మోర్తాడ్: మద్యం అమ్మకాలను పెంచాలని వైన్ షాపుల యజమానులకు ఎకై ్సజ్ అధికారులు టార్గెట్ విధించారు. గతేడాది కంటే పది శాతం విక్రయాలు పెరగాలని ఒత్తిడి చేస్తున్నారు. అమ్మకాలు తగ్గితే తాము ఏమి చేయాలని యజమానులు మొరపెట్టుకుంటున్నా.. ఎకై ్సజ్ శాఖ మాత్రం టార్గెట్ ప్రకారం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించడం గమనార్హం. ప్రభుత్వ ఖజానా నింపే ప్రధాన ఆదాయం మద్యమే కావడంతో టార్గెట్‌పై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. గత సంవత్సరం కొనుగోళ్ల జాబితా ఆధారంగా ఈసారి పది శాతం అదనంగా లేదా గతంలో మాదిరిగానే మద్యం కొనుగో ళ్లను పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.
నిజామాబాద్ నగర కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో 102 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దుకాణం ద్వారా రోజుకు రూ.4లక్షల నుంచి రూ.10లక్షల వరకు మద్యం కొనుగోళ్లు చేపట్టాలని ఎకై ్సజ్ శాఖ టార్గెట్‌ను నిర్ణయించింది. 2022 నాటి కొనుగోళ్లపై అదనంగా పదిశాతం మద్యం కొనుగోలు చేయాలని లేదంటే కేసులు తప్పవని వైన్ షాపుల యజమానులను అధికారులు హెచ్చరిస్తున్నారు. నిత్యం లక్ష్యానికి అనుగుణంగా డీడీలు చెల్లించాలని ఆదేశిస్తున్నారు.
జీరో దందా కట్టడి..
మద్యం దుకాణాల నుంచి రిటైల్ అమ్మకాలతో పాటు టోకున బెల్టుషాపులకు కూడా మద్యం అమ్ముతారు. ఈ క్రమంలో జీరో (పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించిన) మద్యం విక్రయిస్తున్నారా అనే సందేహం వ్యక్తమైతుంది. బెల్టుషాపుల్లో మద్యం గోల్‌మాల్ జరిగే అవకాశం ఉండటంతో వాటి నిర్వాహకులను అధికారులు బైండోవర్ చేస్తున్నారు. బెల్టుషాపులను వైన్‌షాపుల యజమానులే నిర్వహిస్తుండగా కేవలం పని చేస్తున్న తమను ఎందుకు బైండోవర్ చేస్తున్నారని కూలీలు ప్రశ్నిస్తున్నారు.
టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి
మద్యం దుకాణాల ద్వారా గతంలో మాదిరిగా మద్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని టార్గెట్ ఉంది. బ్రేవరీస్ నుంచి మద్యం కొనుగోళ్లు చేపట్టాలి. ఎక్కడైనా జీరో మద్యం కొనుగోలు చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడితే సహించేది లేదు.
– గుండప్ప, ఎకై ్సజ్ సీఐ, మోర్తాడ్
Comments
Please login to add a commentAdd a comment