మద్యంలో నీళ్లు...దుకాణాలు సీజ్ | excise attacks on wine shops in adilabad | Sakshi
Sakshi News home page

మద్యంలో నీళ్లు...దుకాణాలు సీజ్

Published Fri, May 13 2016 5:00 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM

excise attacks on wine shops in adilabad

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు. ఖానాపూర్‌లోని వెంకటసాయి వైన్స్‌తోపాటు తెర్లపాడ్, పెంబి గ్రామాల్లోని బెల్టు దుకాణాల్లో సోదాలు జరిపారు. మద్యంలో నీళ్లు కలిపి విక్రయిస్తున్నారని తమకు ఫిర్యాదు అందాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు 560 లిక్కర్, 161 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఆయా దుకాణాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement