మందు చూపు!
వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : మూకుమ్మడిగా ముంచుకొచ్చిన ఎన్నికల వేళ... జిల్లావ్యాప్తంగా మద్యాన్ని ప్రవహింపజేసేందుకు రాజకీయ నేతలు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మద్యం సరఫరాపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది. నిర్దేశించిన మేరకు మించి ఒక్క బాటిల్ ఎక్కువ అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఈ మేరకు నిర్దేశించిన కోటా పూర్తి కావడంతో నగరంతోపాటు డివిజన్ల పరిధిలోని పలు వైన్ షాపులు మూసి ఉంటున్నారుు.
అరుుతే... ఇటువంటి పరిస్థితి వస్తుందని ఇదివరకే గ్రహించిన తలపండిన రాజకీయ నాయకులు ముందుచూపుతో వ్యవహరించారు. ప్రొహిబిషన్ అమలు సమయంలో పలువురు ఎక్సైజ్ అధికారుల అండతో విచ్చలవిడిగా మద్యం విక్రయూలు చేస్తూ... లిక్కర్‌డాన్‌గా పేరు గడించిన ఓ వ్యక్తి సహాయంతో దొంగచాటు మందు చూపు! తతంగానికి తెరతీశారు. పక్కా ప్రణాళికతో నగరం, శివారు ప్రాంతాల్లోకి భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ (ఎన్‌డీపీ) మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేశారు.
అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే...
జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో 20 లారీల ఎన్‌డీపీ మద్యం నగరానికి చేరుకున్నట్లు తెలిసింది. లిక్కర్‌డాన్‌గా పేరొందిన ఓ వ్యక్తి సాయంతో దొంగచాటున తీసుకొచ్చి... అత్యంత రహస్య ప్రదేశంలో ఈ సరుకును నిల్వ చేసినట్లు సమాచారం. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఓ కేంద్ర స్థాయి నాయకుడి కనుసన్నల్లో లోడ్‌ల కొద్దీ చీప్ లిక్కర్‌ను డంప్ చేసినట్లు వినికిడి. సదరు నాయకుడికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగం నడిపిస్తున్నట్లు వినికిడి.
చూసీచూడనట్లుగా ఎక్సైజ్ అధికారులు
ఓ గోడౌన్‌లో ఎన్‌డీపీ మద్యాన్ని నిల్వ ఉంచినట్లు ఎక్సైజ్ అధికారులకు తెలి సినా... చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడికి త లొగ్గి వారు అటువైపుగా వెళ్లడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. అంతేకాదు... పలువురు ఎక్సైజ్ అధికారుల అండదండలతోనే రాజకీయ నాయకులు ఎన్‌డీపీ మద్యాన్ని దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు.
ధరలకు రెక్కలు
ఎన్నికల సమయం కావడంతో జిల్లావ్యాప్తంగా మద్యానికి డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటారుు. ఏసీబీ దాడులు జరిగిన నాటి నుంచి వ్యాపారులు ఎంఆర్‌పీ రేట్లకే మద్యం అమ్ముతున్నారు. తాజాగా... ఎన్నికల సాకుతో రేట్లను పెంచారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా రేట్లను పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
భలే గిరాకీ..
జిల్లావ్యాప్తంగా సుమారు 230 వరకు వైన్స్, బార్ షాపులు ఉన్నాయి. వైన్స్ దుకాణాలకు సంబంధించి లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లు, బార్‌లకు ఆరు రెట్ల మద్యం (ప్రివిలేజ్) కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రివిలేజ్ మద్యంపై యజమానులకు 20 శాతం లాభం సమకూరుతుంది. ఈ మొత్తం దాటిన తర్వాత వైన్స్, బార్ యజమానులు కొనుగోలు చేసి.. విక్రరుుంచే మద్యంపై ఆరు శాతం మాత్రమే లాభం ఉంటుంది.
అరుుతే గత ఏడాది చాలా ప్రాంతాల్లో గిరాకీ లేకపోవడంతో ప్రివిలేజ్ మద్యం సరుకు విక్రరుుంచడమే గగనమైంది. దీంతో ఆ సరుకును పెద్ద షాపులకు తక్కువ పర్సెంటేజీకి అమ్ముకున్నారు. కానీ... ఇప్పుడు పరిస్థితి మారింది. ఎన్నికల రావడంతో మద్యానికి భలే గిరాకీ ఏర్పడింది.