సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమై చివరకు మద్యపాన నిషేధానికి దారి తీసింది. ఆ తర్వాత 1995లో చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం ఎత్తివేశారు. దీంతో వాడవాడలా బెల్టు షాపులు వెలిశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తాను చేసిన సంతకాన్నే మరిచిపోయి బెల్టు షాపుల్ని వీధివీధినా ఏర్పాటు చేసేలా మద్యం సిండికేట్లకు ఊతమిచ్చారు. పైగా మద్యం గోడౌన్ల సంఖ్యను పెంచారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులుంటే, వీటికి అనుబంధంగా 40 వేలకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. మద్యం మహమ్మారితో కుటుంబాలు చిన్నాభిన్నం మద్యం మహమ్మారి రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురుకు చెందిన కోలాబత్తుల శ్రీనివాసరావు (44) కుటుంబంలో విషాదం నింపింది. శ్రీనివాసరావు రోజువారి కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసై 2015, మార్చిలో మృత్యువాత పడ్డాడు. దీంతో అతని కుటుంబం జీవనాధారం కోల్పోయింది. భార్య ఆదిలక్ష్మి కుటుంబ పోషణ భుజాన వేసుకుని రెండు నెలల క్రితం గల్ఫ్ వెళ్లింది. 7, 8 తరగతులు చదువుతున్న పిల్లలిద్దరినీ నాయనమ్మ వెంకటనర్సమ్మ తనకు వచ్చే పింఛన్ డబ్బులతో పోషిస్తోంది. కొడుకు తాగుడుకు అలవాటు పడడం తమల్ని దిక్కులేనివాళ్లను చేసిందని తల్లి వెంకటనర్సమ్మ కన్నీటిపర్యంతమవుతోంది. ఇదేవిధంగా కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బిలేహాలుకు చెందిన లక్ష్మమ్మ భర్త గత ఐదేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. కనీసం నడిచి గడప దాటలేని పరిస్థితి. వీరికున్న రెండెకరాల పొలాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఆస్పత్రుల్లో చూపిస్తున్నారు. కానీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కుటుంబాలను మద్యం రక్కసి కాటేసింది. దిక్కుతోచని స్థితిలో జీవిస్తున్నాం మద్యానికి బానిసై నా భర్త అకస్మాత్తుగా మృతి చెందాడు. మా కుటుంబాన్ని ఆదుకునేవారు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పాచి పనులు చేసుకొని జీవిస్తున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దపాప ఏడో తరగతి, చిన్నపాప నాలుగో తరగతి చదువుతున్నారు. వారిని పోషించుకోవడం భారంగా మారింది. ప్రభుత్వం నుంచి నాకు ఏవిధమైన సహాయం అందలేదు. మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – కొణిదల వీరలక్ష్మి, రాజమహేంద్రవరం కుటుంబాలు నాశనమవుతున్నాయి చంద్రబాబు గత ఎన్నికల సమయంలో మద్యపానాన్ని నియంత్రిస్తానని చెప్పడం వల్లే మహిళలు అధిక సంఖ్యలో ఓట్లేసి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే అధికారంలోకి వచ్చాక మద్యాన్ని విచ్చలవిడి చేశారు. ఇంటింటికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో కుటుంబాలు నాశనమైపోతున్నాయి. ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే ఎన్నో రకాల మార్గాలుండగా మద్యం అమ్మకాలను ఆదాయంగా చేసుకోవడం దారుణం. వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దశలవారీగా మద్య నియంత్రణ చేస్తానని చెప్పడాన్ని మంచి పరిణామంగా భావిస్తున్నాం. – ఇల్లూరి లక్ష్మిశేషు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు, ఒంగోలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు రోజూ సాయంత్రం మగాళ్లు తాము సంపాదించిన డబ్బు తీసుకొచ్చి తాగేస్తున్నారు. అరకొరగా మిగిలే డబ్బులే ఇంట్లో మహిళలకు ఇస్తున్నారు. ఇక ఆ ఇల్లాలు పిల్లల కడుపు ఎలా నింపుతుంది? టీడీపీ అధికారంలోకి రాగానే బెల్ట్‌షాపులు ఎత్తేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. కానీ ఎక్కడా అమలు కాలేదు సరికదా గ్రామాల్లో వీధికో బెల్ట్‌షాపు వెలిసింది. పేదల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. ప్రజలు తాగుబోతులైతే రాష్ట్రం అభివృద్ది చెందుతుందా? నివాసాల మధ్య దుకాణాలు ఏర్పాటుచేస్తే పేదలు, «మధ్యతరగతి ప్రజలు ఏమైపోతారో తెలియదా? ఇళ్ల మధ్య దుకాణాల ఏర్పాటుపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నాం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం అమ్మకాలను దశల వారీగా అరికడతామంటున్నారు. ఆయన చేసి చూపుతారనే నమ్మకం ఉంది. – చల్లారి రాజ్యలక్ష్మి, ఐద్వా నాయకురాలు, ఏలూరు మద్యంతో ఆర్థికంగా చితికిపోయాం మా నాన్న పేరు.. చిన్న ఆంజనేయ. తాగుడుకు అలవాటు పడి లివర్ వ్యాధితో చనిపోయాడు. మా అమ్మ లక్ష్మీదేవి భవన నిర్మాణ పనులు చేస్తూ మమ్మల్ని సాకింది. తినడానికి తిండి కూడా లభించని దుస్థితిలో బడికి పంపకుండా నన్ను, నా సోదరుడిని పనులకు తీసుకెళ్లింది. కూలికి పోతేనే తిండి.. లేదంటే లేదు. దుర్భర జీవితం గడుపుతున్నాం. ప్రభుత్వం మద్యనిషేధం చేసి మా పరిస్థితి మరెవరికీ రాకుండా చూడాలి. –బాబు, పత్తికొండ, కర్నూలు జిల్లా -
కోరుట్ల: ఎన్నికల ముందస్తు ‘కిక్కు’...!
ఎన్నికల వేళ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ ఆంక్షల ఫలితంగా నకిలీ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. గతేడాది నవంబర్, డిసెంబర్లో జరిగిన మద్యం అమ్మకాల కన్నా 30 శాతం మించి ఈ ఏడాది అమ్మకాలు చేయాలని ఎక్సైజ్ అధికారులు నియంత్రణ విధించారు. ఈ పరిమితిని మించి మద్యం అమ్మకాలు జరిపితే కారణాలు చూపుతూ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో మద్యం అమ్మకాలకు డిమాండ్ పెరగడం.. అందుకు తగినట్లు ఎక్సైజ్ డిపో నుంచి మద్యం సరాఫరా లేక వైన్స్ షాపుల నిర్వహకులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొంత మంది వ్యాపారులు నకిలీ మద్యం అమ్మకాలకు తెరలేపారు. సాక్షి, కోరుట్ల: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దరిమిలా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మద్యానికి డిమాండ్ పెరిగింది. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడానికి వారం రోజులుగా మందు, విందులకు తెరలేపారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి సెగ్మెంట్లలో ఇప్పటికే ఎన్నికల మద్యం ఏరులై పారుతోంది. పోలింగ్‌కు మరో 3 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో సంఘాలు, గ్రూపుల వారీ గా రాజకీయ పార్టీలు ఓటర్లకు మద్యం అందించే అంకానికి తెరలేపాయి. ఈ క్రమంలో మద్యం కొనుగోళ్లు పెరిగాయి. కొనుగోళ్లు పెరిగినా గత ఏడాదికి మించి అమ్మకాలు చేయరాదన్న ఆంక్షలను ఆధారంగా చేసుకుని కొంతమంది మద్యం వ్యాపారులు పక్కతోవ పడుతున్నట్లు తెలిసింది. తగ్గిన అమ్మకాలపై అనుమానాలు.. ఎన్నికల వేళ ఓటర్ల వద్దకు జోరుగా మద్యం చేరుతున్నా అమ్మకాలు మాత్రం తక్కవగా ఉండటం సందేహాలకు తావిస్తోంది. జిల్లాలో 2017, నవంబర్‌లో 61,430 కేసుల విస్కీ, 1,13,346 కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. నవంబర్‌లో 57,934 విస్కీ కేసులు, 1,04,431 బీరు కేసుల అమ్మకాలు జరిగాయి. నవంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో మద్యం అమ్మకాలు పెరగా ల్సి ఉండగా తగ్గడం అనుమానాలకు తావిస్తోంది. ఎక్సైజ్ అధికారులు ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించడం గతేడాది నవంబర్‌లో జరిగిన అమ్మకాల కన్నా 30 శాతం మించి మద్యం అమ్మితే కారణాలు చెప్పి.. వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో మద్యం వ్యాపారులు కొందరు కొత్తదారులు వెతుకుతున్నట్లు సమాచారం. ఎక్సైజ్ డిపో నుంచి సరాఫరా అవుతున్న మద్యం అమ్మకాలను పక్కన బెట్టి నకిలీ మద్యం అమ్మకాలకు తెరలేపారు. నకిలీ జోరు..? ఈనెల7న పోలింగ్ ఉన్న క్రమంలో 1 నుంచి 5 వరకు గతేడాది వైన్స్‌షాపులకు ఎంత మద్యం సరాఫరా అయిందో.. అంతే మద్యం çసరఫరా చేయనున్నట్లు తెలిసింది. పోలింగ్‌కు సమయం దగ్గరపడడంతో అమ్మకాలు తారా స్థాయి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అదనుగా మద్యం వ్యాపారులు కొంత మంది మహా రాష్ట్ర నుంచి చీప్‌లిక్కర్, నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఎత్తుగడతో మద్యం వ్యాపారులు ఎక్సైజ్ ఆంక్షల నుంచి తప్పించుకోవడంతోపాటు అడ్డగోలు లాభాలు పొందుతున్నట్లు తెలిసింది. ఎక్సైజ్ అధికారులు కట్టదిట్టంగా వ్యవహరిస్తే అనేక విషయాలు వెలుగులోకొస్తాయని ప్రజలు అంటున్నారు. -
నో స్టాక్!
అనంతపురం సెంట్రల్: ఎప్పుడూ కళకళలాడే మద్యం షాపులు.. వెలవెలబోతున్నాయి. హుషారుగా వైన్స్ షాపునకు వెళ్లే మద్యం ప్రియులు నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. గోదాముల నుంచి సరఫరా లేకపోవడంతో జిల్లాలో ఏ మద్యం దుకాణంలో చూసినా ‘‘నో స్టాక్’’ బోర్డులే కనిపిస్తున్నాయి. జిల్లాలో 245 మద్యం దుకాణాలు, 20 పైచిలుకు బార్లుండగా...అన్ని చోట్లా మద్యం కొరత ఏర్పడింది. మద్యం దుకాణాదారులు డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ స్టాకు మాత్రం సరఫరా కావడం లేదు. పదిరోజుల నుంచి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. మద్యం విక్రయాలను ఆన్లైన్ చేసిన ప్రభుత్వం..ఈ బాధ్యతలను ‘‘సీ–టెల్’’ కంపెనీకి అప్పగించింది. అయితే సదరు కంపెనీకి ప్రభుత్వం దాదాపు రూ.80 కోట్ల వరకూ బకాయి పడినట్లు తెలుస్తోంది. అందువల్లే ఆ కంపెనీ 10 రోజులుగా మద్యం సరఫరా నిలిపివేసింది. దీంతో వైన్స్‌లకు మద్యం సరఫరా కాకా..అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వ్యాపారం కూడా భారీగా పడిపోయింది. మద్యం దుకాణాదారులకుఎదురుదెబ్బ లక్షలాది రూపాయాలు పోసి మద్యం దుకాణాలను దక్కించుకున్న షాపుల యజమానులు ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. కమీషన్ తగ్గించడం వల్ల తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని గతంలోనే ఆందోళనలు చేపట్టారు. వారం రోజుల పాటు మద్యం దుకాణాలు కూడా బంద్ చేశారు. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. తాజాగా ఆన్లైన్ విధానం తీసుకొచ్చి.. సదరు కంపెనీలకు డబ్బులు చెల్లించకపోవడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా మద్యం దుకాణాదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అదేస్థాయిలో మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తమకు నచ్చిన బ్రాండ్ దొరక్కపోవడంతో పలు షాపులకుతిరిగి తెచ్చుకుంటున్నారు. గురు, శుక్రవారాల్లో ఆ మాత్రం స్టాక్ కూడా ఉండదని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. తీవ్రంగా నష్టపోతున్నాం టెండర్లలో మద్యం షాపుల తీసుకొని తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రోజుకు ఒక్కో షాపు నుంచి రూ. 20 వేలకు పైగా నష్టపోతున్నాం. ప్రభుత్వానికి మేము చెల్లించిన డబ్బులు వెనక్కి ఇస్తే మద్యం షాపులు వదలుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. – రామలింగారెడ్డి, సింధూర వైన్స్, మద్యం యజమానులఅసోసియేషన్ నాయకులు -
వైన్స్ వద్దు...బెల్టే ముద్దు..
భద్రాచలం : ఏజెన్సీ ప్రాంతంలో బెల్ట్ షాపులు బార్లా తెరుచుకున్నాయి. సిండికేటైన వ్యాపారస్తుల కనుసన్నల్లోనే అక్రమ దందా సాగుతోంది. వీటికి అడ్డకట్ట వేసేందుకు ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం స్పందించకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సిండికేట్ దందా’ అనే శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సర్వత్రా చర్చనీయాంశమైంది. భద్రాచలంతోపాటు జిల్లా అంతటా బెల్టు షాపుల దందా సాగుతోంది. భద్రాచలం పట్టణంతోపాటు దుమ్ముగూడెం మండలంలోని కొన్ని ప్రాంతాలను ‘సాక్షి’ పరిశీలించింది. భద్రాచలం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లోగల పాన్ షాపులో మద్యం విక్రయాలు జరిగాయి. ఉదయ భాస్కర్ సినిమాహాల్ ముందు, చర్ల రోడ్‌లోని గాయత్రీ ఆలయం సమీపంలోని పాన్ షాపులు, కాలేజీ సెంటర్, పాత మార్కెట్, ఐటీడీఏ రోడ్లో కాలేజీ గ్రౌండ్ వెనుక గల పాన్ షాపుల్లో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇదే విషయాన్ని నిఘా వర్గాలు సైతం ధృవీకరించినట్లుగా తెలిసింది. భద్రాచలం పట్టణంలో ప్రజానీకానికి ఇబ్బందికరంగా కొన్నిచోట్ల బెల్టు షాపులు నిర్వహణ సాగుతున్న విషయం వాస్తవమేనని నిఘా వర్గాలు సైతం ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. అయినప్పటికీ ఎక్సైజ్Œ అధికారులు తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెస్టారెంట్లలో అమ్మకాలు ఫ్యామిలీ రెస్టారెంట్లుగా బోర్డులు తగిలించినచోట కూడా లోపల మద్యం అమ్మకాలు దర్జాగా సాగుతున్నాయి. భద్రాచలం–చర్ల రూట్లో దుమ్ముగూడెం మండలంలోని సీతానగరం వద్ద ఓ ఫ్యామిలీ రెస్టారెంట్లో మద్యం విక్రయాలు భారీగా సాగుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ కూడా ఉంది. పర్ణశాల కుటీరానికి సమీపంలో ఉండటంతో తిరుగు ప్రయాణంలో వస్తున్న అనేకమంది ఇక్కడ మద్యం సేవిస్తున్నారు. ఈ రహదారిలో తరచూ జరుగుతున్న ప్రమాదాలకు కూడా ఈ మద్యం విక్రయాలే కారణమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దుమ్ముగూడెం మండలంలోని ముల్కపాడు సెంటర్‌లోగల పాన్ షాపులు.. సాయంత్రం వేళ మద్యం దుకాణాలుగా మారిపోతున్నాయి. సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పాన్ షాపుల వదంద వాహనాల రద్దీ కనిపిస్తోంది. భద్రాచలం పట్టణంలోని ఓ రెస్టారెంట్లో కూడా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. క్వార్టర్ బాటిళ్ల కొరత..! మద్యం దుకాణాల్లో ప్రస్తుతం క్వార్టర్ బాటిళ్ల విక్రయాలు నిలిపివేసి, అనుబంధంగా ఉన్న బెల్టు షాపులకు తరలిస్తున్నారని మద్యం ప్రియలు అంటున్నారు. మద్యం షాపుల్లోనైతే ఎంఆర్పీకి ఇవ్వాలనే ఒత్తిళ్లు వస్తున్నందున అధిక రేట్లకు విక్రయించేందుకని వాటిని బెల్టు షాపులకు తరలిస్తున్నారని, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మందు బాబులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ, చివరకు ఇళ్ల మధ్య కూడా ఏర్పాటు చేస్తున్న బెల్టు షాపులను నియంత్రించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బంద్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండి
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారుల బంద్ కొనసాగుతోంది. మద్యం వ్యాపారులు చేస్తున్న సమ్మెతో రెండు కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పండింది. ఈ నిరవధిక సమ్మెతో జిల్లా వ్యాప్తంగా 241 మద్యం దుకాణాలు, 34 బార్లు మూత పడ్డాయి. ట్రేడ్ మార్జిన్‌ను పెంచాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్‌కు రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేసినప్పటికి ప్రభుత్వం స్పందించకపోవడంతో మద్యం వ్యాపారులు బంద్ వైపే మొగ్గు చూపారు. ఈనెల 27 నుంచి మార్జిన్ మనీ 7 నుంచి 24 శాతానికి పెంచాలని బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. -
ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండలంలోని మలపాడులో మద్యం షాపు ఏర్పాటు చేయొద్దంటూ సోమవారం మహిళలు ధర్నాకు దిగారు. మహిళల ధర్నాను పోలీసులు అడ్డుకుని అరెస్టుకు యత్నించారు. దీంతో గ్రామస్తులు పోలీసులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోవైపు జిల్లాలోని సంతమగులూరులో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఇంటి స్థలం విషయంలో వివాదం నెలకొనడంతో ఇరువర్గాల వారు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో పలువురి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
మద్యం షాప్‌ల ఏర్పాటుపై మహిళల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: వైన్ షాపుల ఏర్పాట్లను పలుచోట్ల అడ్డుకున్నారు. కుర్మగూడలో ఏర్పాటు చేయనున్న వైన్‌షాపును ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్, కార్పొరేటర్లు సమీనా, ముజఫ్ఫార్ హుస్సేన్‌లు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు షాపును ఖాళీ చేయిస్తున్నారు. అలానే రాచకొండ బీఎన్ రెడ్డి నగర్ కాలనీలో రెండు దేవాలయాలు, స్కూలుల మధ్య వైన్ షాపు ఏర్పాటు చేస్తున్న తరుణంలో కాలనీ వాసులు అడ్డుకున్నారు. అయినా నిర్మాణం చేపడుతుండగా మహిళలు దానిని కూల్చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడికి స్థానిక పోలీసులు చేరి ఇరు వర్గాల వారిని శాంతిపజేశారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంగడి సెంటర్లో ఉన్న మద్యం దుకానాన్ని తీసివేయాలని మహిళలు, స్థానికులు షాపు ముందు ధర్నా చేపట్టారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో జనావాసాల మధ్య వైన్ షాపు పెట్టకూడదని స్థానికులు అడ్డుకున్నారు. -
‘మందు’ సొమ్మే ఇంధనం
సాక్షి, హైదరాబాద్: ‘మందు’ సొమ్మే సర్కారు బండికి ఇంధనం కాబోతోంది! నిధుల సమీకరణకు ప్రభుత్వం మందు సీసానే ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకుంది. ఈ ఏడాది మద్యం వ్యాపారం ద్వారా రూ.11 వేల కోట్లు, స్పిరిట్ ఆధారిత ఉత్పత్తుల అనుమతి, ఇతర రశీదుల ద్వారా రూ.3,500 కోట్లు.. వెరసి కనీసం రూ.14.5 వేల కోట్లకు పైగా ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎలైట్ బార్లు.. ఎన్నైనా.. దుకాణాలకు దరఖాస్తులు, లైసెన్స్ ఫీజుతోపాటు మద్యం విక్రయాలతో భారీగా ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సాధారణ బార్లకు అనుమతులు తగ్గించి వాటి స్థానంలో అదనపు లైసెన్స్ ఫీజు వచ్చే ఎలైట్ బార్లకు ఎక్కువ సంఖ్యలో లైసెన్స్‌లు కేటాయించాలని నిర్ణయించింది. నగరాలు, పట్టణాల్లో కోరినంత మందికి ఎలైట్ బార్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎక్సైజ్ పాలసీ అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు అమల్లో ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2,215 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు విక్రయించటం ద్వారా రూ.1,675 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో రూ.401 కోట్లు దరఖాస్తుల ద్వారా, రూ.1,274 కోట్లు లైసెన్సుల ద్వారా వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 820 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా గతేడాది రూ 356.90 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది కొత్తగా ఎలైట్ బార్ల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో సాధారణ బార్ల లైసెన్స్ ఫీజుపై అదనంగా 25 శాతం కట్టి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎలైట్ బార్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. మొత్తానికి బార్ల ద్వారా రూ.421 కోట్ల రాబడిని లక్ష్యంగా నిర్ణయించారు. వీటి ద్వారా ఏడాదికి కనీసం 633 లక్షల కేసుల మద్యం విక్రయించాలని, ఇందులో 283.20 లక్షల కేసుల బ్రాందీ, విస్కీ, 349.42 లక్షల కేసుల బీరు, 82 వేల కేసుల విదేశీ మద్యం విక్రయించడం ద్వారా రూ.15,836 కోట్ల విలువైన మద్యం వ్యాపారం చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో వ్యాపారులకు ట్రేడ్ మార్జిన్, ఉత్పత్తి సంస్థలకు బేసిక్ ధర, ఇతర ఖర్చులుపోను నికరంగా రూ.9,020 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. స్పిరిట్ ఆధారిత ఉత్పత్తులకు అనుమతుల ద్వారా రూ.3,500 కోట్ల ఆర్జన లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆ దుకాణాల బదిలీతో 30 కోట్లు! 2011 ఎక్సైజ్ పాలసీలో జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే అన్ని మద్యం దుకాణాలకు లైసెన్స్ ఫీజు రూ.1.04 కోట్లుగా నిర్ధారించారు. ఈ ఫీజు భారంతో జీహెచ్ఎంసీ పరిధిలో 72 మద్యం దుకాణాలకు గత ఏదేళ్ల నుంచి ఒక్క దరఖాస్తు రాలేదు. దీంతో తాజా పాలసీలో ఈ మద్యం దుకాణాలను వేర్వేరు జిల్లాలకు కేటాయించారు. వీటిలో 50 శాతం దుకాణాలను మేడ్చల్, వికారాబాద్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలకు కేటాయించారు. మిగిలిన 50 శాతం దుకాణాలను జిల్లాకు ఒకటి రెండు చొప్పున ఇచ్చారు. వీటి ద్వారా కనీసం రూ.30 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్టు ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. గతంలో మిగిలిపోయిన దుకాణాల్లో కొన్నింటిని టీఎస్‌బీసీఎల్ నిర్వహించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మార్పీ ఉల్లంఘన, అక్రమ మద్యాన్ని నివారించేందుకు టీఎస్‌బీసీఎల్ 22 ఔట్లెట్లను తెరిచి రిటైల్ ధరకే మద్యం విక్రయించింది. కానీ ఇందులో పెద్దగా లాభాలు రాకపోవటంతో ఈ ఏడాది ప్రభుత్వం ఔట్లెట్లను ఎత్తేసింది. 2017–18లో మద్యం విక్రయాల అంచనా ఇదీ.. మద్యం రకం లక్షల కేసులు సాధారణం 37.56 మీడియం 125.19 ప్రీమియం 120.46 విదేశీ 0.82 బీరు 349.42 మొత్తం వ్యాపారం 15,836 (రూ.కోట్లు) ఆదాయం అంచనాలు (రూ.కోట్లలో) ఎక్సైజ్ వ్యాట్ 8,021 ప్రివిలేజ్ ఫీజు 780 క్రీడల ప్రమోషన్ ఫీజు 9.56 సీఎంఆర్ఎఫ్ 210 దరఖాస్తులతో 401 వైన్‌షాప్ లైసెన్స్‌లు 1,274 బార్ల లైసెన్స్ 421 స్పిరిట్ ఆధారిత ఉత్పత్తులకు అనుమతులు, ఇతర రశీదులు 3,500 మొత్తం 14,616.56 -
2,215 షాపులు.. 41,119 దరఖాస్తులు
► సగటున ఒక్కో మద్యం దుకాణానికి 19కిపైగా దరఖాస్తులు ► ఒకే ఒక్క దుకాణానికి నిల్ టెండర్.. రేపు లాటరీ పద్ధతిన కేటాయింపు ► కలెక్టర్ల పర్యవేక్షణలో లాటరీ ప్రక్రియ ► ఖమ్మంలో రికార్డు స్థాయిలో.. మెదక్‌లో తక్కువ పోటీ ► ఖజానాకు రూ.411.19 కోట్లు ఆదాయం.. ► గతంలో కన్నా రూ.256 కోట్లు అదనం సాక్షి, హైదరాబాద్: మద్యం దరఖాస్తులతోనే రాష్ట్ర ప్రభుత్వానికి అంచనాలకు మించిన ఆదాయం సమకూరింది. సగటున ఒక్కో మద్యం షాపునకు 19కి పైగా దరఖాస్తులు రావడంతో.. రాష్ట్ర ఖజానాకు రూ.411.19 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణలోని 2,216 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేయగా ఒక్క షాపు మినహా అన్నింటికీ టెండర్లు దాఖలయ్యాయి. మొత్తం 41,119 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ విభాగం వెల్లడించింది. మల్కాజ్గిరి జిల్లాలోని ఘట్కేసర్ పరిసరాల్లోని ఒక దుకాణానికి ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. మిగతా అన్ని షాపులకు పోటీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లోని మద్యం షాపులకు పోటీ ఎక్కువగా కనిపించింది. కొన్ని జిల్లాల్లో మద్యం షాపుల లైసెన్సులకు వందలాది మంది క్యూ కట్టడంతో బుధవారం తెల్లారుజాము వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగిందని అధికారులు తెలిపారు. చివరి రోజే రాష్ట్రవ్యాప్తంగా 25,750 దరఖాస్తులు వచ్చాయి. గతం కంటే రెండింతలకు పైగా.. 2015లో రాష్ట్రంలో 31 వేల దరఖాస్తులు వస్తే.. రూ.155 కోట్ల ఆదాయం సమకూరింది. అప్పటితో పోలిస్తే ఈసారి పది వేలకు పైగా దరఖాస్తులు పెరిగాయి. మరోవైపు దరఖాస్తుల ఫీజును రెండింతలు చేయటంతో ఆదాయం కూడా అంచనాలు దాటింది. అప్పటితో పోలిస్తే రూ.256 కోట్లు ఎక్కువ ఆదాయం వచ్చింది. 2015లో పలుమార్లు నోటిఫికేషన్ జారీ చేసినా రాష్ట్రంలో 72 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. ఈసారి మాత్రం అన్ని జిల్లాల్లోనూ అనూహ్య పోటీ కనిపించింది. మద్యం లైసెన్స్ ఫీజుల స్లాబ్‌లను కుదించటంతోపాటు గిరాకీ లేని ప్రాంతాల్లోని మద్యం షాపులను ఇతర ప్రాంతాలకు తరలించటం మంచి ఫలితం ఇచ్చిందని అధికారులు తెలిపారు. అలాగే మద్యం షాపులను కేటాయించే విధానం తెలంగాణలో సులభతరంగా ఉండటం కలిసొచ్చిందని విశ్లేషించారు. ఎన్నికల సీజన్‌తో పోటీ రాబోయేది ఎన్నికల సీజన్ కావటంతో మద్యం షాపుల డిమాండ్ పెరిగిందనే అభిప్రాయాలున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాజకీయ నాయకులు తమ అనుచరులతో దరఖాస్తులు చేయించారు. ఇప్పటికే మద్యం షాపులు నిర్వహిస్తున్న వ్యాపారులు తిరిగి తమ దుకాణాలు దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల నుంచి లాటరీ పద్ధతిన మద్యం షాపులను కేటాయిస్తారు. ఈనెల 22న నిర్వహించే లాటరీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తుల్లో ఖమ్మం రికార్డు రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలోని 83 షాపులకు రికార్డు స్థాయిలో 4,029 దరఖాస్తులు వచ్చాయి. ఆ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి 49 దరఖాస్తులు వచ్చాయి. సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో ఉంది. అక్కడి 71 షాపులకు 3,043 దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా మెదక్ జిల్లాలో 37 షాపులకు కేవలం 301 దరఖాస్తులే వచ్చాయి. -
విశాఖలో రూల్స్ పట్టించుకోని వైన్స్
-
మద్యం నియంత్రించక పోతే పోరాటమే
-
మద్యంపై విద్యార్థుల ఆగ్రహం
– ఆలూరులో ధర్నా, రాస్తారోకో - ఎక్సైజ్ పోలీసుల హామీతో ఆందోళన విరమణ ఆలూరు: పాఠశాలలు, కళాశాలల సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయొద్దంటూ ఆలూరు విద్యార్థులు.. భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు. సోమవారం స్థానిక ప్రభుత్వ మోడల్ స్కూల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ జరిపారు. ఎల్లార్తి రోడ్డుకు సమీపంలో ప్రభుత్వ బాలికలు, బాలుర హైస్కూళ్లు, ప్రభుత్వ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల, ఐటీఐ, పాలిటెక్నికల్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, వీటికి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. విద్యార్థుల ఆందోళనతో వాహనాలు ఆగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకోవడంతో విద్యార్థి సంఘం నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. ఎక్సైజ్ పోలీసుల హామీతో ఎట్టకేలకు ఆందోళన విరమించారు. ఆలూరు డివిజన్ ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకాష్ , మైనా, ఆదోని డివిజన్ ఉపాధ్యక్షుడు చంద్రయ్యస్వామి, నాయకులు నాగరాజ్, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి
మద్యం దుకాణాలు తొలగించాలంటూ ధర్నా కర్నూలు : కల్లూరు వక్కెరవాగు ఎదురెదురుగా ఏర్పాటు చేసిన రెండు మద్యం దుకాణాలను అక్కడినుంచి తొలగించాలని మహిళలు పెద్ద ఎత్తున ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. సీపీఎం, ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఎక్సైజ్ కార్యాలయాన్ని చేరుకుని ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న మద్యం దుకాణాలను మరో ప్రాంతానికి తరలించాలని నినాదాలు చేస్తూ సుమారు రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. ఐద్వా నాయకురాలు ధనలక్ష్మి, సీపీఎం పాణ్యం డివిజన్ కార్యదర్శి రామకృష్ణ, కల్లూరు నాయకులు రమణమూర్తి, ఐద్వా పాణ్యం డివిజన్ నాయకురాలు ప్రమీలమ్మ, శ్యామలమ్మ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ.. రెండు మద్యం దుకాణాలు ఒకేచోట ఏర్పాటు చేయడం వల్ల మద్యం బాబులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారని, దీనివల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉందని డిప్యుటీ కమిషనర్ శ్రీరాములుకు ఫిర్యాదు చేశారు. మద్యం షాపులకు ఇరువైపులా ఉన్న వ్యాపార దుకాణాల వద్ద కూడా మందుబాబులు తిష్ట వేసి మద్యం సేవిస్తుండటంతో రాత్రివేళల్లో ఆ దారి గుండా వెళ్లడానికి మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, తాగుబోతులు ఎలాంటి ఆకృత్యాలకు, అఘాయిత్యాలకు పాల్పడతారోనని భయపడుతున్నారని ఫిర్యాదు చేశారు. వక్కెరవాగు వద్ద నుంచి మూడు రోజుల్లో దుకాణాలను మరో ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యుటీ కమిషనర్ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
లేచింది మహిళా లోకం
-
ఇళ్ల మధ్య మద్యం షాపు పెడితే ఒప్పుకోం
మహానంది: తమ కాలనీలో మద్యం షాపు పెడితే ఒప్పుకోమని గాజులపల్లె ఎస్సీ కాలనీవాసులు స్పష్టం చేశారు. ఎస్సీ కాలనీలో పెట్టే వైన్‌షాపును తీసేయాలని కోరుతూ ఆదివారం రాత్రి కాలనీలో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మహానంది ఎస్ఐ పెద్దయ్యనాయుడు, సిబ్బంది గ్రామంలోని కాలనీకి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం పెట్టడం ఏంటని ఎస్ఐను ప్రశ్నించారు. పాఠశాల దగ్గర ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళతామని ఎస్ఐ తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో.. శ్రీశైలం ప్రాజెక్ట్ : భ్రమరాంబా టాకీస్, కాకుల్ సెంటర్ ప్రాంతాలలో లైసెన్స్ దారులు మద్యం దుకాణాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడంతో ఆదివారం ఆయా ప్రాంతాలలోని మహిళలు ఆందోళనకు దిగారు . భ్రమరాంబా టాకీస్ వద్ద లూథరన్ చర్చి పాస్టర్ , క్రైస్తవులు, కాకుల సెంటర్ ప్రాంతంలో అక్కడి మహిళలు మద్యం దుకాణాల ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్, టు టౌన్ ఎస్ఐ ఓబులేసుకు కి వినతి పత్రం అందించారు. క్రైస్తవుల నిరసన పగిడ్యాల: స్థానిక దేవనగర్ కాలనీలోని బురుజు సమీపంలో ఉండే ప్రార్థన మందిరానికి దగ్గరలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై ఆదివారం క్రైస్తవులు నిరసన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయొద్దని స్వామిదాసు, తిరుపాలు, నాగేశ్వరరావు, జయరామిరెడ్డి, శ్రీసువాసులు రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శివారెడ్డి, రాము, రమేష్, రూబేను, పౌలయ్య, యేసురాజు పేర్కొన్నారు. -
కిక్కే..కిక్కు!
- కర్నూలు గోదాములో ‘వంద కోట్ల’ మద్యం స్టాక్ – రహదారుల పక్కన ఉన్న 167 దుకాణాలు, 17 బార్లు రద్దు – జిల్లా వ్యాప్తంగా తెరుచుకున్న 40 దుకాణాలు, రెండు బార్లు – మొదటి రోజు రూ.1.50 కోట్ల మద్యం కొనుగోలు – లైసెన్సుల జారీకి అర్థరాత్రి వరకు కొనసాగిన కసరత్తు – దరఖాస్తులు సక్రమంగా ఉంటేనే అనుమతి కర్నూలు: మద్యాన్ని భారీగా విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కల్లూరు శివారు పందిపాడు సమీపంలోని హంద్రీనది ఒడ్డున ఉన్న ఐఎంఎల్ డిపోలో దాదాపు వంద కోట్ల రూపాయల విలువ చేసే మద్యం నిల్వ చేసింది. నూతన మద్యం పాలసీలో భాగంగా అనుమతి పత్రాలు పొందిన వ్యాపారులు ఆదివారం మొదటి రోజు రూ.1.50 కోట్ల విలువ చేసే 3500 బాక్సుల మద్యం, 2200 కేసుల బీర్లను కొనుగోలు చేసి దుకాణాలకు తరలించి అమ్మకాలు ప్రారంభించారు. 204 మద్యం దుకాణాలకు ఈ ఏడాది మార్చిలో లాటరీ విధానం ద్వారా లైసెన్సీలను ఖరారు చేయగా, బార్ల పాలసీలో భాగంగా ఐదేళ్ల కాల పరిమితితో పాతవి 37, తాజాగా 10 బార్లను వ్యాపారులకు ఎక్సైజ్ అధికారులు ఖరారు చేశారు. ఆదివారం నంద్యాల ప్రాంతానికి చెందిన రెండు బార్లకు అనుమతి పత్రాలు జారీ కావడంతో అవసరమైన మద్యాన్ని డిపో నుంచి వారు తరలించారు. బారులు తీరిన మందు బాబులు... కొంతమంది మాత్రమే దుకాణాలు తెరవడంతో మందు బాబులు వాటి ముందు బారులు తీరారు. రెండు రోజులుగా జిల్లాలో మద్యం సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. కర్నూలులోని వక్కెర వాగు పక్కనున్న జీవీఆర్ దుకాణంలో గంట వ్యవధిలో రూ.2.50 లక్షల మద్యం అమ్ముడపోయింది. డిపో నుంచి తీసుకొచ్చిన సరుకును దుకాణం వద్ద దింపుతుండగానే మద్యం బాబులు బారుతీరి కొనుగోలు చేశారు. కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కేవలం 10 దుకాణాలు మాత్రమే తెరుచుకోవడంతో అన్ని చోట్ల కూడా కొనుగోలు కోసం మందు బాబులు క్యూకట్టారు. కోర్టు తీర్పుకోసం ఎదురుచూపు.. నగర, పట్టణాల్లో జాతీయ రహదారులను మేజర్ డిస్ట్రిక్ రోడ్స్ (ఎండీఆర్)గా మార్పు చేయాలని కోరుతూ కర్నూలు పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు కోర్టుకెళ్లారు. హైదరాబాద్–బెంగుళూరు జాతీయ రహదారి ఏర్పాటుకు ముందు కర్నూలు మున్సిపల్ కార్యాలయం, ఐదురోడ్ల కూడలి, వయా రాజ్‌విహార్ మీదుగా చిత్తూరు–కర్నూలు రోడ్డు ఉండేది. ప్రభుత్వ రికార్డుల్లో ఇప్పటికే ఆ రోడ్డు జాతీయ రహదారిగా కొనసాగుతుండటంతో నగరంలోని 80 శాతం దుకాణాలు, బార్లు ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ రోడ్డును మేజర్ డిస్ట్రిక్ రోడ్స్‌గా మార్పు చేయాలని కోరుతూ కేఈ జగదీష్‌గౌడ్ అనే వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. ఈ నెల 6వ తేదీన తీర్పు వెలువడనుంది. అది అమలైతే జాతీయ, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో బార్లు కొనసాగించవచ్చన్న ఆశతో వ్యాపారులు ఉన్నారు. కర్నూలు ఎక్సైజ్ జిల్లా పరిధిలో 17 బార్లు, నంద్యాల ఎక్సైజ్పరిధిలో రెండు బార్లు రోడ్సైడు ఉన్నాయి. చివరగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం అటు వ్యాపారులు, ఇటు ఎక్సైజ్ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఎలాంటి అభ్యంతరం లేని దుకాణాలకు మాత్రం లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్యూకట్టిన లారీలు... ఐఎంఎల్ డిపోలో భారీ మొత్తంలో స్టాక్ నిల్వ ఉండటంతో ఆదివారం వచ్చిన సరుకును దింపుకోవడానికి ఇబ్బందిగా మారింది. విజయవాడ, తిరుపతి, సింగరాయికొండతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 27 లారీలు మద్యంతో తరలివచ్చాయి. వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి లారీలతో అక్కడికి తరలిరావడంతో డిపో కిటకిటలాడుతోంది. డిపోలో ఉన్న మద్యాన్ని వ్యాపారులకు కేటాయించిన తర్వాతనే లారీల్లో ఉన్న సరుకును గోదాములోకి అనుమతించారు. స్థానచలనం.. జిల్లాలో 167 మద్యం దుకాణాలు, 17 బార్లకు స్థాన చలనం కలగనుంది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి నిబంధనలు పాటించని షాపులు, బార్లు కనిపిస్తే సీజ్ చేయాలని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు వ్యాపారుల నుంచి వచ్చిన దరఖాస్తులు సక్రమంగా ఉంటేనే ఎక్సైజ్ అధికారులు లైసెన్సు జారీ చేస్తున్నారు. రహదారులకు 500 మీటర్ల అవతల మాత్రమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు శనివారం నుంచే అమలులోకి వచ్చింది. దీంతో నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలో 204 దుకాణాలకు 40 మంది లైసెన్సీలు మాత్రమే అనుమతి పత్రాలను తీసుకెళ్లారు. ఇంకా 164 దుకాణాలకు అనుమతి పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయి. నంద్యాల ప్రాంతంలో రెండు బార్లకు మాత్రం అనుమతి పత్రాలను ఎక్సైజ్ అధికారులు మంజూరు చేశారు. వందకోట్ల మద్యం స్టాక్... -
ఆ షాప్ తెరవగానే ఒక్కసారిగా ఎగబడ్డారు
-
మద్యం కోసం తొక్కిసలాట
విజయవాడ: ‘‘కొత్త సినిమా టికెట్ అయినా దొరుకుతుంది కానీ.. కొత్త వైన్ షాప్‌ల్లో మద్యం దొరకడం లేదు..’’ ఇది విజవాడలోని మందు బాబుల ఆవేదన. ఆదివారం కావడంతో మందుబాబులు బారుల ముందు క్యూ కట్టారు. కొత్త మద్యం పాలసీ కారణంగా ఏపీలో వైన్ షాప్‌లు మద్యం ప్రియులతో కిటకిటలాడుతున్నాయి. మద్యం కొరత ఎక్కువ ఉందని తెలిసి ఎక్కడ అయిపోతుందోనని మందు బాబులు ఎగబడి మరీ కొంటున్నారు. విజయవాడలోని బందరు రోడ్డు వద్ద ఉన్న మనోరమ సెంటర్ లోని వైన్ షాప్ వద్ద ఒక్కసారిగా వచ్చిన మద్యం కొనుగోలుదారులతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మద్యం కోసం తోపులాటలతో గందరగోళ పరిస్తితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి మందుబాబులను అదుపు చేస్తున్నారు. లైన్లో వచ్చిన వారికే మందు విక్రయిస్తారని వైన్‌షాప్ యజమానులు చెబుతున్నారు. -
మసీదుల పక్కన మద్యం షాపులు వద్దు
అనంతపురం సెంట్రల్ : ప్రశాంతతకు మారుపేరుగా ఉంటున్న మసీదుల పక్కన మద్యం షాపులు ఏర్పాటు చేయడం ద్వారా తమ మనోభావాలు దెబ్బతీయరాదంటూ అధికారులను ముస్లిం మత పెద్దలు కోరారు. అనంతపురంలోని ఐదో రోడ్డు సమీపంలో మసీదు వద్ద మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం, ఐద్వా ఆధ్వర్యంలో వందలాది మంది ముస్లింలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఐదో రోడ్డు నుంచి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీతో ముస్లింలు చేరుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన విరమించాలంటూ డీఎస్పీ మల్లికార్జున వర్మ,, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకనోక దశలో సహనం కోల్పోయిన ఆందోళన కారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మసీదుల వద్ద కాకుండా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఇంటి వద్ద మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాలని నినదించారు. మసీదు, గుడి, బడి అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఎలా ఏర్పాటు చేస్తారంటూ వాగ్వాదం చేశారు. వెంటనే మసీదుల వద్ద మద్యం దుకాణాల ఏర్పాటును ఉపసహరించుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ... మద్యం షాపులు తొలగిస్తామని హామీనిచ్చారు. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా ఇబ్బంది కలగని చోట ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, కార్యదర్శి సావిత్రి, నగర అధ్యక్షురాలు యమున, నాయకులు రామాంజనమ్మ, నేహమత్, సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, కార్యదర్శివర్గ సభ్యులు రామిరెడ్డి, నాయకులు గోపాల్, వలి, సికిందర్, ముతవల్లీలు రఫిక్, హజీ మునీర్, హమీద్, హుస్సేన్, ఐఎంఎం అధ్యక్షుడు బాషా తదితరులు పాల్గొన్నారు. -
లాతరీలో.. అన్నీ మోషాలే..
మద్యం షాపుల లాటరీ మాయాజాలం l సిండికేట్లతో అధికారుల లాలూచీ l అమలాపురంలో నాలుగు షాపుల తీరు గందరగోళం సీసీ కెమెరాలు... ఎంట్రీ పాస్‌లు... గుర్తింపు కార్డులు... టోకెన్లు... నఖశిఖ పర్యంతం తనిఖీలు... పారదర్శకతకు అద్దం పట్టేలా.. సవాలక్ష నిబంధనల నడుమ జిల్లాలో మద్యం షాపులకు నిర్వహించిన లాటరీ విధానం వివాదా స్పదమైంది. చివరికి ఈ విషయం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు... కోర్టుల్లో కేసుల వరకూ దారి తీస్తోంది. అమలాపురం టౌ¯ŒS (అమలాపురం) : కాకినాడలో గత నెల 31న మద్యం షాపుల కేటాయింపునకు నిర్వహించిన ఈ లాటరీ విధానంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని లాటరీలో అడ్డగోలు చర్యల వల్ల షాపులు కోల్పోయిన దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు, బడా సిండికేట్లకు అధికారులు తెరచాటు సహకారం అందించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. అమలాపురంలో నాలుగు షాపులకు సంబంధించిన లాటరీల్లో కేటాయింపులు వివాదాస్పదం కావడంతో బాధిత దరఖాస్తుదారుల్లో కొందరు జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్ లిఖిత పూర్వక ఫిర్యాదులు చేశారు. మరికొందరు ఎక్సైజ్ అధికారుల చేసిన తప్పిదాలపై కోర్టులను ఆశ్రయించారు. బినామీల రంగప్రవేశం అమలాపురంలో నాలుగు షాపుల కేటాయింపులపై చెలరేగిన దుమారంతో జిల్లాలో మి గిలిన ప్రాంతాల్లో కూడా లాటరీ లోపాలు, అధికారుల తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. అమలాపురంలో 190, 191, 192, 193 షాపుల కేటాయింపు వివాదా స్పదం అయిన సంగతి తెలిసిందే. ఒక షాపులో మొదటి దరఖాస్తుదారుడికి లాటరీలో వచ్చినప్పటికీ సంబంధిత సిండికేటర్ దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తిని అధికారుల ముందు నిర్ణీత సమయంలో హాజరు పరచలేకపోయారు. మరో షాపునకు దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని హాజరుపరచి అతనే అసలు వ్యక్తిగా నమ్మించి అతడితో సంతకం పోర్జరీ చేయించారు. 193 షాపునకు ఒకటో దరఖాస్తుదారుడు కాకుండా మరో వ్యక్తి (బినామీ) డ్రాలో పాల్గొన్నాడు. దరఖాస్తులో ఉన్న వ్యక్తి సంతకాన్ని అతడే చేశాడు. 193 షాపులో రెండో దరఖాస్తుదారుడు జవ్వాది వెంకట కృష్ణ నాగేశ్వరరావు ఈ తప్పిదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటమే కాకుండా కోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. 192 షాపు వ్యవహారం కూడా ఇలాంటి వివాదంపైనే కోర్టు వరకూ చేరింది. పాటించని నిబంధనలు.. లాటరీ డ్రా నిర్వహిస్తున్నప్పుడు సంబంధిత షాపు దరఖాస్తుదారుడు విధిగా హాజరై ఉండాలి. ఈ నిబంధనను అధికారులు కచ్చితంగా పాటించి ఉంటే లేదా ఈ పరిస్థితి వచ్చేది కాదని బాధిత దరఖాస్తుదారులు అంటున్నారు. లాటరీ డ్రాలో పాల్గొనే ప్రతి దరఖాస్తుదారుడికి ఫోటో గుర్తింపు కార్డులు కూడా జారీ చేశారు. దరఖాస్తుదారుడికి బదులు మరో వ్యక్తి డ్రాలో పాల్గొని ఫోర్జరీ సంతకం చేయడంపై ఎక్సైజ్ అధికారులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం షాపుల నిర్వహణలో ఏళ్ల తరబడి బలంగా పాతుకుపోయిన సిండికేటర్లు, ఎక్సైజ్ అధికారుల మధ్య ఉన్న సంబంధాలతోనే ఈ అక్రమాలకు ఆస్కారం ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఆ రోజు లాటరీ డ్రా సమయంలో సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తే అక్రమాలు వెలుగు చూస్తాయని అంటున్నారు. లాటరీ డ్రాకు ఎక్సైజ్ శాఖ విధించిన నిబంధనలను కచ్చితంగా అనుసరించి తిరిగి డ్రాలు నిర్వహిస్తే ఆ షాపులు తమకే దక్కుతాయని బాధిత దరఖాస్తుదారులు అంటున్నారు. -
మద్యం షాపు పెడితే ఉద్యమిస్తాం
– ప్రజాదర్బార్‌లో అధికారులతో మహిళల వాగ్వాదం కల్లూరు (రూరల్): ‘‘మీ కాళ్లు పట్టుకుని మొక్కుతాం సార్.. మా కాలనీలో మద్యం షాపు వద్దు. ఇక్కడ రామాలయం ఉంది. 15వేల మంది విద్యార్థులు బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రతి రోజూ వందల మంది విద్యార్థులు వివిధ విద్యా సంస్థలకు వెళ్తుంటారు. మద్యం షాపు పెడితే పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంది. కాలనీలో మద్యం షాపును తెరిచేందుకు నిర్మాణాలు చేపడుతున్నారు. దయచేసి మద్యం షాపుకు అనుమతి ఇవ్వొద్దు... ఇచ్చారంటే మహిళలు, పురుషులమంతా ఏకమై ఉద్యమం చేస్తాం’’ అంటూ నంద్యాలలోని ఎన్జీఓ కాలనీ, నివర్తినగర్ మహిళలు చెన్నమ్మ, సుంకులమ్మ, నాగార్జున, పెద్ద ఎల్లయ్య, లింగమయ్య, మురళి, టీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రప్పలు.. మీ కోసం ప్రజాదర్బార్‌లో తమ గోడును డీఆర్ఓ గంగాధర్‌గౌడుకు విన్నవించారు. మద్యం షాపు అనుమతిని రద్దు చేసి ఉత్తర్వులు జారీ చేయాలని డీఆర్ఓ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారితో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. సోమవారం నిర్వహించిన మీ కోసం ప్రజాదర్బార్‌లో కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, ఆర్డీఓ హుస్సేన్‌సాహెబ్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ వినతులను స్వీకరించారు. వినతుల్లో కొన్ని... సి. బెళగల్ మండలం ఈర్లదిన్నె గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట ఇసుకను అమ్ముకుంటున్నారని, ఈ విషయమై తహసీల్దార్, ఎస్ఐకు తెలియజేసినా చర్యలు తీసుకోకుండా అక్రమార్కులకే కొమ్ము కాస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇదే గ్రామంలో 2009లో వరద ముంపుకు గురైన వారికి ఇళ్ల స్థలాల కోసం 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి కేటాయించారని, ఇంతవరకూ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేదని..న్యాయం చేయాలని కోరారు. తన పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించారని జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామానికి చెందిన దేవమ్మ.. జిల్లా కలెక్టర్ విజయమోహన్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని జూపాడుబంగ్లా తహసీల్దార్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సంవత్సరాలు గడిచిపోతున్నా తన సమస్య పరిష్కారం కావడం లేదని దేవమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 216లోని ఐదు ఎకరాల్లో మామిడి పంటను సాగు చేశానని, పాత బ్యాటరీలను కాల్చి పొగను వెదజల్లడంతో తోట నాశనమైందని.. న్యాయం చేయాలని డీఆర్ఓకు రైతు బి.నాగలక్ష్మయ్య విన్నవించారు. మిడ్తూరు మండలం 49 బన్నూరులో రేషన్‌కార్డు నెంబర్ డబ్ల్యూఏపీ131600500173, డబ్ల్యూఏపీ 131600500306లకు వేలిముద్రలు పడడం లేదని, రేషన్ ఇవ్వడం లేదని, షేక్ మహబూబ్‌బాష, బి రామలక్ష్మమ్మ డీఆర్ఓకు ఫిర్యాదు చేశారు. పిహెచ్సీ, సీహెచ్‌సీల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్నామని, ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని 104 స్టాఫ్ వెంకటరమణ, రహిమాన్, అబ్దుల్లా, కిరణ్‌కుమార్, నాగేశ్వర్‌రెడ్డి, అభిమన్యుడు మొరపెట్టుకున్నారు. పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలోని సర్వే నెంబర్ 201లోని ప్రభుత్వానికి సంబంధించిన 8.92 సెంట్ల భూమిని 24.84 సెంట్ల భూమిగా మార్పు చేసి స్థానిక ఆంధ్రబ్యాంకులో రుణాలు తీసుకుని ప్రభుత్వాన్ని మోసం చేశారని బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆ గ్రామ నివాసి బి.శివశంకర్ ఫిర్యాదు చేశారు. -
కిక్ ఎక్కించారు
519 మద్యం దుకాణాలకు ౖలైసెన్సులు లైసెన్సు ఫీజు రూ.45.13 కోట్లు ముగిసిన మద్యం దుకాణాల వేలం 26 దుకాణాలకు రీనోటిఫికేష¯ŒSకు చర్యలు కాకినాడ క్రైం : జిల్లాలోని 527 మద్యం దుకాణాల ఏర్పాటుకు కాకినాడ ఎ¯ŒSఎఫ్‌సీఎల్ రోడ్డులోని జీకన్వెన్ష¯ŒS హాల్లో లాటరీ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శనివారం తెల్లవారుజాము 2 గంటల వరకూ ప్రశాంతంగా సాగింది. 2017–2019కి జిల్లాలో 545 మద్యం దుకాణాల ఏర్పాటుకు మార్చి 24న ఎక్సైజ్ అధికారులు నోటిఫికేష¯ŒS జారీ చేయగా, 527 దుకాణాలకు 6,317 దరఖాస్తులు వచ్చాయి. చివరకు 519 మంది వ్యాపారులకు కొత్త మద్యం పాలసీ ప్రకారం దుకాణాలు నిర్వహించుకునేందుకు ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు జారీ చేశారు. మిగిలిన 26 దుకాణాలకు రీటెండర్లు వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రూ.45.13 కోట్ల ఆదాయం 519 మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారుల నుంచి రిజిస్ట్రేష¯ŒS, దరఖాస్తు ఫీజుల రూపంలో రూ.39.66 కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. దీంతో పాటూ లైసైన్సుల రూపంలో మరో రూ.45.13 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లా మొత్తంమీద రూ.84.79 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఇందులో కాకినాడ యూనిట్ పరిధిలోని 184 మద్యం దుకాణాలకు లైసెన్సు ఫీజుగా రూ. 21.15 కోట్లు, రాజమహేంద్రవరం పరిధిలోని 134 దుకాణాలకు రూ.14.92 కోట్లు, అమలాపురంలోని 201 మద్యం దుకాణాలకు 9.06 కోట్ల ఆదాయం సమకూరింది. ముందుగానే వేలం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండకూడదనే సుప్రీంకోర్టు తీర్పుతో లైసెన్సుల జారీ ప్రక్రియను ఈ ఏడాది ముందుగానే ప్రభుత్వం నిర్వహించింది. అయితే జాతీయ రహదారుల సమీపంలోని మద్యం దుకాణాలకు సంబం ధించి శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తుది తీర్పుతో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లీజు గడువు పూర్తయ్యే దాకా (జూ¯ŒS నెలాఖరు దాకా) కొనసాగించేందుకు అవకాశం ఉండటంతో వ్యాపారులు కాస్త ఊరటచెందారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి మద్యం దుకాణాలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 40 మద్యం దుకాణాలకు సుప్రీం కోర్టు తీర్పు వర్తింపు జిల్లాలో గతేడాది మద్యం దుకాణాల కేటాయింపునకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేష¯ŒSలో మిగిలిపోయిన 46 మద్యం దుకాణాల్లో 40 దుకాణాలకు అధికారులు శుక్రవారం వేలం నిర్వహించారు. ఈ వేలంలో కొత్త మద్యం పాలసీ ప్రకారం వ్యాపారులకు మద్యం దుకాణాలను కేటాయించించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల అవతల దుకాణాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. -
లక్కు.. కిక్కు!
మద్యం దుకాణాలకు నేడు లక్కీ డిప్ – చివరి రోజు భారీగా టెండర్ల దాఖలు - రియల్టర్లు, ఫైనాన్స్ వ్యాపారుల దృష్టి – లైసెన్స్ కాల పరిమితి రెండేళ్లు – మధ్యాహ్నం 2 నుంచి లక్కీడిప్ ప్రారంభం – జెడ్పీ సమావేశ భవనంలో ఏర్పాట్లు కర్నూలు: మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 204 మద్యం దుకాణాలకు చివరి రోజు గురువారం నాటికి సుమారు 4,850 పైగా దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే ఈసారి మరో మూడు గంటలు పెంచి రాత్రి 8 గంటల వరకు టెండర్ల దాఖలుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రాత్రివేళ అసౌకర్యానికి లోనుకాకుండా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వ్యాపారులతో ఎక్సైజ్ కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా సందడి కనిపించింది. జిల్లాలో 14 ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు ఉండగా.. స్టేషన్ల వారీగా టెండర్ బాక్సులు ఏర్పాటు చేయడంతో ప్రక్రియ సజావుగా సాగింది. మహిళలు కూడా నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు సమర్పించారు. గత ఏడాది పదుల సంఖ్యలో దుకాణాలకు 100 నుంచి 150 దాకా దరఖాస్తులు దాఖలు కాగా.. ఈ ఏడాది వ్యాపారులు సిండికేట్ కావడంతో కొన్ని ప్రాంతాల దుకాణాలకు దరఖాస్తులు తగ్గాయి. గత ఏడాది 175 దుకాణాలకు టెండర్లు ఆహ్వానించి 19 దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. కొంతకాలం తర్వాత వాటికి కూడా టెండర్లను ఆహ్వానించి వ్యాపారులకు అప్పగించారు. మద్యం వ్యాపారంలోకి కొత్త వ్యక్తులు గత ఏడాది మద్యం వ్యాపారులు భారీగా లాభాలు గడించారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మద్యం వ్యాపారంపై కొత్త వ్యక్తులు కూడా దృష్టి సారించారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉండటంతో గతంలో ఆ వ్యాపారంలో స్థిరపడిన వారు, ఫైనాన్స్ వ్యాపారులు నువ్వా.. నేనా అన్నట్లుగా ఎక్సైజ్ టెండర్లలో పాల్గొని దరఖాస్తులు అందజేశారు. రెండేళ్ల కాల పరిమితితో లైసెన్స్ ఇస్తుండటంతో కలసివచ్చే అవకాశంగా భావించి మద్యం వ్యాపారంతో సంబంధం లేని వాళ్లు కూడా ఈసారి లాటరీల కోసం ప్రయత్నిస్తున్నారు. రాబోవు రెండేళ్ల కాలంలో సాధారణ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉండటంతో వ్యాపారం పెద్ద ఎత్తున సాగే అవకాశముందని భావించి ఫైనాన్స్ వ్యాపారులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు, కర్నూలు, నంద్యాల ఏఈఎస్‌లు మహేష్‌కుమార్, ఆదినారాయణ మూర్తి పర్యవేక్షణలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టెండర్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. గతంలో దుకాణాలు పొందిన వాళ్లు ఈసారి కూడా తమ చేయి దాటకూడదని భావించి అనుచరులు, కుటుంబ సభ్యులతో పదుల సంఖ్యలో దరఖాస్తులు చేయించారు. గత ఏడాది 5,781 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి 204 దుకాణాలకు 4,850 దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే అధికారులు 3,292 దరఖాస్తులను పరిశీలించి స్వీకరించారు. 1558 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. రాత్రి పొద్దుపోయే వరకు వాటిని పరిశీలించి ఆమోదించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వానికి రూ.20 కోట్లకు పైగా ఆదాయం దరఖాస్తు ఫీజుగా రూ.5 వేలు, రిజిస్ట్రేషన్ ఫీజు మండల కేంద్రాల్లో రూ.50 వేలు, నగర పంచాయతీలో రూ.75 వేలు, నగరపాలక సంస్థ పరిధిలో రూ.లక్ష చెల్లించాలి. దరఖాస్తు ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి ఇవ్వరు. ఈ లెక్కన దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఈ ఏడాది సుమారు రూ.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. నేడు అదృష్ట పరీక్ష లక్కీడిప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకోసం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ హాజరై లక్కీడిప్‌ను ప్రారంభించనున్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయంతో పాటు లక్కీడిప్ జరగనున్న జిల్లా పరిషత్ ఆవరణం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం దుకాణాలు : 204 దాఖలైన దరఖాస్తులు : మున్సిపల్ ప్రాంతాలు : 309 కర్నూలు కార్పొరేషన్ : 144 నగర పంచాయతీలు : 99 మండల కేంద్రాలు : 2,740 -
మద్యం దుకాణాల కోసం 675 దరఖాస్తులు
కర్నూలు(టౌన్) : జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల నిర్వహణ కోసం ఆన్లైన్లో 675 దరఖాస్తులు వచ్చాయి. వీటిని మంగళవారం డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో అధికారులు పరిశీలించారు. 215 దరఖాస్తులను మొదటి విడతగా పరిశీలించారు. మొత్తం దరఖాస్తుల్లో కర్నూలు డివిజన్‌కు 285, నంద్యాల డివిజన్‌కు 390 వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు తెలిపారు. బుధవారం ఉగాది పండుగ రోజున కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుల రూపంలో ఎక్సైజ్ శాఖకు రూ.85 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. -
మద్యం దుకాణాలు వద్దంటూ ర్యాలీ
నంద్యాల: తమ ప్రాంతంలో మద్యం దుకాణాలు వద్దంటూ నంద్యాల పట్టణంఓని పద్మావతి నగర్ మహిళలు సోమవారం ర్యాలీ నిర్వహించారు. కాలనీలో సగం భాగం పైగా నివాస గృహాలు, కాలేజీలు, ఆసుపత్రులు, స్టేడియం ఉన్నాయి. కాలనీలో అక్కడక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో మద్యం షాపులను పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. టీడీపికి చెందిన మాజీ మంత్రి అనుచరులకు కూడా మద్యం షాపు ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికులు గెలివి రామకృష్ణ, బాచంనాగేశ్వరరెడ్డి, నెరవాటి నందబాబు ఆధ్వర్యంలో పద్మావతినగర్ పార్కులో సమావేశమయ్యారు. అనంతరం పద్మావతినగర్ సెంటర్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేసి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. నివాస గృహాల మధ్య మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వరాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళనలో శేషిరెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ తారకేష్, డాక్టర్ జఫరుల్లా, న్యాయవాదులు సత్యం, గోళ్ల జయకృష్ణ, బీజేపీ నేతలు పెసల శ్రీకాంత్, నిమ్మకాయల సుధాకర్, లయన్స్‌క్లబ్ ప్రతినిధులు కశెట్టి చంద్రశేఖర్, కశెట్టి వేణుగోపాల్, గెలివి చక్రవర్తి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌లాల్ పాల్గొన్నారు. -
మద్యం షాపులకు నోటిఫికేషన్
- అంతా ఆన్లైన్లోనే.. – దరఖాస్తులకు ఈ నెల 30 వరకు గడువు – 31న కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా టెండర్ల ఖరారు – ఇకపై ప్రతి మద్యం షాపులోనూ పర్మిట్రూం – ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనసూయదేవీ అనంతపురం సెంట్రల్ : జిల్లాలో మద్యం షాప్‌ల నిర్వహణకు సంబంధించి తొలిసారిగా ఆన్లైన్లో టెండర్ల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనసూయదేవి తెలిపారు. శుక్రవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో సూపరింటెండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి, సీఐలు శ్యామ్‌ప్రసాద్, నరసింహులుతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2017-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి జిల్లాలోని 246 మద్యం షాప్‌ల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వివరించారు. ఇందులో అనంతపురం డివిజన్ పరిధిలో 146, పెనుకొండ డివిజన్ పరిధిలో వంద దుకాణాలున్నాయన్నారు. వీటికి సంబంధించి శుక్రవారం నుంచే ఆన్లైన్లో టెండర్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి www.applications.excisehpfs.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు పొందవచ్చునని చెప్పారు. రిజిస్ర్టేషన్ ఫీజులు ఇలా.. టెండర్ల దరఖాస్తుకు ఈ నెల 30న సాయంత్రం ఐదు గంటల వరకు గడువుందని, 31న అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న విద్యుత్ కళాభారతి ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ విధానంలో టెండర్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో రూ. లక్ష, మున్సిపాలిటీ పరిధిలో రూ. 75 వేలు, మండలాల పరిధిలో రూ. 50 వేలు చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇది కాక రూ. 50 వేలు దరఖాస్తు రుసుంగా నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ఈ ఏడాది నుంచి ప్రతి మద్యం షాప్‌లో పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు గాను రూ. 5 లక్షలు, అప్లికేషన్ ఫీజు రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మద్యం షాపుల టెండర్లలో పాల్గొనే వారు ఆధార్, పాన్‌కార్డుతో పాటు రెండేళ్ల ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్, రూ. 3 లక్షలు ఈఎండీ చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. వెరిఫికేషన్ తప్పనిసరి అన్లైన్లో నమోదు చేసుకున్న వెంటనే అదేరోజు అనంతపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుందని డీసీ పేర్కొన్నారు. వెరిఫికేషన్ పూర్తి అయిన వెంటనే ఓ టోకన్ నంబర్ ఇస్తారని, వాటి ఆధారంగా 31న లాటరీ ద్వారా నంబర్లు కేటాయించడం జరుగుతుందని అన్నారు. నిబంధనలు తప్పనిసరి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నూతనంగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాలు జాతీయ రహదారులకు 500 మీటర్లు దూరంలో తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే దేవాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలలకు 100 మీటర్లు దూరంలో ఉండాలన్నారు. ప్రతి షాపులోనూ సీసీ కెమెరా తప్పనిసరిగా అమర్చుకోవాల్సి ఉంటుందన్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ, మండలం యూనిట్లుగా షాపులు కేటాయించారని, ఎక్కడైనా దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. -
ఖరారు కాని మద్యం పాలసీ
ప్రొద్దుటూరు : మద్యం షాపుల యజమానులు అయోమయంలో పడ్డారు. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 31 వరకు మద్యం దుకాణాలకు గడువు ఉంది. అయితే జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు దుకాణాలు ఉండరాదని ఇటీవల సుప్రీంకోర్డు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వ్యాపారులు డీలా పడ్డారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 109 మద్యం షాపులు, 8 బార్లు ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు 91 మద్యం షాపులు, 6 బార్లు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ విధానం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన పాలసీలో ప్రాంతాలతో సంబంధం లేకుండా వైన్ షాపులు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 16 షాపులు, 6 బార్లు రాష్ట్ర, జాతీయ రహదారులకు 500 మీటర్ల లోపు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వేంపల్లి నుంచి ప్రొద్దుటూరు, రాజుపాళెం మీదుగా చాగలమర్రి వరకు ఉన్న రహదారి స్టేట్ హైవే కిందికి వస్తుంది. దీంతో కొర్రపాడు రోడ్డులోని భగత్‌సింగ్ కాలనీ, రాజుపాళెంలో ఉన్న మద్యం షాపులకు ఈ నిబంధన వర్తిస్తుంది. చాపాడు, లింగాపురం, మైదుకూరు రోడ్డు, కేకే స్ట్రీట్, వైఎంఆర్ రాజీవ్ సర్కిల్, టిబిరోడ్డు, గాంధీరోడ్డులోని గాంధీబొమ్మ పరిసర ప్రాంతాల్లోని మద్యం షాపులు 500 మీటర్లలోపు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రకారం పట్టణ, మండలాల్లో 90 శాతం పైగా మద్యం దుకాణాలను వేరే ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. ప్రస్తుతం వార్డుల వారీగా దుకాణాలను నిర్వహిస్తున్నారు. తాజా నిబంధనల ప్రకారం రాష్ట్ర, జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో దుకాణాల నిర్వహణ జరగాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో అధికారులే మద్యం షాపు ఏర్పాటుకు స్థలాలను గుర్తిస్తారా లేక ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చనే నిబంధన వస్తే ఏం చేయాలని వైన్‌షాపు యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాలేదు.. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 20న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర, జాతీయ రహదారుల్లోని 500 మీటర్ల లోపు ఉన్న మద్యం దుకాణాలు, బార్లను గుర్తించి అధికారులకు నివేదిక పంపించాం. –బాలకృష్ణన్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ప్రొద్దుటూరు -
రోడ్డు మీదున్న షాపులకు నోటీసులు
►31లోపు తరలించాలని హుకుం సాక్షి, మెదక్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ, రాష్ట్రీయ రహదారుల సమీపంలో ఉన్న వైన్‌షాపులను మరో చోటికి తరలించాలంటూ ఎక్సైజ్ అధికారులు షాపు యజమానులకు నోటీసులు పంపారు. రోడ్డు సమీపంలో ఉన్న వైన్‌షాపుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నోటీసులు అందజేశారు. జిల్లాలో మొత్తం 37 వైన్ షాపులు ఉండగా అందులో 31 షాపులకు నోటీసులు అందడం గమనార్హం. జాతీయ, రాష్ట్రీయ రోడ్డుకు 500 మీటర్లలోపు ఉన్న వైన్ షాపులను 31 మార్చిలోగా తొలగించి ఏప్రిల్ 1 నుంచి కొత్త షాపుల్లోకి మార్చాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈలోగా కొత్త షాపులను ఎంపిక చేసుకోకపోతే ఏప్రిల్ 1 నుంచి షాపులను నిర్వహించడానికి ఇష్టపడనట్లుగా భావిస్తామని తెలియజేశారు. దీంతో వైన్ షాపు యజమానులంతా కొత్త షాపుల వేటలో పడినట్లు తెలుస్తోంది. -
హైవే.. నోవే!
► జాతీయ, రాష్ట్ర రహదారులకు దూరంగా మద్యం షాపులు ► ఏ మద్యం షాపైనా 500 మీటర్ల దూరంలో ఉండాల్సిందే ► మద్యం షాపులపై కొరడాఝుళిపించిన సుప్రీంకోర్టు ► మార్కాపురం ప్రాంతంలో144 షాపులకు ముప్పు ► ఆందోళనలో మద్యం వ్యాపారులు మార్కాపురం: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా సుప్రీంకోర్టు మద్యం షాపులపై కొరడా ఝుళిపించింది. గతేడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పును ఈ నెల 31వ తేదీలోపు అమలు చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించటంతో ఒక్కసారిగా మద్యం షాపుల యజమానుల్లో ఆందోళన మొదలైంది. జాతీయ, రాష్ట్ర రహదారికి 500 మీటర్ల దూరంలో మాత్రమే మద్యం షాపులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో మార్కాపురం, కంభం, యర్రగొండపాలెం, కనిగిరి, కందుకూరు, సింగరాయకొండ, గిద్దలూరు, దర్శి, పొదిలిలో ఎక్సైజ్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 169 వైన్‌షాపులు నడుస్తున్నాయి. సమీపించిన గడువు: సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం రోడ్డుకు దగ్గరలో ఉన్న (సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం) 144 షాపులను జనవాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. మూడు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల యజమానులతో మాట్లాడుతున్నారు. షాపులను అత్యవసరంగా తొలగించాలని ఆదేశించడంతో వ్యాపారులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రతి మండల కేంద్రం రాష్ట్ర, లేదా జాతీయ రహదారికి అనుబంధంగా ఉంది. ఇప్పటి వరకూ ఎక్సైజ్ అధికారులు గుడికి, బడికి 100 మీటర్ల దూరం ఉంటే చాలనే నిబంధన ప్రకారం 2015లో మద్యం షాపులకు లైసెన్స్‌లు ఇచ్చారు. తాజా నిబంధనలతో పరిస్థితి తారుమారైంది. మార్కాపురం పట్టణంలో 13, దర్శిలో 7, తాళ్లూరులో 4, రాజంపల్లిలో 1, పొదిలిలో 6, దొనకొండలో 3, దోర్నాలలో 3, కంభంలో 5 మద్యం షాపులను రాష్ట్ర రహదారికి దూరంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 31లోపు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. 2015లో మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఏటా ప్రభుత్వానికి షాపు ఆధారంగా రూ.30 నుంచి రూ.45 లక్షల వరకు లైసెన్స్ ఫీజు కింద చెల్లిస్తున్నారు. మార్కాపురం సూపరింటెండెంట్ పరిధిలో ఏటా 60 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఒంగోలు సర్కిల్ నుంచి సుమారు 54 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం తిరునాళ్ల సీజన్. ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తే మద్యం షాపులన్నీ ఊరికి దూరంగా ఉంటాయి. తిరునాళ్లకు మద్యం తాగేందుకు శివారు ప్రాంతాలకు ఎవరొస్తారని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. దోర్నాల, మార్కాపురం, పెద్దారవీడు, త్రిపురాంతకం, కంభం, పొదిలి, దర్శి, కనిగిరి పట్టణాల మీదుగా పలు రాష్ట్ర, జాతీయ రహదారులున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పట్టణంలో ఉన్న షాపులను కూడా ఊరి బయటకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీం తీర్పు పాటించాల్సిందే: ఈ నెల 31వ తేదీలోపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర, జాతీయ రహదారి పక్కన ఉన్న మద్యం దుకాణాలు తొలగిస్తాం. ఇక నుంచి వ్యాపారులు సుమారు 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు వ్యతిరేకంగా యజమానులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఆర్.హనుమంతురావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్, మార్కాపురం. -
తర్జనభర్జన
- హైవేల పక్కన మద్యం దుకాణాల తొలగింపునకు ‘సుప్రీం’ ఆదేశం - జిల్లాలో 247 మద్యం దుకాణాల్లో 179 హైవేల పక్కనున్నవే - తొలగింపునకు ఈ నెల 31 డెడ్‌లైన్.. - ఎక్సైజ్ అధికారులు, మద్యం దుకాణాదారుల్లో టెన్షన్ అనంతపురం సెంట్రల్ : జాతీయ, రాష్ట్రీయ రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాల తొలగింపుపై ఎక్సైజ్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ద్వారా అధికశాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారికి ఆనుకుని మద్యం షాపులు, బార్లు ఉండడం ద్వారా ప్రజలు మరింత ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాగి హైవేలపై రయ్‌మంటూ వాహనాలు నడుపుతున్నారు. వారు నష్టపోవడంతో పాటు ఎదురుగా వస్తున్న అమాయకుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు. ఈ అంశంపై రెండు నెలల క్రితం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు మార్చి 31 గడువు విధించింది. జిల్లాలో మెజార్జీ మద్యం దుకాణాలు హైవేపైనే ఉన్నాయని అధికారుల సర్వేలో తేలింది. మొత్తం 247 మద్యం షాపులలో జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన 179 షాపులు ఉన్నట్లు గుర్తించారు. వ్యాపార కోణంలో ఆలోచించి ప్రతి ఒక్కరూ హైవే పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ షాపులను ఏం చేయాలో అర్థం కాక అధికారులు సతమతమవుతున్నారు. సదరు మద్యం దుకాణాలకు జూన్ వరకూ లైసెన్స్ గడువు ఉంది. దీంతో రెండు నెలలు మినహాయించాలని దుకాణాదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయంస్థానం నుంచి ఎలాంటి కబురు వస్తుందో అనే టెన్షన్ ఇటు అధికారుల్లోనూ, మద్యం దుకాణాదారుల్లోనూ నెలకొంది. ఆదేశాలు రాలేదు జిల్లాలో మద్యం దుకాణాలకు జూన్ వరకూ గడువు ఉంది. న్యాయస్థానం మార్చి 31లోగా హైవేల పక్కన ఉన్న వాటిని తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొంతమంది దుకాణాదారులు మరికొంత గడువు కావాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ఉత్తర్వులను అనుసరించి చర్యలు తీసుకుంటాం. - అనుసూయదేవి, డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ -
‘ఏప్రిల్ నుంచి హైవేకు దూరంగా వైన్స్ షాపులు’
కణేకల్లు : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జాతీయ, రాష్ట్రీయ రహదారులకు దూరంగా మద్యం షాపులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అనంతపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కణేకల్లు ఎక్సైజ్ పోలీసుస్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. అంతకుముందు కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల్లోని వైన్స్‌షాపుల్ని ఆయన పరిశీలించారు. స్థానిక ఎక్సైజ్ పోలీసుస్టేషన్లో సీఐ దశరథరామిరెడ్డితో కలిసి ఈఎస్ విలేకరులతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక ప్రమాదాలు మద్యం తాగుడు వల్ల జరుగుతున్నాయని ఈ ప్రమాదాలను పూర్తిగా అరికట్టాలనే ఉద్ధేశంతో నేషనల్ హైవే, స్టేట్ హైవే రోడ్ల పక్కన మద్యం దుకాణలు పెట్టరాదని సుప్రీం కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఎన్‌హెచ్, ఎస్‌హెచ్ రోడ్లకు 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతపురం ఎక్సైజ్ డివిజన్ పరిధిలో మొత్తం 139 మద్యం షాపులు ఉండగా హైవే రోడ్లలో 91 షాపులున్నట్లు గుర్తించామన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ షాపులను దూరంగా పెట్టుకోవాలని ఆదేశిస్తూ ఆయా షాపు యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. షాపులను షిప్ట్ చేయకపోతే వారి లైసెన్స్‌లను రద్దు చేసి కొత్తషాపులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గుత్తి ఎక్సైజ్ పోలీసుస్టేషన్ పరిధిలో 17, గుంతకల్లులో 3, ఉరవకొండలో 5, శింగనమలలో 5, తాడిపత్రిలో 14, అనంతపురంలో 33, కణేకల్లులో 5, రాయదుర్గంలో 7 షాపులు రోడ్డు పక్కలో ఉన్నాయన్నారు. మద్యం షాపులు మరోచోటికి డమ్మిగా షిఫ్ట్ చేసి రోడ్ల పక్కలో దుకాణాలు తీసి విక్రయించే అవకాశముందా అన్న ప్రశ్నకు సివిల్ పోలీసులు, రెవెన్యూ, ఎక్సైజ్ పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తుంటారని ఆ విధంగా ఎవరైనా చేస్తే వారి లైసైన్స్‌లు కూడా రద్దు చేస్తామని ఆయన సమాధానమిచ్చారు. అలాగే దాబా, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అనంతపురం ఎక్సైజ్ డివిజన్లో నాటుసారాను పూర్తిగా నిర్మూలించడంతో మద్యం వ్యాపారం బాగా పుంజుకుందన్నారు. మద్యం డిపోలో నెలకు రూ. 30 నుంచి రూ.32 కోట్ల విలువ చేసే మద్యం లిఫ్ట్ అవుతున్నట్లు తెలిపారు. -
‘కిక్కు’పై వీడని సస్పెన్స్!
జాతీయ, రాష్ట్ర రహదారులపై 140 వైన్ షాపులు.. తరలించేందుకు ఈనెల ఆఖరుతో గడువు సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకొని ఉన్న 140 మద్యం దుకాణాలు, బార్ల కొనసాగింపుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆయా రహదారులకు ఆనుకొని 500 మీటర్ల లోపల ఉన్న దుకాణాలను మార్చి నెలాఖరులోగా రహదారులకు దూరంగా మరోచోటకు తరలించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద స్పందించిన ఆబ్కారీశాఖ.. ఈ ఏడాది సెప్టెంబరు వరకు లైసెన్సు గడువు ముగియనున్నందున ఆయా దుకాణాలను అప్పటివరకు యధాస్థానంలో కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఈ నెలలో వచ్చే అవకాశాలున్నాయి. కాగా ఆయా దుకాణాలు ప్రధాన రహదారులు, అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాలే కావడంతో ఏకంగా 140 దుకాణాలను తొలగించే అవకాశం ఉంది. దీంతో మిగతా దుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు సాగించడం, సమయపాలన పాటించకపోయే ప్రమాదం కూడా ఉందని ఆబ్కారీశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకొని ఉన్న కల్లు దుకాణాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుండడంతో కల్లు సొసైటీల సభ్యులు కూడా ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా దిల్సుఖ్నగర్– ఎస్.ఆర్.నగర్ రూట్లో అధికంగా మద్యం దుకాణాలు, బార్లు ఈ జాబితాలో ఉన్నట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. గత నెలలో చీప్ లిక్కర్ సేల్స్ అదుర్స్ సిటీని గుడంబా రహిత నగరంగా తీర్చిదిద్దడంలో నగర ఆబ్కారీశాఖ విజయం సాధించడంతో ఇప్పుడు అల్పాదాయ వర్గాలు, దినసరి కూలీలు చీప్ లిక్కర్‌పై మక్కువ చూపుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలిపారు. దీంతో చీప్‌లిక్కర్ సేల్స్ బాగా పెరిగాయి. ప్రధానంగా గుడంబాకు అడ్డాగా ఉన్న ధూల్‌పేట్‌లో ఫిబ్రవరిలో ఏకంగా 273 శాతం అమ్మకాల్లో వృద్ధి నమోదవడం గమనార్హం. ఇక మలక్‌పేట్‌లో 61 శాతం, నారాయణగూడలో 48 శాతం, గోల్కొండలో 45 శాతం, చార్మినార్ ప్రాంతంలో 36 శాతం మేర అమ్మకాల్లో వృద్ధి నమోదవడం విశేషం. మద్యం చీర్స్ ఇక్కడే అత్యధికం.. చీప్‌లిక్కర్ స్థాయిలో కాకపోయినా రూ.700 లోపు (ఫుల్ బాటిల్) ధర ఉన్న మద్యం అమ్మకాలు కూడా నగరంలో ఫిబ్రవరి నెలలో అధికంగా జరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సాధారణ మద్యంలో ధూల్‌పేట్‌లో 27 శాతం, జూబ్లీహిల్స్‌లో 24 శాతం, ముషీరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 5శాతం, చార్మినార్‌లో 11 శాతం, గోల్కొండలో 17 శాతం మేర అమ్మకాలు పెరగడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. నగరంలో 2016 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు: రూ.1621 కోట్లు 2017లో మద్యం అమ్మకాలు: రూ.1756 కోట్లు బీర్ల అమ్మకాల్లో వృద్ధి: 0.1 శాతం మద్యం అమ్మకాల్లో వృద్ధి: 9 శాతం -
సమయపాలన పాటించకపోతే కేసులు
– ఎక్సైజ్ డిప్యుటీ కమిషనర్ శ్రీరాములు కర్నూలు: మద్యం వ్యాపారులు సమయపాలన పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు తెలిపారు. వేళాపాళా లేకుండా దుకాణాల్లో మద్యం విక్రయాలు కొనసాగిస్తున్న విషయాన్ని ‘సాక్షి’లో ‘మామూళ్ల మత్తు’ శీర్షికన ఈనెల 28న కథనం వెలువడింది. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు ఈ కథనంపై స్పందించారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మాసం వరకు జిల్లా వ్యాప్తంగా సమయపాలన పాటించని మద్యం వ్యాపారులపై 70 కేసులు నమోదు చేశామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్లలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలన్నారు. అంతకుమించి దుకాణాలు తెరిచి ఉంచితే నిఘా వేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ధరల ఉల్లంఘనకు సంబంధించి 35 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులు 77 నమోదు చేశామని.. 89 మందిని అరెస్టు చేసి 402 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 171 బెల్టు షాపులను గుర్తించి 186 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 566 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘నవోదయం’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శనివారం అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా కర్నూలు ఎక్సైజ్ సీఐ పద్మావతి బంగారుపేటలో అవగాహన సదస్సు నిర్వహించారు. -
మామూళ్ల మత్తు
ఈ షాపులు మూయరే...! - రాత్రి 10 గంటలు దాటినా నడుస్తున్న వైన్‌షాపులు - కన్నెత్తి చూడని ఎక్సైజ్ సిబ్బంది - ఆదాయం పెంచాలని ప్రభుత్వం నుంచీ ఒత్తిళ్లు - జిల్లాలో అమలుకు నోచుకోని నిబంధనలు - దాడులు వద్దని పై నుంచే ఆదేశాలు? సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇది కర్నూలు నగరంలోని ఓ వైన్ షాపు. రాత్రి పది గంటల పది నిమిషాలు అయినప్పటికీ ఇది మూతపడలేదు. యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారు. ఇది రోజు వారీగా జరిగే తంతే. అయినప్పటికీ ఎక్పైజ్ అధికారులు కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల పరిస్థితీ ఇంతే. వాస్తవానికి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే షాపులు తెరచి ఉంచుకోవాలి. ఇదీ వైన్‌షాపులను మంజూరు చేసిన సమయంలో ఎక్సైజ్ అధికారులు విధించిన నిబంధన. అయితే, జిల్లాలో ఎక్కడా ఈ నిబంధన అమలు కావడం లేదు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఎక్సైజ్ అధికారులు మాత్రం అటువైపు కనీసం కన్నెత్తి చూడరు. నెలవారీగా మామూళ్లు అందుతుండటమే ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎలాగైనా ఆదాయం పెంచాల్సిందేనంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్లు కూడా అధికారులు పట్టించుకోక పోవడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెలనెలా ఇస్తున్నాం.. పట్టించుకోవద్దు ఎక్సైజ్ అధికారులకు కనీసం ఏ మాత్రం బెదరకుండా మద్యం దుకాణాల యాజమాన్యాలు బరితెగించడానికి ప్రధాన కారణం నెలవారీ మాముళ్లే. ప్రతి షాపు నుంచి ఎక్సైజ్ సిబ్బందికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ అందుతోంది. గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ) కంటే అధిక ధరకు విక్రయించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు ఎప్పుడు వ్యాపారం చేసుకున్నా పట్టించుకోకుండా ఉండేందుకే ఈ మాముళ్లు ఇస్తున్నామని మద్యం సిండికేట్లు బహిరంగంగానే పేర్కొంటున్నారు. నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నందున తామేమి చేసినా పట్టించుకోవద్దని ఎక్సైజ్ సిబ్బందిని కోరుతున్నాయి. అంతేకాకుండా మద్యం దుకాణం ముందే మందు బాటిల్ తాగేసినా కూడా ఎక్సైజ్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఎలాంటి పర్మిట్ రూం అనుమతి లేకపోయినప్పటికీ కిమ్మనకుండా ఉంటున్నారు. తెగిస్తున్న బెల్టు...! జిల్లావ్యాప్తంగా బెల్టు షాపుల జోరు రోజురోజుకీ పెరుగుతోంది. ఒక్కో గ్రామంలో ఏకంగా 10 నుంచి 15 వరకూ బెల్టు దుకాణాలు నడుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అయితే, ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో ఎక్కడా ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేయడం లేదు. ఎక్కడ కూడా బెల్టు దుకాణాన్ని గుర్తించిన సంఘటనలూ లేవు. బెల్టు షాపులు ఏర్పాటు చేసుకున్నందుకు కూడా ఎక్సైజ్ సిబ్బందికి మామూళ్లు ఇస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా ఆదాయం పెంచాలంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కూడా యథేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు ఎక్సైజ్ సిబ్బంది అవకాశం ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా నోట్ల రద్దు నేపథ్యంలో రవాణా, వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఆదాయంపై మాత్రం పెద్దగా ప్రభావం పడలేదు. దీంతో ఎలాగైనా ఎక్సైజ్ ద్వారా భారీగా ఆదాయం రాబట్టుకోవాలనేది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగా ఎక్కడా దాడులు జరపకుండా పై నుంచే ఆదేశాలు ఉన్నాయని కూడా ఎక్సైజ్ సిబ్బందే పేర్కొంటున్నారు. -
నల్ల‘మందు’తో తెల్ల‘ధనం’
► బెల్టుబాబు డెరైక్షన్.. సిండికేట్ సభ్యుల యాక్షన్ ► మద్యం సిండికేటు నయాదందా ► మూడు రోజులుగా పాతనోట్లు తీసుకోని లిక్కర్ వ్యాపారులు ► కానీ ఆదాయ లెక్కల్లో.. బ్యాంకు జమల్లో మాత్రం అవే ► బ్లాక్‌ను వైట్ చేసుకునే పనిలో బిజీబిజీ పాత రూ.500, రూ.వెయ్యి నోట్లు ఎక్కడా.. ఎవరూ తీసుకోకపోయినా.. వైన్ షాపులు, బార్లలో మాత్రం కళ్లకద్దుకొని తీసుకున్నారు. బోర్డులు పెట్టి మరీ ఆహ్వానించి మందుబాబులను ఊరించారు.. ఆదాయం కిక్కు పెంచుకుందమనుకున్నారు.. నోట్లు రద్దయిన రెండు మూడు రోజుల వరకు అదే జరిగింది కూడా..కానీ ఆ తర్వాతే సీను మారిపోయింది. మందుబాబులకు బంపర్ ఆఫర్ అందకుండాపోయింది. లిక్కర్ వ్యాపారులు పాత నోట్లు తీసుకోవడం మానేశారు..ఉన్న పళంగా వారి వైఖరిలో ఈ మార్పునకు కారణమేంటి?!.. ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశాలే వెలుగుచూశాయి.దాని వెనుక ఓ బెల్టుబాబు మాస్టర్‌మైండ్ ఉందని.. అందులో నల్లడబ్బును మద్యంలో ముంచి తెల్లగా మార్చేసుకోవాలన్న స్వార్థపూరిత ఆలోచనలున్నాయని తేటతెల్లమైంది.మన దగ్గరే గుట్టలు గుట్టలుగా పాత పెద్దనోట్లు ఉండగా.. జనం నుంచి తీసుకోవడమెందుకు?.. వారి నుంచి కొత్త నోట్లే తీసుకొని.. వాటి స్థానంలో పాత నోట్లను చెల్లుబాటు చేసుకోవాలన్న దురాలోచన ఆ బెల్లుబాబుదే.. ఫలితం.. సిండికేట్ పరిధిలోని షాపులవారు పాత నోట్లకు ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను వెనక్కి తీసేసుకున్నారు. -సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం విశాఖపట్నం: నోట్ల కట్టలు.. గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి.. ఇప్పుడవన్నీ బయట చెల్లుబాటు కావు. ఈ బ్లాక్‌ను ఎలా వైట్ చేసుకోవాలి?!.. ప్రధాని ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇదే విషయమై మథనపడిన నగరంలోని లిక్కర్ సిండికేట్ లీడరు అలియాస్ టీడీపీ ప్రజాప్రతినిధి అలియాస్ బెల్టుబాబుకు ఎట్టకేలకు మెరుపులాంటి ఆలోచన తట్టింది. వెంటనే తనవారందరికీ మార్గదర్శనం చేశారట. వైన్‌షాపులు, బార్లలో ఇక వినియోగదారుల నుంచి పాత రూ.500, వెయ్యి నోట్లు తీసుకోకుండా కొత్త 2వేల రూపాయల నోటు, లేదా రూ.వంద100, రూ.50 నోట్లు మాత్రమే తీసుకోవాలని లోపాయికారీగా ఆదేశాలు జారీ చేశారు. అలా వచ్చే రోజూవారీ వసూళ్ల స్థానంలో పాత నోట్ల కట్టలను తీసుకొచ్చి ఆదాయం లెక్కల్లోచూపించేస్తే.. బ్లాక్‌లో ఉన్న కొంత సొమ్మయినా వైట్ చేసుకునే వీలుంటుందని సదరు బెల్టుబాబు లెక్కట. అందుకే ఇప్పుడు నగరం, నగర శివారులోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో కొత్త నోట్లు మాత్రమే తీసుకుంటామని బోర్డులు పెడుతున్నారు. వాస్తవానికి ఈ నెల 8వ తేదీ రాత్రి కేంద్రం రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆయా నోట్లను తీసుకునేది లేదంటూ బోర్టులు పెట్టేశాయి. కానీ విశాఖ నగరం, శివారులోని మద్యం షాపులు, బార్ల యజమానులు మాత్రం పాత నోట్లను తీసుకుంటామని బోర్డులు పెట్టి మరీ మందుబాబులను ఆహ్వానించారు. బ్లాక్ టు వైట్‌కు ఇదే అదను.. నగరంలోని లిక్కర్ వ్యాపారుల తరఫున దళారీగా వ్యవహరించే సదరు టీడీపీ ప్రజాప్రతినిధి నల్లధనాన్ని వైట్ చేసుకోవాలంటే ఇదే సరైన సమయమని భావించాడు. అందుకే రోజూవారీ ఆదాయంలో భాగంగా పాత నోట్లను తీసుకోకుండా కేవలం కొత్త రూ.2వేల నోట్లు, వందలు, యాభైలు, చిల్లర మాత్రం తీసుకోవాలని సిండికేట్ వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశాడని అంటున్నారు. రోజువారీ లావాదేవీల్లో వచ్చే సొమ్మును ఎలాగూ ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం గొడౌన్లోనో.. బ్యాంకుల్లోనో చెల్లిస్తారు కనుక వైట్ అయిపోతుందన్నది ఆయనగారి వ్యూహం. ఆ మేరకు ఈ నెల 14వ తేదీ నుంచి నగరంలోని అన్ని మద్యం దుకాణాల వద్ద పాతనోట్లు చెల్లవని బోర్డులు పెట్టేశారు. విశాఖ, నగర శివారుల్లో కలిపి దాదాపు 110 మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. సగటున రోజుకి ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల విక్రయాలు జరుగుతుంటాయని అంచనా. వాస్తవానికి గత వారంరోజులుగా సరైన విక్రయాలు లేక రోజూవారీ ఆదాయం ఒకింత తగ్గింది. అయితే రోజూవారీ ఆదాయం పది కోట్లుపైగా చూపిస్తూ ఇప్పటికే భారీమొత్తంలో బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారని చెబుతున్నారు. బెల్టుబాబుతో సహా సిండికేట్ సభ్యులు దాచుకున్న మొత్తం సొమ్ము వైట్ చేసుకోలేకపోయినా.. కొంతలో కొంత మార్పిడి చేసుకునేందుకు ఇదే అవకాశంగా భావిస్తున్నారు. సహజంగానే బెల్టుబాబు అలియాస్ టీడీపీ ప్రజాప్రతినిధి దెబ్బకు.. వైన్‌షాపుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకోవడం తప్ప మిగిలిన వాటి జోలికిపోని ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు కూడా ఏమీ తెలియనట్లే నిద్ర నటిస్తున్నారు. -
మద్యంలో నీళ్లు...దుకాణాలు సీజ్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు. ఖానాపూర్లోని వెంకటసాయి వైన్స్‌తోపాటు తెర్లపాడ్, పెంబి గ్రామాల్లోని బెల్టు దుకాణాల్లో సోదాలు జరిపారు. మద్యంలో నీళ్లు కలిపి విక్రయిస్తున్నారని తమకు ఫిర్యాదు అందాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు 560 లిక్కర్, 161 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఆయా దుకాణాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
15 రోజుల్లోగా ఎత్తేయండి!
జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న బార్లు, వైన్‌షాపులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారులకు వంద మీటర్ల లోపు నెలకొల్పిన మద్యం విక్రయ కేంద్రాలను తొలగించే దిశగా ఎక్సైజ్ శాఖ అడుగులు వేస్తోంది. రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జాతీయ, రాష్ట్ర హైవేలపై ఏర్పాటు చేసిన బార్లతో పాటు మద్యం దుకాణాలను 15 రోజుల్లోగా తొలగించి, అదే ప్రాంతంలో హైవేలకు 100 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని నోటీసులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వైన్‌షాపులు, బార్లతో పాటు అన్ని జిల్లాల్లో ఈ మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు తాఖీదులు పంపించారు. దీంతో గత అక్టోబర్‌లోనే కొత్త లెసైన్సులు తీసుకొని మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన వారితో పాటు గత కొన్నేళ్లుగా రహదారులకు ఇరువైపులా బార్లు ఏర్పాటు చేసిన వారు కూడా ఎక్సైజ్ నోటీసులతో ఆందోళన చెందుతున్నారు. సుప్రీం కోర్టు కమిటీ ఆదేశాలు జాతీయ, రాష్ట్ర రహదారులకు వంద మీటర్ల లోపు మత్తు పానీయాల విక్రయాలు జరపకూడదని జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ చైర్మన్‌గా రోడ్‌సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నూతన ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేకుండా వెంటనే హైవేలలో మద్యం విక్రయాలపై నిషేధం విధించాలని, ఇప్పటికే ఏర్పాటైన దుకాణాలను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు గత నెలలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిస్తూ, తీసుకున్న చర్యలపై ఈ నెల 30వ తేదీలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. రహదారుల నిబంధనకు పక్క‘దారి’ జాతీయ, రాష్ట్ర రహదారులకు వంద మీటర్ల లోపు మద్యం అమ్మకాలు ఉండకూడదనే నిబంధన ఎక్సైజ్ పాలసీలో ఉంది. అయితే ఆయా రహదారులు గ్రామాలు, పట్టణాల మధ్య నుంచి వెళుతున్నప్పుడు మాత్రం అనుమతి ఇవ్వవచ్చనే ‘అనుకూలమైన’ సవరణ చేర్చుకున్న ఎక్సైజ్ శాఖ తదనుగుణంగా అనుమతులు ఇస్తూ వస్తోంది. పనిలో పనిగా ఊళ్లతో సంబంధం లేకుండా జాతీయ రహదారులపై బార్లు, మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. జూలైలో లేఖ రాసినా... సెప్టెంబర్‌లో కొత్త అనుమతులు హైవేలకు 100 మీటర్లలోపు మద్యం అమ్మకాలను నిషేధించి, దుకాణాలను తొలగించాలని జస్టిస్ కేఎస్ రాధాకష్ణన్ చైర్మన్‌గా ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సూచనలను ఆ కమిటీ కార్యదర్శి ఎస్.డి. బంగా గత జూలై 8న ట్రాన్స్‌పోర్టు జాయింట్ కమిషనర్‌కు లేఖ ద్వారా తెలిపారు. రాష్ట్రంలో 2,495.63 కిలోమీటర్ల మేర 13 జాతీయ రహదారులు ఉండగా, పది జిల్లాల్లో 2,023 కి. మీ. మేర 17 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు గాను 500కు పైగా హైవేలపైనే ఉన్నాయి. బార్లు గత కొన్నేళ్లుగా రహదారులపైనే కొనసాగుతున్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీ కోసం వేచి చూడకుండా తక్షణమే హైవేలలో ఆల్కహాల్ విక్రయాలను రద్దు చేసి, సెప్టెంబర్ 30లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కమిటీ జూలైలో సర్కార్‌కు రాసిన లేఖలో ఆదేశించింది. అయితే సెప్టెంబర్ 30 నాటికి సుప్రీంకోర్టు కమిటీకి నివేదిక ఇవ్వకుండా, ఆ తేదీ నాటికి రాష్ట్రంలో 2015-17 సంవత్సరాల కోసం (రెండేళ్లు) కొత్తగా మద్యం దుకాణాలకు అనుమతిచ్చారు. దీంతో అక్టోబర్ 1 నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ ద్వారా వందలాది మద్యం దుకాణాలు హైవేలపై ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో రహదారులపై ఆల్కహాల్ విక్రయాల నిషేధానికి తీసుకున్న చర్యలపై ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కమిటీ కోరింది. గ్రేటర్ వ్యాపారుల ఆందోళన సుప్రీంకోర్టు నిబంధనల నేపథ్యంలో హైవేలపై ఉన్న మద్యం విక్రయ కేంద్రాలను 100 మీటర్ల దూరానికి తరలించాలన్న ఆదేశాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వ్యాపారులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఏడాదికి రూ. కోటీ ఎనిమిది లక్షలు లెసైన్సు ఫీజుగా చెల్లిస్తూ లక్షలాది రూపాయల అడ్వాన్సులు, అద్దెలు చెల్లించే వీరు ప్రత్యామ్నాయ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. -
అక్కడ మూత..ఇక్కడ మోత..
మందుబాబులతో కిటకిటలాడిన తాడేపల్లి రహదారులు గుంటూరు (తాడేపల్లి రూరల్) : విజయవాడలో మద్యం మరణాల నేపథ్యంలో మద్యం షాపులు మూతబడడంతో మంగళవారం తాడేపల్లి మద్యం షాపుల్లో మోత మోగింది. మద్యం బాబులతో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లు కిక్కిరిసిపోయాయి. రోడ్ల వెంబడి ఉన్న మద్యం దుకాణాల్లో కొనుగోలుదారులు బారులు తీరారు. బార్ షాపుల్లో మద్యం తాగేందుకు అనుమతి ఉన్నా, అక్కడ ఖాళీ లేక, వైన్‌షాపుల్లో కొంతమందికి అవకాశం ఉన్నా, అక్కడ స్థలం లేక మద్యం బాబులు రహదారులను, పంట పొలాలను, కృష్ణాతీరాన్ని బార్లుగా మార్చుకున్నారు. దీంతో రహదారులపై ప్రయాణించే వారికి అవస్థలు ఎదురయ్యాయి. ఇదిలా ఉంటే తాడేపల్లిలోని 1వ వార్డులో సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. విజయవాడ ఘటన నేపథ్యంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఉదయం 11 గంటల వరకు గస్తీ నిర్వహించారు. దీంతో మద్యం దొరక్క మందుబాబులు 1వ వార్డులోని పలు ప్రాంతాల్లో సారా కోసం పరుగులు తీశారు. ఇది గమనించి ఎక్సైజ్ శాఖ వారు గస్తీ నిర్వహించడంతో మందుబాబులు అక్కడనుంచి కూడా పలాయనం చిత్తగించారు. -
మామూళ్లు.. పరవళ్లు
జిల్లాలో నెలకు రూ. 110 కోట్ల మద్యం విక్రయాలు ఆమ్యామ్యాల రూపేణా రూ. 1.42 కోట్ల పంపకాలు ఎమ్మార్పీ ఉల్లంఘనతో వ్యాపారులకు రూ. 5 కోట్లకు పైగా అదనపు ఆదాయం అధికార పార్టీ సంపూర్ణ సహకారం విజయవాడ : జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. మామూళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. వందల సంఖ్యలో వైన్ షాపులు, ఎక్కువగా బార్లు ఉండడంతో నిత్యం కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది. ‘తిలాపాపం..తలా పిడికెడు’ చందంగా ఎక్సైజ్, పోలీసు శాఖలో కానిస్టేబుల్ మొదలుకొని ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరు నెలవారీ మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్‌కు రూ. 71.49 లక్షలు, పోలీసు శాఖకు రూ. 71.40 లక్షలు నెలవారీ వ్యాపారులు సమర్పించుకుంటున్నారు. దీన్ని తిరిగి రాబట్టుకునే క్రమంలో ఎమ్మార్పీని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. నెలకు రూ. 5 కోట్లకు పైగా అదనపు ఆదాయాన్ని పొందుతూ మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు. దీనికి అధికార పార్టీ నేతలు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారు. జిల్లాలో కొత్తగా ప్రభుత్వ షాపుల స్థానంలో వచ్చినవాటితో కలిపి 343 వైన్ షాపులున్నాయి. 167 బార్లు ఉన్నాయి. నెలకు సగటున రూ.110 కోట్లకు పైనే మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. 70 శాతానికి పైగా వైన్ షాపులు, బార్లల్లో రోజుకు రూ. లక్షకుపైగా మద్యం విక్రయాలు ఉంటాయి. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. ఎక్కడా మద్యాన్ని ఎమ్మార్పీకి విక్రయించరు. సమయపాలన అస్సలు పాటించరు. వైన్ షాపుల్లో ఇష్టారాజ్యంగా లూజ్ సేల్స్ సాగిస్తున్నారు. పోలీసులు మొదలుకొని ఎక్సైజ్ శాఖ వరకు అప్పుడప్పుడు ఆధికార పార్టీ నేతలు చేప్పే ఖర్చులన్నీ లిక్కర్ వ్యాపారులే చూసుకోవడంతో అధికారులు పూర్తిగా వ్యాపారుల ఇష్టానికే వదిలేశారు. దీంతో అడ్డగోలుగా విక్రయాలు సాగిస్తున్నా నామమాత్రంగా కూడా వైన్ షాపులు, బార్లపై కేసులు నమోదుచేస్తున్న దాఖలాలు లేవు. మామూళ్లు ఇలా.. జిల్లాలో మామూళ్ల వ్యవహారం బహిరంగ రహస్యమే. నెలకు రూ 1.42 కోట్లకు పైగా వివిధ విభాగాల అధికారులకు అందుతాయి. ఒక్కో వైన్ షాపు నుంచి ఎక్సైజ్ స్టేషన్‌కు నెలకు రూ. 15 వేలు అందుతున్నాయి. గత ఏడాది వరకు ఇది రూ. 12 వేలే. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో మామూళ్లనూ పెంచారు. ఒక్కో బార్ నెలకు రూ. 12 వేలు ముట్టజెప్పాలి. ఇది కేవలం ఎక్సైజ్ శాఖ మామూలు మాత్రమే. ఇందులో ఎక్సైజ్ కానిస్టేబుల్ మొదలుకొని జిల్లా స్థాయి అధికారి వరకు అందరికీ వాటాలుంటాయనేది అందరికీ తెలిసిందే. వైన్ షాపు, బార్ నుంచి సంబంధిత లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్‌కు రూ. 14 వేలు మామూళ్లు అందుతాయి. ఇందులో కూడా కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు అందరికీ వాటాలుంటాయి. అప్పుడప్పుడు స్టేట్ టాస్క్‌ఫోర్స్ బృందానికి కూడా కొంత మొత్తం మామూళ్ల రూపేణా అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 3000కు పైగా బెల్ట్ షాపులు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బెల్ట్ షాృులు లేకుండా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీన్ని ఎక్సైజ్ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు కాని అమలు మాత్రం చేయడం లేదు. జిల్లాలోని గ్రామాల్లో ప్రతి వైన్ షాపునకు అనుబంధంగా సగటున 20 నుంచి 50 వరకు బెల్ట్ షాపులున్నాయి. నూజివీడు, తిరువూరు, మైలవరం, కైకలూరు. పెడన, నందిగామ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయి. వైన్ షాపుల్లో ఎమ్మార్పీ కంటే రూ. 10 అధికంగా విక్రయిస్తుంటే.. బెల్ట్ షాపుల్లో మాత్రం రూ. 20 నుంచి రూ. 30 వరకు అధిక ధరకు అమ్ముతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపుల విక్రేతలపై 418 కేసులు నమోదు చేశారు. -
మద్యం దుకాణాలకు నేడు రీ నోటిఫికేషన్!
హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో మిగిలిపోయిన 95 మద్యం దుకాణాలకు మంగళవారం రీ నోటిఫికేషన్ జారీచేసేందుకు ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 52, రంగారెడ్డి జిల్లా పరిధిలో 33, మెదక్ జిల్లా పరిధిలోని 10 దుకాణాలకు నోటిఫికేషన్ జారీ కానున్నట్లు తెలిసింది. ఈ దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 5 వరకు అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబరు 6న ఈ దుకాణాలకు డ్రా నిర్వహించనున్నా రు. తొలిదశలో ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ఈ దుకాణాలకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో రెండేళ్ల కాలపరిమితికి లెసైన్సు ఫీజు రూ.2.16 కోట్లుగా ఉండడం,దుకాణం ఏర్పాటుకు అవసరమైన వాణిజ్య స్థలం అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో వ్యాపారులెవరూ దరఖాస్తుచేసుకోని విషయం విదితమే.రెండోదశలోనూ ఎవరూ ముందుకురాని పక్షంలో ఆయా దుకాణాలను తెలంగాణా బేవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశాలున్నట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
రోడ్ల పక్కన వైన్ కేఫ్‌లు.. మాల్స్‌లో బార్లు!
-
రోడ్ల పక్కన వైన్ కేఫ్‌లు.. మాల్స్‌లో బార్లు!
రాష్ట్రంలో ఏపీ తరహా మద్యం పాలసీ? •నూతన ఎక్సైజ్ విధానంపై విస్తృత చర్చ •60 దుకాణాల నిర్వహణకు సర్కారు నిర్ణయం •పాలసీపై 3 రకాల ఆప్షన్లు సిద్ధం చేస్తున్న అధికారులు •జిల్లాలవారీగా డీసీలు, ఈఎస్‌లతో •ఎక్సైజ్ కమిషనర్ భేటీ •నేడు టీఎస్‌బీసీఎల్ అధికారులతో సమావేశం హైదరాబాద్: రోడ్ల పక్కన వైన్ కేఫ్‌లు... షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌లలో బార్లు, మద్యం షాపులు! అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కనిపించనున్న దృశ్యాలివే!! మహారాష్ట్రను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ‘అందరికీ అందుబాటులో మద్యం’ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి కార్పొరేషన్ల పరిధిలో వైన్ కేఫ్‌లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లలో బార్లు, వైన్ షాపులు ఏర్పాటు చేసే దిశగా కొత్త మద్యం విధానానికి మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాల్లో జనాభా, స్థానిక ఆర్థిక వనరులు, సామాజిక స్థితిగతులను బేరీజు వేసుకొని వైన్‌షాపులు పెంచాలని, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు హైవేలపై బార్లకు అనుమతులు ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలో అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానాన్ని రూపకల్పనపై ఎక్సైజ్ యంత్రాంగం గురువారం నుంచి కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగా మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఎక్సైజ్ అధికారులు అక్కడి విధానాలపై మేలోనే ఎక్సైజ్ కమిషనర్‌కు నివేదికలు అందజేశారు. మహారాష్ట్రలో అమలవుతున్న మద్యం విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే జూన్‌లో సీఎం సూచనల మేరకు సమగ్ర విధానం రూపకల్పన కోసం మూడు నెలలు గడువు కోరిన అధికారులు ప్రస్తుతం అదే పనిలోపడ్డారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ జిల్లాల్లోని డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుతమున్న మద్యం దుకాణాలు, కొత్త వాటికిగల అవకాశాలు, వైన్ కేఫ్‌లు, మాల్స్‌లో బార్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న వైన్స్, బార్ల వివరాలను పరిశీలించారు. ఆయా జిల్లాల్లోని పట్టణాలు, మండలాలవారీగా కొత్తగా వైన్స్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై సమగ్ర నివేదికలు అందజేయాలని ఆదేశించారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వైన్ కేఫ్‌లు, మాల్స్‌లలో బార్లు ఏర్పాటు చేయించే బాధ్యతలను అధికారులకు అప్పగించినట్లు సమాచారం. శుక్రవారం టీఎస్‌బీసీఎల్ అధికారులతో చంద్రవదన్ సమావేశం కానున్నారు. గ్రామీణ స్థాయికి మద్యం మహారాష్ట్రలో మూడు రకాల మద్యం లెసైన్సులు మంజూరు చేస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఐఎంఎఫ్ఎల్, ఐఎంఎల్ మద్యంతోపాటు బీర్లు, వైన్, కంట్రీ లిక్కర్ అమ్మకాలకు అనుమతి ఉంది. తాలూకా స్థాయిల్లో ఐఎంఎల్తోపాటు బీర్లు, వైన్, కంట్రీలిక్కర్ అందుబాటులో ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయితీలు, ప్రధాన రోడ్ల పక్కన వైన్, బీర్లనే విక్రయిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో కూడా కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వైన్ కేఫ్‌లను ఏర్పాటు చేయాలని, ఇందులో వైన్, బీర్లనే విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం తమ ప్రతిపాదనల్లో పేర్కొంది. గ్రామాల్లో కంట్రీ లిక్కర్(చీప్ లిక్కర్)తోపాటు బీర్లు అందుబాటులో ఉండేలా పాలసీలో మార్పులు చేయాలని, రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులు, బార్లలో చీప్ లిక్కర్‌ను 90 ఎంఎల్,180 ఎంఎల్ సీసాల ద్వారా విక్రయించాలని సూచించింది. సర్కారీ షాపులు 60కిపైగానే.. కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో కుమ్ముక్కయిన మద్యం వ్యాపారులు కొన్ని చోట్ల వైన్‌షాపులు ఏర్పాటు చేయకుండా అడ్డుపడుతున్నారని కమిషనర్ చంద్రవదన్ భావిస్తున్నారు. ఇటీవల వైన్‌షాపుల లెసైన్స్‌లను మూడు నెలలు పొడిగించగా 60 షాపుల వాళ్లు లెసైన్సులను రెన్యూవల్ చేయించుకోలేదు. దానికితోడు గ్రేటర్ హైదరాబాద్, దాని సరిహద్దుకు 5 కి.మీ. పరిధిలోని పెరిఫెరల్ ఏరియాల్లో వైన్‌షాపుల లెసైన్స్ ఫీజు రూ. 90 లక్షలు ఉండగా 103 దుకాణాలను ఎవరూ తీసుకోలేదు. ఇది కూడా వైన్‌షాపుల యజమానులు, ఎక్సైజ్ స్థానిక అధికారుల కుమ్ముక్కు ఫలితమేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఎక్సైజ్ పాలసీలో కనీసం 60 దుకాణాలను బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. -
ఆదాయం కిక్కు..లక్కు ఎవరికి దక్కు
- దరఖాస్తుల ద్వారానే రూ.24 కోట్ల ఆదాయం - జిల్లాలో 294 వైన్ షాపులకు 6,995 టెండర్లు - నగరంలో 8 షాపులకు సింగిల్ దరఖాస్తులు - పెదఆవుటపల్లి షాపునకు అత్యధికంగా 162 - నేడు లాటరీ ద్వారా ఎంపిక సాక్షి, విజయవాడ : ఒకటి కాదు.. రెండు కాదు.. 294 వైన్‌షాపులకు ఏకంగా 6,995 దరఖాస్తులు. రూపాయి కాదు.. రెండు రూపాయలు కాదు.. ఏకంగా రూ.24కోట్లు. అది కూడా కేవలం దరఖాస్తుల స్వీకరణ ద్వారానే. దీంతో జిల్లాలో ఎక్సైజ్ శాఖకు మద్యం ఆదాయం ‘ఫుల్లుగా’ సమకూరింది. మద్యం లాటరీ ప్రక్రియ, షాపుల కేటాయింపులు జరగక ముందే ఇంత ఆదాయం వస్తే.. మొత్తం ప్రక్రియ పూర్తయితే ఎంత వస్తుందోనని అధికారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 150 శాతం అధిక ఆదాయం జిల్లాలోని 294 వైన్‌షాపుల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. బందరులోని కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో ఈ షాపులకు 6,995 దరఖాస్తులు అందాయి. వీటి విక్రయం ద్వారానే రూ.24కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఇది దాదాపు 150 శాతం అధికం. గత ఏడాది రూ.9.20 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. నేడు షాపుల కేటాయింపు జిల్లాలో 335 వైన్‌షాపులు ఉండగా, 33 షాపులను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని నిర్ణయించింది. మిగిలిన 302 షాపులకు గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, 302లో 294 షాపులకు మాత్రమే దరఖాస్తులు అందాయి. మిగిలిన ఎనిమిది షాపులకు ఒక్క దరఖాస్తు కూడా అందలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత మళ్లీ ఎనిమిది షాపులకు గజిట్ విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మచిలీపట్నంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ నిర్వహిస్తారు. పాసులు ఉన్న వారిని మాత్రమే కలెక్టరేట్‌లోకి అనుమతిస్తారు. తొలుత సింగిల్ దరఖాస్తులు వచ్చిన షాపులను పరిశీలించి వారికి లెసైన్స్‌లు కేటాయిస్తారు. ఆ తర్వాత గజిట్లో సీరియల్ నంబర్‌కు అనుగుణంగా లాటరీ ప్రక్రియ నిర్వహిస్తారు. 29 సింగిల్ దరఖాస్తులు నగరంలో ఎక్సైజ్ వ్యాపారులు సిండికేట్ అయి ఎక్కువ దరఖాస్తులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో నగరంలోని ఎనిమిది షాపులకు సింగిల్ దరఖాస్తులే అందాయి. ఉయ్యూరులో మూడు, గుడ్లవల్లేరులో రెండు, సుల్తాన్బాద్లో రెండు షాపులకు సింగిల్ దరఖాస్తు రావటంతో వాటికి లాటరీ లేకుండా వారికే కేటాయించనున్నారు. అలాగే, 29 వైన్ షాపులకు సింగిల్ దరఖాస్తులే రావటంతో వారికి కూడా లాటరీ లేకుండానే కేటాయించనున్నారు. పెదఆవుటపల్లి షాపునకు డిమాండ్ ఈ ఏడాది అత్యధికంగా పెదఆవుటపల్లి షాపునకు భారీగా దరఖాస్తులు అందాయి. గన్నవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఈ షాపునకు సమీపంలో జాతీయ రహదారి, ఎక్కువ రెస్టారెంట్లు, దాబాలు ఉండటంతో ఇక్కడ విక్రయాలు భారీగా సాగుతుంటాయి. దీంతో 162 మంది షాపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎక్సైజ్‌శాఖ ఇన్చార్జి డెప్యూటీ కమిషనర్ బాజ్జీరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ సోమవారం లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, మంగళవారం నుంచి కొత్త లెసైన్స్‌ల కాలపరిమితి మొదలవుతుందని చెప్పారు. లాటరీ షాపు దక్కించుకున్న వారు దానికి అనుగుణంగా లెసైన్స్ ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు. -
మద్యం షాపులకు దేవుడి పేర్లు?
అక్షర తూణీరం నూతన మద్యం పాలసీ. కాదు. మద్యం నూతన పాలసీ. ఇక్కడ మద్యం నూతనం కాదు, పాలసీ మాత్రమే నూతనం. అసలామాటకొస్తే నూతన మద్యానికి గిరాకీ ఉండదు. మాగిన మద్యానికే పరువుప్రతిష్టలు ఎక్కువ. పాలసీ సారాంశం ఏమిటంటే, అదనంగా మూడువేల కోట్లు మద్యం మీద పిండాలని, దేవుళ్ల పేర్లు మద్యం షాపులకు పెట్టరాదని సూచించారు. ఇదేమీ నిలవదు. దేవుడు ఒక నమ్మకం, ఒక విశ్వాసం. దాని మీద ఆంక్షలా? లిక్కర్ పాట దక్కిన వాళ్లు తిరుపతి, శ్రీశైలం వెళ్లి మొక్కులు చెల్లించి వస్తుంటారు. దేవుడికి మొక్కులుగా సీసాలు చెల్లించకపోవచ్చు. అయినా తప్పులేదు. కంపెనీల వారు తమ కార్లనీ, బైకుల్నీ స్వామికి సమర్పించడం లేదా? మాంసం దుకాణానికి అభిమానంగా గాంధీ పేరు పెట్టుకొనేవారు, భక్తిగా కనకదుర్గ పేరు పెట్టుకొనేవారుంటారు. నేనిక్కడ ధర్మవ్యాధుడి కథ గుర్తు చేస్తున్నాను. అసలిది కోర్టుకు వెళితే నిలవదు. దేవుడి దయవల్ల షాపు తనకు దక్కిందనీ, దేవుడి దయవల్లే అమ్మకాలు బాగున్నాయనీ సదరు భక్త యజమాని విశ్వసిస్తాడు. వ్యక్తిగత విశ్వాసాలకు, నమ్మకాలకు నిషేధాజ్ఞలు జారీ చేసే హక్కు ఏ రాజ్యాంగానికీ ఉండదు. అసలు దేవుడున్నాడా, లేడా అనే అంశం మీద ఏ సందర్భంలోనైనా, ఏ న్యాయస్థానమైనా తీర్పు ఇచ్చిందా? అసలెవరైనా ఈ ధర్మ సంకటం మీద కనీసం పిల్ అయినా వేశారా? వెయ్యాలి. నాస్తికులూ, హేతువాదులూ అయినా వెయ్యొచ్చు. తటస్థులూ, పిడివాదులూ అయినా పడేయచ్చు. ఆస్తికుల్ని, దేవాదాయ శాఖని ప్రతిపక్షుల్ని చెయ్యాలి. స్వామీజీలూ, పీఠాధిపతులూ తమని పార్టీలుగా చేర్చాలని ముందుకు వస్తారు. ఇక ఆ క్షీరసాగర మథనంలో ఏమేమి వస్తాయో పైవాడికెరుక. అసలొక తీర్పు, తీర్మానం చేతిలో ఉంటే ఆ తర్వాత ఎవరిష్టం వారిది. దాన్ని ఆమోదిస్తామా, అమలు చేస్తామా అనేది ‘సెక్షన్ -8’ లాగా వారిష్టం వారిది. బీరకాయలు తెమ్మంటే, బీరుకాయలు తెచ్చారేంటని భార్య నిగ్గదీస్తే ‘‘నాకట్టా వినిపించింది. శ్రేష్టంగా కనిపించింది.’’ అని భర్త గోముగా జవాబు. కొత్త పాలసీలో మెగా మాల్స్‌లో బీరు అమ్మకాలకు షట్టర్లు ఎత్తారు. పాలకులాగే టెట్రాప్యాక్‌లను పరిచయం చేస్తున్నారు. సెల్ఫోన్లో సింగిల్ బటన్ మీద మద్యం డెలివరీ సదుపాయం ఉండొచ్చు. ప్రసార మాధ్యమాల్లో బ్రాందీలు, విస్కీలు ప్రచారం చేయరాదని నిబంధన ఉంది. మనవాళ్లు దేశ ముదుర్లు కదా! అందుకనే అదే బ్రాండ్ మీద సోడాని తయారుచేసి, దాన్ని ప్రచారం చేస్తూ అసలుదాన్ని గుర్తు చేసి నోరూరిస్తారు. అవి ద్రవాలైతే, సోడాలు ఉపద్రవాలు. ప్రముఖ నటులు చిత్తూరు. వి నాగయ్య అడపా తడపా గొంతు తడుపుకునేవారు. ‘‘పుచ్చుకునేది నీళ్లతో పుచ్చుకోండి, సోడాతో వద్దండీ!’’ అని ఒక శ్రేయోభిలాషి సలహా ఇచ్చాడు. అందుకు నాగయ్య , ‘‘వద్దులే బాబూ! ఇప్పుడు సోడా చూసినపుడే నాలిక పీకుతోంది. అప్పుడు నీళ్లు చూసినపుడల్లా పీకుతుంది. అది మరీ ప్రమాదం’’ అన్నారట. నేచెప్పొచ్చేదేమంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. మద్యశాఖ ఉత్సాహంగా ఉంది. పుష్కరాలు వస్తున్నాయి కదా! పెద్దల్ని తలుచుకోవడం కాబట్టి, దుఃఖావేశం ఉంటుందిట. మర్చిపోవడానికి మోతాదు పెంచుకుంటారని పై శాఖ అంచనా వేస్తోంది. శుభం. - శ్రీరమణ (రచయత ప్రముఖ కథకుడు) -
ఏరులై పారనున్న మద్యం
రిటైల్ దుకాణాలకు అదనంగా మరో 34 ఆదాయమే లక్ష్యం..ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం నెల్లూరు(క్రైమ్) : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మద్యం మత్తులో ముంచెత్తి ఆదాయవనరులను పెంచుకునే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఉన్న మద్యం షాపులు, బెల్టుషాపులతో తమ కుటుంబాలు వీధినపడుతున్నాయని ఆందోళన చెందుతున్న ప్రజలకు ప్రభుత్వ తాజా నిర్ణయం పిడుగుపాటులా తయారైంది. జిల్లాలో 2014-15 ఆబ్కారీ సంవత్సరానికి 348 మద్యం దుకాణాలకుగాను 10 మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో అవి ప్రారంభానికి నోచుకోలేదు. 2015-16ఆబ్కారీ సంవత్సరానికి జిల్లాలో ఇప్పటికే ఉన్న 348 మద్యం దుకాణాలతో పాటు అదనంగా మరో 34 దుకాణాలు ప్రారంభం కానున్నాయి. 348 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా మద్యం వ్యాపారులకు కట్టబె ట్టడంతో పాటు ప్రభుత్వమే నేరుగా సుమారు 34 దుకాణాలను(మండల హెడ్‌క్వార్టర్స్, ప్రధానసెంటర్లలో) నిర్వహించనుంది. దీంతో వాడవాడలా మద్యం ఏరులై పారనుంది. ఆదాయమే పరమావది కాకుండా ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మద్యం విధానం ఉంటుందని ఓవైపు ప్రభుత్వం చెబుతున్నా తాజా నిర్ణయాలను బట్టిచూస్తే మందుబాబులచే ఫూటుగా మద్యం తాగించి తన ఖజానాను నింపుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులను నిర్మూలిస్తామని ప్రకటించింది. అందుకు తగ్గ మార్గదర్శకాలను సైతం జారీచేసి విసృ్తత దాడులు నిర్వహించాలని ఆబ్కారీ అధికారులను ఆదేశించింది. అయితే అవి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. అధికారులు మొక్కుబడిగా అడపాదడపా దాడులు నిర్వహించడమే తప్ప బెల్టుషాపులను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోయారు. మరోవైపు వీటిని నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు సైతం అలంకారప్రాయంగా మారాయి. ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. తాజాగా ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకే ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ గత అనుభవాల దృష్ట్యా ఆచరణలో ఎలా ఉంటుందో వేచిచూడాలి. -
మద్యం విక్రయిస్తే చెప్పు దెబ్బలే
- పాములపర్తి గ్రామ మహిళల తీర్మానం - ఎస్ఐకి తీర్మాన ప్రతి అందజేత వర్గల్: ఆబ్కారీ శాఖ అలసత్వం, పోలీసుల ఉదాసీనం వెరసి గ్రామాల్లో బెల్టు షాపులు పెరిగిపోవడంతో వాటి భరతం పట్టేందుకు నారీమణులు నడుం బిగించారు. వాటిని మూసి వేయించేందుకు నాలుగు రోజులుగా దుకాణాలపై దాడులు చేస్తున్నారు. అంతేకాదు షాపులు నిర్వహిస్తే బెల్టు తీస్తామని హెచ్చరిస్తున్నారు. దుకాణాల నిర్వాహకుడికి 50 చెప్పు దెబ్బలంటూ ఏకంగా తీర్మానం చేశారు. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని పోలీసులకు అందజేశారు. మండల పరిధిలోని పాములపర్తి గ్రామ మహిళలు బెల్టు షాపులకు వ్యతిరేకంగా నాలుగు రోజులుగా ఉద్యమ బాట పట్టారు. వాటిపై దాడి చేసి మద్యాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై బుధ, గురువారాల్లో ఆ శాఖ బెల్ట్ దుకాణాలపై దాడులు చేసి మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు. అయినా మహిళలు ఊరుకోకుండా బెల్టు షాపుల నిర్వహణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని తమ గ్రామానికి వచ్చిన పోలీసు అధికారులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మ్యాకల చంద్రకళ, ఎంపీటీసీ సభ్యురాలు స్వప్న రాజేష్ మాట్లాడుతూ గ్రామంలో ‘బెల్ట్’ దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తే 50 చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు తమకు సహకరించాలని గౌరారం ఎస్ఐ మధుసూదన్‌రెడ్డికి తీర్మాణ ప్రతిని అందజేసినట్లు తెలిపారు. -
బ్రాందీషాపు వద్దు
పి.గన్నవరం, మామిడికుదురు :ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులోని కనకాయలంకలో బ్రాందీషాపు ఏర్పాటుపై స్థానికులు ఆందోళనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామంలోని కాజ్వే వద్ద ఆదివారం గ్రామస్తులు ధర్నా చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని బ్రాందీ షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉంటేపి.గన్నవరం మండల పరిధి చాకలిపాలానికి చేరుకుని కనకాయలంక గ్రామం ఉంది. అక్కడ ధర్నా జరుగుతున్న సమయంలో కొందరు స్థానికులు దీని వెనుక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బ్రాందీ షాపు యజమానుల పాత్ర ఉందని ఆరోపిస్తూ వారు కూడా ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్నా చేస్తున్న రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెబుతుండగా ధర్నాలో పాల్గొన్న మహిళలపై కొందరు చేయి చేసుకోవడంతో వివాదం తీవ్రమైంది. దీంతో రెచ్చి పోయిన మహిళలు బ్రాందీషాపు ఏర్పాటు చేసేందుకు నిర్మిస్తున్న షెడ్డుపై దాడి చేశారు. స్థానికుడితో మహిళల వాగ్వివాదం మహిళల దాడితో షెడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న తాపీమేస్త్రీలు, కూలీలు పరారయ్యారు. ధర్నా చేస్తున్న మహిళలు, పురుషులు అక్కడ ఉన్న సెంట్రింగ్ కర్రలతో షెడ్డు గోడలు కూల్చివేశారు. పక్కనే ఉన్న చెక్క బడ్డీని ధ్వంసం చేసి, బడ్డీ చెక్కలకు, రేకులకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో స్థానికుడు చిట్టిబాబు మ హిళలతో వాగ్వివాదానికి దిగి, మహిళపై చేయిచేసుకోవడంతో గ్రామస్తులు అతడిపై దాడికి యత్నించారు. ఎస్సై శ్రీనివాస్ జోక్యం చేసుకుని చిట్టిబాబు ను అక్కడి నుంచి తప్పించారు. దీంతో చిట్టిబాబు క్షమాపణ చెప్పాలంటూ మహిళలు ధర్నాకు ఉపక్రమించారు. అయితే అదే సమయంలో చిట్టిబాబు మరోసారి సంఘటన స్థలానికి రాగా, మహిళలు అతడిని అడ్డుకున్నారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని అతడిని వేరొకచోటకి పంపారు. చిట్టిబాబుకు వత్తాసు పలుకుతున్నారంటూ మహిళలు ఎస్సై శ్రీనివాస్‌పై ధ్వజమెత్తారు. ఈ సమయంలో సంఘటన స్థలానికి చేరుకున్న పాలకొల్లు సీఐ ఎ.చంద్రశేఖర్ కలుగజేసుకుని మహిళలను శాంతింపజేశారు. అక్కడి నుంచి మళ్లీ ధర్నా ప్రదేశానికి వచ్చి గ్రామ సర్పంచ్ కడలి సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు వలవల నాగేశ్వరరావు సమక్షంలో సీఐ విచారణ జరిపారు. ఏర్పాటు యవద్దని తీర్మానం.. సర్పంచ్ కడలి సత్యనారాయణ మాట్లాడుతూ బ్రాందీషాపు పెట్టేందుకు వ్యా పారులు ముందుగా తనను సంప్రదిం చారని, గ్రామస్తులతో చర్చించి చెబుతానని చెప్పానన్నారు. తమ ప్రమే యం లేకుండానే విజయదశమి రోజున బడ్డీ పెట్టి అమ్మకాలు ప్రారంభించారన్నారు. బ్రాందీషాపు ఏర్పాటు చేయరాదంటూ గ్రామసభలో తీర్మానం చేశామన్నారు. ఆ కాపీలను కలెక్టర్, ఆర్డీఓ, రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ అధికారులకు పంపించామన్నారు. అయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో శనివారం పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును కలిసి సమస్యను విన్నవించామని చెప్పారు. రాత్రి వేళల్లో ఇబ్బందులు రాకుండా కనకాయలంక రావడానికి కాజ్వే ఒక్కటే మార్గమని, ఆ ప్రాంతంలో ఇప్పటికే రాత్రి సమయంలో తాగుబోతులు హల్చల్ చేస్తున్నారని మహిళలు వాపోయారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బ్రాందీ షాపు పెడితే మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ చంద్రశేఖర్ స్పందిస్తూ మీ ఆమోదం, మా అనుమతి లేకుండా ఇక్కడ బ్రాందీషాపు ఏర్పాటు చేసేందుకు అనుమతించేది లేదని చెప్పారు. మహిళపై దాడి చేసిన చిట్టిబాబుతో పాటు, షెడ్డు కూల్చిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆందోళనలో వందలాది మంది డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. -
అర లక్ష ఇస్తే...అంతా ఓకే ఇదీ నేతల వైన్ం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అధికారం అడ్డం పెట్టుకుని దండుకునే కార్యక్రమంలో కొందరు నేతలు నిమగ్నమయ్యారు. ముగ్గురు ప్రజాప్రతినిధులైతే నైతికమా, అనైతికమా అన్నది పక్కన పెట్టి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అనుకున్నది జరగని చోట తమ పవర్ చూపిస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులను ఉసిగొల్పి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. దీనికి మద్యం వ్యాపారస్తులతో జరుగుతున్న లోపాయికారీ ఒప్పందాలే ఉదాహరణ. బెల్ట్‌షాపులు మూసేస్తుండడం వల్ల తమ వ్యాపారాలు తగ్గిపోయాయని, మరోవైపు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే దాడులు నిర్వహిస్తుండడంతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని గగ్గోలు పెడుతున్న మద్యం వ్యాపారస్తులతో డీల్ కుదుర్చుకునే పనిలో పలువురు అధికార పార్టీ నేతలు బిజీగా ఉన్నారు. మధ్యవర్తుల జోక్యంతో రంగంలోకి దిగిన నేతలుఒప్పందాలు చేసుకుంటు న్నారు. ఒక్కొక్క లెసైన్స్ షాపు ప్రతి నెలా రూ.50 వేలు చొప్పున ఇస్తే ఆ షాపు పరిధిలో నాలుగు బెల్ట్‌షాపులు నడుపుకోవడానికి, ప్రతి బాటిల్‌పై రూ.5 నుంచి 10 అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పిస్తామని ఆఫర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల అం గీకారం కుదరడంతో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు జరగడమే కాకుండా బెల్ట్‌షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయన్న వాదనలు ఉన్నాయి. ఎక్కడైతే డిమాండ్ చేసినట్టు రూ.50 వేలు ఇవ్వడం లేదో ఆ షాపులపై అధికారులతో దాడులు చేయిస్తున్నట్టు తెలిసింది. అడిగినంతా ఇచ్చేందుకు ఆసక్తి చూపని చోట (బేరసారాలు కొలిక్కిరాని ఏరియా) దారికితెచ్చుకునే వ్యూహంలో భాగంగా వారికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. బెల్ట్షాపులన్ని మూసేయాలని, ఎంఆర్పీకి మించి విక్రయాలు చేస్తే చర్యలు తీసుకో వాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశిస్తున్నారు. అది కూడా హెచ్చరించినట్టు ఉండాలని పరోక్షంగా అధికారులకు సూచిస్తున్నారు. దీం తో తూచ తప్పకుండా అధికారులు దాడులకు ఉపక్రమించి హడావుడి చేస్తున్నారు. ఈక్రమంలోనే దారికి తెచ్చేలా రాయబేరాలను సాగిస్తున్నారని సమాచారం. సందట్లో సడేమియా...పట్టుబడుతున్న తెలుగు తమ్ముళ్లు నేతలు డీల్ కుదుర్చుకునే పనిలో నిమగ్నమవగా క్షేత్రస్థాయిలో ఉన్న తెలుగు తమ్ముళ్లు సందట్లో సడేమియాలా అనధికారంగా మద్యం రవా ణా చేస్తున్నారు. తమ పార్టీ నేతల షాపుల నుంచి కేసులను తీసుకుని అనధికార విక్రయాలు చేపడుతున్నారు. దొరకకుండా దర్జాగా వ్యాపా రం చేసుకుంటున్నారు. దొరికితే తమ నేతల సిఫారసులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పూసపా టిరేగ మండలం చల్లవానితోట పరిధిలో అదే జరిగింది. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు తమకు సమీపంలో ఉన్న టీడీపీ నేత వైన్‌షాపు నుంచి పెద్ద ఎత్తున మద్యం సీసాలు తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు. కానీ, వారి నుంచి పట్టుకున్న సీసాలు సొం తంగా తాగేందుకు తీసుకెళ్తున్నవే తప్ప విక్రయించడానికి కాదనే కోణంలో కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. అయితే, దీని లోగుట్టు సదరు ఎక్సైజ్ అధికారులకే ఎరుక. ఇక్కడొక చోటే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే తరహా తంతు నడుస్తోంది. -
ఉదయం 6 గంటలకే మద్యం!
నెల్లూరు: ఉదయాన్నే మెడికల్ షాపులు తెరవకపోయినా మద్యం షాపులు మాత్రం తెరుస్తున్నారు. పట్టణాలలోనే కాదు గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయం మద్యం అమ్మకాల నుంచే వస్తోంది. దాంతో ప్రభుత్వాలు కూడా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉదయం ఆరు గంటలకే మద్యం షాపులను తెరుస్తున్నారు. మందు బాబులకు మద్యం షాపులు ఉదయాన్నే తెరవడం బాగానే ఉంది. అయితే మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారట. అదీ వారి బాధ. ఇందుకు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. -
బార్లు వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి
-
ఒకటి రెండుసార్లు నేను కూడా కొన్నాను
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం హైవేలు, రోడ్డు ప్రమాదాల నివారణపై చర్చ జరిగింది. అలాగే జాతీయ రహదారులపై బార్లు వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకు వచ్చారు. వాహనాలు నడిపే డ్రైవర్లు కొందరు మద్యానికి బానిసలై వుండడంతో రాత్రిపూట హైవేలపై ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. బార్లు ఆకర్షించేలా ఉండటం వల్ల ....తాను కూడా ఒకటి, రెండుసార్లు మద్యం కొన్నానని విష్ణుకుమార్ రాజు అన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, బార్లను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యుల అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. హైవేలు, రోడ్డు ప్రమాదాల నివారణకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల్లో రోజూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని.. పలువురు సభ్యులు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఎ.సురేష్, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు, పి.విష్ణుకుమార్‌రాజు, రామారావు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు ఇదే విషయంపై వివరణ కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నామని.. భవిష్యత్‌లో మరింత దృష్టి పెడతామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. -
‘బార్’కోడ్ బాదుడు!
వైన్ షాపులు, బార్లలో బార్కోడ్ స్కానర్లు ఒక్కొక్కరూ రూ.80వేలు చెల్లించాల్సిందే.. జిల్లా వ్యాపారులపై రూ.3.50కోట్లకు పైగా భారం 31లోపు స్కానర్లు కొనకపోతే మద్యం సరఫరాకు బ్రేక్ ఆందోళనలో వ్యాపారులు గుడివాడ : మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుంది మద్యం వ్యాపారుల పరిస్థితి. తీవ్ర ఉత్కంఠ పోటీలో మద్యం షాపు దక్కించుకుని కాసుల వేట సాగించాలని ‘చుక్క’ల లోకంలో విహరిస్తున్న వారి ఆశలపై ఎక్సైజ్ శాఖ నీళ్లు చల్లుతోంది. ఇప్పటికే ఎమ్మార్పీకే విక్రయించాలని, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయొద్దని, పర్మిట్ రూముల కోసం అదనంగా రూ.2లక్షలు చెల్లించాలని ఆదేశించిన ఎక్సైజ్ శాఖ తాజాగా బార్కోడ్ స్కానర్ల పేరుతో మరోమారు బాదుడుకు తెరలేపింది. ఈ నెలాఖరులోపు అన్ని మద్యం షాపులు, బార్లలో బార్కోడ్ స్కోనర్లు ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఇందుకోసం రూ.80వేలు చొప్పున చెల్లించాలని స్పష్టంచేసింది. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే సరుకు సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. బార్కోడ్ స్కానర్లు ఏర్పాటుచేయని షాపులు, బార్లకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి మద్యం సరఫరాను నిలిపివేస్తామని చెబుతున్నారు. దీనిపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రయోజనం కోసం కాదని, ఏదో ఒక హార్డ్‌వేర్ కంపెనీకి లాభం చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. బార్ కోడ్ స్కానర్లు ఉంటేనే అమ్మకాలు జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 301 వైన్ షాపులు, 150కి పైగా బార్లు ఉన్నాయి. వీటిలో ‘హలో గ్రాఫిక్ ఎక్సైజ్ అడిసివ్ లేబుల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టం(హీల్) పేరుతో బార్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ప్రతి మద్యం బాటిల్‌పై ఉండే లేబుల్‌ను స్కాన్ చేసిన తర్వాతే విక్రయించాల్సి ఉంటుంది. ఇందుకోసం కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్కాన్ చేసిన ప్రతి బాటిల్‌కు వచ్చే ప్రింటెడ్ బిల్లును మద్యం వినియోగదారుడికి అందజేయాల్సి ఉంది. ఈ హీల్ స్కానర్‌ను ఎక్సైజ్ శాఖ నేరుగా కొనుగోలు చేసి అందిస్తుంది. ఇందుకోసం ప్రతి వైన్‌షాపు, బార్ లెసైన్సుదారులు రూ.80వేలను డీడీ రూపంలో ఎక్సైజ్ శాఖకు చెల్లించాలి. ఈ లెక్కన జిల్లాలోని మద్యం వ్యాపారులపై రూ.3.50 కోట్లకు పైగా భారం పడుతుంది. హీల్ మిషన్ వల్ల ఉపయోగాలు.. ప్రతి బాటిల్‌ను బార్కోడ్ స్కానర్‌తో స్కాన్ చేయటం వల్ల ఎప్పుడు తయారు చేశారు. ఎక్కడ చేశారు. బ్యాచ్ నంబర్, ఎంఆర్పీ తదితర పూర్తి వివరాలు బిల్లులో వస్తాయి. ఎవరైనా మద్యం తాగి అస్వస్థతకు గురై మరణిస్తే అతను తాగిన బాటిల్ స్కాన్ చేస్తే చాలు. దాని బ్యాచ్ నంబర్ సహా మొత్తం వివరాలు వెలుగులోకి వస్తాయి. ఏ షాపులో విక్రయించారనే విషయం కూడా తెలుస్తుంది. బెల్టు షాపుల్లో పట్టుబడిన బాటిల్స్ ఏ షాపు నుంచి సరఫరా చేశారనే విషయం తెలుస్తుంది. షాపుల్లో ఏయే బ్రాండ్ ఎంత అమ్మకాలు జరిగాయి. ఎంత స్టాకు ఉంది.. అనే వివరాలు తెలుసుకోవచ్చు. -
గ్రేటర్లో మరిన్ని కొత్త బార్లు!
* తెలంగాణలో మొత్తం బార్ల సంఖ్య 726 * గ్రేటర్ పరిధిలోనే 350కిపైగా బార్ లెసైన్స్‌లు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లోని మద్యం ప్రియులకు ఇది శుభవార్తే! వైన్‌షాపుల ముందు రోడ్లపై నిలబడి హడావుడిగా కాకుండా నిమ్మలంగా కూర్చొని తాగేందుకు కొత్తగా మరిన్ని బార్లకు లెసైన్స్‌లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 726 బార్లు ఉంటే, అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 350కిపైగా బార్ లెసైన్సులు ఉన్నాయి. రాజధానిలో ఉన్న డిమాండ్, 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని మరిన్ని బార్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాల్లో మాత్రం బార్ల సంఖ్యను పెంచరాదని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రాష్ట్రంలో కొత్త సర్కార్ మద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్న అపవాదు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మీనా, కమిషనర్ నదీం అహ్మద్ తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విమర్శలకు తావులేని బార్ పాలసీని ప్రకటించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. దీంతో గురు, శుక్రవారాల్లో అధికారికంగా పాలసీని ప్రకటిస్తూ జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. జూలై ఒకటి నుంచి కొత్త పాలసీ అమలు ఈనెలాఖరుతో ప్రస్తుతమున్న ఎక్సైజ్ పాలసీ గడువు ముగుస్తున్నందున జూలై ఒకటి నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తేవలసి ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో ఇప్పటికే గత 14న రిటైల్ అమ్మకాల కోసం మద్యం పాలసీ తీసుకొచ్చి, డ్రా పద్ధతిలో వైన్‌షాపుల కేటాయింపు కూడా పూర్తి చేశారు. ఇక నూతన బార్ పాలసీ రావలసి ఉన్నా, సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు బుధవారం రాత్రి సీఎంతో ఎక్సైజ్ మంత్రి, అధికారులు సమావేశమై నూతన పాలసీకి ఆమోద ముద్ర వేయించుకున్నారు. యథాతథంగా లెసైన్స్ ఫీజు తెలంగాణకు కొత్త బార్ పాలసీ తీసుకువస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న లెసైన్స్ ఫీజులను పెంచకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అధికార యంత్రాంగం కూడా లెసైన్స్ ఫీజును పెంచడం వల్ల వైన్‌షాపుల తరహాలోనే బార్లను తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకురారని ప్రభుత్వానికి వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బార్ల లెసైన్స్ ఫీజు ఉన్నట్టుగానే నాలుగు స్లాబుల్లో కొనసాగించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్టు సమాచారం. కాగా లెసైన్స్ ఫీజు కన్నా 6 రెట్ల విలువైన మద్యాన్ని బార్లలో ఎలాంటి ప్రివిలేజ్ ఫీజు లేకుండా అమ్మవచ్చు. ఆరు రెట్లు దాటితే 9 శాతం నుంచి 16 శాతం వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. గ్రేటర్లో 16 శాతం ప్రివిలేజ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఓ బార్ యజమాని ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాల్లో డిమాండ్ ఉన్నా... రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం మినహాయిస్తే ఎక్కువ శాతం బార్లు పెద్ద మునిసిపాలిటీల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక మునిసిపాలిటీల్లో బార్ల కోసం డిమాండ్ ఉంది. అయితే కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బార్లకు గేట్లు తీసిందన్న అపవాదు వస్తుందన్న కారణంగా జిల్లాల్లో కొత్తగా బార్ లెసైన్స్‌లు ఇవ్వరాదని నిర ్ణయించినట్లు సమాచారం. బుధవారం సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. 170 వైన్‌షాపులపై కమిషనర్ నదీం అహ్మద్ ఆరా! వైన్‌షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్ నదీం అహ్మద్ బుధవారం అన్ని జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. గతంతో పోలిస్తే వైన్‌షాపులకు మంచి డిమాండ్ వచ్చినప్పటికీ, 170 దుకాణాలను ఎవరూ తీసుకోకపోవడానికి గల కారణాలపై చర్చించారు. ఎక్కడైనా వ్యాపారులు సిండికేటై షాపులకు దరఖాస్తులు రాకుండా చేశారా అన్న కోణంలో కూడా కమిషనర్ వివరాలు రాబట్టినట్లు తెలిసింది. దరఖాస్తుల ద్వారా రూ. 50 కోట్లు, తొలివిడత లెసైన్స్ ఫీజు రూపంలో దాదాపు రూ. 300 కోట్లు ఆదాయంగా సమకూరింది. కాగా, దరఖాస్తులు రాని దుకాణాలకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలని కమిషనర్ నిర్ణయించినట్లు సమాచారం. అదనపు కమిషనర్ వెంకటస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
‘దుకాణం’ దక్కేదెవరికో..?
- నేడు వైన్‌షాపులకు లక్కీడ్రా - 127 దుకాణాలకు 993 దరఖాస్తులు - మూడింటికి నిల్.. భారీగా తగ్గిన టెండర్లు నిజామాబాద్ క్రైం: అదృష్టం ఎవరిని వరిస్తుందో.. కొన్నిగంట ల్లో తేలనుంది. జిల్లాలోని మద్యం దుకాణాలకు సంబంధించిన లక్కీడ్రాను సోమవారం నిర్వహిం చనున్నారు. ఇందుకు జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 127 దుకాణాలకు 993 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో గల 93దుకాణాల్లో మూడు దుకాణాలు మినహ 90దుకాణాలకు 721దరఖాస్తులు వచ్చాయి. కోటగిరి, ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి, వార్డు నం.10 దుకాణాలకు టెండర్లు రాలేదు. కామారెడ్డి ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని 37దుకాణాలకు గానూ అన్నింటికీ దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ నగర శివారు బోర్గాం(పి) మద్యం దుకాణం కోసం 28 దరఖాస్తులు, డిచ్పల్లి మండలం ఇందల్వాయి వైన్‌షాపునకు 34దరఖాస్తులు రావడం గమనార్హం. ఈసారి కూడా మహిళలు టెండర్లలో పాల్గొన్నారు. చివర్లో పెరిగిన దరఖాస్తులు మద్యం షాపులకు అధికారులు టెండర్లు ఆహ్వానించిన తర్వాత మొదటి మూడురోజులు అంతంత మాత్రంగానే వచ్చాయి. చివరి రెండురోజులు మాత్రం వ్యాపారులతో ఎక్సైజ్ ఈఎస్ కార్యాలయం కిటకిటలాడింది. చివరిరోజైన శనివారం సాయంత్రం ఐదుగంటల లోపు కార్యాలయంలోకి వచ్చి, టెండర్ఫారం చూపినవారికి అధికారులు టోకన్లు ఇచ్చారు. అనంతరం వచ్చిన వారిని అనుమతించలేదు. దరఖాస్తులు స్వీకరించిన అధికారులు అవి సక్రమంగా ఉన్నాయా.. లేదా పరిశీలించాకే టెండర్బాక్స్లో వేయనిచ్చారు. ఈ ప్రక్రియ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. భారీగా తగ్గుదల జిల్లాలో 2014-15 సంవత్సరానికి 127 దుకాణాలకు 993 దరఖాస్తులు వచ్చాయి. 2012లో జరిగిన టెండర్లతో పోల్చితే ఈసారి భారీగా తగ్గాయి. అప్పుడు 142 మద్యం దుకాణాలకు టెండర్లు పిలువగాా, 17షాపులు మినహా.. 125దుకాణాలకు 1,538 దరఖాస్తులు వచ్చాయి. గత టెండర్లతో పోల్చితే ఈసారి 545 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. 2012లో 17దుకాణాలకు టెండర్లు రాకపోగా.. ఈఏడాది మూడింటికి టెండర్లు రాలేదు. ఈ దుకాణాలు లాభసాటిగా లేవన్న కారణంగానే టెండర్లు వేసేందుకు ఎవరు ఆసక్తి చూపలేదు. గతంలో ఇవే దుకాణాలకు దాదాపు 8సార్లు టెండర్లు పిలిచినా స్పందన రాలేదు. రెండున్నర కోట్ల ఆదాయం ఈ ఏడాది కేవలం దరఖాస్తుల రూపంలోనే ఎక్సైజ్‌శాఖకు దాదాపు రూ.రెండున్నర కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం 993 దరఖాస్తులకు ఒక్కో దరఖాస్తు రూ.25వేల చొప్పున అంటే రూ.2కోట్ల 48లక్షల 25వేల ఆదాయం వచ్చింది. డ్రా కోసం ఏర్పాట్లు పూర్తి జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఉదయం 11గంటలకు లాటరీ పద్ధతిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగారాం తెలిపారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టెండర్లకు డ్రా తీయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేయకుండా, లక్కీడ్రా ద్వారా దుకాణాలను కేటాయించటాన్ని నిరసిస్తూ పలు పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. టెండర్లను అడ్డుకునేందుకు టీడీపీ, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీల వారు ప్రయత్నాలు చేశాయి. టెండర్లు రద్దు చేయాలంటూ వేదిక వైపు దూసుకువచ్చారు. ఈసారి అలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. -
ప్రతి బాటిల్‌కు బిల్లు తప్పనిసరి
తెలంగాణకు నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. తొలుత మద్యం రిటైల్ ఔట్లెట్స్ (వైన్‌షాపులు)కు సంబంధించిన పాలసీని ప్రకటించింది. డ్రా పద్ధతి ద్వారానే కొత్త రాష్ట్రంలోని 2,216 వైన్‌షాపుల కేటాయింపు జరగనుంది. ఇక రిటైలర్ అమ్మే ప్రతి మద్యం సీసాకు కంప్యూటర్ బిల్లింగ్ తప్పనిసరి. మద్యం సీసాపై హోలోగ్రామ్‌తోపాటు2డీ బార్కోడ్ల ముద్రణ ఎంఆర్పీ కచ్చితంగా అమలయ్యేలా చర్యలు ప్రతి వైన్‌షాపులో కంప్యూటర్ బిల్లింగ్ తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దులకు నిర్ణయం పాత విధానం తరహాలో డ్రా పద్ధతి ద్వారానే వైన్‌షాపుల కేటాయింపు గ్రేటర్లో రూ.1.04 కోట్ల నుంచి రూ.90 లక్షలకు తగ్గిన లెసైన్సు ఫీజు వరంగల్, కరీంనగర్‌లలో మాత్రం రూ.4 లక్షల పెంపు త్వరలో బార్లు, కల్లు దుకాణాలపై విధాన ప్రకటన సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఎక్సైజ్ సంవత్సరం జూన్ 30తో ముగుస్తున్న నేపథ్యంలో తొలుత మద్యం రిటైల్ ఔట్లెట్స్ (వైన్‌షాపులు)కు సంబంధించిన పాలసీని ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్ణయించిన డ్రా పద్ధతి ద్వారానే కొత్త రాష్ట్రంలోని 2,216 వైన్‌షాపుల కేటాయింపు జరగనుంది. గ్రామాల నుంచి గ్రేటర్ హైదరాబాద్ వరకు జనాభా ఆధారంగా ఆరు స్లాబ్‌ల ద్వారా లెసైన్స్ ఫీజును నిర్ణయించి, మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో లెసైన్స్ ఫీజును రూ.1.04 కోట్ల నుంచి రూ.90 లక్షలకు తగ్గించింది. కరీంనగర్, వరంగల్ నగరాల్లో మాత్రం ప్రస్తుతం ఉన్న ఫీజు కన్నా అదనంగా రూ.4 లక్షలకు పెంచింది. అలాగే లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లకు పైగా అమ్మకాలు సాగితే ప్రస్తుతం వసూలు చేస్తున్న 14.01 శాతం ప్రివిలేజ్ ట్యాక్స్‌ను 13.6 శాతానికి తగ్గించింది. కొత్తగా మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్‌తో పాటు 2డీ బార్ కోడ్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా రిటైలర్ అమ్మే ప్రతి మద్యం సీసాకు కంప్యూటర్ బిల్లింగ్ తప్పనిసరి చేశారు. ప్రతి వైన్‌షాపులో కంప్యూటర్, స్కానర్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటో తేదీ నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చే విధంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా జీవో (ఎంఎస్ నెంబర్ 2)ను విడుదల చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మద్యం విధానంపై తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. రూ.10,500 కోట్ల ఆదాయం! కొత్త మద్యం విధానం ద్వారా రాష్ట్రంలో రూ.10,500 కోట్ల వార్షికాదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌శాఖకు తెలంగాణలో రూ.9,481 కోట్ల ఆదాయం రాగా, ఆ మొత్తం సాధారణంగా పది శాతం పెరుగుతుంది. తెలంగాణలో 2,216 మద్యం దుకాణాలు ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన మద్యం విధానంలోని లెసైన్స్ ఫీజు, ప్రివిలేజ్ ట్యాక్స్ కారణంగా 292 షాపుల నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రెంటల్స్ రూపంలో రావాల్సిన రూ.1,080 కోట్లకు గాను రూ.931 కోట్లు మాత్రమే ఎక్సైజ్ శాఖకు వచ్చింది. ఈ లెక్కన రూ.250 కోట్ల మేర ఎక్సైజ్ శాఖ వార్షికాదాయాన్ని కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో తగ్గిన లెసైన్ ్స ఫీజు దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన విధానాన్నే కొనసాగిస్తూ నూతన ఎక్సైజ్ పాలసీని రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం.. జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసే రిటైల్ ఔట్లెట్ల విషయంలో మద్యం వ్యాపారులకు కొంత ఉపశమనాన్ని కల్పించింది. గ్రేటర్ పరిధిలోని 503 మద్యం దుకాణాలకుగాను ఎక్కడ షాపు ఏర్పాటు చేయాలన్నా.. లెసైన్సు ఫీజును రూ.1.04 కోట్లుగా నిర్ణయించారు. దీంతో 175 ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం తాజాగా గ్రేటర్లో లెసైన్స్ ఫీజును రూ.90 లక్షలకు తగ్గించింది. అయితే కరీంనగర్ నగరంలోని 22 దుకాణాలకు సంబంధించి ఇప్పటి వరకున్న రూ.46 లక్షల లెసైన్స్ ఫీజును రూ.50 లక్షలకు, వరంగల్ నగరంలోని 37 దుకాణాలకు ప్రస్తుతం ఉన్న రూ.64 లక్షల ఫీజును రూ.68 లక్షలకు పెంచారు. ప్రివిలేజ్ ట్యాక్స్‌లో కొంత ఊరట 2012లో రూపొందించిన ఎక్సైజ్ విధానం ప్రకారం.. లెసైన్స్ ఫీజుకు 6 రెట్ల కన్నా అధికంగా జరిగిన మద్యం అమ్మకాలపై 15.01 శాతం మేర ప్రివిలేజ్ ట్యాక్స్‌గా మద్యం వ్యాపారుల నుంచి వసూలు చేసేలా నిబంధనలున్నాయి. దీనిపై మద్యం వ్యాపారుల నుంచి వ్యతిరేకత రావడంతో స్వల్ప సవరణలు చేశారు. లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్ల కన్నా అధికంగా అమ్మకాలు జరిపితే ప్రివిలేజ్ ట్యాక్స్‌ను 14.01 శాతంగా మారుస్తూ 2013లో నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కొత్త పాలసీలో దాన్ని కూడా తగ్గించి 13.06 శాతంగా నిర్ణయించారు. తద్వారా గతంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు ముందుకురాని ప్రాంతాల్లో కూడా దుకాణాలు తెరవవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. బార్ కోడ్లు... ఎప్పటికప్పుడు దాడులు కొత్త మద్యం విధానంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో మద్యం బాటిళ్లపై బార్కోడ్ల ముద్రణ, అమ్మకాలపై బిల్లింగ్ తప్పనిసరి చేయడం. ఈ మేరకు డిస్టిలరీల్లో తయారయ్యే మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్‌తో పాటు 2డీ బార్‌కోడ్‌లను ఏర్పాటు చేస్తారు. తద్వారా డిస్టిలరీల నుంచి మద్యం డిపోలకు, అక్కడి నుంచి దుకాణాలకు, కొనుగోలుదారుల వద్దకు వెళ్లే బాటిళ్లకు సంబంధించి ట్రాకింగ్ రికార్డు అవుతుంది. కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేసే మద్యం వ్యాపారులు తప్పనిసరిగా కంప్యూటర్, స్కానర్ దుకాణంలో ఏర్పాటు చేసి, అమ్మకం సాగించే ప్రతి బాటిల్‌కు బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా రిటైలర్ ఎంఆర్పీ రేటు కన్నా అధికంగా మద్యం అమ్మే అవకాశం ఉండదని మంత్రి పద్మారావు, ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీమ్ విలేకరులకు తెలిపారు. ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వమే తొలిసారిగా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఎంఆర్పీ ఉల్లంఘనలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై కూడా ఇక నుంచి కఠిన చర్యలు ఉంటాయని, తొలిసారి ఉల్లంఘనలు నమోదైతే రూ.20వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా, రెండోసారైతే రూ.2లక్షల జరిమానా విధించి, మూడోసారి పునరావృతమైతే లెసైన్స్ రద్దు చేయనున్నట్లు తెలిపారు. కల్లు దుకాణాలపై విధివిధానాలు రూపొందిస్తున్నాం హైదరాబాద్‌లో 2004లో మూసేసిన కల్లు దుకాణాలు తెరిపించాలని గత కొన్నేళ్లుగా గీత కార్మికులు కోరుతున్నారని, దీనిపై కేసీఆర్ పలుమార్లు హామీ ఇవ్వడంతో పాటు శుక్రవారం అసెంబ్లీలో కూడా స్పష్టత ఇచ్చారని మంత్రి పద్మారావు చెప్పారు. అయితే కల్లు దుకాణాలు ఎప్పుడు పునఃప్రారంభించేది.. ఏ విధానంలో దుకాణాల నిర్వహణ జరపాలన్న విషయంపై విధి విధానాలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నారని చెప్పారు. ఈ ఎక్సైజ్ పాలసీకి కల్లు దుకాణాలకు సంబంధం లేదని, ఇది పూర్తిగా వైన్‌షాపులకు సంబంధించిందేనని స్పష్టం చేశారు. బార్లకు సంబంధించిన ఎక్సైజ్ పాలసీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. బెల్ట్‌షాపులు తొలగించాం తెలంగాణలో ఎన్నికల ముందే 5 వేల బెల్టుషాపులను మూసివేయించడం జరిగిందని, ప్రస్తుతం ఎక్కడైనా ఉన్నా వాటిని కూడా లేకుండా చేస్తామని మంత్రి పద్మారావు, కమిషనర్ అహ్మద్ నదీం తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా మద్యం వ్యాపారులు అమ్మకాలు సాగించాల్సి ఉంటుందని, ఈ విషయంలో రెండో ఆలోచన లేదని స్పష్టంచేశారు. -
మద్యం సరఫరాకు బ్రేక్
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో మద్యం సరఫరా నిలిచిపోయింది. విభజన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిక్కర్ బేవరేజెస్‌ను విభజించి ఆదాయ వ్యయాలు, అప్పులు, ఇతర లెక్కలను చూసేందుకు మే 27వ తేదీ నుంచి 2వ తేదీ వరకు బేవరేజెస్ అధికారికంగా సెలవులు ప్రకటించారు. కానీ ఈ సెలవులు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెలవుల నేపథ్యంలో జిల్లాలో మద్యం కొరత తలెత్తకుండా ఎక్సైజ్ శాఖ, బేవరేజెస్ అధికారులు వైన్‌షాపులు, బార్లకు వారి నెలవారీ లెసైన్స్‌ల స్థాయిని బట్టి ముందే కేటాయించారు. ఈ కారణంగా జిల్లాలో మే నెల చివరిలో మద్యం విక్రయాలు భారీగా జరిగినట్లు తెలుస్తోంది. మూడు నెలలుగా అంతంతమాత్రంగా విక్రయాలు... జిల్లాలో 156 వైన్స్ షాపులు , 44 బార్లు, మూడు క్లబ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ.45 నుంచి రూ. 55 కోట్ల వరకు విక్రయాలు జరుగుతాయి. కానీ గడచిన మూడు నెలలుగా మాత్రం వ్యాపారం మాత్రం ఆశించిన రీతిలో జరుగలేదు. ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు, దాడులు నిర్వహించారు. దీంతో వ్యాపారులు భారీగా నిల్వలు చేసుకోకపోవడంతో ఆశించిన మే వ్యాపారం జరుగలేదు. కానీ మే నెలలో మాత్రం రూ.84.73 కోట్ల మేరకు విక్రయాలు జరిగాయి. సెలవులతో ఇబ్బంది... వేసవి సెలవులు కావడంతో మద్యం విక్రయాలు బాగుంటాయని ఆశించిన వ్యాపారులకు బేవరేజెస్ సెలవులు కొంత ఇబ్బందిగా మారాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల మద్యం కంపెనీల నుంచి వచ్చే మద్యానికి ఏపీ బేవరేజెస్ స్టిక్కర్ల ద్వారా విక్రయాలు జరిపేవారు. జాన్ 2న అపాయింటెడ్ డే కావటంతో రెండు రాష్ట్రాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రం విభజనకు ముందే బేవరేజెస్‌ను రెండు రాష్ట్రాలకు సమపద్ధతిలో కేటాయించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తం మే 28 నుంచి జూన్ 7వ తేదీ వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే బేవరేజెస్‌కు కొద్ది రోజుల పాటు మూసి వేయాలని నిర్ణయించి నిల్వ ఉన్న మద్యాన్ని పూర్తిస్థాయిలో విక్రయించారు. పది రోజుల పాటు జిల్లాలో మద్యం సరఫరా లేకపోవడంతో వైన్స్, బారుల్లో అనివార్యంగా కొరత ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాలో రోజుకు సగటున పదివేల కేసుల మద్యాన్ని విక్రయిస్తుంటారు. నెలాఖరు కావడం, లెసైన్స్ కాలపరిమితి ముగియనుండడంతో వైన్ షాపుల్లో 30 శాతానికి తక్కువగానే మద్యం నిల్వలు ఉన్నాయి. అలాగే ఈ పదిరోజుల్లో విక్రయాలకు గాను జిల్లాలో లక్ష కేసులు మద్యం అవసరం ఉంది. మద్యం డిపోల బంద్ ఇంకొన్ని రోజులు పెరిగే అవకాశం..? డిపోలకు ఈ నెల 2 తేదీన మద్యం వస్తుందని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా పది రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం బాటిళ్లపై వేసే సీల్, లేబుళ్లు, తెలంగాణ ప్రభుత్వ నూతన సీఎం సంతకం చేసిన తర్వాత బాటిల్‌కు వేయాల్సిన సీల్ మద్యం డిపోలకు వస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కనీసం 10 రోజుల సమయం పడుతుందని వైన్ షాపుల యజమానులు పేర్కొంటున్నారు. ఇదంతా జరిగితే జూన్ 15 వరకు మద్యం సరఫరాకు బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
మందు చూపు!
వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : మూకుమ్మడిగా ముంచుకొచ్చిన ఎన్నికల వేళ... జిల్లావ్యాప్తంగా మద్యాన్ని ప్రవహింపజేసేందుకు రాజకీయ నేతలు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మద్యం సరఫరాపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది. నిర్దేశించిన మేరకు మించి ఒక్క బాటిల్ ఎక్కువ అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఈ మేరకు నిర్దేశించిన కోటా పూర్తి కావడంతో నగరంతోపాటు డివిజన్ల పరిధిలోని పలు వైన్ షాపులు మూసి ఉంటున్నారుు. అరుుతే... ఇటువంటి పరిస్థితి వస్తుందని ఇదివరకే గ్రహించిన తలపండిన రాజకీయ నాయకులు ముందుచూపుతో వ్యవహరించారు. ప్రొహిబిషన్ అమలు సమయంలో పలువురు ఎక్సైజ్ అధికారుల అండతో విచ్చలవిడిగా మద్యం విక్రయూలు చేస్తూ... లిక్కర్‌డాన్‌గా పేరు గడించిన ఓ వ్యక్తి సహాయంతో దొంగచాటు మందు చూపు! తతంగానికి తెరతీశారు. పక్కా ప్రణాళికతో నగరం, శివారు ప్రాంతాల్లోకి భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ (ఎన్డీపీ) మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేశారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే... జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో 20 లారీల ఎన్డీపీ మద్యం నగరానికి చేరుకున్నట్లు తెలిసింది. లిక్కర్‌డాన్‌గా పేరొందిన ఓ వ్యక్తి సాయంతో దొంగచాటున తీసుకొచ్చి... అత్యంత రహస్య ప్రదేశంలో ఈ సరుకును నిల్వ చేసినట్లు సమాచారం. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఓ కేంద్ర స్థాయి నాయకుడి కనుసన్నల్లో లోడ్ల కొద్దీ చీప్ లిక్కర్‌ను డంప్ చేసినట్లు వినికిడి. సదరు నాయకుడికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగం నడిపిస్తున్నట్లు వినికిడి. చూసీచూడనట్లుగా ఎక్సైజ్ అధికారులు ఓ గోడౌన్లో ఎన్డీపీ మద్యాన్ని నిల్వ ఉంచినట్లు ఎక్సైజ్ అధికారులకు తెలి సినా... చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడికి త లొగ్గి వారు అటువైపుగా వెళ్లడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. అంతేకాదు... పలువురు ఎక్సైజ్ అధికారుల అండదండలతోనే రాజకీయ నాయకులు ఎన్డీపీ మద్యాన్ని దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు. ధరలకు రెక్కలు ఎన్నికల సమయం కావడంతో జిల్లావ్యాప్తంగా మద్యానికి డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటారుు. ఏసీబీ దాడులు జరిగిన నాటి నుంచి వ్యాపారులు ఎంఆర్పీ రేట్లకే మద్యం అమ్ముతున్నారు. తాజాగా... ఎన్నికల సాకుతో రేట్లను పెంచారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా రేట్లను పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. భలే గిరాకీ.. జిల్లావ్యాప్తంగా సుమారు 230 వరకు వైన్స్, బార్ షాపులు ఉన్నాయి. వైన్స్ దుకాణాలకు సంబంధించి లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లు, బార్లకు ఆరు రెట్ల మద్యం (ప్రివిలేజ్) కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రివిలేజ్ మద్యంపై యజమానులకు 20 శాతం లాభం సమకూరుతుంది. ఈ మొత్తం దాటిన తర్వాత వైన్స్, బార్ యజమానులు కొనుగోలు చేసి.. విక్రరుుంచే మద్యంపై ఆరు శాతం మాత్రమే లాభం ఉంటుంది. అరుుతే గత ఏడాది చాలా ప్రాంతాల్లో గిరాకీ లేకపోవడంతో ప్రివిలేజ్ మద్యం సరుకు విక్రరుుంచడమే గగనమైంది. దీంతో ఆ సరుకును పెద్ద షాపులకు తక్కువ పర్సెంటేజీకి అమ్ముకున్నారు. కానీ... ఇప్పుడు పరిస్థితి మారింది. ఎన్నికల రావడంతో మద్యానికి భలే గిరాకీ ఏర్పడింది. -
మందుబాబుల కోసం ‘సీసా’ మొబైల్ అప్లికేషన్!
కేరళ: స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అవసరం ఏదైనా ఇట్టే తీర్చేసే మొబైల్ అప్లికేషన్(ఆప్)లు ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. అయితే మందుబాబుల కోసం రూపొందించిన ‘కుప్పి’ అనే ఓ కొత్త మొబైల్ అప్లికేషన్ ఇప్పుడు కేరళలో సందడి చేస్తోంది. కుప్పి అంటే మళయాళంలో సీసా అని అర్థం. మళయాళంలో సమాచారం ఇచ్చే ఈ ఆప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు.. కేరళలో వైన్‌షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి? దగ్గరలోని షాపుల్లో ఏయే బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి? వంటి వివరాలను మందుబాబులు తెలుసుకోవచ్చు. ధరల పట్టిక కూడా ఎప్పటికప్పుడు ఈ అప్లికేషన్లో చూసుకోవచ్చు. అంతేకాదండోయ్.. మద్యపానానికి సంబంధించిన నీతివచనాలను కూడా ఈ అప్లికేషన్ మందుబాబులకు చెబుతుందట. ఈ ఆప్ సరదా కోసమేనని తాగుబోతులను ప్రోత్సహించేందుకు మాత్రం కాదని దీనిని రూపొందించిన ‘లియో సాఫ్ట్వేర్స్’ చెబుతున్నా.. ఇప్పటికే ఐదు లక్షల మంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారట. అన్నట్టూ.. దేశంలో ఆల్కహాల్ వినియోగంలో కేరళ రాష్ట్రమే నెంబర్ వన్ అట. కేరళలో ఒక్కో వ్యక్తి సగటున ఏడాదికి 8 లీటర్లకు పైగా ఆల్కహాల్ సేవిస్తారని, ఇది జాతీయ సగటుకు రెట్టింపు అని అంచనా. -
బెల్టు.. ‘బార్లా’
సాక్షి, కొత్తగూడెం: బెల్టు షాపులు బార్లను తలపిస్తున్నాయి. మారుమూల పల్లెల్లో సైతం కావాల్సిన బ్రాండ్ మద్యం అందుబాటులో ఉంటోంది. నూతన మద్యం విధానం ద్వారా బెల్టుషాపులు రద్దు చేయాల్సి ఉండగా ఎక్త్సెజ్ శాఖ మాత్రం మామూళ్ల ‘మత్తు’లో నిద్రపోతోందనే ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో బెల్టు షాపులున్నా ఈ శాఖ మాత్రం చూసీ చూడనట్లుగానే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీటి నిర్వాహకులు రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. నూతన మద్యం విధానం ద్వారా బెల్టు షాపులను రద్దు చేయాలని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ జిల్లాలో ఇదెక్కడా అమలుకాలేదు. బెల్టు షాపులు యథేచ్ఛగా నడుస్తుండడంతో బార్ల కన్నా నిత్యం ఈ షాపులే కిటకిటలాడుతున్నాయి. అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్పుతుండడంతో అటు వైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి తనిఖీల పేరుతో హల్చల్ చేసినా.. ఈ విషయం బెల్టు షాపు నిర్వాహకులకు ముందే తెలియడంతో దుకాణాలు మూస్తున్నారు. ఖమ్మం, వైరా, కొత్తగూడెం, మధిర, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరులోని బెల్టు షాపుల్లో.. కొన్ని మండల కేంద్రాల్లో ఉన్న దుకాణాల కన్నా ఎక్కువగా మద్యం విక్రయిస్తున్నారంటే ఈ వ్యాపారం ఏ మేరకు నడుస్తుందో ఊహించవచ్చు. అర్ధరాత్రి వరకు బెల్టు షాపులు నడుస్తున్నా పట్టించుకునే అధికారులు లేరు. అయితే మామూళ్లు పుచ్చుకుంటున్న అధికారులు రహస్యంగా బెల్టు షాపులు నడుపుకునేందుకు ఆయా నిర్వాహకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 153 మద్యం షాపులు, వీటికి అనుబంధంగా 147 పర్మిట్ రూంలకు అనుమతి ఉంది. ఇవికాక 44 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే బెల్టు వ్యాపారం బహిరంగంగా సాగుతున్నా అధికారులు నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవ ంబర్ నెలాఖరు వరకు జిల్లాలో 195 మంది బెల్టు షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడంతో కేసుల తర్వాత కూడా వారు మళ్లీ ఈ వ్యాపారం నిర్వహిస్తుండడం గమనార్హం. ఖమ్మం నగర శివారు ప్రాంతాలైన మల్లెమడుగు, రామన్నపేట, రామన్నపేట కాలనీ, దానవాయిగూడెం, కైకొండాయిగూడెం, బీసీ కాలనీ, రాపర్తినగర్, రమణగుట్ట, శ్రీనివాసనగర్, ప్రకాష్‌నగర్, వేణుగోపాల్‌నగర్.. ఇలా ప్రతి కాలనీలో బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి వీధిలో ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయంటే మద్యం అమ్మకాలు ఎంత విచ్చల విడిగా సాగుతున్నాయో తెలుస్తోంది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 200 పైగా బెల్టు షాపులున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఒక్కో మద్యం దుకాణం ఉండటంతో అక్కడినుంచి మండలంలోని బెల్టుషాపులకు యథేచ్ఛగా సర ఫరా అవుతోంది. పలు గ్రామాల్లో మద్యం దుకాణాలు నడుపుకునేందుకు అధికార పార్టీ నాయకులే వేలంపాట నిర్వహిస్తుండడం గమనార్హం. కొణిజర్ల, ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో బెల్టుషాపుల జోరు కొనసాగుతోంది. ఈ మండలాల్లో బెల్టుషాపులతో పాటు నాటుసారా తయారీ కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారు. గుడుంబా అమ్మకాలు సాగిస్తున్న వారిని, బెల్లం వ్యాపారులను అదుపులోకి తీసుకుంటున్న అధికారులు బెల్టుషాపులను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖమ్మం రూరల్ మండలంలో మూడు వైన్ షాపులున్నాయి. ఇందులో ఒకదానికి మాత్రమే సిట్టింగ్ అనుమతి ఉంది. మిగతా రెండు వైన్‌షాపుల పక్కనే ఉన్న హోటళ్లు బెల్టు షాపులుగా పనిచేస్తున్నాయి. పాలేరు దాబాల్లో మద్యం సిట్టింగులు జోరుగా సాగుతున్నాయి. కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లోనూ ప్రతి గ్రామంలో రెండు, మూడు బెల్ట్ షాపులున్నాయి. భద్రాచలం మండలంలో బెల్ట్‌షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. లూజ్ విక్రయాలు ఎక్కడా అమ్మకూడదన్న నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. వాజేడు మండలంలో గుమ్మడిదొడ్డి, పేరూరు, ప్రగళ్లపల్లి, అరుణాచలపురం, ఏడుజర్లపల్లి గ్రామాలలో అధికంగా బెల్టుషాపులు ఉన్నాయి. చర్ల మండలంలోని తేగడ, కలివేరు, సత్యనారాయణపురం, ఆర్.కొత్తగూడెం, కుదునూరు, మామిడిగూడెం, రాళ్లగూడెం గ్రామాల్లోని బెల్ట్ షాపులో మద్యం విక్రయాలు జోరుగు సాగుతున్నాయి. కొత్తగూడెం పట్టణంలోని రామవరం, నాగయ్యగడ్డ, పంజాబ్‌గడ్డ, మేషన్కాలనీ, వనందాస్గడ్డ, చిట్టిరామవరం, గరీబ్పేటతో పాటు మండలంలోని రేగళ్ల, మైలారం, బంగారుచెలక, సీతరాంపురం, సుజాతనగర్, రాఘవాపురం గ్రామాల్లో బెల్టు వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టణ శివార్లలోని బెల్టుషాపులను అర్ధరాత్రి వరకు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. మణుగూరు మండలం కూనవరం కాలనీలో ఏర్పాటు చేసిన బెల్టుషాపుల వల్ల ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బూర్గంపాడు మండలంలోని సారపాక, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అనేక బెల్టు షాపుల్లో 24 గంటలూ మద్యం దొరుకుతోంది. అశ్వాపురంతో పాటు మండలంలోని చింతిర్యాల క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బెల్టు షాపులదీ ఇదే పరిస్థితి. మధిర మండలంలోని సిరిపురం, రాయపట్నం, దెందుకూరు, ముదిగొండ మండలంలోని ముదిగొండ, వల్లభి, చిరుమర్రి, చింతకాని మండలంలో బెల్టుషాపులు ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయి. సిట్టింగ్‌లు బహిరంగంగా పెట్టినా ఎక్త్సెజ్ అధికారులు మాత్రం తనిఖీలు చేయడం లేదు. ఇల్లెందు పట్టణంలో 21, 24 ఏరియాలు, ఇందిరానగర్, ఆజాద్‌నగర్, సుభాష్‌నగర్, మండలంలోని కొమరారం, పోలారం, రొంపేడు, గార్ల మండలంలోని కిష్టారం, మద్దివంచ గ్రామాల్లో బెల్టు షాపులను అక్రమంగా నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి పట్టణ శివారులో ఎన్టీఆర్ నగర్, హనుమాన్‌నగర్, రాజీవ్కాలనీతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బెల్టుషాపులున్నాయి. కల్లూరు మండలంలో 102 బెల్టు షాపులున్నాయి. కల్లూరు మండల కేంద్రంలోని బెల్టు షాపుల్లో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటోంది. -
మామూలిచ్చి అమ్ముకోండి!
మంత్రిగారి బంధువుబంపర్ ఆఫర్ =ఇండెంట్ చెల్లించి పది శాతం ఎక్కువకు అమ్ముకోండి =మంత్రిగారి పేరిట వసూళ్లు కప్పం కట్టండి.. ఎక్కువకు అమ్ముకోండి.. ఇదీ జిల్లాలోని వైన్‌షాపులు, బార్ యజమానులకు మంత్రి గారి బంధువు నుంచి వచ్చిన బంపర్ ఆఫర్. ఇప్పటికే అందరికీ మామూళ్లు ఇస్తూనే వస్తున్నామని, ఇప్పుడు అమాత్యుడి పేరుతో అడిగితే తమకు ఇబ్బందేనని వాపోవడం నిర్వాహకుల వంతయింది.. ఇంతకీ ఆ కథేంటో తెలుసుకుందాం... సాక్షి, విజయవాడ : జిల్లాలోని వైన్‌షాపులు, బార్ యజమానులకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. అదేంటంటే రూ.40 వేలు కప్పం కడితే ఎంఆర్పీ కన్నా పది శాతం ఎక్కువకు అమ్ముకున్నా పట్టించుకోం అని. అయితే ఈ హామీ అబ్కారీ శాఖ నుంచి కాకుండా ఆ శాఖ అదనపు బాధ్యతలు చూస్తున్న మంత్రిగారి దగ్గర బంధువు నుంచి రావడం విశేషం. ఈ అంశంలో మంత్రి పుంగవుడు ఎక్కడా నేరుగా జోక్యం చేసుకోలేదు. ఆయనకు దగ్గర బంధువుగా సిండికేట్లతో పాటు అసోసియేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న నేత ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చినట్లు సమాచారం. త్వరలో ఎన్నికలు వస్తున్నాయి... అవసరాల కోసం మనం ఇవ్వడం మంచిదని ఆయన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వాన్‌పిక్ కేసులో అప్పటి అబ్కారీ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు కావడంతో మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథికి అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అసోసియేషన్ ముందుకు ప్రతిపాదన... జిల్లాలో 360 వరకూ వైన్‌షాపులు, బార్లు ఉన్నాయి. ఒక్కో షాపు నుంచి రూ.40 వేలు మంత్రికి నజరానాగా ఇవ్వాలని అసోసియేషన్ ముందుకు ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన తెచ్చింది కూడా మంత్రి బంధువే. ఈ బంధువే ఈ అసోసియేషన్‌లో కీలక బాధ్యత వహిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు జిల్లాలోని వైన్‌షాపుల నుంచి పెద్దగా అభ్యంతరాలు రాకపోయినా, బార్ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. వారికి లూజ్ అమ్మకాలు, ఎంఆర్పీ కన్నా ఎక్కువకు అమ్మకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అదే బార్ల విషయానికి వస్తే రేటు ఎంతకి అమ్మాలన్న నిబంధనలు లేవు. దీంతో వారు ఈ ఆఫర్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 60 నుంచి 70 షాపుల వారు సదరు నేతకు రూ.40 వేల చొప్పున చెల్లించారు. డబ్బులు చెల్లించిన వారి షాపులపై కూడా ఇటీవల ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. ఒకసారి కేసు నమోదై షాపు మూతపడితే మళ్లీ తెరుచుకోవడానికి కనీసం నెలరోజులు పడుతుంది. రాజధాని స్థాయి నుంచి మళ్లీ అనుమతులు రావాల్సి ఉండటం, ఇక్కడి నుంచి ప్రతిపాదనలు పంపడానికి చాలా సమయం పట్టడం దీనికి కారణం. దీనివల్ల ఆయా షాపులకు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల వరకు వ్యాపారంలో నష్టం వస్తోంది. షాపుల యజమానుల షరతు... డబ్బులు చెల్లించిన తర్వాత కూడా కేసులు రాస్తుండటంతో వారు అడ్డం తిరిగినట్లు సమాచారం. తమ జోలికి రాకుండా ఉంటేనే డబ్బులు ఇస్తామని మిగిలిన షాపుల వారు మొండికేస్తున్నట్లు సమాచారం. కనీసం నెలన్నర రోజులైనా ఎటువంటి దాడులూ జరగవని హామీ ఉంటే అడిగిన మొత్తం ఇస్తామని వైన్‌షాపుల యజమానులు షరతు పెట్టారు. దీంతో నాలుగురోజుల క్రితం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో కోపంగా ఉన్న సభ్యులు సమావేశానికి హాజరుకాలేదు. కేవ లం ఇద్దరు ముగ్గురు మాత్రమే రావడంతో మిగిలిన వారితో సదరు నేత ఫోన్లో సంప్రదింపులకు తెరతీసినట్లు తెలిసింది. ఇప్పటికే విజయవాడలోని బార్ యజమానులు చాలామంది అందరికీ మామూళ్లు ఇస్తూనే వస్తున్నామని, కొత్తగా మళ్లీ మంత్రిగారి పేరుతో అడిగితే తాము ఇచ్చేదిలేదని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. అసలు మంత్రిగారికి ఇస్తారో లేదో కూడా తమకు అనుమానాలున్నాయని, అందుకే ఇవ్వడానికి ఇష్టపడటం లేదని అధికార పార్టీకి చెందిన బార్ యజమాని ‘సాక్షి’ వద్ద వ్యాఖ్యానించారు. -
టెన్త్ విద్యార్థులకు పాఠాలు చె ప్పండి
చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థులకు మానవతా దృక్పథంతో పాఠాలు చెప్పాలని జిల్లా విద్యాశాఖాధికారి బి.ప్రతాప్‌రెడ్డి ఉపాధ్యాయులను కోరారు. బుధవారం ఆయన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్స్ జేఏసీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా కొన్ని రంగాలకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రం అలాంటి అవకాశం లేదన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సమ్మెలోకి వెళ్లడంతో రెండు నెలలుగా పాఠశాలలు జరగడంలేదని, ప్రైవేటు పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. అందువల్ల ఉపాధ్యాయులు మానవతా దృక్పథంతో 10వ తరగతి విద్యార్థులకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీమాంధ్ర జిల్లాల్లోని విద్యార్థులకు సిలబస్ 15 శాతం కూడా పూర్తికాలేదన్నారు. ఇలా అయితే పబ్లిక్ పరీక్షల్లో తెలంగాణ వారికంటే మన విద్యార్థులు వెనుకబడిపోతారన్నారు. బుధవారం చంద్రగిరిలో పాఠాలు చెబుతుంటే కొందరు అడ్డుకున్నారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి అందరూ సహకరించాలని కోరారు. విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు టీచర్స్ జేఏసీ నేతలు సైతం అంగీకరించారు. వద్దు అంటే అన్నీ బంద్ చేయండి టెన్త్ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు మేం ఒప్పుకోం అనే వాళ్లు తమ ప్రాంతాల్లో అన్నీ బంద్ చేయించాలని డీఈవో డిమాండ్ చేశారు. ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులను, ఆటోలను, సినిమా థియేటర్లను, వైన్ షాపులు ఇలా సకలం ఆపివేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ఇందులో విద్యాశాఖ ముందుం టుందని చెప్పారు. త్రైమాసిక పరీక్షలు వాయి దా పడ్డాయన్నారు. టీచర్లు సమ్మె విరమించిన తర్వాత 15 నుంచి 20 రోజుల్లో సిలబస్ పూర్తి చేసి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా త్రైమాసిక పరీక్షల ప్రశ్నపత్రాలు ఇవ్వలేమని, వాళ్లు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మదనపల్లె డీవైఈవో శామ్యూల్, అధికారులు దినకర్‌నాయుడు, నిరంజన్‌కుమార్, టీచర్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ ఏఎం గిరిప్రసాద్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రవీంద్రారెడ్డి, చంద్రశేఖర్‌నాయుడు, మధు, నరేంద్ర, సహదేవనాయుడు పాల్గొన్నారు. -
దారుణ హత్య
గుడివాడ, న్యూస్‌లైన్ : స్థానిక 27వ వార్డు మాజీ కౌన్సిలర్ శొంఠి శ్రీనివాసరావు (45) దారుణహత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గుడివాడ పట్టణంలోని బేతవోలుకు చెందిన మునిసిపల్ మాజీ కౌన్సిలర్ శొంఠి శ్రీనివాసరావు ఆదివారం సాయంత్రం పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో ఉన్న తన చెరువుల వద్దకు వెళ్లారు. తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తూ మార్గంలో పెదపారుపూడి వైన్‌షాపు వద్ద మద్యం సేవించినట్లు సమాచారం. ప్రతిరోజూ చెరువు నుంచి వచ్చేటప్పుడు వైన్‌షాపు వద్ద ఆగి మద్యం సేవిస్తాడని అతని బంధువులు చెబుతున్నారు. మద్యం షాపు నుంచి 100 మీటర్ల ముందుకు తన వాహనంపై రాగానే పెదపారుపూడి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు వద్ద దుండగులు కాపు కాసి కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు. రక్తపు మడుగులో కిందపడి అక్కడికక్కడే మరణించాడు. ఘటన జరిగిన తీరు పరిశీలిస్తే పథకం ప్రకారమే ఈ ఘటన జరిగినట్లు అర్థమవుతోంది. ముందుగా శొంఠి శ్రీనును పథకం ప్రకారం అక్కడ ఆపి వాహనాన్ని స్టాండ్ వేసి, మాట్లాడి.. నరికినట్లు తెలుస్తోంది. -
ప్రజారోగ్యాన్ని భద్రతను గాలికొదిలేసిన ప్రభుత్వం
-
వైన్షాపే బార్!